ఆగిపోయిన వినాయక్‌ ‘సీనయ్య’? | VV Vinayak Unexpected Stopped His New Movie As A Hero | Sakshi
Sakshi News home page

వినాయక్‌ సినిమాకు బ్రేక్‌.. కారణం ఏంటి?

Published Wed, Feb 19 2020 11:41 AM | Last Updated on Wed, Feb 19 2020 11:41 AM

VV Vinayak Unexpected Stopped His New Movie As A Hero - Sakshi

దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు వివి వినాయక్‌. దాదాపు అగ్రహీరోలందరితోనూ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్‌.. మరికొంతమంది నటీనటులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఈయన హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దమయ్యాడు. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. దిల్‌ రాజు  నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ చిత్రం కోసం వినాయక్‌ చాలానే కష్టపడ్డాడు. హీరో లుక్‌ కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు. బాడీ లాంగ్వేజ్‌ కూడా మార్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో మరో దర్శకుడు సక్సెస్‌ హీరో అవబోతున్నాడంటూ ప్రశంసలు కూడా వచ్చాయి.

అయితే అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన సినిమా ఔట్‌పుట్‌, తెరకెక్కిన విధానంపై దిల్‌ రాజు, వినాయక్‌లు అసంతృప్తితో ఉన్నారట. అంతేకాకుండా ఈ సినిమా కథ కూడా గతంలో వచ్చిన ఓ సూపర్‌ డూపర్‌ హిట్‌ కథకు పోలిక ఉండటంతో రిస్క్‌ చేయడం ఎందుకని దిల్‌ రాజు భావించాడట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఆపేసినట్లు టాక్‌. అంతేకాకుండా ఏకంగా ఈసినిమాను పక్కకు పెట్టేసినట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

చదవండి:
చాలెంజ్‌ స్వీకరించిన వివి వినాయక్‌
అన్నయ్యను గుర్తుచేసుకున్న కళ్యాణ్‌రామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement