
రామసత్యనారాయణ, వీవీ వినాయక్
సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా నటించిన చిత్రం ‘రహస్యం’. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించారు. సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘రహస్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది.
సినిమా కూడా మంచి విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘కొత్త కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. రహస్యం ఏంటి? అన్నది తెరపైనే చూడాలి. వినాయక్‌గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు సాగర శైలేశ్.