
అదేంటీ? ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ తగ్గడమేంటి? అనేగా మీ డౌట్. మోహన్‌లాల్ అక్కడ. పాత్రకు తగ్గ వయసుకి మారిపోతుంటారాయన. తాజాగా ‘ఒడియన్’ సినిమా కోసం 55 సంవత్సరాల మోహన్‌లాల్ 35 సంవత్సరాల యువకునిలా కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించడం విశేషం. శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ లీడ్ రోల్‌లో నటించిన మలయాళ చిత్రం ‘ఒడియన్’. ఈ చిత్రం తెలుగు హక్కుల్ని దగ్గుపాటి అభిరామ్, సంపత్ కుమార్ సొంతం చేసుకున్నారు.
మలయాళం, తెలుగు భాషల్లో డిసెంబర్ 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌ను అభినందించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మోహన్‌లాల్‌గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ‘ఒడియన్’ చిత్రం తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రియేషన్స్ సొంతం చేసుకుంది. శ్రీ కుమార్ మీనన్‌గారు ఆయన్ని 35ఏళ్ల వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment