Director VV Vinayak Comments on Former Minister Kodali Nani - Sakshi
Sakshi News home page

కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా: వివి వినాయక్‌

Published Sat, Jan 14 2023 5:22 PM | Last Updated on Sat, Jan 14 2023 6:02 PM

Director VV Vinayak Comments on Former Minister Kodali Nani - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో నిర్వహించిన జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు ప్రదర్శనలకు వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్‌కు మాజీ మంత్రి కొడాలి నాని గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్‌ వివి వినాయక్‌ చెప్పారు. ఏపీలో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. 

ఈ మేరకు వివి వినాయక్‌ మాట్లాడుతూ.. 'అందరూ కళకళలాడుతున్నారు. చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ప్రతీ సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు ప్రదర్శనలను తొలిసారి వీక్షించాను. ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ఈ ఏడాది మార్చిలో నేను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుంది. హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తా. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. కొడాలి నాకెంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు నేను సిద్ధం' అని వివి వినాయక్‌ చెప్పారు.  

చదవండి: (అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement