విదేశీ మహిళపై భర్త వేధింపులు | husband harasments of foreign wife | Sakshi
Sakshi News home page

విదేశీ మహిళపై భర్త వేధింపులు

Published Tue, Sep 20 2016 11:01 PM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ విదేశీ మహిళ ఫిర్యాదు చేయడంతో పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.

పుట్టపర్తి టౌన్‌ : అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ విదేశీ మహిళ ఫిర్యాదు చేయడంతో పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. జపాన్‌ దేశానికి చెందిన సత్యసాయి భక్తురాలు 37 ఏళ్ల నిమిషాహీ మదా తరచూ పుట్టపర్తికి వస్తుండేది. ఈక్రమంలో పుట్టపర్తిలో గణేష్‌ గేట్‌కు సమీపంలో పాదరక్షల దుకాణం నిర్వహిస్తోన్న జాకీర్‌హుస్సేన్‌తో ఐదేళ్లుగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిరువురూ రెండేళ్ల క్రితం కదిరిలో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆరు నెలలుగా వారి మధ్య విబేధాలు మొదలయ్యాయి.

ఇటీవల ఆమె కలెక్టరేట్‌కు వెళ్లి  భర్త  నిత్యం వేధిస్తున్నాడని, సుమారు రూ.60 లక్షల పైబడి డబ్బు తీసుకున్నాడని, ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్‌ ఆమెకు న్యాయపరమైన సహాయం అందించాలని ఐసీడీఎస్‌ పీడీ జుబేదాబేగంను ఆదేశించారు. ఐసీడీఎస్‌ అధికారులు జిల్లా ఎస్పీ దష్టికి తీసుకుని పోయి ఆయన ఆదేశాల మేరకు స్థానిక పుట్టపర్తి పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వారిని  సోమవారం రాత్రి విచారణ చేశారు. అనంతరం నిందితుడు జాకీర్‌హుస్సేన్‌పై వేధింపుల కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement