వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం తన అధికార బలంతో ఝులం ప్రదర్శిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్కు మద్దతుగా నిలుస్తున్న వారిని పోలీసులతో అణిచివేయాలని చూస్తోంది.
ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం తన అధికార బలంతో ఝులం ప్రదర్శిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్కు మద్దతుగా నిలుస్తున్న వారిని పోలీసులతో అణిచివేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా వంటావార్పు, బైక్ ర్యాలీ చేపట్టినందుకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెం వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర నలు మూలల మద్దతు లభిస్తోంది. దీక్షకు మద్దతు తెలుపుతున్నవారిని పోలీసులు పలుకారణాలపేరిట అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు.