
(ఫైల్ ఫోటో)
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని జాహ్నవి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన జాహ్నవి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణలో ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష ఫలితాలు గురువారం విడుదలైన విషయం తెలిసిందే.