Top Stories
ప్రధాన వార్తలు

పటేల్‌కూ, నెహ్రూకూ పడదంటారా?
ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 31నసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్‌కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్ భాయ్ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.వల్లభ్ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్ భాయ్ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్ 1933లో యూరప్‌లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్ భాయ్ 1925–30 కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్ (గుజరాత్) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్ లండన్ వెళ్లి బారిష్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్ పోర్టు, టికెట్ సంపాదించాడు. అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్‌మన్ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్‌కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్ పోర్టు, టికెట్‌తో నేను లండన్ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్ సరే అనడమే కాకుండా విఠల్ లండన్ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు. జైల్లో ఉండి కూడా సర్దార్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్‌లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్ గుజరాత్ కాంగ్రెస్ కమిటీ, అహ్మదాబాద్ మునిసిపల్ కౌన్సిల్ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్ రాజ్ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్ వల్లభ్ భాయ్’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్ కౌన్సిల్ సారథిగా పటేల్ అహ్మదాబాద్‌ను ‘నడిపించాడు’. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్‌కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్ దాస్, పాట్నా టౌన్ కౌన్సిల్‌కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్ భాయ్ పటేల్ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి. 1948లో, వల్లభ్ భాయ్ పటేల్ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్‌లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్‌కు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్‌కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు. తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు. కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్ పటేల్‌కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్ – ఎ లైఫ్’ గ్రంథకర్త-రాజ్‌మోహన్ గాంధీ

పెట్టుబడులు రూ.11,062 కోట్లు
సాక్షి, హైదరాబాద్: జపాన్ పర్యటనలో తెలంగాణ బృందం శుక్రవారం రూ. 11,062 కోట్ల భారీ పెట్టుబడులు సాధించింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎన్టీటీ డేటాతోపాటు ఏఐ–ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.శుక్రవారం టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆయా సంస్థల ప్రతినిధుల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎనీ్టటీ గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్‌పాయ్, నెయిసా సీఈవో, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్ శరద్ సంఘీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోక్యో హెడ్ క్వార్టర్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎన్టీటీ డేటా.. 50కిపైగా దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్–3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. దేశంలోనే అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయం హైదరాబాద్‌లో నిర్మించబోయే 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూర్చనుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఎన్వరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్ (ఈఎస్జీ) ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందించనుందని.. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదపడుతుందని వివరించాయి. మూడో పరిశ్రమకు తోషిబా అనుబంధ సంస్థ ఓకే.. హైదరాబాద్ శివార్లలోని రుద్రారంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల పరిశ్రమను విస్తరించేందుకు తోషిబా అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ముందుకొచి్చంది. రూ. 562 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. రుద్రారంలో సర్జ్ అరెస్టర్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించనున్నట్లు టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.ఇప్పటికే రెండు పరిశ్రమలకు తోడుగా అదనంగా ఇది మూడో పరిశ్రమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీటీడీఐ సీఎండీ హిరోషి ఫురుటా పాల్గొన్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులు: సీఎం రేవంత్ తెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి.. జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం తెలంగాణ కొత్త రాష్ట్రమైనా వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మరింత ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన టోక్యోలో జరిగిన ‘ఇండియా–జపాన్ ఎకనామిక్ పార్టనర్íÙప్ రోడ్ షో’లో 150 మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. ‘టోక్యో గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణగల వారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నా’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులైన నిపుణులు, స్థిరమైన విధానాలను తమ ప్రజాప్రభుత్వం అందిస్తుందని జపాన్ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, ఎల్రక్టానిక్స్, విద్యుత్ వాహనాలు, టెక్స్టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సానుకూలతలను వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పారిశ్రామికవేత్తలకు వివరించారు.సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది. రాష్ట్ర పారిశ్రామిక విధానాలతోనే భారీ పెట్టుబడులుతెలంగాణ భారీ పెట్టుబడులను సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిల్ విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఏడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్‌గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని వ్యాఖ్యానించారు.

కత్తులతోనే పొత్తు పొడుపు!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది. అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు. స్టాలిన్ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్‌పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు. ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్‌కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్‌నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి.

డయాగ్నొస్టిక్స్ డల్!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్’ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. రూ. కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో చాలా కేంద్రాల్లో పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వైద్య పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత కూడా నెలకొంది. దీంతో చాలా జిల్లాల్లో పేదలు అనివార్యంగా రూ. వేలు ఖర్చుపెట్టి మళ్లీ ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. 32 జిల్లాల్లో హబ్స్.. 1,546 చోట్ల స్పోక్స్ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద హబ్ అండ్ స్పోక్ విధానంలో హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ప్రధాన హబ్‌గా తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఏర్పాటైంది. ఆపై రాష్ట్రవ్యాప్తంగా హబ్‌లను విస్తరించారు. ప్రస్తుతం నారాయణపేట, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 32 బయో కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, పాథలాజీ ల్యాబ్స్‌తో కూడిన హబ్స్ ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీలు, బస్తీ, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ సెంటర్లు మొదలైన 1,546 చోట్ల స్పోక్స్ (చిన్న కేంద్రాలు)ను ఏర్పాటు చేశారు. తక్షణమే వచ్చే పరీక్షల ఫలితాలను స్పోక్స్‌లలో, ఇతర వైద్య పరీక్షలను హబ్‌లలో నిర్వహిస్తున్నారు.పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు 32 హబ్‌లలో ఉన్నాయి. సాధారణ మధుమేహ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు మొదలుకొని మూత్రపిండాల వ్యాధి నిర్ధారణకు క్రియాటిన్ పరీక్షల వరకు, కేన్సర్ పరీక్షకు వినియోగించే సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల వరకు హబ్‌లలో అందుబాటులో ఉన్నాయి. పాథాలజీ, రేడియాలజీ సేవలు, అ్రల్టాసౌండ్, టెలి ఈసీజీ, ఎక్స్‌రే, మామోగ్రామ్, 2డీ ఎకో పరీక్షలన్నీ ఈ కేంద్రాల్లో జరుగుతాయి. ఏదైనా తగ్గని జబ్బుతో రోగి బాధ పడుతుంటే ఆ జబ్బు మూలాలను కనుక్కొని, తగిన మందులు సిఫారసు చేసేందుకు వీలుగా ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’టెస్టులు కూడా ఈ హబ్‌లలో జరిపేందుకు వీలుంది. ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టుల కొరతతో.. రాష్ట్రవ్యాప్తంగా 32 హబ్‌లలోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లలో ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’పరీక్షల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన వైద్య పరికరాలను తెచ్చిపెట్టారు. అందుకు సంబంధించిన వైద్య పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్లు నిర్వహిస్తే వాటిని మైక్రోబయోలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్‌తోపాటు కొన్ని పాత జిల్లా కేంద్రాలల్లోని హబ్‌లలో తప్ప ఎక్కడా మైక్రోబయోలజిస్టులు లేక ఈ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే కేన్సర్‌ను నిర్ధారించేందుకు రూ. 50 లక్షల చొప్పున హబ్‌లలో ఏర్పాటు చేసిన సీరం–ఎలక్రో్టఫొరెసిస్ యంత్రాలకు అవసరమైన రీఏజెంట్లు (రసాయనాలు) అందుబాటులో లేక చాలా వరకు పరికరాలు వృథాగా పడి ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. కొన్ని టెస్టులతోనే సరి.. ప్రతి హబ్‌లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీకి సంబంధించి 134 రకాల వైద్య పరీక్షలు జరగాల్సి ఉండగా చాలా హబ్‌లలో 30–40 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతోపాటు రేడియాలజిస్టులు, మైక్రోబయోలజిస్టులు, ఇతర డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. హబ్‌లపై సన్నగిల్లుతున్న నమ్మకం వివిధ హబ్‌లలో తరచూ పరీక్షల ఫలితాలు ఒకరివి మరొకరికి మారిపోతుండటంతో ప్రజల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌పై విశ్వాసం సన్నగిల్లుతోంది. స్పోక్స్ (చిన్న కేంద్రాలు)లో బీపీ, షుగర్ మినహా అన్ని పరీక్షలను హబ్‌లకే పంపుతుండగా అక్కడ పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. ఆ రిపోర్టులను తీసుకొస్తేనే పీహెచ్‌సీల్లో చూపించుకొనే పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో చాలా మంది ఆర్ఎంపీల ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. పీహెచ్‌సీల్లో సమయానికి డాక్టర్లు ఉండకపోవడం కూడా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడానికి కారణమవుతోంది. కాగా, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత నేపథ్యంలో తాజాగా 700 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. ⇒ ఖమ్మంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్‌లో రీ ఏజెంట్ల కొరతతో కేన్సర్‌కు సంబంధించి మూడొంతుల టెస్ట్‌లు జరగడం లేదు. ⇒ అక్కడ 134 రకాల పరీక్షలకుగాను 38 పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని వైద్య పరికరాలు లేకపోవడమే అందుకు కారణం. ⇒జిల్లాలోని స్పోక్స్‌లలో రీ ఏజెంట్ల కొరతతో ఎక్కడా డయాగ్నస్టిక్ టెస్ట్‌లు నిర్వహించడం లేదు. శాంపిల్స్ సేకరించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని హబ్‌కు పంపుతున్నారు. ⇒ జనగామ జిల్లాలోని హబ్‌లో వైద్య పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టులు అందుబాటులో లేక మైక్రోబయోలజీ సంబంధిత పరీక్షలు జరగడం లేదు. ⇒ పీహెచ్‌సీల నుంచి తీసుకున్న తాత్కాలిక సిబ్బందితోనే బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. కేన్సర్‌కు సంబంధించి సీఏ 125, సీఈఏ, పీఎస్ఏ మూడు టెస్టులు ఇప్పటి వరకు 30 వరకు చేశారు. ⇒ ఈ హబ్‌లో 17 రకాల మిషన్లతో రోజుకు 1,659 పరీక్షలను చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ⇒ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ హబ్‌లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల కోసం పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉంచేందుకు సరైన బిల్డింగ్ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ⇒ నిర్మల్ జిల్లాలో మైక్రోబయాలజిస్టులు, పాథాలజిçస్టులు లేరు. కేన్సర్ టెస్టులు చేయడం లేదు. బయోకెమిస్ట్రీ, థైరాయిడ్, సీబీపీ, డెంగీ, థైరాయిడ్ టెస్టులను మాత్రం చేస్తున్నారు. ⇒ మంచిర్యాల టీ హబ్‌లోని మైక్రోబయోలజీ ల్యాబ్‌లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల పరికరాలు ఉన్నా సిబ్బంది లేక దాన్ని వాడట్లేదు. అక్కడ మైక్రోబయోలజిస్ట్ మాత్రం ఉన్నారు. బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాలు ఉన్నా సిబ్బంది లేరు. కేన్సర్ టెస్ట్‌కు ఉపయోగించే రీ ఏజంట్లు ఉన్నా.. టెస్టులు చేసే వారు లేరు. 134 రకాల పరీక్షలకుగాను 76 పరీక్షలు చేస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని 32 హబ్స్, 1,546 స్పోక్స్‌లలో రోగులకు అన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మైక్రోబయోలజీస్టులు లేనిచోట జిల్లా వైద్య కళాశాల అనుబంధ డీఎంఈ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నాం. సీరం–ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష 5 జిల్లాల హబ్స్‌లో జరుపుతున్నాం. ప్రిస్క్రిప్షన్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ప్రతి డయాగ్నస్టిక్ హబ్‌లో 10 నుంచి 20 మంది సిబ్బంది నమూనాలు తీసుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ ఏడాది డీఎంఈ, టీవీవీపీ ఆసుపత్రుల నుంచి సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నాం. – ఆర్.వి. కర్ణన్, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్

చాలెంజర్స్‌పై పంజా...
ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్ ఈ ఐపీఎల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్‌ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. హాజల్‌వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్, సుర్యాంశ్ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్‌స్టోన్‌లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్ (4), కోహ్లి (1), రజత్ పాటీదార్ (23), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్‌కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్ డేవిడ్ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్ స్కోరు 19 కాగా... జేవియర్ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్ సహా అంతా ఇన్నింగ్స్ బ్రేక్ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్ చాలా ఆలస్యంగా నోబాల్ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్‌కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్సిమ్రాన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) ఇలా టాపార్డర్ వికెట్లు రాలినా... మిడిలార్డర్లో నేహల్ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్‌వుడ్ అయ్యర్, ఇన్‌గ్లిస్ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్ బ్యాటింగ్ బెంగళూరును మ్యాచ్‌లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 4; కోహ్లి (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 1; పాటీదార్ (సి) జేవియర్ (బి) చహల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ప్రియాన్‡్ష (బి) జేవియర్ 4; జితేశ్ (సి) నేహల్ (బి) చహల్ 2; కృనాల్ (సి అండ్ బి) యాన్సెన్ 1; టిమ్ డేవిడ్ (నాటౌట్) 50; మనోజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్ 1; భువనేశ్వర్ (సి) జేవియర్ (బి) హర్‌ప్రీత్ 8; యశ్ దయాళ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ 0; హజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్: అర్శ్‌దీప్ 3–0–23–2, జేవియర్ 3–0–26–1, యాన్సెన్ 3–0–10–2, చహల్ 3–0–11–2, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–25–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 16; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 13; అయ్యర్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 7; ఇన్‌గ్లిస్ (సి) సుయశ్ (బి) హాజల్‌వుడ్ 14; నేహల్ (నాటౌట్) 33; శశాంక్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; స్టొయినిస్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–26–2, యశ్ దయాళ్ 2.1–0–18–0, హాజల్‌వుడ్ 3–0–14–3, కృనాల్ 1–0–10–0, సుయశ్ 3–0–25–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X లక్నో వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఈవీ @20 లక్షలు
సాక్షి, అమరావతి: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు తోడు కలవరపెడుతున్న కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే విద్యుత్ వాహనాల(ఈవీ)లను వాడాలని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఓ నినాదం ఉద్యమంలా నడుస్తోంది. దానికి తగ్గట్టుగానే మన దేశంలోనూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాల విక్రయాలు జరగడమే ఇందుకు నిదర్శనం. 2023–24లో ఈ సంఖ్య 16 లక్షలు ఉండేది. జేఎంకే రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ విడుదల చేసిన ‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ఈ విషయాన్ని తాజాగా వెల్లడించింది. ఈవీ విక్రయాలు ఇలా..2024–25 ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన 20 లక్షల విద్యుత్ వాహనాల్లో సగం (60 శాతం)పైగా ఈవీ ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. అంటే 12 లక్షలు ఈవీ మోటార్ సైకిళ్ల విక్రయాలు జరిగాయి. 2023తో పోల్చితే ఈవీ విక్రయాల వృద్ధి 24 శాతం. ప్రయాణికులు, సరుకు రవాణాకు వినియోగించే త్రిచక్ర వాహనాల వాటా దాదాపు 36 శాతం. వీటి విక్రయాలు సుమారు 7 లక్షల వరకు జరిగాయి. మొత్తంగా 2020 నుంచి చూస్తే నాలుగేళ్లలో 61.66 లక్షల వాహనాల కొనుగోలు జరిగింది. ఈ ఫలితం.. గత ప్రభుత్వ పుణ్యమే ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వీటికి సంబంధించి సర్వీస్ చార్జీలను నిర్ణయించాల్సిందిగా రాష్ట్రాలకు గతంలో కేంద్రం సూచించింది. ఈమేరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోని గత ప్రభుత్వం చొరవ చూపింది. ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (ఎన్ఆర్ఈడీసీఏపీ) నేతృత్వంలో 266 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒకటి, జాతీయ రహదారుల్లో 25 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్ కేంద్రాలను నెలకొల్పాలని సంకల్పించింది. టెండర్లు కూడా పిలిచింది. ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలన్నీ నిలిచిపోయాయి.‘ఇండియా ఈవీ వార్షిక నివేదిక కార్డ్ 2025’ ప్రకారం.. » ఈవీ విక్రయాలు, వినియోగంలో మొదటి ఐదు రాష్ట్రాలుః ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ » ద్విచక్ర ఈవీ విక్రయాల్లో 50 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరిగాయి. » తొలి మూడుస్థానాల్లో ..ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ సంస్థలు » 70 శాతం విక్రయాలు ఈ మూడు సంస్థలవే. » మూడు చక్రాల వాహనాల్లో 11% పెరుగుదల » విద్యుత్ కార్ల విక్రయాల్లో 11 శాతం వృద్ధి » గతేడాదిలో లక్ష విద్యుత్ కార్ల విక్రయాలు » ఈవీ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్56 శాతంతో ముందంజ » ఎంజీ మోటార్స్ 28 శాతంతో రెండో స్థానం » ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు 3,834 » గతేడాది కంటే 3 శాతం క్షీణించిన ఈవీ బస్సుల విక్రయాలు

రాజధాని నిర్మాణ పనుల్లో.. రూ.9,000 కోట్ల ప్రజాధనానికి ’టెండర్’!
అప్పు చేసి పప్పు కూడు తినకూదదంటారు పెద్దలు..! ఎందుకంటే చేసిన అప్పును వడ్డీతో కలిపి చెల్లించాలి కాబట్టి..! అప్పుగా తెచ్చిన డబ్బులను ఆస్తుల కల్పన కోసం కాకుండా జల్సాలకు ఖర్చు చేస్తే ఇల్లు గుల్లవుతుంది కాబట్టి! రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజధానికి రుణ పాశం బిగిస్తున్నారు! అప్పు చేసి మరీ జేబులు నింపుకొంటున్నారు! రాజధాని అమరావతి నిర్మాణ పనులే అందుకు నిదర్శనం. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చిన కూటమి సర్కారు మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తోంది. అలా అప్పు తెచ్చిన నిధులతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని అమాంతం పెంచేసి సిండికేట్ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెడుతోంది. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం మొబిలై జేషన్ అడ్వాన్సు ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని ముఖ్యనేత నాకింత..! అంటూ వసూలు చేసుకుంటున్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ విధానానికి పాత రేసి.. అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి దోచేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని పనుల టెండర్లలో ఈ సిండి ‘కేటు’ దందా తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!! సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో 2014లో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి తక్కువ ధరలకే రైతుల నుంచి భూములు కాజేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాజధాని నిర్మాణ పనుల్లో భారీ ఎత్తున దోపిడీకి తెర తీశారు. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించక ముందే సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యనేత సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ.40,497.55 కోట్ల విలువైన 63 ప్యాకేజీల పనులను సిండికేట్ కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఆ మేరకు పనులు అప్పగిస్తూ సిండికేట్ కాంట్రాక్టర్లతో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏడీసీఎల్ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) అగ్రిమెంట్ (ఒప్పందం) చేసుకున్నాయి. ఆ వెంటనే అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.4,049.75 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పాయి. అందులో ఎనిమిది శాతం అంటే రూ.3,239.80 కోట్లను ముఖ్యనేత వసూలు చేసుకున్నారు! అధిక ధరలకు కట్టబెట్టి.. రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ (ఆసియా అభివృద్ధి బ్యాంకు) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు.. వెరసి రూ.31 వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెచ్చింది. రాజధాని నిర్మాణ పనులకు రూ.77,249 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశామని.. మరో 46,249 కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నామని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు చెప్పారు. అప్పు తెచ్చిన నిధులతో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. పనుల అంచనాలను భారీగా పెంచేశారు. అధిక ధరలకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి ఖజానాపై తీవ్ర భారం మోపారు. » ప్రస్తుత ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్) ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్లకు మించదు. ప్రస్తుత ధరల ప్రకారం మట్టి తవ్వకానికి క్యూబిక్ మీటర్‌కు రూ.వంద చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 10 నుంచి 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ తవ్వకానికి కి.మీ.కి రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకు మించి వ్యయం కాదని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ రాజధాని వరద ముంపు నివారణ పనుల్లో 0.4 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రూ.470.74 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ఆ పనిని రూ.487.41 కోట్లకు(3.54 శాతం అధిక ధరకు) ఎన్సీసీ సంస్థకు అప్పగించారు. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేయనున్నారు. అంటే 0.4 టీఎంసీల సామర్థ్యం కలిగిన నీరుకొండ రిజర్వాయర్ పనులను రూ.555.41 కోట్లకు కట్టబెట్టినట్లు స్పష్టమవుతోంది. అంచనా వ్యయాన్ని రూ.305.41 కోట్లు పెంచేసినట్లు వెల్లడవుతోంది. » దేశంలో ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) కి.మీ.కి సగటున రూ.20 కోట్ల చొప్పున ఆరు వరుసలతో కూడిన జాతీయ రహదారులను నిర్మిస్తోంది. కానీ అమరావతిలో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. ఈ–13 రహదారిని ఎన్‌హెచ్–16 వరకూ పొడిగిస్తూ 7.29 కి.మీ.ల పొడవున ఆరు వరుసలతో నిర్మించడానికి రూ.384.78 కోట్ల అంచనాతో ఏడీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీఎస్టీ, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో 81.92 కోట్లు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. అంచనా వ్యయం రూ.466.7 కోట్లు అన్నమాట. ఈ లెక్కన కి.మీకి 64.01 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణ పనులకు టెండర్ పిలిచినట్లు స్పష్టమవుతోంది. జాతీయ రహదారికి కి.మీ.కి అయ్యే వ్యయం కంటే ఈ–13 రహదారి వ్యయం రూ.44.01 కోట్లు అధికంగా పెంచేశారు. » భూసమీకరణ కింద రాజధానికి 29,357 మంది రైతులు 34,773.76 ఎకరాల భూమిని ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద ఆ రైతులకు 17 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలి. ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి పనులకు 18 ప్యాకేజీల కింద రూ.14,887.64 కోట్లతో కాంట్రాక్టర్లకు అప్పగించింది. కాంట్రాక్టు విలువలో 18 శాతం జీఎస్టీ, 0.45 శాతం సీనరేజీ, 0.1 శాతం న్యాక్ పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. అప్పుడు వాటి వ్యయం రూ.2,761.66 కోట్లు ఇస్తారన్నమాట. ఈలెక్కన ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధి పనుల కాంట్రాక్టు విలువ రూ.17,649.3 కోట్లుకు చేరుతుంది. ఈ లెక్కన ఎకరంలో లే అవుట్ అభివృద్ధికి రూ.కోటికి పైగా వెచ్చిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్‌ను అభివృద్ధి చేసినా ఎకరానికి రూ.50లక్షల నుంచి రూ.60 లక్షలకు మించదని బడా రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. » అత్యాధునిక హంగులతో భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదు. అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన రాజధానిలో భవనాల నిర్మాణ వ్యయం తగ్గాలి. కానీ వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు రూ.10,042.86 చొప్పున అప్పగించడం గమనార్హం. మిగతా భవనాల నిర్మాణ పనుల్లోనూ అదే తీరు.జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ రద్దు.. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా జ్యుడీషియల్ ప్రివ్యూ–రివర్స్ టెండరింగ్ విధానం వల్ల 2019–24 మధ్య ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసి రాజధాని పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లకు అధిక ధరలకు రూ.40,497.55 కోట్ల విలువైన పనులు అప్పగించింది. దీనివల్ల ఖజానాపై రూ.1231.42 కోట్ల మేర భారం పడింది. రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా టెండర్లు నిర్వహించి ఉంటే కాంట్రాక్టర్లు పోటీ పడి ఖజానాకు రూ.3,500 నుంచి రూ.4 వేల కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉండేదని ఇంజినీరింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీఎస్సార్‌కు రూ.7,298.97 కోట్లు.. ఆర్వీఆర్‌కు రూ.6,031.79 కోట్ల పనులురాజధాని పనుల టెండర్లలో సిండికేట్ కాంట్రాక్టు సంస్థలు మినహా ఇతరులు బిడ్లు దాఖలు చేస్తే టెక్నికల్ బిడ్‌లోనే ఆ సంస్థపై అనర్హత వేటు వేస్తున్నారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్‌ఫ్రాటెక్‌కు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,298.97 కోట్ల విలువైన పనులు ఇప్పటికే అప్పగించారు. » సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కృష్ణారెడ్డికి చెందిన మేఘా సంస్థకు జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నులతో కాకుండా రూ.7,022.38 కోట్ల విలువైన పనులను అప్పగించేశారు. » టీడీపీకి బాకా ఊదే ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు రూ.6,031.79 కోట్లు విలువైన పనులు కట్టబెట్టారు. » ఎన్సీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏవీ రంగరాజు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆ సంస్థకు శాశ్వత హైకోర్టు భవన నిర్మాణం సహా రూ.6,910.93 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » ఎల్ అండ్ టీ సంస్థకు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంతోపాటు రూ.1,427.21 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » నారా లోకేశ్ తోడల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్‌కు అత్యంత సన్నిహితుడు ఎం.వెంకట్రావు. ఆయనకు చెందిన ఎంవీఆర్ ఇన్ఫ్రా సంస్థకు రూ.796.04 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » చంద్రబాబుకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకు చెందిన బీఎస్సీపీఎల్ సంస్థకు రూ.779.82 కోట్ల విలువైన పనులు అప్పగించారు. » సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఆప్తుడైన కనకమేడల వరప్రసాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్‌కు రూ.429.23 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. » జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్–కె.రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు రూ.309.6 కోట్ల విలువైన పనులు అప్పగించారు. మరో రూ.7,202.3 కోట్ల పనులూ సిండికేట్‌కే.. గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్‌కు సంబంధించి నాలుగు ప్యాకేజీల కింద రూ.1,960.36 కోట్ల అంచనాతో నాలుగు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్లు ఆర్థిక బిడ్ దశలో ఉన్నాయి. ఈనెల 16న శాశ్వత సచివాలయం నిర్మాణంలో భాగంగా ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ టెండర్లు పిలిచింది. ఈ–13, ఈ–15 రహదారుల పొడిగింపు పనులకు రూ.553.12 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెండర్ల దశలో ఉన్న ఈ రూ.7,202.3 కోట్ల విలువైన పనులను సిండికేట్ కాంట్రాక్టర్లకే కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. రాజధానికి వరద ముప్పును నివారించేందుకు కొండవీటివాగుపై మరో ఎత్తిపోతల, గ్రావిటీ కెనాల్‌పై మరో నాలుగు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి.. కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు ఏడీసీఎల్, సీఆర్డీఏ కసరత్తు చేస్తున్నాయి. ఈ పనులు కూడా సిండికేట్ కాంట్రాక్టు సంస్థలకే కట్టబెట్టనున్నారనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు.. రాజధాని పనులకు ప్రాథమిక అంచనా వ్యయం రూ.77,249 కోట్లు అని ఇటీవల 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ, హడ్కో నుంచి రూ.31 వేల కోట్లు రుణం తెచ్చారు. మరో రూ.46,249 కోట్ల రుణం కోసం ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చదరపు అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టు సంస్థలకు అప్పగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున చెల్లించారు. అంటే అంచనా వ్యయం చదరపు అడుగుకు రూ.15,833 పెరిగింది.తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయమే ఈ స్థాయిలో పెరిగితే శాశ్వత నిర్మాణాల వ్యయం ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు. కనీసం రూ.లక్ష కోట్ల నుంచి 1.50 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ డబ్బంతా అప్పులు తేవాల్సిందే. అదంతా వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ఇలా అప్పు తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలసి దోచుకుంటూ రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారనే ఆందోళన అటు మేధావులు.. ఇటు అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇదీ స్థూలంగా నష్టం..!రాజధాని పనులను అధిక ధరలకు కట్టబెట్టడం వల్ల జానాపై అదనపు భారం: రూ.1,231.42 కోట్లకుపైగాజ్యుడీషియల్ ప్రివ్యూ– రివర్స్ టెండరింగ్ అమలు చేయకపోవడంతో నష్టం: రూ.4,000 కోట్లుకాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి 8 శాతం కమీషన్లు వసూళ్లతో అక్రమాలు: రూ.3,200 కోట్లకుపైగా

రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
సాక్షి, అమరావతి: కావాల్సిన వారికి కారు చౌకగా భూములు కేటాయించాలంటే ఏం చేయాలి..? ముందుగా పేరెన్నికగన్న కంపెనీకి అలా కొంత భూమి కేటాయించి.. అదే మా పాలసీ అంటూ మనవాళ్లకు కట్టబెట్టేయడమే. ఇప్పుడు కూటమి సర్కారు అమలు చేస్తున్నది ఇదే.. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఐటీ కంపెనీలకు చౌకగా భూములు కేటాయించే అంశాన్ని పరిశీలించండి అని మంత్రి నారా లోకేశ్.. సీఎం చంద్రబాబుకు చెప్పడం.. వెంటనే ఆయన ఆ విధంగా ఐటీ పాలసీని రూపొందించండి అంటూ అధికారులను ఆదేశించడం.. అసలు ఐటీ పాలసీ రాకుండానే ఐటీ కంపెనీలకు ఎకరా రూ.50 కోట్ల విలువ చేసే భూమిని 99 పైసలకే కేటాయిస్తూ మంత్రిమండలి ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. వాస్తవానికి భారీ లాభాలతో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చౌకగా భూములు కేటాయించండి అని అడగనేలేదు. అయినా, విశాఖ ఐటీ హిల్ నంబర్ 3లో 21.16 ఎకరాలను ఎకరా 99 పైసలకే టీసీఎస్‌కు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న టీసీఎస్కి చౌకగా భూములు కేటాయించినా ఎవరూ ఏమీ అనరు అన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే, ఇక్కడే ఉంది అసలు సిసలైన గిమ్మిక్కు. ‘‘ఇదిగో ఇదీ మా ఐటీ పాలసీ’’ అంటూ ఘనంగా ప్రచారం చేసుకుంటూ స్వామి కార్యంతో పాటు స్వకార్యం చక్కబెట్టేస్తోంది. అలా టీసీఎస్‌కు భూమి కేటాయించగానే.. ఇలా డేటా సెంటర్ పేరుతో ఉర్సా క్లస్టర్స్ అనే సంస్థకు ఏకంగా 60 ఎకరాల విలువైన భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడో విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీ ఏర్పాటైంది రెండు నెలలు క్రితమే. అయినప్పటికీ అత్యంత విలువైన ఐటీ హిల్ నెంబర్3 లో 3.5 ఎకరాలు , కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించడానికి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. టీసీఎస్ పాలసీ ముసుగుఉర్సా క్లస్టర్‌కు భూమిని ఎంత రేటుకు కేటాయిస్తుంది మంత్రి మండలిలో స్పష్టంగా చెప్పకుండా పాలసీ నియమ నిబంధనల ప్రకారం భూకేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. పాలసీ ప్రకారం రెండు నెలల క్రితం ఏర్పాటైన ఉర్సా క్లస్టర్‌కు కారు చౌకగా భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఈ విధానం ఎంచుకుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మధురవాడ, కాపులుప్పాడలో ఎకరా రూ.50 కోట్లపైనే పలుకుతోంది. ఇంతటి ఖరీదైన భూములను తమ వారి చేత కంపెనీలు పెట్టించి భూములు కొట్టేసే విధంగా కూటమి సర్కారు ప్రణాళికలు వేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు టీసీఎస్‌కు ఇచ్చిన ప్రకారం ఎకరా 99 పైసలకే ఇస్తే సుమారు రూ.3,000 కోట్ల విలువైన భూములను కేవలం రూ.59కే ఇచ్చే విధంగాప్రభుత్వ ముఖ్య నేతలు ఎత్తుగడ వేశారంటున్నారు. ఫిబ్రవరి 12న హైదరాబాద్ కేంద్రంగా ఉర్సా క్లస్టర్స్ కంపెనీ ఏర్పాటైంది. అప్పటి వరకు శంషాబాద్ జీఎంఆర్ ఎయిర్‌పోర్టులో మేనేజర్‌గా పనిచేస్తున్న పెందుర్తి విజయకుమార్, అమెరికాలో మన రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సతీష్ అబ్బూరి కలిసి రూ.9.10 లక్షల మూలధనంతో కంపెనీని ఏర్పాటు చేశారు. కేవలం రెండు నెలల క్రితం అదీ కూడా డేటా సెంటర్, ఐటీ కార్యాలయాలు నిర్వహణలో ఎటువంటి అనుభవం లేని వ్యక్తులు ఏర్పాటు చేసిన సంస్థకు ఇంతటి ఖరీదైన భూములు కేటాయిస్తుండటంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎటువంటి రాయితీలు లేకుండానే టీసీఎస్ మిలియన్ టవర్‌లో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే అడగకపోయినా 99 పైసలకే భూములు కేటాయిస్తూ... దీన్ని ఒక పాలసీగా చూపిస్తూ విలువైన భూములను రాజమార్గంలో కొట్టేయడమేనని పదవీ విరమణ చేసిన మాజీ ఐఏఎస్ ఒకరు వ్యాఖ్యానించారు.ఇలా పెట్టు.. అలా భూమి పట్టు‘ముందుగా వచ్చి మాట్లాడు.. ఆ తర్వాత వెళ్లి కంపెనీ పెట్టు.. వెంటనే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకో.. ఆ తర్వాత వందల ఎకరాల భూమి తీసుకో..’ ఇప్పుడిది మన రాష్ట్రంలో జరుగుతున్న తీరు. గతేడాది డిసెంబర్ ఆఖరు వారంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను కొంతమంది వ్యక్తులు వచ్చి కలిసి వెళ్లారు. వెంటనే జనవరి 3న రూ.కోటి మూలధనంతో కాన్పూర్ ఆర్వోసీలో ఇండిచిప్ పేరిట కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే జనవరి 11న ఏకంగా రూ.14,000 కోట్లతో కర్నూలు జిల్లా ఓర్వకల్లులో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా ఏర్పాటైన ఇండిచిప్ సెమీ కండక్టర్ కంపెనీలో పీయూష్ బిచోరియా, వెబ్ చాంగ్, సందీప్ గార్గ్‌లు డైరెక్టర్లుగా, కీలక అధికారిగా రాజీవ్ వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంత వరకు సెమీకండక్టర్ తయారీ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు.. అంత ఆర్థిక శక్తి కూడా లేదు. అయినప్పటికీ ఇప్పుడు ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లో అత్యంత విలువైన వందల ఎకరాలను ఇండిచిప్కు అత్యంత చౌకగా కేటాయించనున్నారు. అలాగే రెండు నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్ ఎనర్జీ తిరుపతి, సత్యసాయి జిల్లాల్లో సుమారు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఐదో రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ కంపెనీలో నవయుగ గ్రూపునకు చెందిన చింతా విశ్వేశ్వరరావు, అట్లూరి గౌరీనాథ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కారులోని పెద్దలకు అత్యంత దగ్గరగా ఉండే నవయుగ గ్రూపునకు గ్రీన్ ఎనర్జీ పేరిట వేల ఎకరాలను కట్టబెట్టనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకనేతగా ఉన్న వ్యక్తికి అత్యంత సన్నిహితునిగా ఉన్న పేరున్న కిలారు సునీల్‌కి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్ రూ.50 కోట్లతో పెట్టుబడి పెడుతుందంటూ తొలి ఎస్ఐపీబీలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తికి చెందిన డల్లాస్ టెక్నాలజీ సెంటర్‌ను టీసీఎస్‌కు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో చివరకు టీసీఎస్‌ను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన మిలీనియం టవర్స్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా అత్యంత విలువైన భూములను సొంత వారికి వేగంగా కేటాయిస్తూ పోతుండటంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం వెర్రితలలు వేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసుతో బరితెగిస్తోంది. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు పచ్చగణంతో కూడిన ‘సిట్’ ద్వారా దర్యాప్తు పేరిట అరాచకాలకు తెగబడుతోంది. అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు.. తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు.. వేధింపులు, బెదిరింపులు, కిడ్నాపులు, దాడులతో పోలీసులు గూండాగిరీకి తెగిస్తున్నారు. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, మరో ఇద్దరు ఉద్యోగులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించారు. తనను వేధిస్తున్నారని కోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి.. అనంతరం సిట్ చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఆ వాంగ్మూలానికి ఏం విశ్వసనీయత ఉంటుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇక డిస్టిలరీల ప్రతినిధులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో నిమిత్తం లేని ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి చుట్టూ దర్యాప్తును కేంద్రీకృతం చేస్తున్నారు. ఏమాత్రం సంబంధంలేని ఎంపీ మిథున్‌రెడ్డి, తదితరులను అక్రమ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతున్నారు.వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విజయ సాయిరెడ్డిని అందుకే తెరపైకి తెచ్చారు. ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో ఓ భేతాళ కథ అల్లుతున్నారు. ఇంతటి కుట్రలు, అరాచకానికి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తెగబడుతోందంటే... సమాధానం ఒక్కటే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పారదర్శకంగా అమలు చేయడమే. లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకే కూటమి ప్రభుత్వం ఇంతటి కుతంత్రాలకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకంవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగిస్తోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతోంది. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఆ సంస్థలో ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూష ఉదంతమే ఇందుకు తార్కాణం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన డెప్యుటేషన్ ముగిసినప్పటికీ రిలీవ్ చేయలేదు. తాము చెప్పినట్టుగా సీఆర్పీపీ 164 సెక్షన్ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని వాసుదేవరెడ్డిని పోలీసులు తీవ్ర స్థాయిలో వేధించారు. తాము చెప్పినట్టు చేస్తేనే రిలీవ్ చేస్తామని, లేకపోతే ఎప్పటికీ సర్వీసులో చేరలేరని హెచ్చరించారు. ఆయన్ను అపహరించుకునిపోయి మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో ఉంచి బెదిరించారు. కుటుంబ సభ్యులను సైతం బెదిరించారు. పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి న్యాయస్థానాన్ని మూడుసార్లు ఆశ్రయించారు కూడా. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం తన కుతంత్రాలను కొనసాగించింది. ఆయన్ను తీవ్ర స్థాయిలో రోజుల తరబడి బెదిరించి లొంగదీసుకుంది. వాసుదేవరెడ్డితో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించడం గమనార్హం. అంటే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు కోసం ఎంతగా బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది. అదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను కూడా తీవ్ర స్థాయిలో వేధించారు.అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఈ కేసులో సాక్షులుగా పేర్కొంటామని.. లేకపోతే అక్రమ కేసుల్లో దోషులుగా ఇరికించి వేధిస్తామని బెదిరించారు. దాంతో వారిద్దరు కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ విధంగా బెదిరించి, వేధించి నమోదు చేసే వాంగ్మూలాలకు ఏం విశ్వసనీయత ఉంటుంది.. ఏం ప్రామాణికత ఉంటుంది..? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.బరితెగిస్తున్న సిట్ఈ కేసులోదర్యాప్తు ముసుగులో సిట్ అధికారులు చేస్తున్న అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్టిలరీల ప్రతినిధుల నివాసాల్లో సోదాల పేరుతో సిట్ అధికారులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. డిస్టిలరీల ప్రతినిధులను బలవంతంగా విజయవాడకు తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. ఒకర్ని తీవ్రంగా కొట్టారు కూడా. వృద్ధులని కూడా చూడకుండా శార్వాణీ ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్‌లను సిట్ అధికారులు కొట్టి, అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమను ఇంటి వద్దే విచారించేట్టుగా ఆదేశించాలని కోరారు. ఇ.చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్‌ను వారి ఇంటి వద్దే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. అబద్ధపు వాంగ్మూలాల నమోదు కోసం సిట్ పాల్పడుతున్న అరాచకాలకు ఈ ఉదంతం ఓ మచ్చుతునక మాత్రమే.అందుకే తెరపైకి విజయ సాయిరెడ్డి అక్రమ కేసు కుట్రను కొనసాగిస్తూ చంద్రబాబు పక్కా పన్నాగంతోనే మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన ఆయనతో తాము లక్ష్యంగా చేసుకున్నవారి పేర్లు చెప్పించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం. మూడున్నరేళ్లు పదవీ కాలం ఉన్నా రాజ్యసభలో కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన మాటలు అసలు కుట్రను బయట పెట్టాయి. మద్యం విధానంపై కొందరు తన ఇంట్లో నిర్వహించిన సమావేశంలో కొందరు పాల్గొన్నారు.మరికొందరు పాల్గొన్నారో లేదో గుర్తు లేదని విజయ్ సాయిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. గుర్తుకు వచ్చాక ఆ విషయం చెబుతానన్నారు. అంటే భవిష్యత్‌లో చంద్రబాబు ఏం చెప్పమంటే అది చెబుతా అని పరోక్షంగా స్పష్టం చేశారు.మద్యం విధానంతో రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం!?మాజీ ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా దర్యాప్తు కొనసాగిస్తుండటం కూడా సిట్ కుట్రలో భాగమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంతో అసలు రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎందరో సలహాదారుల్లో ఆయన ఒకరు. సలహాదారుగా ఆయన పదవీ కాలాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెన్యువల్ కూడా చేయనే లేదు. ఇక రాజ్ కసిరెడ్డికి బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో సంబంధమే లేదు. ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తే బెవరేజస్ కార్పొరేషన్‌కు చైర్మన్‌గానే నియమించి ఉండేవారు కదా.. కానీ ఆయనకు అంతా తెలుసని విజయ సాయిరెడ్డి చెప్పడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నది తేటతెల్లమవుతోంది. తద్వారా మునుముందు మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోందని స్పష్టమవుతోంది.అవినీతి లేదు.. కుంభకోణం అసలే లేదు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా మద్యం విధానంచట్టాలను ఉల్లంఘిస్తూ.. న్యాయ స్థానాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇంతగా బరితెగిస్తోందన్నది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసు కాబట్టి. అసలు మద్యం విధానంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందే వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అంతకు ముందు 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన మద్యం సిండికేట్ దోపిడీని నిర్మూలించింది. ప్రైవేటు మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాల సంఖ్యను 2,934 కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. 2019 వరకు మద్యం దుకాణాలకు అనుబంధంగా అనధికారిక బార్లుగా కొనసాగిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం 14 డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వగా... వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం దుకాణాల వేళలను కుదించింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచి మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పరిచింది. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు తగ్గితే డిస్టిలరీలకు లాభాలు తగ్గుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి లాభాలు తగ్గితే డిస్టిలరీలు ప్రభుత్వానికి ఎందుకు కమీషన్లు ఇస్తాయని ఎవరైనా ప్రశ్నిస్తారు. మద్యం అమ్మకాలను పెంచితే.. తద్వారా లాభాలు పెరిగితే అందుకు ప్రతిగా ప్రభుత్వానికి కమీషన్లు ఇస్తారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్న వాస్తవం. మరి డిస్టిలరీలు.. కమీషన్లు ఇవ్వవవన్నది నిగ్గు తేలిన నిజం. అయినా సరే కేవలం రెడ్‌బుక్ కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. అందుకోసమే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు కుతంత్రాలకు తెగబడుతోందన్నది సుస్పష్టం. వాస్తవంగా కుంభకోణమే జరిగితే.. దర్యాప్తు పేరిట ఇంతటి అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు, అవనీతి జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోందన్నది సుస్పష్టం.

క్రాష్ టు జోష్..!
ట్రంప్ టారిఫ్‌ల సునామీ ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసింది. అనేక దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార సుంకాలు వడ్డించడం, చైనా దీటుగా టారిఫ్‌లతో తిప్పికొట్టడంతో వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో అమెరికా టు ఆసియా స్టాక్ మార్కెట్లు ’బేర్’మన్నాయి. అక్టోబర్ నుంచి రివర్స్‌గేర్‌లో కొనసాగుతున్న మన సూచీలు.. ట్రంప్ టారిఫ్ దెబ్బకు తాజా 17 శాతం దిగజారాయి. సెన్సెక్స్ సెప్టెంబర్‌లో 85,978 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టం నుంచి తాజాగా 71,425 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడం, పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో మళ్లీ బుల్స్ ఫేస్ టరి్నంగ్ ఇచ్చుకున్నాయి. తాజా కనిష్టం నుంచి 10 శాతం మేర ‘రిలీఫ్’ ర్యాలీ చేశాయి. ఈ వారంలోనే 4 శాతం జంప్ చేశాయి. కాగా, దేశీ మార్కెట్లు గతంలో కూడా సంక్షోభాలు, స్కామ్‌ల దెబ్బకు భారీగా పడి, బేర్ గుప్పిట్లో చిక్కుకున్నప్పటికీ... మళ్లీ అంతే వేగంగా రికవరీ అయ్యాయి. అమెరికా–చైనాల మధ్య టారిఫ్ వార్ ముదురుతుండటం, ట్రంప్ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తారోనన్న అనిశి్చతితో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, టారిఫ్‌ల దుమారం పూర్తిగా సద్దుమణిగితే బుల్స్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశం ఉంది. మన మార్కెట్లో అతిపెద్ద పతనాలు, కోలుకున్న తీరు చూస్తే...కోవిడ్ క్రాష్.. 2020లో కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతే.. స్టాక్ మార్కెట్లో బేర్ విలయతాండవం చేసింది. ఇటీవలి చరిత్రలో మార్కెట్లు ఇలా కుప్పకూలడం ఇదే తొలిసారి. లాక్డౌన్లతో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో మార్చి 2020లో సెన్సెక్స్ 41,000 స్థాయి నుంచి 25,981 పాయింట్ల కనిష్టానికి క్రాష్ అయ్యింది. అయితే, సెంట్రల్ బ్యాంకుల సహాయ ప్యాకేజీలు, వడ్డీ రేట్ల భారీ కోతలతో మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా దూసుకుపోయాయి. నవంబర్ 2020 నాటికి కనిష్టం నుంచి 58 శాతం ఎగబాకి మళ్లీ క్రాష్ ముందస్తు స్థాయిని దాటేశాయి. వ్యాక్సిన్ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కుమ్మరింపుతో నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. 2021 సెప్టెంబర్ నాటికి 60,,000 స్థాయి పైకి చేరగా.. 2024 సెప్టెంబర్‌లో 85,978 పాయింట్లతో సరికొత్త చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడం విశేషం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం... 2008లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు అనేక పేరొందిన ఆర్థిక సంస్థలతో పాటు పలు కంపెనీలు కూడా దివాలా తీశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. సెన్సెక్స్ మెగా పతనంతో 21,000 స్థాయి నుంచి 2009 మార్చి నాటికి 8,000 పాయింట్లకు కుప్పకూలింది. అంటే ఏకంగా 62 శాతం కరిగిపోయింది. అయితే, ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఉద్దీపన ప్యాకేజీల అమలు, వడ్డీరేట్ల కోతలతో మార్కెట్ల రికవరీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడటం, విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 2010 నవంబర్ నాటికి సెన్సెక్స్ మళ్లీ 21,000 మార్కును తాకింది. రెండేళ్ల రికవరీలో 162% ర్యాలీ చేసింది. కేతన్ పరేఖ్ స్కామ్/డాట్ కామ్ బబుల్ భారత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన కేతన్ పరేఖ్ షేర్ల కుంభకోణానికి తోడు ప్రపంచవ్యాప్తంగా డాట్–కామ్ బబుల్ బద్దలవ్వడంతో దేశీ సూచీలు కకావికలం అయ్యాయి. 2001 ఆరంభంలో 4,200 పాయింట్ల స్థాయిలో ఉన్న సెన్సెక్స్ సెప్టెంబర్ నాటికి 2,594 పాయింట్లకు కుప్పకూలింది. అయితే, మళ్లీ 2003 నుంచి నెమ్మదిగా మార్కెట్లో జోరు మొదలైంది. 2004 మధ్య నాటికి, అంటే మూడేళ్లలో 62 శాతం ర్యాలీతో 4,200 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా దేశ జీడీపీ వృద్ధి పుంజుకోవడం, ఐటీ రంగం పరుగులతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు వరుస కట్టడం వంటి అంశాలు దోహదం చేశాయి.హర్షద్ మెహతా కుంభకోణం దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయిన హర్షద్ మెహతా స్కామ్.. ఇన్వెస్టర్లను నిలువునా ముంచేసింది. 1992లో స్కామ్ బట్టబయలు కాగా, సెన్సెక్స్ 4,467 పాయింట్ల నుంచి 1993 మే నెలకల్లా 2,529 పాయింట్లకు (43 శాతం) పడిపోయింది. అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, సరళీకరణ దన్నుతో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం కొత్తపుంతలు తొక్కి, మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్లాయి. 1996 నాటికి సెన్సెక్స్ మళ్లీ 4,600 పాయింట్ల స్థాయికి (82 శాతం) అధిగమించి దుమ్మురేపింది.– సాక్షి, బిజినెస్ డెస్క్
మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం
రొయ్యకు లోకల్ మార్కెట్
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా
మూతపడిన జిందాల్ స్టీల్స్
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
2023–24 రక్తహీనత నివారణలో ఏపీదే అగ్రస్థానం
ఉద్దేశపూర్వకంగానే చిరుతకు ఉచ్చు
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
చల్లటి కబురు!
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
పీరియడ్స్.. ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
అమ్మా..ఊపిరాడలేదు!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
పెరుగుతున్న మత సమ్మతి
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్.. బౌలింగ్‌లో నూర్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్ కలర్ చీరలో అమేజింగ్ లుక్స్
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
ఉలవపాడు మామిడికి గడ్డుకాలం
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం
రొయ్యకు లోకల్ మార్కెట్
ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం
భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే
టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా
మూతపడిన జిందాల్ స్టీల్స్
రూ. 3 వేల కోట్ల భూమి కేవలం రూ.59కే..
2023–24 రక్తహీనత నివారణలో ఏపీదే అగ్రస్థానం
ఉద్దేశపూర్వకంగానే చిరుతకు ఉచ్చు
ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
'పుష్ప 2' వీఎఫ్ఎక్స్ వీడియో రిలీజ్
చల్లటి కబురు!
హ్యాట్రిక్ కొట్టిన బంగారం.. తులం ఎంతకు చేరిందంటే..
ఝూటా వకీల్ సాబ్ పతనం మొదలైందా?
పీఎం మోదీ ఏసీ యోజన: కొత్త AC కొనుగోలుపై డిస్కౌంట్
RCB VS PBKS: చరిత్ర సృష్టించిన అర్షదీప్ సింగ్
రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ యాంకర్, ఫోటోలు వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక పారితోషికం అతడిదే.. ఐపీఎల్‌తో పోలిస్తే..!
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’
వెనక్కి తగ్గని ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస రీట్వీట్లు
మామిడి తోటలో మృత్యువు కాటేసింది
పీరియడ్స్.. ఆ సమయంలో చాలా బాధపడ్డాను: సమంత
‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్’
వచ్చేస్తోంది EPFO 3.0: ప్రయోజనాలెన్నో..
కేఎల్ రాహుల్ ముద్దుల కూతురు.. పేరు రివీల్ చేసిన అతియాశెట్టి!
అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
అల్లుడితో కలిసి 7 ఎకరాలు కొన్న బాలీవుడ్ నటుడు.. ఎక్కడంటే?
కమిన్స్, స్టార్క్ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం: రోహిత్
వేములవాడ రాజన్నకు కొత్త గుడి
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
‘మీరు పనులు చేయకపోతే.. న్యాయ వ్యవస్థ చూస్తూ కూర్చోవాలా?’
ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!
చైనా పై 245 శాతం సుంకాలు విధించిన అమెరికా
అయ్యో! ఆగండయ్యా! అది అప్పుడు ఇప్పుడు మనం వాళ్ల కూటమిలో ఉన్నాం!
మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా: భారీ జరిమానా..
అర్జున్ చిన్నకూతురి ఎంగేజ్మెంట్.. 13 ఏళ్ల ప్రేమ అంటూ..
విశాఖ ఉక్కు.. అమరావతి నిర్మాణాలకు పనికిరాదా?.. కార్మికుల ఆగ్రహం
'బురుజులు' ఎందుకు నిర్మించేవారో తెలుసా..?
అత్యాచారం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు చెప్పిన యువతి
అమ్మా..ఊపిరాడలేదు!
ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
IPL 2025: సీఎస్కే అభిమానులకు అదిరిపోయే వార్త.. జట్టులోకి చిచ్చరపిడుగు
Delhi: ఎవరీ లేడీ డాన్?.. ఆ సంచలన కేసుతో లింకేంటి?
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ?: క్లారిటీ ఇచ్చిన కేంద్రం
నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. మాజీ ఓనర్ రియాక్షన్ ఇదే!
పెరుగుతున్న మత సమ్మతి
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
వైరల్: వధువు తెగించేసింది భయ్యా! వరుడి నోట్లో నోరు పెట్టి..
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్
'ఉత్తరాఖండ్‌లో ఆలయం.. ఊర్వశి రౌతేలాపై చర్యలు తీసుకోవాలి'
ప్రియాంక చోప్రా భర్తతో మహేశ్ ఫ్యామిలీ.. థాంక్స్ చెప్పిన నమ్రత
ఇద్దరు కొడుకుల గొంతుకోసి చంపి.. తల్లి ఆత్మహత్య
ఎవడ్రా కూసేది.. 2028 వరకు ఖాళీ లేదిక్కడ.. ఇచ్చిపడేసిన అనురాగ్ కశ్యప్
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
'కోర్ట్' హీరో కొత్త మూవీ.. సైలెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్
రోహిత్ శర్మకు ఫ్రెండ్.. సీనియర్లకు అతడి ప్రవర్తన నచ్చలేదు!
విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..
రెడ్ మిర్చిలా మీనాక్షి చౌదరి.. మట్టికుండతో పూజాహెగ్డే
సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
IPl 2025: 'మరీ అంత స్వార్ధం పనికిరాదు బ్రో.. నీ వల్లే రాజస్తాన్ ఓడిపోయింది'
వైద్యులే కంటతడి పెట్టేలా.. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
IPL 2025: బ్యాటింగ్‌లో పూరన్.. బౌలింగ్‌లో నూర్
PSLతో పోలికా?.. ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు: ఇచ్చి పడేసిన ఇంగ్లండ్ స్టార్
ఇన్ఫోసిస్ డివిడెండ్.. 17 నెలల బుడ్డోడికి రూ. 3.3 కోట్లు
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
ఆడవాళ్లు కనిపిస్తే వదలడు.. అలాంటి నటుడితో నన్ను..: టాలీవుడ్ హీరోయిన్
Kesari Chapter 2 : అనన్య పాండే పర్పుల్ కలర్ చీరలో అమేజింగ్ లుక్స్
వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం: సుప్రీంకోర్టు
రైళ్లు ఇలా మళ్లిస్తున్నారు..
50 ఏళ్ల వయసులో పడుచుపిల్లలా ఖుష్బూ.. సీక్రెట్ అదే!
హాలీవుడ్ రేంజ్లో ఫైట్
26 బంతుల్లో సెంచరీ.. పొట్టి క్రికెట్లో పెను సంచలనం
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మరో లగ్జరీ ప్రాజెక్ట్
బంగారం కొనేముందు ఇవి తెలుసుకోండి
IPL 2025: సన్‌రైజర్స్‌పై విజయం.. చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఆ చట్టం కేవలం కోడళ్ల కోసమే చేయలేదమ్మా: అలహాబాద్ హైకోర్టు
'ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'
ఆరోజు నాకు కోపం వచ్చింది.. అందుకే అలా అరిచాను: రోహిత్ శర్మ
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
ట్రిపుల్ ట్రీట్.. ఆర్య 3, కార్తికేయ 3.. ఇంకా ఎన్నెన్నో..
జ్యోతిష్యం చెప్తుండగా టైర్ పేలి తుర్రుమన్న చిలుక
విశాల్ సినిమాతో ఫేమ్.. హీరోయిన్ నిశ్చితార్థం
‘ద్రవిడ్‌కు సంజూ నచ్చడు.. అందుకే ఇలా!’.. రాయల్స్ క్యాంపులో విభేదాలు?
తిరుమలలో గోవుల మృతిపై కేసు వేస్తా: సుబ్రహ్మణ్యస్వామి
గ్రూప్–1 నియామకాలు నిలిపివేయండి
కాబోయే అల్లుడితో అత్త జంప్ ఎపిసోడ్లో ట్విస్ట్.. ఎందుకిలా చేసిందంటే..
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
ఒకే కాలనీ...56 పార్కులు ఎక్కడో తెలుసా?
రాజ్‌తరుణ్ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య
ముంబైకి ప్రధాన సమస్య అతడే!.. సీజన్ మొత్తం ఎలా భరిస్తారో!?
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
ఉలవపాడు మామిడికి గడ్డుకాలం
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
‘కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి.. అతడి వ్యూహం వల్లే ముంబై గెలుపు’
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
తెలంగాణలో భారీ పెట్టుబడులకు ఒప్పందం
ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ
సినిమా

సూర్య 'రెట్రో' ట్రైలర్ రిలీజ్
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. ఇతడి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు చాలామంది ఎదురుచూస్తుంటారు. కానీ గతకొన్నాళ్లులో సూర్యకు సరైన హిట్ పడలేదు. దీంతో 'రెట్రో' మూవీపై బాగానే ఆశలు పెట్టుకున్నాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాపై ఓ మాదిరి అంచాలు ఉన్నాయి. రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న 'కనిమ' సాంగ్ ఇందులోనిదే. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతమందించాడు. మే 1న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. గతేడాది 'కంగువ'తో సూర్యకు చాలా గట్టిగా దెబ్బ పడింది. మరి 'రెట్రో'తో హిట్ కొడతాడో లేదో చూడాలి?(ఇదీ చదవండి: జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్)

రొమాంటిక్ ప్రేమకథగా వస్తోన్న 'దూరదర్శని'.. సుకుమార్ చేతుల మీదుగా సాంగ్ రిలీజ్
సువిక్షిత్ బొజ్జ, గీతిక రతన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం దూరదర్శని. కలిపింది ఇద్దరినీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహ మూవీ మేకర్స్ పతాకంపై బి.సాయి ప్రతాప్ రెడ్డి, జయ శంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. 1990 నేపథ్యంలో జరిగిన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పుష్ప-2 డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా ఓరోరి మొండివాడా’ అంటూ సాగే బ్యూటిఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను సింధుజ, శ్రీనివాసన్ ఆలపించగా.. సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు.ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ 'ఈ సినిమా హీరో సువిక్షిత్ నా రూపం వచ్చేటట్లు వరిపొలంలో ఫామింగ్ చేశాడు. నాకు అప్పట్నుంచి పరిచయం ఉంది. తనకి సినిమా అంటే ప్యాషన్. సాంగ్ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి' అన్నారు.హీరో సువిక్షిత్ మాట్లాడుతూ.. 'నా అభిమాన దర్శకుడు, ఎంతో ఇష్టమైన వ్యక్తి సుకుమార్ చేతుల మీదుగా మా సాంగ్ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకొస్తాయి. ఈ లిరికల్ వీడియో అందరి హృదయాలకు హత్తుకుంటుంది.1990వ నేపథ్యంలో అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో భద్రం, కృష్ణా రెడ్డి, కిట్టయ్య, చలపతి రాజు, జెమిని సురేష్, జి.భాస్కర్, భద్రమ్, లావణ్య రెడ్డి, తేజ చిట్టూరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాస్ట్ లీ కారు కొన్న ఏఆర్ రెహమాన్.. ధర ఎంతో తెలుసా?
కార్లలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట్రెండ్ నడుస్తోంది. ఓవైపు పెట్రోల్ వాహనాలు ఉపయోగిస్తున్నప్పటికీ.. చాలామంది ఎలక్ట్రిక్ మోడల్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఇప్పుడు ఆ లిస్టులోకి చేరిపోయాడు. ఖరీదైన ఓ కారుని ఇప్పుడు తన గ్యారేజీలోకి తీసుకొచ్చేశాడు. రెహమాన్.. తెలుగు, తమిళ, హిందీతో సహా పలు భాషల్లో గత కొన్ని దశాబ్దాలుగా పాటలు స్వరపరుస్తున్నారు. తెలుగులోనూ రామ్ చరణ్ 'పెద్ది' పనిచేస్తున్నారు. సరే ఈ సంగతులంతా పక్కనబెడితే తాజాగా మహీంద్ర కంపెనీకి చెందిన XEV 9e మోడల్ కారుని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) మహీంద్ర సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ కారు ఇది. ధర రూ.25-35 లక్షల మధ్య ఉండొచ్చు. రెహమాన్ ఈ కారు కొనడం వెనక మార్కెటింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మోడల్ తోపాటు బీఎస్6 మోడల్ కారులో సౌండింగ్ కోసం రెహమాన్ పనిచేశారు. ఇప్పుడు తాను కొన్న కారులోనూ డాల్బీ ఆట్మస్ సౌండింగ్ ని ఏర్పాటు చేశారు. స్వయంగా ఇతడే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.రెహమాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. దాదాపు 29 ఏళ్లపాటు కాపురం చేసిన తర్వాత భార్య సైరాభానుకి కొన్నాళ్ల క్రితం విడాకులు ఇచ్చేశారు. కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: జర్మనీ అమ్మాయితో సూపర్ స్టార్ కొడుకు డేటింగ్) View this post on Instagram A post shared by ARR (@arrahman)

ప్రియురాలితో అమిర్ ఖాన్ సందడి.. టీమిండియా క్రికెటర్ గర్ల్‌ఫ్రెండ్ కూడా!
బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్ గురించి బయటపెట్టాక ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌తో ఏడాది కాలంగా డేటింగ్లో ఉన్నట్లు ఓ తన బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెల్లడించారు. దాదాపు 60 ఏళ్ల వయసులో డేటింగ్ ఉన్నానంటూ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చారు.అయితే తాజాగా అమిర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో కలిసి సందడి చేశారు. వారితో పాటు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సోఫీ షైన్ కూడా ఉన్నారు. చైనాలో జరిగిన రెండో మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో వీరు కనిపించారు. వీరితో పాటు అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఉన్నారు.గౌరీ స్ప్రాట్‌తో రిలేషన్కాగా.. ఇటీవలే తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌కు మీడియాను పరిచయం చేశాడు. వీరిద్దరూ దాదాపు 25 సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. బెంగళూరులో నివసించే గౌరికి గతంలోనే వివాహమై ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. తాజాగా ఈ జంట చైనాలోని మకావు ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్లో జంటగా కనిపించారు. కాగా.. అమిర్ ఖాన్ అంతకుముందు డైరెక్టర్ కిరణ్ రావుతో జూలై 2021లో విడాకులు తీసుకుంటున్నారు. అంతకుముందే రీనా దత్తాను పెళ్లాడిన ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అమీర్ సితారే జమీన్ పర్ మూవీలో కనిపించనున్నారు. చివరిసారిగా లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంతో విఫలమైంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్‌లోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం. 8 మంది సజీవ దహనం. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త సుంకాల నుంచి ఎలక్ట్రానిక్స్‌కు మినహాయింపు. ట్రంప్ సర్కారు తాజా ప్రకటన. అమెరికా కంపెనీల ప్రయోజనాలే లక్ష్యం

అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం

చర్యకు ప్రతి చర్య తప్పదు.. అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు... ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరిక

చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు
క్రీడలు

పసిడి పతకం నెగ్గిన హిమాన్షు
దమ్మామ్ (సౌదీ అరేబియా): ఆసియా అండర్–18 యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. శుక్రవారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో హిమాన్షు భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. 17 ఏళ్ల హిమాన్షు జావెలిన్‌ను 67.57 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. లు హావో (చైనా; 63.45 మీటర్లు) రజతం... రుసియన్ సాదుల్లాయెవ్ (ఉజ్బెకిస్తాన్; 61.96 మీటర్లు) కాంస్యం సాధించారు.హరియాణా మహిళా అథ్లెట్ ఆర్తి తన ఖాతాలో రెండో కాంస్య పతకాన్ని జమ చేసుకుంది. 200 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్తి 24.31 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. 100 మీటర్ల విభాగంలోనూ ఆర్తి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు పురుషుల హైజంప్‌లో దేవక్ భూషణ్ రజత పతకాన్ని గెల్చుకున్నాడు. భూషణ్ 2.03 మీటర్ల ఎత్తుకు ఎగిరి రెండో స్థానంలో నిలిచాడు. పురుషుల షాట్‌పుట్‌లో నిశ్చయ్ రజత పతకం దక్కించుకోగా... పురుషుల మెడ్లీ రిలేలో చిరంత్, సయ్యద్ సాబీర్, సాకేత్ మింజ్, కదీర్ ఖాన్‌లతో కూడిన భారత బృందం రజత పతకాన్ని హస్తగతం చేసుకుంది.

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌గా జు వెన్జున్
మహిళల చదరంగంలో తనకు తిరుగులేదని చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెన్జున్ మరోసారి నిరూపించుకుంది. క్లాసికల్ ఫార్మాట్లో వరుసగా ఐదోసారి ఆమె విశ్వవిజేతగా నిలిచింది. చైనాకే చెందిన టాన్ జోంగితో షాంఘైలో జరిగిన ప్రపంచ చెస్ మహిళల చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో 34 ఏళ్ల జు వెన్జున్ 6.5–2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరి మధ్య 12 గేమ్‌లు జరగాల్సి ఉన్నా... తొమ్మిదో గేమ్‌లోనే జు వెన్‌జున్‌కు టైటిల్ ఖరారు కావడంతో మిగతా మూడు గేమ్‌లను నిర్వహించలేదు. తొమ్మిది గేమ్‌లలో జు వెన్జున్ ఐదు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. విజేతగా నిలిచిన జు వెన్‌జున్‌కు 3,41,000 డాలర్లు (రూ. 2 కోట్ల 91 లక్షలు), రన్నరప్ టాన్ జోంగికి 2,27,000 డాలర్లు (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2018లో రెండుసార్లు (10 గేమ్‌ల ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్ వేర్వేరుగా) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జు వెన్జున్ ఆ తర్వాత 2020లో, 2023లోనూ వరల్డ్ టైటిల్‌ను సాధించింది.

చాలెంజర్స్‌పై పంజా...
ముందు వాన... తర్వాత హైరానా! శుక్రవారం రాత్రి బెంగళూరులో రాయల్ చాలెంజర్స్ (ఆర్సీబీ) పరిస్థితి ఇది. ఆలస్యమైన ఆటలో వికెట్ల వేటను చకచకా మొదలుపెట్టిన పంజాబ్ కింగ్స్ ప్రత్యర్థిథని వారి సొంతగడ్డపై కుదేల్ చేసింది. కుదించిన ఓవర్లలో విదిల్చిన పంజాతో ఎదురైన స్వల్ప లక్ష్యాన్ని ఎంచక్కా ఛేదించిన కింగ్స్ ఈ ఐపీఎల్లో ఐదో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో మూడోసారి బెంగళూరు ప్రేక్షకులకు నిరాశ తప్పలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన మూడో మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బోణీ కొట్టలేకపోయింది. బెంగళూరు: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ గర్జించింది. బెంగళూరును వణికించింది. కింగ్స్‌ను విజేతగా నిలబెట్టింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఆర్సీబీపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (26 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ , మార్కో యాన్సెన్, యజువేంద్ర చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసి గెలిచింది. నేహల్ వధేరా (19 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. హాజల్‌వుడ్ 3, భువనేశ్వర్ 2 వికెట్లు తీశారు. బెంగళూరు తమ తుదిజట్టును మార్చలేదు. పంజాబ్ మాత్రం రెండు మార్పులు చేసింది. మ్యాక్స్‌వెల్, సుర్యాంశ్ షెడ్గే స్థానాల్లో స్టొయినిస్, హర్‌ప్రీత్ బ్రార్ బరిలోకి దిగారు. అందరూ తొందరగానే... వర్షం వల్ల మ్యాచ్ చాలా ఆలస్యంగా ఆరంభమైంది. దీంతో మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. కోహ్లి, సాల్ట్, లివింగ్‌స్టోన్‌లాంటి హిట్టర్లున్న జట్టులో ఏ నలుగురో, ఐదుగురో ఆడాల్సిన 14 ఓవర్లను ఏకంగా 11 మంది ఆడేశారు. టాపార్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అందరూ తొందర, తొందరగా వికెట్లను పారేసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సాల్ట్ (4), కోహ్లి (1), రజత్ పాటీదార్ (23), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (2), కృనాల్ పాండ్యా (1) చేతులెత్తేశారు. డేవిడ్ ఒక్కడి మెరుపులతోనే... జట్టు స్కోరు 95/9. అంటే 11 మంది క్రీజులోకి వచ్చారన్నమాటే! అందరూ బ్యాటింగ్‌కు దిగినా... స్కోరులో సగంకంటే ఎక్కువ స్కోరు ఒక్కడే టిమ్ డేవిడ్ చేశాడు. ఏడో వరుసలో, ఏడో ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ అండగా నిలిచేవారే కరువైనా... ఆఖరి రెండు ఓవర్లలోనే అంతా మార్చాడు. 12 ఓవర్లలో బెంగళూరు 9 వికెట్లకు 63 పరుగులు చేసింది. డేవిడ్ స్కోరు 19 కాగా... జేవియర్ 13వ ఓవర్లో 2 బౌండరీలు సహా 11 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌కు ముందు... చివరి 14వ ఓవర్లో తొలి మూడు బంతులు వరుసగా... 0, 0, 0 పరుగే రాలేదు. తర్వాత మూడు బంతుల్ని డేవిడ్ భారీ సిక్సర్లు బాదడంతో 18 పరుగులొచ్చాయి. 48 పరుగులు చేసిన డేవిడ్ సహా అంతా ఇన్నింగ్స్ బ్రేక్ కావడంతో మైదానం వీడుతున్నారు. కానీ అంపైర్ చాలా ఆలస్యంగా నోబాల్ సిగ్నలిచ్చాడు. సహచరులతో కబుర్లాడుతూ డగౌట్ చేరుతున్న ఆటగాళ్లను వెనక్కి పిలిచి ఫ్రీ హిట్ ఆడించడంతో 2 పరుగులు తీసిన డేవిడ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. నేహల్ మెరిపించాడు... సులువైన లక్ష్యం కావడంతో పంజాబ్‌కు ఛేదనలో పెద్దగా కష్టం ఎదురవలేదు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (16), ప్రభ్సిమ్రాన్ (13), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (7) ఇలా టాపార్డర్ వికెట్లు రాలినా... మిడిలార్డర్లో నేహల్ భారీ షాట్లతో విరుచుకు పడి జట్టును గెలిపించాడు. దీంతో ఒకే ఓవర్లో హాజల్‌వుడ్ అయ్యర్, ఇన్‌గ్లిస్ (14) వికెట్లను పడగొట్టినా... నేహల్ బ్యాటింగ్ బెంగళూరును మ్యాచ్‌లో పట్టుబిగించకుండా చేసింది. 11 బంతులు మిగిలుండగానే పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 4; కోహ్లి (సి) యాన్సెన్ (బి) అర్ష్ దీప్ 1; పాటీదార్ (సి) జేవియర్ (బి) చహల్ 23; లివింగ్‌స్టోన్ (సి) ప్రియాన్‡్ష (బి) జేవియర్ 4; జితేశ్ (సి) నేహల్ (బి) చహల్ 2; కృనాల్ (సి అండ్ బి) యాన్సెన్ 1; టిమ్ డేవిడ్ (నాటౌట్) 50; మనోజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) యాన్సెన్ 1; భువనేశ్వర్ (సి) జేవియర్ (బి) హర్‌ప్రీత్ 8; యశ్ దయాళ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‌ప్రీత్ 0; హజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 95. వికెట్ల పతనం: 1–4, 2–21, 3–26, 4–32, 5–33, 6–41, 7–42, 8–63, 9–63. బౌలింగ్: అర్శ్‌దీప్ 3–0–23–2, జేవియర్ 3–0–26–1, యాన్సెన్ 3–0–10–2, చహల్ 3–0–11–2, హర్‌ప్రీత్ బ్రార్ 2–0–25–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) డేవిడ్ (బి) హాజల్‌వుడ్ 16; ప్రభ్సిమ్రాన్ (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 13; అయ్యర్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 7; ఇన్‌గ్లిస్ (సి) సుయశ్ (బి) హాజల్‌వుడ్ 14; నేహల్ (నాటౌట్) 33; శశాంక్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; స్టొయినిస్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (12.1 ఓవర్లలో 5 వికెట్లకు) 98. వికెట్ల పతనం: 1–22, 2–32, 3–52, 4–53, 5–81. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–26–2, యశ్ దయాళ్ 2.1–0–18–0, హాజల్‌వుడ్ 3–0–14–3, కృనాల్ 1–0–10–0, సుయశ్ 3–0–25–0. ఐపీఎల్లో నేడుగుజరాత్ X ఢిల్లీ వేదిక: అహ్మదాబాద్ , మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X లక్నో వేదిక: జైపూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: చెలరేగిన పంజాబ్ బౌలర్లు.. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ విజయం
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 18) జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆర్సీబీపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ ఆర్సీబీని 95 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, జన్సెన్, చహల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు.. బార్ట్లెట్ ఓ వికెట్ తీసి ఆర్సీబీ పతనాన్ని శాశించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.బ్రార్ వేసిన ఆఖరి ఓవర్లో డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో డేవిడ్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌తో పాటు రజత్ పాటిదార్ (18 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశాడు. మిగతా ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1, భువనేశ్వర్ 8, యశ్ దయాల్ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. అయితే నేహల్ వధేరా (33 నాటౌట్) ఏమాత్రం జంక కుండా బ్యాటింగ్ చేసి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. యశ్ దయాల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది స్టోయినిస్ (7 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రియాంశ్ ఆర్య 16, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 13, శ్రేయస్ అయ్యర్ 7, జోస్ ఇంగ్లిస్ 14, శశాంక్ సింగ్ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు.
బిజినెస్

2025 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?
టీవీఎస్ కంపెనీ.. 2025 అపాచీ ఆర్ఆర్ 310 బైకును మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.2025 అపాచీ ఆర్ఆర్ 310.. టర్న్ సిగ్నల్ లాంప్స్, డ్రాగ్ టార్క్ కంట్రోల్ అనే రెండు సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను పొందుతుంది. లాంచ్ కంట్రోల్, కొత్త 8 స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటివి కూడా ఈ బైకులో ఉన్నాయి. టీవీఎస్ ఆసియా ఓఎంసీ రేస్ బైక్ నుంచి ప్రేరణ పొందటం చేత.. ఈ బైక్ సెపాంగ్ బ్లూ రేస్ రెప్లికా కలర్ స్కీమ్ పొందుతుంది.ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో టెస్లా కారు - లాంచ్ ఎప్పుడంటే?కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బైక్ అదే 312 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా.. 9,800 rpm వద్ద 37 bhp & 7,900 rpm వద్ద 29 Nm టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో ట్రాక్, స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ బైక్ కోసం కంపెనీ ప్రత్యేకంగా కిట్ కూడా అందిస్తోంది. దీనికి అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్
స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది.వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్స్ సాయంతో.. మీ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల.. మీ వాట్సాప్ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరికి కనిపించకూడదనుకుంటారో.. వారు చూడలేరు.ఈ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలంటే..➤వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.➤సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత.. ప్రైవసీ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది.➤ప్రైవసీ మీద క్లిక్ చేసిన తరువాత.. మొదట్లోనే లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి.➤ఆలా చేసిన తరువాత.. నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి.➤ఆ తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టేటస్, లాస్ట్‌సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెలక్ట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు

'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు'
గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇన్ఫోసిస్‌లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.నియామకాల అంచనాజీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలుగతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే!

భవిష్యత్తులో సివిలియన్ హెలికాప్టర్లకు గిరాకీ
భారత్‌లో వచ్చే ఐదేళ్లలో సివిలియన్ హెలికాప్టర్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ అంచనా వేసింది. మెడికల్ ఎమర్జెన్సీలు, డిజాస్టర్ రిలీఫ్, లా ఎన్ఫోర్స్మెంట్, టూరిజం రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతుండడం ఇందుకు కారణమని తెలిపింది. ఇది కీలకమైన సేవల కోసం హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని సూచిస్తుంది.ప్రస్తుత పరిస్థితులు ఇలా..దేశంలో ప్రస్తుతం 250 సివిల్ హెలికాప్టర్లున్నాయి. ఇది ప్రపంచ సివిలియన్ ఫ్లీట్‌లో సుమారు ఒకశాతంగా ఉంది. ఈ వాటా ప్రస్తుతానికి స్వల్పంగానే ఉన్నప్పటికీ దేశంలోని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్లకు అపారమైన మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తుంది. కొండ రాష్ట్రాలు, మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే ప్రాంతాల్లో హెలికాప్టర్ కార్యకలాపాలు అధికంగా ఉండే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధంభారత ప్రభుత్వం కూడా ఈ సర్వీసులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రాంతీయ హెలికాప్టర్ సేవలతో సహా సరసమైన విమాన కనెక్టివిటీని అందించేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రాజెక్టు సంజీవని ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా హెలిపోర్టులను ఏర్పాటు చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఎయిమ్స్ రిషికేశ్‌లో హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీసులకు ఆదరణ పెరిగింది. ఇక్కడ ఎయిర్‌బస్ హెచ్ 125 హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలకోసం సిబ్బందిని, రోగులను తరలిస్తున్నారు.
ఫ్యామిలీ

Good Friday మనిషి కొరకు దైవపుత్రుడే...
క్రీస్తును శిలువ వేసిన రోజు శుక్ర వారం. అయితే ఆ శిలువ ద్వారా మానవాళికి మహత్తర సందేశం అందిన రోజుగా పవిత్ర శుక్రవా రంగా అది పరిగణింపబడింది. అందుకే ఇది ‘గుడ్ ఫ్రైడే’గా పేరొందింది. క్రైస్తవ సమాజంలో ఇది ప్రాముఖ్యం కల్గిన రోజు. ప్రభువు మరణంలో, ఒక మనిషి మరో మని షిని ప్రేమించాలి అనే సందేశం ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రేమతోనే సాటి మనిషిని క్షమిస్తాడు. తోటి మనిషి పట్ల సహనం ప్రదర్శిస్తాడు. అదే ప్రేమతో సాటివానికి సాయం చేస్తాడు. ప్రభువంతటి గొప్పవాడే ఏకంగా మనిషి కోసం మరణించాడే, మరి నేనేమి చేస్తున్నాను? అని ప్రతి వ్యక్తీ ప్రశ్నించుకుంటాడు. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి ప్రాముఖ్యం ఉంది. వీటినే మరో రీతిగా చెప్పుకోవలసి వస్తే, జననం, మరణం, పునరుత్థానం అని వివరించు కోవాలి. జనన పునరుత్థానాల్లో దైవిక భావన కనిపిస్తోంది. కానీ మర ణంలో మాత్రం అచ్చంగా మానవీయత కనిపిస్తోంది. మానవీయ గుణగణాల కలబోత అది. మిగిలిన రెండు పండుగలకూ సమన్వయం చేకూర్చి, క్రీస్తు తత్త్వానికి పరిపూర్ణత్వాన్ని అందించిన రోజు ఇది.క్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు ఇది. ఎన్నో అద్భుతాలు చేసిన క్రీస్తుకు ఈ మరణం నుంచి తప్పించుకోవడానికీ, అసలు తనకు ఆ మరణమే ఎదురుపడకుండా చేసుకోగల శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ తండ్రి దేవుని మాటకు విధేయత చూపి మరణాన్ని ఆహ్వానించడంలో గొప్ప సందేశం కనిపిస్తోంది. వాస్తవానికి తప్పు చేసిన మానవుణ్ణి ఈ మరణమే మాటి మాటికీ హెచ్చరిస్తోంది. ఎన్ని ఫ్రైడేలు లేవు? కానీ, ఇది జనహితం కలిగించిన శుభకరమైన శుక్రవారం. ఇదే క్రీస్తు పవిత్రతను చాటిన పవిత్ర శుక్రవారంగా కూడా పిలువబడుతోంది. క్రైస్తవులు తెల్లటి వస్త్రాలు ధరించి ఈ రోజంతా చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. తమ పాపాలే ఈ రకంగా క్రీస్తును శిలువ వేసి మరణానికి గురిచేశాయి అనే పశ్చాత్తాప బాధతో ఉంటారు. ఇక మీదట తప్పిదాలు, దగా – మోసాలు చేయకుండా కొత్త జీవన విధానంతో ముందుకు సాగిపోతారు. క్రీస్తు మరణం విషాద భరితం. దుఃఖ పరివేదనం. అయినా ఆత్మ ప్రక్షాళనం చేసే చావు కేక. అది మానవుణ్ణి ప్రతి క్షణం మేల్కొల్పుతుంది. – డా.దేవదాసు బెర్నార్డ్ రాజు(నేడు ‘గుడ్ ఫ్రైడే’)

World Heritage Day: చరిత్రలో ఈ రోజు..!
ప్రపంచ మానువులంతా ఒక్కేటనన్న భావన పెంపొందించేలా వివిధ దేశాలూ, ప్రాంతాల్లోని వారసత్వ చిహ్నలను పరిరక్షించడానికి యునెస్కో శ్రమిస్తోంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వాలను, ప్రజలకు తెలియజేసేలా గుర్తుచేస్తోంది. ఇవాళ ప్రపంచ వారసత్వ దినోత్సవం(world Heritage Day). ప్రతి ఏటా ఏప్రిల్ 18న నిర్వహిస్తారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స అండ్ సైట్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని వారసత్వ ప్రదేశాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను చెప్పి, భవిష్యత్తు తరాల కోసం వాటిని రక్షించాల్సిన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్యోద్దేశం.చారిత్రక నేపథ్యం: ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్(ఐసీఓఎంఓఎస్)సంస్థ 1982 ఏప్రిల్ 18న మొదటిసారి ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించింది. 1983లో యునెస్కో ఇదే తేదీన ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.భారతదేశం గొప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అవి మన సంస్కృతి, చరిత్రలో ముఖ్యభాగం. వాటిని కాపాడం మనందరి బాధ్యత. ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ ప్రదేశాలను సాంస్కృతిక, సహజ, మిశ్రమ అనే వర్గాలుగా విభజించింది. 2024 జులై నాటికి 168 దేశాల్లో మొత్తం 1223 హెరిటేజ్ స్టేల్స్ ఉన్నాయి. మన దేశంలో వాటి సంఖ్య 43 ఉన్నాయి. అయితే ఇందులో 35 సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుండగా, ఏడు సహజ సౌందర్యానికి ప్రతీకగాఉన్నాయి. మిగిలింది మిశ్రమ సంస్కృతి ఇందులో సిక్కింలోని కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానవనం చోటు దక్కించుకుంది.ఆ జాబితాలో మనవి..మొట్టమొదటిసారిగా 1983లలో మహారాష్ట్ర ఎల్లోరా గుహలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా కోట, తాజ్‌మహల్ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2024లో అహోమ రాజవంశీకులు అసోంలోని నిర్మించిన సమాధులు కూడా ఇందులోకి చేరాయి. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ జాబితాలో చేరిన తొలి వారసత్వ సంపద ఇదే. ఇక మన తెలుగువారంతా గర్వించేలా తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.ఏవేవి ఉన్నాయంటే..ఫతేపూర్ సిక్రి, భీంబేట్కాలోని రాతి ఆవాసాలు, చంపానేర్- పావగఢ్ ఆర్కియోలాజికల్ పార్క్, సాంచీ బౌద్ధ కట్టడాలు, కుతుబ్‌మినార్, డార్జిలింగ్ పర్వత రైల్వే, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఢిల్లీలోని ఎర్రకోట, జైపుర్‌లోని జంతర్‌మంతర్, రాజస్థాన్ గిరి దుర్గాలు, నలందాలోని నలందా మహావిహార, పటన్‌లోని రాణీకీ వావ్, చండీగఢ్‌లోని లే కార్బుజియర్ నిర్మించిన వాస్తు కట్టడాలు, అహ్మదాబాద్ చారిత్రక నగరం, ముంబైలోని విక్టోరియన్ గోథిక్, కళాత్మక నిర్మాణాలు, ధోలావీరా-హరప్పా నగరం, అస్సాంలోని మియోడమ్స్.మహాబలిపురం, హంపీ స్మారక చిహ్నాలు.కజిరంగా, కియోలాదేవ్, సుందరబన్ జాతీయ ఉద్యాన వనాలు, మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నందాదేవి పువ్వుల లోయ జాతీయ ఉద్యానాలు, హిమాలయాల్లోని నేషనల్ పార్కు కన్జర్వేషన్ ఏరియా, కాంచన్‌జంగ్ జాతీయ ఉద్యానం, శాంతినికేతన్, పశ్చిమ కనుమలు.కోణార్క్ సూర్య దేవాలయం, తమిళనాడులోని గంగైకొండ చోళపురం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, దారాసురంలోని ఐరావతేశ్వర ఆలయం, పట్టదకల్ దేవాలయాలు, ఖజురహో దేవాలయం, బోధ్ గయలోని మహాబోధి ఆలయం, బేలూరు చెన్నకేశవ, హలెబీడు-హోయసలేశ్వర, సోమనాథ్‌పూర్ కేశవ(హోయసల) దేవాలయాలు, గోవాలో చర్చిలు, కాన్వెంట్లు.(చదవండి: సూర్యుడి భగభగలు పెరిగిపోవచ్చు తస్మాత్ జాగ్రత్త..! ఆహారం, పానీయాలపై శ్రద్ధ పట్టాల్సిందే..!)

గంటల్లోనే వణుకుడు వ్యాధి మాయం..!
చేతులు, కాళ్లు విపరీతంగా వణికిపోతూ.. మనమీద మనకే నియంత్రణ లేకుండా చేసే దారుణమైన సమస్య ..పార్కిన్సన్స్ డిసీజ్. దాదాపు ఏడాది క్రితం వరకు దీనికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే ఒక శస్త్రచికిత్స మాత్రమే ఉండేది. కానీ వైద్య పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఓ సరికొత్త చికిత్స వచ్చింది. అదే.. ఎంఆర్ గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ (ఎంఆర్జీఎఫ్యూఎస్). దీని సాయంతో.. కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే వణుకుడు సమస్య పూర్తిగా మటుమాయం అయిపోతుందని కిమ్స్ ఆస్పత్రికి చెందిన వైద్య ప్రముఖులు చెబుతున్నారు. పార్కిన్సన్స్ వ్యాధి బాధితులు, వారి కుటుంబసభ్యులకు ఈ సమస్య, దాని లక్షణాలు, ఉన్న చికిత్స అవకాశాల గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కిమ్స్ హాస్పిటల్స్‌లోని మూవ్మెంట్ డిజార్డర్స్ బృందం డాక్టర్ మానస్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ గోపాల్ మూవ్మెంట్ డిజార్డర్ బృందం ఆధర్యంలో గురువారం నిర్వహించారు. సుమారు 150 మంది రోగులు, వారి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరై.. తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగాధిపతి, చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ కుమార్ పాణిగ్రాహి మాట్లాడుతు.. “పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనిషిని పూర్తిగా కుంగదీసే సమస్య. దీనివల్ల వచ్చే శారీరక సమస్యలతో పాటు.. అవి ఉన్నాయన్న బాధ వల్ల వచ్చే మానసిక సమస్యలు కూడా ఎక్కువే. ఇంతకాలం మందులు, డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు మాత్రమే దీనికి పరిష్కారంగా ఉండేవి. ఇప్పుడు చిన్న కోత కూడా అవసరం లేకుండా కేవలం ఎంఆర్ఐ యంత్రానికి మరో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ యంత్రాన్ని అమర్చి మూడు నాలుగు గంటల పాటు చికిత్స చేస్తాం. ఇది పూర్తయ్యి రోగి బయటకు రాగానే ఒకవైపు ఉన్న సమస్య పూర్తిగా నయం అయిపోతుంది. అప్పటివరకు ఉన్న వణుకు మటుమాయం అవుతుంది. పైగా ఈ ప్రక్రియ చేసేటప్పుడే వణుకు తగ్గిందా లేదా అని చూసుకుంటూ ఉంటాం కాబట్టి... పూర్తిగా తగ్గిన తర్వాతే చికిత్స పూర్తవుతుంది. అంతేకాదు గతంలో డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలకు ఎంత వ్యయం అయ్యేదో.. దాదాపుగా దీనికి కూడా అంతే అవుతుంది. వణుకు ప్రాథమిక దశలో ఉన్నవారి నుంచి బాగా తీవ్రంగా ఉన్నవారి వరకు ఎవరైనా ఈ చికిత్స చేయించుకోవచ్చు. వారికి ఒక చిన్న పరీక్ష చేసి, ఈ చికిత్స వారికి సరిపోతుందో లేదో నిర్ణయిస్తాం. ఆ తర్వాత చికిత్స చేయించుకుని.. హాయిగా ఎవరి సాయం లేకుండా ఒక్కరే నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు” అని తెలిపారు.ఈ కార్యక్రమానికి నిర్వాహక కార్యదర్శిగా వ్యవహరించిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మూమెంట్ డిజార్డర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ మాట్లాడుతూ, “ఎంఆర్జీ ఎఫ్యూఎస్ అనేది చాలా అత్యాధునికమైన చికిత్స. ఇప్పటికే కిమ్స్ ఆస్పత్రిలో ఎనిమిది మంది రోగులకు దీని సాయంతో చికిత్స చేసి సత్పఫలితాలు సాధించాం. ఇందులో ఎలాంటి కోత అవసరం లేకుండా ఎంఆర్ఐతోనే అల్ట్రాసౌండ్ తరంగాలను పంపుతారు. పార్కిన్సన్స్ వ్యాధి వల్ల మెదడులో ప్రభావితమైన ప్రాంతాలను ఎంఆర్ఐ ద్వారా గుర్తించి, వెంటనే చికిత్స చేసేటప్పుడు ముందుగా తక్కువ హీట్‌తో టెంపరెరీ థర్మోఅబ్లేషన్న్ చేసి వణుకు తగ్గిందా లేదా అని చూస్తాం. తర్వాత ఎక్కువ హీట్ తో పర్మినెంట్ థర్మోఅబ్లేషన్ ద్వారా పూర్తి చికిత్స చేయడం జరుగుతుంది. అలా చేస్తుడంగానే వణుకు పూర్తిగా తగ్గిపోతుంది. సాధారణంగా పార్కిన్సన్స్ రోగులకు ఒకవైపే (కుడి లేదా ఎడమ) సమస్య తీవ్రంగా ఉంటుంది. వ్యాధి త్రీవత ఎక్కువ ఉన్న వైపు చికిత్స చేయడం వల్ల వారికి ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది. ఈ మొత్తం చికిత్సకు సుమారు 3-4 గంటల సమయం పడుతుంది. ఫలితాలు మాత్రం వెంటనే కనిపిస్తాయి."ఓ కేసులో 28 ఏళ్ల యువకుడు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. టీచర్ అవుదామనుకుంటే ఆ ఉద్యోగం కూడా రాలేదు. చికిత్స పొందిన తర్వాత ఇప్పుడు హాయిగా టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, చాలామందికి సాయపడుతున్నాడు. అలాంటి నాణ్యమైన జీవితాన్ని అందరికీ ఇవ్వాలని కిమ్స్ తహతహలాడుతుంటుంది. కిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ బృందం అత్యుత్తమ సేవలు అందిస్తోంది. అందుకు వారికి అభినందనలు” అని కిమ్స్ ఆస్పత్రి సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు.చీఫ్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్. మోహన్ దాస్, కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్. సీతా జయలక్ష్మి, డాక్టర్ ఈఏ వరలక్ష్మి, డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాడా, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుభాష్ కౌల్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. “సాధారణంగా పార్కిన్సన్స్ వ్యాధిలో రెండు రకాల సమస్యలు ఉంటాయి. అవి మోటార్, నాన్ మోటార్. మోటార్ సమస్యలు అంటే కదలికలకు సంబంధించినవి. వణుకు, గట్టిగా అయిపోవడం, నెమ్మదించడం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. చేతులు, కాళ్లు విపరీతంగా వణుకుతుంటాయి. ఏవీ పట్టుకోలేరు, సరిగా నడవలేరు. నడకమీద నియంత్రణ ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోయే పనికి 20 నిమిషాలు పడుతుంది. ముఖంలో కదలికలు తగ్గిపోతాయి. ఇక నాన్ మోటార్ సమస్యల్లో నిద్ర లేకపోవడం, మూత్రవిసర్జనపై నియంత్రణ లేకపోవడం, మలబద్ధకం, మానసిక సమస్యలు, వాసన లేకపోవడం లాంటి వాటితో పాటు.. శరీరం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల తరచు పడిపోయి గాయపడతారు. ఈ సమస్యల వల్ల వాళ్లు నలుగురితో కలవలేక ఒంటరిగా మిగిలిపోతారు. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లలేరు. విపరీతమైన కుంగుబాటు ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ పార్కిన్సన్స్ వల్ల అదనంగా వస్తాయి.(చదవండి: శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు.. )

శిల్పారామంలో..సమ్మర్ ఆర్ట్ క్యాంపు..
పరీక్షలు అయిపోయాయి.. వేసవి సెలవులు వచ్చాయి.. మరి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థులు ఏం చేయాలి? వారికి నచ్చిన రంగాల్లో, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సరి.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రతి ఏడాది సమ్మర్ ఆర్ట్ క్యాంప్ చేపడుతోంది. ఈ ఏడాది కూడా మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆర్ట్ క్యాంపు నిర్వహిస్తోంది. దీనిలో మట్టికుండల తయారీ విధానం, పెన్సిల్ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్ పెయింటింగ్, మండల పెయింటింగ్, ఆక్రిలిక్ పెయింటింగ్, సీసెల్ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాల పఠనం, సంస్కృతంలో మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు ఏఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు అధ్యాపకులు శిక్షణ ఇస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా గృహిణులు, ఉద్యోగినులు సైతం వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన మహిళలు వివిధ రకాల బట్టలపై పెయింటింగ్‌లు వేసి ఆర్థికంగా సంపాదిస్తున్నారు. కొంత మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. 6 సంవత్సరాలకుపై బడినవారు ఎవరైనా సమ్మర్ ఆర్ట్ క్యాంపులో పాల్గనవచ్చు. చిన్నారులకు భగవద్గీత, సంస్కృత భాషలను నేర్పడం వల్ల వారు ప్రయోజకులు కావడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రత్యేకతను తెలుసుకుంటారని అధ్యాపకులు తెలుపుతున్నారు. కేవలం సరదాగా నేర్చుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడవచ్చు.. సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి భాషను నేరి్పంచడం అరుదు. శిల్పారామం విద్యార్థులకు, ఆసక్తిగల వారికి సమ్మర్ క్యాంపు ద్వారా ఈ అవకాశాన్ని కలి్పస్తోంది. సులభ పద్ధతిలో సంస్కృత భాషను నేర్చుకోవచ్చు. సంస్కృత భాషను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వల్ల అనేక గ్రంథాలను, పుస్తకాలను చదువుకొని అర్థం చేసుకోవచ్చు. – సంతోష్, అధ్యాపకుడు, సంస్కృత భాష మధుబని పెయింటింగ్‌లో శిక్షణ మధుబని పెయింటింగ్‌ను ఆసక్తితో నేర్చుకోవాలి. ప్రత్యేకత ఉన్న మధుబని పెయింట్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. గృహిణులు ఇంట్లో సరదాగా వేసి అమ్ముకోవచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో నేర్చుకున్న వారు మరి కొంతమందికి శిక్షణ ఇవ్వవచ్చు. – రాజేశ్, మధుబని పెయింటింగ్ అధ్యాపకుడు ఆసక్తి గలవారు 8886652030,8886652004లలో సంప్రదించగలరు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ఆరు నుంచి 60 సంవత్సరాల వారు ఎవరైనా శిక్షణ పొందవచ్చు. మొత్తం 9 అంశాలలో శిక్షణ (చదవండి: హెరిటేజ్ వాక్..ఎక్స్పర్ట్స్ టాక్..!)
ఫొటోలు


తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దంపతులు (ఫొటోలు)


విడాకులు తీసుకుంటాంలే.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ (ఫొటోలు)


బ్యాంకాక్ ఫెస్టివల్లో జగ్గు భాయ్ సందడి.. మన సంక్రాంతిలాగే ఎంజాయ్ చేశా (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రీతి జింటా (ఫోటోలు)


శబరిమల అయ్యప్పకు ఇరుముడి సమర్పించిన హీరో కార్తీ (ఫోటోలు)


రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక (ఫొటోలు)


పుజారా చాలా మొండివాడు.. రాజ్‌కోట్ వీధుల నుంచి ఇక్కడిదాకా (ఫొటోలు)


పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నటి అభినయ.. సోషల్ మీడియాలో అభినందనల వెల్లువ (ఫొటోలు)


తిరుమల శ్రీవారి సేవలో అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి టీమ్ సందడి (ఫొటోలు)


ఘనంగా నటి అభినయ పెళ్లి.. ఫోటోలు వైరల్
అంతర్జాతీయం

నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్ మస్క్. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాల్ని మస్క్ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్జే వెబ్సైట్ అనేది ఒక గాసిప్ వెబ్ సైట్ అని, అందులో గాసిప్ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్ డోనర్ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది.

కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్ ఆర్మీ చీఫ్
కశ్మీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(General Asim Munir) భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్ మీడియా హౌజ్ డాన్(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్ మునీర్ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్‌కు బెలూచిస్తాన్ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్ ఆర్మీ చీఫ్(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్ మునీర్.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025

ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!
పాంగ్య్యాంగ్: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.***UPDATE***New warship revealed by #NorthKorea hints at VLS and phased array radars. #OSINT pic.twitter.com/2pzm01QcLr— H I Sutton (@CovertShores) December 29, 2024ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది.🇰🇵🛳️ North Korea is building the largest warship in its arsenal, measuring 140 meters long, — CNN.❗️The missile frigate is said to have vertical launchers for missiles at air and ground targets. DPRK receiving military technology from Russia, as it is under strict sanctions. pic.twitter.com/ivEEVwmQAY— MAKS 24 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) April 14, 2025

టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్.
జాతీయం

ఆప్‌కు అక్రమంగా విదేశీ నిధులు
న్యూఢిల్లీ: నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆమ్ ఆద్మీ పార్టి(ఆప్)కి విదేశాల నుంచి నిధులు అందాయనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ గుజరాత్ ఎన్నికల సహ ఇన్చార్జి దుర్గేశ్ పాఠక్ ఇంటిపై గురువారం సీబీఐ అధికారులు దాడులు జరిపారు. విదేశీ విరాళాల నిబంధనల సవరణ చట్టం(ఎఫ్సీఆర్ఏ)– 2010కు విరుద్ధంగా ఆప్ నిధులు అందుకుందనే ఆరోపణలపై హోం శాఖ నుంచి అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఆప్‌కు చెందిన మరో నేత దివంగత కపిల్ భరద్వాజ్ పేరు కూడా ఉంది. ఆప్ ఓవర్సీస్ ఇండియా పేరుతో ఏర్పాటైన విభాగానికి అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా తదితర దేశాల్లో వలంటీర్లు ఉన్నారని తెలిపింది. వీరు నిబంధనలకు విరుద్ధంగా నిధులు సేకరించి దుర్గేశ్ పాఠక్, కపిల్ భరద్వాజ్‌లకు పంపినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. కాగా, విచారణకు అవసరమైతే పార్టీ అగ్ర నేతలను కూడా ప్రశ్నించే అవకాశముందని సీబీఐ వర్గాలు తెలిపాయి. సోదాలపై దుర్గేశ్ స్పందించారు. గుజరాత్లో పార్టికి పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే కేంద్ర ప్రభుత్వం తనను బెదిరించేందుకు ఈ కుట్ర పన్నిందని ఆరోపించారు. గురువారం ఉదయం ఆరుగురు సీబీఐ అధికారులు తన నివాసానికి వచి్చ, రెండు గదుల్లో దాదాపు 4 గంటల పాటు అణువణువూ గాలించారని, వారికేమీ దొరకలేదని ఆయన చెప్పారు. సెర్చ్ వారెంట్ చూపిన అధికారులు సోదాలకు కారణం మాత్రం చెప్పలేదన్నారు. భయపెట్టడం ద్వారా గుజరాత్లో తమ పార్టీని ఏకాకిని చేయడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశమని ఆరోపించారు. తమ పార్టీని అంతం చేయడమే బీజేపీ ఉద్దేశమని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. దుర్గేశ్‌కు గుజరాత్లో 2027లో జరిగే అసెంబ్లీ ఎ న్నికల బాధ్యతలను అప్పగించిన వెంటనే బీ జేపీ ప్రభుత్వం దాడులకు దిగిందని ఆప్‡ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు.

బీజేపీ నూతన చీఫ్ ఎంపిక వేగవంతం
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను పార్టీ అగ్ర నాయకత్వం వేగవంతం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్షు ల ఎంపికను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసేందుకు అగ్రనేతలు విస్తృత సంప్రదింపులు మొదలుపెట్టారు. మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మూడు గంటల పాటు కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్ లు పాల్గొన్నారు. ఈ చర్చల అనంతరం అమిత్ షా, రాజ్‌నాథ్, సంతోష్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత అమిత్ షా, నడ్డా విడిగా భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించడంతో పాటు ఈ నెల 20వ తేదీ తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన వెంటనే పార్టీ జాతీయ ఎన్నికల అధికారి తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటివారంలో ఎన్నికలు నిర్వహించే ప్రణాళికతో పార్టీ ముందుకెళ్లనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత భేటీలో ఐదారుగురు నేతల పేర్లే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, బీఎల్ సంతోశ్ తో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, తెలంగాణకు చెందిన జి.కిషన్‌రెడ్డిల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. 2020 ఫిబ్రవరిలో నడ్డా తొలిసారిగా అధ్యక్షుడయ్యారు. పరిమిత మూడేళ్ల కాలం పూర్తయ్యాక కూడా ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. దాంతో ఇప్పటికీ ఆయనే అధ్యక్షునిగా సేవలందిస్తున్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన బీజేపీ ఇప్పటివరకు 15 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించింది. ఏప్రిల్ 19 లేదా 20వ తేదీన మరో ఆరేడు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించాలని భావిస్తోంది. పార్టీ సొంత నియమనిబంధనావళి ప్రకారం 19 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జరిగిన తర్వాతే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని పార్టిలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అధ్యక్షుల ప్రకటన తర్వాత మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల అధ్యక్షుల ప్రకటన ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రేసులో పురందేశ్వరి, మాధవ్, పార్థిసారధి రెడ్డిల పేర్లపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఎంపిక ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ పాత్ర సైతం ఉంటుందని తెలుస్తోంది. బిహార్‌లో ఈ ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలు జరగొచ్చు. పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు ఉండొచ్చు. ఈ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల్లో కమలదళ సారథుల ఎంపిక కొనసాగనుంది.

ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ సైనిక బంకర్
బెంగళూరు: భారత రక్షణ మౌలిక వసతుల, నిర్మాణ రంగంలో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ముద్రిత సైనిక బంకర్‌ను లేహ్‌లో నిర్మించారు. సముద్రమట్టానికి 11,000 అడుగుల ఎత్తులో అసాధారణ పరిస్థితులను తట్టుకునేలా పటిష్టవంతంగా మిలటరీ బంకర్‌ను పోతపోయడం విశేషం. అప్పటికప్పుడు తయారుచేసిన ప్రత్యేక కాంక్రీట్ మిక్సర్‌ను ముందే డిజైన్ చేసిన విధంగా 3డీ విధానంలో నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇండియన్ ఆర్మీ తరఫున అరుణ్ కృష్ణన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)హైదరాబాద్‌తోపాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బహుళ సాంకేతికతలు, ఉత్పత్తుల అంకుర సంస్థ సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ సంయుక్తంగా ‘ప్రబల్’ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బంకర్‌ను నిర్మించారు. సముద్రమట్టానికి అత్యంత ఎత్తు, అత్యల్ప ఆక్సిజన్(హ్యాలో) పరిస్థితుల్లో ప్రపంచంలో నిర్మించిన తొలి బంకర్ ఇదేనని ప్రబల్ ప్రాజెక్ట్‌కు సారథ్యం వహించిన ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం చెప్పారు. ‘‘అత్యంత మారుమూల ప్రదేశానికి ఈ ప్రింటర్‌ను తీసుకురావడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. ఇంత ఎత్తులో దాదాపు కేవలం 40–50 శాతం ఆక్సీజన్ అందుబాటులోనే మేం, మా ప్రింటర్ పనిచేయాల్సి వచ్చింది. శత్రుసైన్యం బుల్లెట్లను తట్టుకునేలా అధునాతన డిజైన్‌లో పటిష్టంగా, పరిసరాల్లో కలిసిపోయే రంగులో బంకర్‌ను నిర్మించాం’’ అని ఆయన వెల్లడించారు. గతంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలోని బురుగుపల్లి గ్రామంలో ప్రపంచంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెండ్ హిందూ ఆలయాన్ని సైతం ఇదే సింప్లీఫోర్జ్ క్రియేషన్స్ నిర్మించింది.

వచ్చే వారం అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు.
ఎన్ఆర్ఐ

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు తెలుగు కుటుంబాలకు యెంతో ఉత్సాహాన్నిచ్చాయి, తెలుగు సంవత్సరాదిని ఐక్యతతో, సాంస్కృతిక సంపదతో జరుపుకుంన్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య (THKTS) నిర్వహించే ఈ కార్యక్రమం, అనధికారికంగా ఇరవై రెండు సంవత్సరాలుగా మరియు పదమూడు సంవత్సరాల అధికారిక సంస్థగా తెలుగు సేవ కొనసాగిస్తోంది. చింగ్ మింగ్ ఉత్సవం కారణంగా హాంకాంగ్‌లో సుదీర్ఘ వారాంతం సెలవలు ఉన్నప్పటికీ, విశేషమైన సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాంకాంగ్ & మకావులోని భారత కాన్సులేట్ జనరల్ నుంచి కాన్సుల్ శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు; హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ జిల్లా అధికారి శ్రీ మొక్ మాంగ్-చాన్ గారు; ఎన్.ఎ.ఎ.సి టచ్ సెంటర్ ప్రాంతీయ డైరెక్టర్ శ్రీమతి కోనీ వాంగ్ గారు; మరియు హాంకాంగ్‌లో ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నత అధికారి శ్రీ దేవేష్ శర్మ గారు హాజరయ్యారు.చీకటిని పారద్రోలడానికి మరియు కొత్త ప్రారంభాలను స్వాగతించడానికి ప్రతీకగా గౌరవనీయ అతిథుల దీప ప్రజ్వలనతో ఉగాది వేడుకలు ప్రారంభమైంది. ప్రార్థన తర్వాత, హాజరైన వారిని "మా తెలుగు తల్లి" శ్రావ్యమైన పాట ఆకట్టుకుంది,తెలుగుతనాన్ని ప్రేక్షక హృదయాలలో ప్రతిధ్వనించింది. ప్రముఖుల ప్రసంగాలు సమాజ ప్రయాణం మరియు దాని సభ్యులను బంధించే లక్ష్యం గురించి ప్రతిబింబించాయి. శ్రీ కూచిభొట్ల వెంకట రమణ గారు తెలుగు భాష మరియు సాంస్కృతిక విలువలను పునరుద్ఘాటిస్తూ ఇది భావితరాలికి అందించాల్సిన కర్తవ్య ప్రాముఖ్యతని గుర్తుచేశారు. తెలుగు సమాఖ్య ద్వారా హాంగ్ కాంగ్ తెలుగు ప్రజలకు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.తన ప్రసంగంలో, తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు హాంకాంగ్‌లోని తెలుగు వారిలో ఒక అనుబంధ భావన మరియు సంబంధాన్ని సృష్టించడం ముఖ్యోద్దేశంగా సంస్థ ప్రయాణం మరియు దాని లక్ష్యం గురించి ప్రతిబింబించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మరియు సమాజానికి తిరిగి ఇవ్వడం యొక్క ప్రాముఖ్యతను ఆమె యెంతో అవసరం అని చెప్పారు. హాంకాంగ్ మరియు భారతదేశంలోని వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.వినోదాత్మక స్కిట్ వైవిధ్యమైన ప్రదర్శనలను సజావుగా అనుసంధానించింది, ప్రేక్షకుల హర్షధ్వానాలు - కరతాళధ్వనులతో సాంస్కృతికోత్సవం ముగిసింది. ప్రదర్శలిచ్చిన కళాకారులను కాన్సల్ శ్రీ కూచిభొట్ల వెంకట్ రమణ గారు పురస్కరాలు అందజేస్తూ అభినందించారు.హాంకాంగ్‌లోని తెలుగు సమాజం శ్రీ విశ్వవాసు నామ ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్నందున, తెలుగు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తూ సాంప్రదాయ ఉగాది పచ్చడితో, తెలుగు భోజనంతో వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమం సమాజం యొక్క ఐక్యత, సేవా స్ఫూర్తికి నిదర్శనం, స్నేహం మరియు సేవా బంధాలను పెంపొందించడం, ఆనందం, విజయం మరియు సద్భావనతో నిండిన సంవత్సరాన్ని వాగ్దానం చేయడం మరియు తెలుగు ప్రజల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడం తార్కాణం.అధ్యక్షురాలు తన కృతజ్ఞతా ప్రసంగంలో,గౌరవనీయులైన అతిథులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, సమాఖ్య సభ్యులు, స్నేహితులు మరియు తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు.

డల్లాస్‌లో నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమం
అమెరికాలో సామాజిక బాధ్యత పెంచే కార్యక్రమాలను నాట్స్ తరచూ చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని డల్లాస్‌లోని ఫ్రిస్కో నగరంలో చేపట్టింది. డల్లాస్ నాట్స్ విభాగం ఆధ్వర్యలో ప్రిస్కోలోని మోనార్క్ పార్క్‌లో 50 మందికి పైగా నాట్స్ సభ్యులు, తెలుగు విద్యార్ధులు పాల్గొని పార్క్‌ని శుభ్రం చేశారు. ప్రకృతిని కాపాడేందుకు, శుభ్రతను ప్రోత్సహించేందుకు అడాప్ట్ ఎ పార్క్ వంటి కార్యక్రమాలు ఎంతో మేలును కలిగిస్తాయని, పార్కులను శుభ్రంగా ఉంచడం వల్ల పర్యావరణ హితమైన జీవనశైలికి మార్గం సుగమం అవుతుందని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు నాట్స్ చేపట్టిన ఈ సామాజిక సేవా కార్యక్రమం ద్వారా విద్యార్ధుల సేవను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత తమ విలువైన సమయాన్ని వినియోగించి పార్కును శుభ్రపరిచారు. చెత్తను తొలగించారు. చెట్లకు నీరు పట్టారు ప్రకృతి పరిరక్షణకు తోడ్పడ్డారు. విద్యార్ధులకు ఇది ఒక సామాజిక బాధ్యతగా మాత్రమే కాకుండా, భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించే గొప్ప అనుభవంగా మిగులుతుందని డల్లాస్ చాప్టర్ వ్కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాయింట్ ట్రెజరర్ రవి తాండ్ర, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సత్య శ్రీరామనేని, నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ మీడియా రిలేషన్స్ కిషోర్ నారె, నాట్స్ సభ్యులు శివ మాధవ్, బద్రి, కిరణ్, పావని, శ్రీ దీపిక, ఉదయ్, వంశీ, వీరా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! రేపటి తరంలో సామాజిక బాధ్యత పెంచే అడాప్ట్ ఎ పార్క్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన డల్లాస్ చాప్టర్ జట్టుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి తమ అభినందనలు తెలిపారు. జూలై 4,5,6 తేదీల్లో టంపాలో జరిగే 8 వ అమెరికా తెలుగు సంబరాలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారంతా తరలిరావాలని కోరారు.

30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన
గత మూడు దశాబ్దాల సత్ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.....“విశ్వావసు” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా వంగూరు ఫౌండేషన్ ఎంపిక చేసి విజేతల వివరాలను ప్రకటించింది. అలాగే విజతలకు శాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, వంగూరి చిట్టెన్ రాజు అభినందనలు తెలిపారు.వంగూరు ఫౌండేషన్ ప్రకటనఅమెరికా, కెనడా, భారత దేశం, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఖతార్, చెకొస్లొవేకియా, అబుదాభి, బోస్ట్వానా, దుబై తదితర ప్రాంతాల నుండి ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. చేయి తిరిగిన రచయితలు, ఔత్సాహిక రచయితలూ అనేక మంది ఈ పోటీ కాని పోటీలో పాల్గొనడం సంతోషంగా ఉంది. అన్ని రచనలకూ సర్వ హక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలు, ప్రచురణకి అర్హమైన రచనలూ కౌముది.నెట్, సిరిమల్లె. కామ్ మొదలైన పత్రికలలో ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! అందుబాటులో ఉన్న విజేతల నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు ఏప్రిల్ 13, 2025 నాడు శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక, హైదరాబాద్ లో నిర్వహించబడుతున్న "అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం" లో ఆహూతుల సమక్షంలో బహూకరిస్తాం.30వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలుప్రధాన విభాగం – 30వ సారి పోటీఉత్తమ కథానిక విభాగం విజేతలు“కాంతా విరహగురుణా”- పాణిని జన్నాభట్ల, Boston, MA,)“నల్లమల్లె చెట్టు” - గౌతమ్ లింగా (Johannesburg, South Africa)ప్రశంసా పత్రాలు‘లూసఫర్’ -నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్), Tampa, FL‘తెలివి’ - మురళీశ్రీరాం టెక్కలకోట, Frisco, TXఉత్తమ కవిత విభాగం విజేతలు“వర్ణాక్షరం” - గౌతమ్ లింగా, (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా)“కృత్రిమ మేధా వికూజనము” – స్వాతి శ్రీపాద (Detroit, MI)ప్రశంసా పత్రాలు“డయాస్పోరా ఉగాది పచ్చడి”- సావిత్రి మాచిరాజు, Edmonton, Canada“చెప్పిన మాట వింటా!”- అమృత వర్షిణి, Parker, CO, USA“మొట్టమొదటి రచనా విభాగం” -17వ సారి పోటీ“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు‘ప్రత్యూష రాగం -కైలాస్ పులుగుర్త’ – హైదరాబాద్,“మనో నిశ్చలత” – సీతా సుస్మిత, మద్దిపాడు గ్రామం,ఒంగోలు - ప్రశంసా పత్రం“మంకెన పూలు” -సుజాత గొడవర్తి, ఆశ్వాపురం, తెలంగాణా - ప్రశంసా పత్రం"నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు“ఇంకెంత కాలమని?” కరిపె రాజ్ కుమార్, ఖానాపూర్, నిర్మల్ జిల్లా, తెలంగాణా “వర్షాగమనానికి ఆశగా ఎదురుచూసే ప్రకృతిని హృద్యంగా, కొంత కరుణాత్మకంగా వర్ణించే కవిత”“అచ్చం నాలానే” -మళ్ళ కారుణ్య కుమార్, అమ్మవారి పుట్టుగ (గ్రామం), శ్రీకాకుళం“వయసు ఒక అనిరిర్ధారిత సంఖ్య” - ప్రొఫెసర్ దుర్గా శశికిరణ్ వెల్లంచేటి, Bangalore, India-
క్రైమ్

వన్ వే.. సెల్‌ఫోన్ డ్రైవింగ్
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎదురుగా వస్తున్న చెరువుమట్టి టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూరు నుంచి చెరువు మట్టిని రంగాపూర్ ఇటుకబట్టీకి తరలిస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. 27మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత కొందరిని ఇళ్లకు పంపించారు. కండక్టర్ కూకట్ల శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌కు తరలించారు.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే ప్రమాదంపెద్దపల్లిలోని శాంతినగర్ నుంచి అప్పన్నపేట వరకు రాజీవ్ రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. వాహనాలను వన్ వే లో నడిపిస్తున్నారు. బస్సు డ్రైవర్ నాగేందర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగిందని కమాన్‌పూర్ ప్రాంత ప్రయాణికుడు సదయ్య తెలిపాడు. ప్రమాదంలో 27మంది గాయపడగా 22 మంది మహిళలే ఉన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెండ్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశం పర్యవేక్షించారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలుపెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణీకులకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్షతగాత్రులు వారి బంధువులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ మరో 10 మంది వైద్యబృందం అందుబాటులో ఉంటూ బాధితులకు మెరుగైన సేవలందిస్తారని పేర్కొన్నారు.

వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు.

విశాఖలో కీచక ముఠా! 30 మంది యువతులకు మత్తు మందు ఇచ్చి..
విశాఖపట్నం, సాక్షి: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఈ 11 నెలలకాలంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. అదే సమయంలో విశాఖ నేరాలమయంగా మారిపోయింది. తాజాగా.. నగరంలో మ్యారేజ్ బ్యూరో పేరిట అరాచకాలకు పాల్పడుతున్న ఓ ముఠా గట్టు రట్టయ్యింది. యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతుండడమే కాకుండా.. ఆపై బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యవహారం ఓ బాధితురాలు ముందుకు రావడంతో వెలుగు చూసింది. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం వివరాల్లోకి వెళ్తే.. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ యాప్ పేరిట ఓ ముఠా పెళ్లికాని అమ్మాయిల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేయడంతో పాటు వీడియోలు తీస్తోంది. సాక్షి టీవీతో బాధితురాలుఅలా ఇప్పటిదాకా 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారని తెలిపిందామె. గర్భం దాల్చిన తననూ అబార్షన్ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరించిందని ఆమె పోలీసులను ఆశ్రయించింది. అయితే.. ఈ విషయంలో పోలీసుల నుంచి కూడా తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది. ఆ ముఠాను ఆగడాలను కట్టడి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుకుంటోంది. ఈ వ్యవహారంపై, యువతి చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

అవసరాలకు అప్పు ఇచ్చి.. భార్యను లొంగదీసుకున్నాడు..
మహబూబాబాద్: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భార్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సాయిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కాగా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు.
వీడియోలు


కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తమిళనాడు సీఎం ఘాటు వ్యాఖ్యలు


టీడీపీ నేతల ఓవర్ యాక్షన్.. పేర్నినాని ఫైర్


మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కేసులు పై భూమన రియాక్షన్


తమిళ హీరోలే కావాలి అంటున్న లక్కీ భాస్కర్ డైరెక్టర్...


కుట్రలు, కుతంత్రాలతో.. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం


ఎగుమతులు పెరిగినా తీరని ఆక్వా రైతుల వెతలు


ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి సర్కార్ నెరవేర్చడం లేదు


TTD గోవుల మృతిపై కోర్టులో కేసు వేస్తా


తివిక్రమ్ ని రిజెక్ట్ చేస్తున్న హీరోలు


మ్యారేజ్ బ్యూరో పేరుతో యువతులకు వల వేసిన కేటుగాళ్లు