
వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయిన తరువాత బాలయ్య మరింత జోష్‌తో సినిమాలు చేస్తున్నాడు. వందో సినిమా తరువాత ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసిన బాలకృష్ణ, ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా బాలయ్య ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. చాలా రోజులుగా బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ ను సెట్ చేసేందుకు పెద్ద నిర్మాణ సంస్థలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాను నిర్మించేందుకు ఉత్సాహం గా ఉంది. మరి కాంబినేషన్‌కు బాలయ్య ఓకె చెప్తాడా..? లేదా..? చూడాలి.