వివి. వినాయక్ ప్రియ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమైన చిత్రం గీత. హెబ్బా పటేల్ కథానాయికగా, సునీల్ ముఖ్యపాత్రలో నటించగా "నువ్వే కావాలి, ప్రేమించు" వంటి పలు చిత్రాల్లో హీరోగా చేసిన సాయి కిరణ్ విలన్‌గా నటించారు. ఈ నెల 14న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. తొలి చిత్రంతోనే ఎంతో ప్రతిభ కనబర్చిన విశ్వకు చాలా మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చారు పలువురు దర్శకులు. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి సైతం విశేష ప్రశంసలు అందుకుంటున్న "గీత" సినిమాను తెలుగు దర్శకుల సంఘం సభ్యుల కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో విచ్చేసిన దర్శకులు చిత్ర నిర్మాత ఆర్.రాచయ్య, దర్శకుడు విశ్వలపై ప్రశంసల వర్షం కురిపించారు.
అప్పట్లో గ్లామర్ రోల్స్‌కు పరితమైన రాధతో "ఆత్మబంధువు" చిత్రం తీసి మెప్పించిన భారతీ రాజా కోవలో... గ్లామర్ హీరోయిన్ హెబ్బా పటేల్ నుంచి అద్భుత నటన రాబట్టుకున్నారని కొనియాడారు. దర్శకుడు విశ్వను శాలువాతో సత్కరించి పూల మొక్కను కానుకగా ఇచ్చారు. దర్శకత్వ శాఖలో తలలు పండిన ఎందరో మేధావులు "గీత" చిత్రాన్ని ఇంతగా మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్న విశ్వ... తొలి ప్రయత్నంలో దొర్లిన తేలికపాటి తప్పులు రెండో చిత్రంలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. తన గురువు వి.వి.వినాయక్, తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత ఆర్.రాచయ్యలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.
చదవండి: కొత్త ఫ్లాట్ కొన్న బుల్లితెర నటి
యాంకర్ సుమ సంపాదనే ఎక్కువా?: ఆమె భర్త ఏమన్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment