Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy with local body YSRCP Party representatives1
మీ నిబద్ధతకు హ్యాట్సాఫ్‌! : వైఎస్‌ జగన్‌

స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించిన 50 స్థానాలకు గానూ 39 చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకుండా హుందాగా వదిలేయాలి. కానీ చంద్రబాబు అలా కాకుండా నేను సీఎంను, నా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నాకు బలం ఉన్నా లేకపోయినా ప్రతి పదవీ నాకే కావాలి.. ఎవరినైనా నేను భయపెడతా.. కొడతా.. చంపుతా.. ప్రలోభపెడతా..! అనే రీతిలో అహంకారంతో వ్యవహరిస్తున్న తీరును మనం అంతా చూస్తున్నాం. ఇది ధర్మమేనా? న్యాయమేనా? రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే.. తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి పని చేశానని ప్రజల దగ్గరకు ధైర్యంగా వచ్చి చిరునవ్వుతో వారి ఆశీర్వాదం తీసుకునేలా ఉండాలి. కానీ చంద్రబాబు పాలనలో సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ సెవెన్‌ గాలికి ఎగిరిపోయాయి. అవి మోసాలుగా మిగిలాయి మీ జగన్‌ పాలనలో ప్రతి నెలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక మేలు జరిగింది. నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేవి. చంద్రబాబు వచ్చిన తర్వాత నాలుగు వేళ్లు నోట్లోకి పోవడం మాట అటుంచి.. ఉన్న ప్లేటును కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితులలో ఆయన ప్రజల్లోకి వెళ్లలేడు. తన కార్యకర్తలను పంపించి ప్రజలకు ఫలానా మంచి చేశామని చెప్పే పరిస్థితి కూడా లేదు– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌సాక్షి, అమరావతి: ‘మీ అందరినీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. రాజకీయాలలో ఎప్పుడూ విలు­వ­లు, విశ్వసనీయత ఉండాలని నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటా.. పార్టీ కూడా అలా­గే ఉండాలని మొట్టమొదటి నుంచి ఆశించా. కష్టకాలంలో మీ అందరూ చూపించిన తెగువ, స్ఫూ­ర్తి­కి హ్యాట్సాఫ్‌..’ అని స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ(YSRCP) ప్రజాప్రతినిధులను పార్టీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి(YS Jagan Mohan Reddy) ప్రశంసించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలో­భా­లకు లొంగకుండా.. బెదిరింపులు, అక్రమ కేసులు, దాడులకు వెరవకుండా పార్టీ కోసం గట్టిగా నిల­బడిన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతి­నిధులను అభినందించారు. బుధవారం తాడేపల్లి­లోని పార్టీ కేంద్ర కార్యా­లయంలో వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా­ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమ­య్యా­రు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరాయని వ్యాఖ్యానించారు. ‘రాబోయే రోజులు మనవే.. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపో­తా­యి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ మెజా­ర్టీతో అధికా­రంలోకి వస్తుంది. జగన్‌ 1.0 పాలనలో కోవిడ్‌ వల్ల కార్యకర్తలకు చేయాల్సినంత చేయకపోయి ఉండ­వచ్చు. కానీ.. జగన్‌ 2.0లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడు’ అని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..సంఖ్యాబలం లేనప్పుడు పోటీ చేయకూడదుమొన్న జెడ్పీ, ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో–ఆప్షన్‌ సభ్యు­లు, ఉప సర్పంచ్‌ స్థానాలు కలిపి దాదాపు 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఏడు చోట్ల అధి­కార పార్టీ గెలిచే పరిస్థితి లేకపో­వడంతో ఎన్ని­కలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల వాయి­దా వేసే పరిస్థితి లేకపోవడంతో అని­వా­ర్యంగా ఎన్ని­క­లు జరిపారు. అలా ఎన్నికలు నిర్వహించిన 50 స్థానా­­లకు గానూ 39 చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గొప్ప తెగింపు చూపించి గెలిచారు. ఆశ్చర్యం కలిగించే విష­యం ఏమిటంటే.. అసలు టీడీపీకి ఎక్కడా కనీ­సం గెలవడానికి కావాల్సిన సంఖ్యాబలం లేదు. అయినా సరే.. మ­భ్య­­పెట్టి, భయపెట్టి, ప్రలోభ పెట్టి.. ఏకంగా పోలీ­సు­లను వాడుకుని దౌర్జన్యాలు చేస్తూ ఎన్నికలు నిర్వ­హించారు. ఇన్నేళ్లు సీఎంగా చేశానని చెప్పు­కునే చంద్ర­బాబుకు నిజంగా బుద్ధీ, జ్ఞానం రెండూ లేవు! సూపర్‌ సిక్స్‌లు.. మోసాలుగా మిగిలాయిఎన్నికల మేనిఫెస్టోలో 143 హామీలతో కూటమి పార్టీలు ప్రజలను మభ్యపెట్టి, ప్రతి ఇంటికి వారి కార్యకర్తలను పంపించి పాంప్లెట్లు పంచాయి. చంద్ర­బాబు బాండ్లు పంపించారని ప్రతి ఒక్కరికీ చెప్పి ఎన్నికల్లో గెలిచాయి. చంద్రబాబు పాలన చేపట్టి దాదాపు 11 నెలలు అవుతుంది. మరి ఆయన చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్లు ఏమయ్యాయని ఎవ­రైనా అడగడానికి ధైర్యం చేస్తే.. ఆ స్వరం కూడా వినిపించకుండా చేయాలని తాపత్రయపడుతు­న్నా­రు. ఆ హామీలను నెరవేర్చాలనిగానీ, ప్రజల­కి­చ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగానీ చంద్రబా­బులో కనిపించడం లేదు. ప్రతి అడుగులోనూ మోసం.. పాలనలో అబద్ధాలే కనిపిస్తున్నాయి. సూపర్‌ సిక్స్‌లు, సెవెన్లు గాలికెగిరిపోయి మోసా­లుగా కనిపిస్తున్నాయి. మాట మీద నిలబడే పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారు..సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ ఎందుకు అమలు చేయ­డం లేదు అని అడుగుతుంటే రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లు అని చంద్రబాబు అంటారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ డాక్యుమెంట్లలోనే రాష్ట్రం అప్పు రూ.6.50 లక్షల కోట్లు అని చూపించారు. అందులో రూ.3.13 లక్షల కోట్లు ఆయన ప్రభు­త్వం దిగిపోయే నాటికి, ఆయన చేసిన అప్పులే అని తెలుసు. కానీ రాష్ట్రాన్ని భయంకరంగా చూపించాలని రూ.10 లక్షల కోట్లు అని చెబుతున్నారు. మరో రెండు రోజు­లు పోతే రూ.12 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అని చెబు­తాడు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీ­లను ఎగ్గొట్ట­డానికే ఈ దిక్కుమాలిన అబద్ధాలు చెబు­తు­న్నారు. ఇలాంటి దిక్కు­మాలిన అబద్ధాలు, మోసా­లతో రాష్ట్రంలో పాలన చేస్తున్నాడు. ఇలాంటి పాలన పోయి మళ్లీ మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన రావాలని, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలను పరిష్క­రి­ంచాలని తపించే గుండె ఉండే మంచి పాలన రావా­లని ప్రజలందరూ ఇవాళ మన­స్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఉన్నదల్లా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే..మరోవైపు ఇవాళ వలంటీర్‌ వ్యవస్థ లేదు. పార­దర్శకత లేదు. స్కీములూ లేవు. ఉన్నదల్లా రెడ్‌ బుక్‌ రాజ్యాంగమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. పోలీసులను అధికార పార్టీ కాపలాదారులుగా వాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దారుణ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం..⇒ తిరుపతి కార్పొరేషన్‌లో మనం 48 స్థానాలు గెలిస్తే వాళ్లు కేవలం ఒక్కటే గెలిచారు. అక్కడ ఇటీవల డిప్యూటీ మేయర్‌ ఎన్నికల సందర్భంగా మన కా­ర్పొ­­రేటర్లు ప్రయాణిస్తున్న బస్సును అడ్డుగుతున్నారు. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని పోలీసుల ఆధ్వ­ర్యంలోనే కిడ్నాప్‌ చేశారు. ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి. ⇒ విశాఖ కార్పొరేషన్‌లో 98 స్థానాలకు వైఎస్సార్‌­సీపీ 56 స్థానాలకు పైగా గెలిచింది. అక్కడ ప్రజా­స్వామ్యయుతంగా వైఎస్సార్‌సీపీ మేయర్‌ ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మన కార్పొ­రేటర్లు క్యాంపుల్లో ఉంటే.. పోలీసులు వారి ఇళ్ల వద్దకు వచ్చి మీ భర్తలు ఎక్కడున్నారో చెప్పాలని, లేదంటే మిమ్మల్ని స్టేషన్‌కి తరలిస్తామని బెదిరిస్తు­న్నారు. బుద్ధీ, జ్ఞానం ఉన్నవారు ఎవరైనా పోలీసులను ఈ మాదిరిగా వాడుకుంటారా?⇒ అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పదికి తొమ్మిది స్థానాలు మనవే. వాళ్లు ఒక్కటే గెలిచారు. సంఖ్యాపరంగా చూస్తే ఉప ఎన్నికలో మనమే గెలవాలి. కానీ అక్కడ ఎస్‌ఐ పోలీసు ప్రొటెక్షన్‌ ఇచ్చినట్లు నమ్మించి తొమ్మిది మంది మన ఎంపీటీసీలను కిడ్నాప్‌ చేశాడు. వీడియో కాల్‌లో లోకల్‌ ఎమ్మెల్యేతో మాట్లాడిస్తున్నాడు. అయినా సరే మన ఎంపీటీసీలు మాట వినక­పోవడంతో మండల కేంద్రంలో నిర్బంధించి బైండోవర్‌ కేసులు పెడుతున్నాడు. దీనిపై మన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ మండ­లంలో భయం రావాలట..! అందుకోసం లింగమయ్య అనే బీసీ నాయకుడిని హత్య చేశారు. పోలీసుల సమక్షంలో చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు చేయిస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం?⇒ స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పంలో 16కి మొత్తం 16 ఎంపీటీసీలను మనం గెలిచాం. ఆరుగురిని ప్రలోభ­పెట్టగా..మిగిలిన వాళ్లు మనవాళ్లే. అక్కడ మన­వాళ్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసులతో అడ్డుకుని కౌంటింగ్‌ దగ్గరకు పంపించకుండా చంద్రబాబు ఆపించారు. అక్కడ కోరమ్‌ లేకపో­యినా.. ఆరుగురే ఉన్నా వాళ్ల మనిషే గెలిచినట్లు డిక్లేర్‌ చేశాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని.. ఎంపీపీ స్థానంలో బలం లేకపోయినా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇదీ.⇒ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం గోప­వరంలో ఉప సర్పంచ్‌ ఎన్నికలు చూస్తే.. మనం 19 గెలిస్తే వాళ్లు నలుగురిని ప్రలోభపెట్టారు. మన­వాళ్లు 15 మందిని పోలీ­సులు బందోబస్తు కల్పి­స్తా­మని చెప్పి తీసుకెళ్లి టీడీపీ సభ్యులున్న చోట విడి­చిపెట్టారు. అంటే టీడీపీ వాళ్లను దౌర్జన్యం చే­య­మని వదిలేశారు. కౌంటింగ్‌ హాల్‌­లోకి మన­వాళ్లను లోపలకి పంపించరు కానీ.. వాళ్లను మాత్రం పంపి­స్తారు. అక్కడ నకిలీ వార్డు మెంబర్లతో ఐడీ కార్డులు తయారు చేశారు. అదే విషయం ఎన్నికల అధికా­రికి చెబితే ఎన్ని­క వాయిదా వేశారు. మళ్లీ రెండో రోజు.. ఎన్నికల అధికారికి గుండెపోటు అని వాయి­దా వే­శారు. బలం లేనప్పుడు ఇలాంటివన్నీ చేస్తు­న్నారు. ⇒ ఇక తుని మున్సిపాల్టీలో 30కి 30 కౌన్సిలర్లు మనమే గెలిచాం. వాళ్ల దగ్గర ఏమాత్రం సంఖ్యా బలం లేదు. అయినాకూడా వైస్‌ చైర్మన్‌ పోస్టు దక్కించుకునేందుకు కావాలని ఎన్నికలకు అడ్డంకులు సృష్టించి వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరకు మున్సిపల్‌ చైర్మన్‌ మహిళను బెదిరించి రాజీనామా చేయించారు.⇒ అత్తిలిలో 20 స్థానాలకు మనం 16 గెలిస్తే.. వాళ్లు 4 గెలిచారు. ఒకరు డిస్‌ క్వాలిఫై కాగా మన బలం 15 ఉంది. అంటే అక్కడ ఎన్నికల్లో మనం గెలవాలి. వాళ్లకు సంఖ్యా బలం లేదు కాబట్టి ఎన్నిక జరపకుండా వాయిదా మీద వాయిదా వేస్తున్నారు. ఇదీ రాష్ట్రంలో జరుగుతోంది!!⇒ ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య.. మీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగు­తున్నా.. మీరంతా గట్టిగా నిలబడ్డారు. నా అక్కచెల్లెమ్మలు చాలా గట్టిగా నిలబడ్డారు. దీన్ని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు చూపించిన గొప్ప స్ఫూర్తితో... చంద్రబాబు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అనే సందేశం మీ ద్వారా వెళ్లింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి చిరస్ధాయిగా నిలబడుతుంది.సమావేశానికి హాజరైన వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తల కోసం ఎంత గట్టిగా నిలబడతానో చూపిస్తా..‘కష్ట సమయంలో ఉన్న మన కార్యకర్తలకు ఒక్కటే చెబుతున్నా. ఈ కష్ట కాలంలో మీరు చూపించిన ఈ స్ఫూర్తి, నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాడు. రాబోయే రోజులు మనవే. ఈసారి కచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. ఈ సారి వచ్చినప్పుడు మీ జగన్‌ కార్యకర్తల కోసం కచ్చితంగా ఉంటాడు. జగన్‌ 1.0 పాలనలో కార్యకర్తల కోసం చేయాల్సినంత చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. కోవిడ్‌ సమయంలో రెండేళ్లు ప్రజల గురించి, వాళ్ల ఆరోగ్యం గురించే మొత్తం ఎఫర్ట్‌ పెట్టాం. కాబట్టి కార్యకర్తలకు ఉండాల్సి­నంత తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కానీ జగన్‌ 2.0 లో అలా జరగదు. అందరికీ మాట ఇస్తున్నా. కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటా. కార్యకర్తల కోసం జగన్‌ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత మీ జగన్‌ చేసి చూపిస్తాడు’ – వైఎస్‌ జగన్‌విద్య, వైద్యం, వ్యవసాయం అధోగతి..ఇవాళ స్కూళ్లు నాశనం అయిపోయాయి. ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. నాడు ృ నేడు పనులు ఆగిపోయాయి. టోఫెల్‌ తీసేశారు. మూడో తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ తరగతులు నిర్వహించి పిల్లలను గొప్పగా చదివించాలని ఆరాటపడే ఆలోచనలు గాలికెగిరి­పోయాయి. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ లేదు. ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్‌ల పంపిణీ ఆగిపోయింది.మరోవైపు వైద్యం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. 11 నెలలకు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. 104, 108 ఆంబులెన్సుల గురించి చెప్పాల్సిన పనిలేదు.ఈ రోజు వ్యవసాయం గురించి అందరికీ తెలిసిందే. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతన్న పూర్తిగా దళారుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి సహాయం కింద జగన్‌ పీఎం కిసాన్‌తో కలిపి రూ.13,500 ఇస్తున్నాడు... మేం వస్తే పీఏం కిసాన్‌ కాకుండా సొంతంగా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ ఇచ్చిన అమౌంట్‌ లేదు... బాబు ఇస్తామన్నది కూడా ఇవ్వలేదు. మరోవైపు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తివేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది.పీ4 పేరుతో బాబు కొత్త మోసం..చంద్రబాబునాయుడు మోసాలు క్లైమాక్స్‌కి చేరాయి. చాలామంది చంద్రబాబు మారిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆయన మారలేదని నిరూపిస్తూ ఈమధ్య పీ4 అని కొత్త మోసం తీసుకొచ్చాడు. పీ4 విధానం ద్వారా సమాజంలో 20 శాతం పేదవారి బాగోగులు అన్నింటినీ 10 శాతం సంపన్నులకు అప్పగిస్తాడట. ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అసలు చంద్రబాబుకు రాష్ట్రంలో ఎన్ని తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయో తెలుసా? రాష్ట్రంలో 1.61 కోట్ల ఇళ్లు ఉంటే 1.48 కోట్ల వైట్‌ (తెల్ల) రేషన్‌ కార్డులున్నాయి. అంటే 90 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో కేవలం 8.60 లక్షల మంది మాత్రమే ఆదాయపన్ను కడుతున్నారు. 25 లక్షల మంది ఐటీ ఫైల్‌ చేస్తున్నారు. అంటే 8.60 లక్షల మందికి.. 1.48 కోట్ల తెల్ల రేషన్‌ కార్డు దారులను అప్పగించాలి. అక్కడ కూడా మోసం చేస్తున్నాడు. పేదలు కేవలం 20 శాతం అంటున్నాడు. చంద్రబాబు చెప్పిన దానికి కనీసం వెయ్యి మంది కూడా ముందుకు రారు. చంద్రబాబు చెప్పింది అవాస్తవమని, జరగదని అందరికీ తెలుసు. ఆయన డ్రామాలు ఆడుతున్నాడని ప్రజలకు తెలుసు. జనం నవ్వుకుంటున్నారు. ఆయన మాట్లాడినప్పుడు మీటింగ్‌ల నుంచి వెళ్లిపోతున్నారు. అయినాసరే నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అన్నట్లు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నారు.

USA Donald Trump Announces Tariff Over All Countries2
ట్రంప్‌ మార్క్‌ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్‌ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్‌ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్‌ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్‌ అన్నారు.ఏప్రిల్‌ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్‌ బుధవారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్‌, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్‌ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్‌: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్‌: 10 శాతంసింగపూర్‌: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్‌: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్‌: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్‌: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్‌: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్‌: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్‌: 36 శాతంబంగ్లాదేశ్‌ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్‌ సభ్యులతో పాటు స్టీల్‌, ఆటోమొబైల్‌ కార్మికులను ట్రంప్‌ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్‌ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025

Rasi Phalalu: Daily Horoscope On 03-04-2025 In Telugu3
ఈ రాశి వారికి చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి.. భూవివాదాలు పరిష్కారం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.షష్ఠి రా.3.27 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: రోహిణి ప.12.25 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.5.45 నుండి 7.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.02 నుండి 10.51 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, అమృత ఘడియలు: ఉ.9.24 నుండి 10.55 వరకు.సూర్యోదయం : 5.58సూర్యాస్తమయం : 6.09రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృషభం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.మిథునం.... బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కుటుంబసమస్యలు. వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు.కర్కాటకం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.సింహం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.కన్య.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.తుల..... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం... చేపట్టిన కార్యాలు విజయవంతమవుతాయి. భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.ధనుస్సు... దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.మకరం.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.కుంభం... కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.మీనం.... పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

Telangana High Court orders Congress govt on Kancha Gachibowli lands4
చెట్ల నరికివేత ఆపండి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. దీనిపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్‌ సుజోయ్‌ పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎక రాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్‌ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్‌ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్‌ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి..పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ఎల్‌.రవిచందర్‌ వాదిస్తూ ‘ఆ 400 ఎకరాలు అటవీభూమి. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాలి. 40కిపైగా జేసీబీలతో చెట్లు కొట్టేసి భూమిని చదును చేస్తున్నారు. సుప్రీం తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని చదును చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. ఆ కమిటీ క్షేత్రస్థాయిలో నెలపాటు అధ్యయనం చేయాలి. ఈ అడవిలో బఫెలో, పీకాక్, ఎస్‌ఆర్‌ ప్రధాన సరస్సులు, ‘పుట్టగొడుగుల శిల’ వంటి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలున్నాయి. ఇది 237 జాతుల పక్షులు, నెమళ్లు, చుక్కల జింకలు, అడవి పందులు, నక్షత్ర తాబేళ్లు, ఇండియన్‌ రాక్‌ పైథాన్, బోయాస్‌ వంటి వివిధ పాము జాతులకు పర్యావరణ నివాసం. వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. ‘అడవి’ అనే పదాన్ని ప్రభుత్వ రికార్డులు, చట్టపరమైన నోటిఫికేషన్లకే పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. దీనికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యతను దెబ్బతీసే విధ్వంసాన్ని నిరోధించాలి’ అని నివేదించారు.ఆదాయం కోసం ఆరాటమే తప్ప..‘150 ఎకరాలకు మించి అటవీ ప్రాంతాన్ని చదును చేసేందుకు పర్యావరణ అధ్యయనం అవసరం. మీటర్‌ కంటే ఎక్కువ ఎత్తు కాండం పెరిగిన చెట్లును కొట్టాలంటే వాల్టా చట్ట ప్రకారం అనుమతి పొందాలి. లేకుంటే చట్టప్రకారం శిక్షార్హం. కానీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేదు. ఆదాయం కోసం ఆరాటమే తప్ప పర్యావరణ విధ్వంసం గురించి పట్టించుకోలేదు. హైదరాబాద్‌ నడిబొడ్డున 400 ఎకరాల్లో దశాబ్దాలకుపైగా ఉన్న భారీ వృక్షాలను తొలగిస్తే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. పక్కనే కాంక్రీట్‌ జంగిల్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు ఊపిరి కూడా అందడం కష్టమవుతుంది. భవిష్యత్‌ తరాలు ఆక్సిజన్‌కు అవస్థ పడాల్సి వస్తుంది. ఒకపక్క కేసు హైకోర్టులో విచారణ సాగుతుండగానే అధికారులు రాత్రీపగలు చెట్ల నరికివేత చేపడుతున్నారు. ఈ పనులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు.క్రీడల పేరిట రూ. వేల కోట్ల భూములకు చంద్రబాబు..రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ అకాడమీస్‌ భారత ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఐఎంజీబీపీఎల్‌) ఏర్పాటైంది. ఆగస్టు 9న ఐఎంజీ భారతతో నాటి చంద్రబాబు ప్రభుత్వం (తాత్కాలిక ప్రభుత్వం) క్రీడల్లో ఇక్కడి యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దే పేరుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. స్పోర్ట్స్‌ అకాడమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసమంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్‌ 25లోని 400 ఎకరాలను ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం మామిడిపల్లి సర్వే నంబర్‌ 99/1లోని మరో 450 ఎకరాలను అప్పగిస్తామని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. ఐఎంజీ భారత అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి బంజారాహిల్స్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. 2004 ఫ్రిబవరిలో రూ. వేల కోట్ల విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే రూ. 2 కోట్లకు ఐఎంజీ భారతకు సేల్‌డీడ్‌ చేసింది. ఏమాత్రం అర్హతలేని, భూములు కొట్టేయడం కోసమే ఏర్పడిన కంపెనీ నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం 2006లో నాటి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ఐఎంజీ భారతకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన సేల్‌డీడ్‌తోపాటు ఎంఓయూ కూడా రద్దయ్యింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా రాజశేఖరరెడ్డి నిర్ణయాన్ని సమర్థించాయి. నాడు వైఎస్సార్‌ రక్షించిన ఆ 400 ఎకరాలు ఇండస్ట్రియల్‌ భూములే. నాడు పిల్‌ దాఖలు చేసిన వారు అర్హతలేని కంపెనీ, తక్కువ ధరనే సవాల్‌ చేశారు. హెచ్‌సీయూ భూములనిగానీ, పర్యావరణం దెబ్బతింటుందని కానీ ఎక్కడా పేర్కొనలేదు. నాడు ఒక దొంగ నుంచి మేము ఈ భూములను రక్షించినప్పుడు ఈ పిల్‌ దాఖలు చేసిన వారెవరూ కలసి రాలేదు. ఇప్పుడు పిల్‌లు దాఖలు చేసి ప్రశ్నిస్తున్నారు’ అని ఏజీ పేర్కొన్నారు.గూగుల్‌ ఫొటోలే ఆధారామా?‘గూగుల్‌ ఫోటోల ఆధారంగా అక్కడ ఫారెస్ట్‌ ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. రెవెన్యూ, ఇతర ఏ రికార్డుల్లోనూ అది అటవీ భూమిగా లేదు. గూగుల్‌ చిత్రాలు వానాకాలం ఒకలా, ఎండాకాలంలో మరోలా ఉంటాయి. గూగుల్‌ చిత్రాలు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. నా స్నేహితుడొకరు సభ్యుడిగా ఉన్న ఓ గోల్ఫ్‌ క్లబ్‌లోనూ నెమళ్లు, జింకలు, పాములు ఉన్నాయి. దాన్ని కూడా అటవీ ప్రాంతంగా డిక్లేర్‌ చేస్తారా? ఈ లెక్కన హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టొద్దు. గత పదేళ్లలో నాటి ప్రభుత్వం వేలాది ఎకరాలు విక్రయించినా నోరుమెదపని వారు ఇప్పుడు రూ.75 కోట్లకు ఎకరం విక్రయిస్తుంటే ప్రశ్నిస్తున్నారు. ఈ పిల్‌లు ప్రజాప్రయోజనం ఆశించి వేసినవి కావు. నిజాం కాలం నుంచి ఈ 400 ఎకరాలు గడ్డి భూములు. ఈ భూములకు ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ స్థలంలో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్‌లు కూడా ఉన్నాయి’ అని ఏజీ చెప్పారు. కాగా, ఇది ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ అని సర్కార్‌ వద్ద రికార్డులున్నాయా? అని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సమయం ముగియడంతో తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.

Lok sabha passes Waqf Amendment Bill 20255
వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది.న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి. బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. వక్ఫ్‌ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్‌ జరగనుంది. రాజ్యసభలోనూ అధికార ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.యూపీఏ పాపమే: రిజిజు వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్‌ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటముల మధ్య సంవాదం సభను వేడెక్కించింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ పక్షాలు పేర్కొనగా, బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. వక్ఫ్‌ బిల్లు పేరును ఉమ్మీద్‌ (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్, ఎఫీషియన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్టు రిజిజు ప్రకటించారు. అనంతరం చర్చను ప్రారంభించారు. వక్ఫ్‌ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తే అంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్‌ ఆస్తుల్లో భాగమేనని ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) చీఫ్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌ గతంలో వ్యాఖ్యలు చేశారు. వాటినుద్దేశించే మంత్రి ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ బిల్లు కేవలం వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయమే తప్ప ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్‌ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి అత్యంత సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపాం. జేపీసీ సూచించిన పలు సవరణలకు అంగీకరించాం. అయినా విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నాయి. వక్ఫ్‌ చట్టానికి యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్ల దానికి విపరీతమైన అధికారాలు దఖలు పడ్డాయి. వక్ఫ్‌ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశాయి. అందుకే ఈ సవరణలు తప్పనిసరయ్యాయి’’ అని రిజిజు అన్నారు. ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ తమ ప్రభుత్వం వేలుపెట్టబోవడం లేదని చెప్పారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వక్ఫ్‌ ఆస్తులున్నది భారత్‌లోనే. వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి. అలా జరిగేలా చూడటమే బిల్లు లక్ష్యం. దీనికి మద్దతిస్తున్నదెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్‌ తరఫున గౌరవ్‌ గొగొయ్‌ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. బిల్లును రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే దాడిగా అభివర్ణించారు. రిజుజు చర్చకు బదులిచ్చారు. మైనారిటీలకు భారత్‌ను మించిన సురక్షితమైన దేశం ప్రపంచంలోనే లేదన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా సగర్వంగా నివసిస్తున్నట్టు చెప్పారు.అంతా అంగీకరించాల్సిందే: అమిత్‌ షా వక్ఫ్‌ బిల్లు విషయమై దేశంలో అయోమయం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టడం ద్వారా వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో వేలు పెడుతుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ‘‘ఈ సవరణలను మైనారిటీలు ఒప్పుకోరని కొందరంటున్నారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు చేస్తున్న చట్టమిది. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు. ‘‘2014 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాటి కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ సర్కారు వక్ఫ్‌ చట్టానికి హడావుడిగా రాత్రికి రాత్రి అడ్డగోలు సవరణలు చేసింది. తద్వారా దాన్ని చట్టాలకు అతీతంగా మార్చింది. కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం సంతుïÙ్టకరణ రాజకీయాలకు ఇది పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరముండేదే కాదు’’ అని అమిత్‌ షా అన్నారు. ‘‘యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్‌ జోన్‌లో ఏకంగా 123 ఆస్తులు కేవలం 25 రోజుల వ్యవధిలో వక్ఫ్‌ ఆస్తులుగా మారిపోయాయి. ఇలాంటి దారుణమైన అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్‌ భూములు, ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే తాజా బిల్లు ఉద్దేశం. అంతేతప్ప ఓటుబ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేదు’’ ని స్పష్టం చేశారు. పౌరుల వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి తీరతామని చెప్పారు. ‘‘కేవలం వక్ఫ్‌ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్‌ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుంది’’ అని వివరించారు. అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు బిల్లుపై అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఓటింగ్‌ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. తర్వాత దానికి విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా అవన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయాయి.చర్చకు రాహుల్‌ గైర్హాజరు సోదరి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక కూడా కీలకమైన వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు, ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన సోదరి, వయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా బుధవారం సభకు హాజరు కాలేదు. బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. దాంతో బిల్లుపై కాంగ్రెస్‌ తరఫున చర్చకు రాహులే సారథ్యం వహిస్తారని భావించారు. కానీ చర్చలో పాల్గొనరాదని రాహుల్‌ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ప్రియాంక కూడా చర్చలో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్‌కు కేటాయించిన గంటా 40 నిమిషాల సమయంలో గౌరవ్‌ గొగొయ్‌ తదితర పార్టీలే ఎంపీలే మాట్లాడారు. బీజేపీ నయా మత రాజకీయంలౌకిక ఇమేజ్‌ కు పెద్ద దెబ్బ: అఖిలేశ్‌ వక్ఫ్‌ బిల్లు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, భారత లౌకిక ఇమేజ్‌ కు పెద్ద దెబ్బ అని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నయా మత రాజకీయం అని ధ్వజమెత్తారు. లోక్‌ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఓట్ల పోలరైజేషన్‌ కు, తమకు దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాషాయ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అధికార కూటమిలోకి కొన్ని పార్టీలు వక్ఫ్‌ బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ వాటికీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదని తెలిపారు.

Myanmar: Man pulled alive from Myanmar hotel wreckage after 5 days6
మృత్యువుతో 108 గంటల పోరాటం

బ్యాంకాక్‌: భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. వేలాది మంది మరణించారు. మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. వందలాదిగా భారీ భవనాలు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా విధ్వంసమే కనిపిస్తోంది. శిథిలాల నుంచి తవ్వినకొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలతో మిగిలి ఉంటున్నారు. హోటల్‌లో కార్మికుడిగా పని చేస్తున్న 26 ఏళ్ల నాయింగ్‌ లిన్‌ టున్‌ అదృష్టం కూడా బాగున్నట్లుంది. 108 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు ప్రాణాలతో బయటకు వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడారు. ఇందుకోసం చాలా శ్రమించాల్సి వచ్చింది. నాయింగ్‌ లిన్‌ టున్‌ మయన్మార్‌ రాజధాని నేపడాలోని క్యాపిటల్‌ సిటీ హోటల్‌లో పని చేస్తున్నాడు. గత శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి ఈ హోటల్‌ కుప్పకూలింది. శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఇక్కడ గత ఐదు రోజులుగా జరుగుతున్న సహాయక చర్యల్లో కేవలం మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. శిథిలాల కింద ఎవరైనా బతికి ఉండొచ్చన్న అంచనాతో ఎండోస్కోపిక్‌ కెమెరాతో గాలించారు. శిథిలాల కింద చిక్కుకున్న నాయింగ్‌ లిన్‌ టున్‌ ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. యంత్రాల సాయంతో కాంక్రీట్‌ దిమ్మెలకు భారీ రంధ్రం చేసి అతడిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ పూర్తికావడానికి 9 గంటలకు పైగా సమయం పట్టింది. ఆహారం, నీరు లేక పూర్తిగా నీరసించిపోయినప్పటికీ స్పృహలోనే ఉన్న నాయింగ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు ప్రకటించారు. 3,000 దాటిన మృతుల సంఖ్య ఇదిలా ఉండగా, మయన్మార్‌ భూకంపంలో మృతుల సంఖ్య 3,000కు చేరుకున్నట్లు స్థానిక మీడియా ప్రకటించింది. మరో 4,639 మంది గాయపడ్డారని తెలియజేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు బ్యాంకాక్‌లో భూకంపం మృతుల సంఖ్య 22కు చేరుకుంది. 34 మంది క్షతగాత్రులయ్యారు. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న భారీ భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇక్కడ బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఆ్రస్టేలియా ప్రభుత్వం ఇప్పటికే 1.25 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించగా, అదనంగా మరో 4.5 మిలియన్‌ డాలర్లు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. సహాయక చర్యల కోసం భారత ప్రభుత్వం 200 మందిని పంపించింది. చైనా 270 మందిని, రష్యా 212 మందిని, యూఏఈ 122 మందిని పంపించాయి. మయన్మార్‌లో ఎంత నష్టం వాటిల్లిందనేది ఇంకా నిర్ధారించలేదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్‌ఫోన్‌ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు. రోడ్లు చాలావరకు దెబ్బతినడంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. మాండలే నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సింగు టౌన్‌షిప్‌లో ఓ బంగారు గని భూకంపం వల్ల కుప్పకూలడంతో అందులో ఉన్న 27 మంది కార్మికులు మృత్యువాత పడినట్లు తాజాగా వెల్లడయ్యింది.

Supreme Court of India warns police Department7
పరిధి దాటొద్దు.. పోలీసులను హెచ్చరించిన సుప్రీంకోర్టు

వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. పౌరులు పరిధి దాటవచ్చేమో కానీ.. పోలీసులు దాటడానికి వీల్లేదు. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు. మేజి్రస్టేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలి. రొటీన్‌గా వ్యవహరించవద్దు. సాక్షి, అమరావతి: పౌరుల అరెస్ట్‌ విషయంలో పోలీసులు పరిధులు దాటి వ్యవహరిస్తుండటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పౌరులు పరిధి దాటవచ్చునేమో గానీ, పోలీసులు మాత్రం పరిధులు దాటడానికి ఎంత మాత్రం వీల్లేదని హెచ్చరించింది. ‘రాష్ట్ర యంత్రాంగంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకం. సమాజం.. ముఖ్యంగా వ్యక్తుల రక్షణ, భద్రతపై పోలీసు వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల వ్యక్తులు, సమాజం నమ్మకాన్ని చూరగొనేలా నడుచుకోవడం పోలీసుల అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు పరిధులు దాటుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మేజిస్ట్రేట్లు కూడా తగిన నిర్ణయం వెలువరించే ముందు జాగ్రత్తగా తమ మెదడు ఉపయోగించాలని, రొటీన్‌గా వ్యవహరించవద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీని దేశంలోని డీజీపీలందరికీ పంపాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది. కస్టడీ విషయంలో వ్యక్తుల హక్కులను పరిరక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఈ ఆదేశాల ద్వారా డీజీపీలకు గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ పిటిషన్‌హరియాణాకు చెందిన విజయ్‌ పాల్‌కు తన పొరుగు వారైన మమతా సింగ్‌ తదితరులతో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు విజయ్‌ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు తన పట్ల చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు తనను కొట్టారంటూ విజయ్‌పాల్‌ పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని ఆయన హైకో­ర్టుకు నివేదించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు 2023లో కొట్టేసింది. దీనిపై విజయ్‌పాల్‌ అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనా స్థలంతో పాటు అటు తర్వాత పోలీస్‌స్టేషన్‌లో కూడా పోలీసులు తనపై దాడి చేశారని విజయ్‌పాల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తన అరెస్ట్‌ గురించి తన సోద­రుడు జిల్లా ఎస్‌పీకి ఈ–మెయిల్‌ పంపారని, దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయారన్నారు. తనను కస్టడీలోకి తీసుకున్న రెండు గంటల తర్వాత తనపై కేసు నమోదు చేశారని తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు హర్యానా డీజీపీ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. దీంతో డీజీపీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు స్వయంగా హాజరయ్యారు. ఆ తర్వాత పలు విచారణల అనంతరం గత వారం ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇరుపక్షాలు కోర్టు ముందుంచిన రికార్డులను పరిశీలించిన ధర్మాసనం, విజయ్‌పాల్‌ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తేల్చింది. ఓ వ్యక్తి క్రిమినల్‌ అయినప్పటికీ, అతని విషయంలో కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని చట్టం చెబుతోందని ధర్మాసనం గుర్తు చేసింది. విజయ్‌పాల్‌పై నమోదైన కేసులో కింది కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యాన్ని మూసి వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులను హెచ్చరించింది. తన కింది అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదన్న రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఓ వ్యక్తి అరెస్ట్‌ విషయంలో పోలీసులకు అధికారాలు కల్పిస్తున్న సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(1)(బీ)(2)లో నిర్ధేశించిన చెక్‌లిస్ట్‌ పట్ల తాము ఎంత మాత్రం సంతృప్తికరంగా లేమంది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తమ ముందు ఉంచిన ఈ చెక్‌లిస్ట్‌ను ఓ ఫార్మాలి­టీగానే భావిస్తున్నామంది. ఈ చెక్‌లిస్ట్‌ను అనుమతించే విషయంలో మేజిస్ట్రేట్‌ సైతం మెదడు ఉపయోగించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Celebrities from various fields are responding at the national level to the HCU land dispute8
హెచ్‌సీయూపై సెలబ్రిటీలు సై!

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. విద్యార్థుల నిరసనలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. వారికి మద్దతుగా సినీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, భిన్న రంగాల ప్రముఖులు గొంతు కలుపుతున్నారు. దీనితో హెచ్‌సీయూ భూముల అంశాన్ని మరింత చర్చనీయాంశంగా మారుస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం..: హెచ్‌సీయూ విద్యార్థులకు మద్దతుగా సినీహీరో రాంచరణ్‌ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. ‘‘జంతువులు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? మనం చెట్టును ఎక్కడ తిరిగి నాటుతున్నాం? దీనిపై మీ భవిష్యత్తు ప్రణాళికను పంచుకోండి. అటవీ ప్రాంతాన్ని నిర్మూలించిన తర్వాత ఏం చేయబోతున్నారు’అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు పెట్టారు. ప్రముఖ నటి సమంత కూడా ఈ అంశంపై స్పందించారు. గచ్చిబౌలిలో జీవవైవిధ్యమున్న భూమిని ధ్వంసం చేయడం వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందంటూ.. పర్యావరణ ప్రభావాలపై ఓ ఆంగ్లపత్రిక నివేదికను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ‘‘ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు. ఇది మంచిది కాదు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా నేను విద్యార్థులకు అండగా నిలుస్తాను. భవిష్యత్తును కాపాడుకోవడానికి అందరూ నిరసన తెలపాలి’’అని పిలుపునిచ్చారు. ఇక.. ‘‘పర్యావరణ భవిష్యత్తు కోసం విద్యార్థులు గళం విప్పుతున్నారు. యువతకు సుస్థిరమైన రేపటికి అవకాశం కల్పిoచేవి ఐటీ పార్కులు కాదు, అరణ్యాలే. జీవవైవిధ్యాన్ని పణంగా పెట్టి చేసేది అభివృద్ధి కాదు వినాశనం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి లో కంచ ఫారెస్ట్‌ను కాపాడండి’’అని బాలీవుడ్‌ నటి దియా మీర్జా పేర్కొన్నారు. వీరితోపాటు నటి ఈషా రెబ్బా, బిందు మాధవి కూడా విద్యార్థులకు మద్దతుగా ప్రకటనలు చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ నేరుగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. టీవీ, సోషల్‌ మీడియా ప్రముఖులు సైతం.. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్, నటి రష్మీ గౌతమ్‌ తదితరులతోపాటు పలువురు టీవీ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు. చాలా మంది నెటిజన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌ పోస్టుల్లో ‘ఆల్‌ ఐస్‌ ఆన్‌ హెచ్‌సీయూ, సేవ్‌ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’వంటి నినాదాలను షేర్‌ చేస్తున్నారు.

Sakshi Editorial On Uttar Pradesh Bulldozer demolitions9
ఇకనైనా అరాచకం ఆగేనా!

రాచరికాల్లో అధికారానికీ, దర్పానికీ, దానిద్వారా లభించే న్యాయానికీ రాజదండం చిహ్నం. ఈమధ్యకాలంలో బుల్‌డోజర్‌ అలాంటి పాత్ర పోషిస్తున్న వైనం కనబడుతోంది. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ పాలన మొదలయ్యాక బుల్‌డోజర్‌ అర్థం, దాని పరమార్థం మారిపోయాయి. ఆ రాష్ట్రాన్ని చూసి మరికొన్ని రాష్ట్రాలు వాతలు పెట్టుకోవటం కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో 2021 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఆవాసాలను కూల్చేసిన అధికారగణంపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయటంతోపాటు, ఇళ్లు కోల్పోయిన ఆరుగురు పిటిషనర్లకూ ఆరువారాల్లో రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు... ఈ ఉదంతం తమ అంతరాత్మను తీవ్రంగా కలవరపరిచిందని ధర్మాసనం తెలియజేసింది. అధికారమంటే ఇష్టానుసారం ఏదైనా చేయడానికి దొరికిన లైసెన్స్‌గా భావించే సంస్కృతి దేశంలో ముదిరిపోయింది. ఒక్క యూపీలోనేకాదు... మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ వగైరాల్లో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకున్న తీరు గమనిస్తే ఇదో అంటువ్యాధిగా మారిందన్న అభిప్రాయం కలుగుతుంది. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నా లేదా శిక్షపడినా... అధికార పక్షానికి అనుకూలంగా లేకపోయినా అలాంటివారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చేయడానికి బుల్‌డోజర్‌లు అత్యుత్సాహంతో ఉరుకుతున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. నిర్మాణ నిబంధనల్ని తీవ్రంగా ఉల్లంఘించారని తేలినా, ప్రభుత్వ భూమినో, మరొకరి భూమినో దురా క్రమించి కట్టారని తేలినా అలాంటివాటిని కూల్చేయటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ అందుకొక విధానం ఉండాలి. చట్ట నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. తప్పు చేశారని ఆరోపణ లొచ్చినవారికి తగిన నోటీసులిచ్చి వారి సంజాయిషీ కోరాలి. సంతృప్తి చెందనట్టయితే ఆక్రమణ దారులకు హేతుబద్ధమైన వ్యవధినిచ్చి కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారిస్తున్న కేసు సంగతే తీసుకుంటే 2021 మార్చి 1న మొదటిసారి అక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు వచ్చాయి. వారికి అంతకు దాదాపు మూణ్ణెల్ల ముందే... అంటే జనవరి 8న నోటీసులిచ్చినట్టు, అందులో ఆ నెల 27లోగా ఎవరికివారు సొంత ఖర్చులతో ఇళ్లు కూల్చేయాలని ఆదేశించినట్టు ఉంది. దానికి స్పందన రాకపోవటంతో తాజాగా నోటీసులు జారీచేశామని అందులో పేర్కొన్నారు. మరో ఆరు రోజుల్లో బుల్‌డోజర్‌లతో వచ్చి ఇళ్లు కూల్చేశారు. తొలుత నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో ఇళ్ల దగ్గర అతికించామన్న ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఓకా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ లతో కూడిన బెంచ్‌ విశ్వసించలేదు. పిటిషనర్లకు సహేతుకమైన వ్యవధినిచ్చిన దాఖలా కనబడటం లేదని, ఇది పౌరులకు రాజ్యాంగంలోని 21వ అధికరణ ద్వారా సమకూరిన ఆవాస హక్కును ఉల్లంఘించటమేనని తేల్చిచెప్పింది. ఈ తీర్పు అనేకవిధాల ఎన్నదగినది. పిటిషనర్లకు ఆ స్థలంపై చట్టబద్ధమైన హక్కుందా లేదా అన్న అంశంలోకి ధర్మాసనం పోలేదు. దానిపై వారు విడిగా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిందే! 2023 ఏప్రిల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన రాజకీయ నాయకుడు, పలు కేసుల్లో నింది తుడైన అతీఖ్‌ అహ్మద్‌ అక్రమంగా ఆక్రమించుకున్న భూమిలో ఈ ఇళ్లున్నాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎన్నడో 1906లో అప్పటి అలహాబాద్‌ జిల్లా కలెక్టర్‌ షకీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తికి 30 ఏళ్లకు లీజుకిచ్చి మరో రెండు దఫాలు పొడిగించుకునే వీలు కల్పించారని రికార్డులు చెబు తున్నాయి. 1960లో జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతితో షకీర్‌ దాని హక్కుల్ని వేరేవారికి బదలాయించాడు. ఆ తర్వాత క్రమంలో అది మరికొందరి చేతులు మారింది. చివరకు ప్రస్తుత పిటిషనర్లు దాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ కొనుగోలు చెల్లకపోవచ్చు. అది ప్రజా ప్రయోజనం కోసం వినియోగించాల్సిన భూమే కావొచ్చు. అంతమాత్రాన నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇళ్లు కూల్చటం సరైన చర్య కాదు. సుప్రీంకోర్టు తీర్పు దీన్ని తేటతెల్లం చేసింది.ఈ సందర్భంగా వేరేచోట బుల్‌డోజర్‌ కూల్చివేతలు సాగిస్తుండగా ఒకటో తరగతి బాలిక అనన్యా యాదవ్‌ తన స్కూల్‌ బ్యాగ్‌ను రక్షించుకోవటానికి మంటలంటుకున్న షెడ్‌ సమీపానికి వెళ్లిన వీడియోను న్యాయమూర్తులు ప్రస్తావించటం గమనార్హం. అలాంటి ఉదంతాలు అందరినీ దిగ్భ్రాంతిపరుస్తాయన్న వారి వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. గత నవంబర్‌లో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నారులూ, మహిళలూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి సంద ర్భాల్లో కూల్చివేతలకు పాల్పడిన అధికారుల నుంచి ఇళ్ల, దుకాణాల పునర్నిర్మాణానికి అయ్యే వ్యయం వసూలు చేయాలని కూడా చెప్పింది. ఇతర మార్గదర్శకాలు కూడా రూపొందించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలైనా ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. కేవలం అయిదేళ్ల కోసం ఎన్నికై అధి కారంలోకొచ్చిన ప్రభుత్వాలు శాశ్వతంగా నిలిచే రాజ్యాంగ విలువలను కాలరాయటం, ఇష్టాను సారం ప్రవర్తించటం తప్పుడు సంకేతాలిస్తుంది. సాధారణ పౌరుల్ని కూడా చట్ట ఉల్లంఘనలకు ప్రోత్సహిస్తుంది. అందుకే ప్రభుత్వాలు ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. నాలుగేళ్లు ఆలస్యమైనా సర్వోన్నత న్యాయస్థానంలో బాధితులకు సరైన న్యాయం దక్కటం హర్షించదగ్గది.

Chandrababu Naidu govt negligence on Bird flu10
బర్డ్‌ఫ్లూ కలకలం.. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం

నరసరావుపేట/మంగళగిరి/సాక్షి, అమరావతి: బర్డ్‌ఫ్లూ (హెచ్‌5ఎన్‌1) వైరస్‌ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర చరిత్రలో తొలిసారి మనుషులకు ఆ వ్యాధి సోకడంతో పాటు ఒక మరణం సంభవించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం రెండేళ్ల చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. రాష్ట్రంలో రెండు నెలలుగా ఎక్కడా బర్డ్‌ ఫ్లూ లేదంటూ అబద్ధపు ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు సర్కారు.. తాజాగా పచ్చి చికెన్‌ తినడం వల్లే ఆ బాలికకు బర్డ్‌ ఫ్లూ వచ్చిందని ప్రకటించింది. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. కొద్ది నెలలుగా రాష్ట్రంలోని పౌల్ట్రీ పరిశ్రమలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. దానిని అరికట్టడంలో, వైరస్‌ ప్రబలకుండా చర్యలు చేపట్టడంలో చంద్ర­బాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వంతో వ్యవహరించింది. ఈ క్రమంలోనే నరసరావుపేట రావిపాడు రోడ్డులోని బాలయ్య నగర్‌కు చెందిన పెండ్యాల గోపి, జ్యోతి దంపతుల కుమార్తె రెండేళ్ల ఆరాధ్య మృత్యువాత పడింది. జలుబు, తుమ్ములు, తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఈ చిన్నారి మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గత నెల 15న మృతి చెందగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘రెండేళ్ల బాలిక జ్వరం, శ్వాసకోశ సమస్యతో మార్చి 4వ తేదీన పిడియాట్రిక్స్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరింది. ఆ బాలికకు లెప్టోసిరోసిస్‌ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. నాసోఫారింజియల్‌ స్వాబ్‌ పరీక్ష ద్వారా ఇన్‌ఫ్లూయింజా ఏ పాజిటివ్‌గా కూడా నిర్ధారణ అయింది. దీంతో మరో నమూనాను పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపాం. వారు ఏవియన్‌ ఇన్‌ఫ్లూయింజా (హెచ్‌5ఎన్‌1)గా నిర్ధారించారు. అయితే అంతలోనే పాప ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 15వ తేదీన మృతి చెందింది. ఎవరైనా సరే జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి’ అని ఎయిమ్స్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంత స్పష్టంగా ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ సంస్థే రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ ఉందని నిర్ధారించగా, ప్రభుత్వం మాత్రం లేనే లేదంటూ పచ్చి అబద్ధాలు చెబుతోంది. రంజాన్‌ రోజు సాయంత్రం స్థానిక డీఎంహెచ్‌వోకు ఈ విషయం తెలియడంతో మరుసటి రోజు మంగళవారం ఉదయం నుంచి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లీశ్వరి మంగళవారం నరసరావుపేటకు వచ్చి చిన్నారి కుటుంబాన్ని విచారించారు. తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి రక్త పరీక్షలు చేశారు. జాగ్రత్తలు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా బర్డ్‌ ఫ్లూ వ్యాధి జాడ లేదని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ టీ.దామోదర నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఇదే తొలి కేసురాష్ట్రంలో గతంలో చాలాసార్లు కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కొద్ది నెలల కింద కూడా బర్డ్‌ఫ్లూ వైరస్‌ పెద్ద ఎత్తున విజృంభించింది. ఇలాంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వం కేవలం పబ్లిసిటీ డ్రామా నడిపింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించకుండా కేవలం ప్రకటనలతో సరిపెట్టింది. నరసరావుపేటలో మరణించిన చిన్నారి ఫిబ్రవరిలో పచ్చి కోడి మాంసం తినడం వల్లే వ్యాధిబారిన పడిందని వైద్య శాఖ చెబుతుండగా.. తామసలు రెండు నెలలుగా చికెన్‌ తినడం లేదని బాధిత కుటుంబం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే వైరస్‌ను పూర్తిగా అరికట్టేశామని ప్రభుత్వం ఏ విధంగా ప్రకటన చేస్తుంది? ఈ పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి.. బుధవారం పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కేసులు లేనేలేవని ప్రకటన ఇవ్వడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. బాలిక మృతి నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. చిన్నారి మరణించిన ప్రాంతంలో రెండు వారాల పాటు సర్విలెన్స్‌ పెట్టారు. దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో కేవలం 4 హ్యూమన్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయింజా కేసులు (హెచ్‌5ఎన్‌1), హెచ్‌9ఎన్‌2 కేసులు నమోద­య్యాయి. వీటిలో జూన్‌ 2019లో మహారాష్ట్ర, జూలై 2021లో హరియాణలో ఒక్కో కేసు, ఏప్రిల్, మే 2024లో పశ్చిమ బెంగాల్లో రెండు కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ మృతి కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.చికెన్‌ తీసుకురాలేదు రెండు నెలలుగా మా కుటుంబం చికెన్‌ తీసుకురాలేదు.. వండలేదు. రావిపాడు చర్చిలో ప్రార్థనలకు హాజరైనప్పుడు 40 రోజులపాటు మాంసాహారం తినొద్దని చర్చి పెద్దలు చెప్పటంతో చికెన్‌ తెచ్చుకోలేదు. ఈ జబ్బు ఏవిధంగా వచ్చిందో మాకు తెలియదు. మా అందరికీ రక్త పరీక్షలు చేశారు. అందరికీ బాగానే ఉందన్నారు. – పెండ్యాల లక్ష్మయ్య (చిన్నారి తాత), రాము (పెదనాన్న)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement