న్యూస్‌లైన్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటలను ఎవరూ నమ్మవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు.
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాటలను ఎవరూ నమ్మవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లీగల్‌సెల్ జిల్లా చైర్మన్ కారుమంచి రామకృష్ణారెడ్డితో పాటు న్యాయవాదులు జె.లక్ష్మీనారాయణ, మగ్బూల్, బేగ్, ఎస్.డేనియల్, జగదీశ్ తదితరులు... కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎస్వీ మోహన్‌రెడ్డినివాసంలో ఆయన సమక్షంలోనే వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.
అలాగే జీషాన్, అబుహురైరా, జావీద్, ఫయాజ్, ఇర్ఫాన్, జావీద్, సమీర్, రెహ్మాన్, మనోజ్, జుబేర్‌తోపాటు 12వ వార్డుకు చెందిన సుమారు 100 మంది ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. మారుతి, మాబు, చంటి, భరత్, భంజా, తేజ, చిన్న, అశోక్, మాను, శ్రీనులతో పాటు 1వ వార్డుకు చెందిన 100 మంది ప్రజలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను ఇబ్బందుల పాలు చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వలసలు వెళుతున్నారని తెలిపారు. టీడీపీ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలిపారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అన్నివర్గాల ప్రజలను మేలు చేశాయని, అలాంటి పాలన తిరిగి రావాలంటే ఒక్క జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.రమణ, బ్రదర్ రమణ, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.