లైంగిక దాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు | For one to three years in prison for sexual assault case | Sakshi

లైంగిక దాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలు

Published Thu, Aug 18 2016 12:00 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM

లైంగిక దాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధి స్తూ బుధవారం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కేబీ నర్సింహులు తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం బక్కచింతపల్లికి చెందిన ఓ గిరిజనుడు వరంగల్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

వరంగల్‌ లీగల్‌/కొత్తగూడ : లైంగిక దాడి కేసులో ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధి స్తూ బుధవారం మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి కేబీ నర్సింహులు తీర్పు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడ మండలం బక్కచింతపల్లికి చెందిన ఓ గిరిజనుడు వరంగల్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన కూతురు మైనర్‌ (16) చదువు మానేసి ఇంటివద్దనే ఉంటుంది. ఈ క్రమంలో 2014 సెప్టెంబర్‌ 19న ఆమె పశువులను మేపేందుకు ఇంటి సమీపంలోని పంట భూముల వద్దకు వెళ్లింది.
 
ఈ సందర్భంగా ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన అదే గ్రామానికి చెందిన జర్పు ల లింగం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లికి వివరించింది. తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు కొత్తగూడ పోలీస్‌స్టేçÙ¯Œæలో ఫిర్యాదు చేశారు. కాగా, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు సాక్ష్యాధారాల ను పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు జర్పుల లింగంకు ఐపీసీ సెక్షన్‌ 354 (ఏ)(1) కింద మూడేళ్ల జైలు శిక్ష, రూ. రూ.5 వేల జరిమానా విధిస్తూ జడ్జి కేబీ నర్సింహులు తీర్పు వెల్లడించారు. ఇదిలా ఉండగా, సాక్షులను కానిస్టేబుల్‌ మ్యాడద రాజ్‌కుమార్‌ కోర్టులో ప్రవేశపెట్టగా.. లైజన్‌ ఆఫీసర్‌గా వి.భద్రునాయక్‌ విచారణను పర్యవేక్షించారు. ప్రాసిక్యూషన్‌ తరపున సీని యర్‌ పీపీ ఎండీ సర్దార్‌ వాదించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement