
శ్రీ... శ్రీ... శ్రీకారం జరిగింది
శ్రీ అంటే శ్రీవాస్ (దర్శకుడు). ఇంకో శ్రీ ఎవరంటే... శ్రీనివాస్. హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వీళ్లిద్దరి కలయికలో మేఘనా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
శ్రీ అంటే శ్రీవాస్ (దర్శకుడు). ఇంకో శ్రీ ఎవరంటే... శ్రీనివాస్. హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వీళ్లిద్దరి కలయికలో మేఘనా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి కొరియోగ్రాఫర్ కమ్ హీరో కమ్ డైరెక్టర్ రాఘవా లారెన్స్ కెమేరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం శ్రీవాస్ మాట్లాడుతూ –‘‘బెల్లంకొండ శ్రీనివాస్‌ను సరికొత్తగా చూపించే చిత్రమిది. జగపతిబాబుగారు పవర్‌ఫుల్ విలన్‌గా కనిపిస్తారు. డిఫరెంట్ జోనర్‌లో తెరకెక్కనున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందీ సినిమా. వచ్చే నెలలో హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఫారిన్‌లో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాం’’ అన్నారు. నిర్మాతలు ఎం.ఎస్. రాజు, బెల్లంకొండ సురేశ్, నల్లమలుపు బుజ్జి, చంటి అడ్డాల, మిర్యాల రవీందర్‌రెడ్డి, రచయిత గోపీమోహన్ తదితరులు పాల్గొన్నారు. రవికిషన్, మధు గురుస్వామి నటించనున్న ఈ చిత్రానికి కళ: ఏఎస్ ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: ఆర్థర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.