VV Vinayak
-
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?
కుశాల్ రాజు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఎంఎస్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్లో డా. లతా రాజు నిర్మిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ కొట్టగా..మల్లిడి వశిష్ట ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మల్లిడి కృష్ణ మాట్లాడుతూ.. '2012లో నా జర్నీ మొదలైంది. ఎన్నోమలుపులు తిరిగి మీ ముందుకు డైరెక్టర్‌గా వచ్చాను. లత గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి మంచి నిర్మాత దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఇదొక స్కైఫై డ్రామా మూవీ. ఓటీటీల యుగంలో ఇలాంటి కథను ఎంచుకోవాలంటే ధైర్యం ఉండాలి. రాబోయే ఈవెంట్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడిస్తా' అని చెప్పారు. హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ..'నా దర్శకుడు కృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను హీరోగా పరిచయం చేయడం కోసం మా అమ్మ లత చాలా కేర్ తీసుకున్నారు. వీవీ వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్, మా టీమ్ మొత్తానికి బిగ్ థ్యాంక్స్' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో జగపతి బాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
ఊరమస్ కథతో వస్తున్న వినాయక్ & వెంకీ
-
డైరెక్టర్ వినాయక్ అనారోగ్యంపై రూమర్స్.. ఇదీ అసలు నిజం
టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, క్రిటికల్ కండీషన్ లో ఉన్నారని సోషల్ మీడియాలో నిన్నంత ఒక న్యూస్ వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని చెబుతూ ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ఆస్కార్ ఉత్తమ చిత్రం ఓ బోల్డ్ మూవీ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)'ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా, వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని మనవి. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొంటాం' అని వినాయక్ టీమ్ చెప్పారు.తాజాగా 'దిల్' టీమ్ అంతా అంటే నిర్మాత దిల్ రాజు, అప్పుడు సినిమాకు రైటర్స్ గా పనిచేసిన సుకుమార్, వాసువర్మ, డాలీ తదితరులు డైరెక్టర్ వినాయక్ ఇంట్లో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో వినాయక్ కాస్త బక్కగా ఉన్నట్లు కనిపించడంతో, అనారోగ్యం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
ఈ ఫొటోలో నలుగురు డైరెక్టర్స్.. ఎవరో కనిపెట్టారా?
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త దర్శకులు వస్తూనే ఉంటారు. అలా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సుకుమార్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అవునా అని ఆశ్చర్యపోకండి. ఇంతకీ ఏంటా సినిమా?స్వతహాగా సుకుమార్ లెక్కల మాస్టర్. కానీ సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత వివి వినాయక్ దగ్గర 'దిల్' సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఈ మూవీ నిర్మించిన దిల్ రాజు.. సుకుమార్ ని 'ఆర్య'తో డైరెక్టర్ గా పరిచమయ్యాడు. (ఇదీ చదవండి: కథ కనిపెట్టు.. ఈ బైక్ గిఫ్ట్ పట్టు: హీరో కిరణ్ అబ్బవరం)పైన ఫొటో విషయానికొస్తే.. దర్శకుడు వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు కాకుండా మిగతా వారిలో సుకుమార్ గురించి మనకు తెలుసు. వాళ్లు కాకుండా దర్శకులు వాసువర్మ (జోష్ సినిమా), డాలీ (గోపాల గోపాల సినిమా), రచయిత వేమారెడ్డి ఉన్నారు.చాన్నాళ్ల తర్వాత 'దిల్' టీమ్ అంతా ఇలా డైరెక్టర్ వివి వినాయక్ ఇంట్లో కలిశారు. ఈ సందర్భంగా నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. అదికాస్త వైరల్ అవుతోంది. ఇదే టైంలో వినాయక్ ఇలా అయిపోయారేంటి అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవిపై ఫేక్ న్యూస్.. ఏమైంది?) -
యాక్షన్.. కట్.. ఓకే.. చెప్పెదెప్పుడు?
ఓ సినిమా విజయం అనేది డైరెక్టర్ల కెరీర్‌ని నిర్ణయిస్తుంది అంటారు. హిట్టు పడితే వరుస ఆఫర్లు వస్తాయి. అదే ఫ్లాపులొస్తే కెరీర్‌కి బ్రేకులు పడతాయి. నెక్ట్స్ చాన్స్ ఇచ్చే హీరో ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండానూ అవకాశాలు దక్కుతాయనుకోండి. కానీ కారణం ఏదైనా ప్రస్తుతం కొందరు దర్శకులు మాత్రం ఏ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు. వాట్ నెక్ట్స్? అనే ప్రశ్నకు జవాబు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.ఆ వివరాల్లోకి వెళదాం... కృష్ణవంశీ పేరు చెప్పగానే కుటుంబ కథా చిత్రాలు గుర్తొస్తాయి. బంధాలు, బంధుత్వాలు, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారాయన. అంతేకాదు... సమాజంలోని ప్రస్తుత పరిస్థితులు, వాస్తవ ఘటనల నేపథ్యంలోనూ సినిమాలు రూపొందిస్తుంటారు కృష్ణవంశీ. తొలి సినిమా ‘గులాబీ’ నుంచి గత ఏడాది తెరకెక్కించిన ‘రంగ మార్తాండ’ వరకూ మధ్యలో ‘నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, గోవిందుడు అందరివాడేలే’...’ ఇలా పలు హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు కృష్ణవంశీ. కాగా 2017లో వచ్చిన ‘నక్షత్రం’ తర్వాత దాదాపు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నారాయన. ఆ తర్వాత వచ్చిన ‘రంగమార్తాండ’ (2023) సినిమా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించి, కన్నీరు పెట్టించింది. ఆ చిత్రం తర్వాత కృష్ణవంశీ ప్రాజెక్టుపై ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. సో... నెక్ట్స్ ఏంటి? అంటే వెయిట్ అండ్ సీ. ఒకప్పుడు కమర్షియల్ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన పూరి జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్ వేటలో ఉన్నారు. ‘బద్రి, ఇడియట్, పోకిరి, దేశ ముదురు, చిరుత, బుజ్జిగాడు, బిజినెస్‌మేన్, టెంపర్, పైసా వసూల్, ఇస్మార్ట్ శంకర్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకున్నారు పూరి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత ఆయన్ని హిట్ వరించలేదు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘లైగర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్‌గా వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక΄ోయింది. దీంతో నెక్ట్స్ పూరి జగన్నాథ్ ్ర΄ాజెక్ట్ ఏంటి? ఏ హీరోతో ఆయన సినిమా చేయనున్నారు? వంటి ప్రశ్నలకి జవాబు లేదు. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు ఆయన హిట్స్ ఇచ్చారు. ప్రస్తుతం వారంతా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు పూరి జగన్నాథ్‌కి డేట్స్ ఇచ్చే వీలు లేదు. ఇలాంటి సమయంలో ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో ΄ాటు ప్రేక్షకుల్లో నెలకొంది. సరైన కథ, కాంబినేషన్ కుదిరితే మళ్లీ ఆయన బౌన్స్ బ్యాక్ అవడం కష్టమేమీ కాదు. మాస్ సినిమాలు తీయడంలో వీవీ వినాయక్ శైలి ప్రత్యేకం. హీరోలకు మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలోనూ ఆయనకి ఆయనే సాటి. అలాగే కమర్షియల్ సినిమాలకు కొత్త విలువలు నేర్పిన దర్శకుడిగా వినాయక్‌కి పేరుంది. ‘ఆది, చెన్నకేశవ రెడ్డి, దిల్, ఠాగూర్, బన్ని, లక్ష్మి, యోగి, కృష్ణ, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారాయన. అయితే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ (2017) సినిమా హిట్ తర్వాత వినాయక్ తీసిన ‘ఇంటెలిజెంట్’ (2018) సినిమా నిరాశపరచింది. ఆ చిత్రం తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు వినాయక్. ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో హిందీలో ‘ఛత్రపతి’ (2023) పేరుతోనే రీమేక్ చేశారు. ఆ తర్వాత ఆయన్నుంచి కొత్త ్ర΄ాజెక్ట్ ప్రకటన ఏదీ రాలేదు. ఆ మధ్య ‘దిల్’ రాజు నిర్మాతగా వీవీ వినాయక్ హీరోగా ఓ సినిమా రానుందంటూ వార్తలు వచ్చాయి. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌ని సైతం మార్చుకున్నారు వినాయక్. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి ఇప్పుడు వినాయక్ ప్రయాణం డైరెక్టర్‌గానా? నటుడిగానా? అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. కల్యాణ్‌రామ్ హీరోగా రూపొందిన ‘అతనొక్కడే’ (2005) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు సురేందర్ రెడ్డి. ‘కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి’ వంటి విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారాయన. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఏజెంట్’(2023) సినిమా భారీ అంచనాలతో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేక΄ోయింది. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే మూవీపై ఇప్పటివరకూ ఒక్క ప్రకటన కూడా వెలువడలేదు. ఫలానా హీరోతో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుందనే టాక్ కూడా ఇప్పటివరకూ ఎక్కడా వినిపించలేదు. మరి... ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు జవాబు రావాలంటే వేచి ఉండాలి. ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007) మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు వంశీ పైడిపల్లి. తెలుగులో ఇప్పటివరకూ ఆయన తీసింది ఐదు చిత్రాలే అయినా (మున్నా, బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి) అన్నీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘మహర్షి’ (2019) సినిమా తర్వాత ఆయన మరో తెలుగు సినిమా చేయలేదు. విజయ్ హీరోగా తమిళంలో ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) సినిమా చేశారు. ఈ చిత్రం విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆయన తర్వాతి ్ర΄ాజెక్టుపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. ఆ మధ్య షాహిద్ కపూర్ హీరోగా వంశీ ఓ బాలీవుడ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. తెలుగు సినిమాలని డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసే గోల్డ్ మైన్ అనే సంస్థ ఈ ్ర΄ాజెక్టును నిర్మించనుందని, ఆగస్టులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్తలు వినిపించినా ఈ ్ర΄ాజెక్టు ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. మరి వంశీ పైడిపల్లి తర్వాతి చిత్రం టాలీవుడ్లోనా? బాలీవుడ్లోనా? లేకుంటే మరో భాషలో ఉంటుందా? అనేది చూడాలి. దర్శకుడు పరశురాం ‘గీతగోవిందం’ (2018) సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాదు... హీరో విజయ్ దేవరకొండని వంద కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లారు పరశురాం. ఆ సినిమా హిట్ అయినా నాలుగేళ్లు వేచి చూశారాయన. ఆ తర్వాత మహేశ్‌బాబు హీరోగా ‘సర్కారువారి ΄ాట’ (2022) సినిమా తీసి, హిట్ అందుకున్నారు. అనంతరం విజయ్ దేవరకొండ హీరోగా‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం తీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా రిలీజై ఆర్నెళ్లు దాటినా పరశురాం తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. గతంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించినా ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ‘ఫ్యామిలీ స్టార్’ నిర్మించిన నిర్మాత ‘దిల్’ రాజు బ్యానర్లోనే పరశురామ్ మరో సినిమా చాన్స్ ఉందని టాక్. మరి ఆయన నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేది వేచి చూడాలి. ఇరవయ్యేళ్ల ప్రయాణంలో ఏడు సినిమాలు తీశారు దర్శకుడు మెహర్ రమేశ్. వాటిలో రెండు కన్నడ సినిమాలున్నాయి. ఆయన తీసిన ఐదు తెలుగు చిత్రాలు ‘కంత్రి, బిల్లా, శక్తి, షాడో, బోళా శంకర్’. వెంకటేశ్‌తో తీసిన ‘షాడో’ (2013) తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు మెహర్ రమేశ్. అయితే ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత చిరంజీవి రూపంలో అదృష్టం ఆయన్ని వరించింది. ‘బోళా శంకర్’ సినిమా చేసే మంచి అవకాశం ఇచ్చారు చిరంజీవి. 2023 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా రిలీజై ఏడాదికి పైగా అయినప్పటికీ తన తర్వాతి సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరి.. మెహర్ రమేశ్ నెక్ట్స్ మూవీ ఏంటి? వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే... 2021న విడుదలైన నితిన్ ‘చెక్’ మూవీ తర్వాత డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తర్వాతి సినిమాపై ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ‘అన్నీ మంచి శకునములే’ (2023) తర్వాత దర్శకురాలు నందినీ రెడ్డి నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనేదానిపై క్లారిటీ లేదు. అదే విధంగా ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఫేమ్ అజయ్ భూపతి ‘మంగళవారం’ (2023) సినిమా రిలీజై దాదాపు ఏడాది కావస్తున్నా ఆయన తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. కాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పెదకాపు 2’ ఉంటుందని చిత్రయూనిట్ గతంలో ప్రకటించినా ఇప్పటివరకూ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సినిమా విడుదలై ఏడాది దాటి΄ోయినా ఆయన తర్వాతి సినిమా ఏంటి? అనేదానిపై ఎలాంటి ప్రకటన లేదు. అదే విధంగా ‘ఘాజీ’ మూవీ ఫేమ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పైనా ఎలాంటి అప్డేట్ లేదు. ఆయన తెరకెక్కించిన ‘ఐబీ 71’ (2023) అనే హిందీ చిత్రం రిలీజై ఏడాదిన్నర దాటినా తర్వాతి సినిమా టాలీవుడ్లో ఉంటుందా? బాలీవుడ్లో ఉంటుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.– డేరంగుల జగన్ -
చిరంజీవి 'ఠాగూర్' వల్ల మా బతుకు నాశనం: ప్రముఖ డాక్టర్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో 'ఠాగూర్' ఓ క్లాసిక్. మరీ ముఖ్యంగా ఇందులో హాస్పిటల్ సీన్‌కి అయితే సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఇదే సన్నివేశం వల్ల డాక్టర్ల బతుకులు సర్వనాశనం అయిపోయాయని ప్రముఖ డాక్టర్ గురవారెడ్డి అంటున్నారు. డాక్టర్లని ఆ సన్నివేశంలో అత్యంత దారుణంగా చూపించారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడుతూ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు.(ఇదీ చదవండి: అల్లు స్నేహా అట్లతద్ది పూజ.. ఇది ఎందుకు చేస్తారంటే?)'ఆ సీన్ ఎవరు రాశారో తెలీదు గానీ వైద్య వృత్తికి చాలా నష్టం చేకూర్చారు. చెప్పాలంటే అది వరస్ట్ సీన్. అది చూసిన ఎవరైనా సరే పేషెంట్స్‌ని డబ్బుల కోసమే డాక్టర్లు ఐసీయూలోకి తీసుకెళ్తారని అనుకుంటారు. పొరపాటున పేషెంట్ చనిపోతే, దానికి తాము కారణం కాదని వైద్యులు నిరూపించుకోవాల్సిన పరిస్థితి''చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్. ఆయనతో చాలాసార్లు కలిసి భోజనం కూడా చేశారు. ఓ సందర్భంగా 'ఠాగూర్' సీన్ గురించి చెప్పా. డాక్టర్లకి మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పాను. అయితే అది ఇంకా దారుణంగా ఉందట. చిరంజీవిగారే దాన్ని కాస్త మార్పు చేశారు' అని డాక్టర్ గురవారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: దీపావళికి థియేటర్లలో అరడజను సినిమాలు.. కానీ!) -
డైరెక్టర్ వి.వి.వినాయక్ బర్త్‌డే.. విషెస్ చెప్పిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
'సుమోలు' అనగానే గుర్తొచ్చేది వివి వినాయక్.. ఇప్పుడేం చేస్తున్నారు? (ఫొటోలు)
-
డైరెక్టర్ వివి వినాయక్‌కు మేజర్ సర్జరీ
ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. కొన్ని నెలలుగా కాలేయానికి సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకున్నారని నెట్టింట ఒక వార్త వైరల్ అవుతుంది. కాలేయానికి సంబంధించి వినాయక్‌కు మేజర్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన ఆయన నుంచి రాలేదు. -
విశ్వంభరతో వినాయక్
చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్‌కి వెళ్లారు దర్శకుడు వీవీ వినాయక్. దాదాపు 20 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్’ (2003) చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్నుంచీ చిరంజీవి–వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉంది. సోమవారం ‘విశ్వంభర’ సెట్‌కి వెళ్లిన వినాయక్ చిత్రదర్శకుడు వశిష్ఠకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
కృష్ణ జయంతి.. మిస్ అవుతున్నా నాన్నా అంటూ మహేశ్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనపేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. తన నట ప్రస్థానంతో, సాధించిన అవార్డులతో అభిమానుల మనసు ఉప్పొంగేలా చేశారు. నేడు (మే 31) కృష్ణ 81వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని గుర్తు చేసుకుని మహేశ్‌బాబు భావోద్వేగానికి లోనయ్యాడు.మిస్ అవుతున్నా..హ్యపీ బర్త్‌డే నాన్నా.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. కానీ నువ్వు నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటావు అంటూ కృష్ణ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.అవి గుర్తు చేసుకుంటేమరోవైపు డైరెక్టర్ వివి వినాయక్.. కృష్ణతో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. అసిస్టెంట్‌గా, సహ దర్శకుడిగా కృష్ణగారి నాలుగు సినిమాలకు పని చేశాను. ఆయనతో పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటుంది. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) Forever in our hearts, forever a legend 💫 Today, we honour the eternal legacy of Superstar Krishna Garu 🎬 May his invaluable contributions to Indian cinema continue to inspire generations.#SSKLivesOn pic.twitter.com/kRewKGtp18— AMB Cinemas (@amb_cinemas) May 31, 2024 -
సాంబ లాంటి సినిమా తీయకూడదు అనుకున్న: వివి వినాయక్
-
రామ్ చరణ్ డబ్బుల విషయంలో ఎంత సీరియస్ గా ఉంటారంటే..!
-
నాకు డైరెక్ట్ గా లైఫ్ ఇచ్చింది ఆయనే..!
-
మంచి కథతో పెదకాపు రూపొందింది
‘‘పెదకాపు 1’ ట్రైలర్ చాలా బాగుంది. రవీందర్ రెడ్డిగారు తన బావమరిదిని, పైగా కొత్త హీరోని పెట్టి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా తీసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ విడుదల చేయగా, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ– ‘‘పెదకాపు’ మా యూనిట్‌కి మరపురాని చిత్రంగా నిలిచి, ‘పెదకాపు 2’కి ప్రస్థానం కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సినిమా మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను’’ అన్నారు మిర్యాల రవీందర్ రెడ్డి. ‘‘నాకింత మంచి కథ ఇచ్చిన శ్రీకాంత్, నిర్మించిన రవీందర్ రెడ్డిగార్లకు రుణపడి ఉంటా’’ అన్నారు విరాట్ కర్ణ. కెమెరామేన్ ఛోటా కె. నాయుడు పాల్గొన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన వివి వినాయక్
-
డైరెక్టర్ వివి వినాయక్ సినిమాల్లో తన నటన గురించి
-
వివి వినాయక్ తన ఫ్లాప్ మూవీ గురించి ఎమోషనల్..!
-
ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాకు ఎందుకు పని చేయలేదు..?
-
ఠాగూర్ సీక్వెల్ పై వివి వినాయక్ గొప్ప మాటలు
-
విజయనిర్మల ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న శరణ్
శరణ్‌కుమార్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘సాక్షి’. జాన్వీర్ కౌర్ హీరోయిన్. శివకేశన కుర్తి దర్శకత్వంలో ఆర్యూ రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో మునగాల సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం జూలై 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– 'విజయనిర్మలగారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, శరణ్తోపాటు చిత్ర యూనిట్‌కి మంచి పేరు రావాలి' అన్నారు. 'సాక్షి’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది' అన్నారు శరణ్. 'యూనిట్ సభ్యులందరూ బాగా సహకరించారు' అన్నారు శివ. 'ప్రేక్షకులు మా చిత్రాన్ని విజయవంతం చేయాలి' అన్నారు సుధాకర్‌రెడ్డి, ఆర్యూ రెడ్డి. -
'ఏజెంట్' డిజాస్టర్.. సురేందర్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనా!
టాలీవుడ్ దర్శకుల్లో వివి వినాయక్‌ది ప్రత్యేక శైలి. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డ్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, దిల్, ఠాగూర్, లక్ష్మీ, సాంబ, బన్నీ, బద్రినాథ్, అదుర్స్, అఖిల్, ఖైదీ నంబర్150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2018లో వచ్చిన ఇంటలిజెంట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. తాజాగా హిందీ ఛత్రఫతి రీమేక్ డిజాస్టర్ కావడంతో వినాయక్ పనైపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?) అయితే సరిగ్గా అదే కోవలోకి మరో డైరెక్టర్ చేరిపోయాడు. అఖిల్ ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. అతనొక్కడే చిత్రం ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సురేందర్..కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి హిట్ చిత్రాలు అందించారు. ఊసరవెల్లి, అతిథి, కిక్-2, సైరా లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ మూవీపై ఎవరితో అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించిన సురేందర్ రెడ్డికి ఇప్పుడు యంగ్ హీరోలే మిగిలారు. తాజాగా మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే సురేందర్ రెడ్డి సినిమాకు ఫైనాన్స్ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి వచ్చిందని సినీవర్గాల టాక్. ఏదేమైనా టాలీవుడ్లో సురేందర్ రెడ్డి మరో వి.వి. వినాయక్ అవుతాడా అనే విషయంపై చర్చ నడుస్తోంది. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) -
రాజమౌళి, ప్రభాస్ ఎంట్రీతో పూర్తిగా మారిపోయిన హిందీ ఛత్రపతి లెక్కలు
-
ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు: వీవీ వినాయక్
‘నేటి యువతలో చాలామంది తెలుగు ‘ఛత్రపతి’ (2005) సినిమాను చూసి ఉండరు. వారికి హిందీ రీమేక్ ‘ఛత్రపతి’ (2023) ఫ్రెష్‌గా ఉంటుంది. ఇక అప్పట్లో ‘ఛత్రపతి’ని చూసినవారు తెలుగు ‘ఛత్రపతి’ సినిమాను పాడు చేయకుండా బాగా తీశారని అనుకుంటారు. లొకేషన్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తగా ఉంటాయి. ఓ ప్రాపర్ హిందీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి ) ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో జయంతి లాల్ గడ నిర్మించిన ఈ సినిమా మే 12న హిందీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో సాయి హీరోగా నటించిన సినిమాలు హిందీలో అనువాదమై, మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ కోసం తను ఫిజిక్ బాగా మెయిన్టైన్ చేశాడు. హిందీ నేర్చుకున్నాడు. ఇంట్రవెల్, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్‌లో సాయి నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. (చదవండి: ఆ ఓటీటీలోకి రానున్న ది కేరళ స్టోరీ! ) ఈ చిత్రంతో సాయి బాలీవుడ్లో హీరోగా నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. రీమేక్ అంటే కొన్ని ఐకానిక్ షాట్స్‌ను టచ్ చేయకపోవడమే మంచిది. మేమూ అదే చేశాం. ఇక యాక్టింగ్ పరంగా ప్రభాస్‌కు, సాయికి పోలికలు వద్దు. అయితే ‘ఛత్రపతి’ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు సాయి న్యాయం చేశాడని మాత్రం చెప్పగలను. హిందీ ‘ఛత్రపతి’ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాను కేవలం హిందీ భాషలోనే రిలీజ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘మాస్ పల్స్ తెలిసిన దర్శకుల్లో వీవీ వినాయక్‌గారు ఒకరు. తెలుగులో ‘అల్లుడు శీను’తో మా అబ్బాయి (బెల్లంకొండ సాయి)ని ఇంట్రడ్యూస్ చేసిన వినాయక్‌గారు హిందీలోనూ పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయవచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాను హిందీ భాషలోనే ఆడియన్స్‌కు చూపిద్దామన్నారు వినాయక్‌గారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణసంస్థ మా అబ్బాయితో సినిమా నిర్మించడం నాకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. -
ఈ నెలలోనే ఛత్రపతి
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఛత్రపతి’. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకి వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. నుష్రత్ బరుచ్చా హీరోయిన్గా నటించారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛత్రపతి’ (2005)ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో పెన్ స్టూడియోస్‌పై ధవల్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘‘తెలుగు ‘ఛత్రపతి’ సినిమా బ్యాక్‌డ్రాప్‌ని మార్చి, యాక్షన్ ఎంటర్టైనర్గా హిందీ ‘ఛత్రపతి’ని తెరకెక్కించారు వినాయక్. శ్రీనివాస్ రగ్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించాడు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నిజార్ అలీ షఫీ, సంగీతం: తనిష్క్ బాగ్చి, వరల్డ్ వైడ్ విడుదల: పెన్ మరుధర్ సినీ ఎంటర్టైన్మెంట్. -
కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా: వివి వినాయక్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్‌కు మాజీ మంత్రి కొడాలి నాని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ వివి వినాయక్ చెప్పారు. ఏపీలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు వివి వినాయక్ మాట్లాడుతూ.. 'అందరూ కళకళలాడుతున్నారు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ప్రతీ సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించాను. ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ఈ ఏడాది మార్చిలో నేను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుంది. హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తా. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. కొడాలి నాకెంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు నేను సిద్ధం' అని వివి వినాయక్ చెప్పారు. చదవండి: (అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!) -
ఆయన అభిమానుల్లో నేనూ ఒకణ్ణి
‘‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక క్రేజ్. ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను కూడా ఒకణ్ణి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంతమంది కాంబినేషన్ అయినా సెట్లో కూల్‌గా ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకున్నాను. ఆయన గోల్డెన్ డేస్‌ని ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ రిపీట్ చేస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ వీవీ వినాయక్. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో సోహైల్, మృణాళిని జంటగా నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఎస్వీ కృష్ణారెడ్డి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘అల్లసాని వారి అల్లిక..’ అనే పాటని సి. కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వినాయక్ విడుదల చేశారు. ఈ పాటని శ్రీమణి రచించగా, శ్రీకృష్ణ, హరిణి ఆలపించారు. ఈ సందర్భంగా కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ– ‘‘కల్యాణ్‌గారి సహకారంతో ఆయన భార్య కోనేరు కల్పన నిర్మాతగా నా సమర్పణలో ఈ సినిమా నిర్మించే అవకాశం రావడం హ్యాపీ’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ అరిటాకులో వడ్డించిన అచ్చ తెలుగు భోజనం’’ అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ–‘‘నా గత చిత్రాల్లోని అన్ని అంశాలను.. అంతకు మించి ఈ చిత్రంలో పొందుపరిచి ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాం’’ అన్నారు. -
‘లవ్ యూ రామ్’లో స్ఫూర్తి, సందేశం రెండూ ఉన్నాయి
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ జంటగా నటించిన చిత్రం‘లవ్ యూ రామ్’. దర్శకుడు దశరథ్ కథ అందించిన ఈ సినిమాకు డీవై చౌదరి దర్శకత్వం వహించారు. దశరథ్, డీవై చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘దశరత్ నాకు మంచి మిత్రుడు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న డీవై చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ తొలి సినిమా విజయం సాధించాలి’ అన్నారు. ‘నా పాతికేళ్ల మిత్రుడు చౌదరితో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’అన్నారు కే. దశరథ్. ‘ఈ తరానికి కావాల్సిన సందేశం, స్పూర్తి ఈ సినిమాలో ఉన్నాయి’ అన్నారు డీవై చౌదరి. ‘ఈ సినిమా నాకు స్పెషల్’ అన్నారు రోహిత్. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా, డి. నేగేశ్వర్రావు. -
వారాహి అమ్మవారి నేపథ్యంతో...
‘సుబ్రహ్మణ్యపురం’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి కాంబినేషన్లో ‘వారాహి’ మూవీ షురూ అయింది. జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ఏడుగురు దేవతామూర్తుల్లో వారాహి అమ్మవారు ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మవారి ఆలయ నేపథ్యంలో డిఓషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ– ‘‘సంతోష్ ఈ కథ చెప్పగానే చప్పట్లు కొట్టాను. మా కాంబినేషన్లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా మంచి స్క్రిప్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్, సహనిర్మాత: కేఆర్ ప్రదీప్. -
బెల్లంకొండ గణేష్ 'నేను స్టూడెంట్ సర్' టీజర్ విడుదల
బెల్లంకొండ గణేష్, అవంతిక జంటగా నటింన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. కృష్ణచైతన్య కథ, స్క్రీన్ ప్లేతో రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శనివారం ఈ సినివ టీజర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘టీజర్ బాగుంది. ఈ సినిమాతో గణేష్‌కు మరో విజయం దక్కాలి. ‘నాంది’ వంటి సినిమాను నిర్మించిన సతీష్ వర్మ సంస్థలో గణేష్ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు రాఖీతో పాటు చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేయడం సంతోషంగా అనిపింంది. అయితే ఆ సినిమా రిలీజ్ కాక ముందే నన్ను నమ్మి, ‘నేను స్టూడెంట్ సర్’ను నిర్మింన సతీష్‌గారికి ధన్యవాదాలు. ఈ కథలో మంచి కంటెంట్ ఉంది. అందుకే యాక్సెప్ట్ చేశాను’’ అన్నారు గణేష్. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘నాంది’ సక్సెస్ అయ్యింది. ‘నేను స్టూడెంట్ సర్’లో కూడా మంచి కంటెంట్ ఉంది’’ అన్నారు సతీష్ వర్మ. ‘‘గణేష్ కథతో పాటే ట్రావెల్ చేస్తారు. సతీష్గారిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు రాఖీ. -
ఆసక్తికరంగా ‘హలో మీరా’ ట్రైలర్
గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా. ఈ చిత్రానికి శ్రీనివాస్ కాకరాల కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా ట్రైలర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేస్తూ ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2 నిమిషాల 26 సెకనుల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తి మరింత పెంచేశారు మేకర్స్. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. -
వి.వి.వినాయక్ శిష్యుడి తొలి మూవీకి స్పందన
వివి. వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమైన చిత్రం గీత. హెబ్బా పటేల్ కథానాయికగా, సునీల్ ముఖ్యపాత్రలో నటించగా "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా చేసిన సాయి కిరణ్ విలన్‌గా నటించారు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. తొలి చిత్రంతోనే ఎంతో ప్రతిభ కనబర్చిన విశ్వకు చాలా మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు పలువురు దర్శకులు. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి సైతం విశేష ప్రశంసలు అందుకుంటున్న "గీత" సినిమాను తెలుగు దర్శకుల సంఘం సభ్యుల కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన దర్శకులు చిత్ర నిర్మాత ఆర్.రాచయ్య, దర్శకుడు విశ్వలపై ప్రశంసల వర్షం కురిపించారు. అప్పట్లో గ్లామర్ రోల్స్‌కు పరితమైన రాధతో "ఆత్మబంధువు" చిత్రం తీసి మెప్పించిన భారతీ రాజా కోవలో... గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ నుంచి అద్భుత నటన రాబట్టుకున్నారని కొనియాడారు. దర్శకుడు విశ్వను శాలువాతో సత్కరించి పూల మొక్కను కానుకగా ఇచ్చారు. దర్శకత్వ శాఖలో తలలు పండిన ఎందరో మేధావులు "గీత" చిత్రాన్ని ఇంతగా మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న విశ్వ... తొలి ప్రయత్నంలో దొర్లిన తేలికపాటి తప్పులు రెండో చిత్రంలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. తన గురువు వి.వి.వినాయక్, తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత ఆర్.రాచయ్యలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు. చదవండి: కొత్త ఫ్లాట్ కొన్న బుల్లితెర నటి యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: ఆమె భర్త ఏమన్నాడంటే? -
గీత రిలీజ్ డేట్ ఫిక్స్.. వివి వినాయక్ శిష్యుడే దర్శకుడు
గ్రాండ్ మూవీస్" పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం "గీత". దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. "మ్యూట్ విట్నెస్" అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ "తన శిష్యుడు విశ్వకు ఈ సినిమ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాగా ఈ సినిమాలో హెబ్బా పటేల్ టైటిల్ రోల్లో నటించగా, సునీల్ కీలక పాత్రలో నటించారు. "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావులు కీలక పాత్రలు పోషించారు. -
పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’.. ఫస్ట్ లుక్, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్
నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా తెరకెక్కిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్యప్రాతలో నటించారు. ఈ సినిమా ద్వారా శివమ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్‌కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ఎమోషనల్ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. 'శివమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్యాన్సర్‌పై పోరాటంపై ఉంటుంది. క్రియేటివ్ యూనిక్ గా ఉంది. అలాగే సీనియర్ నటుడు శివ కృష్ణ సినిమా మీద ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి. ఈ చిత్రంలో నటించిన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు. (చదవండి: న్యాచురల్ స్టార్ 'దసరా' అప్డేట్.. ఊరమాస్ లుక్‌లో నాని) నటుడు శివ కృష్ణ మాట్లాడుతూ... 'నా కెరీర్ లో చాలా మంది దర్శకులతో పని చేశా. కానీ వీవీ వినాయక్ అంత కూల్ పర్సన్‌ను నేను ఇంత వరకు చూడలేదు. ఆయనతో పనిచేయడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి రావడం సంతోషం' అని అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్ పాయింట్. 32 ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్' అని అన్నారు. -
25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్
‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆదరించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇస్తాను. నవంబర్ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
నటుడు సింహా ప్రధాన పాత్రలో ‘రావణ కల్యాణం’
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రావణ కల్యాణం’. ఆలూరి సురేష్, సింహా సమర్పణలో జేవీ మధుకిరణ్ దర్శకత్వంలో అరుణ్ కుమార్ సూరపనేని, కె. రేష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా శనివారం ఆరంభమైంది. తొలి సీన్‌కి యాక్టర్ సత్యదేవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, సింహా తనయుడు అర్జున్ సింహా క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. సింహా మాట్లాడుతూ.. ‘‘రావణ కల్యాణం’ కథ విన్నప్పుడు నేనెంత ఎగై్జట్ అయ్యానో, థియేటర్స్‌లో ఆడియన్స్ చూస్తున్నప్పుడు అంతే ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సందీప్ మాధవ్, రాజేంద్రప్రసాద్, శత్రు, శరత్ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. రధన్ సంగీతం, మనోహర్ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ‘‘పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు కిరణ్. -
‘దిల్వాలా’ సినిమాకు క్లాప్ ఇచ్చిన డైరెక్టర్ వీవీ వినాయక్
నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి జంటగా వీరభద్రం చౌదరి దర్శకత్వంలో ‘దిల్ వాలా’ సినిమా షురూ అయింది. నబీ షేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు అలీ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. హీరో ‘అల్లరి’ నరేష్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కి అందించారు. ‘‘మా నిర్మాతలు నబీ షేక్, తూము నర్సింహాగారు తొలి సినిమాగా ‘దిల్వాలా’ని నా దర్శకత్వంలో చేయడం హ్యాపీ. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు వీరభద్రం. ‘‘మొదటిసారి ‘దిల్వాలా’ లాంటి ఒక కమర్షియల్ సినిమా చేయబోతున్నా’’ అన్నారు నరేష్ అగస్త్య. ‘‘క్రైమ్ కామెడీ జోనర్లో ‘దిల్ వాలా’ ఉంటుంది’’ అన్నారు నబీ షేక్. రాజేంద్ర ప్రసాద్, దేవ్ గిల్, అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: అనిత్. -
తెలుగమ్మాయిలు హీరోయిన్గా పనికిరారా? అని లయ ఏడ్చేసింది
హీరోయిజానికి ఫ్యాక్షనిజం యాడ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన డైరెక్టర్ వీవీ వినాయక్. తొలి సినిమా ఆదితోనే పవర్ఫుల్ హిట్ అందుకున్నాడాయన. ఆ వెంటనే బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. అయితే ఇందులో టబు పాత్రకు సౌందర్యను, దేవయాని పాత్రకు లయను అనుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'టబు పాత్రకు సౌందర్యను అడిగాను. అయితే ఆమె ఓల్డ్ పాత్ర అప్పుడే వద్దని తిరస్కరించింది. టబును అడగ్గానే ఆమె ఒప్పేసుకుంది. దేవయాని పాత్రకు స్వయంవరం హీరోయిన్ లయను అడిగాను. ఆమె వెంటనే కళ్లనీళ్లు పెట్టుకుంది. చెల్లెలి పాత్రకే ఎందుకు అడుగుతారు? తెలుగమ్మాయిలు హీరోయిన్గా పని చేయరా? అని ఏడ్చేసింది. మీ ముఖం అమాయకత్వంగా ఉంది కాబట్టి ఈ రోల్ కోసం అడిగానని చెప్పాను. కానీ ఆమె మాత్రం ఎందుకండీ అలా చూస్తారు? హీరోయిన్గా ఎందుకివ్వరు? అని ప్రశ్నించింది. నేను సారీ చెప్పి వచ్చేశా. తర్వాత దేవయానిని అడగ్గానే ఒప్పుకుంది. సినిమాలో తల్లి, చెల్లెలి పాత్రలు సెలక్ట్ చేసుకోవడం చాలా కష్టం' అని చెప్పుకొచ్చాడు వినాయక్. చదవండి: నయనతారకు వాంతులు, ఎనీ గుడ్‌న్యూస్ అంటున్న ఫ్యాన్స్! చై టాటూకి, సమంతతో ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా? -
నిర్మాతగా మారిన డైరెక్టర్.. వీవీ వినాయక్‌తో లోగో ఆవిష్కరణ
VV Vinayak Launched Sri Ishta Kameswara Creations Logo: ‘ప్రేమంటే సులువు కాదురా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చందా గోవిందరెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ అనే నూతన నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్ లోగోని దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘నా చేతుల మీదుగా శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ అంచలంచెలుగా ఎదిగి, టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలి’’ అని తెలిపారు. ‘‘మా ఇలవేల్పు శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి పేరిట బ్యానర్ స్థాపించడం హ్యాపీ. తొలి చిత్రంగా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ని రూపొందించనున్నాను. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను’’ అని చందా గోవిందరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కె.సాగర్, ‘రఫ్’ చిత్ర డైరెక్టర్ సుబ్బారెడ్డి, సీనియర్ కో–డైరక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. -
భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
Yash Raraju Movie Trailer Launched By VV Vinayak: ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సంతు: స్ట్రయిట్ ఫార్వార్డ్’. మహేశ్ రావు దర్శకుడు. ఈ సినిమాను సుబ్బారావు తెలుగులో ‘రారాజు’గా జూన్ ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ – ‘‘పాతికేళ్లుగా పద్మావతి పిక్చర్స్‌పై సుబ్బారావుగారు ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు యశ్ కేజీఎఫ్‌కు ముందు చేసిన ఈ సినిమాను తెలుగులో 'రారాజు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ‘‘యాక్షన్ ప్రధానాంగా సాగే చిత్రమిది. యశ్, ఆయన భార్య రాధిక పండిట్ కలిసి నటించారు. కన్నడంలో హిట్ సాధించినట్లే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించారు. ఈ మూవీ హరికృష్ణ సంగీతం అందించగా, ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రెండు సీన్లు చూసి ఆ సినిమాను ఎక్కువ రేటుకు కొన్నారు
Shikaaru Movie Trailer: ‘‘నా ‘ఆది’ సినిమా అప్పుడు జస్ట్ రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయనకు జడ్జిమెంట్ బాగా తెలుసు. బాబ్జీని ఒప్పించి, దర్శకుడు హరి ఈ సినిమా చేయడం గొప్ప విషయం. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరున్న బాబ్జీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో హరి కొలగాని దర్శకత్వంలో పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ ప్రధాన తారలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్ ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘చక్కని కామెడీతో హరిగారు ఈ సినిమాని తెరకెక్కించారు. శేఖర్ చంద్ర చక్కని బాణీలు సమకూర్చారు’’ అన్నారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది’’ అని తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ అన్నారు. -
డైరెక్టర్ అవతారం ఎత్తిన హీరో.. షూటింగ్ ప్రారంభం
కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ లోవ, లక్ష్మి కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం `ఓసీ`. కిరణ్ &విష్ణు దర్శకులు. విష్ణు శరణ్ బొంపల్లి నిర్మాత. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సెన్సేషనల్ డైరక్టర్ వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ముని రాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కిరణ్ లోవ మాట్లాడుతూ...`` నేను నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న చిత్రానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గారు వచ్చి క్లాప్ కొట్టడం మా తొలి సక్సెస్ గా భావిస్తున్నాం. ఇప్పటి వరకు నేను తెలుగు, తమిళ భాషల్లో కలిపి హీరోగా 18 చిత్రాలు చేశాను. `ఓసీ` చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా డైరక్షన్ కూడా చేస్తున్నా. నా పద్దెనిమిదేళ్ల అనుభవంతో ఈ చిత్రాన్ని ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా రూపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తాను'' అని పేర్కొన్నారు. -
ఉదయ్‌శంకర్ సినిమా.. క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్
ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరో, హీరోయిన్లుగా ఓ చిత్రం ప్రారంభమైంది. డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫస్ట్ క్లాప్ ఇచ్చి టీంకి శుభాకాంక్షలు తెలిపారు. ఆద్యాత్మిక గురువు శ్రీరామ్ కెమెరా స్విచ్ఛాన్ చేసి ఆశిస్సులు అందించారు.ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆత్మీయ అతిథిగా విచ్చేసి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో మధునందన్, పృధ్వీరాజ్ , శ్రీకాంత్ అయ్యాంగార్ కీలక పాత్రల పోషిస్తున్నారు.దర్శకుడు గురు పవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి నారాయణరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఒకేసారి రెండు సినిమాలు గొప్ప విషయం: వీవీ వినాయక్
‘‘ఒకేసారి రెండు సినిమాలను నిర్మిస్తూ ఇద్దరు దర్శకులకు అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం. జీవీ నాయుడు నిర్మిస్తున్న ఈ రెండు చిత్రాలు గొప్ప విజయాలు సాధించాలి’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. వీఆర్‌జీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న రెండు సినిమాల ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. వీఆర్‌జీఆర్ ప్రొడక్షన్స్‌లో తొలి సినిమాగా ఫిల్మీ గ్యాంగ్స్టర్స్ దర్శకత్వంలో ఓ హారర్ సినిమాను గొంగటి వీరాంజనేయ నాయుడు (జీవీ నాయుడు) నిర్మించనున్నారు. అలాగే మహేశ్ గంగిమళ్ల దర్శకత్వంలో జీవీ నాయుడు నిర్మిస్తున్న మరో చిత్రానికి ‘యూజ్‌ఫుల్ ఫెలోస్’ అనే టైటిల్ పెట్టారు. ఈ రెండు చిత్రాల ముహూర్తపు సన్నివేశాలకు దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. అడిషనల్ సెక్రటరీ కాళీ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఐఏఎస్ ఆఫీసర్ టి. చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ రెండు చిత్రాలతో కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు జీవీ నాయుడు. -
సినిమా ఏంటో పోస్టరే చెబుతోంది: వీవీ వినాయక్
‘‘పంచనామ’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతోంది. ఈ సినిమాని ఎంత కసిగా చేశారో పోస్టరే చెబుతోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ లీడ్ రోల్స్‌లో సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంచనామ’. గద్దె శివకృష్ణ, వెలగ రాము నిర్మించారు. వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా ‘పంచనామ’ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ను వీవీ వినాయక్ విడుదల చేశారు. ‘‘మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది’’ అన్నారు సిగటాపు రమేష్ నాయుడు. వెంప కాశీ, వినాయక్ -
'గీత' ఫస్ట్ లుక్ విడుదల.. గురువుకు తగ్గ శిష్యుడని ప్రశంస
Geetha Movie First Look Poster Released By VV Vinayak: ‘‘గీత’ సినిమా ఫస్ట్ లుక్ బాగుంది. నా శిష్యుడు విశ్వ దర్శకుడిగా, నా మిత్రుడు రాచయ్య నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి. యూనిట్‌కి మంచి పేరు రావాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. కుమారి 21F ఫేమ్ హెబ్బా పటేల్ టైటిల్ రోల్, సునీల్ ముఖ్యపాత్ర చేసిన చిత్రం ‘గీత’. ‘మ్యూట్ విట్నెస్’ (మూగ సాక్ష్యం) అన్నది ఉప శీర్షిక. ‘నువ్వే కావాలి, ప్రేమించు’ సినిమాల ఫేమ్ సాయికిరణ్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. డైరెక్టర్ వీవీ వినాయక్ శిష్యుడు విశ్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని వినాయక్ విడుదల చేశారు. రాచయ్య మాట్లాడుతూ ‘‘గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా విశ్వ ‘గీత’ చిత్రాన్ని తెరకెక్కించాడు. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొచ్చాయి’’ అన్నారు. ‘‘గీత’ సినిమా అవకాశం మా గురువు వినాయక్‌గారే ఇప్పించారు. రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అన్నారు విశ్వ. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్ అందించగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్. చిన్నా, కెమెరా: క్రాంతికుమార్.కె. -
నా శిష్యుడు 'విశ్వ' విజేత కావాలి: వి.వి.వినాయక్
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘గీత’.‘మ్యూట్ విట్నెస్’ అన్నది ఉప శీర్షిక. ‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ప్రముఖ నటుడు సనీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్‌గా పరిచయం అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపుగా పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ.. తన శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతున్న "గీత' ఘన విజయం సాధించాలని, తన మిత్రుడు రాచయ్య నిర్మాతగా రాణించాలని అభిలాషించాడు. . ఈ చిత్రంలో పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ సినిమా అవకాశం తన గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారని, నిర్మాత రాచయ్యగారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు విశ్వ పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న హిందీ "ఛత్రపతి" పనులతో తలమునకలుగా ఉన్నప్పటికీ... తమ మీద ప్రత్యేకమైన అభిమానంతో "గీత" చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వినాయక్ గారికి నిర్మాత ఆర్.రాచయ్య కృతజ్ఞతలు తెలిపారు. గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా డైరెక్టర్ విశ్వ... "గీత" చిత్రాన్ని అత్యద్భుత ప్రణాళికతో రూపొందించారని పేర్కొన్నారు. రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి, తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా. -
భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’
సాక్షి,భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి బీచ్‌లో శుక్రవారం షూటింగ్ సందడి నెలకొంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో అదే పేరుతో తీస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, బెల్లంకొండ సురేష్ నిర్మాత. హీరోయిన్ ముసరత్ బంచా, హీరో తల్లిగా భాగ్యశ్రీ నటిస్తుండగా ఇంకా శరత్ ఖేలేఖర్, రాజేష్‌శర్మ, రాంజేంద్ర గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 10 వరకు ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తారు. వినాయక్‌ను కలిసిన మంత్రి ముత్తంశెట్టి షూటింగ్లో ఉన్న దర్శకుడు వినాయక్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్ తనకు మంచి మిత్రుడని తెలిపారు. స్వయం కృషితో గొప్ప దర్శకునిగా ఎదిగారని భీమిలిలో జరిగే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆయనకు హిందీలో తొలి సినిమా అని అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని గుర్తింపు పొందుతారని అన్నారు. చదవండి: Allu Arjun-Priyamani: ప్రియమణిపై ‘హాట్’ కామెంట్స్ చేసిన బన్నీ -
బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న తెలుగు డైరెక్టర్లు
హిందీ దర్శకులు తెలుగులో సినిమాలు చేయడం చాలా అరుదు. తెలుగు దర్శకులు హిందీకి వెళ్లడం కూడా అరుదే. అయితే ఇప్పుడు ఒకేసారి ఐదుగురు దర్శకులు హిందీ చిత్రాలు చేస్తున్నారు. హిందీ పరిశ్రమ మనవాళ్లకు ‘స్వాగ్ సే స్వాగత్’ పలికింది. అంటే... ఆత్మీయ స్వాగతం పలికింది. ఆ ఆహ్వానం అందుకున్న దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగులో వీవీ వినాయక్ స్టార్ డైరెక్టర్. దాదాపు 20 ఏళ్లుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నారు. తొలి సినిమా ‘ఆది’ (2002)తోనే ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న వీవీ వినాయక్ ఆ తర్వాత ‘దిల్’(2003), ‘ఠాగూర్’(2003), ‘బన్నీ’(2005), ‘కృష్ణ’ (2008) ‘అదుర్స్’ (2010), ‘ఖైదీ నంబరు 150’ (2017) వంటి హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు హిందీ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ఆయన దర్శకుడిగా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఇటు సాయి శ్రీనివాస్‌కు కూడా హిందీలో ‘ఛత్రపతి’యే తొలి సినిమా కావడం విశేషం. ఇక ‘అర్జున్‌రెడ్డి’ (2017) సక్సెస్‌తో డైరెక్టర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కభీర్ సింగ్’ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్‌లోనూ నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు సందీప్. మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డు సాధించి ఇండస్ట్రీ దృష్టిని వెంటనే తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కూడా బీ టౌన్ దర్శకుల లిస్ట్‌లో చేరారు. విద్యుత్ జమాల్ హీరోగా‘ఐబీ 71’ అనే స్పై థ్రిల్లర్‌ను తీయనున్నారు సంకల్ప్. జాతీయ అవార్డు సాధించిన మరో తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కూడా హిందీకి హాయ్ చెబుతున్నారు. ‘మళ్ళీ రావా’(2017) వంటి ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల మెప్పు పొందిన గౌతమ్ 2019లో నానీతో తీసిన ‘జెర్సీ’కి జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం షాహిద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అయ్యింది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరియే దర్శకుడు. ఈ ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వక్ సేన్ ‘హిట్’ (2020) చిత్రంతో దర్శకుడిగా హిట్టయ్యారు శైలేష్ కొలను. తెలుగు ప్రేక్షకులు ‘హిట్’ చేసిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలనుయే డైరెక్టర్. ఇందులో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. ప్రముఖ సంగీత దర్శకులు యం.యం. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా పరిచయమైన చిత్రం ‘మత్తువదలరా’ (2019)తో దర్శకుడిగా పరిచయమయ్యారు రితేష్ రాణా. ఈ చిత్రం హిందీ రీమేక్‌తో దర్శకుడుగా రితేష్ బీ టౌన్లో అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు మరికొంతమంది టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్‌కు డైరెక్షన్ మార్చారు. ఇదిలా ఉంటే.. ఈ దర్శకులందరూ హిందీలో డైరెక్ట్ సినిమా ద్వారా పరిచయమవుతుంటే, ప్యాన్ ఇండియన్ సినిమాల ద్వారా మరికొందరు హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారు. -
రేపే ‘ఛత్రపతి’ రీమేక్ స్టార్ట్, ముఖ్య అతిథిగా రాజమౌళి
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 2005లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. పెన్ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కునున్న ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హజరుకానుండటం విశేషం. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం శ్రీనివాస్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి మరింత ఫిట్‌గా అయ్యాడు. మాస్ లుక్‌తో బెల్లంకొండ మరి హిందీ ఆడియన్స్ మెప్పిస్తాడో లేదో చూడాలి. -
పవన్ కల్యాణ్ సినిమా : కీలక పాత్రలో వీవీ వినాయక్
‘ఠాగూర్’, ‘ఖైదీ నం. 150’, ‘నేనింతే’వంటి చిత్రాల్లో దర్శకుడు వీవీ వినాయక్ నటుడిగా కనిపించారు. అయితే ఇవి పెద్ద నిడివి ఉన్న పాత్రలు కాదు. ఆయన హీరోగా ఆ మధ్య ‘శీనయ్య’ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి పక్కన పెడితే తాజాగా వినాయక్ మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌లో నటిస్తున్నారు. పవన్ కల్యాణ్, రానా హీరోలుగా ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వీవీ వినాయక్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. లాక్‌డౌన్‌కు ముందు జరిగిన ఈ సినిమా షూటింగ్లో వినాయక్ పాల్గొన్నారు. మరోవైపు వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించనున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి మూవీ మేకర్స్‌కు భారీ నష్టం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ రీమేక్ చిత్రం ‘ఛత్రపతి’ మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు రీమేక్ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి కోసం మేకర్స్ హైదరాబాద్‌లో 6 ఎకరాల స్థలంలో ఓ భారీ విలేజ్ సేట్ వేశారట. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాతలకు ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాల కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పడు షూటింగ్ కోసం వేసిన ఈ భారీ విలేజ్ సేట్ ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినట్లు సమాచారం. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే మేకర్స్‌కు 3 కోట్ల నష్టం రావడం నిజంగా బాధించే విషయమే. ఇక ఈ సెట్ సినిమాకు చాలా కీలకం కానుండటంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు దీనిని పున:నిర్మించే ఆలోచనలో పడ్డారట. ఈ వర్షాలు తగ్గిన వెంటనే తిరిగి సెట్‌ను నిర్మించే పనులు చేపట్టాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్ -
పవన్ సినిమాలో మెరవనున్న స్టార్ డైరెక్టర్!
టాలీవుడ్ దర్శకుల్లో చాలా మంది అప్పుడప్పుడు వెండితెరపై మెరుస్తుంటారు. ఏదో ఒక సన్నివేశాల్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. అలాంటి వాళ్లల్లో ముందుంటారు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్. వీలున్నప్పుడల్లా వెండి తెరపై ప్రత్యక్షమవుతూ తనలోని నటుడిని బయటపెడుతుంటాడు. గతంలో అలా 'ఠాగూర్', 'ఖైదీ నెంబర్ 150' వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. తాజాగా ఆయన మరో చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం. అది ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా కాకపోవడం ఒక విశేషం అయితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కావడం మరో విశేషం. మలయాళం సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో వీవీ వినాయక్ కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగులో కూడా ఆయన ఇటీవల పాల్గొన్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్లో ఆయనపై చిత్రీకరణ జరిగినట్టు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేను సమకూర్చడంతో పాటు మాటలు కూడా రాస్తున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- వివి వినాయక్
-
తంగేడు పువ్వు
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక నిర్మించారు. టి.డి. ప్రసాద్‌వర్మ దర్శకత్వం వహించారు. యం.యం. శ్రీలేఖ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలోని ‘తంగేడు పువ్వు...’ పాటను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిర్మల్ బొమ్మల నేపథ్యంలో లవ్‌స్టోరీని తెరకెక్కించారు ప్రసాద్‌వర్మ. హీరో అనురాగ్‌కి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. చిత్రనిర్మాణ సారధి కృష్ణకుమార్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే విడుదలైన ‘కొట్టుకొట్టు..’ అనే సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘తంగేడు పువ్వు...’ పాటకు కూడా మంచి పేరు వస్తుందనుకుంటున్నా. ఈ పాట రాసిన అనంత్ శ్రీరామ్‌కి, పాట పాడిన శ్రుతికి అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సమర్పకులు శ్రీనివాస్ రెడ్డి, యం.యం. శ్రీలేఖ, హీరో అనురాగ్, దర్శకుడు టి.డి. ప్రసాద్‌వర్మ, రాథోడ్ రాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
వినాయక్ చేతుల మీదుగా చెక్‌మేట్ ట్రైలర్
నట కిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చెట్‌మేట్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పై ప్రసాద్ వెలంపల్లి దర్శక నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, సందీప్, విష్ణుప్రియ, దీక్షపంత్, బ్రహ్మనందం, రఘుబాబు, షకలక శంకర్ కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్ ఆవిష్కరించిన సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్ చాలా బాగుంది .నేటి యువత అభిరుచులకు అద్దం పడుతూ అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలతో సినిమా వుంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. రాజేంద్రప్రసాద్,బ్రహ్మానందం,రఘుబాబు,కృష్ణ భగవాన్ వంటి సీనియర్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు ప్రసాద్ నాకు మంచి మిత్రుడు.అతను చేసిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’అని తెలిపారు. దర్శక నిర్మాత ప్రసాద్ వెలంపల్లి మాట్లాడుతూ.. ‘నేటి సమాజంలో యూత్ ముఖ్యంగా అమ్మాయిలు.. వాళ్లకు ఏదైనా సమస్య వస్తే డైర్యంగా ఆసమస్య ను పరిష్కరించుకోలేక, ఆ సమస్యను ఎవరికి చెప్పుకోలేక అత్మ హత్యలు చేసుకుంటున్నారు. అలా కాకుండా సమస్యను దైర్యం గా పరిష్కరించుకోవాలి అనే పాయింట్‌తో నలుగురు వ్యక్తులు వాళ్లకు వచ్చిన సమస్యలను వాళ్ళు ఎలా దైర్యం గా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాము. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రఘుబాబు మిగతా అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. సినిమా అందరికీ నచ్చే విధంగా భారీ స్టార్ కాస్ట్‌తో, మలేషియా సింగపూర్లలోని బ్యూటిఫుల్ లోకేషన్స్‌లో తెరకెక్కించాం. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ట్రైలర్ రిలీజ్ చేసి మా చిత్రాన్ని తన సినిమాగా మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్న వినాయక్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గరుడ వేగ అంజి, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్: మహతి, ఎడిటర్: క్రాంతి, లిరిసిస్ట్: రెహమాన్, కో ప్రొడ్యూసర్: కే.కామేశ్వర్. -
కరోనాకు మందు కనిపెట్టిన స్టార్ డైరెక్టర్!
కరోనాకు సంబంధించి సామాజిక భాద్యతగా చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు వీడియోలు ద్వారా తమ అభిమానులకు జాగ్రత్తలు చెప్పారు. వ్యాధినిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని, వ్యాయమం చేయాలని కొంత మంది చెప్పగా, సెలబ్రెటీలందరూ మాస్క్ పెట్టుకోమని, సామాజిక దూరం పాటించాలని, చేతులు కడుక్కోవాలని చెప్పారు. ఇదిలా వుండగా దర్శకుడు వివి వినాయక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఓ ఇంజెక్షన్ గురించి మాట్లాడాడు. కరోనాకు ఆ ఇంజెక్షన్ తో చెక్ పెట్టడం సాధ్యమౌతుందేమో అనే అనుమానం వ్యక్తంచేశాడు. దీనికి సంబంధించి వివి వినాయక్ ఒక వీడియోను విడుదల చేశారు. వినాయక్ తెలిపిన ఇంజెక్షన్ ఎల్లో ఫీవర్ అనే వ్యాధి రాకుండా ఇచ్చే ఇంజెక్షన్.దీని గురించి ఆయన మాట్లాడుతూ, "ఓసారి కెన్యా వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాలంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ తీసుకునే క్రమంలో ఎల్లో ఫీవర్ లక్షణాల్ని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు కరోనా లక్షణాలుగా ఏవైతే చెబుతున్నారో.. సరిగ్గా అవే లక్షణాలు ఎల్లో ఫీవర్ లో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎల్లో ఫీవర్ కోసం నేను వేయించుకున్న ఇంజెక్షన్ కరోనాకు పనిచేస్తుందేమో అని నా అనుమానం." అని వీవీ వినాయక్ అన్నారు. (ఆగిపోయిన వినాయక్ ‘సీనయ్య’?) ఇదిలా వుండగా ఈ మధ్య కరోనా నివారణకు సంబంధించి ఇద్దరు వైద్యులు మాట్లాడుకున వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కరోనా వైరస్ శరీరంలో ఎలా వ్యాపిస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఉన్నాయి. ఆ ఆడియో క్లిప్ విన్న వినాయక్ వాళ్లకు తన ఆలోచన చేరాలనే ఉద్దేశంతోనే వీడియో షేర్ చేసినట్లు తెలిపారు. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి ఆ వైద్యులకు చెప్పడమే తన ఉద్దేశమని వినాయక్ తెలిపారు. అది ఏమైనా కరోనా నివారణకు పనికొస్తుందేమో ఒకసారి పరీక్షించాలని వినాయక్ కోరారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్) -
సినీ కార్మికులకు చేయూత
నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ఆధ్వర్యంలో కరోనా కాలంలో ఇప్పటికే వేలాదిమందికి వంట సరుకులు ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా 230 మంది సినీ కార్మికులు, నిరుపేదలకు మంతెన వెంకట రామరాజువారి ‘వసుధ ఫౌండేషన్’ ద్వారా ఆర్థికసాయం అందించారు. దర్శకులు వీవీ వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాదంబరి కిరణ్ చేస్తున్న నిస్వార్థ సేవకు తమ వంతుగా మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో ‘మనం సైతం’ కు ‘వసుధ ఫౌండేషన్’ చేయూత అందిస్తోందని మంతెన వెంకట రామరాజు అన్నారు. అనంతరం పూనమ్ కౌర్ చేతుల మీదుగా ‘మనం సైతం’ కార్యాలయం వద్ద మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బీబీజీ రాజు, ‘మనం సైతం’ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కథే ప్రాణం
అల్లు వంశీ, ఇతీ ఆచార్య జంటగా నటిస్తున్న చిత్రం ‘పసివాడి ప్రాణం’. ధన్‌శ్రీ ఆర్ట్స్ పతాకంపై ఎన్.ఎస్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లిరికల్ ఆడియో సాంగ్‌ను దర్శకులు కోదండరామిరెడ్డి, వీవీ వినాయక్‌లతో కలిసి నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్. మూర్తి మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రం ‘పసివాడి ప్రాణం’. మోషన్ క్యాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన 3డీ, 2డీ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. 2డీ బేబి, 3డీ టెడ్డీ బేర్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ సినిమాకు కథ ప్రాణం అయితే గ్రాఫిక్స్ ఊపిరి’’ అన్నారు. -
ఆగిపోయిన వినాయక్ ‘సీనయ్య’?
దర్శకుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు వివి వినాయక్. దాదాపు అగ్రహీరోలందరితోనూ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. మరికొంతమంది నటీనటులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఈయన హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యాడు. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ చిత్రం కోసం వినాయక్ చాలానే కష్టపడ్డాడు. హీరో లుక్ కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో మరో దర్శకుడు సక్సెస్ హీరో అవబోతున్నాడంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సినిమా ఔట్పుట్, తెరకెక్కిన విధానంపై దిల్ రాజు, వినాయక్‌లు అసంతృప్తితో ఉన్నారట. అంతేకాకుండా ఈ సినిమా కథ కూడా గతంలో వచ్చిన ఓ సూపర్ డూపర్ హిట్ కథకు పోలిక ఉండటంతో రిస్క్ చేయడం ఎందుకని దిల్ రాజు భావించాడట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆపేసినట్లు టాక్. అంతేకాకుండా ఏకంగా ఈసినిమాను పక్కకు పెట్టేసినట్టు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్ అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్ -
చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. వినాయక్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతీ ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాలని వినాయక్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడంపై ప్రకృతి ప్రేమికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్ వంటి ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మరికొంతమందికి సవాల్ విసిరిన సంగత తెలిసిందే. -
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్. ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్‌కె కులపాక. -
ఖోఖో నేపథ్యంలో...
పూల సిద్ధేశ్వర్ రావ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రథేరా’. జాకెట్ రమేష్ దర్శకత్వం వహించారు. పూల సిద్ధేశ్వర్ రావ్, నరేష్ యాదవ్, వై.ఎస్.కృష్ణమూర్తి నిర్మించిన ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. సిద్ధేశ్వర్ రావ్ మాట్లాడుతూ– ‘‘ఖోఖో నేపథ్యంలో వస్తోన్న చిత్రమిది. క్రీడా నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. మా సినిమా టీజర్‌ను విడుదల చేసిన వీవీ వినాయక్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘రథేరా’ సినిమాను చూసిన కొందరు సినీ ప్రముఖులు బాగుందన్నారు. రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి అదే స్పందన వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు జాకెట్ రాకేష్. -
లవ్ అండ్ యాక్షన్
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి శుక్రవారం కొబ్బరికాయ కొట్టారు. ఇందులో నభా నటేష్ కథానాయికగా నటిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పి. కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించనున్నాం. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్రలో సాయి శ్రీనివాస్ కనిపిస్తాడు. తన కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. డిసెంబర్ 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, దుబాయ్‌లో చిత్రీకరణ జరపనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కందిరీగ’ సినిమా నుంచి సంతోష్ పరిచయం. తనతో పని చేయడం నా కుటుంబ సభ్యులతో చేసినట్టుగా ఉంది. నా గత చిత్రాలతో పోల్చితే ఇందులో కొత్త తరహా పాత్ర పోషిస్తున్నాను’’ అన్నారు. ‘‘నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సురేష్, పద్మగార్లకి ధన్యవాదాలు. ఏ మాత్రం రాజీ పడకుండా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందిస్తాం’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘సాయిశ్రీనివాస్‌తో పని చేయడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాను. నటనకి ఆస్కారం ఉన్న పాత్ర పోషించనుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు నభా నటేష్. ‘‘బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పని చేశాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అన్నారు కెమెరామేన్ డుడ్లీ. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల మాట్లాడారు. -
రెండు హృదయాల ప్రయాణం
శైలేష్, ఏయిషా అదరహా జంటగా నటించిన చిత్రం ‘శివ 143’. ది జర్నీ ఆఫ్ టు హార్ట్స్ ట్యాగ్‌లైన్. రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రంలో హీరోగా నటించి, దర్శకత్వం వహించారు శైలేష్. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలు నిర్మించటంలో రామ సత్యనారాయణది అందె వేసిన చేయి. సినిమాను ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు’’ అన్నారు. ‘‘వినాయక్‌గారు విడుదల చేసిన మా ‘రహస్యం’ చిత్రం విజయం సాధించింది. ఇప్పుడు ఆయన ట్రైలర్ విడుదల చేసిన మా ‘శివ 143’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు రామసత్యనారాయణ . ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రామసత్యనారాయణ గారికి థ్యాంక్స్. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు హీరో, దర్శకుడు శైలేష్. -
రాజా వస్తున్నాడహో...
మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రలు చేశారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ మలయాళ చిత్రం ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజా నరసింహా’ ట్రైలర్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ యాప్ట్‌గా ఉంది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి పవర్ఫుల్ యాక్షన్, జగపతిబాబు విలనిజం, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
శ్రీవిష్ణు మంచి కథలను ఎంపిక చేసుకుంటాడు
‘‘మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, ఆ కథల్లో తాను ఇన్వాల్వ్ అవుతూ కొత్త రకం సినిమాలు చేస్తున్నాడు శ్రీవిష్ణు. తను నటించిన సూపర్‌హిట్ సినిమా ‘బ్రోచేవారెవరురా’ని మూడుసార్లు చూశాను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా ‘అసుర’ చిత్ర దర్శకుడు విజయ్‌కృష్ణ. ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తిప్పరా మీసం’. శ్రీ హోమ్ సినిమాస్ సమర్పణలో రిజ్వాన్ నిర్మించారు. గ్లోబల్ సినిమాస్ ద్వారా ఈ నెల 8న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో, సినీ పరిశ్రమలో మంచి గౌరవం సంపాదించుకున్నారు శ్రీవిష్ణు. ఇకముందు కూడా ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్ చాలా బావున్నాయి’’ అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. అద్భుతమైన సినిమా. శ్రీవిష్ణు ఇంకా పెద్ద సినిమాలు చేయాలి’’ అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘చాలా దగ్గరగా నన్ను చూసిన దర్శకుడు విజయ్ నాకు నెగటివ్ క్యారెక్టరు డిజైన్ చేశాడు. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు కానీ అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. తల్లి గొప్పదనం గురించి చెప్పే చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ– ‘‘మేం చేసిన ఈ మంచి ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. శ్రీవిష్ణు పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో తల్లి పాత్రలో నటించిన రోహిణి గారికి అంతే ఇంపార్టెన్స్ ఉంది’’ అన్నారు. ‘‘నా పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు’’ అన్నారు నటి రోహిణి. రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘విజయ్ ది బెస్ట్ ఫిల్మ్‌ను ఇచ్చాడు.. సురేశ్ బొబ్బిలి సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అన్నారు. ఇంకా ఈ వేడుకలో నిర్మాత యం.ఎల్. కుమార్ చౌదరి, బెనర్జీ, అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఎక్స్ లవ్ హిట్ కావాలి
‘‘ఆర్.నారాయణమూర్తిగారికి నేను కనిపించినప్పుడల్లా ‘నువ్వు హీరోగా చెయ్యి బాసూ’ అనేవారు. నేను కూడా మొహమాటానికి చేస్తానని చెప్పేవాణ్ణి. నిజంగా తథాస్తు దేవతలు ఉన్నారేమో. హీరోగా నా సినిమా ప్రారంభమైంది. నారాయణమూర్తిగారికి థ్యాంక్స్. ‘ఆర్డీఎక్స్ లవ్’ సినిమా పోస్టర్స్ చూస్తుంటనే చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ‘ఆర్ఎక్స్ 100’ అంత హిట్ చేయాలి’’ అన్నారు వీవీ వినాయక్. ‘‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచర్ల జంటగా శంకర్ భాను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. రామ్ మునీష్ సమర్పణలో సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ లాంటి సక్సెస్ సాధించడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఆ కష్టమే నన్ను టాప్ టెన్ హీరోయిన్స్‌లో ఒకర్ని చేసింది. నా కెరీర్లో ‘ఆర్డీఎక్స్ లవ్’ ఓ మైలురాయి అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పుట్టడానికి కారణం సత్యనారాయణ, ప్రవీణ్‌లే. ముందుగా ఈ సినిమాకి ‘ట్రిపుల్ ఎక్స్ లవ్’ అనే టైటిల్ అనుకున్నాను. పాయల్ చాలా గొప్పగా నటించింది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘సినిమా ఔట్పుట్ చూసిన తర్వాత దీన్ని నేనే డైరెక్ట్ చేశానా? అనిపించింది. అంత అద్భుతంగా ఈ చిత్రం రావడానికి కారణం సి.కల్యాణ్‌గారు’’ అన్నారు శంకర్ భాను. తేజస్ కంచర్ల, నటుడు డా.వి.కె.నరేశ్, నటి తులసి, సినిమాటోగ్రాఫర్ రామ్‌ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. -
నా జీవితంలో ఇదొక మార్పు
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రంతో తొలిసారి హీరోగా మారారు. నరసింహ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకులు కె. రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆది’ సినిమాతో వినయ్(వినాయక్)తో నా ప్రయాణం మొదలైంది. మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమా వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ చేశాం. ఈ సినిమా పేరే మా ఇంటిపేరుగా మార్చేంత హిట్ సాధించింది. 1982–1984 నేపథ్యంలో సాగే కంప్లీట్ ఎమోషనల్ స్టోరీ ‘సీనయ్య’. ఈ సినిమాలో ఎవర్ని హీరోగా అడుగుదామా? అనుకుంటున్న తరుణంలో మా సంస్థలో సినిమాలు చేసిన దర్శకులు గుర్తుకువచ్చారు. ఈ కథకు వినయ్ అయితే సరిపోతాడనిపించి నరసింహతో చెప్పగానే ఎగై్జటింగ్‌గా ఫీలయ్యాడు. ఆ తర్వాత వినయ్‌కు కథ చెప్పడంతో నటిస్తా అన్నాడు. ఈ కథలో భాగమైన హరిని భవిష్యత్‌లో దర్శకుడిగా పరిచయం చేస్తా. వచ్చే ఏడాది వేసవిలో ‘సీనయ్య’ విడుదల చేస్తాం’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘రాజుగారు ఓ రోజు వచ్చి...‘నువ్వు నన్ను ‘దిల్’ రాజుని చేశావ్. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నా’ అన్నారు. నరసింహ చెప్పిన కథ నచ్చి, పాత్ర కోసం బరువు తగ్గాను. ఇప్పుడు ఎలాంటి దుస్తులైనా వేసుకోగలుగుతున్నా (నవ్వుతూ). జీవితంలో నాకు ఇదొక మార్పు’’ అన్నారు. ‘‘మంచి ఎమోషనల్ కథ ఇది’’ అన్నారు నరసింహ. దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, సి.కల్యాణ్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ, రచయిత హరి పాల్గొన్నారు. -
వీవీ వినాయక్ ‘సీనయ్య’ చిత్రం ప్రారంభం
-
‘సీనయ్య’గా వినాయక్..
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. మంగళవారం రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. అందులో వినాయక్ మెకానిక్ షెడ్లో నుంచి నడిచివస్తున్నట్టు చూపించారు. దిల్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్ర కథ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఈ సినిమాలో పాత్ర కోసం వినాయక్ బరువు తగ్గారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వినాయక్ పుట్టినరోజున(అక్టోబర్ 9) ప్రారంభం కానుంది. దర్శకుడిగా పలువురు తెలుగు హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన వినాయక్.. ఈ చిత్రంలో హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ వివి వినాయక్
-
రైతు పాత్రలో...
దర్శకుడు వీవీ వినాయక్ యాక్టర్ వినాయక్‌గా మారబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చేయబోతున్న పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్నారు. నరసింహారావు దర్శకత్వంలో వినాయక్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు నిర్మాత. 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుందని, వినాయక్ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. -
కొత్తవారితో..
పూల సిద్ధేశ్వరరావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రథేరా’. జాకట్ రమేష్ దర్శకత్వంలో వైఎస్ కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, పూల సిద్ధేశ్వరరావు నిర్మించారు. సెన్సార్ నుంచి యు సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా గురించి జాకట్ రమేష్ మాట్లాడుతూ– ‘‘వీవీ వినాయక్‌గారు విడుదల చేసిన మా సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. మంచి కంటెంట్‌తో తెరకెక్కించిన చిత్రం ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. అందరూ కొత్తవారికే ప్రాధాన్యం ఇచ్చాం. సంగీతంతో పాటు రీరికార్డింగ్‌కి మంచి ప్రశంసలు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. -
వినాయక్ సినిమా మొదలవుతోంది!
కమర్షియల్ దర్శకుడిగా ఒకప్పుడు వరుస విజయాలు సాధించన వీవీ వినాయక్ ఇటీవల కాలంలో ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే దర్శకుడిగా నిరాశపరుస్తున్న ఈ సీనియర్ డైరెక్టర్ త్వరలో కొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. వినాయక్ హీరోగా త్వరలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వినాయక్ కసరత్తులు ప్రారంభించాడు. ఈ సినిమాతో శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ప్రారంభించనున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమా కథ 1980ల కాలంగా జరుగుతుందని తెలుస్తోంది. వినాయక్ లుక్, బాడీ లాంగ్వేజ్, ఏజ్‌కు తగ్గ కథ కావటం దిల్ రాజు స్వయంగా మాట్లాడి వినాయక్ ను హీరోగా ఒప్పించారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. -
విజయశాంతిగారిలా పాయల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి
‘‘డబ్బులకోసం కాకుండా ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నారు కల్యాణ్‌గారు. ఈ కథని నమ్మి బడ్జెట్‌కి వెనకాడకుండా చాలా రిచ్‌గా ‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్ సాధింబోతున్నారు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ జంటగా శంకర్ భాను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చాలా మంచి సినిమాలు చేశాడు, కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్‌గా తనకి పెద్ద బ్రేక్ రావాలి. తేజస్, పాయల్‌కి ఈ సినిమా మంచి పేరు తేవాలి. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాతో విజయశాంతిగారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘యుక్త వయసులో జీవితాన్ని సరదాగా గడపాల్సిన టైమ్‌లో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుపక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఓ అమ్మాయి ఏ విధంగా పోరాడింది? అనేది మా చిత్ర కథాంశం. ఈ సినిమా తర్వాత పాయల్ మరో విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నా. ‘ఆర్డీఎక్స్ లవ్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నా. ఈ బ్లాస్టింగ్ హిట్‌తో కల్యాణ్‌గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపెనీ అవుతుంది’’ అని శంకర్ భాను అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన కల్యాణ్ గారికి, చక్కగా తెరకెక్కించిన శంకర్ భానుగారికి థ్యాంక్స్’’ అన్నారు తేజస్ కంచెర్ల. ‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ‘ఆర్డీఎక్స్ లవ్’ కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. విద్య పరంగా ఆలోచింపచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది. మనసును హత్తుకునే సినిమా ఇది’’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: రథన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా, సహ నిర్మాత: సి.వి. రావ్. -
మాస్.. మమ్మ మాస్?
‘ఇస్మార్ట్ శంకర్’తో ఇస్మార్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు రామ్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి మాస్ హిట్‌గా నిలిచింది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ ఏ సినిమా చేయబోతున్నాడు? అంటే పలు వార్తలు వినిపిస్తున్నాయి. ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. అలాగే వీవీ వినాయక్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇది మాస్ ఎంటర్టైనర్ అట. ముందుగా ఏ సినిమా పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. -
మరో మాస్ డైరెక్టర్‌తో రామ్!
ఇటీవల ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. గతంలో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలు మాత్రమే చేసిన రామ్, ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తరువాత రూట్ మార్చాడు. మాస్ కథల కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో మాస్ కమర్షియల్ దర్శకుడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కొంత కాలంగా తన రేంజ్‌కు తగ్గ సక్సెస్‌లు సాధించటంతో ఫెయిల్ అవుతున్న సీనియర్ దర్శకుడు వీవీ వినాయక్, రామ్ హీరోగా ఓ యాక్షన్ డ్రామాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే రామ్‌కు కథ వినిపించి ఓకె చేయించుకున్న వినాయక్, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్న వినాయక్ ఆ సినిమాకన్నా ముందే రామ్ సినిమాను పట్టాలెక్కిస్తాడా? లేక ఆ సినిమా పూర్తయ్యాక మొదలుపెడతాడా? అన్న విషయం తెలియాల్సి ఉంది. -
బాక్సాఫీస్ బద్దలయ్యే కథ
‘బాక్సాఫీస్ బద్దలయ్యేలాగా ఓ కత్తిలాంటి కథ చెబుతాను గురువుగారు’ అనే డైలాగ్‌తో విడుదలైన ‘ధమ్కీ’ టీజర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. రజిత్, త్రిషాలాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆదిలక్ష్మి, భాస్కరరావు సమర్పణలో సుంకర బ్రదర్స్ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మించారు. ఈ సినిమా టీజర్, బ్యానర్ లోగోను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సుంకర బ్రదర్స్ మా కుటుంబానికి కావాల్సిన వారు. వాళ్ల తమ్ముడికి మంచి లైఫ్ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈ బేనర్‌ని స్థాపించారు. కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిగా నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమా సుంకర బ్రదర్స్ బేనర్‌కి మంచి ఫౌండేషన్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాను’’ అన్నారు ఏనుగంటి. ‘‘సుంకర బ్రదర్స్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ చాలా బాగుంది. తప్పకుండా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు రజిత్. ‘‘మా బేనర్లో ‘ధమ్కీ’ లాంటి మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుంకర బ్రదర్స్ అభిలాష్. ఫైట్ మాస్టర్ రామ్ సుంకర పాల్గొన్నారు. శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, బిత్తిరి సత్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: దీపక్ భగవంత్, సంగీతం: ఎసి.బి ఆనంద్. -
నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు
‘‘శ్రీనివాస్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఒకప్పుడు నేను మద్రాసులో ఉండలేననుకుని, సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాను. అప్పుడు ‘నువ్విక్కడ ఉండి చాలా సాధించగలవు’ అంటూ నాలో నమ్మకాన్ని నింపాడు శ్రీనివాస్‌రెడ్డి. నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో శ్రీనవ్‌హాస్ క్రియేషన్స్, శ్రీకార్తికేయ సెల్యూలాయిడ్స్ నిర్మించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఇషా రెబ్బా, సత్యదేవ్ జంటగా శ్రీనివాస్ కానూరి నిర్మించారు. ఈ చిత్రం టైటిల్ మోషన్ పోస్టర్‌ను వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ వినగానే రేడియోలో వచ్చే వాయిస్ గుర్తొచ్చింది. శ్రీనివాస్‌రెడ్డి మంచి దర్శకుడు. మంచి స్క్రిప్ట్ దొరికితే ఎంత బాగా సినిమా తీస్తాడో చెప్పడానికి ‘ఢమరుకం’ ఓ ఉదాహరణ. ఇప్పుడు ఈ ‘రాగల 24 గంటల్లో’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’... ఇలా నా ప్రతి చిత్రం ఫస్ట్‌లుక్ కానీ, ఆడియో గానీ వినాయక్‌గారి చేతుల మీదగా విడుదల చేయించడం నాకు ఆనవాయితీ. మా నిర్మాత శ్రీనివాస్‌గారి సహకారం వల్ల మంచి అవుట్‌పుట్ వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. ‘‘ఇది నా మొదటి చిత్రం. ప్రేక్షకులందరూ మంచి సినిమా తీశావని అభినందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. ఈ చిత్రానికి కెమెరా: అంజి, ఎడిటింగ్: తమ్మిరాజు, మాటలు: కృష్ణభగవాన్, సంగీతం: రఘు కుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అలీ బాబా. -
రాజుగారి గది 3 ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వినాయక్
వినాయక చవితి సందర్భంగా ‘రాజుగారి గది 3’ ఫస్ట్ లుక్‌ని వి.వి.వినాయక్ విడుదల చేశారు. రాజుగారిగది, రాజుగారిగది 2 చిత్రాల తర్వాత ఓంకార్ దర్శకత్వంలో ఈ చిత్రంలో తెరకెక్కుతోంది. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. షబీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ని విడుదల సందర్భంగా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ... ‘రాజుగారి గది, రాజుగారి గది 2 చిత్రాల కంటే రాజుగారిగది 3 చాలా పెద్ద హిట్ కావాలి. ఓంకార్ చాలా కష్టపడి కమిట్మెంట్తో ఈ సినిమా చేస్తున్నారు. అశ్విన్ ఈ సినిమాలో తొలిసారి సోలో హీరోగా నటిస్తున్నాడు. ఓంకార్ ఓక్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీవీ రంగంలో ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ఎంత పెద్ద బ్యానర్ అయ్యిందో సినిమా రంగంలోనూ అంతే పెద్ద బ్యానర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పనిచేసిన ఛోటా కె.నాయుడు సహా యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు’ అన్నారు. దర్శక నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ... ‘రాజుగారిగది సినిమా చేసేటప్పుడు ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అప్పుడు వినాయక్ అన్నయ్య చేతుల మీదుగా వినాయకచవితిరోజునే టీజర్‌ను విడుదల చేశాం. దాని దశ మారిపోయింది. బిజినెస్ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వినాయక్ అన్నయ్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయడం ఆనందంగా అనిపించింది. రాజుగారిగది, రాజుగారిగది 2 చిత్రాల కంటే ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఛోటాగారు, గౌతంరాజుగారు, మ్యూజిక్ డైరెక్టర్ షబీర్ సహా ఇతర టెక్నీషియన్స్ అలాగే అశ్విన్, అవికా, అలీ గారు, బ్రహ్మాజీ గారు, ఊర్వశి గారు ఇలా అందరూ వారి సొంత సినిమాగా భావించి చేయడం వల్ల సినిమా చాలా బాగా వచ్చింది. అన్నీ కుదిరితే ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తాం’ అన్నారు. -
‘గాంధీ’లో వీవీ వినాయక్
గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో పనిచేసే తన మిత్రుడిని మాట్లాడించేందుకు సినీ దర్శకుడు వీవీ వినాయక్ గురువారం ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన గాంధీలో అందే సేవలను తెలుసుకున్నారు. -
ఫిట్ అవడానికే హీరోగా చేస్తున్నా
‘‘నేను హీరోగా పరిచయం చేసిన సాయి శ్రీనివాస్‌కి ‘రాక్షసుడు’ సినిమాతో హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది. తనకంటే కూడా నాకే ఎక్కువ సంతోషంగా అనిపించింది. దానికి కారణమైన రమేశ్ వర్మకి నా అభినందనలు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాక్షసుడు’. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాని అభిషేక్ నామా ఈ నెల 2న విడుదల చేశారు . ఆ సినిమా మంచి హిట్ కావడం సంతోషంగా ఉందని వినాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘రాక్షసుడు’ నిర్మాత కోనేరు సత్యనారాయణగారి అబ్బాయి హవీష్ కూడా హీరోనే. అయినా కూడా ‘రాక్షసుడు’ కథకి సాయి కరెక్ట్‌గా సరిపోతాడని, నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఓ సూపర్‌హిట్ సినిమాని సాయికి అందించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరూ రీమేక్ చేయడం చాలా ఈజీ అంటారు.. కానీ చాలా కష్టం. ‘రాక్షసన్’ తమిళ సినిమా నేను చూశా. మొదటి నుంచి చివరి వరకు ఆ సినిమా టెంపోని ఎక్కడా మిస్ అవకుండా రమేశ్ చాలా బాగా తెరకెక్కించాడు. డైరెక్షన్ వైపు ఎందుకొచ్చావని రమేశ్‌ని అడిగితే.. దాదాపు 800 సినిమాలకు డిజైనర్‌గా పనిచేశాను.. బోర్ కొట్టి డైరెక్షన్ వైపు వచ్చానని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అయితే డైరెక్షన్ ఎప్పుడూ బోర్ కొట్టదు.. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. సాయితో మళ్లీ హిట్ సినిమా తీయాలి. సాయికి ఇంకా మంచి హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ.... ► ఓ కమర్షియల్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలంటే ఏ అంశాలు అవసరమో అవన్నీ సాయితో తీసిన ‘అల్లుడు శీను’లో ఉన్నాయి. కొన్ని కథకి అవసరం లేకున్నా యాడ్ చేశాం.. ఎందుకంటే హీరోని (సాయి శ్రీనివాస్) ఎలివేట్ చేయడానికి చేసిన మ్యాజిక్ అది.. సినిమాకి అది బాగా వర్కవుట్ అయింది. ► ఈ మధ్య పేపర్లో చదివా.. ‘మా అబ్బాయి శ్రీనుని ‘రాక్షసుడు’ సినిమాతో ప్రేక్షకులు నటుడిగా గుర్తించారు’ అని బెల్లంకొండ సురేశ్‌గారు అన్నారు. అది అబద్ధం. ‘అల్లుడు శీను’ నుంచి ‘రాక్షసుడు’ వరకూ అన్ని సినిమాలకు సాయిని నటుడిగా గుర్తించారు ప్రేక్షకులు. ► తొలి సినిమా ‘అల్లుడు శీను’కే ది బెస్ట్ ఇచ్చాడు. వినోదం పండించడం చాలా కష్టం.. కానీ ఆ సినిమాలో బాగా చేశాడు. ‘రాక్షసుడు’లో కథ టెంపో ఏ మాత్రం తగ్గకుండా, బాగా ఇన్వాల్వ్ అయి నటించాడు.. దాంతో తనకు మంచి పేరొచ్చింది. తను ఏ పాత్ర అయినా చేయగలడు. ► ‘అల్లుడు శీను’ సినిమా వచ్చి ఐదేళ్లు అయిందంటే రోజులు ఎంత స్పీడుగా అయిపోతున్నాయా అనిపిస్తోంది. ఆ సినిమా నిన్నకాక మొన్ననే విడుదల చేసినట్లుంది నాకు. ప్రతి ఒక్కరూ సినిమా సినిమాకి కొంచెం నేర్చుకుంటూ ఉంటారు. సాయి మాత్రం అనుభవం ఉన్నవాడిలా అన్నీ ఒకే టేక్‌లోనే చేసేవాడు. నాకు చాలా సంతోషంగా, పెద్ద హీరోతో చేసినట్టు అనిపించింది. అప్పటికీ ఇప్పటికీ తనలో నాకు తేడా కనిపించడం లేదు. కథకు ఏది అవసరమో దాన్ని చేస్తున్నాడు. నేను–సాయి కలిసి మళ్లీ సినిమా చేయాలనుంది. అయితే పెద్ద సినిమా తీయాలి. అందుకు మంచి కథ కుదిరితే చేస్తాం. ► నేను సినిమా చేస్తున్నదే ఫిట్ అవడానికి.. అంతేకానీ హీరో అయిపోవాలని కాదు (నవ్వుతూ). బాడీ ఫిట్ అవడానికి ఏదో ఓ కారణం కావాలి.. అందుకు సినిమాని కారణంగా పెట్టుకుని చేస్తున్నా’’ అంటూ హీరోగా తాను ఓ సినిమా కమిట్ అయిన విషయం గురించి చెప్పారు వినాయక్. -
మంచి కంటెంట్ ఉన్న సినిమా
పూల సిద్ధేశ్వరరావు హీరోగా పరిచయం కానున్న చిత్రం ‘రథేరా’. జాకట్ రమేష్ దర్శకత్వం వహించారు. నరేష్ యాదవ్, వైఎస్ కృష్ణమూర్తి, పూల సిద్ధేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా బాగుంది. కొత్త ఆర్టిస్టులతో ఈ సినిమాను రమేష్ అద్భుతంగా తెరకెక్కించాడు. హీరోకి మంచి భవిష్యత్ ఉంది. దర్శకుడు మంచి కంటెంట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమాతో బ్రేక్ రావాలి. నిర్మాతలకు డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘ఎంతోమంది నూతన దర్శకులకు వీవీ వినాయక్‌గారు స్ఫూర్తిదాయకం. ఆయన మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతో మా సినిమాకు మంచి బజ్ వచ్చింది’’ అన్నారు రమేష్. ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన వినాయక్‌గారికి థ్యాంక్స్. దర్శకుడు ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు’’ అన్నారు నిర్మాతలు. -
టైటిల్ బాగుంది
శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో నవీన్ నాయని దర్శకత్వంలో డాక్టర్ లింగేశ్వర్ నిర్మించిన చిత్రం ‘ఉండిపోరాదే’. తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటించారు. ఈ చిత్రంలోని ఓ పాటను దర్శకుడు వి. వి వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘టైటిల్ బాగుంది. అలాగే సాబు వర్గీస్ ఇచ్చిన పాటలన్నీ చాలా బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. డా. కె లింగేశ్వర్ మాట్లాడుతూ – ‘‘టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా చిత్రం యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు. నవీన్ నాయని మాట్లాడుతూ – ‘‘మంచి కంటెంట్‌తో పాటు సందేశాత్మక చిత్రంగా ‘ఉండి పోరాదే’ని తెరకెక్కించాం’’ అన్నారు. -
శివ పెద్ద దర్శకుడు కావాలి
మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శివకుమార్ బి. దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రం ‘22.’. రూపేశ్‌కుమార్ చౌదరి, సలోని మిశ్రా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం బ్యానర్ లోగో ఆవిష్కరణ, టైటిల్ ఎనౌన్స్మెంట్ కార్యక్రమం శనివారం జరిగింది. లోగోను సి. కల్యాణ్ ఆవిష్కరించగా, టైటిల్‌ను వీవీ వినాయక్ ఎనౌన్స్ చేశారు. వినాయక్ మాట్లాడుతూ– ‘‘శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు. క్రమశిక్షణ, డెడికేషన్ ఉన్నవాడు. బీఏ రాజుగారి ద్వారా శివకు ఈ సినిమా చాన్స్ వచ్చింది అనుకుంటారు అందరూ. కానీ తానే సొంతంగా దర్శకునిగా అవకాశం దక్కించు కున్నాడు. ఈ సినిమా టైటిల్ ‘22’. ఈ రోజు జూన్ 22. వచ్చే నెల 22న రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. శివ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘వెబ్ సిరీస్‌తో తన టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకొని సినిమా చాన్స్ దక్కించుకోవటం సామాన్యమైన విషయం కాదు. నాకు ‘ఈరోజుల్లో’ సినిమా ఎలా ట్రెండ్ మార్క్ అయ్యిందో అలా శివకు ‘22’ ట్రెండ్ మార్క్ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు మారుతి. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘జయగారు ఎక్కడున్నా సంతోషిస్తారు. శివ దర్శకుడు అవ్వాలని బలంగా ఆమె కోరుకునేది. తక్కువ టైమ్‌లో శివ దర్శకునిగా ఎక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. శివ మాట్లాడుతూ– ‘‘మారుతి, పూరి జగన్నాథ్, వీవీ వినాయక్ గార్ల దగ్గర దర్వకత్వ శాఖలో చేశాను. నేను వెబ్ సిరీస్ చేసిన ప్రొడక్షన్లోనే సినిమా చేసే అవకాశం రావటం హ్యాపీగా ఉంది. దర్శకురాలు బి.జయగారు మా అమ్మ అని అందరికీ తెలుసు. ఆమె దగ్గర ప్రొడక్షన్ శాఖలో మెళకువలు నేర్చుకున్నా. నా స్ట్రగుల్స్‌లో తోడుగా ఉంటూ ప్రతిక్షణం ముందుకు నడిపించారు మా నాన్న బీఏ రాజు’’ అన్నారు. ‘‘డైరెక్టర్ శివగారు నాకు వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చారు. మళ్లీ తన సినిమాలో హీరోగా చాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్’’ అన్నారు రూపేష్. ‘‘ఫలక్నామా దాస్’ తర్వాత చేస్తున్న సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్ పాత్ర చేస్తున్నా’’ అన్నారు సలోని. నిర్మాత కొండా కృష్ణంరాజు, సంగీత దర్శకులు సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో ఆరంభం
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వీవీ వినాయక్ ఇక నటుడిగా లొకేషన్లోకి అడుగుపెట్టనున్నారు. అవును.. వీవీ వినాయక్ లీడ్ రోల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు నిర్మిస్తారు. నరసింహ రావు దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమం త్వరలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు రెండోవారంలో టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. సెట్లో నటీనటులతో ఎలా చేయాలో చెప్పి, చేయించుకున్న వినాయక్‌కి నటన పెద్ద కష్టం కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
బాలకృష్ణ 105వ చిత్రం ప్రారంభం
-
కాంబినేషన్ రిపీట్
బాలకృష్ణ–కె.ఎస్.రవికుమార్– సి.కల్యాణ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘జై సింహా’ సినిమా గత ఏడాది జనవరిలో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముగ్గురి కాంబినేషన్లో తెరకెక్కనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.కె.ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ చిత్రానికి పరుచూరి మురళి చక్కని కథను అందించారు. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. చిరంతన్ భట్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రామ్–లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా ఉంటాయి. చిన్నా ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను తెలియజేస్తాం’’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: సి.వి.రావ్. -
సమరం కథ కొత్తగా ఉంది
‘‘సమరం’ టైటిల్ చాలా బాగుంది. పోస్టర్స్ ఆసక్తిగా ఉన్నాయి. బషీర్ చెప్పిన కథ కొత్తగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయి ఇండస్ట్రీలో సాగర్ మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సాగర్ గంధం, ప్రగ్య నయన్ జంటగా, సుమన్, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సమరం’. బషీర్ ఆలూరి దర్శకత్వం వహించారు. యూనివర్సల్ ఫిలిమ్స్ సమర్పణలో జననీ క్రియేషన్స్ బ్యానరుపై శ్రీనివాస్ వీరంశెట్టి, పి .లక్ష్మణాచారి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని వీవీ వినాయక్ విడుదల చేశారు. బషీర్ ఆలూరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన ఒక ఇంజినీరింగ్ అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి... అనేది చిత్ర కథాంశం. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మాది మాచర్ల. పల్నాడు ప్రాంతం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఓ మంచి సినిమా తీయాలన్నది నా కల. బషీర్ చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా తీశాను. విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు పోకూరి లక్ష్మణా చారి. ‘‘త్వరలోనే మా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం’’ అని శ్రీనివాస్ వీరంశెట్టి అన్నారు. ‘సమరం’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాగర్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.డేవిడ్, సహ నిర్మాత: ప్రగ్యానయన్. -
ప్రజాస్వామ్యం అంగట్లో అమ్మే సరుకు కాదు
ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘నా చిన్నతనం నుండి ఆర్. నారాయణమూర్తిగారి సినిమాలు చూస్తున్నాను. ఇప్పటికీ అదే పంథాలో తనదైన స్టైల్లో చక్కటి సందేశంతో ప్రతి సినిమాని తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘డబ్బుకోసం ఆలోచించి మూర్తిగారు ఏ రోజూ సినిమాలు తీయలేదు’ అన్నారు వీవీ వినాయక్. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థను నోటు ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో సందేశాత్మకంగా చక్కగా వివరించారు నారాయణమూర్తి’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. ‘‘ఎర్రసైన్యం’తో పాటు అనేక సిల్వర్ జూబ్లీ సినిమాలను నారాయణమూర్తి చేశారని, ప్రజా సమస్యలపై ఎప్పుడూ పోరాటం చేస్తుంటారు’’’ అన్నారు దర్శకులు బి.గోపాల్. ‘‘చిన్న సందేశాలతో సినిమాలు చేయటానికే నేను భయపడి పోతాను. అలాంటిది ఇన్నేళ్లుగా ఓ కమిట్మెంట్తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తున్నారు ఆయన. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చూపించారు’’ అన్నారు శేఖర్ కమ్ముల. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వారసత్వ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నాయి. పది శాతం పాలిస్తూ, తొంభై శాతం పరిపాలించబడితే ప్రజాస్వామ్యం కాదు. బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జ్యోతిబాపూలే, అంబేద్కర్ చూపించిన బాటలో పయనించాలని ఈ సినిమాలో చూపించాను. ప్రజాస్వామ్యం అంటే అంగట్లో అమ్మే సరుకు కాకుండా, దానిని కాపాడుకోవాలి అని చాటి చెప్పే చిత్రమిది’’ అన్నారు. గద్దర్, ధవళ సత్యం, ఎల్బీ శ్రీరాం, గటిక విజయ్ కుమార్, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి నిర్మాతలు అవసరం
‘‘శివరంజని’ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రష్మి గౌతమ్, నందు జంటగా నందినీరాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకరన్ దర్శకత్వంలో యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్స్ బ్యానర్లో ఎ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. వీరికి మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి’’ అన్నారు. నాగ ప్రభాకరన్ మాట్లాడుతూ–‘‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఊహించని కథ, కథనాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘శివరంజని’ తప్పకుండా నేటి ట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి’’ అని చెప్పారు. -
దిల్ రాజు బ్యానర్లో వీవీ వినాయక్ హీరో
-
హీరోగా మారనున్న మాస్ డైరెక్టర్
ఆది లాంటి సూపర్ హిట్ సినిమాతో పరిచయం అయిన మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్. హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో సూపర్బ్ అనిపించుకున్న వినాయక్ దిల్, ఠాగూర్, కృష్ణ, అదుర్స్, ఖైదీ నంబర్ 150 లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇటీవల వరుస తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న వినాయక్ త్వరలో కొత్త అవతారం ఎత్తబోతున్నాడట. త్వరలో వినాయక్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుంది. గతంలో ఠాగూర్‌లో చిన్న పాత్రలో కనిపించిన వినాయక్ పూర్తి స్థాయి నటుడిగా ఇంతవరకు కనిపించలేదు. అయితే దర్శకుడు నరసింహరావు వినాయక్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. తన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. మహర్షి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న దిల్ రాజు అక్కడే ఈ విషయాన్ని ధృవీకరించారు. దిల్ రాజుగా తనను నిలబెట్టిన వివి వినాయక్‌ను తమ బ్యానర్లో త్వరలోనే నటుడిగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని దేవుడి సన్నిధిలో ప్రకటించమని వినాయకే కోరారని దిల్ రాజు తెలిపారు. దర్శకుడిగా ఫామ్ కోల్పోయిన వినాయక్‌కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : దిల్ రాజు బ్యానర్లో వీవీ వినాయక్ హీరో -
విజయ్ పెద్ద స్టార్‌గా ఎదగాలి
‘‘నేను అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నప్పటి నుంచి శివాజీరాజాతో పరిచయం ఉంది. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు హీరోగా పరిచయమవుతోన్న ఆయన తనయుడు విజయ్ పెద్ద స్టార్‌గా ఎదగాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. పూజా సోలంకి, సాషాసింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ‘‘ఏదైనా జరగొచ్చు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెడుతున్న మా అబ్బాయి విజయ్‌ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి. వినాయక్‌గారి చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా స్పెషల్ థాంక్స్’’ అన్నారు. ‘‘ఇదొక క్రైమ్ హారర్ థ్రిల్లర్. మంచి సహకారం అందిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులకు థాంక్స్’’ అన్నారు రమాకాంత్. బాబీ సింహా, నాగబాబు, అజయ్ ఘోష్, ‘వెన్నెల’ కిషోర్, పృథ్వి, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: సుదర్శన్ హనగోడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాశ్ అన్నంరెడ్డి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: శ్రీకాంత్ పెండ్యాల. -
పదిమందికి సాయపడితే...
శ్రీనివాస కళ్యాణ్, ఖుష్బూ పోద్దార్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వెల్కం జిందగీ’. శాలు–లక్ష్మణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం పిల్లర్ 9 ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందింది. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వెల్కం జిందగీ’ టీజర్ చూశాక సినిమాలో మంచి కంటెంట్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా బాగా ఆడాలి’’ అన్నారు. దర్శకులు శాలు, లక్ష్మణ్ మాట్లాడుతూ– ‘‘మన చుట్టూ ఉన్న పదిమందికి మనం చేసే చిన్న సాయం వారి జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్యతను వివరించే చిత్రం ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. మధుమణి, కమల్ల నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ‘జబర్దస్త్’ ఫేం కొమురం కామెడీ ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. శ్రీసాయి ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించారు. గౌతమ్ రవిరామ్ సంగీతం చక్కగా కుదిరింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి’’ అని తెలిపారు. -
అందరికీ చేరువయ్యేలా ఉంది
‘‘మళ్లీ మళ్లీ చూశా’ చిత్రంలోని ‘చినుకే నాకె చూపె...’ పాట వినసొంపుగా ఉంది. ట్రైలర్ కూడా అందంగా, అందరికీ చేరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా మంచి విజయం సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. అనురాగ్ కొణిదెన హీరోగా, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా సాయిదేవ రామన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. క్రిషి క్రియేషన్స్ పతాకంపై కొణిదెన కోటేశ్వరరావు నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చినుకే నాకె చూపె...’ పాటను వినాయక్ విడుదల చేశారు. సాయిదేవ రామన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమకు ప్రకృతి తోడైతే ఎంతో అందంగా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో తీసిన సినిమా ఇది. శ్రవణ్ సంగీతం, సతీష్ ముత్యాల కెమెరా ఆకర్షణగా నిలుస్తాయి. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రం మా ‘మళ్లీ మళ్లీ చూశా’’ అన్నారు కోటేశ్వరరావు. ‘మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ ఇది’’ అన్నారు అనురాగ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి సతీష్ పాలకుర్తి మాట్లాడారు. ∙వీవీ వినాయక్, అనురాగ్ -
వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
-
కొత్త చాప్టర్ షురూ
సినిమాల ఎంపికలో వైవిధ్యానికి పెద్దపీట వేస్తుంటారు వరుణ్ తేజ్. విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. వరుణ్ నటించనున్న తాజా చిత్రానికి ‘వాల్మీకి’ అనే పేరును ఖరారు చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించనున్న ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రామ్ బొబ్బ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటి, వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక కొణిదెల క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నా తర్వాతి చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్ ఖరారు చేశాం. కొత్త చాప్టర్ మొదలైంది’’ అని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ పేర్కొన్నారు. ‘‘మా ‘వాల్మీకి’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. డైరెక్టర్ సుకుమార్, నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు పలువురు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా. కాగా, తమిళ హిట్ చిత్రం ‘జిగర్తాండ’ కి ‘వాల్మీకి’ తెలుగు రీమేక్ అనే సంగతి తెలిసిందే. -
వీవీ వినాయక్‌ను కలిసిన మార్గాని
పశ్చిమగోదావరి, చాగల్లు: చాగల్లులో ప్రముఖ సీనీ దర్శకుడు వీవీ వినాయక్‌ను వైఎస్సార్ సీపీ నాయకులు బీసీ సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్టినేటర్ మార్గాని భరత్‌రామ్‌కు మద్దతు ఇవ్వాలని వినాయక్‌ను కోరారు. అనంతరం నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాజమండ్రి సీటును బీసీలకు కేటాయించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు 13 జిల్లాలో బీసీలకు చట్ట సభల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సానుకూలంగా ఉందని జగన్ ఇప్పటికే తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో మూలనివాసి రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని చంటిబాబు, బీసీ సంఘం చాగల్లు మండల అధ్యక్షుడు బొర్రా కృష్ణారావు, వీవీ వినాయక్ సోదరుడు గండ్రోతు సురేంద్రకుమార్, జుట్టా కొండలరావు,అయినం నాగరాజు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు ప్రస్తుతానికి రాజకీయ రంగంలోకి ప్రవేశించే అలోచన లేదని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామం చాగల్లు వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ఆన్లైన్లో ఫేస్బుక్, ట్విట్టర్, హిస్ట్రోగామ్ వంటి వాటిల్లో అకౌంట్లు లేవని, వాటిల్లో వచ్చిన వార్తలకు తనకు సంబంధం లేదన్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి చాగల్లు వచ్చి తన కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి గడపటం సంతోషాన్ని ఇస్తుందన్నారు. త్వరలో సి.కళ్యాణ్ నిర్మాతగా హీరో బాలకృష్ణతో చిత్రం తీసేందుకు కథ అన్వేషణలో ఉన్నట్టు తెలిపారు. -
ఈ క్షణం.. ఓ హైలైట్
ధ్రువ, అశ్విని జంటగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించి, చిత్రబృందాన్ని అభినందించారు. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందించాం. ‘యమ్ 6’ అనే డిఫరెంట్ టైటిల్‌ని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా చిత్రానికే హైలైట్‌గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడి సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ధ్రువ సర సన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్గా నటించింది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్, రియాజ్, సహ నిర్మాత: సురేశ్. -
అందరికీ ధన్యవాదాలు
‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ తనలోని నటుణ్ణి మరింత సానపెడుతున్నారు యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. గురువారం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సాయీ.. హ్యాపీ బర్త్‌డే. సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు శీను’ సినిమా చేసాను. కొత్త హీరోతో చేసినట్లు అనిపించలేదు. అలవాటు ఉన్న హీరోతో చేసిన అనుభూతి కలిగింది. బోయపాటిగారితో మంచి యాక్షన్ సినిమా చేశాడు. ఆర్టిస్టుగా సాయి మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. సాయి ఇంకా పెద్ద హీరో అవుతాడు. సినిమా ఫెయిల్యూర్స్ అందరికీ వస్తాయి. కానీ సాయి మాత్రం ఫెయిల్ అవ్వలేదు. అవ్వడన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సాయి శ్రీనివాస్ బెల్లంకొండకు పుట్టినరోజు∙శుభాకాంక్షలు. సాయి హీరోగా కంటే ముందు మా ఫ్యామిలీ మెంబర్. సాయి హీరో అవుతానన్నప్పటి నుంచి అతని వర్క్ చూస్తూనే ఉన్నాం. సందేహం లేదు. సినిమా సినిమాకి యాక్టింగ్, డ్యాన్స్‌లో ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మంచి కథలను ఎంపిక చేసుకుంటే టాలీవుడ్లో సాయి శ్రీనివాస్ వన్నాఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేదు. సరైన ఆర్టిస్టుకు మంచి సినిమా పడితే మంచి స్టార్ హీరోగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సాయికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘ఇంతకుముందు ‘దిల్’ రాజుగారు మాట్లాడుతూ మంచి కథలను ఎంపిక చేసుకోవాలి అన్నారు.ఇప్పుడు మేం సాయితో చేస్తున్న సినిమా కథ భిన్నమైనదని అనుకుంటున్నాం. యాక్షన్, డ్యాన్స్‌ల్లో సాయిని పర్ఫెక్ట్గా చూసి ఉంటారు. ఈ సినిమాలో తన నటనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. అవుట్‌పుట్ పట్ల చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల జాబితాలోకి సాయిగారి పేరు ఈ ఏడాదే చేరుతుందని చెప్పగలను’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘నన్ను హీరోగా లాంచ్ చేసిన వినాయక్ అంకుల్ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకు ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే ‘దిల్’ రాజుగారికి థ్యాంక్స్. అనిల్‌గారు వచ్చి ఆశీర్వదించినందుకు థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన అజయ్ భూపతిగారికి, ఇంకా నిర్మాతలు అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్‌కి ఇలా అందరికీ థ్యాంక్స్’’ అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, బెక్కెం వేణుగోపాల్, మల్టీ డైమన్షన్ వాసు పాల్గొన్నారు. -
ఈ సినిమాతో నేను అప్డేట్ అయ్యాను
తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్ష నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమా ఇంగ్లే, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘హుషారు’. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో వీవీ వినాయక్ మాట్లాడుతూ – ‘‘బెక్కెం వేణుగోపాల్ అంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా కొత్తవాళ్లకు. మంచి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. చిన్న సినిమా తీసి పెద్ద లెవల్లో రిలీజ్ చేయగలరు. ‘సినిమా చూపిస్త మావ’ అంత హిట్ కావాలి’’ అన్నారు. ‘‘నా 9 సినిమాలను ఒక్కో అనుభవంలానే భావిస్తా. సినిమా పరంగా నేను అప్డేట్ అయ్యాను. టీమ్ నన్ను సినిమాలో ఇన్వాల్వ్ చేశారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎంజాయ్ చేశాను. కొత్తవాళ్లతో సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్.‘‘క్వాలిటీ సినిమా తీసే నిర్మాతల్లో వేణుగోపాల్‌గారు ఒకరు’’ అన్నారు మధుర శ్రీధర్. ‘‘వేణు గోపాల్ తపనున్న నిర్మాత. అందుకే ఈ సినిమా ఇంత అందంగా ఉంది’’ అన్నారు రాజ్‌తరుణ్. ‘‘వేణుగోపాల్‌గారు సినిమాల గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు. పాటలు బావున్నాయి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘5 ఏళ్ల క్రితం గోపీగారితో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా చేశాను. ఆ తర్వాత నుంచి ఆయన సలహాలు తీసుకుంటున్నాను’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘అవకాశం ఇచ్చిన బెక్కెం వేణుగోపాల్గారికి థ్యాంక్స్. సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది అది చూసి ఎంజాయ్ చేయాల్సిందే’’ అన్నారు దర్శకుడు శ్రీహర్ష. ఈ కార్యక్రమంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు. -
వయసు తగ్గింది...
అదేంటీ? ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ తగ్గడమేంటి? అనేగా మీ డౌట్. మోహన్‌లాల్ అక్కడ. పాత్రకు తగ్గ వయసుకి మారిపోతుంటారాయన. తాజాగా ‘ఒడియన్’ సినిమా కోసం 55 సంవత్సరాల మోహన్‌లాల్ 35 సంవత్సరాల యువకునిలా కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించడం విశేషం. శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ లీడ్ రోల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఒడియన్’. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని దగ్గుపాటి అభిరామ్, సంపత్ కుమార్ సొంతం చేసుకున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌ను అభినందించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మోహన్‌లాల్‌గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ‘ఒడియన్’ చిత్రం తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రియేషన్స్ సొంతం చేసుకుంది. శ్రీ కుమార్ మీనన్‌గారు ఆయన్ని 35ఏళ్ల వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి’’ అన్నారు. -
‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ అదేనా..?
బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసిన ‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (వర్కింగ్ టైటిల్) ఆదివారం ఆరంభమైంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ క్రేజీ కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. డి. పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వీవీ వినాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శకులు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రిప్ట్‌ను చిత్రబృందానికి అందించి, శుభాకాంక్షలు తెలిపారు. నటులు ప్రభాస్, రానా, కల్యాణ్ రామ్, దర్శకులు బోయపాటి శ్రీను, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్, వెంకీ అట్లూరి, నిర్మాతలు బి.వి.ఎస్.యన్. ప్రసాద్, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, కె.ఎల్. నారాయణ, ఎన్.వి. ప్రసాద్, సాయి కొర్రపాటి, పీవీపీ, శోభు యార్లగడ్డ, నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, యలమంచలి రవిశంకర్, వంశీ, విక్రమ్, పరుచూరి ప్రసాద్, రచయిత గుణ్ణం గంగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా సత్తాను ‘బాహుబలి’తో ప్రపంచానికి చాటి చెప్పిన ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా మా బ్యానర్లో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఓ కలలా అనిపిస్తోంది. ప్రేక్షకులతో పాటు, హీరోల అభిమానుల అంచాలను మించేలా సినిమా ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటేంత గొప్ప సాంకేతిక విలువలతో కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను భారీగా రూపొందిస్తాం. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19న ప్రారంభిస్తాం. రెండు వారాలపాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం. సినిమాలో భాగమైన ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే...ఈ సినిమాకు ‘రామరావణ రాజ్యం’ అనే టైటిల్‌ని చిత్రబృందం పరిశీలిస్తోందన్న ప్రచారం ఫిల్మ్ నగర్లో సాగుతోంది. ఈ సినిమాకు కథ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఛాయాగ్రాహకుడు: కె.కె. సెంథిల్ కుమార్. -
రహస్యం ఏంటి?
సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా నటించిన చిత్రం ‘రహస్యం’. ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించారు. సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘రహస్యం’ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించి చిత్ర బృందానికి మంచి పేరు, డబ్బు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘కొత్త కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. రహస్యం ఏంటి? అన్నది తెరపైనే చూడాలి. వినాయక్‌గారు మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది ’’ అన్నారు సాగర శైలేశ్. -
బ్రేకప్ లవ్‌స్టోరీ
అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే జంటగా కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉప శీర్షిక. ఎస్.ఏ. రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి. చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. రిలీజ్ తర్వాత ఇందులోని మెసేజ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి వినోదాత్మక చిత్రాలను కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘వినాయక్ వంటి దర్శకులు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి మెచ్చుకోవడం గర్వంగా ఉంది. ‘కష్టపడి జీవితంలో పైకి వచ్చేవాడు లక్కీ ఫెలో. ఇతరుల కష్టంతో ఓసీగా బతుకుతూ పేదవాడిగా, బిచ్చవాడిగా జీవించేవాడు అన్ లక్కీఫెలో’ అనే ఫిలాసఫీ ఆధారంగా సినిమాను తెరకెక్కించాం. సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’’ అని బి. చంద్రశేఖర్‌రావు అన్నారు. -
గుమ్మడికాయ కొట్టగానే కొబ్బరికాయ
‘సమ్మోహనం’ హిట్ తర్వాత సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’కి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సుధీర్ బాబు, మెహరీన్ జంటగా పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ఖుర్షీద్ (ఖుషి), సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: పి.వి శంకర్. -
హైదరాబాద్‌కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ముఖ్య తారలుగా నటించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు వీవీ వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ప్రభు మాస్టర్ అంటే మా అందరికీ చాలా గౌరవం. అన్ని భాషల్లో కీర్తి సంపాదించిన ఆయన ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. విజయ్ అర్థవంతమైన సినిమాలు తీస్తాడు. నా సినిమా టైటిల్‌ను వాడుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గొప్ప ప్రొడ్యూసర్ కల్యాణ్‌గారు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా హిట్ సాధించాలి. ఎ.ఎల్. విజయ్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు క్రిష్. ‘‘చాలా ఇష్టపడి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఇందుకు కారణం ప్రభుదేవాగారే. మంచి ఫీల్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘ఈ ఆడియో వేడుకను ఇంత బాగా సెలబ్రేట్ చేసిన కల్యాణ్‌గారికి థ్యాంక్స్. హైదరాబాద్‌కి వస్తే నాకు పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్‌గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది డ్యాన్స్ సినిమా అనే కంటే ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. దిత్య సూపర్ డ్యాన్సర్’’ అన్నారు ప్రభుదేవా. ‘‘ప్రభుదేవా ఈ సినిమాకు ఒక యాక్టర్లా కాకుండా గాడ్‌ఫాదర్‌లా పనిచేశారు. చిన్నారి దిత్య బాగా కష్టపడింది’’ అన్నారు చిత్రదర్శకుడు విజయ్. ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రభుదేవాగారి ‘ప్రేమికుడు’ సినిమా చూశా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. చిన్న పిల్లల ప్రతిభను బయటకు చూపించే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు రాజ్ కందుకూరి. బేబి దిత్య, ఐశ్వర్యా రాజేశ్, సత్యం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నెక్ట్స్ బాలయ్యతోనే..!
నందమూరి బాలకృష్ణ హీరోగా వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సి కళ్యాణ్.. ఈ కాంబినేషన్లో మరోసారి తెర మీదకు తెచ్చేందుకు ప్లాన్ చేశారు. జై సింహా తరువాత వినాయక్ సినిమానే సెట్స్ మీదకు వస్తుందని భావించినా.. బాలయ్య మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీ అయ్యారు. దీంతో వినాయక్, బాలకృష్ణ ల సినిమా ఆగిపోయినట్టే అన్న టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం బాలయ్యతో చేయబోయే సినిమాకు వినాయక్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ‘ఎన్టీఆర్’ పూర్తయిన వెంటనే వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు బాలకృష్ణ ఓకె చెప్పారట. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి
‘‘అల్లుడుశీను’ సినిమా విడుదలై అప్పుడే నాలుగేళ్లయిందంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే షూటింగ్ చేసినట్లుంది. సినిమా సినిమాకి సాయి చాలా మెచ్యూర్డ్‌గా ఎదుగుతున్నాడు. ‘సాక్ష్యం’ ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. అభిషేక్ నామా ‘సాక్ష్యం’ని అంత గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హేగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మించిన ‘సాక్ష్యం’ రేపు విడుదలవుతోంది. ‘సాక్ష్యం’ చిత్రంలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘డెస్టినీ’ని వినాయక్ రిలీజ్ చేశారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మా టీమ్ అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తేనే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. అభిషేక్‌గారు ఈ చిత్రాన్ని లావిష్‌గా నిర్మించారు. శ్రీవాస్‌గారి విజన్‌కి ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద విజయం అందించాలి’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ‘సాక్ష్యం’ ఉంటుంది. ఇందులో ఇప్పటివరకూ చేయని కొత్త పాత్ర చేశాను. విజువల్స్ చాలా బాగుంటాయి’’ అని పూజాహెగ్డే అన్నారు. -
మాస్ మసాలా స్టార్ట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటరై్టన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇవ్వగా, మరో డైరెక్టర్ శ్రీవాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్రదర్శకుడు తేజ తొలి షాట్ డైరెక్షన్ చేశారు. ‘‘మాస్ మసాలా ఎంటరై్టనర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. సోమవారమే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తేజ, కాజల్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ రెండోసారి నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి దానం నాగేందర్, నటుడు అభిమన్యు సింగ్ పాల్గొన్నారు. సోనూ సూద్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శీర్షరే, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు. -
బాలయ్యతో ‘మైత్రీ’ కుదిరేనా..?
వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయిన తరువాత బాలయ్య మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. వందో సినిమా తరువాత ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసిన బాలకృష్ణ, ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. చాలా రోజులుగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు పెద్ద నిర్మాణ సంస్థలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాను నిర్మించేందుకు ఉత్సాహం గా ఉంది. మరి కాంబినేషన్‌కు బాలయ్య ఓకె చెప్తాడా..? లేదా..? చూడాలి. -
ఆయనంటే అందరికీ ఇష్టమే
‘‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ షాట్ మేకింగ్ అద్భుతంగా ఉంది. శ్రీకాంత్ భయ్యా అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. నాకైతే మరీ ఇష్టం. ఆయన ఎంత మంచి నటుడో అంత మంచి మనిషి. ఎందరికో సహాయం చేశాడు’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. శ్రీకాంత్, యజ్ఞా శెట్టి జంటగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. ‘బి వేర్ ఆఫ్ పబ్లిక్’ అన్నది ట్యాగ్ లైన్. అలివేలు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కరణం బాబ్జీ మాట్లాడుతూ –‘‘సినిమా ఆడాలంటే స్టార్లు అవసరం లేదని ‘మహానటి’ నిరూపించింది. ఒక సినిమా ఆడాలంటే మంచి నటీనటులు కుదరాలి. మా సినిమాకి కుదిరారు. ఈ చిత్రంలో ముగ్గురు యంగ్ హీరోలున్నారు. వాళ్లెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. జూన్ 15లోపు సెన్సార్ పూర్తి చేసి, అదే నెలలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘శ్రీకాంత్ కష్టమంతా ట్రైలర్లో చూసాం. ఈ చిత్రం యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత అలివేలు. ‘‘మెంటల్ పోలీస్’ తర్వాత కరణం బాబ్జితో చేసిన చిత్రమిది. బాబ్జీని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అనాలి. సినిమా బడ్జెట్ తగ్గించడం కోసం డైరెక్టర్ పడ్డ తపన మెచ్చుకోకుండా ఉండలేం. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రమిది’’అన్నారు శ్రీకాంత్. సీనియర్ నటుడు శివకృష్ణ, దీక్షాపంత్, మ్యూజిక్ డైరెక్టర్ రాప్రాక్ షకీల్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్టీఆర్’ని పక్కన పెట్టేశారా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభమైన సంగతి తెలసిందే. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ముందుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. చిత్ర ప్రారంభోత్సవ సమయంలో కూడా తేజ దర్శకుడిగా కొనసాగారు. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ముందు తాను ఎన్టీఆర్‌కు పూర్తి న్యాయం చేయలేనేమో అంటూ తేజ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మరో దర్శకుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి పేర్లు వినిపించినా ఎవరినీ ఫైనల్ చేయలేదు. ఒక దశలో బాలయ్యే దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ మరింత ఆలస్యమవుతుండటంతో బాలయ్య మరో సినిమా ప్రారంభించాలనుకుంటున్నారట. చాలా రోజులుగా వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు నిర్మాత సీ కల్యాణ్. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పక్కన పెట్టి ఈ సినిమాను ముందుగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట నందమూరి నటసింహం. అయితే ఈ విషయంపై ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. -
అవకాశాలు రాలేదని బాధపడే వారికి శంకర్ ఓ స్ఫూరి – వీవీ వినాయక్
శంకర్ హీరోగా శ్రీధర్. ఎన్ దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్. పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘శంభో శంకర’. మే డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ– ‘‘శంకర్ రెండేళ్లు నాతో ట్రావెల్ చేశాడు. శ్రీకాకుళం నుంచి వచ్చి హీరోగా ఎదగడం ఆశ్చర్యంగాను, సంతోషంగాను ఉంది. సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బాధపడే వాళ్లకు శంకర్ ఓ స్ఫూర్తి. ఫస్ట్ పాట బావుంది. శంకర్ మాస్ లుక్‌లో బావున్నాడు. సినిమా సక్సెస్ అయి, అందరికీ మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో నాకు వినాయక్‌గారు గాడ్‌ఫాదర్. ఆయన వద్ద చాలా కాలం పనిచేసి, చాలా విషయాలు నేర్చుకున్నాను. నా మిత్రుడు శ్రీధర్‌తో సినిమా చేస్తున్నాను. నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శంకర్. ‘‘శంకర్, నేను ఫ్రెండ్స్. ఈ సినిమాతో నేను డైరెక్టర్‌గా, శంకర్ హీరోగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. ఏది అడిగినా సమకూర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. ‘‘వినాయక్‌గారు ఈ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శంకర్ స్టార్ హీరోల్లాగే కష్టపడ్డారు. శ్రీధర్ శ్రమించి స్క్రిప్ట్ చేశారు. నిర్మాత బడ్జెట్ విషయంలో రాజీపడలేదు. సినిమా హిట్ అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు’’ అన్నారు నిర్మాత సురేశ్ కొండేటి. నిర్మాతల్లో ఒకరైన రమణా రెడ్డి పాల్గొన్నారు. -
మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది
‘‘కొన్ని రోజుల క్రితం ‘అమ్మమ్మగారిల్లు’ యాడ్ చూడగానే నా బాల్యంలోని మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది. మేమంతా వేసవి సెలవులకు వెళ్లినప్పుడు అక్కడ ఆడుకోవడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ రోజంతా నేను చాలా మంచి ఫీలింగ్‌లో ఉండిపోయాను. అలాంటి ఫీలింగ్ ఇచ్చినందుకు యూనిట్‌కి థ్యాంక్స్. ‘అమ్మమ్మగారిల్లు’ మంచి హిట్‌తో పాటు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. స్వప్న సమర్పణలో కె.ఆర్, రాజేష్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని వినాయక్ ఆవిష్కరించారు. నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘అమ్మమ్మగారిల్లు’ ఒక గుడిలాంటిది. గుడికి వెళ్లినప్పుడు శత్రువులు ఎదురైనా తగాదాలు పడం. అలాగే అమ్మమ్మగారి ఇంటికెళ్లినప్పుడు కుటుంబంలోని వ్యక్తుల మధ్య మనస్పర్థలున్నా అమ్మమ్మ బాధపడకూడదని బయటికి నవ్వుతూ ఉంటాం. ఇది రేటింగ్ ఇచ్చే సినిమా కాదు. దయచేసి ఎవరూ ఈ సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘దర్శకుడిగా నాకు తొలి చిత్రమిది. నా జీవితంలో చోటు చేసుకున్న కొన్ని జ్ఞాపకాలతో ఈ సినిమా చేశా. నాగశౌర్య లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాత్ర కన్నీరు పెట్టిస్తుంది. మా నిర్మాతలు చక్రపాణి–నాగిరెడ్డిగార్లలా కలిసి ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుందర్ సూర్య. ‘‘ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఇది’’ అన్నారు నిర్మాత రాజేష్. సహ నిర్మాత కుమార్, ఛాయాగ్రాహకుడు రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
16 ఏళ్ల తరువాత అదే కాంబినేషన్లో..
కుర్ర హీరోలకు పోటి ఇచ్చేలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ మరో సినిమాకు అంగీకరించారు. ఇటీవల జై సింహా సినిమాతో ఆకట్టుకున్న బాలకృష్ణ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ (ఎన్టీఆర్ బయోపిక్) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాజా మరో సినిమాను ఫైనల్ చేశారు బాలకృష్ణ. జై సింహా సినిమాను నిర్మించిన సీ కల్యాణ్ బ్యానర్లో మరో సినిమాను చేయనున్నాడు బాలయ్య. ఈ సినిమాను మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ వీవీ వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు. 2002లో వినాయక్ దర్శకత్వంలో చెన్నకేశవ రెడ్డి సినిమాలో నటించారు బాలయ్య, 16 ఏళ్ల తరువాత మరోసారి అదే కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ సినిమాను మేలో ప్రారంభించి 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేలాప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ మఫ్టీ కి రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. -
ఏ నిమిషానికి ఏమి జరుగునో!
‘వినవయ్యా రామయ్య’,‘ఏంజెల్’ చిత్రాల ఫేమ్ నాగ అన్వేష్ కథానాయకుడిగా శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో రూపొందనున్న ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ,ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షో టైమ్ స్టూడియోస్ సమర్పణలో గణేష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేశ్, సీహెచ్‌వీ. నాగేశ్వరరావు నిర్మించనున్నారు. ‘‘ వినగానే కథ నచ్చింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో క్లైమాక్స్ వచ్చే వరకు అర్థం కాదు’’ అన్నారు నాగ అన్వేష్. ‘‘సైన్స్ ఫిక్షన్ చిత్రమిది. ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శ్రీ కృష్ణ గొర్లె. ‘‘నాగ అన్వేష్ని చూస్తే బాలీవుడ్ హీరోని చూసినట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది’’ అన్నారు లండన్ గణేశ్. ‘‘మూడు షెడ్యూల్స్‌లో సినిమాను కంప్లీట్ చేస్తాం’’ అన్నారు నాగేశ్వరరావు. -
సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యం
కొత్తపేట: సమాజాన్ని ప్రభావితం చేసే సందేశాత్మక చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తానని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. గాయత్రీ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ జనరల్ మేనేజర్ బొరుసు వెంకట ఉదయబాస్కర్ మేనల్లుడు పసుపులేటి సాయిహర్ష – రమ్య వివాహ రిసెప్షన్ సందర్భంగా ఆదివారం సాయంత్రం కొత్తపేట వచ్చిన వినాయక్ విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్షనిజం, రాజకీయ, ముఠాకక్షలు తదితర అంశాలతో పెడదారి పట్టిన సమాజాన్ని ప్రభావితం చేసి, సన్మార్గంలో నడిపించే కథాంశాలతో చిత్రాలు తీస్తూ వచ్చానని తెలిపారు. అదే ఒరవడి కొనసాగిస్తూ చిత్రాలు తీస్తానన్నారు. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్ఫూర్తితో దర్శకుడిని కావాలనే లక్ష్యంతో సినీ రం గానికి వచ్చి, అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించానన్నారు. ఆయన వద్ద, దర్శకుడు సాగర్ వద్ద కృష్ణ హీరోగా ‘అమ్మదొంగా’ సినిమాకు పని చేశానన్నారు. తొలుత జూనియర్ ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఆది’ సినిమా తీశానన్నారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించగా 13 సూపర్‌హిట్ అయ్యాయన్నారు. ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదని, త్వరలో కథ ప్రారంభించాల్సి ఉందని చెప్పారు. ఆ కథకు హీరో ఎవరన్నది ఇంకా అనుకోలేదన్నారు. ‘‘నాకు లక్ష్యం అంటూ ఏమీ లేదని, డైరెక్టర్ కావాలని ఆశించాను. అయ్యాను. ఆశించిన దానికన్నా వెయ్యిరెట్లు సంతృప్తి చెందాను’’ అని వినాయక్ చెప్పారు. శ్రీదేవి మృతి తీరని లోటు ప్రముఖ నటి శ్రీదేవి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని వినాయక్ అన్నారు. ఆమె మరణించారన్న విషయం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకునిగా, టెక్నీషియన్‌గా ఆమెను అభిమానించేవాడినన్నారు. సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుల్లో శ్రీదేవి ఒకరన్నారు. -
కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది – సాయి శ్రీనివాస్
బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంఠినేని (నాని) నిర్మాణంలో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మెన్ పి. రామ్మోహన్రావు గౌరవ దర్శకత్వం వహించారు. సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కొత్త సినిమా అంటే కొత్త ఎగై్జట్‌మెంట్ వస్తుంది.నవీన్గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. చాలా కథలు విన్నాం. దర్శకుడు శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చింది. ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘అల్లుడు శీను’ చిత్రం తర్వాత ఛోటాగారితో, తమన్‌తో తొలిసారి వర్క్ చేయబోతున్నందుకు హ్యాపీ’ అన్నారు. ‘‘మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. కథ, కాన్సెఫ్ట్ కొత్తగా ఉంటాయి. కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తాం’’ అన్నారు నవీన్. ‘‘రొమాటింక్ థ్రిల్లర్ చిత్రమిది. కథను నమ్మి అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి కృతజ్ఞతలు.నా పై నమ్మకంతో మంచి టీమ్‌ను అందించిన నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకునిగా నా ప్రయాణం స్టార్ట్ చేయడానికి కారణమైన నవీన్, శాంతయ్య, సాయి శ్రీనివాస్‌కు థ్యాంక్స్. పెద్ద దర్శకులతో పనిచేసిన బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త డైరెక్టర్ అయిన నాతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మార్చి 2 నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘కో–డైరెక్టర్‌గా ఎప్పటినుంచో శ్రీనివాస్ నాకు తెలుసు. కొత్తగా అద్భుతమైన కథ చెప్పారు. టీమ్ అందరికీ మంచి పేరు తెచ్చెలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు కెమెరామెన్ ఛోటా కె. నాయుడు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘బెల్లంకొండ సురేశ్ మంచి సినిమాలను నిర్మించారు. ఆయన తనయుడు శ్రీనివాస్ నటిస్తున్న ఈ సినిమా వంద రోజులు ఆడాలి. వంశధార క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ తొలి సినిమా హిట్ సాధించాలి’’ అన్నారు. -
విందు భోజనంలా ఉంటుంది – కీరవాణి
‘‘ఈ సినిమాకు కీరవాణిగారు సంగీతం అందించటం చాలా గొప్ప విషయం. సినిమా బావుంటుంది అనుకుంటేనే ఆయన సంగీతం అందిస్తారు. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. నటుడిగా రంజిత్‌కు మంచి గుర్తింపు రావాలి’’ అన్నారు దర్శకులు వీవీ వినాయక్. రంజిత్, పాలక్ లల్వాని జంటగా త్రికోటి దర్శకత్వంలో భరత్ సోమి నిర్మించిన చిత్రం ‘జువ్వ’. ఈ చిత్రం ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినాయక్ మాట్లాడుతూ –‘‘మా కుటుంబానికి ఆప్త మిత్రులు బొత్స సత్యనారాయణ గారు. వారి అల్లుడు, ఈ సినిమా నిర్మాత భరత్ సోమిగారికి శుభాకాంక్షలు. తమ్ముడి మీద ప్రేమతో రంజిత్‌ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘త్రికోటì మొదటి సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’కి మ్యూజిక్ నేనే చేశా. ఈ సినిమా విందు భోజనంలా ఉంటుంది. రంజిత్ ఫ్యూచర్లో పెద్ద హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కీరవాణి. ‘‘నాలాంటి కొత్తవాడి సినిమాకు సంగీతం ఇచ్చిన కీర వాణిగారు నాకు దేవుడితో సమానం. బడ్జెట్ విషయంలో భరత్‌గారు వెనకాడలేదు’’ అన్నారు త్రికోటి. రంజిత్ మాట్లాడుతూ –‘‘నా మెదటి సినిమాకు కీరవాణిగారు మ్యుజిక్ ఇవ్వడం నా లక్. మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘ముఖ్య అతిథిగా వచ్చిన వినాయక్‌గారికి, బొత్స సత్యనారాయణ గారికి, అతిథులందరికి కృతజ్ఞతలు. రత్నం గారి డైలాగ్స్ బాగుంటాయి. ఫిబ్రవరి 23న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత భరత్. -
ఇద్దరం కలిసి సక్సెస్‌మీట్ పెడతాం
‘‘రీమిక్స్ సాంగ్స్ కావాలని నేనెప్పుడూ అడగలేదు. అది డైరెక్టర్స్ ఛాయిస్. ఆ రీమిక్స్‌కి నా బెస్ట్ ఇవ్వటానికి కృషి చేస్తాను. నాలుగు రీమిక్స్ సాంగ్స్‌ను ఎంజాయ్ చేస్తూ, బాధ్యతగా చేశాను’’ అన్నారు సాయిధరమ్ తేజ్. వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఎప్పుడూ ట్రై చేయడు. ఫ్రెండ్స్, పేరెంట్స్ వల్ల కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చే ప్రాసెస్‌లో ఎంత ఇంటిలిజెంట్‌గా బిహేవ్ చేసి, తన వాళ్లను కాపాడుకుంటాడనే పాయింట్‌తో నా క్యారెక్టర్ని బిల్డ్ చేశారు.మనకి హెల్ప్ చేసినవాళ్లను ఎప్పుడూ మరచిపోకూడదు. వాళ్లకు అవసరం వచ్చినప్పుడు మనం వాళ్లకు ఉండాలనే మెసేజ్ ఉంది. ► ఫస్ట్ టైమ్ ఫుల్ లñ ంగ్త్ కమర్షియల్ మూవీ చేశా. కొత్తగా అనిపించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుందనే చేస్తాం. అన్ని సినిమాలకూ ఒకేలా కష్టపడతాం. ► వినాయక్‌గారు ఏం చెప్పినా చేసేస్తాం. ఆయన అడిగే విధానం అంత బావుంటుంది. అంత కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు మన దృష్టి మొత్తం మన డైలాగ్స్ మీద, మన షాట్స్ మీద పెట్టుకొని ఇంకా బాగా వర్క్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్‌తో చేస్తే ఇలా ఉంటుందా? అనిపించింది. నాలో మా ఇద్దరి మావయ్యలు కనిపిస్తారని, వినాయక్‌గారు దాన్ని బెస్ట్‌గా యుటిలైజ్ చేసుకొని ఆడియన్స్‌కు ఇవ్వాలనుకున్నారు. ఆకుల శివగారు రాసిన కథకు ఆయన స్టైల్లో స్క్రీన్‌ప్లే రాశారు. నేనెంత ఇంటెలిజెంట్ అంటే ఒక 60 పర్సెంట్ అనుకుంటున్నాను. కానీ నా గురువులందరూ ఇంటెలిజెంట్సే. ► నా లాస్ట్ సినిమాల్లో చేసిన తప్పులు ఎనలైజ్ చేసుకుంటున్నాను. డైరెక్టర్స్ అనుకున్నట్టుగానే తీశారు కానీ ఆడియన్స్ ఆశించింది ఇవ్వలేకపోయాం. అది ఎవ్వరి తప్పు కాదు. సినిమా అంటేనే కలñ క్టివ్ ఎఫర్ట్. ఎవర్నీ బ్లేమ్ చేయడానికి లేదు. ► వరుణ్, నేను ఒకేసారి రావాలనుకోలేదు. అది తెలియకుండా జరిగింది. ఇద్దరం కూర్చుని డిస్కస్ చేశాం. కానీ ప్రొడ్యూసర్స్ ఇష్యూ కదా అని చేతులు ఎత్తేశాం. కానీ నాకనిపించింది ఇద్దరం ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్కే వేరని. మా మెగా హీరోస్ ఇంతమంది అయ్యేసరికి ఇలా రిలీజ్ డేట్ ఇష్యూ అవుతోంది అంటే.. మాకు ఇదో టెస్ట్ అనుకుంటాను. ప్రేక్షకులకు రెండు సినిమాలు నచ్చుతాయని ఆశిస్తున్నాను. మా సినిమాలు హిట్ అయ్యాక వరుణ్, నేను కలిసి సక్సెస్ మీట్ పెడతాం. ⇒ మీ స్పెషల్ ఫ్రెండ్ రెజీనా ఈ మధ్య ఓ యంగ్ హీరోతో లవ్‌లో పడి, కెరీర్ పాడు చేసుకున్నా అన్నారు. మీ ఒపీనియన్? ► క్లోజ్ ఫ్రెండే.. కాదనడంలేదు. కానీ తన పర్సనల్ విషయాల గురించి నేను కామెంట్ చేయదలచుకోలేదు. -
అలాంటి కథలు నాకు చెప్పటం లేదు : సాయి ధరమ్
మెగా ఇమేజ్ను క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, ఈ శుక్రవారం ఇంటిలిజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈ మెగా హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తున్న సాయి ధరమ్ తేజ్‌ను డిఫరెంట్ సినిమాలు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించగా.. ‘దర్శకులెవరు నా దగ్గరకు అలాంటి కథలు తీసుకురావటంలేదు. నేను కూడా కొత్త కథల కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ సమాధానమిచ్చారు. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సాయి, ఇంటిలిజెంట్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తుండగా సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. వినాయక్ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. -
అందరికంటే సినిమానే గొప్ప
‘‘నిన్నే ఫైనల్ కాఫీ చూశాం. సినిమా చాలా బాగా వచ్చింది. తేజు, లావణ్య బాగా చేశారు. నేను అందర్నీ బాగా చూసుకుంటాను. కల్యాణ్ గారు నన్నో గాజు బొమ్మలా చూసుకున్నారు. ఖచ్చితంగా ‘ఇంటిలిజెంట్’ సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు వీవీవినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా వినాయక్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమాలో ఒక సోషల్ ఇష్యూను టచ్ చేశాం. మైండ్ గేమ్స్ మీద సినిమా ఉంటుంది. అందుకే ‘ఇంటిలిజెంట్’ అని పెట్టాం. నా స్టైల్లోనే ఫుల్ కమర్షియల్ మీటర్లో ఉంటుంది. సాయిధరమ్, నేను, కల్యాణ్... మా ముగ్గురిలో ఎవరు ఇంటిలిజెంట్ అంటే సి.కల్యాణ్ గారే (నవ్వుతూ). ► ఆకుల శివ మంచి కథ అందించారు. తమన్ సూపర్ మ్యూజిక్ అందించాడు. జానీ, శేఖర్ మాస్టర్లు డ్యాన్స్‌లు బాగా కంపోజ్ చేశారు. కాంబినేషన్ ప్రెష్‌గా ఉంటుందని తేజ్‌కు జోడీగా లావణ్య త్రిపాఠిను తీసుకున్నాం. తను కుడా చాలా బాగా చేసింది. సినిమా టెంపోకు అడ్డు రాకూడదని కేవలం నాలుగు పాటలే పెట్టాము. నా మునుపటి సినిమా ఖైదీ నెం.150లో కూడా నాలుగు పాటలే ఉన్నాయి. ► ఈ సినిమాతో ఎంత పెద్ద కమర్షియల్ కథనైనా మోయగలడు అనే నమ్మకం తీసుకొచ్చాడు తేజ్. తనని హీరోగా ఫిక్స్ చేశాక ‘చమక్ చమక్’ సాంగ్‌ను రీమిక్స్ చేయాలనుకున్నాను. చిరంజీవిగారి పాటల్లో అది నా ఫెవరేట్ సాంగ్. అడిగిన వెంటనే ఇళయరాజాగారు పాటను మాకు ఇచ్చారు. ► మెగా ఫ్యామిలిలో నాలుగో హీరోతో చేశాను. చిరంజీవిగారితో సినిమా అంటే సెట్లో అందరం చాలా టెన్షన్‌గా ఉంటాం. చరణ్, బన్నీ విషయానికి వస్తే వాళ్లను ఠాగూర్’ సినిమా అప్పుడు నుంచి చూస్తున్నాను. చరణ్ చాలా సౌమ్యుడు. బన్నీ చాలా హార్డ్ వర్కింగ్. తేజ్, వరుణ్‌తేజ్ ఒకేసారి వస్తున్నారు. ఇది అనుకోకుండా జరిగింది. బాగుంటే రెండు సినిమాలు ఆడతాయి. సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత.. ఎవరు గొప్ప అంటే నా దృష్టిలో అందరికంటే సినిమానే గొప్ప. ► బయట కథలతో సినిమా ఎందుకు తీస్తున్నానంటే, ఒక్కో కథకు చాలా టైమ్ పడుతుంది. రాఘవేంద్రరావుగారు ఓసారి అన్నారు. ఎప్పుడూ మన కథలే కాదు బయట కథలు కూడా చేయాలి. లేకపోతే మన ఐడియాలే రిపీట్ అవుతాయని. బయట కథలు చేస్తే కొత్త యాంగిల్ ఓపెన్ అవుతుంది. ► మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నాకా ఆలోచన లేదు. దర్శకుడిని కావాలనుకోలేదు.. అయ్యాను. సో... డెస్టినీకు వేరే ప్లాన్స్ ఏం ఉన్నాయో నాకు తెలీదు. ► రెండేళ్ల తర్వాత కొత్తవాళ్లతో సినిమా తీస్తాను. అప్పుడే ప్రొడక్షన్ హౌస్ ప్లానింగ్స్ కూడా చెబుతా. స్టార్స్‌తో అయినా కాబోయే స్టార్స్‌తో సినిమా అయినా నాకు టెన్షనే. బేసిక్‌గా సినిమా అంటేనే టెన్షన్. ఈ మధ్యన ఎవరో ఎయిర్‌పోర్ట్‌లో ఒ వ్యక్తి ‘సుమోలు గాల్లో లేస్తేనే మీ సినిమాలా ఉంటుంది సార్’ అన్నారు. ప్రతి సినిమాలోనూ సుమోలు గాల్లో ఎలా లేపుతాం (నవ్వుతూ). సినిమా సినిమాకు గ్యాప్ కావాలని తీసుకోం. రైటర్స్ కొరత కూడా అనను. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావట్లేదు. అవకాశం ఉన్నవాళ్లకు మంచి కథలు సెట్ కావట్లేదు. ► నా తర్వాత సినిమా ఏంటో నాక్కూడా తెలియదు. ‘అదుర్స్ 2’ వర్క్‌వుట్ చేద్దామనుకున్నాం. బట్ సెట్ అవ్వలేదు. కానీ తప్పకుండా ఉంటుంది. మహేశ్‌తో సినిమా చేద్దామనుకున్నాను కానీ మంచి కథ చెప్పలేకపోయా. -
‘త్వరలో ఆ సూపర్ హిట్‌కు సీక్వల్’
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా అదుర్స్. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో రికార్డ్లను తిరగ రాసింది. తరువాత చాలా సందర్భాల్లో ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ వినాయక్ హింట్ ఇచ్చారు. అయితే అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘ఇంటిలిజెంట్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా మరోసారి వినాయక్ అదుర్స్ సీక్వల్ ప్రస్తావన తీసుకువచ్చారు. ‘గతంలోనే అదుర్స్ సీక్వల్ కు ప్రయత్నాలు జరిగినా అది సాధ్యం కాలేదు. కానీ తప్పకుండా అదుర్స్ సీక్వల్ చేస్తాన’ని అన్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఇంటిలిజెంట్ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. సీ కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. -
ఆ అన్నదమ్ములిద్దరూ కలిస్తే తేజ్
‘‘తేజూతో ‘చమకు చమకు..’ సాంగ్ చేసేటప్పుడు చిరంజీవి గారే గుర్తుకొచ్చారు. రెండు మూడు సీన్స్‌లో పవన్‌కల్యాణ్‌లా తేజు కనపడేలా తీశాం. ఎందుకంటే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు కలిస్తే ఎలా ఉంటుందో తేజు స్టైల్ అలా ఉంటుంది’’ అన్నారు వీవీ వినాయక్. సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా వినాయక్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ ఈ నెల 9న విడుదలవుతోంది. రాజమండ్రిలో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో వినాయక్ మాట్లాడుతూ– ‘‘మెగా ఫ్యామిలీలోని కష్టపడే తత్వం తేజులోనూ ఉంది. తేజు కూడా చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్ అంత పెద్ద స్టార్ కావాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పట్నుంచి పెద్ద డైరెక్టర్ని అవుతానని నమ్మినవారిలో సి.కల్యాణ్ అన్నయ్య ఒకరు. ఆయన రామానాయుడిగారిలా వంద సినిమాలు తీస్తారు. ఆ జర్నీలో నేనూ ఉంటాను. మాతోపాటు విడుదలవుతున్న ‘తొలి ప్రేమ’, ‘గాయత్రి’ సినిమాలు పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘అత్తకి యముడు అమ్మాయికి మొగుడు’ సినిమా వంద రోజుల ఫంక్షన్ తర్వాత ఆ రేంజ్లో గ్రాండ్‌గా జరుగుతున్న ఫంక్షన్ ‘ఇంటిలిజెంట్’. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ వినాయక్‌గారు. ఇంత మంచి సినిమా చేసే చాన్స్ ఇచ్చారు. ప్రేక్షకులకు, మెగా ఫ్యాన్స్‌కు ఈ సినిమా గుర్తుండిపోయేలా ఉంటుంది. మెగాస్టార్, పవర్‌స్టార్, మెగాపవర్‌స్టార్, స్టైలిష్ స్టార్, వరుణ్.. నాకు పంచభూతాలు. చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్‌గారు, నాగబాబుగారు నాకు గురువులు. వారు లేకుండా ఈ స్టేజ్‌పై నేను లేను’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు తేజ్ చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. వినాయక్ సినిమాను ఇరగదీశారు. పాటలు చూస్తుంటే చిరంజీవిగారి సాంగ్స్ చూస్తున్నట్లుంటుంది. ఓ దర్శకుడు కారు దిగగానే సింహం, పులి, ఏనుగులా గంభీరంగా అనిపించేవారిలో దాసరిగారు ఒకరు. ఆయన తర్వాత అలా అనిపించే దర్శకుడు వినాయక్ మాత్రమే’’ అన్నారు సి.కల్యాణ్. -
టాలీవుడ్ టైటానిక్
‘టైటానిక్’ సినిమాను నిర్మించిన ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ సంస్థ మన టాలీవుడ్‌పై కన్నేసింది. ‘టైటానిక్’ను తెలుగులో ఒకేసారి ముగ్గురు దర్శకులతో రీమేక్ చేయాలని నిర్ణయించుకొని వారితో సమావేశం ఏర్పాటు చేసింది.‘‘లోకల్ఫ్లేవర్ మిస్ కాకుండా, ఇది మన సినిమానే అని ప్రతి తెలుగు ప్రేక్షకుడు అనుకునేలా మాకో సినిమా తీసిపెట్టాలి’’ అని ఆ డైరెక్టర్లను అడిగింది ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్. ముగ్గురు దర్శకులు ఉత్సాహంగా రంగంలోకి దిగి తమ సత్తా చాటారు. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దామా మరి....రామ్‌గోపాల్‌వర్మ టైటానిక్:హుస్సేన్‌సాగర్ నీళ్లలో టైటానిక్ వేగంగా దూసుకుపోతుంది. షిప్ లోపల దృశ్యం: ‘‘అన్నా...అటు చూడు...వాడే శివ’’ పాన్‌పరాగ్ నోట్లో పోసుకుంటూ భవానీ చెవిలో చెప్పాడు నానాజీ. ‘‘శివా...శివా..శివా...షిప్లో కూడా శివా. ఎటాక్ హిమ్’’ అని ఆవేశంగా అరిచాడు భవానీ.హాకీ కర్రలు, క్రికెట్ బ్యాట్లతో శివను చుట్టు ముట్టింది భవానీ గ్యాంగ్. ‘‘ఏమిటలా డీప్‌గా ఆలోచిస్తున్నావు? ఎలా తప్పించుకోవాలనా!’’ తన తల వెంట్రుకలను వెనక్కి తోస్తూ వెటకారంగా నవ్వాడు భవానీ.‘‘నీ గురించి కాదెహే.... మా అఖిల్ గురించి ఆలోచిస్తున్నాను. మూడో సినిమా ఏ డెరెక్టర్‌కు అప్పగిస్తే సేఫా అని’’ కూల్‌గా చెప్పాడు శివ.‘‘ముందు నీ సేఫ్టీ గురించి ఆ భగవంతుడిని ప్రార్థించు’’ అంటూ శివ కణతలపై రివాల్వర్ పెట్టాడు భవానీ. ఇంతలో.... పెద్ద శబ్దం! టైటానిక్ ఒక పక్కకు ఒరిగిపోతుంది. షిప్‌లోని ప్రయాణికులు భయంతో పెద్దగా అరుస్తున్నారు. ఆ అరుపుల దెబ్బకు భవానీ చేతిలోని పిస్టల్ జారి కింద పడిపోయింది. మెరుపు వేగంతో ఆ పిస్టల్ మీద కాలువేశాడు శివ.‘‘ఒరే భవానీ...నా నడుముకు ఏముందో తెలుసా?’’ అంటూ భవానీ జుట్టు పట్టుకొని అడిగాడు శివ.‘‘బెల్ట్. కొంపదీసి ఆ బెల్ట్‌తో బాదుతావేంటీ?’’ వణికిపోయాడు భవానీ.‘‘బెల్ట్ కాదు...సైకిల్ చైన్..బాదడం కాదు బాక్స్ బద్దలు చేస్తాను’’ అంటూ పటపటమని సౌండ్ వస్తుండగా ప్యాంట్‌కు బెల్ట్‌లా ఉన్న సైకిల్ చైన్ తీశాడు శివ. ఈలోపు టైటానిక్‌లో ఉన్న ప్రయాణికులంతా శివను చుట్టుముట్టి ‘‘ఈ భవానీగాడి సంగతి తరువాత. ముందు టైటానిక్ మునిగిపోకుండా చూడు...మమ్మల్ని కాపాడు శివా...’’ అని దీనంగా వేడుకున్నారు.‘‘ఎవ్వరూ భయపడాల్సిన అవసరంలేదు. వినాయక నిమజ్జనం ఎప్పుడైంది?’’ అడిగాడు శివ. ‘‘జస్ట్ రెండు రోజుల క్రితమే’’ అన్నారు ప్రయాణికుల్లో ఒకరు.‘‘హుస్సేన్‌సాగర్ లోతు 32 అడుగులు. 29 అడుగుల వరకు విగ్రహాలే ఉన్నాయి. పూడిక సంగతి సరేసరి. ఇక టైటానిక్ ఎలా మునుగుతుంది? హౌ ఇటీజ్ పాసిబుల్?! మీరు భయపడుతున్నట్లు టైటానిక్ మునగడం లేదు. జస్ట్ పక్కకు ఒరిగింది అంతే...’’ అసలు విషయం చెప్పాడు శివ. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తరువాత...చేతికిచుట్టుకున్న సైకిల్ చైన్‌తో భవానీ ఫేస్ మీద ఒక పంచ్ ఇవ్వబోయి సడన్‌గా ఆగాడు శివ.‘‘రేయ్ భవానీ... నిన్ను సైకిల్ చైన్‌తో కొట్టి చంపుతాననుకున్నావా! కానే కాదు. ఈ హుస్సేన్‌సాగర్ నీళ్లు జస్ట్ ఒక లీటర్ తాగిస్తానంతే’’ అని శివ అన్నాడో లేదో గ్యాంగ్‌స్టర్ భవానీ గుండె ఆగి అక్కడికక్కడే చనిపోయాడు. వి.వి. వినాయక్ టైటానిక్: ధవళేశ్వరం గోదావరి జలాల్లో టైటానిక్ దూసుకువస్తుంది. కాటన్ బ్యారేజీ మీద తెల్లటి టాటా సుమోలు బారులు తీరి ఉన్నాయి. అందులో నుంచి నల్లటి తుమ్మ మొద్దుల్లాంటి గూండాలు, నల్లటి బాంబులతో దిగారు. ‘‘అదిగో టైటానిక్...ఆదిసుబ్బుసాంబసింహాద్రినాయుడు దాంట్లోనే ఉన్నాడు. ఏసేండ్రా బాంబులు’’ అని అరిచాడు అందులో ఒక వ్యక్తి. ఆ సమయంలోనే పెద్ద శబ్దంతో టైటానిక్ గోదావరిలో మునగడం మొదలైంది. షిప్లో ఉన్న ప్రయాణికులు భయంగా అరుస్తూ ‘‘మీరే రక్షించాలి’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్‌ను చుట్టుముట్టారు. ‘‘మీరేం భయపడవద్దు. తాతగారు తరచుగా ఒక మాట అంటుండే వారు... ‘కర్మనేషు కార్పణ్యం కనామి సునామి అని.’’ అన్నాడు ఎన్టీఆర్. ‘‘దాని మీనింగ్ ఏమిటండీ?’’ ఆసక్తిగా అడిగాడు ఒక అభిమాని. ‘‘ఈ టెన్షన్లో నీకు మీనింగ్ అవసరమా?’’ అని తీవ్రంగా విసుక్కున్నాడు ఎన్టీఆర్. టైటానిక్ మరింత లోతులోకి మునిగిపోతుంది. ఏడుపులు, పెడబొబ్బలు ఎక్కువయ్యాయి. ‘‘ఆపండి’’ అని గట్టిగా అరిచాడు ఎన్టీఆర్. పిన్ డ్రాప్ సైలెన్స్. ‘‘అమ్మతోడు...ఈ షిప్‌ను అమాంతం పైకి లేపుతా’’ అని మీసం తిప్పుతూ తొడ కొట్టడం స్టార్ట్ చేశాడు. మునిగిపోతున్న టైటానిక్ వేగంగా పైకి లేవడం మొదలైంది. ‘రామయ్యా వచ్చాడయ్యా...టైటానిక్ లేపాడయ్యా’ పాట షిప్లో హోరెత్తిపోయింది. రాజమౌళి టైటానిక్: విజయవాడ కృష్ణా నది జలాల్లో ప్రయాణిస్తున్న టైటానిక్ ప్రమాదానికి గురై మునగడం మొదలైంది. షిప్‌లోని ప్రయాణికులు అంతులేని శోకాలు పెడుతూ బాహుబలిని చుట్టుముట్టారు.‘దండాలయ్యా...దండాలయ్యా... మునుగుతున్న టైటానిక్‌ను లేపాలయ్యా... లేపాలయ్యా’ అని పాడటం మొదలు పెట్టారు.‘ఓస్...అదెంత పని!’’ అని షిప్లో నుంచి నదిలోని నీళ్లలోకి దూకాడు బాహుబలి.‘‘సేవ్ చేయమంటే... జంప్ చేశాడేమిటి?’’ అని తలలు పట్టుకున్నారు ప్రయాణికులు. టైటానిక్ మరింత లోతులోకి మునుగుతుంది. షిప్‌లోకి నీళ్లు రావడం మొదలైంది. ఏడుపులు, పెడబొబ్బలు ఆకాశాన్ని అంటాయి. ఈలోపే...‘‘మీ ఏడుపులు ఆపండహే’’ అంటూ పెద్ద గొంతు ఒకటి వినిపించింది.ఇప్పుడు టైటానిక్ కృష్ణానది నీళ్లలో లేదు. ఆ నీళ్లలోనే ఉన్న బాహుబలి భుజాల మీద ఉంది. ‘బాహుబలి–1’ సినిమాలో మహాశివలింగాన్ని భుజాల మీద మోసినట్లు, ఇప్పుడు టైటానిక్ షిప్‌ను భుజాల మీదమోస్తూ ఒడ్డుకు చేరుకున్నాడు బాహుబలి. ‘సాహోరే బాహుబలి... సేవ్ చేశాడ్రో టైటానిక్‌ని’ అంటూ పాట అందుకున్నారు షిప్‌లోని ప్రయాణికులు. ఈ మూడు సినిమాలు ‘టైటానిక్ థీమ్’తోనే తయారై, ఒకేసారి విడుదలై రికార్డ్‌లు బద్దలు కొట్టి టాలీవుడ్‌ను షేక్ చేశాయి.శుభం – యాకుబ్ పాషా -
పేరు.. డబ్బులు రావాలి – వినాయక్
‘‘ఎందుకో ఏమో’ టైటిల్‌లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నందు, నోయల్, పునర్నవి ముఖ్య తారలుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న సినిమా ‘ఎందుకో ఏమో’. ఈ చిత్రం టీజర్‌ను వినాయక్ విడుదల చేశారు. కోటి వద్దినేని మాట్లాడుతూ– ‘‘ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మా నిర్మాత రాజీ పడకుండా, నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగా. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో, అదే నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి లవ్ స్టోరీతో పాటు కమర్షియల్ హంగులు మా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు మాలతి. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్, కెమెరా: జీయస్ రాజ్ (మురళి). -
‘ఇంటిలిజెంట్’ సాంగ్ రిలీజ్ చేసిన ప్రభాస్
-
వినాయక్ చేతుల మీదుగా ‘ఎందుకో ఏమో’ టీజర్ లాంచ్
మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ఎందుకో ఏమో. కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు స్టార్ డైరక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ టైటిల్ లాగే టీజర్ కూడా చాలా ట్రెండీగా, ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్న కోటికి మంచి పేరు, నిర్మాతకు లాభాలు రావాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా శుభాకాంక్షలు’’ అన్నారు. దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ...‘‘ ఎందుకో ఎమో’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నా. ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా మా చిత్రం టీజర్ ఆవిష్కరించిన వి.వి.వినాయక్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నందు, నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా నటించారు. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా, పూర్తి స్వేచ్ఛ నివ్వడంతో అనుకున్నట్టుగా సినిమా తీయగలిగాం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాత మాలతి వద్దినేని మాట్లాడుతూ...‘‘ మహేశ్వర క్ర్రియేషన్స్ పతాకంపై ఇది మా తొలి సినిమా. వినాయక్ గారి చేతుల మీదుగా మా చిత్రం టీజర్ విడుదల కావడం శుభసూచకంగా భావిస్తున్నాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమాను ఏ విషయంలో రాజీ పడకుండా నిర్మించాం. మంచి లవ్ స్టోరీ తో పాటు కమర్షియల్ హంగులు కూడా సినిమాలో ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. మా యూనిట్ అంతా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో సినిమాను అనుకున్నవిధంగా పూర్తి చేయగలిగాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఆడియో విడుదల చేసి సినిమాను కూడా అదే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మెగా హీరోకు ప్రభాస్ హెల్ప్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్లో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇంటిలిజెంట్. సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌కు మరో స్టార్ హీరో సాయం చేయనున్నాడు. ఇంటిలిజెంట్ సినిమాలో తొలి సింగిల్‌ను బాహుబలి స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం సాయత్రం 4 గంటలకు ఈ పాట సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. #Baahubali Prabhas Will be releasing #Inttelligent 1st single " Let's Do " today @ 4 P. M#InttelligentOnFeb9th #VVVinayak@IamSaiDharamTej @ProducerCKalyan @Itslavanya @MusicThaman @adityamusic pic.twitter.com/jh8mISSAcd — CK Entertainments (@CKEntsOffl) 28 January 2018 -
'ఇంటిలిజెంట్' టీజర్ విడుదల
-
పేదోడికి ప్లాట్ ఫాం.. ధర్మాభాయ్.కామ్
వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంటిలిజెంట్. సాయి ధరమ్ ధర్మభాయ్ గా నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సికె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి.కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఇంట్రస్టింగ్ పోస్టర్లతో ఆకట్టుకున్న ఇంటిలిజెంట్ యూనిట్, తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. సుప్రీం హీరోని తన మార్క్ మాస్ లుక్ లో చూపించాడు వినాయక్. టీజర్ లోనే సినిమా పక్కా మాస్ యాక్షన్ అని కన్ఫామ్ చేశారు. టీజర్ మొత్తం సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ ను ప్రజెంట్ చేసేందుకే కేటాయించారు. స్టైలిష్ లుక్ లో రాహుల్ దేవ్ లోను కొన్ని క్షణాలు పాటు చూపించగా హీరోయిన్ను అసలు పరిచయం చేయలేదు. -
తప్పు కాదు కావాలనే అలా..!
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ ఇంటిలిజెంట్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్ లోగో రిలీజ్ చేయగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈసినిమా టైటిల్ లోగోలో ఇంటిలిజెంట్ పదం ఇంగ్లీష్‌లో స్పెల్లింగును మార్చి రాశారు. ‘INTELLIGENT’ స్పెల్లింగ్ ను ‘INTTELLIGENT’గా రాశారు. దీంతో పోస్టర్ లో తప్పు వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంపై బిఏరాజు క్లారిటీ ఇచ్చారు. న్యూమరాలజీ కరెక్షన్ కారణంగానే స్పెల్లింగ్ ను మార్చి రాశారని తెలిపారు. వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో ఉన్న సాయి ధరమ్ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్న వినాయక్ సినిమాను సక్సెస్ చేసేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. That is Not a spelling mistake !! You know that it is spelled according to Numerology, because you are too 'INTTELLIGENT' #Intelligent — BARaju (@baraju_SuperHit) 22 January 2018 -
అల్లరి మొగుడు గుర్తొస్తోంది – రాఘవేంద్ర రావు
‘‘విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్ చూస్తుంటే ‘అల్లరి మొగుడు’ సినిమా గుర్తుకు వస్తోంది. నాగేశ్వర రెడ్డి అంటేనే ఎంటర్టైన్మెంట్. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ వంటి ఎంటర్టైనర్స్ అందించిన మంచు విష్ణు – జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజా పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ సినిమాలో కామెడీ ‘ఢీ’ సినిమా రేంజ్లో పండుతుంది అనుకుంటున్నాను. కుమార్ చౌదరిగారి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వీవీ వినాయక్. ‘‘దేనికైనా రెడీ’ సినిమా కొన్ని సమస్యలను ఎదుర్కొంది. మళ్లీ బ్రాహ్మణుల పై ఎందుకు అనుకున్నాం కానీ మంచి కథ కుదిరింది. ఈ సినిమాలో వారి గొప్పతనాన్ని చెప్పాం. తమన్ చక్కటి సంగీతం సమకూర్చారు’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘విన్నీ (విరానిక) తర్వాత నేను పెళ్లి చేసుకున్నది డైరెక్టర్ నాగేశ్వర రెడ్డిగారినే. ఇద్దరం ప్రతి విషయంలో అంతలా వాదించుకుంటాం. సినిమాకు వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. మలేసియాలో జరిగిన యాక్సిడెంట్‌కు కారణం నేనే. ఆ స్టంట్ చేసి, నిర్మాతలకు నష్టం కలిగించాను. సారీ’’ అన్నారు విష్ణు. ‘‘విష్ణు కెరీర్లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. -
సాయి ధరమ్ తేజ్ ‘ఇంటెలిజెంట్’
వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, ప్రస్తుతం మాస్ సినిమా దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారట చిత్రయూనిట్. ముందుగా ఈ సినిమాకు ధర్మాభాయ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ఇంటెలిజెంట్’ అనే టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. హీరో విలన్ల మధ్య మైండ్ గేమ్ తో సాగే కథ కావడంతో ఇంటెలిజెంట్ అనే టైటిలే కరెక్ట్ అని భావిస్తున్నారట. త్వరలోనే టైటిల్ ను ఫైనల్ చేసి అధికారిక ప్రకటన చేయనున్నారు. -
ఫిబ్రవరిలో మెగా వార్
టాలీవుడ్ లో సినిమాల నిర్మాణం భారీగా పెరుగతోంది. దీంతో హీరోల మధ్య పోటి తప్పటం లేదు. అయితే ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు మాత్రం తమ సినిమాల మధ్య క్లాష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒక్కోసారి ఒకే ఫ్యామిలీ హీరోలకు మధ్య కూడా పోటి తప్పటం లేదు. ఫిబ్రవరిలో ఇలాంటి ఆసక్తికరమైన పోటి ఒకటి జరగనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం తొలిప్రేమ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే రోజు వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే ఇద్దరు మెగా హీరోలు ఒకే రోజు బరిలో నిలుస్తారు. మరి మెగా హీరోలు పోటికి సై అంటారో లేక.. ఎవరో ఒకరు సర్థుకు పోతారో చూడాలి. -
‘ధర్మా భాయ్’గా మెగా హీరో
జవాన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఓ ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నారట. సాయి సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు ఇంటలిజెంట్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈసినిమా మరీ క్లాస్ అయ్యిందన్న టాక్ రావటంతో ఇప్పుడు ధర్మా భాయ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. యాక్షన్ జానర్ సినిమా కావటంతో పాటు వినాయక్ ఇమేజ్ కు కూడా ఈ టైటిల్ అయితే నే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఇప్పటివరకు చిత్రయూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ధర్మా భాయ్ కే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
కొంచెం భయం కొంచెం ఆనందం
‘‘నేనొక దేవకన్య. స్వర్గం నుంచి భూమిపైకి ఎందుకొచ్చాను? హీరోను ఎలా కలిశాను? తనతో నా జర్నీ ఏంటి? అనేదే ‘ఏంజెల్’ సినిమా కథ. నా పాత్ర రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్లు బబ్లీగా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది’’ అని కథానాయిక హెబ్బా పటేల్ అన్నారు. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భువన్ సాగర్ నిర్మించిన ‘ఏంజెల్’ రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర ్భంగా హెబ్బా చెప్పిన విశేషాలు... ► ‘ఏంజెల్’ సినిమా రెగ్యులర్‌గా మనం చూసే హెవీ సబ్జెక్ట్ కాదు. చాలా సింపుల్‌గా, లైట్‌గా ఉంటుంది. ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో కథ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. నా గత సినిమాల కంటే ఇందులో నా బాధ్యత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ► నేనిప్పటి వరకూ ‘ఏంజెల్’ సినిమా చూడలేదు. రేపు విడుదల అంటే కొంచెం కంగారుగా, సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా? అనే ఆత్రుతగా ఉంది. మంచి సినిమా చేశామనే ఆనందం ఉంది. ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తా. ► నాగ అన్వేష్ చాలా మంచివాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. డ్యాన్సులు బాగా చేశాడు. తనతో పనిచేయడం హ్యాపీ. ‘ఏంజెల్’ మా ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుంది. ► ప్రస్తుతం సినిమా తప్ప వేరే ఆలోచన నాకు లేదు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులేవీ ఒప్పుకోలేదు. చర్చల దశలో ఉన్నాయి. వినాయక్ మాట సాయం ఓ స్టార్ హీరో లేదా స్టార్ డైరెక్టర్ ఓ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తున్నారంటే ఆ చిత్రంపై క్రేజ్ మరింతగా పెరుగుతుంది. తాజాగా ‘ఏంజెల్’ సినిమాకి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ వాయిస్ ఓవర్ అందించారు. కచ్చితంగా వినాయక్ మాటలు సినిమాకి ప్లస్ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. -
కాంబినేషన్ కుదిరింది..కల నిజమైంది!
మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్‌తో ఓ సినిమా చేయాలన్నది సాయిధరమ్ తేజ్ కల. ఆ కల ఈజీగానే నెరవేరింది. వీవీ వినాయక్ దర్శకత్వంలో తేజ్ హీరోగా శుక్రవారం ఓ సినిమా మొదలైంది. ‘‘వినాయక్‌గారితో లొకేషన్లో ఫస్ట్ డే. ఇది నిజమేనా అనిపిస్తోంది. కలలు నిజమవుతాయని అర్థమైంది’’ అని సాయిధరమ్ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు.. మేనమామ చిరంజీవితో రెండు హిట్ సినిమాలు (‘ఠాగూర్’, ‘ౖఖైదీ నెం. 150’)æ తీసిన డైరెక్టర్ తనతో సినిమా చేయడం అంటే మేనల్లుడికైనా ఆనందంగానే ఉంటుంది కదా. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది అని సమాచారం. -
మెగా హీరో ద్విపాత్రాభినయం..!
మెగా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్న సాయి, తరువాత ఫ్లాప్ లు పలకరించటంలో ఢీలా పడిపోయాడు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమా ధరమ్ తేజ్ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం రచయిత, దర్శకుడు బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సాయి. వినాయక్ లాంటి మాస్ స్పెషలిస్ట్ తో సినిమా చేస్తే మాస్ హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకొవచ్చని భావిస్తున్నాడు. అంతేకాదు వినాయక దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో సాయి ధరమ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో డ్యూయల్ రోల్ చేయించి సూపర్ హిట్స్ సాధించిన వినాయక్ సాయి కి కూడా హిట్ ఇస్తాడేమో చూడాలి. -
పవన్ డైరెక్టర్‌తో సాయి ధరమ్...!
డైరెక్టర్ కరుణాకరన్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే సినిమా తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమా, దర్శకుడిగా కరుణాకరన్ రేంజ్ ను కూడా పెంచింది. అయితే తొలి ప్రేమ తరువాత మరోసారి అంతటి భారీ విజయాన్ని నమోదు చేయటంలో ఫెయిల్ అవుతున్నాడు కరుణాకరన్. డార్లింగ్, ఉల్లాసంగా.. ఉత్సాహంగా లాంటి హిట్స్ ఉన్నా.. స్టార్ ఇమేజ్ తీసుకువచ్చే సినిమాలు మాత్రం ఇంత వరకు రాలేదు. మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్న కరుణాకరన్, త్వరలో మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్న సాయి ధరమ్ తేజ్, తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ వినాయక్ తో ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు వినిపిస్తుండగా.. కరుణాకరన్ తోనూ సినిమా అంగీకరించాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాను ముందు స్టార్ట్ చేస్తాడో తెలియాల్సి ఉంది. -
స్టార్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్..!
మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్. మెగా ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటూ తనకంటూ మార్కెట్ సంపాదించుకున్న సాయి, ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డాడు. తిక్క, విన్నర్ సినిమాలు సాయి మార్కెట్ మీద గట్టినే ప్రభావం చూపించాయి. అయితే ఆ కష్టాల నుంచి బయటపడి స్టార్ లీగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడీ మెగా హీరో. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నక్షత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సాయి ధరమ్ తేజ్. రైటర్ కమ్ డైరెక్టర్ బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. వీటితో ఓ స్టార్ డైరెక్టర్ తో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి హీరోగా వంద కోట్ల హిట్ అందుకున్న వివి వినాయక్ తో నెక్ట్స్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాకు స్టార్ రైటర్ కోనా వెంకట్ కథ అందింస్తున్నాడు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
శ్రీ... శ్రీ... శ్రీకారం జరిగింది
శ్రీ అంటే శ్రీవాస్ (దర్శకుడు). ఇంకో శ్రీ ఎవరంటే... శ్రీనివాస్. హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వీళ్లిద్దరి కలయికలో మేఘనా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ కెమేరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం శ్రీవాస్ మాట్లాడుతూ –‘‘బెల్లంకొండ శ్రీనివాస్‌ను సరికొత్తగా చూపించే చిత్రమిది. జగపతిబాబుగారు పవర్ఫుల్ విలన్‌గా కనిపిస్తారు. డిఫరెంట్ జోనర్లో తెరకెక్కనున్న కమర్షియల్ ఎంటర్టైనర్. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందీ సినిమా. వచ్చే నెలలో హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఫారిన్లో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అన్నారు. నిర్మాతలు ఎం.ఎస్. రాజు, బెల్లంకొండ సురేశ్, నల్లమలుపు బుజ్జి, చంటి అడ్డాల, మిర్యాల రవీందర్‌రెడ్డి, రచయిత గోపీమోహన్ తదితరులు పాల్గొన్నారు. రవికిషన్, మధు గురుస్వామి నటించనున్న ఈ చిత్రానికి కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
దేవకన్య ప్రేమకథ కొత్తగా ఉంటుంది! – వీవీ వినాయక్
‘‘దేవలోకం నుంచి వచ్చిన ఓ అమ్మాయి సాధారణ యువకుడితో ప్రేమలో ఎలా పడింది? అనేది ఈ చిత్రకథ. ‘ఠాగూర్’ నుంచి నిర్మాత కృష్ణారెడ్డిగారితో పరిచయ ముంది. దర్శకుడు కథ చెప్పారు. కొన్ని సీన్స్ చూశా. చాలా కొత్తగా ఉంటుందీ సినిమా. నాగ అన్వేష్ బాగా హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. తనకు హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలింస్ పతాకంపై భువన్ సాగర్ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘ఏంజెల్’. గురువారం వీవీ వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు. ‘‘తొమ్మిది నెలలు కథపై వర్క్ చేశాం. నాగ అన్వేష్ లుక్, గెటప్ అన్నీ కొత్తగా ఉంటాయి. హెబ్బా పటేల్ బాగా నటించింది. ప్రతి సీన్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి. ‘‘వినాయక్‌గారు కథ విని బాగా సపోర్ట్ చేశారు. సప్తగిరి కామెడీ, భీమ్స్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు దర్శకుడు పళని. భువన్ సాగర్, నాగ అన్వేష్, హెబ్బా పటేల్, సంగీత దర్శకుడు భీమ్స్, హాస్యనటుడు సప్తగిరి, కథా రచయిత రమేష్ రెడ్డి, మాటల రచయిత శ్రీనివాస్ సంకల్ప్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: ముప్పా వెంకయ్యచౌదరి. -
ఏంజెల్ టీజర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్
శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో యంగ్ హీరో నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ఏంజెల్. దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నాడు. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరై ఏంజెల్ మూవీ టీజర్‌ను లాంఛ్ చేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ, సింధూరపువ్వ కృష్ణారెడ్డి గారితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఏంజెల్ కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమాకి మొదటి నుంచి తన సహాయ సహాకారులు అందిస్తున్నట్లుగా తెలిపారు. కథ విన్న వెంటనే తనకి చాలా ఆశక్తిగా అనిపించి కృష్ణారెడ్డిగారిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. అలానే హీరో నాగా అన్వేష్ చిన్నప్పటి నుంచి నటన పైనే ధ్యాస పెడుతూ చిత్ర సీమలో ఒక్కో మొట్టు పైకి ఎక్కుతున్నాడని, ఈ సినిమా కచ్ఛితంగా అన్వేష్ కెరీర్‌ని ఓ కీలక మలుపు తిప్పుతొందని అన్నారు. వినాయక్‌తో పాటు ఈ కార్యక్రమంలో ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్, సింధూరపువ్వు కృష్ణరెడ్డి, సప్తగిరి, తదితరులు పాల్గొన్నారు. -
వినాయక్ నెక్ట్స్ విన్నర్ తోనే..?
ఖైదీ నంబర్ 150 సక్సెస్ తో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న వి వి వినాయక్, నెక్ట్స్ సినిమాను ఓ యంగ్ హీరోతో ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన వినాయక్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. మాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తున్న సాయి, వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఖైదీ లాంటి భారీ హిట్ తరువాత వినాయక్, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమా చేయాలని భావించాడు. అయితే బాలయ్య ఇప్పటికే వరుసగా సినిమాలకు కమిట్ అయి ఉండటంతో ఇప్పట్లో బాలయ్య, వినాయక్ ల కాంబినేషనేషన్ సెట్స్ మీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మీడియం రేంజ్ సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు వినాయక్. ఇప్పటి వరకు ఎక్కువగా స్టార్ హీరోలను మాత్రమే డీల్ చేసిన వినాయక్, చాలా కాలం తరువాతా సాయిలాంటి మీడియం రేంజ్ హీరోతో కలిసి పనిచేసే ఆలోచన చేస్తున్నాడు. తిక్క, విన్నర్ లు ఫ్లాప్ అవ్వటంతో ఆలోచనలో పడ్డ సాయి, ప్రస్తుతం బీవీయస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇలాంటి సమయంలో వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే సాయి కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్. -
ప్రేమలీల ఒకరిది పెళ్లి గోల మరొకరిది
రెండు దశాబ్దాలకు పైగా రాయలసీమలో 400 సినిమాలు పంపిణీ చేసిన శ్రీ మహావీర్ ఫిలిమ్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. విష్ణు విశాల్, నిక్కీ గల్రానీ జంటగా ఎళిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెల్లై కారన్’ అనే తమిళ చిత్రాన్ని ‘ప్రేమలీల–పెళ్ళి గోల’ పేరుతో మహావీర్ ఫిలిమ్స్ అధినేత పారస్ జైన్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సత్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను డైరెక్టర్ వీవీ వినాయక్, నిర్మాత ఆర్.బి. చౌదరి విడుదల చేశారు. ఆర్. బి.చౌదరి మాట్లాడుతూ– ‘‘విష్ణు విశాల్‌కు తమిళ్లో హీరోగా మంచి గుర్తింపు ఉంది. అతని టైమింగ్, నటన బాగుంటుంది. హిలేరియస్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘పారస్ జైన్ ఎన్నో మంచి సినిమాలు పంపిణీ చేశారు. మంచి కంటెంట్ ఉన్న ‘ప్రేమలీల పెళ్లిగోల’ ఘనవిజయం సాధించాలి’’ అని వీవీ వినాయక్ అన్నారు. పారస్ జైన్ మాట్లాడుతూ– ‘‘ప్రేమలీల ఒకరిది. పెళ్ళి గోల మరొకరిది. అదే ఈ సినిమా. ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం చాలామంది పోటీపడ్డా, నా మీద నమ్మకంతో విష్ణు విశాల్ నాకు ఇప్పించారు. ముందు రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ, కామెడీ మిస్ అవుతుందని విష్ణు విశాల్ చెప్పడంతో డబ్బింగ్ చేసి, రిలీజ్ చేస్తున్నాం. ఈ వేసవిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
సౌతిండియాలో మణిరత్నం తర్వాత పూరీనే!
– వీవీ వినాయక్ ‘‘పాతిక సినిమాలు తీస్తే... అన్నిటికీ కథ, మాటలు సొంతంగా రాసుకున్న దర్శకులు సౌతిండియాలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు.. మణిరత్నం. ఆయన తర్వాత సౌతిండియాలో జగ్గూభాయ్ (పూరి జగన్నాథ్) ఒక్కడే. ‘టెంపర్’ తప్ప జగ్గూభాయ్ తీసిన ప్రతి సినిమా కథ, మాటలు ఆయనవే. నిజమైన దర్శకుడతను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ నిర్మించిన సినిమా ‘రోగ్’. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ‘రోగ్’ ఆడియో సోమవారం విడుదలైంది. హిందీ నటుడు అర్భాజ్‌ఖాన్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, వీవీ వినాయక్‌కు అందజేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ ‘‘తమ్ముణ్ణి హీరోగా లాంచ్ చేయాలని పూరి కోసం సీఆర్ మనోహర్‌గారు రెండేళ్లు ఎదురు చూశారు. ఆయన ఎందుకు వెయిట్ చూశారో.. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. జగ్గూభాయ్ వయసులో వెనక్కి వెళ్లుంటాడు. ఎవరో కొత్త కుర్రాడు సినిమా తీసినట్టుంది. ఇషాన్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘‘నేను ‘బద్రి’ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నిర్మాత త్రివిక్రమ్‌రావుగారికి ఎలా చేస్తానోననే టెన్షన్ ఉండేది. ఫస్ట్‌డే ప్యాకప్ చెప్పిన తర్వాత ‘50 సినిమాలు తీస్తావ్’ అన్నారు. ఆల్రెడీ 33 తీశా. అప్పుడాయన ఎంత నమ్మకంతో చెప్పారో... నేనూ అంతే నమ్మకంతో చెబుతున్నా. ఇషాన్ 50 సినిమాలు చేస్తాడు. సునీల్ కశ్యప్ మంచి మెలోడీలు ఇచ్చాడు’’ అన్నారు. సీఆర్ మనోహర్ మాట్లాడుతూ ‘‘పూరిగారి చేతుల్లో పడడం ఇషాన్ అదృష్టం. ఇషాన్ మా బాబాయ్ కుమారుడు. ‘మా అన్నయ్య డబ్బులు పెడుతున్నాడు, హీరోగా ఏదో ఒకటి చేసేద్దాం’ అని రాలేదు. చాలా కష్టపడ్డాడు’’ అన్నారు. ఇషాన్ మాట్లాడుతూ ‘‘ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో... నాకు ఇంత మంచి అన్నయ్యలు, ఫ్యామిలీ దొరికింది. అందరూ నేను సూపర్‌స్టార్ అవుతానంటున్నారు. తప్పకుండా ఏదొక రోజు సూపర్‌స్టార్ అయ్యి, మా ఫ్యామిలీ పేరు నిలబెడతా’’ అన్నారు. ‘‘హీరోలను ఇంట్రడ్యూస్ చేయాలంటే రాఘవేంద్రరావుగారి తర్వాత పూరిగారే. తమిళంలో ఈ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నా’’ అన్నారు ఏఎం రత్నం. ఈ వేడుకలో సన్నీ లియోన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాతలు ‘భవ్య’ ఆనంద్‌ప్రసాద్, పీవీపీ, దర్శకుడు క్రిష్, హీరో రామ్‌శంకర్, ఆకాశ్ పూరి తదితరులు పాల్గొన్నారు.