
శ్రీ రితిక
‘‘విజయాలు అపజయాలతో సంబంధం లేకుండా నిరంతరం సినిమాలు నిర్మిస్తుంటారు రామసత్యనారాయణగారు. ఏక కాలంలో రెండు, మూడు సినిమాలు నిర్మించే ఆయన చిన్న నిర్మాతలకు ఆదర్శం’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా సాగర శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రహస్యం’. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించారు.
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం 3వ ట్రైలర్‌ను రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సాగర్ శైలేష్ షార్ట్ ఫిలిమ్స్ చాలా తీసాడు. నాకు ‘రహస్యం’ ట్రైలర్ బాగా నచ్చింది. మంచి టీమ్ కుదిరింది కాబట్టే సినిమా ఔట్‌పుట్ సూపర్‌గా వచ్చింది’’ అన్నారు. ‘‘సరికొత్త కథతో తెరకెక్కిన చిత్రమిది. సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. డిసెంబర్ 14న సినిమాను రిలీజ్ చేయాలనుకుం టున్నాం’’ అన్నారు తుమ్మలపల్లి రామసత్య నారాయణ.