
కఠ్మాండ్ : ఎవరెస్టు శిఖరంపై ఇటీవల సంభవించిన మరణాలు కేవలం ట్రాఫిక్ జామ్ వల్ల కాలేదని.. ఎత్తైన ప్రదేశాల్లో వ్యాధులకు గుర య్యే అవకాశం, ఆరోగ్య సమస్యలు, ప్రతికూల వాతావరణం వంటి కారణాల వల్ల జరిగాయ ని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది. ఎవరెస్టుపై అత్యధిక రద్దీ నెలకొనడంతో ఈ ఏడాది 11 మంది చనిపోయారన్న జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలను నేపాల్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఏదైనా కథనాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకొని రాయాలని.. అసత్య వార్తలు రాయడం తగదని ఘాటు గా వ్యాఖ్యానించింది. ఎవరెస్టును అధిరోహిం చే క్రమంలో ఎనిమిది మంది చనిపోయారని నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ డీజీ దండు రాజ్ గిమిరే గురువారం వెల్లడించారు. ఈ మరణాలకు ట్రాఫిక్ జామ్ మాత్రమే కారణం కాదన్నారు.