టీవీ చానల్ మార్చినందుకు గొడవ.. ఆత్మహత్య | intermediate student suicide in hyderabd over tv channel changing | Sakshi

టీవీ చానల్ మార్చినందుకు గొడవ.. ఆత్మహత్య

Published Tue, Nov 8 2016 5:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

టీవీ చానల్ మార్చినందుకు గొడవ.. ఆత్మహత్య

టీవీ చానల్ మార్చినందుకు గొడవ.. ఆత్మహత్య

టీవీ చానల్ చూసే విషయంలో తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ : తనకు ఇష్టమైన టీవీ చానల్ చూసే విషయంలో తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఎస్‌ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌పీఆర్‌హిల్స్ సమీపంలోని సంజయ్‌నగర్‌లో నివసించే షహానాబేగం(16) నిమ్రా కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత ఆదివారం ఇంట్లో టీవీ చూస్తుండగా తమ్ముడు సమీర్ తనకు ఇష్టమైన చానల్ మారుస్తూ షహానాను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

చానల్ మార్చిందంటూ కోపం పట్టలేక సమీర్ అక్క షహానాను కొట్టాడు. దీనిపై తల్లి కూడా.. టీవీ చూస్తూ కాలక్షేపం చేయకపోతే ఇంట్లో పని చేయవచ్చు కదా అంటూ కోప్పడింది. దీంతో మనస్తాపానికి గురైన షహానా తన గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొంది. కొద్దిసేపటి తర్వాత మరో సోదరి ఆ గదిలోకి వెళ్లగా ఉరికి వేలాడుతున్న చెల్లెలు కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షహానాబేగం సోమవారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement