
శంకర్ హీరోగా శ్రీధర్. ఎన్ దర్శకత్వంలో ఎస్.కె.పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్. పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘శంభో శంకర’. మే డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ– ‘‘శంకర్ రెండేళ్లు నాతో ట్రావెల్ చేశాడు. శ్రీకాకుళం నుంచి వచ్చి హీరోగా ఎదగడం ఆశ్చర్యంగాను, సంతోషంగాను ఉంది. సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బాధపడే వాళ్లకు శంకర్ ఓ స్ఫూర్తి. ఫస్ట్ పాట బావుంది. శంకర్ మాస్ లుక్‌లో బావున్నాడు. సినిమా సక్సెస్ అయి, అందరికీ మంచి పేరు తీసుకు రావాలి’’ అన్నారు. ‘‘ఇండస్ట్రీలో నాకు వినాయక్‌గారు గాడ్‌ఫాదర్. ఆయన వద్ద చాలా కాలం పనిచేసి, చాలా విషయాలు నేర్చుకున్నాను.
నా మిత్రుడు శ్రీధర్‌తో సినిమా చేస్తున్నాను. నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో శంకర్. ‘‘శంకర్, నేను ఫ్రెండ్స్. ఈ సినిమాతో నేను డైరెక్టర్‌గా, శంకర్ హీరోగా పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. ఏది అడిగినా సమకూర్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు శ్రీధర్. ‘‘వినాయక్‌గారు ఈ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శంకర్ స్టార్ హీరోల్లాగే కష్టపడ్డారు. శ్రీధర్ శ్రమించి స్క్రిప్ట్ చేశారు. నిర్మాత బడ్జెట్ విషయంలో రాజీపడలేదు. సినిమా హిట్ అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదు’’ అన్నారు నిర్మాత సురేశ్ కొండేటి. నిర్మాతల్లో ఒకరైన రమణా రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment