స్నేహితుడే అత్యాచారం చేశాడు | woman professor allege rape by friend | Sakshi
Sakshi News home page

స్నేహితుడే అత్యాచారం చేశాడు

Published Fri, Jan 12 2018 4:35 PM | Last Updated on Fri, Jan 12 2018 4:35 PM

నోయిడా: తన స్నేహితుడే తనపై అత్యాచారం జరిపాడని, దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడని ఓ మహిళా ​ప్రొఫెసర్‌ ఫిర్యాదు చేసినట్లు iఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు శుక్రవారం తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌ 26న ఈ సంఘటన జరిగిందన్నారు. సెక్టార్‌ 26లోని ఓ గెస్ట్‌ హోస్‌లో కలుసుకోమని శుభమ్‌ వర్మ అనే మిత్రుడు అడిగాడని, వివాహం చేసుకుంటానన్న సాకుగా అక్కడ తనపై అత్యాచారం జరిపాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు రాజస్థాన్‌లోని శికార్‌ జిల్లానుంచి వచ్చి కాన్పూర్‌ మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరు స్నేహితులని, శికార్‌ జిల్లాకే చెందిన ఇతను యునైటెడ్‌ స్టేట్స్‌లో పనిచేస్తుంటాడని, 15 రోజుల సెలవుపై ఇండియాకు వచ్చాడని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి మహిళను వైద్య పరీక్షలకు పంపామని, నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement