Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Trump Reacts on Recession Fears says this1
ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్‌ ఏమన్నారంటే..

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు. మార్కెట్‌ క్రాష్‌ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్‌ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు. పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్‌ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన.

Growing pressure within the party on Chandrababus approach to the Waqf Bill2
వక్ఫ్‌ బిల్లుకు మద్దతుపై ముసలం!

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్‌ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్‌ సీపీ వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌ సీపీపై సోషల్‌ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్‌ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్‌ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్‌ బిల్లు నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్‌ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్‌ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌ సీపీ.. ఆది నుంచి అదే విధానంవక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్‌ సీపీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్‌ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్‌ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు సీఎం నితీష్‌ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.2) రెండో సవరణ కింద.. వక్ఫ్‌ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్‌ ర్యాంకింగ్‌ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్‌ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్‌ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్‌ ఆస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా??

Nayanthara And Madhavan Test Movie Review And rating Telugu3
'టెస్ట్‌' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్‌ మెప్పించారా..?

చిత్రం: టెస్ట్‌నటీనటులు: ఆర్‌. మాధవన్‌, నయనతార, సిద్ధార్థ్‌, మీరా జాస్మిన్‌, కాళీ వెంకట్‌, నాజర్‌ తదితరులు దర్శకత్వం: ఎస్‌.శశికాంత్‌నిర్మాతలు: ఎస్‌.శశికాంత్‌, రామచంద్రసినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్సంగీతం: శక్తిశ్రీ గోపాలన్నిర్మాణ సంస్థలు: వైనాట్‌ స్టూడియోస్‌స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం.. అందుకే ఈ ఆట చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. టెస్ట్‌( Test) సినిమాలో కేవలం ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎంచుకుని అందులో క్రికెట్‌ను ప్రధాన అంశంగా జోడించి దర్శకుడు శశికాంత్‌ తెరకెక్కించాడు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో(Nayanthara) పాటు మాధవన్, సిద్ధార్థ్‌ (Siddharth) లీడ్‌ రోల్స్‌ చేశారు. మీరా జాస్మిన్‌ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్‌ 4న ఈ‌ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తమిళ్‌,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది.కథేంటంటే.. ‍చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథ. సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కుముద (నయనతార ) ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకుంటుంది. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) భారతదేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుముద స్కూల్‌మేట్ అర్జున్‌ (సిద్ధార్థ్‌) స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ ఫామ్‌ కోల్పోయి భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు తమ కోరికలను ఎలాగైన సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారి లైఫ్‌లోకి బెట్టింగ్ మాఫియా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎవరు ఎలాంటి తప్పులు చేస్తారు అనేది దర్శకుడు చూపారు. చెన్నైలో ఇండియా, పాక్‌ మధ్య జరిగే టెస్ట్‌ మ్యాచ్‌తో వీరి ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉంటాయి. శరవణన్‌ సైంటిస్ట్‌గా తను కనుగొన్న ప్రాజెక్ట్‌ అప్రూవల్‌ కోసం రూ. 50 లక్షలు అప్పు చేస్తాడు. కానీ, అది ముందుకు సాగదు. అర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో కుమదతో శరవణ్‌కు గొడవలు వస్తాయి. గొప్ప చదవులు పూర్తి చేసినప్పటికీ జీవితంలో ఏమీ సాధించలేని అసమర్థుడిగా మిగిలిపోతానేమో అనుకున్న శరవణన్.. అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. శరవణన్‌కు బెట్టింగ్‌ మాఫియాతో ఎలా లింక్‌ ఏర్పడుతుంది..? తన స్నేహితుడి కుమారుడిని కిడ్నాప్‌ చేసినా కూడా అర్జున్‌కు కుముద ఎందుకు చెప్పదు..? కుమారుడిని కూడా పనంగా పెట్టి అర్జున్ ఎందుకు ఆడుతాడు..? ఈ తతంగం అంతా పోలీసులు ఎలా పసిగడుతారు..? చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముగిసిపోతాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..దర్శకుడు కథ చెబుతున్నప్పుడు అద్భుతంగా అనిపించే నయనతార, సిద్దార్థ్‌, మాధవన్‌ ఒప్పుకొని ఉండొచ్చు. కానీ, స్క్రీన్‌పై స్టోరీ చూపించడంలో డైరెక్టర్‌ శశికాంత్‌ ఫెయిల్‌ అయ్యాడని చెప్పవచ్చు. మిడిల్‌క్లాస్‌ జీవితాలను చూపించే సమయంలో ఎమోషన్స్‌ లేకపోతే ఆ సీన్స్‌ పెద్దగా కనెక్ట్‌ కావు. ది టెస్ట్‌ సినిమాలో అదే ఫీల్‌ కలుగుతుంది. సినిమా టైటిల్‌, ట్రైలర్‌ను చూసిన వారందరూ కూడా ఈ మూవీ మరో జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామా, థ్రిల్లర్‌ సినిమానే అనుకుంటారు. కానీ, ఇందులో ఆ రెండూ బలంగా లేవు. కథలో భాగంగా ప్రతి పాత్రలో ఎక్కువ షేడ్స్‌ కనిపించేలా ఉండాలి. ఆపై ఆ పాత్రల చుట్టూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు ప్రేక్షకులకు దగ్గర చేయాలి. ఇవి ఏమీ ఇందులో ఉండవు. అర్జున్ ఒక స్టార్ క్రికెటర్. అతనికి కుముద తండ్రి కోచ్‌గా ఉండేవాడని చెప్తారు. అయితే, కుముదతో ఉన్న బాండింగ్‌ను దర్శకుడు చూపిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆటగాడికి జట్టులో చోటు దక్కడం కష్టం అంటున్న సమయంలో బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లుగా ఒక్క సీన్‌ కూడా ఆర్జున్‌కు సంబంధించి వుండదు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టి గ్రౌండ్‌లో అర్జున్‌ అడుగుపెడుతాడు. కానీ, తనకు క్రికెటే ముఖ్యం అనేలా దర్శకుడు చూపించలేకపోయాడు. దీంతో ఆర్జున్‌ ఆటకు ప్రేక్షకులు కనెక్ట్‌ కావడం చాలా కష్టం.ఎవరెలా చేశారంటే..టెస్ట్ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించే పాత్ర ఏమైనా ఉందంటే శరణన్‌ (మాధవన్) అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతారు. ఒక సైంటిస్ట్‌గా దేశం కోసం ఏదైనా చేస్తాను అనే పాత్రలో చక్కగా సెట్‌ అయ్యాడు. టెస్ట్‌ మ్యాచ్‌లా సాగుతున్న సినిమాను వన్డే ఆటలా మార్చేశాడు. విలన్‌, హీరో ఇలా రెండు షేడ్స్‌ ఆయనలో కనిపిస్తాయి. తన వరకు వస్తే ఒక మనిషి ఎంత అవకాశవాదో శరవన్‌ పాత్రలో దర్శకుడు చూపాడు. ఈ కోణంలో చూస్తే చాలామందికి నచ్చుతుంది. టెస్ట్‌ సినిమాలో సిద్దార్ధ్‌ పాత్రను ఇంకాస్త హైలెట్‌ చేసి చూపింటే బాగుండేది. ది టెస్ట్‌లో మంచి, చెడు, సంఘర్షణ, స్వార్ధం గెలుపు, ఓటమి ఇలా ఎన్నో షేడ్స్‌ ఉన్నాయి. కానీ, తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు.

Microsoft Turns 50: Bill Gates Gives A Unfortunate Rewind Viral4
దురదృష్టవశాత్తు.. ‘50 వసంతాల మైక్రోసాఫ్ట్‌’పై బిల్‌గేట్స్‌ వీడియో

వాషింగ్టన్‌: టెక్‌ దిగ్గజం మైకోసాఫ్ట్‌ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ.. ఆ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కంపెనీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఆరంభ రోజుల్లో.. యవ్వనంలో ఉండగా దిగిన ఫొటోలను సరదాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రూపంలో పోస్ట్‌ చేశారు. ‘‘దురదృష్టవశాత్తు.. నేను మళ్ళీ ఎప్పటికీ కూల్‌గా ఉండను. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ తొలినాళ్లలో ఇది నేనే’’ అంటూ క్యాప్షన్‌ ఉంచారాయన. 1975 ఏప్రిల్‌ 4వ తేదీన న్యూ మెక్సికో అల్బుకెర్కీలో మైక్రోసాఫ్ట్‌ను చిన్ననాటి స్నేహితులైన బిల్‌ గేట్స్‌, పాల్‌ అలెన్‌లు స్థాపించారు. 1979లో కంపెనీ విస్తరణలో భాగంగా వాషింగ్టన్‌కు మార్చారు. ఆ తర్వాత గేట్స్‌, అలెన్‌తో పాటు స్టీవ్‌ బాల్మర్‌, సత్య నాదెళ్ల కంపెనీ ఎదుగుదలలో విశేష కృషి చేశారు. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) మైక్రోసాఫ్ట్‌కు 2000 సంవత్సరం దాకా గేట్స్‌ సీఈవోగా ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద రీతిలో.. మైక్రోసాఫ్ట్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల నుంచి 2020 నుంచి ఆయన వైదొలిగారు. 1955 సియాటెల్‌లో జన్మించిన విలియమ్‌ హెన్సీ గేట్స్‌.. బాలమేధావిగా 13 ఏళ్ల వయసుకే సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ రాసే స్థాయికి చేరాడు. అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ కంపెనీని స్థాపించేందుకు హార్వార్డ్‌ నుంచి విద్యాభ్యాసం మధ్యలోనే ఆపేశారాయన. చిన్ననాటి స్నేహితులైన ఈ ఇద్దరూ ఎంఎస్‌-డాస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ రూపొందించి.. ఆపై దానిని విండోస్‌గా పేరు మార్చారు. 50వ వార్షికోత్సవం సందర్భంగా.. మైక్రోసాఫ్ట్‌ తన వెబ్‌సైట్‌లో కొత్త పేజీలను లాంచ్‌ చేసింది. గత ఐదు దశాబ్దాలుగా సాగిన ప్రయాణాన్ని అందులో పదిలపరిచింది. కంపెనీ ఎదుగుదల, మైలు రాళ్లు, ఆవిష్కరణలను అందులో ఉంచింది. అలాగే.. రాబోయే 50 ఏళ్ల విజన్‌ను అందులో పొందుపరిచింది.

van rams into parked truck in Karnataka Kalaburagi5
కర్ణాటకలో ఘోర ‍ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని జీపు కొట్టిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలోని జీవరగి సమీపంలో శనివారం తెల్లవారుజామున లారీని అధిక వేగంతో వస్తున్న జీపు అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు దుర్మరణం చెందారు, పది మందికి పైగా గాయాలయ్యాయి. బాగల్ కోట నుంచి కలబుర్గిలోని హజరత్ కాజా గరీబ్ నవాజ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Kalaburagi, Karnataka | Five people died and 10 injured after a van rammed into a parked truck near Nelogi Cross in Kalaburagi district at around 3.30 am. The deceased have been identified as residents of Bagalkote district. The injured have been admitted to Kalaburagi Hospital.… pic.twitter.com/3i04s2SNVF— ANI (@ANI) April 5, 2025

US Prez Trump massive Military move In Asia Region Check Full Details6
ట్రంప్‌ సైలెంట్‌ బాంబ్‌! అంతకు మించి..

వాషింగ్టన్‌: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్‌(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్‌ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్‌-బ్రిటన్‌ మిలిటరీ బేస్‌ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్‌ సిగ్నల్స్‌ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్‌ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్‌ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్‌లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్‌ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్‌ ఈస్ట్‌, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్‌, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్‌ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్‌ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్‌ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్‌ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్‌ వద్ద యూఎస్‌ఎస్‌ నిమిట్జ్‌ క్యారీయర్‌ను, మిడిల్‌ ఈస్ట్‌లో యూఎస్‌ఎస్‌ కార్ల్‌ విన్‌సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్‌ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది.

Waqf Bill Effect five leaders resign To Nitish Kumar JDU7
సీఎం నితీశ్‌ కుమార్‌కు బిగ్‌ షాక్‌

పాట్నా: బీహార్‌లో ముఖ్యమంత్రి నితిశ్‌ కుమార్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బీహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. తాజాగా మరో కీలక నాయకుడు నదీమ్‌ అక్తర్‌ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో, ఎన్నికలకు ముందు బీహార్‌లో జేడీయూకు ఎదురుదెబ్బ తగిలింది.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలు ఉభయసభల్లో మద్దతు తెలుపుతూ ఓటింగ్‌లో పాల్గొన్నాయి. ఈ ‍క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షమైన నితీష్ కుమార్ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ఓటు వేయడంతో.. ఆ పార్టీలోని మైనార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత నదీమ్‌ అక్తర్ పార్టీకి రాజీనామా చేశారు. అంతకంటే ముందు.. జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ షానవాజ్ మాలిక్, అలీఘర్ నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ తబ్రేజ్ సిద్ధిఖీ, భోజ్‌పూర్‌కు చెందిన సభ్యుడు మొహమ్మద్ దిల్షాన్ రైన్, మాజీ అభ్యర్థి మొహమ్మద్ ఖాసిం అన్సారీ, రాజు నయ్యర్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీహార్‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో వరుసగా నేతలు రాజీనామా చేస్తుండటంతో జేడీయూ ముస్లిం ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయమని ఆ రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.JDU muslim leaders are resigning in bulk Nitish Kumar Muradabad, Nitish Kumar hai hai 😡😡pic.twitter.com/1mbnpAQvei— Chandan Sinha (I Am Ambedkar) (@profAIPC) April 4, 2025మరోవైపు.. తబ్రేజ్ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత నితీష్ కుమార్‌కి పంపారు. బిల్లుకు మద్దతు ఇవ్వడం ద్వారా ముస్లింల విశ్వాసాన్ని దెబ్బతీశారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘మీరు మీ లౌకిక ఇమేజ్‌ను కొనసాగిస్తారని నేను ఆశించాను, కానీ ముస్లింలకు వ్యతిరేకంగా పదేపదే పనిచేసిన శక్తులతో నిలబడాలని మీరు ఎంచుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ , పౌరసత్వ సవరణ చట్టం వంటి చర్యల తర్వాత ఏన్డీయే ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకువచ్చిందని, ఇది ముస్లిం ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. ఎన్డీయే మరో మిత్రపక్షమైన ఆర్ఎల్డీలో కూడా ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఆర్ఎల్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాజాయిబ్ రిజ్వి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ జయంత్ చౌదరి.. లౌకికవాదాన్ని విడిచిపెట్టారని, ముస్లింలకు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. ముస్లింలు జయంత్ చౌదరికి మద్దతు ఇచ్చారని, కానీ ఈ సమయంలో మాతో నిలబడలేదని రిజ్వీ అన్నారు. దీంతో, వక్ఫ్‌ సవరణ బిల్లును ఎన్డీయే మిత్రపక్ష పార్టీల్లో అగ్గి రాజేసింది. అసంతృప్తి నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. BREAKING NEWS TODAY 🚨First JDU Senior leader Mohammad Kasim Ansari and Now JDU Minority Pradesh Secratary Shah Nawaz Malik resign on #WaqfBoard Slowly slowly Muslim leader resign from JDU JDU support #WaqfBillAmendment bills in Lok sabha pic.twitter.com/US5ckR7YBE— Ashish Singh (@AshishSinghKiJi) April 3, 2025

ChatGPT Can Now Create Fake Aadhaar PAN Cards Risk of Cybercrimes8
క్షణాల్లో ఫేక్‌ ఆధార్‌, పాన్‌ కార్డులు..

ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్‌ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్‌జీపీటీ. ఇది విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్‌జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్‌ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్‌లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్‌జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్‌ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk. This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025

Prathibha Kunda chit chat with Actress ratna pathak shah9
అసహ్యించుకుంటూనే....చివరికి నటినయ్యా..!

రాయదుర్గం : మొదట్లో నేను నటిని కావాలనే ఆలోచననే అసహ్యించుకున్నా.. కానీ చివరకు నటిగా మారానని ప్రఖ్యాత నటి, నాటక కళాకారిణి రత్నపాఠక్‌షా స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నాలెడ్జి సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘పాత్రలు, కథలను రూపొందించడం’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ పురాతన డోక్రా క్రాఫ్ట్‌ జ్ఞాపికను ఆమె ఆవిష్కరించారు. నేను కథకుల కుటుంబంలో పెరిగానని, కాబట్టి ఆ నైపుణ్యం నాకు సహజంగానే వచి్చందని, అందరిలా కాకుండా నేను భిన్నంగా ఉండాలని కోరుకున్నాని వివరించారు. మంచి స్క్రిప్ట్‌ రాయడం అంత సులభం కాదని, దీనికి ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉండాలని అన్నారు. సినిమాలతో పోలిస్తే థియేటర్‌ ఆర్ట్స్‌ ఒక సవాలుతో కూడిన పని అని గుర్తుచేశారు. డోక్రా మెటల్‌ కాస్టింగ్‌ క్రాఫ్ట్‌ పునరుద్ధరణే లక్ష్యం.. చేతి వృత్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా 4వేల ఏళ్ళ పురాతన డోక్రా మెటల్‌ కాస్టింగ్‌ క్రాఫ్ట్‌ను పునరుద్ధ్దరించాలనేదే లక్ష్యం. మన సంప్రదాయాన్ని కాపాడుకోడమేకాదు, దానిని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉషేగావ్, జామ్‌గావ్, కేస్లా గూడ నుంచి వచ్చిన చేతి వృత్తులవారితో కలిసి పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నాం. – ప్రతిభాకుందా, ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్‌పర్సన్‌చదవండి: ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్‌ డే గిఫ్ట్‌ : కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

Punjab Kings vs Rajasthan Royals match today10
పంజాబ్‌ జోరు కొనసాగేనా!

ముల్లాన్‌పూర్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ 18వ సీజన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌... రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ‘డబుల్‌ హెడర్‌’లో భాగంగా శనివారం జరగనున్న రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన పంజాబ్‌ జట్టు... ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ శిక్షణ, శ్రేయస్‌ అయ్యర్‌ కెపె్టన్సీలో తాజా సీజన్‌లో జోరు మీదుంది. మరోవైపు తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తిరిగి సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసిన జైస్వాల్‌... ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సీజన్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజూ సామ్సన్‌... ఈ మ్యాచ్‌లో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో వికెట్‌ కీపింగ్‌ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతినిచ్చింది. జైస్వాల్, సామ్సన్, నితీశ్‌ రాణా, రియాన్‌ పరాగ్, ధ్రువ్‌ జురేల్, హెట్‌మైర్, హసరంగతో రాయల్స్‌ బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, తీక్షణ, సందీప్‌ శర్మ, తుషార్‌ దేశ్‌పాండే, శుభమ్‌ శర్మ బౌలింగ్‌ భారం మోయనున్నారు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన పంజాబ్‌ కింగ్స్‌... సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అటు విదేశీ హిట్టర్లు... ఇటు స్వదేశీ ప్లేయర్లతో పంజాబ్‌ పటిష్టంగా ఉంది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ప్రియాంశ్‌ ఆర్య జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... శ్రేయస్‌ అయ్యర్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, యాన్సెన్‌తో మిడిలార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అర్ష్ దీప్ సింగ్‌తో కలిసి ఫెర్గూసన్, యాన్సెన్‌ పేస్‌ భారం మోయనుండగా... యుజ్వేంద్ర చహల్‌ స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు. పెద్ద బౌండరీలతో కూడిన ముల్లాన్‌పూర్‌ మైదానం స్పిన్‌కు అనుకూలించనుంది. గత సీజన్‌లో ఇక్కడ ఓ మాదిరి స్కోర్లే నమోదు కాగా... బౌలింగ్‌ బలంతోనే జట్లు విజయాలు సాధించాయి. తుది జట్లు (అంచనా) రాజస్తాన్‌ రాయల్స్‌: సామ్సన్‌ (కెప్టెన్ ), జైస్వాల్, రాణా, పరాగ్, జురేల్, హసరంగ, హెట్‌మైర్, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్, శుభమ్‌ దూబే. పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్ ), ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్‌ సింగ్, సుర్యాంశ్, యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్ దీప్, చహల్, వైశాక్‌.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement