'రుద్రాక్ష'లో అనుష్క కాదు సమంత | samantha in krishna vamsi rudhraksha | Sakshi
Sakshi News home page

'రుద్రాక్ష'లో అనుష్క కాదు సమంత

Published Fri, Jan 29 2016 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

'రుద్రాక్ష'లో అనుష్క కాదు సమంత

'రుద్రాక్ష'లో అనుష్క కాదు సమంత

రుద్రమదేవి, సైజ్ జీరో వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తరువాత అనుష్క ప్రధాన పాత్రలో మరో లేడి ఓరియంటెడ్ సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం జరిగింది. కృష్ణవంశీ దర్శకత్వంలో హార్రర్...

రుద్రమదేవి, సైజ్ జీరో వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల తరువాత అనుష్క ప్రధాన పాత్రలో మరో లేడి ఓరియంటెడ్ సినిమా తెరకెక్కుతుందన్న ప్రచారం జరిగింది. కృష్ణవంశీ దర్శకత్వంలో హార్రర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కించాలని భావించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.

రుద్రాక్ష సినిమాలో లీడ్ క్యారెక్టర్కు సమంతను ఎంపిక చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అనుష్కతో సినిమా చేస్తే ప్రేక్షకులు రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉందన్న ఆలోచనతో చిత్రయూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న 'అ.. ఆ..' కూడా లేడీ ఓరియంటెడ్ సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. అదే బాటలో రుద్రాక్ష సినిమాలో కూడా సమంతనే ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement