Anushka
-
ధైర్యమే ఆయుధం
భర్త కోసం ఒకరు... మార్పు కోసం మరొకరు... ఊరి కోసం ఇంకొకరు... ఇలా సమాజంతో, వ్యతిరేక పరిస్థితులతో ధైర్యాన్నే ఆయుధంగా చేసుకుని పోరాటానికి నడుం బిగించారు కొందరు తారలు. తమ హక్కులు, లక్ష్యాల కోసం సిల్వర్ స్క్రీన్‌పై తగ్గేదే లే అంటూ విజృంభించారు.. పోరాటానికి ‘సై’ అని కొందరు నటీమణులు చేసిన ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.క్రిమినల్... లెజెండ్ ‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌లో అనుష్క యాక్షన్ టాలెంట్‌ని ఆడియన్స్ చూశారు. కొంత గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న ఈ తరహా చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఓ వ్యాపారంలో ఎదుగుతున్న మహిళను కొందరు వ్యక్తులు ఓ కుట్రలో ఇరికించి, క్రిమినల్‌గా చిత్రీకరిస్తారు. ఆ సమస్యల నుంచి ఆమె బయటపడి, తనను ఇబ్బంది పెట్టినవారికి ఎలా బుద్ధి చెప్పింది? ఆ వ్యాపార సామ్రాజ్యానికి ఓ లెజెండ్‌గా ఆమె ఎలా ఎదిగింది? అన్నదే ‘ఘాటి’ సినిమా కథ అని టాక్.మా ఇంటి బంగారం కుటుంబాన్ని చక్కబెట్టే ఓ గృహిణి గన్ పట్టిందంటే అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులే కారణమై ఉంటాయి. మరి... ఆమె ఎందుకు గన్ పట్టుకుందో ‘మా ఇంటి బంగారం’ సినిమాలో చూడాలి. ఈ సినిమాలో గృహిణిగా నటిస్తున్నారు సమంత. తన నిర్మాణ సంస్థ ట్రా లా లా పిక్చర్స్‌పై సమంత నిర్మిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. గత ఏడాది తన బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ను ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీపై అప్డేట్ రాలేదు. అలాగే ‘ట్రా లా లా’లోనే ఓ హారర్–కామెడీ ఫిల్మ్ రూపొందుతోందని తెలిసింది. ఈ చిత్రంలో సమంత గెస్ట్ రోల్ చేశారని సమాచారం. భర్త కోసం... ఆల్మోస్ట్ అందరూ మహిళలే ఉన్న ఓ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రం ‘ది ఐ’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లీడ్ రోల్లో నటించారు. డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. వేరే దేశంలో ఉన్న తన భర్త మరణ వార్త విని షాక్ అయిన ఓ మహిళ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తుంది. అక్కడ ఆమెకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఓ దశలో భర్త బతికే ఉన్నాడనే అనుమానం కూడా ఆమెకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది ఐ’ ఉంటుందని సమాచారం.వీరోచిత పోరాటం ఓ ఊరి సంరక్షణ కోసం దుష్ట శక్తులతో శివ శక్తి అనే నాగసాధువు ఎలాంటి వీరోచిత పోరాటం చేసిందనే ఇతివృత్తంతో రూపొందుతున్న సినిమా ‘ఓదెల 2’. ఈ చిత్రంలో నాగ సాధువుగా నటిస్తున్నారు తమన్నా. దర్శక–నిర్మాత సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. బ్యాగ్‌లో బాంబు ఓ అమ్మాయి తన హ్యాండ్ బ్యాగ్‌లో కత్తి, బాంబు, తుపాకీలు పెట్టుకుని తిరుగుతుంటుంది. ఎందుకనేది థియేటర్స్‌లో ‘రివాల్వర్ రీటా’ మూవీ చూసి తెలుసుకోవాలి. కీర్తీ సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. స్టూడెంట్ స్టోరీ రష్మికా మందన్నా తొలిసారి చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ప్రేమలో పడకూదనుకుంటూనే ప్రేమలో పడే ఓ కాలేజీ స్టూడెంట్ కథగా ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ చిత్రంలో కాలేజ్ స్టూడెంట్‌గా నటిస్తున్నారు రష్మికా మందన్నా. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో ఓ ప్రకటన రానుంది. అలాగే ‘రెయిన్ బో’ అనే మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌కూ రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీపై తాజా అప్డేట్ రావాల్సి ఉంది. సుబ్బు సాహసం అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్, సంగీత... ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన చిత్రం ‘పరదా’. ఊరి సంప్రదాయం, కట్టుబాట్ల కోసం సుబ్బు (అనుపమ) చేసిన సాహసోపేతమైన ప్రయాణమే ‘పరదా’. ఈ చిత్రంలోని మెయిన్ హీరోయిన్ రోల్లో అనుపమా పరమేశ్వరన్ నటించారు. ఈ సినిమాతో ఓ సామాజిక అంశాన్ని బలంగా చెప్పబోతున్నారట ఈ చిత్రదర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. అలాగే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే కోర్టు రూమ్ డ్రామాలోనూ, ‘లాక్ డౌన్’ అనే మరో ఉమెన్ సెంట్రిక్ చిత్రంలోనూ అనుపమ నటించారు. నెగటివిటీ తగ్గాలంటే... సమాజంలోని నెగటివిటీని తగ్గించాలకుని ఓ యువతి తనదైన శైలిలో ఏం చేసింది? అనే అంశంతో ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ నిర్మాణంలో ఉంది. సామాజిక, రాజకీయ అంశాల మేళవింపుతో రానున్న ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త లీడ్ రోల్ చేస్తున్నారు. కేఎస్సీ యోగేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంయుక్త కూడా ఓ నిర్మాత. ఆమెకు నిర్మాతకు ఇదే తొలి చిత్రం కావడం ఓ విశేషం. సతీ లీలావతి ‘హ్యపీబర్త్ డే’ తర్వాత హీరోయిన్ లావణ్యా త్రిపాఠి సైన్ చేసిన మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘సతీ లీలావతి’. తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం ఆరంభమైంది. కథాంశం గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది.బూమరాంగ్ అనూ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్లో నటించిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బూమరాంగ్’. ఇందులో శివ కందుకూరి కీలక పాత్రధారి. ఆండ్రూ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఓ సైకో కిల్లర్ నుంచి ఒక యువతి ఎలా తప్పించుకుంది? అనే అంశంతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.సత్యభామ కథ పెళ్లైన ఓ అమ్మాయి తన సమస్యలను తానే ఏ విధంగా పరిష్కరించుకుంది? అనే అంశంతో రూపొందుతున్న సినిమా ‘శివంగి’. ఈ మూవీలో సత్యభామగా ఆనంది, పోలీసాఫీసర్‌గా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించారు. దేవరాజ్ భరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. అలాగే ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ఆనంది టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహిస్తున్నారు.మహిళలు ఎదగాలి మహిళలను గౌరవించాలి, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాల ఇతివృత్తంగా రూపొందిన చిత్రం ‘నారీ’. ఈ సినిమాలో ఆమని ఓ లీడ్ రోల్ చేశారు. సూర్య వంటిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఇవే కాదు... ఇంకా మరికొన్ని ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
Anushka Sen: క్యూట్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనుష్క సేన్
-
కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయానికి యాంత్రిక ఏనుగు సేవలు..!
దేవాలయాల్లో దేవుళ్లను గజవాహనంతో ఊరేగించడం వంటివి చేస్తారు. అంతేగాదు కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అయితే ఏనుగులపై దేవుడిని ఊరేగిస్తారు. అందుకోసం మావటి వాళ్లు తర్ఫీదు ఇచ్చి దైవ కైంకర్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. దీని కారణంగా ప్రకృతి ఓడిలో హాయిగా స్వేచ్ఛగా బతకాల్సిన ఏనుగులు బందీలుగా ఉండాల్సిన పరిస్థితి. దీనివల్లే కొన్ని ఏనుగులు చిన్నప్పుడు వాటి తల్లుల నుంచి దూరమైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమస్య తలెత్తకుండా ఉండేలా లాభపేక్షలే జంతు హక్కుల సంస్థ పెటా ఇండియా ఒక చక్కని పరిష్కారమార్గం చూపించింది. ఇంతకీ ఆ సంస్థ ఏం చేస్తోందంటే..గజారోహణ సేవ కోసం ఏనుగుల బదులుగా యాంత్రిక ఏనుగుల(ఛMechanical elephant)ను తీసుకొచ్చింది పెటా ఇండియా. ఏనుగులు సహజ ఆవాసాలలోనే ఉండేలా చేసేందుకే వీటిని తీసుకొచ్చినట్లు తెలిపింది. ఇలా యాంత్రిక ఏనుగులను ఉపయోగించడం ద్వారా నిజమైన జంబోలు తమ కుటుంబాలతో కలిసి ఉండగలవని, పైగా నిర్బంధం నుంచి విముక్తి కలుగుతుందని పేర్కొంది పెటా ఇండియా. అలాగే ఆయుధాలతో నియత్రించబడే బాధల నుంచి తప్పించుకుని హాయిగా వాటి సహజమైన ఆవాసంలో ఉంటాయని పేర్కొంది. ఇక ఈ యాంత్రిక ఏనుగులను రబ్బరు, ఫైబర్, మెటల్, మెష్, ఫోమ్ స్టీల్‌తో రూపొందించినట్లు తెలిపింది. ఇవి నిజమైన ఏనుగులను పోలి ఉంటాయి. ఈ యాంత్రిక ఏనుగు తల ఊపగలదు, తొండం ఎత్తగలదు, చెవులు, కళ్లను కూడా కదిలించగలదు. అంతేగాదు నీటిని కూడా చల్లుతుందట. ఇది ప్లగ్-ఇన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుందట. దీనికి అమర్చిన వీల్‌బేస్ సాయంతో వీధుల గుండా ఊరేగింపులకు సులభంగా తీసుకెళ్లచ్చొట. తాజాగా ప్రఖ్యాత సితార్ విద్వాంసురాలు, ఈ ఏడాది గ్రామీ నామినీ అనౌష్కా శంకర్(Anoushka Shankar) పెటా ఇండియా(Peta India) సహకారంతో కేరళ త్రిస్సూర్‌లోని కొంబర శ్రీకృష్ణ స్వామి ఆలయాని(Kombara Sreekrishna Swami Temple)కి ఇలాంటి యాంత్రిక ఏనుగుని విరాళంగా సమర్పించారు. సుమారు 800 కిలోగ్రాముల బరువున్న ఈ ఏనుగును బుధవారం(ఫిబ్రవరి 05, 2025న ) ఆలయంలో ఆవిష్కరించారు. ఈ యాంత్రిక ఏనుగు పేరు కొంబర కన్నన్.ఇలా పెటా ఇండియా కేరళ(Kerala) ఆలయాలకి యాంత్రిక ఏనుగులను ఇవ్వడం ఐదోసారి. త్రిస్సూర్ జిల్లాలో మాత్రం రెండోది. ఇటీవల మలప్పురంలోని ఒక మసీదులో మతపరమైన వేడుకల కోసం కూడా ఒక యాంత్రిక ఏనుగును అందించింది. నిజంగా పెటా చొరవ ప్రశంసనీయమైనది. మనుషుల మధ్య కంటే అభయారణ్యాలలోనే ఆ ఏనుగులు హాయిగా ఉండగలవు. అదీగాక ఇప్పుడు ఏనుగుల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రత్యామ్నాయం ప్రశంసనీయమైనదని జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Kombara Kannan, a 3-metre-tall mechanical elephant weighing 800 kilograms, was offered to Kombara Sreekrishna Swami Temple, in Thrissur district on Wednesday, by renowned sitarist Anoushka Shankar and PETA India.📹Thulasi Kakkat (@KakkatThulasi) pic.twitter.com/Cz0vD0NNHs— The Hindu (@the_hindu) February 5, 2025 (చదవండి: ఆ అమ్మాయి భలే అద్భుతం..అచ్చం కంప్యూటర్‌లా..!) -
డిజిటల్ దివా ఆఫ్ ది ఇయర్: ఎవరీ సిండ్రిల్లా
-
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
కోహ్లి-అనుష్క తాగే నీరు ఎక్కడ నుంచి దిగుమతి అవుతుందో తెలుసా..!
విరాట్ కోహ్లి-అనుష్క జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందమైన సెలబ్రిటీ జంటగా పేరుగాంచిన ఈ ఇద్దరు ఏ వేడుకకైన జంటగానే హాజరవ్వుతారు. ఫ్యాషన్ పరంగా కూడా ఇద్దరూ స్టైలిష్ ఐకాన్లుగా ట్రెండ్‌కి తగ్గట్టు ఉంటారు. అలాగే ఇద్దరు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా కేర్‌గా ఉంటారు. వ్యాయామ సెషన్ నుంచి నిద్ర వరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంలో ఈ జంట చాలా ప్రత్యేకం. మాములుగా ఏజ్‌ని బట్టి, పరిస్థితుల రీత్యా డైట్‌ని మారుస్తు కాస్త హెల్తీగా మార్పులు చేసకోవడం సహజం. కానీ వీళ్లు ఏకంగా తాగే నీళ్ల విషయంలో కూడా మార్పులు చేశారు. అదికూడా వేరే దేశం నుంచి దిగుమతి చేసుకున్న నీళ్లను తాగుతారట. వీళ్లు ఎవియన్ అనే సరస్సు నుంచి వచ్చే నేచురల్ స్ప్రింగ్ వాటర్ (భూమి నుంచి సహజసిద్ధంగా వచ్చేది) తాగుతారట. అంతేగాదు నివేదికల ప్రకారం ఎవియన్-లెస్-బెయిన్స్ సరస్సులోని నీరు ఎటువంటి రసాయనాలతో కలుషితం కాలేదని వెల్లడయ్యింది. ముఖ్యంగా ఈ వాటర్ ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతుందట. ఎవియన్-లెస్-బెయిన్స్ జెనీవా సరస్సు దక్షిణ భాగంలో ఉంటుంది. ఇది పశ్చిమ ఐరోపాలోని అతి పెద్ద సరస్సులలో ఒకటి. దీన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు పంచుకుంటున్నాయి. అంతేగాదు ఒక లీటరు ఎవియన్ బాటిల్ ధర దాదాపు రూ. 600ల దాక ఉంటుంది. అంటే ప్రతిరోజు రెండు లీటర్ల నీటిని తీసుకుంటే రూ. 1200 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఒక లీటర్ ఎవియాన్ బాటిళ్లు డజను వచ్చేటప్పటికీ ఏకంగా రూ. 4200/ పలుకుతుంది.(చదవండి: వర్కౌట్ సెషన్లో రకుల్‌కి వెన్ను గాయం..అలా జరగకూడదంటే..!) -
'అమ్మ చేతి వంటే కంఫర్ట్ ఫుడ్'..!
చాలామంది ఇంటి భోజనం కంటే పొరిగింటి పుల్లకూరే రుచిగా ఉందంటూ లొట్టలేసుకుని మరి తింటుంటారు. ఎంతలా వండినా ఏవోవే వంకలతో అమ్మను బాధపెట్టే పిల్లలు ఎక్కువనే చెప్పొచ్చు. మన ఆరోగ్యం కోసమని వండినా..అమ్మ బాధ అర్థం చేసుకోం. ఎప్పుడైనా తినేందుకు ఏమి దొరకనప్పుడూ,..తిన్నవా అని అడిగేనాథుడు లేనప్పుడు కచ్చితం ఇంటి భోజనం, అమ్మచేతి వంట తప్పక గుర్తొస్తుంది ఎవరికైనా.. కదూ..!. ఇప్పుడిదంతా ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీలైనా ఓ అమ్మకు పిల్లలమే..!. దిగ్గిజ క్రికెటర్ విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్కా తనకు నచ్చిన ఫుడ్ గురించి చెబతుంటే ఇదంతా స్ఫురిస్తుంది. ఆమె మాటలు వింటే కచ్చితంగా అమ్మ చేతి వంట అమృతాని కన్నా మిన్నా అని ఒప్పుకోక తప్పదు. ఇంతకీ ఆమె ఏమందంటే..నటి అనుష్క శర్మ 2024లో కొడుకు అకాయ్ కోహ్లీకి జన్మనిచ్చిన తర్వాత అక్కడ కొన్ని నెలలు గడిపి ఇటీవలే ముంబైకి తిరిగొచ్చింది. ఆమె ఓ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె తన అభిమానులు, మీడియాతో మళ్లీ కనెక్ట్ అవ్వడం గురించి మాట్లాడుతూ తను సంబంధించిన ఆసక్తికకర విషయాలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. మాతృత్వం, తన కాలేజ్ జ్ఞాపకాల గురించి మాట్లాడింది. ఆ టైంలో తన అమ్మ చేసే ఫుడ్ అయినా ఇష్టంగా తినేదాన్ని అని చెప్పుకొచ్చింది. తాను ఇంటి ఫుడ్‌కి పెద్ద అభిమానిని అని తెలిపింది. మనసు బాగోలేనప్పుడూ అమ్మ చేతి వంటే తనకూ మంచి బూస్టప్ అని అంటోంది. అందుకే తానెప్పుడూ అమ్మ చేతి ఫుడ్‌నే కంఫర్ట్ ఫుడ్‌గా భావిస్తానని చెప్పింది. బాగా సంతోషంగా లేదా గ్రేట్‌గా అనపించినప్పుడూ వెంటే అమ్మ చేతి భోజనం తినాల్సిందేనని అంటోంది. అలాగే కత్రినా విక్కీ కౌశల్ తమను డిన్నర్‌కి ఆహ్వానించారని..అయితే తాము ఆరు గంటల కల్లా తిని 9.30 గంటలకే పడుకుంటామని అందువల్ల 7-7.30 కల్లా తిందామని చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చింది. అలాగే అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. సక్రమమైన జీవనశైలితో కెరీర్‌ను అందంగా మలుచుకోవచ్చు అనడానికి విరాట్-అనుష్కాలే గొప్ప ఉదాహరణ కదూ..!(చదవండి: బ్రూనైలో మోదీ లంచ్ మెనూ ఇదే..!) -
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
Anushka Sen: బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా..
అనుష్కా సేన్.. టీవీ.. సినిమా.. ఓటీటీ స్క్రీన్స్‌కి న్యూ ఫేస్ కాదు.. గ్లామర్ ఫీల్డ్కి న్యూ నేమ్ కాదు. ఆ ఫేమ్ కూడా ఆమెకు కొత్త కాదు. బాల నటిగా.. మోడల్‌గా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చిన్న వయసులోనే ఎంతో ఘనతను సాధించేసింది.అనుష్కా పుట్టింది రాంచీ (జార్ఖండ్)లో. పెరిగింది ముంబైలో. నాన్న.. అనిర్వాణ్ సేన్, బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. అమ్మ.. రాజ్రూపా సేన్, గృహిణి. కూతురి ఉన్నతి వెనుకున్నది ఆ ఇద్దరే! అనుష్కా ప్రస్తుతం.. సినిమాటోగ్రఫీలో డిగ్రీ చదువుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్‌గా జీటీవీ ‘యహా మై ఘర్ ఘర్ ఖేలీ’ అనే సీరియల్‌తో పరిచయం అయింది. ‘దేవోంకా దేవ్ మహాదేవ్’లో బాల పార్వతి, ‘బాల్ వీర్’లో మెహెర్ పాత్రతో పాపులర్ అయింది. తర్వాత క్రికెటర్ ధోనీతో కలసి చేసిన ఒక కమర్షియల్ యాడ్‌తో మరింత ఫేమస్ అయింది. అంతేకాదు ఆ యాడ్‌తో ధోనీకి ఆమెకూ మధ్య చిక్కీ అండ్ చాచూ (చిక్కీ అండ్ బాబాయ్)గా అనుబంధమూ బలపడింది.చైల్డ్ ఆర్టిస్ట్‌గానే అనుష్కా ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’తో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చదువు మీద శ్రద్ధ పెట్టింది. 2018లో ‘ఇంటర్నెట్ వాలా లవ్’తో మళ్లీ బుల్లితెర మీద కనిపించసాగింది. యంగ్ ఆర్టిస్ట్‌గా అనుష్కాకు కీర్తి సంపాదించిపెట్టిన సీరియల్ ‘ఝాన్సీ కీ రాణీ’. అందులో ఆమెది టైటిల్ రోల్! ‘లిహాఫ్ .. ద క్విల్ట్’ అనే సినిమాలో అనుష్కా సేన్ యుక్తవయసు ఇస్మత్ చుగ్తాయ్గా నటించింది. అది ఆమెకు మంచి నటిగా గుర్తింపునిచ్చింది.ఓ వైపు సీరియళ్లు, సినిమాలు చేస్తూనే ఇంకో వైపు వీడియో ఆల్బమ్స్‌లోనూ తన అభినయ కళను చాటసాగింది. ఇటు ఓటీటీ అవకాశాలూ వరుసకట్టాయి. అలా ‘క్రాష్’, ‘స్వాంగ్’ సిరీస్‌లలో నటించింది. తాజాగా ‘దిల్ దోస్తీ డైలమా’లోనూ ప్రధాన భూమిక పోషించింది. అందులోని ఆమె నటన అభిమానులవే కాదు విమర్శకుల ప్రశంసలూ అందుకుంటోంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతోంది.అనుష్కా సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లకే కాదు సోషల్ మీడియా పోస్ట్‌లకూ వీర ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్, కోట్లలో ఫాలోవర్స్‌తో చిన్నవయసులోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది. ఈ పాపులారిటే ఆమెకు కొరియన్ సినిమా చాన్స్‌నూ తెచ్చిపెట్టింది. అలా అనుష్కా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయింది.కొరియన్ డ్రామాస్ అంటే కళ్లింత చేసుకుంటా. అలాంటి నాకు కొరియన్ మూవీలో చాన్స్ వచ్చిందని తెలియగానే క్లౌడ్ 9లో తేలిపోయా! ఇదంతా నా అభిమానుల బ్లెస్సింగ్స్ వల్లే పాజిబుల్ అయిందని నమ్ముతా! ఫ్యాన్సే నా సైన్యం! సోషల్ మీడియాలో వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడల్లా పాజిటివ్ ఎనర్జీతో చార్జ్ అవుతాను. కాన్ఫిడెంట్‌గా ఫీలవుతాను! – అనుష్కా సేన్ -
Anushka Jag: హ్యాపీ హ్యాపీగా.. హాయి హాయిగా..
‘రీబర్త్’, ‘టాబూ’ ‘హరికేన్’లాంటి పాటలతో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అనుష్క జగ్ లేటెస్ట్ సింగిల్ ‘ఖుషీ ఖుషీ’ వైబ్రెంట్ యానిమేటెడ్ వీడియోతో విడుదల అయింది. తన యూనిక్ వాయిస్‌తో శ్రోతలను ఆకట్టుకుంటున్న అనుష్క తాజాగా ‘ఖుషీ ఖుషీ’తో స్వరసందడి చేస్తోంది. ‘ఖుషీ ఖుషీ అనేది స్పిరిచ్యువల్ పాప్’ అంటుంది అనుష్క.కాలేజీ రోజుల నుంచి అనుష్కకు ఫిలాసఫీ అంటే ఇష్టం. తాజా పాటలో ఫిలాసఫీ కనిపిస్తుంది. అయితే భారంగా, సంక్లిష్టంగా కాకుండా యూత్‌ఫుల్ స్టైల్లో లిరిక్స్ ఉంటాయి. టైటిల్ హిందీలో ఉన్నప్పటికీ లిరిక్స్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటాయి.‘హ్యాపీ ఈజ్ ఏ ఫీలింగ్ ఐ హ్యావ్ గాట్ హ్యాపీ ఈజ్ ఏ స్విచ్ ఇన్ మై హార్ట్’లాంటి లిరిక్స్‌తో ‘ఖుషీ ఖుషీ’ దూసుకుపోతోంది. తనను తాను ‘మ్యూజికల్ టూరిస్ట్’గా చెప్పుకునే అనుష్క ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ్రపాంతాలలో కచేరీలు ఇచ్చింది. జెన్నిఫర్ ఓనీల్, జాన్ జోన్స్, డడ్డీ బ్రౌన్, డానీ పాపిట్, కైల్ కెల్పోలాంటి సంగీతకారులతో కలిసి పనిచేసింది. ప్రతి కొత్త ్రపాజెక్ట్లో తనదైన ప్రతిభ చూపుతుంది అనుష్క. ఇండియన్ మెలోడీలు, రిథమ్లతో ప్రవాసభారతీయులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకుంది అనుష్క జగ్. -
స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ ఆమెనా?
లియో కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమధానమే వినిపిస్తోంది. నటుడు విజయ్, నటి త్రిష సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ జంట ఇప్పుటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియోతో పాటు దాదాపు ఐదు చిత్రాల్లో జంటగా నటించారు. ఇందులో గిల్లీ, తిరుపాచ్చి, లియో చిత్రాలు మంచి విజయా న్ని సాధించాయి. కాగా తాజాగా మరోసారి ముచ్చటగా రెండో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా.. విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇందులో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలోనే విజయ్‌తో నటి త్రిష మరోసారి జత కడుతున్నట్లు తాజా సమాచారం. ఇందు తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్ సరసన త్రిష నటించనున్నారు. అయితే ఇది ప్రత్యేక పాత్రేనని సమాచారం. కాగా ముందు ఈ పాత్రకు నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు.. ఆమె తిరస్కరించడంతో ఈ అవకాశం నటి త్రిషకు వచ్చినట్లు టాక్. కాగా.. గోట్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. కాగా ప్రస్తుతం త్రిష నటుడు కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్, అజిత్ సరసన విడాముయర్చి చిత్రాలతో పాటు, ఓ మలయాళ, తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి
దానాలు, విరాళాల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ అనే సోషల్ వెంచర్‌కు శ్రీకారం చుట్టింది దిల్లీకి చెందిన అనుష్క జైన్. దాతల ఇంటికి వెళ్లి వారు ఇచ్చే దుస్తులు, పుస్తకాలు... మొదలైన వాటిని తీసుకొని ఎన్జీవోలకు పంపిణీ చేస్తుంది షేర్ ఎట్ డోర్ స్టెప్. ఏఐ టెక్నాలజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలతో కనెక్ట్ అవుతోంది.... ‘ప్రతిరోజు పిల్లల బట్టలు, యూనిఫాంను చేతితో ఉతికేదాన్ని. షేర్ ఎట్ డోర్ స్టెప్ ద్వారా వాషింగ్ మెషిన్ అందిన తరువాత నాకు చాలా శ్రమ తప్పింది. ఎంతో టైమ్ మిగులుతోంది. ఈ టైమ్‌లో పిల్లలకు కథలు చెబుతున్నాను’ అంటోంది బెంగళూరుకు చెందిన ఒక బామ్మ. బెంగుళూరు నుంచి జైపూర్ వరకు ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ను ఎంతోమంది ప్రశంసిస్తున్నారు. దిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన అనుష్కకు ‘షేరింగ్’ కాన్సెప్ట్ కొత్త కాదు. గతంలోకి వెళితే... తన ప్రతి పుట్టినరోజుకి ‘ఇవి కావాలి అవి కావాలి’ అని కాకుండా ‘ఈరోజు ఏ ఎన్జీవోకు వెళదాం’ అని తల్లిని అడిగేది. నగరంలో ఉన్న ఏదో ఒక ఎన్జీవోకు వెళ్లి అక్కడ ఉన్నవారికి స్వీట్లు పంచేది. అలా ‘షేరింగ్’ అనే కాన్సెప్ట్ తనతోపాటు పెరిగి పెద్దదైంది. దాతృత్వానికి సంబంధించి కాలేజీ రోజుల్లో తనకు స్పష్టత వచ్చింది. చాలామందికి దానం చేయాలనే కోరిక ఉన్నా, సమయం లేకపోవడం వల్ల దూరభారం వల్ల చేయలేకపోతున్నారు. ‘డొనేషన్ ఏ స్వచ్ఛంద సంస్థకు ఇస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది;’ అనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు’ అంటున్న అనుష్క ఈ సమస్యకు ఒక పరిష్కారం వెదకాలనుకుంది. తన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన అనుష్క నైట్‌షిఫ్ట్‌లో డ్యూటీ చేసేది. పగటిపూట సేవాకార్యక్రమాలపై దృష్టి పెట్టేది. ఉద్యోగంలో చేరినా ఎన్జీవోలకు డొనేట్ చేయాలనే ఆలోచన అనుష్కను వదలలేదు. దీంతో ఒక వెబ్సైట్ రూపొందించి డొనేట్ చేయాలనుకుంటున్నవారు తమ ఐటమ్స్‌ను రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. రిజిస్టర్ కాగానే పొద్దున్నే వెళ్లి వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చేది. పికప్స్ రెండు వందలు దాటిన తరువాత ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. అక్కడ మరో కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరింది. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అనే ఆలోచనతో బెంగళూరులోకి అడుగుపెట్టింది అనుష్క. 2018లో ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’కు పూర్తి సమయాన్ని కేటాయించింది. ‘మా వెబ్సైట్లోకి వచ్చి పికప్ బుక్ చేయండి. మీరు విరాళంగా ఇవ్వాలనుకుంటున్న వస్తువు, అది తేలికైనదా, బరువైనదా అనేది తెలియజేయండి. మా ఏజెంట్లు నిర్ణీత సమయంలో మీ ఇంటి ముందు ఉంటారు. మీ విరాళాన్ని మాకు అనుబంధంగా ఉన్న ఎన్జీవోలలో ఒకదానికి పంపిస్తాం’ అంటూ అనుష్క చేసిన ప్రకటనకు అద్భుత స్పందన వచ్చింది. ఏ వస్తువులు ఏ ఎన్జీవోకు వెళ్లాలి... అనే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాంకేతికత సహాయం తీసుకుంటుంది అనుష్క. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ ద్వారా కంపెనీలకు మార్కెటింగ్ సొల్యూషన్స్‌ను అందించడంతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)కు సంబంధించిన కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది. ఇండివిడ్యువల్స్‌తో పాటు కార్పొరేట్ డోనర్స్ కోసం డోర్‌స్టెప్ డొనేషన్ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘షేర్ ఎట్ డోర్ స్టెప్’ దేశీయంగా తిరుగులేని విజయం సాధించిన తరువాత ఈ కాన్సెప్ట్‌ను విదేశాలలో ప్రచారం చేయాలని ఆలోచన చేసింది. తొలి అడుగుగా సింగపూర్‌లో ప్రచారం చేసింది. అక్కడ లభించిన స్పందన అమితమైన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో మరింత వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అనుష్క. ఎంతో శక్తి ఇస్తుంది దానం చేయడానికి అవసరమైన స్ఫూర్తిæ ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉండవచ్చు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే ఉన్నత ఆలోచన మాత్రం దేశాల సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒకటి చేస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అనే పని మనకు ఎంతో శక్తి ఇస్తుంది. – అనుష్క జైన్ -
పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా అనుష్క సినిమా
‘అరుంధతి’, ‘భాగమతి’.. ఇలా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో తనదైన శైలిని చాటుకుని సక్సెస్ అయ్యారు అనుష్క. తాజాగా ఆమె కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో సినిమా అంగీకరించారు. క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ సినిమాకు దర్శకుడు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో పదేళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ అమ్మాయిగా అనుష్క పాత్ర ఉంటుందట. ఇటీవల ఒడిస్సాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారని తెలిసింది. కాగా ఈ సినిమాకు ‘శీలవతి’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఓ లీడ్ రోల్ చేస్తున్నారని, ఈ సినిమా ఈ ఏడాదే దక్షిణాది భాషల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కళ్లు చెదిరే లగ్జరీ ఇల్లు : యువ నటి అనుష్క కల నెరవేరిందట!
ప్రముఖ టీవీ షో బాల్ వీర్లో నటించి పాపులర్ అయిన యువ నటి అనుష్క సేన్ ఒక కొత్త లగ్జరీ ఇల్లును కొనుగోలు చేసింది. ఈ మేరకు అనుష్క తన ఇన్‌స్టా హ్యాండిల్లో అందమైన ఫోటోలను షేర్ చేసింది.. సేన్ ఫ్యామిలీ.. కొత్త ఇల్లు. మరో కల నెలవేరింది అంటూ ముంబైలో తన కొత్తింటోల అమ్మానాన్నలతో పోజిలిచ్చిన స్నాప్‌షాట్ ఫోటోలను అభిమానులకు పంచుకుంది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలిపారు. విలాసవంతమైన ఇంటి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అంతేకాదు చక్కటి ఇంటీరియర్స్ , అత్యుధునికి ఫీచర్స్‌తో ఉన్న ముంబై స్కైలైన్ ఫ్లాట్ అదిరి పోతోంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు కరియర్లో ఒక్కో మెట్టూ ఎక్కుతోంది. ఈ క్రమంలో18 ఏళ్లకే రూ.55 లక్షల విలువ చేసే (2020లో) బిఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ యువ టీవీ నటి మెహర్ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ జీవిత విశేషాలను తన అనుచరులతో పంచుకుంటుంది. ఇటీవల,పాపులర్ బ్రాండ్ జైపురి అదాహ్కు చెందిన అద్భుత జైపురి సూట్ ఫోటోలతో తన అభిమానులకు బ్యూటిఫుల్ ట్రీట్ ఇచ్చింది. అనుష్క సేన్ 2009లో యహా మై ఘర్ ఘర్ ఖేలీ సీరియల్‌తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే సంవత్సరం, ఆమె తన మొదటి మ్యూజిక్ వీడియో హమ్కో హై ఆషాతో తనదైన ముద్ర వేసింది. 2015లో క్రేజీ కుక్కాడ్ ఫ్యామిలీ చిత్రంలో అనుష్క ఒక పాత్రతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. దీంతోపాటు స్టంట్ ఆధారిత రియాలిటీ టీవీ షో ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11లో తన టాలెంట్‌ను అందర్నీ మెస్మరైజ్ చేసింది. -
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్‌డే ఫోటోలు
-
ప్రభాస్, అనుష్క పెళ్లి పై అదిరిపోయే అప్డేట్
-
ప్రభాస్ అనుష్క పెళ్లి..ఒక పాప కూడా !
-
ఏఐ మాయ.. ప్రభాస్ భార్య, పిల్లలు ఫోటోలు వైరల్
-
జాతి రత్నాలు తర్వాత ఒత్తిడికి గురయ్యాను
‘‘ఒక యాక్సిడెంట్లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్‌తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది. అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు. -
అలా చేశానని ఇంట్లోవాళ్లే తిట్టారు: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే మీకు తెలియకుండానే 'ఈవ్..' అనే సౌండ్ చేస్తారు. ఎందుకంటే 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' మూవీతో హిట్ కొట్టినప్పటికీ 'జాతిరత్నాలు' చిత్రంతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'గా రాబోతున్నాడు. సెప్టెంబరు 7న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) అప్పుడు కోప్పడ్డారు 'నేను ఓ ఇంజినీర్. చేతిలో ఉన్న ఉద్యోగం పక్కనబెట్టి ఇండస్ట్రీలోకి వచ్చాను. బాగా డబ్బులొచ్చే పని వదిలేసి వచ్చానని అమ్మనాన్న చాలా కోప్పడ్డారు. 'ఏజెంట్ ఆత్రేయ'కి ముందు పదేళ్లపాటు ఇంటిపేరు పాడుచేస్తున్నానని తిట్టారు. నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టైటిల్లోనే ఇంటిపేరు ఉండటం చూసి నాన్న హ్యాపీగా ఫీలయ్యారు' అందుకే ఈ మూవీ ''జాతిరత్నాలు' ఈ రేంజులో అలరిస్తుందని మేం అస్సలు ఊహించలేదు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యాను. అలాంటి టైంలో ఓ మహిళా అభిమానిని కలిశాను. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నేను ఏడ్చేశాను. ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యా. అలా ఎన్నో కథలు విని.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఓకే చేశాను. అనుష్కతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది' అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
Anushka Malhotra: చిరంజీవి డాడీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడెంత అందంగా ఉందో చూశారా? (ఫోటోలు)
-
మళ్లీ ఒక్కటవబోతున్న ప్రభాస్ అనుష్క
-
ప్రభాస్ పక్కన అనుష్క స్థానం ఆక్రమించిన కృతి ప్రూఫ్ ఇదే
-
మళ్ళి ఒక్కటి కాబోతున్న అనుష్క ప్రభాస్
-
ఇండస్ట్రీ కళకళ.. లేడీస్ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్ స్పెషల్’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్ను రిలీజ్ చేశాయి. ఆ పో స్టర్స్ పై ఓ లుక్ వేయండి. ఫారిన్ అన్విత ఫారిన్ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్ చేస్తున్నారు మిస్ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శకుంతల ప్రేమ ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి చేరువలో.. ఉమెన్స్ డే రోజున ‘మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేశారు హన్సిక. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక. మిస్ భైరవి ‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పో స్టర్‌ను రిలీజ్ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. గీత సాక్షిగా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించారు. ఇవే కాదు.. మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్ కూడా విడుదలయ్యాయి. -
అజిత్ కూతురు అనౌష్కను చూశారా? ఎంత అందంగా తయారైందో!
తమిళ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన కథలు, పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తెలుగులోనూ అజిత్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఇండస్ట్రీలో ఆయనకు వివాదా రహితుడు. పొగడ్తలైన, విమర్శలనై ఒకేలా తీసుకుంటూ తన పనేంటో తాను చూసుకుంటాడు. ఇక తన పని తర్వాత అజిత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది కుటుంబానికే. హీరోగా ఎంత బిజీగా కుటుంబానికి ఎప్పుడు సమాయాన్ని కెటాయిస్తాడు. చదవండి: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లిరిక్స్ వివాదం.. యండమూరికి చంద్రబోస్ గట్టి కౌంటర్ ముఖ్యంగా పండుగలు, పుట్టిన రోజు వేడుకుల, స్పెషల్ డేస్ అసలు మిస్ అవ్వడు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. అయితే అజిత్ కుటుంబం విషయంలో చాలా గోప్యత పాటిస్తాడనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషమాలను, కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయమైన బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపడు. ఈ నేపథ్యంలతో న్యూ ఇయర్‌ను కుటుంబంతో కలిసి విదేశాల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు అజిత్. భార్య షాలిని, కూతురు అనౌష్క, కుమారుడు ఆద్విక్లతో కలిసి విదేశాల్లో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఇందులో అజిత్ కూతురు అనుష్క స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మీడియా ముందు పెద్దగా కనిపించని అనౌష్క హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో కనిపించి షాకిచ్చింది. మీడియాకు, సోషల్ మీడియా దూరంగా ఉండే అజిత్ కూతురు సడెన్‌గా ఇలా కనిపించడంతో ఆమె హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె ఏం చేస్తుంది, ఏం చదువుతుంది, సినిమాల్లోకి ఎప్పుడు ఇస్తుంది? అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు నెటిజన్లు. చదవండి: నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ View this post on Instagram A post shared by வீர சென்னை (@ajithkumar_fansclup) -
Kantara Movie: కాంతార సినిమా పై ప్రభాస్, అనుష్క కామెంట్స్.. దిమ్మతిరిగే కలెక్షన్స్ తో దుసుకుపోతుంది
-
ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్స్..19 ఏళ్లలోనే అనుష్క రికార్డ్
చదువు, ఆటపాటల్లో చురుకుగా ఉండే ఈ అమ్మాయికి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్లో జరిగే వివిధ ఈవెంట్స్‌లో యాక్టివ్‌గా పాల్గొనేది. ఒకసారి డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొంది కానీ తొలిరౌండ్లో ఎలిమినేట్ అయ్యింది. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మంచి నటిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క సేన్. 19 ఏళ్ల అనుష్క వివిధ సీరియల్స్‌లో నటించి పాపులర్ అవడమేగాక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లక్షలమంది వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటోంది. చిన్న వయసులో సీరియల్స్, యాడ్స్‌లో నటిస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తూ ఎంతో మంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది. జార్ఖండ్‌కు చెందిన అనిర్బన్, రాజ్‌రూప సేన్ దంపతుల ఒక్కగానొక్క సంతానం అనుష్కసేన్. 2002 ఆగస్టు 4న రాంచీలో పుట్టిన అనుష్క కొన్ని రోజులు అక్కడే ఉన్న తరువాత, కుటుంబం ముంబైకి మకాం మార్చడంతో ముంబైలోని ‘రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదివింది. చిన్నప్పటి నుంచి క్యూట్‌గా, యాక్టివ్‌గా ఉండే అనుష్కకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ పోటీలో పాల్గొంది. కానీ కాళ్లకు సమస్య ఎదురవడంతో వెంటనే ఎలిమినేట్ అయ్యింది. డ్యాన్స్ కాంపిటీషన్ నుంచి వెనుతిరిగాక, అదే సమయంలో ‘యహాన్ మే ఘర్ ఘర్ ఖేలీ’ అనే హిందీ టీవీ సీరియల్లో నటించే అవకాశం అనుష్కను బిజీ చేసేసింది. రాణి లక్ష్మిగా... సీరియల్స్‌లో నటిస్తూనే... రాకేష్ ఓమ్ ప్రకాష్ మెహ్రా కంపోజ్ చేసిన ‘హమ్కో హై ఆశా’ మ్యూజిక్ వీడియోలో(2012) నటించింది. మరుసటి ఏడాది బాల్ వీర్, దేవన్ కి దేవ్ మహదేవ్ సీరియల్లో చిన్నప్పటి పార్వతీ దేవిగా, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్, కామెడీ క్లాసెస్, ఇంటర్నెట్ వాలా లవ్ , అప్నా టైమ్ భీ ఆయేగా వంటి సీరియల్స్‌లో నటించింది. కలర్స్ టీవీలో ప్రసారమైన ఝాన్సీ కీ రాణి సీరియల్లో అనుష్క పోషించిన రాణి లక్ష్మి పాత్ర తనకి మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. అంతేగాక బాల్ వీర్లో మెహర్‌గా క్యారెక్టర్లో ఒదిగిపోయి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక్కడినుంచి అనుష్క వెనక్కి తిరిగి చూసుకోలేదు. నటనలో కాస్త నిలదొక్కుకున్నాక ‘షియామక్ దేవర్ డ్యాన్స్ అకాడమీ’లో చేరి డ్యాన్స్ నేర్చుకుంది. యాక్టింగ్ చేస్తున్నప్పటికీ, చదువును నిర్లక్ష్యం చేయలేదు. పదోతరగతి, ఇంటర్మీడియట్లలో ఎనభైఐదు శాతం పైగా మార్కులు సాధించింది. భవిష్యత్‌లో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేయాలని అనుష్క భావిస్తోంది. యాడ్స్‌లో.. సీరియల్ ద్వారా అనుష్కకు వచ్చిన పాపులారిటీతో ఆమెకు అనేక యాడ్లలో నటించే అవకాశాలు వచ్చాయి. వీటిలో అమూల్ చీజ్, హార్లిక్స్, హరిదర్శన్ దూప్ స్టిక్స్, డీఎన్ఏ, అబ్సల్యూట్ ఇండియా, ఏరియల్ డిటర్జెంట్, కొరియో ఎలక్ట్రానిక్స్, ఇమేజ్ బజార్, నయి దునియా వంటి అనేక యాడ్లలో నటించింది. ఎమ్ఎస్ ధోనీతో కలిసి కమర్షియల్ యాడ్‌లో కూడా నటించింది. ఇవేగాక అర్బన్ క్లాప్, కూవ్స్, మింత్రా వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా... అనుష్కకు కంగనా రనౌత్ అంటే బాగా ఇష్టం. దీంతో ఆమె నటించిన క్వీన్ సినిమాను అనేకసార్లు చూసింది. 2015లో ‘క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ’ సినిమాలో నటించి బాలీవుడ్లో అడుగు పెట్టింది. లిహాఫ్: ద క్విల్ట్, షార్ట్ ఫిల్మ్ సమ్మదిత్తిలో నటించింది. చాలా మ్యూజిక్ వీడియోలలో అనుష్క నటించింది. వీటిలో ‘గల్ కర్కే’, ‘వియా’, ‘సూపర్ స్టార్’ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. రామ్ కపూర్ నిర్మించిన బడే అచ్చే లగతే హై సీరియల్, డ్యాన్స్ టెలివిజన్ రియాలిటీ షో జలక్ ధికలాజా, కామెడీ సర్కస్‌లో పాల్గొంది. ఒకపక్క సీరియళ్లు, సినిమాలు, మరోపక్క యాడ్లు చేస్తూనే ఖాళీ సమయాల్లో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూట్యూబ్(2017) చానల్లో తనకు సంబంధించిన కంటెంట్, ఫన్నీ, కామెడీ, బ్యూటీ రెమిడీ వీడియోలను పోస్టు చేస్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆరు మిలియన్ల ఫాలోవర్స్‌తో పాపులర్ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. ఇండియాలో టిక్‌టాక్ నడిచినంతకాలం టిక్‌టాక్ సెలబ్రిటీగా, సింగర్, డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అనుష్క యూట్యూబ్ చానల్‌కు దాదాపు 24 లక్షలమంది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 2.32 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ‘ఖతరోంకే ఖిలాడీ– 11’లో పాల్గొని ఎలిమినేట్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న 19 ఏళ్ల పిన్న వయస్కురాలిగా అనుష్క సేన్ నిలవడం విశేషం. తల్లిదండ్రులతో అనుష్కసేన్ సోషల్ స్టార్ -
ఎదుటివారిని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పేయండి: అనుష్క
Anushka Shetty: ‘‘అందరితో ప్రేమగా ఉండండి. ఎదుటివారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. వాళ్ల గురించి ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అతిగా స్పందిస్తున్నారని బాధపడకండి. ఎక్కువగా ప్రేమను చూపించండి ప్రపంచంలో ఇంకా మంచితనం ఉందని నిరూపించండి’’ అంటున్నారు అనుష్క. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే... ‘‘అన్నింటిలోనూ మంచినీ, అందాన్నీ వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. అంతేకానీ జరిగినదాన్ని తలుచుకుంటూ బాధపడకండి. కొత్త ఆరంభాలను స్వాగతించండి. ఎప్పుడూ హాయిగా నవ్వండి. ఎక్కువగా ఆశలు పెట్టుకోండి. ఎక్కువగా బతికేందుకు ప్రయత్నించండి. మీతో మీరు ఎక్కువగా గడపండి. మీ బాధలను పోగొట్టేవారితో ఉండండి. మీరింకా బతికే ఉన్నారని గుర్తు చేసే అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరెంత అదృష్టవంతులో ఊహించుకోండి. జీవితం ఎంత బాగుందో గుర్తు చేసుకోండి. ప్రపంచంలో అందమైనవన్నీ మాయమైపోతున్నాయి. మీ హృదయం కూడా అందులో ఓ భాగం కాకుండా చూసు కోండి’’ అన్నారు అనుష్క. -
'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
చిరంజీవి, సిమ్రాన్ జంటగా నటించిన సినిమా డాడీ. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. 2001లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది.తండ్రి-కూతురి మధ్యనుండే ఎమోషన్ కథాంశంగా రూపొందించిన ఈ సినిమాలో చిన్నారి ఐశ్వర్య పాత్ర గుర్తింది కదా.. అదేనండీ చిరంజీవి, సిమ్రాన్‌ల కూతురిగా నటించిన పాప. చిరంజీవి తర్వాత అంతలా ప్రేక్షకులకు దగ్గరైన పాత్ర అది. ఐశ్వర్య, అక్షయలా ద్విపాత్రిభినయంతో ఆకట్టుకున్న ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హొత్ర. డాడీ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ చిన్నారి పాత్ర గుర్తుండిపోయింది. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అనుష్క మల్హొత్రకు డాడీ విజయం తర్వాత చాలా ఆఫర్స్ ఆమెను వరించాయి. అయితే కొన్ని కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. డాడీ సినిమా తర్వాత స్క్రీన్‌పై ఎక్కడా కనిపించలేదు. అప్పటి చిన్నారి ఇప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. తాజాగా ఈమె ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం యూకేలో ఉంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకప్పటి చిన్నారి పాపలంతా ఇప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దేవుళ్ళు చిత్రంలో చిన్నారి పాత్రలో నటించిన నిత్య శెట్టి ఓ పిట్ట కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి అనుష్క మల్హొత్ర హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : ‘వల్లంగి పిట్ట’ చిన్నారి ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా! పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ -
'షీ పాహీ' మొదటి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా అనుష్క..
-
హైదరాబాద్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: స్వీటీ అనుష్క తన అభిమానులను సర్‌పప్రైజ్ చేశారు. కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్న దేవసేనా.. ఆకస్మాత్తుగా హైదరాబాద్‌లో దర్శనం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత స్వీటీ హైదరాబాద్‌లో కనిపించడంతో మీడియా తమ కెమెరాలకు పనిచెప్పారు. దీంతో అనుష్క ఫొటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నిశ్శబద్దం తర్వాత ఇప్పటి వరకు అనుష్క ఏ మూవీకి సంతకం చేసిన దాఖలాలు కనిపించకపోవడంతో ఆమె అభిమానులు నిరుత్సాహంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్వీటీ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే అనుష్కను వెండితెరపై చూసే అవకాశం ఉందంటూ ఖుషి అవుతున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు అనుష్క పెట్టింది పేరు. దీంతో పరిశ్రమలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్భుతమైన నటనతో మెప్పించిన అనుష్క.. ‘అరుంధతి’, ‘భాగమతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి హిస్టారికల్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగారు. -
అనుష్క–విజయ్– ఓ సినిమా?
అనుష్క నటించిన తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఈ నెల 2న విడుదలైన విషయం తెలిసిందే. మరి.. ఆమె చేయబోయే తదుపరి చిత్రాలేంటి? అంటే.. విజయ్ దేవరకొండ–అనుష్క కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త వినిపిస్తోంది. ఒక ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఈ కథకి అనుష్క, విజయ్ కరెక్ట్‌గా సరిపోతారని దర్శక–నిర్మాతలు సంప్రదించారట. కథ నచ్చి ఇద్దరూ అంగీకరించారని సమాచారం. ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో అనుష్క చాట్ చేస్తూ.. రెండు కొత్త సినిమాలను అంగీకరించానని, త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనలు వస్తాయని అన్నారు. ఆ రెండు చిత్రాల్లో విజయ్–అనుష్క కాంబినేషన్ ఒకటి అని, ఈ సినిమాని ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని టాక్. -
మార్పు అవసరం
‘‘థియేటర్, ఓటీటీ.. రెండూ వేరు అయిన ప్పటికీ ఓటీటీలో సినిమాల విడుదలను పాజిటివ్‌గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే టెక్నాలజీ పరంగా ఆడియన్స్‌కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావడం అవసరం. వాటిని అందరూ స్వాగతించడం కూడా చాలా అవసరం’’ అన్నారు అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర ్భంగా అనుష్క చెప్పిన విశేషాలు. ‘భాగమతి’ చిత్రం తర్వాత కావాలని గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో కోన వెంకట్‌గారు, హేమంత్ గారితో ‘నిశ్శబ్దం’ కథ వినిపించారు. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సినిమా కూడా బాగుంటుందని బలంగా అనిపించి, నటించడానికి ఒప్పుకున్నాను. తొలిసారి నేను నటించిన సినిమా ఓటీటీలో విడుదలవ్వడం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో నాది చెవిటి, మూగ అమ్మాయి పాత్ర. నేను ఈ సినిమా చేయడానికి కారణం నా పాత్రకున్న ప్రత్యేకతే. ఈ పాత్ర కోసం కొన్నాళ్లు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. అయితే షూటింగ్‌కి అమెరికా వెళ్లాక అందరూ ఎక్కువగా వాడే సైన్ లాంగ్వేజ్‌ని అక్కడి ఓ 14 ఏళ్ల అమ్మాయి దగ్గర శిక్షణ తీసుకుని నటించాను. మాధవన్‌గారితో నా కెరీర్ తొలినాళ్లలో నటించాను. మళ్లీ ఇన్నాళ్లకు నటించడం వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఈ కథ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరగదు.. స్క్రీన్‌ప్లే ముందుకు నడిపించడంలో మిగతా పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. హేమంత్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ ప్రయోగాత్మక కథని అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం అంత సులువు కాదు.. దానికి చాలా ప్యాషన్, ధైర్యం కావాలి.. ఆ రెండూ ఉన్న నిర్మాతలు విశ్వప్రసాద్, కోన వెంకట్గార్లు. థ్రిల్లర్ సినిమాలకి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓటీటీలో విడుదలవడంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఇదే. థియేటర్స్‌లో ఉండే సౌండ్ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ప్రేక్షకులు మిస్ అవుతారు. అయితే హెడ్ ఫోన్స్, హోమ్ థియేటర్స్ ఈ లోపాన్ని కవర్ చేస్తాయి. మా సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ పెద్ద ఎస్సెట్స్. గోపీ సుందర్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఫార్వార్డ్ చేయకుండా ‘నిశ్శబ్దం’ సినిమాను ప్రేక్షకులంతా ఓ ఫ్లోలో చూడాలని మనవి చేస్తున్నా. -
నిశ్శబ్దం ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది
అనుష్క, మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడ్సన్, షాలినీ పాండే ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా చిత్రదర్శకుడు హేమంత్ మధుకర్ మీడియాతో చెప్పిన విశేషాలు. ► కమల్‌హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ సినిమాలా ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రయోగాత్మక సినిమాగా చేద్దామనుకుని కోన వెంకట్‌గారికి ఈ కథ చెప్పాను. కోనగారికి కథ నచ్చటంతో ఆయన ద్వారా అనుష్కగారికి, మిగతా నటీనటులకు ఈ కథ చెప్పి, ఒప్పించాను. ప్రయోగాత్మక చిత్రం అంటే నిర్మాతలు ముందుకు రారేమోనని కోన వెంకట్‌గారి సలహా మేరకు మూకీ సినిమాని కాస్తా డైలాగ్స్‌తో నింపి మెయిన్ పాత్ర అనుష్క క్యారెక్టర్‌ను మాత్రం మూకీగా ఉంచాను. అప్పుడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌గారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చారు. ఆయనతో పాటు కోన ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మాణ భాగస్వామిగా చేరటంతో మా ‘నిశ్శబ్దం’ తెరకెక్కింది. ► విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించటంతో పాటు ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ రావటం కోసం, కథానుగుణంగా సినిమాను అమెరికాలో చిత్రీకరించాం. అమెరికాలో పుట్టిన ఇండియన్ అమ్మాయి పాత్ర అనుష్కది. అలాగే అన్ని ముఖ్యపాత్రలు అమెరికా నేపథ్యంలో ఉంటాయి. ఒరిజినాలిటీ మిస్ కాకూడదనే ఉద్దేశంతో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ను పూర్తి నిడివి ఉన్న పాత్రకోసం తీసుకున్నాం. ఒక హాలీవుడ్ నటుడు పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’ అని అనుకుంటున్నాను. ► ఈ సినిమాను కేవలం 55రోజుల్లో తీయగలిగానంటే దానికి కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే. అమెరికాలో షూటింగ్ అంటే వీసాలు, లొకేషన్లు అని ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. నేను చెప్పిన కథను నమ్మి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గార్లు ఏ లోటు లేకుండా చేయటం వల్లే ఈ సినిమా సాధ్యమయింది. ఈ సినిమాలోని సౌండ్, షానిల్ డియో కెమెరా వర్క్ గురించి సినిమా చూసిన తర్వాత అందరూ మాట్లాడతారని నమ్ముతున్నాను. సంగీత దర్శకుడు గిరీష్, గోపీసుందర్ నేపథ్య సంగీతం పోటాపోటీగా ఉంటాయి. -
ఫలితాన్ని దాచలేం: కోన వెంకట్
‘‘ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడటం ఒక కిక్. అలా కుదరకపోతే టీవీలో చూస్తాం. కరెంట్ పోతే ఫోన్లో చూస్తాం. కానీ ఉత్కంఠ ఒక్కటే. ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ స్క్రీన్ అయినా ఒక్కటే. సినిమా కూడా అంతే’’ అన్నారు రచయిత కోన వెంకట్. అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన కోన వెంకట్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు. మూకీ టు టాకీ ‘నిశ్శబ్దం’ని ముందు మూకీ సినిమాగా అనుకున్నాం. స్క్రీన్ ప్లే కూడా పకడ్బందీగా ప్లాన్ చేశాం. కానీ అనుష్క పాత్ర ఒక్కటే వినలేదు... మాట్లాడలేదు.. మిగతా పాత్రలు ఎందుకు సైలెంట్‌గా ఉండాలి? అనే లాజికల్ క్వశ్చన్‌తో మూకీ సినిమాను టాకీ సినిమాగా మార్చాం. రచయితగా నాకూ సవాల్ దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ కథ ఐడియా చెప్పగానే నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఐడియాను కథగా మలిచి స్క్రీన్ ప్లే చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మేమిద్దరం మంచి మిత్రులం కావడంతో వాదోపవాదనలు చేసుకుంటూ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచాం. షూటింగ్ ఓ పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా మొత్తాన్ని అమెరికాలోనే పూర్తి చేశాం. అది కూడా కేవలం 60 రోజుల్లోనే. కానీ అలా చేయడానికి చాలా ఇబ్బందులుపడ్డాం. థ్రిల్లర్ సినిమా షూట్ చేయడానికి వాతావరణం కీలకం. అమెరికాలో శీతాకాలంలో తీయాలనుకున్నాం. మా అందరికీ వీసాలు వచ్చేసరికి అక్కడ వేసవికాలం వచ్చేసింది. రోజూ ఉదయాన్నే రెండుమూడు గంటలు ప్రయాణం చేసి లొకేషన్స్‌కి వెళ్లి షూట్ చేశాం. వేరే దారిలేకే ఓటీటీ ‘నిశ్శబ్దం’ చిత్రం రిలీజ్ ఫి్ర» వరి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అయోమయం. మరీ ఆలస్యం చేస్తే కొత్త సినిమా చుట్టూ ఉండే హీట్ పోతుంది. అది జరగకూడదని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఓటీటీకి వెళ్లకూడదని చాలా విధాలుగా ప్రయత్నించాం. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇలా చేస్తున్నాం. కచ్చితంగా థియేటర్ అనుభూతి ఉండదు. కానీ సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. వాళ్లకు ఎలా అయినా చూపించాలి కదా. ఓటీటీలో ‘నిశ్శబ్దం’ మొదటి బ్లాక్‌బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఫలితాన్ని దాచలేం థియేట్రికల్ రిలీజ్ అయితే కలెక్షన్స్‌ని బట్టి సినిమా హిట్, ఫ్లాప్ చెప్పొచ్చు. ఓటీటీలో అలా ఉండదు. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పేస్తారు. బావుంటే అభినందనలు ఉంటాయి. లేదంటే చీల్చి చండాడేస్తారు. ఈ లాక్‌డౌన్‌ను నేను ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. లాక్డౌన్ తర్వాత మనం చెప్పే కథల్లో చాలా మార్పు ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. కచ్చితంగా కొత్త ఐడియాలు మన తెలుగులోనూ వస్తాయి. ‘నిశ్శబ్దం’ కూడా అలాంటి సినిమాయే అని నా నమ్మకం. కోన 2.0 వస్తాడు ► లాక్డౌన్లో కొన్ని కథలు తయారు చేశాను ► లాక్డౌన్ తర్వాత అందరిలోనూ కొత్త వెర్షన్ బయటకి వస్తుంది అనుకుంటున్నాను. అలానే కోన వెంకట్ 2.0 కూడా వస్తాడు ► కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా బాగా ముస్తాబవుతోంది ► దేశం మొత్తం ఆశ్చర్యపడే కాంబినేషన్ ఒకటి ఓకే అయింది. ఆ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను ► సంక్రాంతికి థియేటర్స్ ఓపెన్ అయి, ప్రేక్షకులందరూ తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. -
నిశ్శబ్దం కూడా...
ఇప్పటికే పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ‘నిశ్శబ్దం’ కూడా విడుదల కానుంది. అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తెలుగులో ‘నిశ్శబ్దం’, తమిళ, మలయాళ భాషల్లో ‘సైలె¯Œ ్స’ పేరుతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘సస్పె¯Œ ్స, థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మాటలు రాని మరియు వినికిడి లోపం ఉన్న కళాకారిణిగా అనుష్క నటించారు’’ అన్నారు హేమంత్ మధుకర్. ‘‘భారతదేశంతో పాటు 200 దేశాల్లో మా సినిమా విడుదల కానుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. అనుష్క మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు చేసిన అన్ని పాత్రలతో పోలిస్తే ఈ చిత్రంలోని సాక్షి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. నా కంఫర్ట్ జోన్ నుండి నన్ను బయటకు నెట్టివేసిన పాత్ర’’ అన్నారు. -
సెన్సార్ పూర్తి.. సస్పెన్స్ అలానే ఉంది!
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్ టీం. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్ మధుకర్ తన ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!) ‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్ చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్ మధుకర్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!) Both our films #nishabdham Telugu and #silence given U/A censor certificate and I am overwhelmed by the response of the #cencorboard panel members and my sincere thanks to them for there advice to release the film first in theatre 🙏 pic.twitter.com/bIZTOvjY7q — Hemantmadhukar (@hemantmadhukar) May 26, 2020 ‘మా చిత్రం ‘నిశ్శబ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ కొద్దిరోజుల క్రితం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_841250433.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సమ్మర్లో నిశ్శబ్ధం
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ శుక్రవారం ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాను ఫిబ్రవరి 20కి పోస్ట్‌పోన్ చేశారన్నది నిన్న మొన్నటి వార్త. అయితే 20న కూడా నిశ్శబ్దం సందడి ఉండదని తాజా సమాచారం. ఏప్రిల్ నెలకు ఈ సినిమా వాయిదా పడిందని భోగట్టా. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 31న విడుదల కాకపోవడానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అవ్వకపోవడమే అని తెలిసింది. అందుకే శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో వారం అవసరం అయ్యేలా ఉండటంతో ఫిబ్రవరి 28వ తేదీన తీసుకువద్దాం అనుకున్నారు చిత్రబృందం. కానీ మార్చి మొదటివారం నుంచి పరీక్షల సీజన్ మొదలవుతోంది. సినిమా కలెక్షన్లపై పరీక్షల ప్రభావం పడే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు అనడంతో మళ్లీ విడుదలను వాయిదా వేశారని తెలిసింది. ఈ సినిమాను సమ్మర్లో తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అందుకు ఏప్రిల్ 2 కరెక్ట్ డేట్ అని, సమ్మర్‌కి కరై్టన్ రైజర్‌లా ఈ సినిమా ఉంటుందని టీమ్ భావించి ఆ డేట్‌ని కన్ఫర్మ్ చేశారట. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్. కెమెరా: షానీ డియోల్. -
ఇంట్లోనే పండగ
సంక్రాంతి పండక్కి అందరూ సొంత ఊర్లకు ప్రయాణం అయ్యారు. పండగ రోజులు కుటుంబంతో గడపడానికి ప్లాన్ వేసుకున్నారు. అనుష్క కూడా సంక్రాంతిని కుటుంబంతో కలిసి చేసుకోబోతున్నారట. ఆమె నటించి తాజా సినిమా ‘నిశ్శబ్దం’ ఈనెల 31న రిలీజ్ కానుంది. హేమంత్ మధుకర్ దర్శకుడు. మాధవన్, అంజలీ, షాలినీ పాండే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదు. సంక్రాంతి సెలవుల్ని ఫ్యామిలీతో గడపడానికి బెంగళూరు వెళ్లారు అనుష్క. అమ్మానాన్న, ఇద్దరు అన్నయ్యలతో పొంగల్ చేసుకోబోతున్నారట. సినిమా షూటింగ్స్ లేదా ప్రమోషన్స్‌తో పండగలకు ఇంట్లో ఉండే వీలు చాలా తక్కువగా దొరుకుతుంది హీరోయిన్లకు. ఈ అవకాశాన్ని కుటుంబంతో కలిసి పూర్తిగా ఆస్వాదిస్తారని ఊహించవచ్చు. పండగ పూర్తయిన తర్వాత నుంచి ‘నిశ్శబ్దం’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటారట అనుష్క. ఈ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో థ్రిల్లర్ చిత్రంలో నటించనున్నారామె. -
ఈ సంవత్సరం వీరు మిస్సయ్యారు
2019 సిల్వర్ స్క్రీన్ కొంతమంది స్టార్స్‌ని మిస్ చేసింది. అభిమానులను నిరాశపరిచింది. ఒకప్పుడంటే ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేక రెండు. అంతే.. ఆ ఒక్క దర్శనం కోసం అభిమానులు ఎదురు చూపులు చూస్తుంటారు. కానీ ఈ ఏడాది కొందరు హీరోలు అసలు ఒక సినిమాలో కూడా కనిపించలేదు. మిస్ అయిన లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే అభిమానులకు చిన్న ఊరట ఇస్తూ.. కొందరు ‘గెస్ట్’ రోల్స్‌లో కనిపించారు. కానీ రెండున్నర గంటలసేపు చూసినంత తృప్తి ఇలా వచ్చి అలా వెళ్లే అతిథి పాత్రలు చూసినప్పుడు దక్కదు కదా. మరి.. ఈ ఏడాది మిస్ అయిన ‘మిస్సింగ్ స్టార్స్’ ఎవరు? వచ్చే ఏడాదిని కూడా మిస్సవుతారా?.. తెలుసుకుందాం. రెండోసారి మిస్ తెలుగు సినిమా ప్రతిష్టను దేశవ్యాప్తంగా పెంచిన చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా రెండు భాగాలను తెరకెక్కించడానికి దర్శకుడు రాజమౌళికి ఐదేళ్ల సమయం పట్టింది. ఆ ఐదేళ్లలో రెండు సార్లు మాత్రమే ప్రభాస్ తెరపై కనిపించారు. అయితే ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో తమ హీరోను చూసిన తర్వాత ‘ఇలాంటి సినిమాకి ఇంత టైమ్ అవసరమే’ అనుకున్నారు ఫ్యాన్స్. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎనీ్టఆర్, రామ్‌చరణ్ హీరోలుగా డీవీవీ దానయ్య నిరి్మస్తున్న చిత్రం ఇది. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ చిత్రానికి కాస్త సమయం పడుతుంది. అలా ఈ ఏడాది తెరపై ఎనీ్టఆర్‌ను చూసుకునే చాన్స్ ఆయన ఫ్యాన్స్‌కు లేకుండా పోయింది. 2009లో ఎనీ్టఆర్ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. మళ్లీ మిస్సయిన ఇయర్ ఇదే. గత ఏడాది దసరాకి ‘అరవింద సమేత వీరరాఘవ’లో కనిపించిన తర్వాత సెప్టెంబర్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రం వచ్చే జూలై 30న రిలీజ్ కానుంది. గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..’ అని మురళీ శర్మ అంటే, ‘ఇవ్వలా.. వచి్చంది’ అని అల్లు అర్జున్ బదులు చెబుతారు. ఇది అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అల..వైకుంఠపురములో’ టీజర్‌లోని సీన్. ఈ డైలాగ్ మాదిరిగానే ఈ ఏడాది వెండితెరకు అల్లు అర్జున్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. 2018లో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించిన అల్లు అర్జున్ కథల ఎంపికకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అయితే వరుసగా మూడు సినిమాలను ప్రకటించి రన్నింగ్ ట్రాక్‌లోనే ఉన్నానని చెప్పకనే చెప్పారు. ‘అల..వైకుంఠపురములో’ జనవరి 12న రిలీజ్ కానుంది. నెక్ట్స్ సుకుమార్ దర్శకత్వంలో హీరోగా, ఆ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాలు చేయబోతున్నారు. అనుకోని గాయం.. చేసింది దూరం అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘భీష్మ’గా నితిన్ ఈ ఏడాది వెండితెరపై సందడి చేయాల్సింది. కానీ నితిన్ గాయపడటం వల్ల వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇలా అనుకోని గాయం నితిన్‌ను హీరోగా ఈ ఏడాది వెండితెరకు దూరం చేసింది. కానీ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దలకొండ గణే’లో అతిథిగా నితిన్ కనిపించారు. చంద్రశేఖర్ ఏలేటి, వెంకీ అట్లూరి (‘రంగ్ దే’ టైటిల్), కృష్ణచైతన్య దర్శకత్వాల్లో నితిన్ తర్వాతి చిత్రాలు తెరకెక్కనున్నాయి. రానా... రాలేదు ‘అరణ్య’, ‘1945’, ‘భుజ్: దిఫ్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాల చిత్రీకరణలతో ఈ ఏడాది బిజీ బిజీగా గడిపారు రానా. ఈ ఏడాది హీరోగా తెలుగు వెండితెరపైకి రాలేదు రానా. నిజానికి ‘అరణ్య’ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. అయితే ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ సినిమాలో రానా కొద్దిసేపు కనిపించిన సంగతి తెలిసిందే. ‘హౌస్‌ఫుల్ 4’తో హిందీ తెరపైనా కనిపించారు. గుణశేఖర్ దర్శకత్వం వహించనున్న ‘హిరణ్యకశ్యప’, ప్రముఖ మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ .. నటుడిగా రానా నెక్ట్స్ ప్రాజెక్ట్స్. శ్రీలంక ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్కు రానా ఓ నిర్మాత. ఇలా హీరోగా, నిర్మాతగా రానా వచ్చే ఏడాది హల్చల్ చేస్తారు. వితో వస్తాడు ప్రస్తుతం ‘వి’ సినిమాలో పోలీసాఫీసర్‌గా చేస్తున్న సుధీర్‌బాబు ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించలేదు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని మరో హీరో. ‘వి’ చిత్రం వచ్చే ఏడాది మే 25న విడుదల కానుంది. ఇది కాకుండా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటారు సుదీర్.సినిమాల్లో గ్యాప్ అనేది సహజం. మహా మహా స్టార్లకు కూడా గ్యాప్‌లు వచి్చన సందర్భాలున్నాయి. సో.. ఈ ఏడాది తమ అభిమాన తారలను వెండితెరపై చూసుకోలేకపోయామని ప్రేక్షకులు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిని మిస్సయినవారందరూ షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నవారే. కాబట్టి వచ్చే ఏడాది వీరి సందడి కాస్త ఎక్కువగానే ఉండొచ్చని ఊహించవచ్చు. – ముసిమి శివాంజనేయులు ►గత ఏడాది కథానాయికగా ‘భాగమతి’లో కనిపించిన అనుష్క ఈ ఏడాది ‘నిశ్శబ్దం’ చిత్రంలో వెండితెరపై కనిపించాల్సింది. కానీ ఈ ఏడాది చివర్లో విడుదల కావాల్సిన ‘నిశ్శబ్దం’ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది. దీంతో చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో కనిపించారు కదా అని అనుష్క ఫ్యాన్స్ సరిపెట్టుకోవాల్సి వచి్చంది. ‘మహానటి’ కీర్తీ సురేష్ ఈ ఏడాది ‘మిస్ ఇండియా, గుడ్‌లుక్ సఖి’ అనే రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు తమిళంలో ‘పెంగ్విన్’, మలయాళంలో ‘అరేబియన్ కడలింటే సింగమ్’, హిందీలో ‘మైదాన్’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ 168వ సినిమాకి ఇటీవల సైన్ చేశారు. ఈ ఏడాది ‘మన్మథుడు 2’లో అతిథిగా కనిపించడం మినహా కీర్తీ వేరే సిరిమాల్లో కనిపించలేదు. అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదలవుతాయి కాబట్టి 2020లో కీర్తీ పలు మార్లు దర్శనమిస్తారు. ఇక ‘ఎన్టీఆర్: కథానాయకుడు’లో అతిథిగా నటించి, హాలీవుడ్ మూవీ ‘ఫ్రోజెన్ 2’ తెలుగు వెర్షన్‌కు తన గొంతును వినిపించిన నిత్యామీనన్ హీరోయిన్గా ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించలేదు. నిత్యా నటించిన ‘ప్రాణ’ ఈ ఏడాది తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ‘దేవుడు చేసిన మనుషులు’ (2012) చిత్రంలో హీరోయిన్గా నటించిన తర్వాత దాదాపు ఆరేళ్లు హిందీ చిత్రాలు చేస్తూ గత ఏడాది ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో తెలుగు తెరపైకి కమ్ బ్యాక్ ఇచ్చారు ఇలియానా. ఆ తర్వాత మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ‘కాటమ రాయుడు’ (2017) తర్వాత శ్రుతీహాసన్ తెలుగు తెరకు దాదాపు రెండేళ్లు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు రవితేజ ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్ ట్రాక్‌లోకి వచ్చారు శ్రుతీ. 2017లో ‘కేశవ’లో నటించిన రీతూ వర్మ. ఇటీవలే నాని ‘టక్ జగదీ’లో ఒక హీరోయిన్గా నటించే చాన్స్ దక్కించుకున్నారు. దాదాపు రెండేళ్లు వెండితెరకు దూరమయ్యారు మంచు మనోజ్. ఇటీవలే మనోజ్ ఎమ్ఎమ్ ఆర్ట్స్ అనే ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. మనోజ్ తర్వాతి చిత్రం ఈ నిర్మాణ సంస్థలోనే తెరకెక్కుతుందని ఊహించవచ్చు. మనోజ్ హీరోగా నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ 2017లో విడుదలైంది. దాదాపు రెండేళ్లుగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని సాయిరామ్ శంకర్ ఇటీవలే తన కొత్త చిత్రం ‘రీసౌండ్’కు కొబ్బరికాయ కొట్టారు. 2018లో ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ మూవీ కెమెరా ముందుకు రాలేదు. ప్రస్తుతానికి సినిమాలేవీ కమిట్ అయిన దాఖలాలు కూడా లేవు. అయితే హిందీ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారని టాక్. -
పశువులు తిరుగుతున్నాయి జాగ్రత్త
హైదరాబాద్‌లో శంషాబాద్ హైవే మీద అఘాయిత్యం జరిగింది. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై నలుగురు దుర్మార్గుల దాష్టీకం సాగింది. ఇది సిగ్గు పడాల్సిన సమయం కడుపులో అగ్గి రగలాల్సిన సమయం. ప్రతి అమ్మాయికి రోడ్డు మీద తిరుగుతున్న పశువుల గురించి హెచ్చరించాల్సిన సమయం. సాక్షి ఫీచర్స్ డెస్క్: అమ్మాయీ... పని మీద బజారుకు వెళుతున్నావు జాగ్రత్త. రోడ్డు మీద పశువులు తిరుగుతున్నాయి. అమ్మాయీ.. చదువుకోవడానికి కాలేజీకి వెళుతున్నావు జాగ్రత్త. దారిలో పశువులు రంకెలు వేస్తున్నాయి. అమ్మాయీ... ఉద్యోగానికి బండెక్కి వెళుతున్నావు జాగ్రత్త. పశువులు మాటేసి, దారి కాచి పడేస్తున్నాయి. పశువులు ఇవి. ప్యాంటూ షర్టూ వేసుకున్న పశువులు. మీసాలు గడ్డాలు ఉన్న పశువులు. ఛాతీ మీద వెంట్రుకలుండే పశువులు. మగవాడంటే మొలభాగం మాత్రమే అని, స్త్రీ అంటే కటి భాగం మాత్రమే అని భావించే పశువులు. పశువులకే తలవొంపులు తెచ్చే పశువులు. అమ్మాయీ.. జాగ్రత్త. బయలుదేరే ముందు నీ హ్యాండ్ బ్యాంగ్‌లో కత్తి పెట్టుకో. కారప్పొడి పెట్టుకో. వీలైతే ఒక తుపాకీ పెట్టుకో. కుప్పకూల్చే ఒక పిడుగునే పెట్టుకో. అన్నింటికీ మించి చాలా చాలా ధైర్యం పెట్టుకో. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన సమయస్ఫూర్తి పెట్టుకో. అమ్మాయీ... పశువులు ముందు నమ్మించేలా వస్తాయి. నమ్మకాన్ని కలిగిస్తాయి. తోక ఊపుతాయి. మాట కలుపుతాయి. వెంటనే నమ్మకు తల్లీ. ఏమాత్రం నమ్మకు. మగది అని తెలిస్తే ఆఖరుకు పశువును కూడా నమ్మకు. మగ మనిషిని అసలు ఏమాత్రం నమ్మకు. అమ్మాయీ... పశువు ఒకోసారి ప్రేమ అనే చర్మం కప్పుకొని వస్తుంది. ప్రియుడు అనే పేరుతో వస్తుంది. కబుర్లు చెబుతుంది. కానుకలు ఇస్తుంది. ఒంటరి ప్రదేశంలో కలుద్దామని చెబుతుంది. వెళ్లకు తల్లీ. వెళ్లకు. ప్రేమను కూడా కలుషితం చేసే స్థాయిలో, ప్రేమకు కూడా పాపం అంటగట్టే స్థాయిలో, ప్రేమంటేనే భయపడే స్థాయిలో పశువులు కొమ్ములు విసురుతాయి. దొరికావా? కూల్‌డ్రింకుల్లో మత్తుమందులు కలుపుతాయి. నగ్నంగా వీడియోలు తీస్తాయి. కారులో తిప్పుతూ కోరలు దింపుతాయి. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టి పెంచుకున్న తల్లివమ్మా నువ్వు. ఈ ప్రేమ పశువుల నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎప్పుడో ఒకసారి పులి ఎదురొస్తుంది. ఎప్పుడో ఒకసారి పాము కరుస్తుంది. ఎప్పుడో ఒకసారి తేలు కనపడుతుంది. కాని ఇది అలా కాదు తల్లీ. అనుక్షణం ప్రమాదం నీ పక్కనే పొంచి ఉంటుంది. ఊరు అని లేదు, వాడ అని లేదు, వీధి అని లేదు, హైవే అని లేదు, రాత్రి అని లేదు, పగలు అని లేదు. తనవాళ్లని లేదు, పరాయి వాళ్లని లేదు. నువ్వొక అమ్మాయివైతే, స్త్రీవైతే, మహిళవైతే, చిన్నారి పాపవైనా సరే, ప్రమాదంలో ఉన్నట్టే. చాలా ప్రమాదంలో ఉన్నట్టే. అనుక్షణం నువ్వు వేయి కళ్లతో లక్ష ఆయుధాల పహారాతో నిన్ను నువ్వు రక్షించుకోవాల్సిందే. మరి ఈ సమాజం ఏం చేస్తుంది? చూస్తూ ఉంటుంది. అంతా జరిగాక ‘అయ్యయ్యో’ అంటుంది. ఫేస్బుక్లో పోస్టులు రాస్తుంది. టీవీ కెమెరాల ముందు ఖండిస్తుంది. కొవ్వొత్తులతో ప్రదర్శనలు చేస్తుంది. ర్యాలీలు నిర్వహిస్తుంది. అంతే తప్ప తన ఇంట్లో మగవాళ్లు ఎలా ఉన్నారు, తన ఇంట్లో మగ అబ్బాయిలు ఎలా ఉన్నారు అని చూసుకోదు. చెక్ చేసుకోదు. వాళ్లు ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారో, ఎలాంటి అఘాయిత్యపు తెగింపులో ఉన్నారో నిఘా పెట్టదు. వాళ్లను ముందు తమ ఇంటి స్త్రీలను గౌరవించమని నేర్పదు. ఇంట్లోని స్త్రీలను గౌరవించినవాడే బయట సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవిస్తాడు. ఇంట్లో అవమానించినవాడు బయట అఘాయిత్యానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే ఇవాళ సమాజంలో అతి అరుదుగా వినిపిస్తున్నది ‘సంస్కారం’ అనేమాటే తల్లీ! సంస్కార హీనమైన సమాజంలోనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటాయి. స్త్రీని గౌరవించని సంస్కారం, స్త్రీకి రక్షణ ఇవ్వలేని సంస్కారం, ఒంటరిగా ఒక స్త్రీ కనిపిస్తే ఆమెకు నిజమైన సహాయం చేయలేని సంస్కారం, ఆమెకు ఏ ఆందోళనా ఇవ్వకుండా ఇల్లు చేరేలా చూసే సంస్కారం... ఇది లేకుండా పోయిందమ్మా. అదృశ్యమైపోయింది. ఏ సైంటిస్టులైనా వచ్చి తిరిగి సృష్టిస్తే, మాత్రలుగా తయారుచేసి మింగిస్తే, ఇంజక్షన్లుగా జబ్బల్లో పొడిస్తే తప్ప ఈ సంస్కారం ఇప్పుడప్పుడే సమాజంలో వచ్చేలా లేదమ్మా! అమ్మాయీ... మన చదువులు చట్టుబండలు... ఇవి ర్యాంకులు ఎలా తెచ్చుకోవాలో చెప్తాయి గాని, క్యాంపస్ సెలక్షన్లో ఎలా జాబ్ కొట్టాలో నేర్పుతాయిగానీ, వీసా తెచ్చుకొని ఎలా దూరదేశాలకు ఎగిరిపోవాలో చెబుతాయిగానీ, పక్కనే ఉన్న ఒక ఆడపిల్లను, స్త్రీని, మహిళను, తల్లిని, చెల్లిని, ఉపాధ్యాయురాలిని, ఉద్యోగినిని ఎలా గౌరవించాలో నేర్పించవు. గతంలో కాండక్ట్ సర్టిఫికెటు ప్రతి ఒక్కరికీ ఒక యోగ్యతా పత్రంగా ఉండేది. ఇవాళ కాండక్ట్ అనేది ఒక హేళన చేయదగ్గ సంగతి అయిపోయిందమ్మా. అయినా తల్లీ! నువ్వు తెలుసుకోవాలి! ఎప్పుడూ నీ ఫోన్లో పోలీసు శాఖల నంబర్లు ఏమేమి ఉండాలో తెలుసుకోవాలి. షీ టీమ్‌ల నంబర్లు ఉంచుకోవాలి. అర్జెంట్‌గా నీకు సహాయం చేసేవారి నంబర్లు నోటికి వచ్చి ఉండాలి. గుంపులో ఉంటేనే సేఫ్టీ లేదు తల్లీ. ఒంటరి ప్రదేశానికి చేరుకోగానే నువ్వు తక్షణమే ఏ రక్షణ విభాగానికి ఫోన్ చేయాలో నీకు తెలిసి ఉండాలి. చాలు తల్లి! చాలు! వంట నేర్చుకున్నది చాలు! ఊడ్చడం నేర్చుకున్నది చాలు! అంట్లు కడగడం నేర్చుకున్నది చాలు! ఇక ఈ చేతులు ఉక్కుముక్కలుగా ఎలా మార్చాలో తెలుసుకోవాలి. శరీరాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చుకోవాలో తెలియాలి. యుద్ధవిద్యల్లో నువ్వు ఆరితేరాలి. పద్ధతిగా వస్తే ఒంటరిగా పెద్ద సైన్యంతో పోరాడవచ్చు. కాని ఇవి ఎటునుంచి ఎలా దాడి చేస్తాయో తెలియని పశువులమ్మా! పాశవిక మందలమ్మా! కొమ్ములతో పొడిచి కామం తీర్చుకోవాలనుకునే వికృత జంతువులమ్మా! పురుగులమ్మా! చెదకు మందు కనిపెట్టగలిగాం కానీ, ఈ వికృత మగవాంఛకు మందు కనిపెట్టలేకపోయాం. అందుకే నువ్వు ఎంత పెద్ద మూకతో అయినా సరే, తలపడే స్థయిర్యాన్ని, ధైర్యాన్ని సదా కలిగి ఉండాలమ్మా! తల్లిదండ్రులారా... అమ్మాయిల కోసం ఆందోళన పడుతూనే ఉన్నారు. అబ్బాయిల కోసం ఆందోళన పడండి. వారితో మాట్లాడండి. వారి భావోద్వేగాలు వినండి. వారి మానసిక స్థితి తెలుసుకోండి. వారిని నిత్యం గమనించండి. వారు ప్రమాదంలో పడకుండా, ఒకరిని ప్రమాదంలో పడవేయకుండా ఎలా తమను తాము అదుపు చేసుకోవాలో తెలియచేయండి. మాట్లాడండి తల్లిదండ్రులారా.... మాట్లాడండి... మాట్లాడుతూనే ఉండండి... అబ్బాయిలు పశువులుగా మారకుండా ఉండేందుకు... పశువులుగా మారినవారు మనుషులుగా మారేంత వరకూ మాట్లాడుతూనే ఉండండి. ఈ పశు సంస్కృతి ప్రియాంకారెడ్డితో ఆఖరు కావాలి. ఈ పశుహేల ఆమె అర్ధరాత్రి ఆక్రందనలతో అంతం కావాలి. అందుకు అందరం చైతన్యవంతం అవుదాం. సంస్కారవంతం అవుదాం. ఉరిశిక్ష అనడం వల్లే చంపేస్తున్నారు నిర్భయ చట్టంలో నేరం రుజువైతే ఉరిశిక్ష తప్పనిసరి అనేసరికి ఎక్కడ తమ గురించి చెబుతుందో అనే ఉద్దేశ్యంతో నిందితులు ఆ బాధితురాలిని అతికిరాతకంగా చంపేస్తున్నారు. చట్టం ఫెయిల్యూర్ బాధ్యత ప్రభుత్వాలదే. ఐదేళ్ల నుంచి యాభై ఏళ్లలోపున్న ఆడవారిపై అరవై శాతం అఘాయిత్యాలు జరుగుతున్నాయని పోలీసులే ధ్రువీకరించారు. ఒక స్త్రీ తనకు తాను జాగ్రత్తలు తీసుకున్నా ఆమెకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. – బి.అనిత, అడ్వకేట్ మానసిక స్థితిలో మార్పు రావాలి ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయాలనే నిర్భయ చట్టం తీసుకువచ్చారు. కానీ, మగాడు ఆ శిక్షలకు కూడా భయపడటం లేదు. మగవాడిలో ఇలాంటి నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందో, మానసిక స్థితి ఏంటో తెలుసుకోవాలి. దానికి చికిత్స చేయాలి. చట్టాలు వస్తున్నాయి. తగిన శిక్షలు అమలవుతున్నాయి. అలాగని ఏవీ తగ్గడం లేదు. మనుషులకు భయం అనేది పోయింది. ఇంటర్నెట్లో పోర్న్ సైట్స్ చూసి కూడా ఇలా ఉన్మాదుల్లా తయారవుతున్నారు. – జి.మమత, అడ్వకేట్ అమాయకురాలైన ప్రియాంకా రెడ్డిపై ఆత్యాచారం చేసి హత్య చేశారు. మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన çఘటన ఇది. ఈ ఘటనలో దోషులైనవారిని క్రూరమృగాలతో పోల్చితే అవి కూడా సిగ్గుపడతాయి. ఈ సమాజంలో మహిళగా పుట్టడం నేరమా? ప్రియాంకా రెడ్డి మరణానికి కారకులై, తప్పు చేసిన వారికి శిక్షపడేలా మనమందరం పోరాడాలి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను – అనుష్క ప్రియాంకా రెడ్డి సంఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. మాటలు రావడం లేదు. రోజు రోజుకీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నేను ఎంతో సేఫ్ ప్లేస్‌గా భావించిన హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం బాధ కలిగించింది. ఏ సమయంలోనైనా, ఎక్కడికి వెళ్లినా మహిళలు సురక్షితంగా తిరిగి రాగల పరిస్థితులు దేశంలో ఎప్పుడు వస్తాయో? ప్రియాంకను కిరాతకంగా చంపిన దోషులకు శిక్ష పడాలి. – కీర్తీ సురేష్ చాలా కోపం తెప్పించే ఘటన ఇది. మహిళలపై రోజు రోజుకీ జరుగుతున్న అఘాయిత్యాలు నన్ను బాధపెడుతున్నాయి. అసలు మహిళలు సురక్షితంగా ఉండగల ప్లేస్ ఎక్కడైనా ఉందా? అనిపిస్తోంది. ప్రియాంకారెడ్డి ఘటనలో నేరస్తులకు పెద్ద శిక్ష విధించాలి – కాజల్ అగర్వాల్ ఇలాంటి దిగ్భ్రాంతికర సంఘటనపై ఎలా స్పందించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి నేరం చేయాలనే ఆలోచన కూడా రాని విధంగా నేరస్తులను శిక్షించాలి – రకుల్‌ప్రీత్ సింగ్ ప్రియాంకా రెడ్డి ఘటన తెలిసిన తర్వాత నా గుండె పగిలిపోయింది. స్పందించడానికి మాటలు రావడం లేదు. ఇలాంటి వార్తలను చదవాలన్నా చాలా విచారకరంగా ఉంది. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ రాక్షసులను ఉరి తీయాలి – రాశీ ఖన్నా ఇది చాలా హేయమైన సంఘటన. చాలా కలత చెందాను. ఈ అమానవీయ ఘటనలో ప్రియాంకా ఎంతటి క్షోభను అనుభవించి ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. వారి కుటుంబ సభ్యుల బాధను మాటల్లో చెప్పలేం. నిందితులకు శిక్షపడాలి. – లావణ్యా త్రిపాఠి -
సోనాలి... వాయిస్ ఆఫ్ సాక్షి
సాక్షి మాట్లాడలేరు. కేవలం సైగలతోనే స్పందిస్తారు. ఆ సైగల్ని సరిగ్గా అర్థం చేసుకోగల అమ్మాయి ఒకరున్నారు. ఆమే సోనాలి. సాక్షి గొంతు. ఆ సోనాలి పాత్రను పోస్టర్ ద్వారా సోమవారం పరిచయం చేసింది చిత్రబృందం. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. ‘సాక్షి’ అనే మూగ పెయింటర్ పాత్రలో అనుష్క నటించారు. సోనాలి పాత్రలో షాలినీ పాండే నటించారు. ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. -
ఏజెంట్ మహా
యూఎస్‌లోని సియోటెల్ పోలీస్ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేశారు హీరోయిన్ అంజలి. పోలీసాఫీసర్‌గా ఆమె కేసులను ఎలా సాల్వ్ చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనుష్క, ఆర్. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే ముఖ్యతారలుగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఇటీవల ఈ సినిమాలోని అనుష్క, మాధవన్ లుక్స్‌ని విడుదల చేశారు. తాజాగా అంజలి లుక్‌ను రిలీజ్ చేశారు. యూఎస్ పోలీసాఫీసర్ ఏజెంట్ మహా పాత్రలో నటించారు అంజలి. ఈ పాత్ర కోసం దాదాపు 8 కిలోల బరువు తగ్గానని ఓ సందర్భంలో అంజలి పేర్కొన్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
‘నిశ్శబ్దం’ ప్రీ టీజర్
-
సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి
గత ఏడాది జనవరిలో విడుదలైన ‘భాగమతి’ చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని బుధవారం విడుదల చేశారు. బొమ్మలు గీస్తూ చూస్తున్న అనుష్క పోస్టర్‌పై ‘సాక్షి, ఏ మ్యూట్ ఆర్టిస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది నిశ్శబ్ద చిత్రం. ఇందులో సాక్షి అనే మూగ చిత్రకారిణిగా అనుష్క నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, ఇంగ్లిష్, హిందీ, మలయాళం భాషల్లో ఈ ఏడాది చివరిలో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షానియల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కోన వెంకట్. -
అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్ రిలీజ్
తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీ మరియు మలయాళం భాషల్లో నిశ్శబ్దం అనే చిత్రాన్ని చేస్తున్నారు అనుష్క. భాగమతి చిత్రం తరువాత మరే చిత్రాన్ని ఒప్పుకోని అనుష్క చాలా కాలం తరువాత ఈ బహుభాషా చిత్రానికి ఓకే చెప్పారు. ఇప్పటికే షూటింగ్‌ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనుష్క సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో సియాటెల్లోజరగ్గా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అక్కడే జరగనున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో చేతి సైగలతో ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. ఈ చిత్రంలో అనుష్క మూగ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్ ప్రత్యేకపాత్రలో నటస్తున్న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. -
తగ్గానండి!
అమెరికా పోలీసాఫీసర్ల చట్టాలను బాగా స్టడీ చేస్తున్నారు మన తెలుగు అమ్మాయి అంజలి. అక్కడి చట్టాలతో ఇక్కడి అమ్మాయికి పనేంటా అని ఆలోచనలో పడ్డారా? మరేం లేదు.. ఆమె ‘నిశ్శబ్దం’ సినిమాలో అమెరికన్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలుగా ‘నిశ్శబ్దం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఇటీవలే ఓ పాటను కూడా చిత్రీకరించారు. మాధవన్, అనుష్కలపై ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బధిర యువతి (చెవుడు, మూగ) పాత్రలో అనుష్క నటిస్తున్నారు. ఇటీవలే అంజలిపై కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో చేస్తున్న పోలీసాఫీసర్ పాత్ర కోసం ఆమె ఎనిమిది కిలోల బరువు కూడా తగ్గారు. అంతే కాదండోయ్... కెరీర్లో అంజలి తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘నిశ్శబ్దం’ సినిమాలో యూఎస్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా అమెరికా పోలీసుల బాడీ లాంగ్వేజ్, వారి చట్టాల గురించి స్పెషల్ కోర్స్ తీసుకున్నాను’’ అన్నారు అంజలి. -
కంగారేం లేదు
ఇటీవల కాలంలో హీరోలందరూ వరుసగా గాయపడుతున్నారు. తాజాగా అనుష్క కూడా గాయపడ్డారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమెకు ఏమైందో అని అనుష్క అభిమానులు గాబరా పడ్డారు. అయితే అనుష్కకు గాయం అయిందనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసింది. ‘సైరా: నరసింహారెడ్డి’ షూటింగ్ చేస్తూ అనుష్క గాయపడ్డారన్నది ప్రచారంలో ఉన్న వార్త. కానీ ‘సైరా’ సినిమా షూటింగ్‌ను అనుష్క ఎప్పుడో పూర్తిచేశారు. ఆమె పాత్ర మాత్రమే కాదు.. మొత్తం షూటింగ్ పూర్తయి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఆల్రెడీ చిరంజీవి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో అనుష్క, చిరంజీవిలపై ఓ సాంగ్ ఉంటుందట. చాలా కొద్దిక్షణాలు మాత్రమే అనుష్క ‘సైరా’లో కనిపిస్తారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ అనే చిత్రం చేస్తున్నారామె. -
సైలెన్స్ అంటున్న స్వీటీ
తమిళసినిమా: నటి అనుష్కను సన్నిహిత వర్గాలు అభిమానంగా స్వీటీ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. అనుష్క నటించిన చివరి చిత్రం తెరపైకి వచ్చి సుమారు రెండేళ్లు దాటింది. భాగమతి తరువాత ఈ అమ్మడు మరో చిత్రం చేయలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు అనుష్క బహిరంగంగా వెల్లడించినా, ఆ చిత్రం సెట్‌పైకి వెళ్లలేదు. మరో విషయం ఇంజి ఇడుప్పళగి చిత్రంలోని పాత్ర కోసం తన బరువును కనీసం 100 కిలోలకు పెంచుకున్న అనుష్క ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడిందనే చెప్పాలి. మొత్తం మీద సుదీర్ఘ శ్రమ తరువాత బరువు తగ్గి కొత్త అందాలను సంతరించుకుంది. తాను ఎలా బరువు తగ్గానన్న విషయాలను ఒక బుక్కుగా రాసి ఇటీవల విడుదల చేసింది కూడా. కాగా మళ్లీ ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయిన అనుష్క సైలెన్స్ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తెలుగు, తమిళం, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో నిశబ్దం అనే టైటిల్‌ను నిర్ణయించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కేఎఫ్‌సీ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో నటుడు మాధవన్, హాలీవుడ్ నటుడు మైఖేల్ మెడ్సన్, నటి అంజలి, శాలినీపాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారం అమెరికాలో సైలెంట్‌గా షూటింగ్‌ను ప్రారంభించింది. నటి అనుష్క ఇంతకుముందు పలు విభిన్నమైన కథా పాత్రల్లో నటించినా, ఈ సైలెన్స్ చిత్రంలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే కథా పాత్రలో కనిపించనుందట. దీంతో సైలెన్స్ చిత్రంపై సినీవర్గాలు, ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. -
పాయల్ బోల్డ్ కబుర్లు
ఛకొన్ని సినిమాలు హిట్ అయినట్టుకొన్ని బండ్లు కూడా హిట్ అవుతుంటాయి.ఒకప్పుడు ఆర్ఎక్స్ బైక్ పెద్ద హిట్.ఆ పేరుతో వచ్చిన ‘ఆర్ఎక్స్100’ కూడా హిట్.హీరోగా కిక్ కొట్టిన కార్తికేయకు ఎన్ని సినిమాలువచ్చాయో బ్యాక్సీట్లో కూర్చున్నపాయల్కి కూడా అంతే డిమాండ్ వచ్చింది.ఆల్రెడీ ఐదు సినిమాలు చేస్తోంది.ఇంకో నాలుగైదు డిస్కషన్లో ఉన్నాయి.బ్యూటిఫుల్ మాత్రమే కాదు..బోల్డ్ పాత్రలు చేస్తున్న పాయల్ రాజ్‌పుత్‘సాక్షి’తో బోలెడు కబుర్లు చెప్పింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో నటించాక బైక్ స్పీడ్ అంత వేగంగా కెరీర్ కొనసాగుతున్నట్లుంది? పాయల్: అవును. ఫుల్ స్పీడ్. తెలుగులో ‘వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డిఎక్స్ లవ్’ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో ‘ఏంజెల్’ అనే సినిమాలో నటిస్తున్నాను. తేజగారి ‘సీత’లో స్పెషల్ సాంగ్ చేశాను. చూసే ఉంటారు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాను. అందులో వేశ్య పాత్రలో కనిపిస్తాను. లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంది. అయినా తప్పక బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. బ్రేకా.. ఎందుకు? నెల రోజులుగా పాపికొండల్లో ‘ఆర్డిఎక్స్ లవ్’ సినిమా కోసం ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. అంతా సాఫీగా జరిగితే బ్రేక్ వచ్చేది కాదు. ఒక పాటకు డ్యాన్స్ చేస్తూ గాయపడ్డాను. ఆ పాట తీసే ముందు నాలుగు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. అప్పుడు మోకాలి ఎముక డిస్లొకేట్ అయింది. దాంతో పది రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్‌లో ఉండాల్సి వచ్చింది. పాపికొండల్లో ఎండలను ఎలా తట్టుకోగలిగారు? అయ్య బాబోయ్.. చాలా ఎండలు. నాకు వైరల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. ముఖ్యంగా నా టవల్‌ను ఉతక్కుండా నాలుగు రోజులు వాడాను. ఉతికి ఇవ్వమని చెబుదామంటే మరచిపోయేదాన్ని. హరీబరీగా షూటింగ్‌కి రెడీ కావడం, మళ్లీ టవల్‌తో ముఖం తుడుచుకున్నప్పుడు ఉతకలేదని గుర్తుకు రావడం.. దాంతో ఫేస్ మీద చిన్న చిన్న ర్యాషెస్ వచ్చాయి. మేకప్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. సినిమా ఆర్టిస్ట్ జాబ్ అంత ఈజీ కాదనిపించిందా? చాలా టఫ్. మన భుజం మీద చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక్క సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ హైప్‌ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎండ, వాన, చలి.. ఇలా సీజన్స్‌ని పట్టించుకోకూడదు. మాకున్నదల్లా సినిమా సీజన్ ఒక్కటే. ఆల్ టైమ్ సీజన్ అన్నమాట. దానికోసం ఎంతైనా కష్టపడాలి. మరి పేరు, డబ్బూ ఊరికే రావు కదా. హీరోయిన్ కావాలన్నది మీ చిన్నప్పటి కలా? అవును. హీరోయిన్ కావాలని కలలు కన్నాను. ఆ కలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నిజమైంది. నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాను. నా మాతృభాష పంజాబీలో సినిమాలు చేసుకుంటున్న నన్ను తెలుగు ఇండస్ట్రీ ఎంతో ప్రేమతో ఆహ్వానించింది. ‘ఆర్ఎక్స్ 100’లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చింది. ప్రేక్షకుల ప్రేమ వర్ణించలేనిది. ‘ఆర్ఎక్స్ 100’లో బోల్డ్ క్యారెక్టర్ చేశారు. అబ్బాయిని మోసం చేసే అమ్మాయి పాత్ర అది. అవకాశం పోగొట్టుకోకూడదని చేశారా? ఇష్టంగానే చేశారా? నిజానికి నాకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం. వ్యక్తిగా నా పర్సనల్ చాయిస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ నటిగా ఏదైనా కొత్త పాత్రలు, స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేయాలనుకుంటాం కదా. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాను. చాలా మంది హీరోయిన్లు ఆ పాత్ర విని చేయడానికి ఒప్పుకోలేదట. నాకు మాత్రం కథ వినగానే, ఇలాంటివి సొసైటీలోనూ జరుగుతున్నాయి కదా. అబ్బాయిల కంటే కొందరు అమ్మాయిలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. సినిమాలో చూపిస్తే తప్పేంటి? అని ఒప్పుకున్నాను. ఆ సినిమాలో అన్నీ మోతాదుకి మించి ఉంటాయి. లిప్‌లాక్ సన్నివేశాలైనా, ఇతర రొమాంటిక్ సీన్స్ అయినా. మరి ఈ పాత్ర గురించి ఇంట్లో చెప్పారా? మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. అలాగని లేనిపోని హద్దులు పెట్టి, మా అమ్మానాన్న నన్ను పెంచలేదు. కూతురికి అండగా ఉండటానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇద్దరూ నా బ్యాక్‌బోన్. డైరెక్టర్ అజయ్ భూపతిగారు కథ చెప్పినప్పుడే ‘మీ పాత్ర చాలా బోల్డ్‌గా ఉంటుంది’ అన్నారు. ఇంట్లో చెప్పాను. ఫస్ట్‌లో కొంచెం ఆలోచించినా తర్వాత ఒప్పుకున్నారు. ‘యాక్టర్‌గా నువ్వు ఏది చేసినా అది నీ కెరీర్‌కు హెల్ప్ అవ్వాలి. ప్లస్ ఏది కరెక్టో ఏది రాంగో నువ్వే డిసైడ్ చేసుకో’ అన్నారు. ఈ సినిమా చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. అయితే సినిమా చూసి నా పేరెంట్స్ షాక్ అయ్యారు. రవితేజతో చేస్తున్న ‘డిస్కో రాజా’లో మీది చాలెంజింగ్ రోల్ కదా? అవును. డెఫ్ అండ్ డమ్ (మూగ, చెవిటి అమ్మాయి) పాత్రలో కనిపిస్తాను. నటిగా నన్ను సవాల్ చేసే ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ఇంకా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాలేదు. వెంకటేశ్ గారితో చేస్తున్న ‘వెంకీ మామా’ షూటింగ్ చేస్తున్నాను. వచ్చే నెల ‘డిస్కో రాజా’ షూటింగ్లో అడుగుపెడతాను. ఆ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘అడ్జెస్ట్ కావాలి’ అని అడిగారని క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారు. దాని గురించి? నీకు ఇది కావాలంటే ఇలా కాంప్రమైజ్ కావాలి అని అడగటం నా దృష్టిలో బుల్షిట్. అలాంటి వాళ్లను అసలు కేర్ కూడా చేయను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలోనూ అడుగుతారు. ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా అడుగుతూనే ఉంటారు. అంటే అడగడం కామన్ అన్నమాట. వాటిని అంగీకరించకూడదు. తిరస్కరించాలి. మన టాలెంట్ మీదే మనం ఆధారపడాలి. తిరస్కరణ అనేది తెలివిగా జరగాలి. మరి ఆ టైమ్‌లో మీ తెలివితేటలను ఎలా ప్రదర్శించారు? కరెక్టే. గొడవలకు దిగకూడదు. అలాగని అమాయకత్వాన్ని ప్రదర్శించకూడదు. సింపుల్‌గా ‘నో’ అనేయడమే. నో చెప్పేటప్పుడు మన గొంతులో సీరియస్‌నెస్‌ని ఎదుటివాళ్లు గ్రహించగలగాలి. అలా చెప్పాలి. అంతే. యాక్టింగ్‌లో నా బెస్ట్ ఇవ్వడానికి నేను ఎంత కష్టపడటానికైనా రెడీ. ఎంత కష్టపెట్టినా రెడీయే. అందుకే ఇలాంటి విషయాలకు తలొంచాల్సిన అవసరం లేదనుకున్నా. పోనీ అడిగారే అనుకుందాం.. ఎందుకు బయటకు చెబుతున్నావు అని కొందరు అన్నారు. చెబితే తప్పేంటి? అనేది నా ఫీలింగ్. అడ్జస్ట్ కావాలని అడిగినది మీ పంజాబీ ఇండస్ట్రీలోనా? ఇక్కడా? క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోటా ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉంటుంది. ఓకే.. పాయల్ టామ్ బోయా లేక నాటీ గాళా? నేనంత నాటీ కాదు.. టామ్ బోయ్ టైప్ కూడా కాదు. అయితే చాలా హుషారైన అమ్మాయిని. నా లైఫ్ చాలా బ్యూటిఫుల్. నాన్న, అమ్మ, తమ్ముడు, నేను. చిన్నప్పుడు పెద్ద బ్రైట్ స్టూడెంట్ను కాదు. నా చదువు మీద ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ముంబై పంపితే హీరోయిన్ అయిపోతాను కదా? అనేదాన్ని. ఏదైనా డిగ్రీ పూర్తయిన తర్వాతే అన్నారు. అమ్మానాన్న మాటలను కాదనలేదు. మీకు ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా ఉందా? లేదు. కానీ నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. దేవుణ్ణి ఏదైతే అడిగానో దాన్ని ఇచ్చాడు. దీన్ని ఇలా కొనసాగించాలంటే ఈ హార్డ్ వర్క్‌ను ఇలా కొనసాగించాలి. నటిగా అవకాశాలు సంపాదించుకునే క్రమంలో పడిన కష్టాల గురించి? నేను కాలేజ్‌లో ఉండే సమయంలో మా అమ్మ నాకు 5 వేలు పాకెట్ మనీ ఇచ్చేవారు. ఐదు వేలంటే తక్కువ కాదు. కానీ హీరోయిన్ కావడానికి ముంబై వెళ్లాలంటే కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. అందుకే ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. 1500 నుంచి 5 వేలు సంపాదించడం స్టార్ట్ చేశాను. సేవింగ్స్‌తో ముంబై వెళ్లాలన్నది ఆలోచన. ముంబై వెళ్లే సమయానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉంది? లక్ష రూపాయలు. ఫైనల్లీ... ప్రస్తుతం సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈ గ్రోత్‌ని ఎలా చూస్తున్నారు. సంపాదన కోట్ల దాకా ఎదగడం ఆనందమే (పెద్దగా నవ్వుతూ). చాలా బావుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు అనిపిస్తోంది. గతంలో నేను కొన్ని సౌత్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చాను. ‘బ్యూటిఫుల్... అవకాశం మీకే’ అనేవారు. కానీ ఇచ్చేవారు కాదు. చాలా సినిమాలు వచ్చినట్టే వచ్చి చేజారేవి. ఇది మన టైమ్ కాదనుకుంటా అనుకునేదాన్ని. అప్పట్లో నేను సీరియల్స్ చేసేదాన్ని. ఆ సీరియల్ షూటింగ్ బ్రేక్స్‌లో సినిమాలకు ట్రైల్ వేస్తుండేదాన్ని. ప్రతిదాంట్లో రిజెక్షన్. ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్స్ ముంబైలో నా ఫోటో చూపించి ‘ఇలాంటి హీరోయిన్ కావాలి’ అంటున్నారు. అది చాలా గర్వంగా అనిపిస్తుంది. – డి.జి. భవాని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో చేస్తున్న సినిమాలో మీది వేశ్య పాత్ర అన్నారు. మళ్లీ బోల్డ్ రోలా? అది బయోపిక్. నిజంగా చాలెంజింగ్ రోలే. సవాళ్లు నాకిష్టం (నవ్వుతూ). రాణీ ముఖర్జీ, టబు, అనుష్క వంటి స్టార్స్ వేశ్య పాత్రలు చేశారు. వాటిని రిఫరెన్స్‌గా తీసుకుంటున్నారా? అఫ్కోర్స్. వారి సినిమాలు చూస్తాను. అయితే నా స్టైల్లో చేస్తాను. వేశ్యల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా ఒప్పుకున్నాక వాళ్ల లైఫ్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. వారి జీవితం అంత ఈజీగా సాగదు. ఒకవేళ వాళ్లు బ్రెడ్ అండ్ బటర్ కోసమే ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఆపేయమని చెప్పలేం. కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం అలాంటి పనులు చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఎవరి జీవితం వారిష్టం కాబట్టి నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని కామెంట్ చేయలేం. -
అమెరికాలో సైలెంట్‌గా...
‘బాహుబలి’ తర్వాత అనుష్క నెక్ట్స్ సినిమా పట్ల చాలా సైలెంట్‌గా ఉన్నారు. ఏ సినిమా చేస్తున్నారో చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే ‘సైలెంట్’ అనే బహుభాషా చిత్రం అంగీకరించారు. మాధవన్, అనుష్క జంటగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అంజలి, షాలినీ పాండే, హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడిసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోన వెంకట్ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అమెరికాలోని సీటెల్ ప్రాంతంలో ప్రారంభమైంది. చాలా శాతం షూటింగ్ అక్కడే జరుపుకోనుంది. సైలెంట్ థ్రిల్లర్‌గా రూపొందబోతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్ షానీ డియోల్ కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు. -
మౌనం వీడారు
ఈపాటికి యూఎస్‌లో సైలెంట్‌గా ‘సైలెన్స్’ టీమ్ షూటింగ్ చేసుకుంటూ ఉండాల్సింది. కానీ జరగలేదు. ఈ విషయంపై ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న టీమ్ ఇప్పుడు మౌనం వీడారు. ఈ నెలాఖర్లో షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘సైలెన్స్’ చిత్రం తెరకెక్కనుంది. అనుష్కా, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజులతో పాటు హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య తారాగణంగా కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24న ప్రారంభించనున్నట్లు దర్శకుడు హేమంత్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ అంతా ఆల్మోస్ట్ యూఎస్‌లోనే జరగుతుందని తెలిసింది. కొంతమంది అమెరిక్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ‘సైలెన్స్’ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
గాంధీ జయంతికి సైరా
దాదాపు రెండేళ్లుగా సాగుతున్న వెండితెర ‘సైరా: నరసింహారెడ్డి’ ప్రయాణం తుది దశకు చేరుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘సైరా: నరసింహారెడ్డి’. చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హీరో రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈనెల 14న ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ స్టూడియోలో ఓ పాటను చిత్రీకరించనున్నారు. అలాగే ఈ నెల చివరలో హీరోయిన్ అనుష్కపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇక్కడితో ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ పూర్తయిపోతుందని సమాచారం. అనుష్క పాత్రతోనే థియేటర్లో ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమా ఆరంభం అవుతుందని తాజా సమాచారం. ఈ ఏడాది గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2) ‘సైరా’ చిత్రాన్ని విడుదల చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. -
హెల్త్ జీరో కాకూడదు
నాజూకు రాణులు సన్నజాజుల్లా ఉండాలట.వాళ్ల బరువు ఏడు మల్లెల ఎత్తు తూగాలట.కానీ... ఇక్కడో అందమైన, ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్ మాట కూడా ఉంది.‘చక్కనమ్మ చిక్కినా అందమే’ అని ఓ వాడుక. అంటే మరి... చిక్కిపోకుండా బొద్దుగా ఉంటేనో? అప్పుడామె ఇంకా మరింత అందంగా ఉందనే కదా అర్థం!అన్నట్టు ఒక్కమాట...సైజ్ జీరో అయితే హెల్త్ కూడా జీరో కావచ్చు. హెల్త్ జీరో అయితే జీవితమూ జీరో కావచ్చు. హెల్త్ కొరవడిన లైఫ్ హెల్ అనిపించవచ్చు.అందుకే సన్నబడినా, కండపట్టినాఆరోగ్యానికి మించిన అందం లేదని గ్రహించాలి.అటు ఆ ఏడుమల్లెలూ, సన్నజాజులే కాదు...ఇటు ఈ బొండుమల్లెలూ, ముద్దబంతులూ ఇచ్చే‘అందమైన’ సందేశం ఇదే! ‘‘ఆద్యా.. ఏంటమ్మా ఇది? ఏమీ తినకుండానే చేయి కడుక్కుంటున్నావ్?’’ కంచంలో వడ్డించిన భోజనం వడ్డించినట్టే వదిలేసిన ఆరేళ్ల మనవరాలిని మందలించింది అమ్మమ్మ.‘‘అమ్మో.. కర్రీస్‌లో ఎంత ఆయిల్ ఉందో?’’ భయంతో కళ్లింత చేసుకొని జవాబిచ్చింది ఆద్యా.‘‘ఏయ్ వేషాలా? ఎక్కడుందే ఆయిల్?’’ గద్దించింది ఆద్యా పిన్ని.‘‘అంతంత ఆయిల్ తింటే రోడ్డు రోలర్లా తయారవుతారు. నేను కంగనా రనౌత్‌లా ఉండాలి’’ .. కళ్లు, చేతులు, నడుము తిప్పుకుంటూ ఆ పిల్ల.అక్కడున్న పెద్దవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంకానయం.. ఆరేళ్ల వయసులో ఆద్యా ఆ మాటలు మాట్లాడుతోంది.ఆ పిల్ల మేనత్త కూతురు.. నాలుగేళ్ల పసికూనకైతే బార్బీడాలే రోల్ మోడల్!విస్మయం చెందాల్సిన విషయమే. జీరో సైజ్.. ప్రభావం!తెల్లటి ఛాయే అందం అనే భ్రమను ‘నిజం’గా ఎలా నమ్మించారో.. బ్యూటీ అంటే జీరోసైజే అనే పిచ్చినీ అంతే ‘వాస్తవం’గా ప్రాచుర్యంలోకి తెచ్చారు. మ్యాగజైన్లు, పత్రికలు, టీవీలు, సినిమాల్లో ప్రకటనలు, కథనాలు, కథలు, సీరియళ్లు.. అన్నీ ఆ అతి నాజూకుతనానికే కిరీటం పెట్టాయి. అందం అంటే తెల్లటి రంగుతో.. 36–24–36 శరీర కొలతలు కాదు మొర్రో.. అందం అంటే ఆరోగ్యంతో ఉన్న ఆత్మవిశ్వాసమని ఇవే పత్రికల్లో మానసిక విశ్లేషకులు, వైద్యులు నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్నా కమర్షియల్ యాడ్స్ మాయలో.. హోరులో వినట్లేదు.. చూడట్లేదు!శారీరక వ్యాయామం లేకుండా డైట్‌తో ఫలానా రోజుల్లోగా ఫలానా అన్ని కేజీలు తగ్గుతారు.. మేము గ్యారెంటీ అంటూ.. ‘డైట్‌కి ముందు.. తర్వాత’ అని ఫోటోలు వేసి మరీ నిలబెట్టిన హోర్డింగులు చూసి.. క్యూ కడ్తున్నారు. సన్నబడ్డమేమో గానీ.. నీరసించి ఆసుపత్రి పాలైన టీనేజ్ అమ్మాయిలు కళ్లముందే కనిపిస్తున్నా! సన్నజాజి.. ముద్దబంతి వెనకట.. ‘‘ఆ అమ్మాయి చూడు.. సన్నజాజి తీగలా ఎంత నాజూగ్గా ఉందో?’’ అని అన్నవాళ్లే కాస్త బొద్దుగా కనిపించిన ఆడపిల్లను చూసి‘‘ముద్దబంతి పువ్వు’’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్లు. అంటే అందం.. మనిషి మనిషికీ మారినట్టే కదా! సన్నజాజి తీగను, ముద్దబంతినీ అభినందించారు అంటే ఆరోగ్యాన్ని.. దానిద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసాన్నే పరిగణనలోకి తీసుకున్నట్టు కదా! కండ కలవాడే (కలది కూడా) మనిషని గురజాడ కూడా సెలవిచ్చాడు. మనిషి మనిషికీ ఒంటితీరు మారుతుంది. ఎవరి బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వాళ్ల బరువు ఉండాలి. కష్టే ఫలి. చెమటోడ్చే శ్రమే ఆరోగ్య సూత్రం. అందుకే జీరో సైజ్ అబ్సేషన్గా మారిన తరాన్ని ఆ వెర్రిలోంచి బయటపడేయడానికి చాలా ప్రయత్నాలే మొదలయ్యాయిప్పుడు. ధమ్ లగాకే హైష్షా..! జీరో సైజ్‌కు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వెలిగిందీ.. అందులో ఆరోగ్యం జీరో అని చాటిందీ సినిమా స్టార్సే.. సినిమాలే అయినా ఇప్పడు తూచ్ అంటోందీ అవే.. వాళ్లే! కరీనా కపూర్‌తో ఈ తరహా నాజూకుతనం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. జీరో సైజ్ కొలతల్లో ఇమడడానికి కరీనా తీసుకున్న అతి శ్రద్ధ ఆమెను అనారోగ్యం పాలు చేసింది. దాంతో హెల్త్‌ను మించిన గ్లో, ఫేమ్ లేదని అంతే త్వరగా దాంట్లోంచి బయటకు వచ్చింది కరీనా. పాజిటివ్ దృక్పథం, చేస్తున్న పనిపట్ల నిబద్ధత, ప్లస్ పాయింట్స్.. ప్లస్ సైజ్‌ను బీట్ చేస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని ప్రొజెక్ట్ చేస్తాయి. ఇదే అందానికి యూనివర్స్ ఇచ్చే నిర్వచనం. బ్యూటీ పేజెంట్స్‌లో క్రౌన్‌ను డిసైడ్ చేసే లాస్ట్ రౌండ్ కూడా వీటికి సంబంధించే ఉంటుంది. ఈ సత్యానికి సినిమాలు పబ్లిసిటీ ఇస్తున్నాయి. లావుగా ఉన్న భార్యతో బయటకు వెళ్లడానికి సిగ్గుపడే భర్తను రక్షించి ఆత్మవిమర్శలోకి నెట్టిన హీరోయిన్ కథ తెలుగులో ‘కితకితలు’తో ప్రారంభమై.. హిందీలో భూమి ఫడ్నేకర్ కథానాయికగా వచ్చిన ‘ధమ్ లగాకే ౖహె ష్షా’గా కొనసాగుతోంది. ప్లస్ సైజ్ కథానాయికతో తెలుగులో ‘సైజ్ జీరో’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం కోసం అనుష్క శెట్టి బరువు పెరిగి పాత్రకు ప్రాణం పోసింది. అయినా.. ఆమె పట్ల ప్రేక్షకుల అభిమానం గ్రాము కూడా తగ్గలేదు. తెలుగు, తమిళ భాషల నటి ఆర్. వరలక్ష్మి (ఆర్. శరత్ కుమార్ కూతురు), బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎట్సెట్రా.. నటనతోనే అభిమానులను సంపాదించుకున్నారు తప్ప నాజుకుతనంతో కాదు. పాతకాలంలో సంధ్యా, సావిత్రి, దేవిక, రాజశ్రీ తర్వాత జయచిత్ర లాంటి వారు లేరా.. అంటే ఉన్నారు. స్లిమ్‌గా ఉండే ట్రెండ్‌లో కూడా కాన్ఫిడెన్స్ పాత్‌ను ఎంచుకున్న లేటెస్ట్ హీరోయిన్స్ ఉదాహరణగా చూపించింది.. ఈ తరం కనెక్ట్ అవడం కోసమే. ప్లేబాయ్ టు మాల్స్..! లావుగా ఉండే వారిలో ఆత్మన్యూనత పోగొట్టడానికి ప్లస్ సైజ్ మోడల్స్ కూడా వచ్చారు. వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ ప్లస్ సైజ్‌లో లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. వరల్డ్ టాప్ బ్రాండ్స్ వాటికి తమ బ్రాండ్నేమ్నిస్తున్నాయి. మాల్స్‌లో స్పెషల్ స్పేస్ దొరుకుతోంది. ప్లేబాయ్ లాంటి పత్రికలు ప్లస్ సైజ్ మోడల్స్‌ను తమ ముఖచిత్రంగా వేసి స్టీరియో టైప్‌ను బ్రేక్ చేస్తున్నాయి. ఆ పత్రిక ఫోటోగ్రాఫర్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న ఎల్. రామచంద్రన్ ఆ మోడల్స్‌తో ఫోటో షూట్ చేస్తున్నాడు. ‘‘సన్నని మేను, తెల్లటి రంగు అంటూ అందానికి నిర్వచనాలుండవ్. అవి కథల్లో, కవితల్లో మాత్రమే. ఆత్మసౌందర్యమే అసలైన సౌందర్యం’’ అంటాడు ఎల్. రామచంద్రన్. ఆయన ఫోటో షూట్‌కు మోడల్‌గా పనిచేసిన అక్షయ నవనీతన్.. టాప్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్, పలు టీవీ షోలకు యాంకర్ కూడా. ఎల్.రామచంద్రన్ ఫోటో షూట్లో ఆమె గుండు చేయించుకుని (క్యాన్సర్ మీద అవగాహన, క్యాన్సర్ బాధితలకు సంఘీభావంగా) కూడా పాల్గొన్నారు. ‘‘బాడీ షేమింగ్‌ను బ్రేక్ చేయడానికి విజువల్ ఆర్ట్‌ను మించిన మీడియం లేదు’’ అంటాడాయన.క్లారిటీ, సింప్లిసిటీ, స్ట్రెంత్.. సెల్ఫ్కాన్ఫిడెన్స్కు గ్రామర్.. గ్లామర్! దీన్ని మించిన అందం ఏం ఉంటుంది? ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తుల జీవితాలను చదివినా.. ఈ సామాన్య లక్షణాలే కనిపిస్తాయి! – సరస్వతి రమ అన్కండిషనల్గా ప్రేమించుకోవాలి మనమంటే హోల్ ప్యాకేజ్.. దాన్ని మొత్తంగా చూడగలగాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అన్ కండిషనల్‌గా. ఇంప్రూవ్ చేసుకోవాల్సిన క్వాలిటీస్‌ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. చేసుకోవాలి కూడా. అలాగని అప్పియరెన్స్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి.. అదీ ఓ భ్రమ కోసం మనల్ని మనం హింసించుకోవడం తప్పు. మోడల్స్‌ను రోల్ మోడల్స్‌గా తీసుకోకూడదు. వాళ్ల ఫోటోలు.. షూట్స్‌ను చూసి మనం ఫోలో కావద్దు. కారణం.. అవన్నీ ఎడిట్, గ్రాఫిక్‌ల గిమ్మిక్కులు. ఆరోగ్యం కోసం, ఒబేసిటీతో బాధపడ్తున్న వాళ్లు సన్నబడాలనుకోవడంలో తప్పులేదు. అది అవసరం కూడా. కాని అందం కోసం.. అదీ స్పెసిఫిక్‌గా జీరో సైజ్ ఫ్రేమ్‌లోకి రావాలని తాపయత్రయ పడడం మాత్రం ప్రమాదమే. దీనివల్ల శారీరకంగానే కాదు మానసిక సమస్యలూ తలెత్తుతాయి. ఎప్పుడైనా .. ఎక్కడైనా సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్ అవుతుంది. – డాక్టర్ పద్మాపాల్వాయి, సీనియర్ సైకియాట్రస్ట్ -
స్పెషల్ సాంగ్ @ సెకండ్ టైమ్
‘ఐ వాంట్ ఏ స్పైడర్‌మ్యాన్’ అని గతంలో ఓసారి అనుష్క అడిగారు గుర్తుందా? చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ చూసినవాళ్లు ఇది ఆ సినిమాలోని పాటే కదా అని చటుక్కున చెప్పేస్తారు. ఆ స్పెషల్ సాంగ్‌లో చిరు, అనుష్క వేసిన స్టెప్స్‌ను అంత సులువగా మరచిపోలేం. మళ్లీ చిరంజీవితో మరో స్పెషల్ సాంగ్‌కి నర్తించడానికి అనుష్క రెడీ అయ్యారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, తమన్నా కథానాయికలు. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారు అనుష్క. పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ చిరుతో కలసి ఆమె స్టెప్స్ వేయడం విశేషం. ఈ సాంగ్ షూటింగ్ ఈ నెలాఖరున జరగనుందని సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సాంగ్‌ను చిత్రీకరించే ప్లాన్‌లో చిత్రబృందం ఉందని తెలిసింది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
రాణి పూంగుళలి
రాణి రుద్రమదేవిగా ‘రుద్రమదేవి’లోను, రాణి దేవసేనగా ‘బాహుబలి’లోనూ అనుష్క ప్రదర్శించిన ధైర్యసాహసాలను మనం చూశాం. రాణి పాత్రలంటే అనుష్కే చేయాలన్నంత బాగా ఈ బ్యూటీ నటించారు. ఇప్పుడు ‘రాణి పూంగుళలి’గా అనుష్క కనిపించబోతున్నారని సమాచారం. ఎవరీ రాణి? ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదే అనుకుంటున్నారా? తమిళచరిత్ర తెలిసినవాళ్లకు పూంగుళలి గురించి తెలుస్తుంది, చోళుల చరిత్ర గురించి ప్రముఖ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా మణిరత్నం ఓ భారీ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఇందులో రాణి పూంగుళలి పాత్రకు ముందుగా నయనతారను అనుకున్నారట. అయితే వేరే చిత్రాలకు అప్పటికే డేట్స్ ఇవ్వడంతో నయనతార ఈ సినిమా చేయలేని పరిస్థితి. దాంతో అనుష్కను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ధైర్యసాహసాలు ప్రదర్శించాల్సిన పాత్ర ఇది. ఇప్పటికే రాణి పాత్రల్లో నిరూపించుకున్నారు కాబట్టి అనుష్క ఈ పాత్రను సునాయాసంగా చేసేస్తారని ఊహించవచ్చు. గత ఏడాది విడుదలైన ‘బహుబలి 2’ తర్వాత అనుష్క కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. ఇటీవలే ‘సైలెన్స్’ అనే చిత్రం అంగీకరించారు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా బహు భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పుడు ‘పొన్నియిన్ సెల్వన్’ వార్త నిజమైతే మళ్లీ నటిగా అనుష్క బిజీ అయిపోతారు. -
చైనాలో నైరా
‘సైరా’ చిత్రానికి గుమ్మడికాయ కొట్టే సమయం వచ్చేసిందట. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తమన్నా, అనుష్క కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఏప్రిల్ మొదటి వారంతో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి అయిపోతుందని తెలిసింది. ఈ చిత్రం చైనాలో చిత్రీకరణ జరగుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదట. చైనాలో ‘నైరా’ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉందని టాక్. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
స్క్రీన్ టెస్ట్
కొన్ని పాటలు పదే పదే పాడుకోవాలనేలా ఉంటాయి. ఎప్పటికీ వెంటాడుతుంటాయి. వాటినే ‘ఎవర్ గ్రీన్ సాంగ్స్’ అంటాం. ఆ పాత పాటలు రీమిక్స్ రూపంలో వస్తే.. అప్పటికే ఆ పాటలను ఎంజాయ్ చేసినవారికి ఆనందాన్నివ్వడంతో పాటు కొత్త తరానికి కూడా ఆ ట్యూన్స్ దగ్గరైపోతాయి. అలాంటి ఫేమస్ పాటలను కొన్నింటిని గుర్తుచేస్తూ ‘రీమిక్స్’పై ఈ వారం స్పెషల్ క్విజ్... 1. ‘రాముడు కాదు కృష్ణుడు’.. 1983లో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ జంటగా నటించిన చిత్రం. ఆ చిత్రంలోని ‘ఒక లైలా కోసం, తిరిగాను లోకం’ అనే సూపర్‌హిట్ సాంగ్ రీమిక్స్‌లో నాగచైతన్య నటించారు. ఆ పాటలోని మొదటి లైన్‌ను తన సినిమా పేరుగా పెట్టుకున్నారు చైతన్య. ఇందులో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్‌ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) నిధీ అగర్వాల్ డి) లావణ్యా త్రిపాఠి 2. ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రంలోని ‘వానా వానా వెల్లువాయె, కొండాకోన తుళ్లిపోయె...’ అప్పట్లో పెద్ద హిట్. తండ్రి చిరంజీవి చేసిన ఆ పాట రీమిక్స్‌లో తమన్నాతో కలిసి ‘రచ్చ’ చిత్రంలో స్టెప్పులేశారు రామ్‌చరణ్. అప్పట్లో చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? ఎ) వాణీ విశ్వనాథ్ బి) విజయశాంతి సి) రాధిక డి) రాధ 3. ఆత్రేయ స్వరపరచిన ‘ఓ బంగరు రంగుల చిలక పలకవే.. ఓ అల్లరి చూపుల రాజా ఏమని..’ పాట చలం హీరోగా నటించిన ‘తోటరాముడు’ చిత్రంలోనిది. కృష్ణ భగవాన్ హీరోగా నటించిన ఓ చిత్రంలో మరోసారి ఆ పాటను వినిపించాడు. ఆ సినిమాలో కృష్ణభగవాన్ సరసన హీరోయిన్గా నటించింది ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) రమ్యకృష్ణ సి) నగ్మా డి) రవళి 4. ‘ఆర్య–2’ చిత్రంలోని ఐటెమ్ సాంగ్ ‘రింగ రింగ రింగ రింగ రింగ రింగారే’ పాట హిందీలో రీమిక్స్ నటించిన హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అజయ్ దేవ్గన్ బి) అక్షయ్ కుమార్ సి) షారుక్ ఖాన్ డి) సల్మాన్ ఖాన్ 5. ‘గల గల పారుతున్న గోదారిలా...’ ఈ పాట మహేశ్‌బాబు నటించిన ‘పోకిరి’ చిత్రంలోనిది. కృష్ణ నటించిన ఓ సినిమాలోని పాట ఇది. అది ఏ సినిమానో తెలుసా? ఎ) గౌరి బి) సాక్షి సి) పండంటి కాపురం డి) అల్లూరి సీతారామరాజు 6. 1977లో యన్టీఆర్ నటించిన ‘యమగోల’ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ‘ఓలమ్మి తిక్క రేగిందా, వొళ్లంతా తిమ్మిరెక్కిందా...’ను రీమిక్స్ చేసిన దర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) వీవీ వినాయక్ బి) శ్రీను వైట్ల సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) కొరటాల శివ 7. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే..’ అంటూ సిల్వర్‌స్క్రీన్‌పై స్టెప్పులేసిన హీరో పవన్‌కళ్యాణ్. ఆయన సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) రాశి బి) రేణూదేశాయ్ సి) శ్రియ డి) భూమికా చావ్లా 8. ‘ఆకుచాటు పిందె తడిసే...’ అంటూ ‘వేటగాడు’ చిత్రంలో తన అందాలను ఆరబోశారు అందాల తార శ్రీదేవి. అదే ట్యూన్‌ను గుర్తు చేస్తూ ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అని జూనియర్ యన్టీఆర్ ‘అల్లరి రాముడు’ చిత్రంలో ఏ హీరోయిన్‌తో చిందేశారో గుర్తుందా? ఎ) ఆర్తీ అగర్వాల్ బి) సదా సి) కీర్తీ చావ్లా డి) అంకిత 9. కృష్ణ హీరోగా నటించిన ‘సింహాసనం’ చిత్రంలోని ‘ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ’ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఈ పాటను రీమిక్స్ చేసి తన సినిమాలో వాడుకున్న హీరో ఎవరో తెలుసా? ఎ) నితిన్ బి) నిఖిల్ సి) నవదీప్ డి) ‘అల్లరి’ నరేశ్ 10. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల, మాపటేల కలుసుకో...’ అనే పాట చాలా ఫేమస్. ఆ పాటను తన ఆల్బమ్‌కి పేరుగా పెట్టుకున్న ప్రముఖ గాయని పేరేంటో కనుక్కోండి? ఎ) చిత్ర బి) స్మిత సి) గీతామాధురి డి) శ్రావణ భార్గవి 11. ‘దం^è వే మేనత్త కూతురా... వడ్లు దంచవే నా గుండెలదరా... దంచు దంచు బాగా దంచు’ అనే పాట ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రంలోనిది. మళ్లీ ఆ పాటను హీరో నాని ‘రైడ్’ చిత్రంలో యూజ్ చేశారు. ‘రైడ్’ చిత్ర సంగీతదర్శకుడెవరో తెలుసా? ఎ) హేమచంద్ర బి) సాయికార్తీక్ సి) భీమ్స్ డి) శేఖర్ చంద్ర 12. నాగార్జున హీరోగా నటించిన ‘అల్లరి బుల్లోడు’ చిత్రంలోని ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా మురిపాలు కావాలా...’ పాటను రీమిక్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) నాని బి) సుమంత్ సి) శర్వానంద్ డి) కల్యాణ్‌రామ్ 13. ‘దేవదాసు’ చిత్రంలోని ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో..’ అనే పాట ఏ హీరో కోసం మళ్లీ తయారయ్యిందో లె లుసా? (క్లూ: ‘ఆటాడుకుందాం రా’ అనే చిత్రం కోసం ఈ పాట మళ్లీ తయారయ్యింది) ఎ) రానా బి) నాగచైతన్య సి) అఖిల్ డి) సుశాంత్ 14. ‘విష్ణు’ చిత్రంతో హీరోగా మంచు విష్ణు కెరీర్ మొదలైంది. ఆ చిత్రంలో యన్టీఆర్, సావిత్రి నటించిన ‘రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ..’ పాటను రీమిక్స్ చేశారు విష్ణు. ఆ పాట ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) మిస్సమ్మ బి) మాయాబజారు సి) దేవత డి) గుండమ్మ కథ 15. ‘ము, ము, ము, ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా...’ పాట అక్కినేని హీరోగా నటించిన ‘అదృష్టవంతులు’ చిత్రంలోనిది. ఆ పాటను హీరో నాగార్జున సినిమాలో వాడారు. నాగార్జున సరసన హీరోయిన్గా నటించిన ఆ భామ ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) మీనా సి) ప్రియమణి డి) మమతా మోహన్‌దాస్ 16. ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు, నేను రోమియోగా మారినది లగాయతు..’ పాట 1993లో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చింది. 2018లో ‘సవ్యసాచి’ సినిమాలో ఆ పాట రీమిక్స్‌కు నాగచైతన్య, నిధీ అగర్వాల్ కాలు కదిపారు. 1993లో సినిమాకు, 2018లో సినిమాకు సంగీత దర్శకుడు ఒక్కరే. ఎవరా మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా? ఎ) ఇళయరాజా బి) యం.యం. కీరవాణి సి) మణిశర్మ డి) కోటి 17. కృష్ణ, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘పచ్చనికాపురం’. ఈ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్ ‘వెన్నెలైనా చీకటైనా...’ పాటను రీమిక్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) అల్లు శిరీష్ బి) సునీల్ సి) సుధీర్‌బాబు డి) తరుణ్ 18. ‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ పాట ‘ఖైదీ నెంబర్ 786’ చిత్రంలోనిది. ‘అందం ఇందోళం, అధరం తాంబూలం’ పాట ‘యమకింకరుడు’ చిత్రంలోనిది. ఈ రెండు పాటలు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లోనివే. ఆ పాటలను రీమిక్స్ చేసిన హీరో ఎవరు? ఎ) వరుణ్ తేజ్ బి) అల్లు అర్జున్ సి) సాయిధరమ్ తేజ్ డి) రామ్‌చరణ్ 19. ‘ఇప్పటికింకా నా వయసు 26లే, ఇప్పటికిప్పుడు నీ కోసం పెళ్లికి తయ్యారే..’ పాట కృష్ణభగవాస్, రఘుబాబు హీరోలుగా నటించిన కామెడీ సినిమాలోనిది. ఆ సినిమాలో వాళ్లిద్దరూ ఏ హీరోయిన్ను ఉద్ధేశించి ఈ పాట పాడుకున్నారో తెలుసా? ఎ) సౌందర్య బి) రజని సి) రంభ డి) సంఘవి 20. ‘ఆర్య’ సినిమాలో ఐటెమ్ సాంగ్ ‘ఆ అంటే అమలాపురం’ పెద్ద హిట్. ఆ పాటను హిందీ చిత్రం ‘మాగ్జిమమ్’ కోసం వాడారు. హిందీలో ఈ ఐటెమ్ సాంగ్‌కు కాలు కదిపిన భామ ఎవరు? ఎ) కత్రినాౖ కెఫ్ బి) కరీనా కపూర్ సి) మలైకా అరోరా డి) హజెల్ కీచ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) ఎ 4) డి 5) ఎ 6) సి 7) డి 8) ఎ 9) డి 10) బి 11) ఎ 12) బి 13) డి 14)ఎ 15) డి 16) బి 17) సి 18) సి 19) సి 20) డి నిర్వహణ: శివ మల్లాల -
మ్యాడసన్ @ సైలెన్స్
అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ముఖ్య తారలుగా హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రం ‘సైలెన్స్’. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ నటించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ‘కిల్ బిల్, హేట్‌ఫుల్ ఎయిట్, రిసర్వోయర్ డాగ్స్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించారు మ్యాడసన్. ‘‘టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. ఓ వినూత్నమైన సినిమాను చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని ఆశిస్తున్నాం. యూఎస్ఏలోని సీయోటల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిత్రీకరణ జరపబోతున్నాం. ఈ సినిమా టీజర్‌ను మేలో యు.ఎస్.ఏలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
స్క్రీన్ టెస్ట్
ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్‌కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు సి) కొంగర జగ్గయ్య డి) యస్వీ రంగారావు 2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) హరనాథ్ డి) శరత్‌బాబు 3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి? ఎ) రైలు బి) కారు సి) విమానం డి) స్కూటర్ 4. 2009 ఎలక్షన్స్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం) ఎ) కుష్బూ బి) నగ్మా సి) సుహాసిని డి) జయసుధ 5. నటి రోజా వైయస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా? ఎ) నగరి బి) చిత్తూరు సి) పీలేరు డి) తిరుపతి 6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్‌గా గెలుపొందిన నటి? ఎ) హేమమాలిని బి) జయప్రద సి) జయబాధురి డి) రేఖ 7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత? ఎ) కరుణానిధి బి) యం.జీ.ఆర్ సి) స్టాలిన్ డి) నెపోలియన్ 8. నటి రాధిక భర్త శరత్‌కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి? ఎ) హిందూ మక్కళ్ కట్చి బి) కొంగునాడు మున్నేట్ర కళగం సి) తమిళ్ మానిల కాంగ్రెస్ డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి 9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి? ఎ) మురళీమోహన్ బి) ఏవీయస్ సి) అలీ డి) కోట శ్రీనివాసరావు 10. 1995వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) బాలకృష్ణ డి) ఏయన్నార్ 11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) సాయికుమార్ బి) ప్రకాశ్ రాజ్ సి) అయ్యప్ప.పి.శర్మ డి) యశ్ 12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి, మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి? ఎ) శారద బి) కవిత సి) విజయశాంతి డి) విజయనిర్మల 13. ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు? ఎ) 2000 బి) 2001 సి) 2002 డి) 2004 14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా నటుడు? ఎ)ఉపేంద్ర బి) పునీత్ రాజ్‌కుమార్ సి) సుదీప్ డి) శివ రాజ్‌కుమార్ 15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్ర రావు సి) దిలీప్ కుమార్ డి) రాజేష్‌ఖన్నా 16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు? ఎ) కమల్‌హాసన్ బి) రజనీకాంత్ సి) విశాల్ డి) విజయ్‌కాంత్ 17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు? ఎ) సుమన్ బి) పోసాని కృష్ణమురళీ సి) బాబుమోహన్ డి) విజయ్ చందర్ 18. 1999లో పదమూడవ లోక్‌సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు? ఎ) సి.అశ్వనీదత్ బి) మాగంటి బాబు సి) జి.ఆదిశేషగిరిరావు డి) డి.రామానాయుడు 19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు? ఎ) కృష్ణ బి) మురళీమోహన్ సి) కైకాల సత్యనారాయణ డి) కృష్ణంరాజు 20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్‌లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) హన్సిక డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి) 11) (బి) 12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
అనుష్క @ 14
రావడం రావడమే అనుష్క ‘సూపర్’లో గ్లామరస్ రోల్‌తో తెలుగు పరిశ్రమకు వచ్చారు. ఆ తర్వాత దాన్నే కంటిన్యూ చేస్తూ గ్లామరస్ రోల్స్‌లోనే కనిపించారు. అనుష్క ‘గ్లామరస్ హీరోయిన్’ అని ముద్ర పడుతున్న టైమ్‌లో, ‘అరుంధతి’గా వచ్చారు. అంతే.. గ్లామర్ స్టార్ అన్నవాళ్లే పర్ఫార్మెన్స్ స్టార్ అని కితాబులిచ్చేశారు. ‘అరుంధతి’ తరహాలోనే ‘రుద్రమదేవి, భాగమతి’ చిత్రాల్లో అనుష్క అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ‘బాహుబలి’ సినిమాలో ఆమె పోషించిన దేవసేన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘వేదం’లో వేశ్యగా, ‘సైజ్ జీరో’లో బొద్దు అమ్మాయిగానూ అలరించారామె. అలాగే ‘విక్రమార్కుడు, రగడ, మిర్చి’ వంటి కమర్షియల్ చిత్రాల్లోనూ నటించారు. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే.. అనుష్క కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు పూర్తి అయ్యింది. ‘‘నేను యాక్టింగ్ వైపు వస్తాననుకోలేదు. ‘సూపర్’ సినిమాలో హీరోయిన్ కోసం పూరి జగన్నాథ్‌గారు వెతుకుతున్నారని ఓ ఫ్రెండ్ నా గురించి ఆయనకు చెబితే హైదరాబాద్ వచ్చాను. చాన్స్ ఇచ్చిన నాగార్జునగారికి, పూరీగారికి థ్యాంక్స్. ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు అనుష్క. ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా, సంతోష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ భక్తి చిత్రంలో అనుష్క నటించనున్నారు. -
మరో భక్తి చిత్రం?
‘దళపతి, రోజా, దిల్ సే, రావన్, నవాబ్’ వంటి భారీ సినిమాలకు కెమెరామెన్‌గా పని చేశారు సంతోష్ శివన్. భారతదేశంలోని టాప్ కెమెరామెన్ లిస్ట్‌లో మొదటి వరుసలో ఉంటారాయన. అప్పుడప్పుడూ ఆయన డైరెక్టర్‌గా మారుతుంటారు కూడా. దర్శకునిగా ‘అశోక, ఉరిమి, నవరస’ వంటి చిత్రాలను రూపొందించిన ఆయన ఓ భారీ బడ్జెట్ డివోషనల్ మూవీ ప్లాన్ చేశారు. అయ్యప్ప స్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉండబోతోంది. మలయాళ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని శ్రీ గోకులన్ గోపాలన్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో అనుష్క కనిపిస్తారని టాక్. సౌత్‌లో అనుష్క క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ఆమెను సంప్రదించారని ఊహించుకోవచ్చు. ఆల్రెడీ ‘ఓం నమో వెంకటేశాయ’ అనే భక్తి చిత్రంలో అనుష్క కనిపించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ‘‘ఈ చిత్రం అయ్యప్ప జీవితంపై ఎక్కువ ఫోకస్ చేస్తుంది. యువరాజుగా, యోధుడిగా అయ్యప్ప ఏంటి? అనేది మా సినిమాలో చూపిస్తాం’’ అని శ్రీ గోకులన్ గోపాలన్ పేర్కొన్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. -
సైలెంట్‌గా ఉన్నారు
సినిమాలో కీలక పాత్ర ఉంది. నిడివి తక్కువే. మామూలుగా అయితే కొందరు ఆర్టిస్టులు నిడివి గురించి ఆలోచించిన నో అంటారు. కానీ నో ప్రాబ్లమ్ నేనున్నా అంటారు రానా. ఇంతకుముందు చాలా సినిమాల్లో అతిథిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా సినిమాల్లో గెస్ట్‌గా కనిపించారు. లేటెస్ట్గా అనుష్క, మాధవన్ సైలెంట్ థ్రిల్లర్ చిత్రంలోనూ అతిథిగా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ విషయం గురించి సైలెంట్‌గా ఉన్నారు. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందట. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలో జరగనుంది. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ‘బాహుబలి’ తర్వాత అనుష్క, రానా స్క్రీన్ షేర్ చేసుకోబోయే చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. -
‘సైరా’లో అనుష్క స్పెషల్ అపియరెన్స్
2006లో చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు అనుష్క. మళ్లీ పదమూడేళ్ల తర్వాత అలాంటి స్పెషల్ అపియరెన్సే ‘సైరా’ సినిమాలో ఇవ్వబోతున్నారట. అయితే అప్పుడు పాటకు మాత్రమే పరిమితమైతే ఇప్పుడు సీన్స్‌లో కూడా కనిపిస్తారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘సైరా : నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్‌సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్గా ఈ సినిమాలోకి అనుష్క కూడా జాయిన్ అవ్వనున్నారట. ఓ స్పెషల్ రోల్లో కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నారట అనుష్క. ప్రస్తుతం పాండిచ్చేరీ దగ్గర షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరాకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
హారోయిన్స్
కథానాయికలు లేటెస్ట్ ట్రెండ్‌కి మారిపోయారు. ఓన్లీ గ్లామర్, సాంగ్స్‌కే కాదు. యాక్షన్ సినిమాలు చేయడానికైనా, బయోపిక్స్‌లో ఒదిగిపోవడానికైనా, థియేటర్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టడానికైనా సై అంటున్నారు. వారి ఉత్సాహాన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఆడియన్స్‌ను భయపెట్టి మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి భయమే అభయంగా బాక్సాఫీస్ వద్ద వెండితెర ఆత్మలుగా హారర్ సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్న కొందరి హారోయిన్స్ గురించి తెలుసుకుందాం. ఐరాగా.. అందాల తార రెండేళ్ల క్రితం ‘డోరా’ సినిమాతో భయపెట్టడానికి ఆడియన్స్‌ను థియేటర్స్‌లోకి పిలిచారు నయనతార. కానీ ప్రేక్షకులు అంతగా భయపడలేదు. ఇప్పుడు ‘ఐరా’ సినిమాతో మరో సారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు నయన్. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో హారర్ అంశాలు పుష్కలంగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇందులో నయనతార డబుల్ రోల్ చేయగా ఒకటి డీ–గ్లామర్ రోల్ కావడం విశేషం. కేఎమ్. సర్జున్ దర్శకత్వం వహించిన ‘ఐరా’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. నయనతార ట్రిపుల్ టెర్రర్ కథానాయిక అంజలి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా లిస్ట్‌ను చెక్ చేస్తే అందులో మూడు హారర్ సినిమాలు (గీతాంజలి 2, ఓ, లీసా)ఉన్నాయి. 2004 లో వచ్చిన ‘గీతాంజలి’ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్‌కు ప్రిపేర్ అవుతున్నారు. మరో హారర్ మూవీ ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు త్రీడీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఇక ‘ఓ’ సినిమా దగ్గరకు వస్తే... తన చుట్టూ ఏం లేకపోయినా ఏదో ఉందని ఊహించుకుని భయపడే క్యారెక్టర్లో అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకుడు. ఇలా.. ఈ ఏడాది ట్రిపుల్ హారర్ థమాకా ఇవ్వనున్నారు అంజలి. అంజలి మహా భయం తన సినీ కెరీర్లో 50వ చిత్రాన్ని కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు హన్సిక. ఆ ఆలోచనలోనే ‘మహా’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హారర్ అండ్ సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ వివాదం అయ్యాయి. కానీ, టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు డిఫరెంట్ పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. హన్సిక ఫాంటసీ హారర్ ప్రస్తుతం సౌత్‌లో మంచి బిజీగా ఉన్నారు రాయ్‌లక్ష్మీ. కన్నడలో ‘ఝాన్సీ’, తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన ఆమె ‘సిండ్రెల్లా’ అనే ఫ్యాంటసీ కమ్ హారర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వినోద్ వెంకటేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది. రాయ్‌లక్ష్మీ థ్రిల్లింగ్ హారర్ థియేటర్లో ‘అరుంధతి’ సినిమా చూసిన ప్రేక్షకులు తర్వాత ఇంటికి ఒంటరిగా వెళ్లడానికి జంకేలా ఉన్నాయి ఆ సినిమాలో హారర్ సీన్స్. ఆ తర్వాత అనుష్క ‘పంచాక్షరి, భాగమతి’ వంటి సినిమాలను చేసినప్పటికీ ఆ రేంజ్ హిట్‌ను సాధించలేకపోయారనే చెప్పొచ్చు. మళ్లీ ఇప్పుడు ‘అరుంధతి’ రేంజ్లో ఆడియన్స్‌ను హడలెత్తించడానికి రెడీ అవుతున్నారట అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారామె. ఇది కేవలం హారర్ సినిమానే కాదు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంటాయట. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే కూడా నటిస్తారు. కొంతమంది హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారట. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ∙‘భాగమతి’లో అనుష్క ఎక్స్ట్రా ఫియర్ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆడియన్స్‌ను బాగానే కంగారు పెట్టారు నందితా శ్వేతా. ఇప్పుడామె ‘ప్రేమకథా చిత్రమ్ 2’ సినిమాలో నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరి కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నానీ ముఖ్య తారలుగా నటించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన నందిత లుక్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘దేవి 2’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన దేవి (తెలుగులో ‘అభినేత్రి’) సినిమాకు ఇది సీక్వెల్. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభుదేవా, తమన్నా ముఖ్య తారలు. తమిళంలో ‘నర్మద’ అనే సినిమాకు కమిట్ అయ్యారు నందిత. ఈ సినిమాలో కూడా హారర్ అంశాలు ఉంటాయని టాక్. మరి.. ఈ మూడు సినిమాలతో నందితా ఆడియన్స్‌కు ఎక్స్ట్రా ఫియర్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. నందితా శ్వేతా హీరోలు కూడా హారర్ జానర్‌పై దృష్టిపెట్టారు. 2017లో ‘గృహం’ సినిమాతో బంపర్‌హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ‘అరువమ్’ అనే హారర్ మూవీలో నటిస్తున్నారు. ‘ముని’ సిరీస్ మూవీస్‌తో రాఘవ లారెన్స్ ప్రేక్షకులను బాగా భయపెట్టారు. ఆయన తాజా హారర్ మూవీ ‘కాంచన 3’ (ముని 4) ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘నిను విడని నీడను నేనే’ చిత్రంతో తొలిసారి హారర్ జానర్లో నటిస్తున్నారు సందీప్ కిషన్. ‘చీకట్లో చితక్కొట్టుడు’ వంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరిక్షీంచుకోవడానికి రెడీ అవుతున్నాయి. సిద్ధార్థ్, రాఘవ లారెన్స్ – ముసిమి -
ఆ నలుగురూ ముఖ్యులు
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మంచి పేరున్న నటుడు మాధవన్. ‘బాహుబలి’ ముందు వరకూ అనుష్క దక్షిణాది వరకే పరిమితం. ఆ సినిమా తర్వాత ఉత్తరాదిన కూడా పేరు తెచ్చుకున్నారు. తెలుగమ్మాయి అంజలికి సౌత్‌లో మంచి పేరుంది. ఇక ‘అర్జున్‌రెడ్డి’తో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు షాలినీ పాండే. ఈ నలుగురూ ముఖ్య తారలుగా తెరకెక్కుతున్న చిత్రం మార్చిలో ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అమెరికాలో జరిగే షూటింగ్‌తో ప్రారంభం కానుంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో తీయనున్నామని చిత్రనిర్మాతలు తెలిపారు. అలాగే తెలుగు, తమిళ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తారు. తొలి క్రాస్ ఓవర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజులు ముఖ్య పాత్రలు చేస్తారు. కోన వెంకట్, షనిల్ డియో, గోపీ మోహన్, నీరజ కోన, గోపీసుందర్ టెక్నీషియన్లుగా చేయనున్నారు. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తామని నిర్మాతలు తెలిపారు. మార్చిలో ప్రారంభం అయ్యే ఈ సినిమాను ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేస్తామన్నారు. -
హాలీవుడ్ టచ్
హారర్ చిత్రం ‘భాగమతి’ తర్వాత ‘సైలెంట్’ అనే మూకీ థ్రిల్లర్‌లో కనిపించనున్నారు అనుష్క. మాధవన్ హీరోగా ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కోన వెంకట్ నిర్మాణంతో పాటు రచయితగానూ వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్నాయి. క్రాస్ఓవర్ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. అంటే కేవలం కొంతమంది మన భాష నటులు మిగతా అంతా వేరే భాష నటులు కనిపిస్తారు. ఇందులో హాలీవుడ్ నటుల టచ్ ఎక్కువగానే కనిపించనుంది. ‘కిల్‌బిల్’లాంటి క్లాసిక్ హిట్ చిత్రంలో నటించిన మైఖెల్ మేడ్సన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ‘కిల్ బిల్ ఫస్ట్ పార్ట్’తోపాటు ‘ఫారెస్ట్ ఆఫ్ లివింగ్ డెడ్, ఫ్రీ విల్లీ 2’ చిత్రాల్లో కనిపించారు మైఖెల్. మార్చి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ అమెరికాలోనే జరుపుకోనుంది. ఈ చిత్రం కోసం అనుష్క బరువు తగ్గి, కొత్త లుక్‌లో కనిపించనున్నారని కోన వెంకట్ పేర్కొన్నారు. -
కొత్త లుక్‌లో..
ఏడాది కావస్తోంది అనుష్క స్క్రీన్‌పై కనిపించి. ‘భాగమతి’ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా ఎక్కడా కనిపించలేదు. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందనున్న సైలెంట్ థ్రిల్లర్ ‘సైలెన్స్’లో నటించడానికి అంగీకరించారు కానీ ఆ చిత్రం షూటింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ ఉంది. ఈ సినిమాలో కంప్లీట్ న్యూ లుక్‌లో కనిపించే విషయంపై శ్రద్ధ పెట్టారట అనుష్క. అందుకే మీడియా బయట ఎక్కడా కనిపించడం లేదు. మాధవన్, అనుష్క ముఖ్య పాత్రల్లో ‘వస్తాడు నా రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ సినిమాకు దర్శకుడు. కోన వెంకట్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ లేటెస్ట్ థ్రిల్లర్ గురించి కోన వెంకట్ మాట్లాడుతూ – ‘‘తెలుగులో రాబోతున్న తొలి క్రాస్ఓవర్ చిత్రం ‘సైలెన్స్’. (మన భాష నటులతో సమానంగా లేదా ఎక్కువ సంఖ్యలో వేరే ప్రాంతం, భాష నటులు సినిమాలో కనిపించడాన్ని క్రాస్ఓవర్ అంటారు). అనుష్క, మాధవన్ మరో ఇద్దరు ప్రముఖ ఆర్టిస్టులు మినహా ఈ సినిమాలో మొత్తం హాలీవుడ్ నటులు కనిపించనున్నారు. ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం కోసం అనుష్క ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆమె సరికొత్త లుక్ కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
అనుష్క కొత్త లుక్ చూశారా?
సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్ ట్రెండ్‌ను మళ్లీ సృష్టించారు మన స్వీటి అనుష్క. అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి సినిమాలతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్‌ను తీసుకొచ్చారు. బాహుబలి సినిమాలతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి సిరీస్ తరువాత అనుష్క భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అయితే మళ్లీ ఇప్పటివరకు మరే ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేకపోయారు. కథా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనే నటించేందుకు స్వీటి ఆసక్తి చూపింస్తుండగా.. కోన వెంకట్ చెప్పిన కథకు అనుష్క ఓకే చెప్పారు. ఈ మూవీలోని అనుష్క లుక్‌ను కోన వెంకట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ మూవీ అనుష్కకు ఎలాంటి క్రేజ్‌ను తీసుకువస్తుందో చూడాలి. We are super excited with the look of Anushka in our film. This would be her best look till date. I like this look too 👍 pic.twitter.com/7aDxK0xk0D — kona venkat (@konavenkat99) 25 December 2018 -
మేం సింగిల్
ప్రజంట్ టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో ప్రభాస్, రానా టాప్‌లో ఉంటారు. కానీ వీళ్ల రిలేషన్షిప్ స్టేటస్‌ల మీద ఫ్యాన్స్‌కు సరైన క్లారిటీ లేదు. అనుష్కతో ప్రభాస్ రిలేషన్షిప్లో ఉన్నారని చాలా వార్తలే వచ్చాయి. ఏకంగా పెళ్లి ఫిక్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్త హల్ చల్ చేసింది. రానా విషయానికొస్తే... అప్పుడప్పుడూ ఎవరో ఒక హీరోయిన్‌తో లింక్ పెట్టి వార్తలు వస్తుంటాయి. అయితే ఈ ఇద్దరూ ‘మేం సింగిల్’ అన్నట్లుగానే సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు. రీసెంట్గా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ అదే అన్నారు. ఈ షోలో రాజమౌళి, ప్రభాస్, రానా పాల్గొన్నారు. జనరల్‌గా ఈ షోలో ఎలాంటి మొహమాటం లేకుండా నేరుగా ప్రశ్నలు సంధించేస్తారు కరణ్. అదే విధంగా.. మీరు, త్రిష రిలేషన్షిప్లో ఉండేవారట? అని రానాని అడగ్గా – ‘‘మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని రోజులు డేటింగ్ కూడా చేశాం. ప్రస్తుతానికి నేను సింగిలే’’ అని సూటిగా సమాధానం చెప్పేశారు. అలాగే ప్రభాస్‌ను మీరు అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నారట కదా అని అడగ్గానే– ‘‘అనుష్క నాకు 8 ఏళ్లుగా తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్. వరుసగా కలసి సినిమాలు చేసేసరికి ఇలాంటి వార్తలు వస్తుంటాయి. అందులో వాస్తవం లేదు. నేనింకా సింగిలే’’ అని సమాధానమిచ్చారు ప్రభాస్. మరి తెలుగులో ఎవరు సెక్సియస్ట్ హీరోయిన్ అన్న ప్రశ్నకు అనుష్క పేరు చెప్పారు ప్రభాస్. ఆ వెంటనే.. ఈ సమాధానానికి, మా గురించి ప్రచారమవుతున్న రూమర్కీ సంబంధం లేదని ప్రభాస్ నవ్వేశారు. ఇక.. రానా, ప్రభాస్ ఇద్దరిలో రానాకే త్వరగా పెళ్లి అవుతుంది. ప్రభాస్ పెళ్లి లేట్ అవ్వడానికి కారణం తన బద్ధకమే అని రాజమౌళి పేర్కొనడంతో అందరూ హాయిగా నవ్వుకున్నారు. ప్రొఫెషనల్‌గా మీ విజన్‌తో పోటీగల బాలీవుడ్ దర్శకుడు ఎవరైనా ఉన్నారా? అని రాజమౌళిని కరణ్ అడగ్గా – ‘లేరు’ అని సమాధానమిచ్చారు. అలాగే రజనీకాంత్, కమల్హాసన్లలో ఎవర్ని డైరెక్ట్ చేయాలని ఉంది? అనే ప్రశ్నకు – ‘‘రజనీకాంత్’’ అన్నారు రాజమౌళి. బాలీవుడ్ ఖాన్స్‌లో ఎవరిష్టం అన్న ప్రశ్నకు ‘సల్మాన్ ఖాన్’ పేరు చెప్పారు రాజమౌళి. -
మ్యూజికల్ రైడ్
ఈ ఏడాది అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి మంచి ఊపు మీద ఉన్నారు మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్. అటు మాలీవుడ్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తున్న గోపీసుందర్ తాజాగా మరో తెలుగు సినిమాకు స్వరాలు సమకూర్చడానికి సిద్ధం అయ్యారు. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్కా, మాధవన్ ప్రధాన పాత్రలుగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘సైలెన్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది యూఎస్‌లో ప్రారంభం కానుంది. ‘‘తెలుగులో ఇప్పటికే గోపీ సుందర్ మంచి సంగీతం అందించారు. ఆయన మా సినిమాకు మ్యూజిక్ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీ. మంచి మ్యూజికల్ రైడ్‌గా ఉంటుందీ చిత్రం’’ అన్నారు కోన వెంకట్. -
అంతా నిశ్శబ్దం
అనుష్క నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? అన్నది కొన్ని నెలలుగా జవాబు దొరకని ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. అనుష్క నెక్ట్స్ చేయబోయే చిత్రం పేరు ‘సైలెన్స్’. మూకీ సినిమా అని అర్థమయ్యే ఉంటుంది. ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ముఖ్య›పాత్రల్లో ‘సైలెన్స్’ అనే సైలెంట్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. రచయిత కోన వెంకట్ ఈ చిత్రానికి రచయితగా, సహాయ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలోని సీటెల్ ప్రాంతంలో జరగనుంది. అనుష్క, మాధవన్ ఇదివరకు ‘రెండు’ (2006) అనే తమిళ సినిమాలో తొలిసారి కలసి నటించారు. ఇప్పుడు 12ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరూ కలసి నటించబోతున్నారు. సైలెంట్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. -
హిట్ కాంబినేషన్.. నాలుగో సారి.!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అనుష్కలది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలసిందే. వీరిద్దరు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ ఘనవిజయం సాధించింది. మూడు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాలకు హరి దర్శకుడు. ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సూర్య 39వ సినిమాకు హరినే దర్శకత్వం వహించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్గా మరోసారి అనుష్కనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు హరి. అయితే కొద్ది రోజులుగా లుక్ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ప్రస్తుతం సినిమాలు అంగీకరించటం లేదు. మరి మరోసారి హరి, సూర్యలతో కలిసి పనిచేసేందుకు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
అది నేను కోరుకున్నదే!
తమిళసినిమా: అది నేను కోరుకున్నదే అంటోంది అందాల భామ అనుష్క. తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్న కథానాయకి ఈ జేజెమ్మ. బాహుబలి–2లో అందంతో పాటు, రాజసాన్ని, పౌరుషాన్ని ప్రదర్శించి వావ్ అనిపించుకున్న అనుష్క భాగమతి చిత్రంలో శక్తి యుక్తులతో పాత్రను రక్తిగట్టించి ఈ చిత్రాన్ని విజయతీరం దాటించింది. అలాంటి మంచి నటి ఇప్పుడు ఒక్క చిత్రం కూడా చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అం శం. దీంతో అనుష్క గురించి రకరకాల వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఈ స్వీటీని ఓ ఇంటిదాన్ని చేయడానికి ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్నది మినహా ఆ వదంతుల్లో నమ్మదగ్గవి ఏమీలేవు. అనుష్క పెళ్లి కోసం దోష నివారణ పూజలను నిర్వహించారు. అయినా ఇంకా సరైన వరుడు లభించలేదు. అనుష్కకు 36 ఏళ్లు. అయినా ఆమె అందంలో ఏ మాత్రం మార్పు లేదు. అంతగా అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారన్న ప్రశ్నకు ఈ బ్యూటీ ఏం చెప్పిందో చూద్దాం. శరీరానికి, మనసుకు మధ్య సమతుల్యం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. అందం అనేది మనసులోంచి రావాలి. అంతేగానీ దాన్ని బయట నుంచి పొందలేం. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం వల్లే నన్ను నేను అందంగా ఉంచుకోగలుగుతున్నాను. పెరిగే వయసును ఆపడం సాధ్యం కాదు. అయితే వయసైపోతోందని చింతించకూడదు. వయసు అన్నది లెక్కపెట్టుకోవడం కోసమే. దాన్ని సంతోషంగా మార్చుకుంటే వయసు పైబడిపోతోందన్న భావన మనకు రాదు. విరామం లభించినప్పుడు మరో పనిచేయకుండా విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో ఏకాంతాన్ని కోరుకుంటాను. నా గురించి ఆలోచించుకుంటాను. నాకు తెలియకుండా ఏదైనా తప్పుచేస్తే అది గుర్తుకొస్తుంది. ఆ తప్పును మళ్లీ చేయకుండా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రస్తుతం చిత్రాల్లో నటించకుండా ఉండడం నేను కోరుకుని తీసుకున్న నిర్ణయమే. శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం అవడంతో కొత్త చిత్రాలేవీ అంగీకరించడం లేదు. ఈ విశ్రాంతిని సంతోషంగా అనుభవిస్తున్నాను అని పేర్కొంది. -
నాని సినిమాలో అనుష్క.!
టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ హీరోయిన్ అనుష్క. అరుందతి, బాహుబలి, భాగమతి లాంటి చాలెంజింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్న స్వీటీ మరో డిఫరెంట్ క్యారెక్టర్ కు ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి త్వరలో నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. బాహుబలి 2 తరువాత సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న స్వీటీ, చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారో లేదో చూడాలి. -
హన్సిక సైతం..
తమిళసినిమా: అందాల భామ హన్సిక సైతం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. నయనతార, అనుష్క, త్రిష వంటి అగ్రతారలు స్త్రీ ప్రధాన ఇతివృత్త కథాచిత్రాలకు మారిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ హర్రర్ కథా చిత్రాల్లోనూ నటించారు. తాజాగా ఈ కోవలో హన్సిక చేరుతోంది. అవును ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఒక థ్రిల్లర్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. కోలీవుడ్‌లో యువ స్టార్ హీరోలందరితోనూ నటించేసిన ఈ అమ్మడికి చిన్న గ్యాప్ వచ్చిన మాట నిజ మే అయితే ఇప్పు డు సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ అయిపోయింది. ఇప్పటికే కోలీవుడ్‌లో రెండు చిత్రాలను చేస్తున్న హన్సిక తాజాగా మరో చిత్రానికి ఓకే చేసింది. ఇదే థ్రిల్లర్ కథా చిత్రం. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందించడం. దీన్ని జ్యోస్టర్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎం.కోటేశ్వర రాజు నిర్మించనున్నారు. విజయ్ రాజేంద్ర వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ద్వారా యుఆర్.జమీల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన మసాలా పడం, రోమియో జూలియట్, భోగన్ చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశారు. రోమియో జూలియట్, భోగన్ చిత్రాల సమయంలో యుఆర్.జమీల్ పనితనం నటి హన్సికను ఆకర్షించిందట. అందుకే ఈయన దర్శకత్వంలో నటించమని అడగ్గానే ఓకే చెప్పాసిందట. ఈ చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ పలు భారీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న జిబ్రాన్ తమ చిత్రానికి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యం కలిగిన ఈ థ్రిల్లర్ కథా చిత్రానికి పనిచేయడానికి ఆయన ఆసక్తిని వ్యక్తం చేశారన్నారు. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యి సంగీతాన్ని అందించడానికి సమ్మతించారని చెప్పారు. ఇక నటి హన్సిక కథ వినగానే కథ వినగానే నటించడానికి సమ్మతించారని చెప్పారు.ఆమె నాయకిగా నటించడం, జిబ్రాన్ సంగీతాన్ని అందించడం సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు. మరి కొందరు ప్రఖ్యాత సాంకేతిక నిపుణలను ఎంపిక చేసే చర్చల్లో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అనగానే వాణిజ్య పరమైన అంశాలు అంతగా ఉండవని భావించవచ్చునని, అయితే తమ చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలతో పాటు జనరంజకమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని అన్నారు. నిర్మాతలు ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి విలువలతో నిర్మించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు యుఆర్.జమీల్ చెప్పారు. -
స్క్రీన్ టెస్ట్
1. నటుడు విశాల్ హీరో కాకముందు ఓ ప్రముఖ హీరో దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఎవరా హీరో? ఎ) విక్రమ్ బి) అర్జున్ సి) భాగ్యరాజా డి) విజయ్ కాంత్ 2. నాని నటించిన ‘మజ్ను’ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) అనూ ఇమ్మాన్యుయేల్ బి) అనుపమా పరమేశ్వరన్ సి) రుక్షార్ థిల్లన్ డి) నివేథా థామస్ 3. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తనకు బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఆ బ్రేక్ ఇచ్చిన దర్శకుడెవరు? ఎ) గౌతమ్ పట్నాయక్ బి) సురేందర్ రెడ్డి సి) మేర్లపాక గాంధీ డి) సుబ్బారెడ్డి 4. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని పోలీసులకు దొరికిన బాలీవుడ్ నటుడెవరో కనుక్కోండి? ఎ) ఆమిర్ ఖాన్ బి) సల్మాన్ ఖాన్ సి) సొహైల్ ఖాన్ డి) అర్భాజ్ ఖాన్ 5. ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు’... అనే పాట ‘చందమామ’ సినిమాలోనిది. ఈ పాట రచయితెవరో తెలుసా? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) అనంత శ్రీరామ్ సి) చంద్రబోస్ డి) వనమాలి 6. ఎన్టీఆర్, అంజలీదేవి, జమున నటించిన ‘సతీ అనసూయ’ చిత్రానికి సంగీతదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఎస్.రాజేశ్వరరావు బి) కె.వి. మహదేవన్ సి) ఘంటసాల డి) పెండ్యాల 7. 2012వ సంవత్సరానికి ఫోర్బ్ ్స ఇండియా సెలబ్రిటీ టాప్ 100 లిస్టు్టలో 66వ స్థానాన్ని సంపాదించిన టాలీవుడ్ హీరో ఎవరై ఉంటారో ఓ లుక్కేయండి? ఎ) ప్రభాస్ బి) జూనియర్ ఎన్టీఆర్ సి) అల్లు అర్జున్ డి) రామ్ చరణ్ 8. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ‘బర్ఫీ’ ద్వారా తెలుగు నుండి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిన హీరోయిన్ ఎవరో కనిపెట్టండి? ఎ) ఇలియానా బి) తమన్నా సి) రకుల్ ప్రీత్‌సింగ్ డి) పూజా హెగ్డే 9. ఓ నాటకంలో నటించటానికి సావిత్రి దుగ్గిరాల వెళ్లినప్పుడు ఓ ఇంట్లో బస చేశారు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఆమె సినిమా ఇండస్ట్రీకి రమ్మన్నారు. ఆమె చెన్నై వెళ్లి, చాలా పెద్ద హీరోయిన్ అయ్యారు. ఎవరా హీరోయిన్? ఎ) విజయనిర్మల బి) అంజలీదేవి సి) దేవిక డి) జమున 10. జూన్ 10న హీరో బాలకృష్ణ పుట్టినరోజు. అదే రోజున మరో అగ్ర దర్శకుని పుట్టినరోజు కూడా. ఎవరా దర్శకుడు? ఎ) బి.గోపాల్ బి) శ్రీను వైట్ల సి) ఈవీవీ సత్యనారాయణ డి) జంధ్యాల 11. వెంకటేశ్ నటించిన ‘బొబ్బిలి రాజా’ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయ రాజా బి) చక్రవర్తి సి) యం.యం. కీరవాణి డి) కోటి 12. ‘మదరాస పట్టణం’ సినిమా ద్వారా స్క్రీన్‌కి పరిచయమయ్యారీ భామ. ‘ఎవడు’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. ఎవరా హీరోయిన్? ఎ) అమీ జాక్సన్ బి) అమలాపాల్ సి) ఆండ్రియా డి) అంజలి 13. యోగా గురువు భరత్ ఠాగూర్ దగ్గర కొంత కాలం శిష్యరికం చేశారు ఈ హీరోయిన్. ఎవరామె? ఎ) భూమిక బి) అనుష్క సి) చార్మీ డి) ప్రియమణి 14. 1985లో విడుదలైన వందేమాతరం’ సినిమాలో కథానాయకుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) భానుచందర్ బి) సుమన్ సి) రాజశేఖర్ డి) వినోద్‌కుమార్ 15. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి తన మొదటి సినిమా నుండి ఈ రోజు వరకు అలాంటి చిత్రాల్లోనే నటించారు. ఆయన మొదటి సినిమా ఏదో చెప్పుకోండి? ఎ) దండోరా బి) అర్ధరాత్రి స్వతంత్రం సి) అడవి దివిటీలు డి) ఎర్ర సైన్యం 16. ఆ హీరో ఇప్పటివరకూ 15 సినిమాలు చేశారు. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న ఆ హీరో ఎవరు? ఎ) రామ్ బి) నాని సి) తరుణ్ డి) మనోజ్ 17. ‘కబాలి, కాలా’ చిత్రాల దర్శకుడు పా.రంజిత్ గతంలో ‘మద్రాస్’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. అందులో నటించిన హీరో? ఎ) కార్తీ బి) సూర్య సి) సిద్ధార్ధ్ డి) విశాల్ 18. బిగ్ బాస్ సీజన్ వన్ 70 రోజుల పాటు సాగింది. ఇప్పుడు మొదలయ్యే సీజన్ 2 షో ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలుసా? ఎ) 74 రోజులు బి) 85 రోజులు సి) 93 రోజులు డి) 106 రోజులు 19. ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టండి? ఎ) కంగనా రనౌత్ బి) కత్రినాకైఫ్ సి) స్నేహా ఉల్లాల్ డి) సోనమ్ కపూర్ 20 . ఈ ఫొటోలో ఉన్నది ప్రముఖ దర్శక–నిర్మాత. ఆయనెవరో గుర్తుపట్టండి? (ఆయనో ప్రముఖ హీరో తండ్రి ) ఎ) అక్కినేని బి) వీబీ రాజేంద్రప్రసాద్ సి) ఎన్టీఆర్ డి) డి. రామానాయుడు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) సి 4) డి 5) బి 6) సి 7) బి 8) ఎ 9) డి 10) సి 11) ఎ 12) ఎ 13) బి 14) సి 15) బి 16) ఎ 17) ఎ 18) డి 19) బి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
అనుష్కే స్పందించాలి
తమిళసినిమా: సినిమానే కాదు ఏ రంగంలోనైనా విమర్శించే వారు ఉంటారు. మన పని చాలా మందికి సమంజసంగా ఉన్నా, కొంతమందికి అసమంజసంగా ఉంటుంది. విమర్శలు అలానే పుడుతుంటాయి. నటి అనుష్కనే తీసుకుంటే. టాప్ హీరోయిన్. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించేయగల సత్తా ఉన్న నటి. అయినా తనూ అందరిలాంటి మగువే. తనకూ వ్యక్తిగత అంశాలు ఉంటాయి. ఇటీవల కాస్త విరామం లభించడంతో ఆలయాలకు వెళ్లి దైవ దైర్శనం చేసుకున్నారు. దీన్ని కూడా భూతద్దంలో చూపుతూ అనుష్క పెళ్లి కోసం పుజలు నిర్వహిస్తున్నారు. దోష పరిహారాల కోసమే పూజలు, పునస్కారాలు అంటూ ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేసేస్తున్నారు. అనుష్క భాగమతి చిత్రం తరువాత కొత్త చిత్రం ఏదీ అంగీకరించలేదు. అయితే మలయాళంలో నటించబోతోందని, తమిళంలోనూ ఒక చిత్రం కమిట్ అయ్యింది లాంటి బేస్‌లెస్ ప్రసారాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటివి వినీ, వినీ విసిగిపోయిన అనుష్క గురించి తాజాగా మరో ప్రచారం హల్చల్ చేస్తోంది. ఈ స్వీటీ త్వరలో పెళ్లికి సిద్ధం అవుతోందని, అందుకే నూతన చిత్రాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోందని, ముఖ్యంగా హీరోతో సన్నిహితంగా ఉండేలాంటి సన్నివేశాలు, గ్లామరస్ సన్నివేశాలు ఉండకూడదని దర్శక నిర్మాతలకు నిబంధనలు విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అనుష్క స్పందిస్తే గానీ తెలియదు. -
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి
అనుష్క టిప్స్ ఉపయోగపడ్డాయి ... అంటున్నారు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ‘భాగమతి’లో అనుష్క పక్కన ఉన్ని ముకుందన్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉన్ని నటించబోయే తదుపరి సినిమా ‘చాణక్య తంత్రం’లో ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అందులో లేడీ గెటప్ కూడా ఒకటి. ‘‘ఆడవాళ్లు ఎలా నడుస్తారు. వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ ఎలా వేసుకుంటారు? అనే చాలా విషయాల్లో అనుష్క టిప్స్ ఇచ్చారు. ‘భాగమతి’ టైమ్‌లో ఈ క్యారెక్టర్ గురించి అనుష్కతో డిస్కస్ చేశాను. తను చాలా ఇన్పుట్స్ ఇచ్చింది. ఈ లేడీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనుష్క ఇచ్చిన టిప్స్ చాలా ఉపయోగపడ్డాయి’’ అన్నారు ఉన్ని ముకుందన్. -
ఆ ముగ్గురి బాటలో...
సాక్షి, చెన్నై : హన్సిక కూడా రెడీ అయిపోతోంది అనగానే ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలకు వెళ్లిపోతున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. ఈ ముంబై బ్యూటీ నోట ఇంకా పెళ్లి మాట రానే లేదులెండి. మరి దేనికి రెడీ అవుతోందనేగా మీ ఆసక్తి. థ్రిల్లర్ కథా చిత్రానికండి. నయనతార, అనుష్క, త్రిష బాటలో పయనించడానికి సిద్ధం అవుతోంది హన్సిక. అవును హన్సిక కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించబోతోంది. ఈ అందగత్తె ఇప్పుటి వరకూ అభినయంతో కూడిన గ్లామరస్ పాత్రలోనే నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అరణ్మణై–2 చిత్రంతో హర్రర్ పాత్రను కూడా రక్తి కట్టించారు. అయితే థ్రిల్లర్ కథా చిత్రాల్లో నటించలేదు. అదేవిధంగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో కూడా ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది ఇప్పుడా అవకాశం హన్సికను వరించింది. మసాలా పడం, భోగన్, రోమిమో జూలియట్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన యూఆర్.జమీల్ మెగాఫోన్ పడుతున్న చిత్రంలో హన్సిక కథానాయకిగా సెంట్రిక్ పాత్రను పోషించడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడి చేతిలో ఒక్క చిత్రం కూడా లేదు. ఇలాంటి సమయంలో కథనంతా తన భుజస్కంధాలపై మోసుకెళ్లే చిత్రంలో నటించే అవకాశం రావడం విశేషమే. ఈ చిత్రం వివరాలను దర్శకుడు జమీల్ తెలుపుతూ హన్సికను దగ్గరుండి చూసిన తనకు ఈ చిత్ర కథ తయారు చేసుకున్నప్పుడు ఇందులో కథానాయకి పాత్రకు తనే కరెక్ట్‌గా నప్పుతుందనిపించిందన్నారు. కథ చెప్పగానే హన్సిక వెంటనే ఓకే చెప్పారని తెలిపారు. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుటి వరకూ పోషించనటువంటి వైవిధ్యభరిత పాత్రలో హన్సికను ప్రేక్షకులు చూస్తారన్నారు. మహిళలు తమ కష్టాల నుంచి బయట పడడానికి ఏం చేస్తారన్నది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రంలో హన్సిక పాత్ర గురించి ప్రస్తుతానికి చెప్పలేనని, అయితే ఇందులో హన్సిక భారీ ఫైట్స్‌ను కూడా చేస్తారని, అవి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయని అన్నారు. ప్రేమ, హాస్యం అంటూ జనరంజక అంశాలు చోటు చేసుకుంటాయని, జాయ్స్టార్ ఎంటర్‌ప్రైజస్ సంస్థ నిర్మించనున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం జూలైలో సెట్ పైకి వెళ్లనుందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జమీల్ చెప్పారు. -
ఈ పూజలు ఎవరి కోసం?
‘నాకు దైవ భక్తి ఎక్కువ. వీలు కుదురినప్పుడల్లా పుణ్యక్షేత్రాలకు వెళుతుంటాను’ అని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు అనుష్క. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ టెంపుల్‌ను సందర్శించారామె. అక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయించారు అనుష్క. కేదార్‌నాథ్‌తో పాటు గంగోత్రి, బద్రీనాథ్ కూడా సందర్శించనున్నారట. సన్నిహితుల కోసం మొక్కుకుని గుడికి వెళుతుంటానని అనుష్క ఈ మధ్య ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. గుడికి వెళ్లి తన కోసం తాను ఎప్పుడూ ఏమీ కోరుకోనని కూడా అన్నారు. మరి.. ఇప్పుడు ఎవరి కోసం గుడికి వెళ్లారో? లేక జస్ట్ ఖాళీ దొరికింది కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుందని వెళ్లారో? -
మొదట్లో అలానే ఉండేదాన్ని
తమిళసినిమా: ముందు అనుసరించినా, తరువాత మారానని అన్నారు నటి అనుష్క. అగ్రనటిగా రాణిస్తున్న ఈ బ్యూటీ ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించేస్తారు. చారిత్రక, పౌరాణిక పాత్రల్లో నటించడానికి ఆమెకు ఆమే సాటి. రుద్రమదేవి, బాహుబలి, నమో వేంకటేశాయ చిత్రాలే ఇందుకు సాక్షి. ఇక అరుంధతి, భాగమతిలోనూ విశ్వరూపం చూపించారు. అలాంటిది భాగమతి తరువాత ఆమె తదుపరి చిత్రం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించానని ఇంతకు ముందొకసారి చెప్పారు. అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదుగాని, తాజాగా ఒక చిత్రంలో నటించే విషయమై కథను వింటున్నారట. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ స్వీటీ దాన్ని తగ్గించుకోవడానికి కాస్త ఎక్కువగానే శ్రమ పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వపు అందాలను తెచ్చుకునే ప్రయత్నంలో కసరత్తులు చేస్తున్నారు. ఈ సందర్భంగా అనుష్క తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఇంటర్వ్యూలో పేర్కొంటూ తాను నటించేది సినిమాల్లోనేననీ, నిజ జీవితంలో తనకు నచ్చినట్లు నడుచుకుంటానని చెప్పారు. సినీ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఒకటిగా చూడనని చెప్పారు. నటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో ఇకపై బహిరంగ కార్యక్రమాలకు కూడా మేకప్ వేసుకుని మంచి మోడరన్ దుస్తులు ధరించి వెళ్లాలని సలహాలిచ్చారన్నారు. వారి సూచనలను కొంత కాలం అనుసరించినా, ఆ తరువాత మారిపోయానని చెప్పారు. తనకు నచ్చినట్టు ఉండడం సౌకర్యంగా ఉంటుందన్నారు. చిత్రం సక్సెస్ అయితే ప్రతిభావంతులు, ఫ్లాప్ అయితే ప్రతిభ లేదని అనడం కరెక్ట్ కాదని అనుష్క పేర్కొన్నారు. -
ఏఆర్‌సీలో ఆడ సింహం మృతి
ఆరిలోవ (విశాఖ తూర్పు): జంతు పునరావాస కేంద్రం (ఏఆర్సీ)లో శుక్రవారం ఆడ సింహం అనారోగ్యంతో మృతి చెందింది. ఇక్కడ 16 సంవత్సరాల 3 నెలల వయసు గల ‘లత’ అనే ఆడ సింహం కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీని గర్భాశయం పాడయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని జూ ఇన్చార్జి క్యూరేటర్ బి.జానకిరావు తెలిపారు. దీనిని 2002 జూన్ 12న కోల్‌కతాలో ఫేమస్ సర్కస్ నుంచి ఇక్కడ తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. జూలో బేబీ బైసన్ మృతి ఆరిలోవ(విశాఖతూర్పు): జూ పార్కులో వారం రోజుల క్రితం పుట్టిన బైసన్(అడవిదున్న) పిల్ల శుక్రవారం మృతి చెందింది. ఇక్కడ అనుష్క అనే బైసన్‌కు ఈ నెల 6న పిల్ల పుట్టింది. ఇది పుట్టిన నుంచి నీరసంగా ఉండటంతో పాటు తల్లి వద్ద పాలు సరిగా తాగేది కాదు. దీంతో నీరసించిపోయింది. ఇదిలా ఉండగా గురువారం రాత్రి ఇది మృతి చెందింది. తల్లి బైసన్ కాళ్లతో తొక్కేయడంతో ఈ పిల్ల మృతి చెందినట్లు ఇక్కడ వైద్యులు గుర్తించారు. దీని పొట్టపై తల్లి బైసన్ కాళ్లతో తొక్కేసిన పెద్ద గాయాలున్నట్లు గుర్తించామని వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. -
మొదటి అడుగు
ఇప్పటివరకూ తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో అలరించారు బెంగళూరు బ్యూటీ అనుష్కా శెట్టి. ఆ మాటకొస్తే మాతృభాష కన్నడ కంటే తెలుగులోనే అత్యధిక చిత్రాలు చేశారామె. ఈ ఏడాది మలయాళ చిత్రసీమలోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. అది కూడా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి సరసన కథానాయికగా నటించనున్నారని సమాచారమ్. ‘అరుంధతి’ సినిమా తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న అనుష్క అప్పుడప్పుడూ హీరోలతోనూ జోడీ కడుతున్నారు. అనుష్క నటించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఏ తెలుగు సినిమా కూడా అనుష్క చేతిలో లేదు.అయితే గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట అనుష్క. తాజాగా మలయాళం నుంచి ఆఫర్ రావడం, మమ్ముట్టి వంటి స్టార్ హీరోకి జోడీ కావడంతో ఓకే చెప్పారట అనుష్క. మమ్ముట్టి హీరోగా శరత్ సందిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెరోల్’ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదలయ్యాక శరత్ దర్శకత్వంలోనే మమ్ముట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్నారట. ఆ చిత్రంలోనే అనుష్క నటించనున్నారని సమాచారం. -
స్క్రీన్ టెస్ట్
► అక్కినేని నాగార్జున సరసన తొలిసారి హీరోయిన్గా నటించిన నటి ఎవరు? ఎ) అమలా అక్కినేని బి) గౌతమి సి) సుహాసిని డి) శోభన ► శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ‘రాధాగోపాళం’ చిత్రానికి బాపు దర్శకుడు. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో? ఎవరా హీరో? ఎ) నాని బి) విజయ్‌కృష్ణ సి) నరేశ్ డి) విజయ్ దేవరకొండ ► చిరంజీవితో 20 సినిమాలకు పైగా దర్శకత్వం వహించిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండరామిరెడ్డి బి) బి. గోపాల్ సి) దాసరి నారాయణరావు డి) కె. రాఘవేంద్రరావు ► ‘ప్రేమనగర్’ అనే చిత్రం ద్వారా తన సురేశ్ ప్రొడక్షన్ సంస్థ నిలబడిందని నిర్మాత డి.రామానాయుడు ఎన్నోసార్లు చెప్పారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఆ చిత్రదర్శకుని కుమారుడు కూడా ప్రముఖ దర్శకుడే) ఎ) బోయిన సుబ్బారావు బి) కె. విశ్వనాథ్ సి) కె.యస్. ప్రకాశరావు డి) వి.మధుసూదన్‌రావు ► ‘విన్నర్’ సినిమాకి యాంకర్ సుమ ఓ పాట పాడింది. ఆమె పాడిన పాటలో ఓ యాంకర్ నటించారు. ఎవరా యాంకర్? ఎ) రేష్మి గౌతమ్ బి) అనసూయ సి) ఝాన్సీ డి) శిల్పా చక్రవర్తి ► ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలో ‘మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రోడే’ అనే పాటలో నటించిన తార ఎవరో తెలుసా? ఎ) అనుష్క బి) రిచా గంగోపాధ్యాయ సి) హంసా నందిని డి) ముమైత్‌ఖాన్ ► చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవితో మొదటిసారిగా నటిస్తున్నారు. ఎవరామె? ఎ) రమ్యకృష్ణ బి) మీనా సి) నయనతార డి) టబు ► హీరో నాని ‘కృష్ణార్జున యుద్ధం’అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంతో కలిపి ఇప్పటివరకు నాని ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో గుర్తు తెచ్చుకోండి? ఎ) 3 బి) 2 సి) 4 డి) 1 ► యోగా గురువు ‘భరత్ ఠాగుర్’ తెలుగులో ఎన్నో మంచి సినిమాల్లో నటించిన హీరోయిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ హీరోయిన్ పేరేంటో చెప్పేయండి? ఎ) సంగీత బి) సిమ్రాన్ సి) స్నేహ డి) భూమిక ► దర్శకుడు మణిరత్నం 1983వ సంవత్సరంలో మొదటిసారిగా దర్శకునిగా అరంగేట్రం చేశారు. ఆయన ఏ భాషలో తన మొదటి సినిమాను తెరకెక్కించారో తెలుసా? ఎ) కన్నడ బి) మలయాళం సి) తమిళ్ డి) తెలుగు ► ‘ఊపిరి’ సినిమాలో నాగార్జున పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఈ హీరోయిన్, అజయ్ దేవ్గన్తో ‘హిమ్మత్వాలా’లో కూడా నటించింది? ఎ) రాశీ ఖన్నా బి) లావణ్య త్రిపాఠి సి) తమన్నా భాటియా డి) శ్రియ శరన్ ► హీరో నాగచైతన్య ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి? ఎ) ఐయామ్ చే బి) అక్కినేని చైతన్య సి) చే అండర్స్కోర్ అక్కినేని డి) దిస్ ఈజ్ చే ► శ్రీ విష్ణు నటించిన ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ఓ దర్శకుడు నటుడయ్యారు, ఆయన పేరేంటో తెలుసా? ఎ) దేవి ప్రసాద్ బి) పరశురామ్ సి) కోన వెంకట్ డి) తరుణ్ భాస్కర్ ► సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం పేరు ‘మహానటి’. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన నటి పేరేంటి? ఎ) సమంత బి) కీర్తీ సురేష్ సి) నిత్యామీనన్ డి) అనుష్క ► దర్శకుడు శ్రీను వైట్ల భార్య కూడా సినీ రంగంలోని ఓ విభాగంలో పని చేస్తున్నారు. అమె పని చేస్తున్న విభాగం పేరేంటి? ఎ) ఫ్యాషన్ డిజైనర్ బి) ఆర్ట్ డిపార్ట్మెంట్ సి) ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డి) ఎడిటింగ్ ► ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ అనే పాట రచయిత ఎవరు? ఎ) వరికుప్పల యాదగిరి బి) మాస్టర్జీ సి) కేదారేశ్వర్ డి) సిరివెన్నెల సీతారామశాస్త్రి ► ‘లైఫ్‌లో ఎపుడైనా ఏమైనా జరగొచ్చు, అది జరిగినప్పుడు దాన్ని మనం ఫేస్ చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామా.. లేదా అన్నదే ముఖ్యం’.. ఈ డైలాగ్ చెప్పింది హీరో నాగచైతన్య. ఇది ఏ సినిమాలోని డైలాగో చెప్పుకోండి? ఎ) యుద్ధం శరణం బి) బెజవాడ సి) ఆటోనగర్ సూర్య డి) సాహసం శ్వాసగా సాగిపో ► అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలోని బంగళా సెట్‌కి మంచి పేరొచ్చింది. ఆ బంగళాను డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ఎవరు? ఎ) ఆనంద్ సాయి బి) రవీందర్ రెడ్డి సి) అశోక్ కుమార్ డి) బ్రహ్మ కడలి ► కార్తీక్, ముచ్చర్ల అరుణ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) నాలుగు స్తంభాలాట బి) రెండు రెళ్ల ఆరు సి) సీతాకోక చిలుక డి) స్వరకల్పన ► ఈ క్రింది ఫోటోలోని నటుడెవరో గుర్తు పట్టండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నాగశౌర్య డి) ప్రభాస్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) ఎ 4) సి 5) బి 6) సి 7) సి 8) ఎ 9) డి 10) ఎ 11) సి 12) సి 13) ఎ 14) బి 15) ఎ 16) డి 17) డి 18) బి 19) సి 20) ఎ -
అనుష్క తాజా చిత్రం ఖరారు
తమిళసినిమా: నటి అనుష్క తాజా చిత్రం ఎట్టకేలకు ఖరారైందన్నది తాజా సమాచారం. బాహుబలి సిరీస్, భాగమతి వంటి భారీ చిత్రాల నాయకి అనుష్క చిత్రాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. ఆమె చివరి చిత్రం భాగమతి విడుదలై రెండు నెలలు దాటినా తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో ఒక్క చిత్రం కూడా లేకపోవడంతో అనుష్క పెళ్లికి రెడీ అవుతున్నారని, అందుకే కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మధ్య భాగమతి చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చిన అనుష్క తాను దర్శకుడు గౌతమ్‌మీనన్ చిత్రం మాత్రమే అంగీకరించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ దర్శకుడి చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. గౌతమ్‌మీనన్ ఇంతకు ముందు మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు అనుష్కతో లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇదీ భాగమతి తరహాలో వైవిధ్య కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ విక్రమ్ హీరోగా ధ్రువనక్షత్రం, ధనుష్ హీరోగా ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించే చిత్రం పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అనుష్క ఇంతకు ముందు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్‌కు జంటగా ఎన్నై అరిందాల్ చిత్రంలో నటించారన్నది గమనార్హం. -
చిన్నప్పటి నుంచి అవే ఊహలే
తమిళసినిమా: అనుష్క అంటే ఒకప్పుడు అందాల నటి మాత్రమే. ఇప్పుడు అందం, అభినయం కలబోసిన జాణ. అలాంటి తార నేను ఊహల్లో జీవించానంటోంది. తన చిన్నతనంలోనే బాహుబలిలో యువరాణిగా ఊహల్లో జీవించేశానని చెప్పుకొచ్చింది. అనుష్క కెరీర్లో అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్కను ఇప్పుడు సాదా సీదా కథా పాత్రల్లో ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. ఈ విషయాన్ని గ్రహించిన స్వీటీ ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే కొత్త చిత్రాలు అంగీకరించలేదంటున్న అనుష్క తాజాగా ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. తన సినీ అనుభవం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి రాణించగలనని నిరూపించుకున్నానంది. తన విజయాల వెనుకున్నది దర్శకులేనని, మంచి కథాపాత్రల్లో వాళ్లు నటింపజేయడం వల్లే పేరు అని పేర్కొంది. చిన్నవయసులోనే తాను పురాణ, చరిత్ర పుస్తకాలను ఆసక్తిగా చదివేదాన్ననీ, అదే విధంగా కల్పిత కథలను ఎక్కువగా చదివేదానినని చెప్పింది. అలాంటి కథలోని ఒక పాత్రలో తనను ఊహించుకుని జీవించేదానిననీ అంది. అలాంటి ఊహల్లోంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనీ, అదో తీయని అనుభవంగా ఉండేదని పేర్కొంది. రాజ్యాలు, కోటలు కూడా తన ఊహల్లో మెదిలేవనీ, అలా తాను మహారాణి ఊహించుకుని జీవించేదాన్నని చెప్పింది. ఆ ఊహలే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించడానికి ధైర్యాన్నిచ్చాయని భావిస్తానంది. ఇంకా చెప్పాలంటే బాహుబలి చిత్రం తాను చిన్నవయసులో ఊహించిన విధంగానే అమరిందని చెప్పింది. విజయాల గురించి ఎదురు చూడననీ, బాధ్యతను నిర్వహించు ఫలితాన్ని ఎదురు చూడకు అన్నది తన ఫాలసీ అని పేర్కొంది. -
ఇప్పుడు భానుమతిగా..
తమిళసినిమా: ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రలో ఒదిగిపోవడం నటి అనుష్కకు వెన్నతో పెట్టిన విద్య. అరుంధతిలో అందంతో పాటు రౌద్రం చూపించినా, రుద్రమదేవిలో వీరత్వం చూపినా, బాహుబలిలో శౌర్యప్రరాక్రమాలను ప్రదర్శించినా, భాగమతిలో భయబ్రాంతులకు గురి చేసినా అద్భుతమైన నటనతో తనకు తానే అని చాటుకున్న అందరి స్వీటీ అనుష్క. త్వరలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న అనుష్క అంతకు ముందు ప్రఖ్యాత నటీమణి భానుమతిగా మారనున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఇతివృత్తంతో ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)గా తెరకెక్కుతున్న నడిగైయార్ తిలగం(తెలుగులో మహానటి) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పలు విశేషాలతో కూడుకున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో సావిత్రిగా యువ నటి కీర్తీసురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రను ఈమె పోషించడంపై సీనియర్ నటి, సావిత్రి సమకాలీన నటి జమున ఆక్షేపణను వ్యక్తం చేసినట్లు మీడియాల్లో వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చిత్రంపై మరింత ఉత్సుకత కలుగుతోంది. ఇందులో సావిత్రితో అనుబంధం ఉన్న పలువురు గొప్పగొప్ప నటీనటుల పాత్రల్లో యువ తారాగణం నటిస్తున్నారు. ముఖ్యంగా విలేకరి పాత్రలో నటి సమంత, సావిత్రి భర్త జెమినీగణేశన్‌గా మలయాళ యువ నటుడు దుల్కర్సల్మాన్, మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో అర్జున్‌రెడ్డి చిత్రం ఫేమ్ విజయ్‌దేవరకొండ, ఎస్వీ.రంగారావు పాత్రలో మోహన్‌బాబు నటిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. తాజాగా నటి భానుమతిగా అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ ఇదే నిజమైతే ఈ చిత్ర కలరే మారిపోతుంది. -
స్క్రీన్ టెస్ట్
► మహేశ్‌బాబు హీరో కాకముందు బాల నటుడిగా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఎ) 6 బి) 5 సి) 9 డి) 4 ► హీరో రామ్ ‘దేవదాసు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. అదే సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) హన్సిక సి) షీలా డి) ఇలియానా ► దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసిన విజయవాడ అమ్మాయి ఎవరో తెలుసా? ఎ) రంభ బి) రోజా సి) లయ డి) రవళి ► కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్లది చాలా క్రేజీ కాంబినేషన్. ఏ చిత్రం ద్వారా ఈ కాంబినేషన్ ఫేమస్ అయ్యిందో తెలుసా? ఎ) మామగారు బి) చినరాయుడు సి) ఆ ఒక్కటీ అడక్కు డి) మాయలోడు ► ‘మనసుగతి ఇంతే.. మనిషి బతుకింతే.. మనసున్న మనిషికి సుఖము లేదింతే..’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) ఆత్రేయ బి) కొసరాజు సి) దాశరథి డి) ఆరుద్ర ► టాలీవుడ్లో వీఎఫ్ఎక్స్ (గ్రాఫిక్స్) స్టూడియోను ప్రారంభించిన హీరో ఎవరో తెలుసా? ఎ) ఉదయ్‌కిరణ్ బి) కల్యాణ్రామ్సి) నితిన్ డి) మంచు విష్ణు ► ‘దిల్’ సినిమా నిర్మించటం ద్వారా వెంకటర మణారెడ్డి ‘దిల్ రాజు’ అయ్యాడు. మరి ‘దిల్’ సినిమా దర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) బోయపాటి శ్రీను బి) సుకుమార్ సి) వీవీ వినాయక్ డి) వంశీ పైడిపల్లి ► శ్రీకాంత్ నటించిన ఓ సినిమాకు హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ సినిమా పేరేంటి? ఎ) ఆపరేషన్ దుర్యోధన బి) రాధాగోపాళం సి) కౌసల్య సుప్రజ రామ డి) శ్రీకృష్ణ 2006 ► కార్తీ నటించిన మొదటి సినిమా ‘పరుత్తివీరన్’. అందులో నటించిన హీరోయిన్‌కి నేషనల్ అవార్డు వచ్చింది. ఎవరా హీరోయిన్? ఎ) త్రిష బి) ప్రియమణి సి) రీమాసేన్ డి) ఆండ్రియా ► ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంలో అల్లు అర్జున్ ఏ పాత్రను పోషిస్తున్నాడో తెలుసా? ఎ) ఆర్మీ ఆఫీసర్ బి) పైలెట్ సి) పోలీసాఫీసర్ డి) నేవల్ ఆఫీసర్ ► ‘అల్లరి’ నరేశ్ తన తర్వాతి చిత్రంలో మొదటిసారి ఓ ప్రముఖ హీరోకి సోదరుడిగా నటిస్తున్నాడు. ఎవరా హీరో కనుక్కోండి? ఎ) మహేశ్‌బాబు బి) యన్టీఆర్ సి) నాని డి) రవితేజ ► తమన్నా ట్విట్టర్ ఐడీ ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) ఐ తమన్నా బి) యువర్స్ తమన్నా సి) తమన్నా స్పీక్స్ డి) తమన్నాభాటియా ► విఘ్నేశ్ శివన్ అనే తమిళ దర్శకుడు తెలుగులో చాలామంది టాప్ హీరోలతోనటించిన హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నాడు. ఆ మలయాళ కుట్టి ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) మమతా మోహన్‌దాస్ బి) నివేథా థామస్ సి) నయనతార డి) అనుపమ పరమేశ్వరన్ ► ‘అర్జున్‌రెడ్డి’ తెలుగు సినిమాను తమిళ్లో ‘వర్మ’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తోన్న ధృవ్ ఓ ప్రముఖ హీరో కొడుకు. ఎవరా హీరో? ఎ) విక్రమ్ బి) అర్జున్ సజ్జా సి) కార్తీక్ డి) ప్రభు ► ప్రత్యూష ఫౌండేషన్ అనే సేవాసంస్థ ద్వారా తన సహాయ సహకారాల్ని అందిస్తున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్? ఎ) అనుష్క శెట్టి బి) సమంతా అక్కినేని సి) రకుల్‌ప్రీత్ సింగ్ డి) శ్రుతీహాసన్ ► ‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కట్ వేసిండే..’ పాట ‘ఫిదా’ చిత్రంలోనిది. ఈ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సుద్ధా అశోక్ తేజ బి) సిరివెన్నెల సి) వనమాలి డి) కృష్ణచైతన్య ► ‘సైరా నరసింహారెడ్డి’ చిరంజీవికి 151వ చిత్రం. ఈ చిత్రకథ ఏ తెలుగు ప్రాంతానికి చెందిన కథో తెలుసా? ఎ) రాయలసీమ బి) కోనసీమ సి) తెలంగాణ డి) ఉత్తరాంద్ర ► నటి ఖుష్బూను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ.కోదండరామిరెడ్డి బి) కె.రాఘవేంద్రరావు సి) బి.గోపాల్ డి) కోడి రామకృష్ణ ► ఏఎన్నార్, వాణిశ్రీ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) ప్రేమనగర్బి) ప్రేమాభిషేకంసి) ప్రేమడి) ప్రేమంటే ఇదేరా ► ఈ ఫొటోలో ఉన్న బాలనటుడు, ఇప్పటి హీరో ఎవరో గుర్తుపట్టగలరా? ఎ) కమల్హాసన్బి) అల్లు అర్జున్సి) తరుణ్ 4) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) డి 3) ఎ 4) ఎ5) ఎ 6) డి 7) సి 8) బి 9) బి 10) ఎ 11) ఎ 12) సి 13) సి 14) ఎ 15) బి 16) ఎ 17) ఎ 18) బి 19) ఎ 20) సి -
అరుంధతి నేనే అవ్వాల్సింది
తమిళసినిమా: అరుంధతి నేనే అవ్వాల్సిందని అని నటి మమతామోహన్‌దాస్ పేర్కొంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ బహుభాషా నటిగా రాణించిన మమతా మంచి గాయని కూడా. తెలుగులో నాగార్జున వంటి స్టార్‌తో జత కట్టి స్టార్ హీరోయిన్గా రాణించిన మలయాళీ భామ ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడింది. అరుంధతి చిత్రాన్ని నటి అనుష్క జీవితంలో మరచిపోలేదు. తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆ చిత్రానికి కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. అంత ఘన విజయం సాధించిన చిత్రం అరుంధతి. నటి అనుష్కకు అంత పేరును ఆపాదించి పెట్టిన ఆ చిత్రం మమతను దాటి అనుష్కకు వచ్చిందట. దీని గురించి మమత ఒక భేటీలో తెలుపుతూ మొదట్లో తాను నటనపై ఆసక్తి చూపలేదని అంది. తొలి నాలుగేళ్లలో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోయాను కానీ, చాలా అయోమయంలో ఉండిపోయానని చెప్పింది. మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనేలేదని అంది. అరుంధతిలో నటించే అవకాశం తొలుత తనకే వచ్చిందని, చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. ఆ తరువాత ఆ చిత్రంలో అనుష్క నటించడం ఆమెకా చిత్రం స్టార్డమ్ తెచ్చిపెట్టడం గురించి తెలుసుకున్నానని తెలిపింది. ఆ తరువాతే చిత్రాలపై అవగాహన పెరిగిందని, ఆ తరువాత రెండు నెలల్లోనే జీవితంలో పెద్ద షాక్‌కు గురయానని చెప్పింది. కేన్సర్‌తో తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పింది. దీంతో సినిమా కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత నివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతామోహన్‌దాస్ పేర్కొంది. -
నువ్వు నన్నేం చేయలేవురా అనలేకపోయా!
‘హలో అండీ... ఎలా ఉన్నారు?’ అని స్వీట్‌గా పలకరిస్తారు స్వీటీ. అంతేనా? తెలుగులో చక్కగా మాట్లాడతారు. మరి.. నిత్యామీనన్, రకుల్, అనుపమా పరమేశ్వరన్, సాయిపల్లవి, కీర్తీ సురేశ్, అనూ ఇమ్మాన్యుయేల్.. రష్మిక మండన్నలా అనుష్క తన పాత్రకు ఎందుకు డబ్బింగ్ చెప్పుకోరు? వీళ్లందరికన్నా స్వీటీ సీనియర్. పైగా తెలుగు చక్కగా మాట్లాడతారు. ఇదే విషయం అనుష్క ముందుంచితే – ‘‘నేను తెలుగు మాట్లాడగలను. అయితే.. డబ్బింగ్ చెప్పేంత సాహసం చేయలేను. నా మాట చిన్నపిల్లల మాదిరిగా ఉంటుంది. నేను మాట్లాడుతుంటే పక్కవాళ్లకు కూడా వినిపించదని మా కుటుంబ సభ్యులే అంటుంటారు. అటువంటప్పుడు నేను డబ్బింగ్ చెబితే ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. అంతెందుకు? ‘అరుంధతి’ సినిమాలో ‘నువ్వు నన్నేం చేయలేవురా’ డైలాగ్ ఇంటి వద్ద చాలాసార్లు ప్రాక్టీస్ చేసినా అంత గట్టిగా చెప్పలేకపోయాను. ఇటీవల వచ్చిన ‘భాగమతి’ సినిమాలోని ‘ఇది భాగమతి అడ్డా’ డైలాగ్ కూడా అంతే. ఆ పాత్రలకు తగ్గ గంభీరమైన గొంతు నాకు లేదు. అందుకే డబ్బింగ్ చెప్పడం లేదు’’ అన్నారు. పాయింటే కదా. -
‘రాజమహేంద్రవరం అడ్డా’లో ‘భాగమతి’
-
అజిత్‌తో రొమాన్సా?
తమిళసినిమా: నటుడు అజిత్‌తో రొమాన్సా? నేనా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది వర్థ్ధమాన నటి ఆద్మియ. ఈ బ్యూటీకి అజిత్ తాజా చిత్రం విశ్వాసంలో నటించే అవకాశం వచ్చిందని సోషల్‌మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. వివేకం తరువాత అజిత్, దర్శకుడు శివ నాలుగోసారి కలిసి పనిచేయనున్న విషయం తెలిసిందే. వివేకం నిర్మాత టీజీ.త్యాగరాజన్నే తన సత్యజ్యోతి ఫిలిం పతాకంపై విశ్వాసం చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రీ పొడక్షన్స్ కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 22న సెట్‌పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. మరోసారి దాదాగా.. అజిత్ మరోసారి విశ్వాసం చిత్రంలో దాదాగా కనిపించనున్నారని సమాచారం.ఈసారి ఆయన ఉత్తర చెన్నై దాదాగా దుమ్మురేపనున్నారట. ఇందులో హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు.సోషల్‌మీడియాల్లో మాత్రం రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క నటించే అవకాశం ఉందని, విలన్‌గా విజయ్ ఏసుదాస్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అజిత్ చిత్రంలో తాను నటించడం లేదని ఏసుదాస్ స్పష్టం చేశారు. తాజాగా ఆద్మికను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తమ అభిమాన హీరో సరసన ఆద్మిక లాంటి వర్థమాన నటిని వారు ఊహించుకోలేకపోతున్నారు. ఇలాఉండగా ఆద్మిక కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అజిత్‌తోనే? నేనా? ఎవరు చెప్పారు? నాకే తెలియదే? అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తోంది. దీంతో విశ్వాసం చిత్రంలో హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయితే త్వరలోనే విశ్వాసం చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
భాగమతిపై చరణ్ పొగడ్తలు
రామ్‌చరణ్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్లు, కొత్త విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అందరినీ అలరిస్తారు. ఏదైనా సినిమా విడుదలౌతుందంటే ఆయా వ్యక్తులకు శుభాకాంక్షలు తెలపడం, ఫోన్ చేసి అభినందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరితో సన్నిహితంగా మెలిగే వ్యక్తి అని పేరు కూడా సంపాదించుకున్నారు. అందుకే చరణ్ అంటే అభిమానులకు ఎనలేని ప్రేమ. తాజాగా రామ్ చరణ్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి చిత్రం పై పొగడ్తల వర్షం కురిపించారు. గత రాత్రి భాగమతి చూశానని, అనుష్క అద్భుతంగా నటించిందంటూ ఆకాశానికెత్తాశారు. సాంకేతిక అంశాలు, చిత్ర నిర్మాణం సూపర్‌గా ఉందన్నారు.చాలా మంచి సినిమా తీసిన అందరికీ అభినందనలు అంటూ ఫేస్బుక్లో పోస్టు చేశారు. భయంతో రాత్రి తన సతీమణి ఉపాసన నిద్ర కూడా పోలేదని చలోక్తి విసిరాడు. గతంలో బాహుబలి సమయంలోను చిత్ర బృందానికి తన అభినందనలు తెలిపాడు. శ్రీమంతుడు సినిమా సమయంలోను చరణ్ మహేష్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే. -
మంచి టీమ్ కుదిరితేనే అది సాధ్యం – అనుష్క
‘అరుంధతి, రుద్రమదేవి’ చిత్రాలకు అనుష్క ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేశారో ‘భాగమతి’కి కూడా అంతే కష్టపడ్డారు. అందుకు తనకు హ్యాట్సాఫ్. ఈ సినిమా పాయింట్‌ను నమ్మి అశోక్ ఇన్నేళ్లు ట్రావెల్ చేశాడు. తన నమ్మకం ఈరోజు నిజమైంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అనుష్క టైటిల్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘భాగమతి’ హిట్‌తో కొత్త కాన్సెప్ట్ సినిమాలను ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. వంశీ, ప్రమోద్, విక్కీలను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్లు ఉంది. నేను ఆరేళ్లలో ఐదు హిట్స్ కొట్టినట్లే, యు.వి. క్రియేషన్స్‌పై ఆరేళ్లలో ఐదు హిట్స్ సాధించారు’’ అన్నారు. ‘‘భాగమతి’ విడుదలైన రోజు నుంచి నేటి వరకు పాజిటివ్ టాక్‌తో రన్ అవుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు బాగా చేస్తున్నావని చాలామంది అంటుంటారు. ఒక మంచి బ్యానర్, టీమ్ కుదిరినప్పుడే అది సాధ్యమవుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘ఇది సక్సెస్‌మీట్ కాదు.. సక్సెస్ఫుల్ ప్రయాణం. 2012లో స్టార్ట్ చేసిన జర్నీ ఇది. అçప్పటి నిర్ణయం సరైనదని ఈరోజు రుజువైంది. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా అనుష్క, నిర్మాతలకే చెందుతుంది’’ అన్నారు అశోక్. ఈ కార్యక్రమంలో వంశీ, ప్రమోద్, విక్కీ, రవీందర్, తమన్, ప్రభాస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పుడకా? పురుగా? పుడకా?
సినిమా కన్నా ముందు.. ‘భాగమతి’ మూవీ పోస్టర్లు విడుదలైనప్పుడు, చాలామందికి మొదట అర్థం కాలేదు.. అనుష్క ముక్కుపై ఉన్నదేమిటో!! ఎవరో పుడక అన్నారు. ఇంకెవరో, పురుగై ఉండొచ్చు అనుకున్నారు. పురుగెలా అవుతుందని ఇంకొందరు. క్యారెక్టర్ని బట్టి పుడకో, పురుగో అయి ఉంటుందిలెమ్మని సరిపెట్టుకున్నారు అప్పటికి. సినిమా రిలీజ్ అయింది. అనుష్క ముక్కుపై ఉన్నది పుడక అని తేలిపోయింది. పోస్టర్ని దీక్షగా చూసినవాళ్లు రిలీజ్‌కంటే ముందే అది పుడక అని గుర్తించే ఉంటారు. అయినా పురుగులను ఆభరణాలుగా ధరించేవారు ఎక్కడైనా ఉంటారా? ఉంటారు. ఇప్పుడు ఉన్నారో లేదో కానీ, ఒకప్పుడు ఉండేవారు. ఈజిప్షియన్లు యుద్ధానికి వెళ్లే ముందు జీరంగి పురుగులను మెడలో ధరించి వెళ్లేవాళ్లు. అలా చేస్తే అతీంద్రియ శక్తులు ఆవహించి విజయం లభిస్తుందని వారి నమ్మకం. జీరంగికి నొప్పి కలక్కుండా ఒడుపుగా మెడలోని హారానికి దానిని తగిలించేవారట. ఈ ఆచారం ప్రాచీన మెక్సికన్లలో కూడా ఉండేది. అయితే వాళ్లు బొద్దింకలను ధరించేవారు. మయన్ కల్చర్‌లో బంగారు ఆభరణాలకు జీవంతో ఉన్న పురుగుల్ని కలిపి ధరించడం అనే సంప్రదాయం ఉన్నట్లు చరిత్రలో ఉంది. అదృష్టం కలిసిరావడానికి, దుష్టశక్తులు దూరంగా వెళ్లడానికి ఇలా చేసేవారట. -
భాగమతి బాగుందంటున్నారు
‘‘నాకు అవసరమైన టైమ్‌లో ‘భాగమతి’ సినిమా రూపంలో బిగ్ సక్సెస్ రావడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ వర్క్‌తో సినిమాను కంప్లీట్ చేశాం. అనుష్క యాక్టింగ్ సూపర్’’ అన్నారు దర్శ కుడు అశోక్. అనుష్క లీడ్ రోల్లో ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ– ‘‘మనిషి మెదడును మించిన దెయ్యం ఉందా? లేదా మనిషి తెలివితేటలకు మించిన దెయ్యం ఉందా? అన్న ప్రశ్నలను రైజ్ చేస్తూ చేసిన సినిమా ‘భాగమతి’. సినిమాలో భయం అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. అంతకు మించిన ట్విస్ట్ సినిమాలో ఉందని ముందే చెప్పాం. అనుç ష్కను మా ఇంటి అమ్మాయి అని ప్రేక్షకులు మరోసారి దగ్గరకు తీసుకుని మంచి హిట్ అందించారు. కథ విని భాగమతి బంగ్లా ఇలా ఉండబోతుంది సార్ అని చూపించినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. ‘భాగమతి బంగ్లా’ అనే క్యారెక్టర్‌ను సూపర్‌గా ఫెర్ఫార్మ్ చేయించిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌కి కృతజ్ఞతలు. తమన్‌తో పాటుగా టీమ్ అందరూ చాలా శ్రమపడ్డారు. మార్నింగ్ షో నుంచే ‘భాగమతి’ సినిమాకు మంచి టాక్ తెచ్చుకుంది. తమిళనాడు, కేరళ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి రివ్యూస్ అండ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఇందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. పైరసీని ప్రోత్సహించకండి’’ అన్నారు. ‘‘టెక్నీషియన్స్‌కు మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. అనుకున్న టైమ్‌లోనే సెట్‌ను కంప్లీట్ చేయగలిగాం. ‘భాగమతి’ టీమ్ తరఫున ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అన్నారు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్. -
నన్నడిగితే నాకేం తెలుసు!
తమిళసినిమా: ఆ విషయం నాకేం తెలుసు ఆయన్నే అడగండి అంటోంది నటి శ్రద్ధాకపూర్. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేంటో చూద్దామా. బాహుబలి సిరీస్ తరువాత నటుడు ప్రభాష్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ నాయకిగా నటిస్తోంది. ఇందుకు గానూ ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకుంటోందట. బాహుబలి చిత్రం తరువాత ప్రభాష్ మార్కెట్ ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో సాహో చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే మొదట దక్షిణాది భాషలకు చెందిన నటీమణుల్లో ఒకరిని హీరోయిన్గా ఎంపిక చేయాలని భావించినా, ఇతర భాషల్లోనూ సాహోను విడుదల చేయాలని భావించడంతో నటి శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంతో ఈ భామ దక్షిణాది చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతోందన్నమాట. నటుడు ప్రభాష్ గురించి చెప్పమని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రద్ధాకపూర్ బదులిస్తూ ఆయన మంచి నటుడు మాత్రమే కాదు మంచి మనసున్న మనిషి అని కితాబిచ్చేసింది. అంతే కాదు ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది. నటుడు ప్రభాస్, అనుష్క గురించి రకరకాల గ్యాసిప్స్ ప్రచారంలో ఉన్న విషయం తలిసిందే. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేలా ఇటీవల ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని స్పష్టంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ వివాహం గురించి తనను అడుగుతున్నారని నటి శ్రద్ధాకపూర్ పేర్కొంది. అయితే ఆ విషయం గురించి తనకేమీ తెలియదని ఆయన్నే అడగాలని చెప్పింది. -
ఆమె లేకపోతే భాగమతి లేదు
‘‘భాగమతి’ కథను 2012లో యూవీ క్రియేషన్స్ వారికి చెప్పాను. తర్వాత ప్రభాస్‌కి వినిపించాను. ఆ తర్వాత అనుష్కకి చెప్పా. అందరికీ కథ నచ్చడంతో చేద్దామని డిసైడ్ అయ్యాం. అలా ఈ ప్రాజెక్ట్ కుదిరింది’’ అని దర్శకుడు జి.అశోక్ అన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ‘భాగమతి’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అశోక్ మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► ఇదొక యూనివర్శల్ సబ్జెక్ట్. ఏ నేపథ్యానికైనా సరిపోతుంది. కోలీవుడ్.. మాలీవుడ్.. బాలీవుడ్... ఇలా ఏ ఇండస్ట్రీలో చేసినా హిట్టవుతుంది. ఇందులో కథ ప్రతి చోటా జరిగేదే.. అందరికీ పరిచయమైనదే. ► ‘బాహుబలి’ మొదటి పార్ట్ షూటింగ్‌కు వెళ్లకముందే అనుష్క ‘భాగమతి’ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే.. ‘బాహుబలి’ కమిట్మెంట్ వల్ల చాలా రోజులు ఆగాల్సి వచ్చింది. మధ్యలో రెండు సార్లు ‘భాగమతి’ మొదలుపెడదామని ప్రయత్నించినా కుదరలేదు. ► ‘భాగమతి’ పాట్రన్ క్యారీ చేయాలంటే ఒక స్టేచర్ ఉండాలి. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉండాలి. అవి రెండూ అనుష్కలో కనిపించాయి. అందుకే.. ఆమె తప్ప ఈ కథకి ఎవరూ న్యాయం చేయలేరనే ఇన్నేళ్లు ఆగాను. ఆమె లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు అనుష్క. ఎడమ చేతి భుజానికైన గాయం బాధపెడుతున్నా, డస్ట్ ఎలర్జీ ఉన్నా లెక్కచేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు. ► ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా కాదు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. ఈ సినిమాకు అదే బలం. ఈ చిత్రంలోని బంగ్లా సెట్ కూడా కథలో ఒక క్యారెక్టర్. కథ దాని చుట్టూ తిరుగుతుంది. తొలుత నార్మల్‌గా వేద్దామనుకున్నాం. అది సరిపోదని భారీగా వేశాం. 75 శాతం సినిమా కోట సెట్లోనే జరుగుతుంది. ► ప్రస్తుతానికి నా దృష్టంతా ‘భాగమతి’ పైనే ఉంది. అందుకే ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ అనుకోలేదు. ‘భాగమతి’ విడుదల తర్వాత ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అన్నీ పూర్తయ్యాక తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తా. -
అరుంధతిలా భాగమతి హిట్ కావాలి – అల్లు అరవింద్
‘‘భాగమతి’ ట్రైలర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే కాస్త భయమేసింది. ఏడాదికిపైగా ఈ సినిమా తీస్తున్నారు. అనుష్కకి ఉన్న ఏకైక లక్షణం.. ఓపిక చాలా ఎక్కువ. ఇండస్ట్రీలో అది ఎవరికీ లేదు. ఆ విషయాన్ని ‘అరుంధతి’ చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ సినిమాలా ‘భాగమతి’ పెద్ద హిట్ కావాలి’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. అనుష్క టైటిల్ రోల్లో అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘భాగమతి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ– ‘‘గెలవాలనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఈ రెండూ సమాంతరంగా నడుస్తుంటాయి. తను గెలుస్తూ.. తన చుట్టూ ఉన్నవారిని గెలిపిద్దాం అని ఎవరైనా ఆలోచిస్తే.. అతనిలో దైవత్వం మొదలైనట్లు. అలాంటి దేవుడైన ప్రభాస్ ముందు ఈ కథ విని, ఇక్కడిదాకా నడిపించారు. వంశీ, ప్రమోద్, విక్కీగారు త్రిమూర్తులు. వీరితో ఐదేళ్లుగా ప్రయాణం చేస్తున్నా. సినిమాను బిడ్డలా చూసుకున్నారు. ‘భాగమతి’ కోసం అనుష్క విపరీతమైన డస్ట్‌లో 45 రోజులు పని చేశారు’’ అన్నారు. ‘‘2012లో ‘భాగమతి’ కథ వినగానే నచ్చిందన్నా. కానీ, డేట్స్ లేకపోవడంతో చేయలేనని చెప్పా. ఈ సినిమా నేను కాకుండా వేరే ఎవరైనా చేసి ఉంటే బాధపడేదాన్ని. ఎందుకంటే నా హృదయానికి బాగా దగ్గరైన కథ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అనుష్క. ‘‘నాతో ‘పిల్లజమీందార్’ చేసిన తర్వాత అందరూ ఆశోక్‌ను ‘పిల్లజమీందార్ అశోక్’ అని పిలుస్తున్నారు. జనవరి 26 తర్వాత అందరూ ‘భాగమతి అశోక్’ అని పిలుస్తారు. ఈ ఏడాది టాలీవుడ్‌కి సరైన హిట్ పడలేదు. ‘భాగమతి’తో ఆ హిట్ వస్తుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు హీరో నాని. ‘‘సాధారణంగా నటీనటులు, దర్శకులకు అభిమానులుంటారు. కానీ, నిర్మాతలకు ఉండరు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మాతలకు అభిమానులుంటారు’’ అన్నారు దర్శకుడు మారుతి. దర్శకులు మేర్లపాక గాంధీ, రాధాకృష్ణ, నటులు ప్రభాస్ శ్రీను, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
టచ్ చేస్తే చంపేయాలి
ముట్టుకుంటే... స్పర్శలో ప్రేమ ఉండాలి.. ఆప్యాయత ఉండాలి.. సంరక్షణ ఉండాలి.. గౌరవం ఉండాలి. అలాంటి స్పర్శతో జీవం పులకిస్తుంది. మహిళ వికసిస్తుంది. కానీ ఆ టచ్‌లో వాంఛ ఉంటే.. ఆ చేతిని ఏ ఆడపిల్లకైనా తెగ నరకాలనిపిస్తుంది... గౌరవాన్ని మలినం చేసే టచ్‌ని సమాజంలోంచి చంపేసి, తుద ముట్టేయాలనిపిస్తుంది. ఆ స్పర్శ ఒక మగవాడి చేతిది కాదు. వాడిలో ఉన్న దురహంకారానిది. అది చావాలి. దాదాపు టూ ఇయర్స్ అయిందేమో కలిసి... తెల్లగా ఉన్నారు కానీ నల్లపూస అయిపోయారు? (నవ్వేస్తూ). షూటింగ్స్, ఇల్లు. ఎప్పుడూ ఇంతే. సినిమా రిలీజ్ అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం వస్తాను. అందుకే ఎక్కడా కనిపించను. యాక్చువల్లీ షూటింగ్ వరకూ ఓకే కానీ ప్రమోషనల్ కార్యక్రమాలంటే నాక్కొంచెం కష్టమే. సినిమాలకంటే మేకప్ కంపల్సరీ. ఇప్పుడు కూడా లైట్‌గా అయినా మేకప్ వేసుకోవాలి కదా. అది నచ్చదు. మీలాంటి అందగత్తెలకు మేకప్ ఎందుకులెండి? అందం గురించి పెద్దగా పట్టించుకోను. మీరన్నట్లు నేను అందగత్తెని అని ఎప్పుడూ ఫీలవ్వలేదు. ఆఫ్ స్క్రీన్ మేకప్ లేకుండానే నాకు నేను నచ్చుతాను. మేకప్ వేసుకున్నప్పుడు నేను నాలా ఫీల్ అవ్వను. టైమ్‌తో సంబంధం లేని జాబ్, లొకేషన్లో కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి. స్ట్రెస్ ఎలా తట్టుకుంటారు? నేనెప్పుడూ స్ట్రెస్ తీసుకోను. షూటింగ్ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం. వర్క్ అంటే ప్యాషన్. అన్నీ ఎంత సవ్యంగా ఉన్నా ఒక్కోసారి స్ట్రెస్ అయిపోతాం. అలాంటప్పుడు నా స్ట్రెస్ అంతా నావాళ్లపై పడేసి, హ్యాపీగా ఉంటాను. మీ స్ట్రెస్‌ను తట్టుకునే ఒక ఐదుగురి పేర్లు చెబుతారా? వల్లీ (లైన్ ప్రొడ్యూసర్, కీరవాణి వైఫ్) గారు, రమా (స్టైలిస్ట్, రాజమౌళి మిసెస్) గారు, భానుగారు (హెయిర్ స్టైలిస్ట్), ప్రశాంతి గారు (కాస్ట్యూమ్ డిజైనర్), యూవీ గ్యాంగ్... వీళ్లందరూ నా స్ట్రెస్‌ను తట్టుకోగలరు. అందుకే వాళ్ల మీద వదిలేస్తా (నవ్వేస్తూ). మీ ఫ్యామిలిలో మీ స్ట్రెస్‌ను తట్టుకునేది? అమ్మానాన్న ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకున్నారు. మళ్లీ వాళ్లను కష్టపెట్టడమెందుకు? అందుకే అన్నయ్యను బలి చేస్తా (నవ్వుతూ). నాకు సిస్టర్స్ లేరు. అందుకే వదినను బాగా చూసుకుంటా. ఇంతకీ ‘భాగమతి’లో ఏం నచ్చి ఒప్పుకున్నారు ? ఈ సినిమా ఒప్పుకోవడానికి ముఖ్య కారణం యూవీ క్రియేషన్స్. వాళ్లతో ఇంతకుముందు ‘మిర్చి’ సినిమా చేశాను. 2012లో ఈ సినిమా స్క్రిప్ట్‌ను నా దగ్గరకు తీసుకువచ్చారు. కేవలం ఆ బ్యానర్ మీద ఉన్న నమ్మకం, వాళ్లు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్ కచ్చితంగా నెక్స్›్టలెవల్కు తీసుకుని వెళుతుందనే ఫీలింగ్ ఉంది. అశోక్ (డైరెక్టర్) గారు చెప్పిన కథ బాగా నచ్చింది. దేవసేన, రుద్రమదేవికి టోటల్లీ డిఫరెంట్‌గా, మోడరన్‌గా భాగమతి ఉంటుంది. ‘బాహుబలి’ సినిమా కన్నా ముందే ఈ కథ విన్నాను. డేట్స్ లేక చేయలేదు. నా కోసం నాలుగేళ్లు వెయిట్ చేశారు. ఒక హీరోయిన్ కోసం ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయటం అంటే మీ మీద పెద్ద బాధ్యత ఉన్నట్లే. భయం అనిపించలేదా? వేరే హీరోయిన్‌తో కావాలంటే తీయొచ్చు. అయినా నాకోసం ఆగారు. అందుకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా నేను చేస్తేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యారు. అందుకే వెయిట్ చేశారు. ఎప్పటిలానే బాధ్యతగా ఈ సినిమా చేశా. అశోక్‌గారికి చాలా నాలెడ్జ్ ఉంది. బాగా తీశారు. వరల్డ్ వైడ్‌గా మిమ్మల్ని పాపులర్ చేసిన ‘బాహుబలి’ గురించి రెండు మాటలు... మొదట్లో ఈ ఫేమ్ సింక్ అవ్వలేదు. మెల్లి మెల్లిగా ‘ఓకే... ఇది మనకు వచ్చిన పేరే’ అనుకున్నాను. మళ్లీ ‘బాహుబలి’లాంటి సినిమా చేస్తానో లేదో కానీ, ‘ఇట్స్ ఎ స్వీట్ మెమరీ’. ‘నీ పెళ్లెప్పుడు?’ అని మీరు, ప్రభాస్ ఒకరినొకరు అడుగుతుంటారా? అలాంటి టాపిక్ రాదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్లది. నిజానికి మనం చాలామంది సెల్ఫిష్‌గా ఉంటాం. మనం కోరుకున్నవాళ్లను పెళ్లి చేసుకోవాలనిపిస్తే, ఎవరు చెప్పినా చెప్పకపోయినా చేసేసుకుంటాం. పెళ్లనేది పర్సనల్ మేటర్. ఎవర్ని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ల చాయిస్. ఎందుకంటే పెళ్లి ఫంక్షన్ అయిపోయాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత కలిసి ఉండాల్సింది భార్యాభర్తలే కదా. మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు.. అమ్మానాన్న ఒత్తిడి చేయరా? అమ్మ నాన్నలకు ఉంటుంది. బట్.. ఎప్పుడూ గట్టిగా అడగలేదు. అమ్మ డెస్టినీని నమ్ముతుంది. పెళ్లనేది దేవుడు డిసైడ్ చేయాలి. ప్రతి దానికీ రైట్ టైమ్ ఉంటుంది. అది రావాలి. యాక్చువల్లీ రైట్ పర్సన్ మీట్ అవ్వాలి. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అతనితోనే గడపాలనిపిస్తే పెళ్లి అయిపోతుంది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తి ఒక్కరూ తారసపడలేదా? అనిపించలేదని కాదు. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. కొన్నిసార్లు అనుకున్నా కానీ కుదర్లేదు. ‘బాహుబలి 2’లో ఓ సీన్లో ఒకతను అమ్మాయిల్ని అసభ్యకరంగా తాకితే.. మీరు అతని వేలు కట్ చేస్తారు. రియల్ లైఫ్‌లో అయితే ఏం చేయాలనిపిస్తుంది? చంపేయాలనేంత కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ప్రమోషన్స్‌కి పబ్లిక్‌లోకి వెళతాం కదా. అక్కడ కొంతమంది తాకడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య హైదరాబాద్‌లో నాకలాంటి ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఆ మూమెంట్లో చంపేయాలనేంత కోపం వచ్చింది. కానీ అలా చేయలేం కదా. అందుకే కొట్టాను. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి నిద్ర పట్టలేదు. వక్రబుద్ధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారనుకుంటా. హాలీవుడ్ నటి యాష్లీ జెడ్ ఇండస్ట్రీలో ఉన్న ‘క్యాస్టింగ్ కౌచ్’ మీద ‘మీటూ’ అని క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే, కొందరు హీరోయిన్స్ వాయిస్ రైజ్ చేశారు. దాని గురించి మీరేమంటారు? ‘మీటూ’ గురించి ఐడియా లేదు. బట్.. సెలబ్రిటీస్ ఇలాంటి విషయాల పై మాట్లాడటం మంచి పరిణామమే. మన ఇండియాలోనే తీసుకుంటే 60శాతం కంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ద్వారానే వేధింపులకు గురవుతున్నారని పోల్స్ చెబుతున్నాయి. ఆ వేధింపుల గురించి బయటకు చెప్పటానికి భయపడుతున్నారు. మనం ఎప్పుడైనా పక్కవాళ్లతో కంపేర్ చేసుకుంటాం... చెబితే ఏమనుకుంటారోనని. పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలరు. ‘క్యాస్టింగ్ కౌచ్’ సంఘటనలు మీకూ ఎదురయ్యాయా? లేదండి. ఐయామ్ వెరీ మచ్ బ్లెస్డ్. ‘సూపర్’ టూ ‘భాగమతి’ నేను ఎవరితో వర్క్ చేసినా నాతో బాగానే బిహేవ్ చేశారు. అందుకే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా చెబితే నమ్మబుద్ధి కాదు. యాక్చువల్లీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పార్టీలకు వెళ్లకపోతే, ప్రోగ్రామ్స్‌కి అటెండ్ కాకపోతే చాన్సులు రావని అంటుండేవారు. నేను నమ్మేదాన్ని కాదు. మనకేం కావాలో మనం తెలుసుకోవాలి. నా వరకు నేను ఎవరైనా ‘ఇలానే చేయాలి’ అని కండీషన్స్ పెడితే ‘చేయను’ అని తెగేసి చెప్పేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది పేరెంట్సే నేర్పించాలి. పేరెంట్స్ సరైన గైడెన్స్ ఇవ్వకపోతే పిల్లలు చెడు దారులు పడతారు. ఓకే.. ఆ మధ్య కేరళలో ఓ గుడికి వెళ్లారు. ఆ తర్వాత బెంగళూరులో ఓ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. రీజన్ ఏంటి? ఇప్పుడే కాదండి.. చిన్నప్పటి నుంచీ కూడా పూజలు చేయడం నాకు అలవాటు. తరచూ తిరుపతి వెళతాను. ‘భాగమతి’లో మలయాళ నటుడు జయరామ్ నటించారు. ఆయన చెబితే కేరళలో ఓ టెంపుల్ని విజిట్ చేశాను. నా కోసం నేనెప్పుడూ మొక్కుకోను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కోసం మొక్కుకుంటా. 2011లో ఒకరి కోసం మొక్కుకుని, చిలుకూరి వెళ్లి, 108 ప్రదక్షిణాలు చేశాను. ఇంకో మొక్కు కూడా ఉంది. మళ్లీ వెళ్లాలి. మీ కోసం మొక్కుకునేది ఎవరు? మా అమ్మానాన్న, అన్నయ్య, వదిన, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యాన్స్ కూడా నా కోసం పూజలు చేస్తారనుకుంటున్నా. ఇంతమంది ఉండగా నాకోసం నేను దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు? పెద్ద సినిమాలు చేస్తున్నారు కాబట్టి సక్సెస్ కోసం, పెళ్లి అవ్వాలని గుడికి వెళుతున్నారేమో అనిపించింది... అలా ఏం లేదండి. చాలామంది ఇలానే ఊహించుకుంటున్నారు. ప్రభాస్‌తో మీ రిలేషన్ ఏంటి? అనే టాపిక్ లేకుండా ఇంటర్వ్యూ ఫినిష్ అవ్వదు. అదేమైనా కోపంగా ఉంటుందా? మేం ఎప్పటినుంచో ట్రావెల్ చేస్తున్నాం. పైగా ఇద్దరం పెళ్లి కానివాళ్లమే. అందుకని ఏదేదో అనుకుంటారు. అది నేచురల్. అయితే చెప్పిన విషయాలను వేరే రకంగా ప్రొజెక్ట్ చేస్తే మాత్రం బాధగా ఉంటుంది. ఫ్రభాస్ కెరీర్ పెద్దగా షేప్ అవ్వటం ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ వెరీ ఫోకస్డ్. మంచి వ్యక్తి. ఫ్రెండ్స్‌కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. తన కెరీర్‌ని ఈ రేంజ్లో చూడటం హ్యాపీగా ఉంటుంది. ఆ మాటకొస్తే.. ‘వియ్ ఫీల్ హ్యపీ ఫర్ ఈచ్ అదర్’. ‘బాహుబలి’లో మీరు పడవ ఎక్కడానికి ప్రభాస్ తన రెండు చేతులు చాచితే, వాటి మీద నడుచుకుంటూ వెళతారు. రియల్‌గా అంత ప్యాంపర్ చేసే భర్త రావాలనిపిస్తుంటుందా? (నవ్వేస్తూ). నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి స్వీట్ స్వీట్ మూమెంట్స్ అంటే ఇష్టం. బేసిక్‌గా నేను డ్రీమర్ని. అయితే అలా జరగడం అసాధ్యం కదా. ఒకవేళ మీకెవరైనా లవ్ ప్రపోజ్ చేయాలంటే ఇలాంటిది ఏదైనా ప్లాన్ చేయాలని కోరుకుంటారా ? అందరూ ఇలానే చేయాలని కోరుకోకూడదు. కొందరు మాటలతో చెప్పలేకపోవచ్చు. కొందరు వాళ్ల ప్రేమను మనకోసం వాళ్లు చేసే పనుల ద్వారా చూపిస్తుంటారు. అలానే కొందరు జస్ట్ ఒక్క హగ్ ఇచ్చినా ఆ స్పర్శలో మొత్తం ప్రేమ తెలిసిపోతుంది. ‘యాక్షన్ స్పీక్స్ లౌడర్ దేన్ వాయిస్’ అని నేను నమ్ముతాను. ఫైనల్లీ మీకెలాంటి వెడ్డింగ్ కావాలి? చాలా సింపుల్ వెడ్డింగ్. గ్రాండ్‌గా అంటే మేకప్ వేసుకోవాలి కదా (నవ్వుతూ) . – డి.జి. భవాని -
బాహుబలి బెస్ట్ ఫ్రెండ్... భల్లాలదేవ బ్రదర్
... ఇదిగో ఇలాగే చెప్పారు దేవసేన. అదేనండీ అనుష్క. అదేంటీ? దేవసేన మీద భల్లాలదేవుడు (రానా) పగ సాధించాలనుకున్నాడు కదా! బాహుబలి (ప్రభాస్)తో దేవసేన వివాహం అయ్యింది కదా అంటే.. అవును. అవి రీల్ లైఫ్ క్యారెక్టర్స్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ రియల్ లైఫ్‌లో ప్రభాస్, రానా, అనుష్కల బాండింగ్ వేరు. ఆ అనుబంధం గురించి అనుష్క స్వయంగా చెప్పారు. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ‘భాగమతి’లో అనుష్క టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26న ఈ చిత్రం రిలీజ్ కానుంది. చెన్నైలో జరిగిన తమిళ ‘భాగమతి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనుష్క కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ‘‘రానా నన్ను బ్రదర్ అని పిలుస్తాడు. నేనూ తనని అలాగే పిలుస్తాను. ప్రభాస్ నాకు బ్రదర్ కాదు. బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అయినా అందరూ బ్రదర్స్ అవ్వాలనేం లేదుగా?’’ అన్నారామె. పెళ్లి గురించి మాట్లాడుతూ – ‘‘పెళ్లి గురించిన ఆలోచన ప్రస్తుతానికి లేదు. మీకు తెలిసిన అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్పండి. (నవ్వుతూ). నా నెక్ట్స్ సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఉండొచ్చు. రాజమౌళి దర్శకత్వంలో మరోసారి నటించాలని ఉంది’’ అన్నారు అనుష్క. భాగమతి సినిమా గురించి చెబుతూ– ‘‘ఇందులో సంచల అనే ఐఏఎస్ అమ్మాయి క్యారెక్టర్ చేశాను. నిజానికి ఈ కథను నేను 2012లో విన్నా. కానీ లింగా, సైజ్ జీరో, బాహుబలి 1 అండ్ 2 సినిమాలను ముందు కమిట్ అయ్యాను. సో.. మేకర్స్ నాకోసం ఫోర్ ఇయర్స్ వెయిట్ చేశారు. ‘భాగమతి’ ట్రూ స్టోరీ కాదు. ఫిక్షన్. దర్శకుడు అశోక్ సినిమాను బాగా తీశారు’’ అన్నారు. -
బాహుబలి.. ఓ పాఠం!
‘బాహుబలి’ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. అదేంటంటే.. ‘బాహుబలి’ సినిమా సక్సెస్‌ను పాఠంగా చెప్పబోతున్నారు. ఈ చిత్ర విజయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎమ్ఎ) ఓ కేస్ స్టడీగా తీసుకుని, పరిశోధన చేయనున్నట్లు అక్కడి ప్రొఫెసర్ భరతన్ కందస్వామి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ– ‘‘సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి’ చక్కని మార్కెటింగ్ స్ట్రాటజీతో మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్స్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పార్ట్ సక్సెస్ అయితే రెండో పార్ట్‌కి పబ్లిసిటీ ఈజీగా వస్తుంది. మార్కెటింగ్ సులువు అవుతుంది. ప్రధానంగా నేను సీక్వెల్స్ నిర్మాణం, మార్కెటింగ్ మంత్ర, కలెక్షన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాను. ఈ విషయాల్లో అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులకు డిజిటల్ మార్కెట్ గురించి కూడా చెబుతాం. సినిమా ఇండస్ట్రీ గురించి అన్ని కోణాల నుంచి విద్యార్థులకు తెలియజేయనున్నాం.అందుకే సక్సెస్ సాధించిన ‘బాహుబలి’ సినిమాను ఓ కేస్ స్టడీగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి’ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ముఖ్య తారలుగా నటించిన ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణంగా నిలిచింది. -
ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి
‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అంటూ అనుష్క చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘భాగమతి’ట్రైలర్. అనుష్క టైటిల్ రోల్లో ‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం ‘భాగమతి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమాతో సూపర్ ఫామ్‌లో ఉన్న అనుష్కతో ‘భాగమతి’ చిత్రం నిర్మించినందుకు గర్వంగా ఉంది. అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అద్భుతమైన కథని అంతే అద్భుతంగా అశోక్ తెరకెక్కించారు. ‘భాగమతి’ కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమన్ పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్’’ అన్నారు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: మథి. -
డబుల్ అనుష్క
న్యూ ఇయర్ సందర్భంగా ‘భాగమతి’ చిత్రబృందం అనుష్కకు సంబంధించిన ఒక ఫొటోను విడుదల చేసింది. వీరోచిత పోరాట పటిమను ప్రదర్శిస్తున్న ఓ వీర వనిత చిత్రపటం వైపు తదేకంగా చూస్తున్నారు అనుష్క. ఎప్పటి నుండో సమాధానం తెలియని ఓ ప్రశ్నను అన్వేషిస్తున్నట్టున్నాయి ఆమె చూపులు. విశేషం ఏంటంటే ఆమె చూస్తున్న ఆ చిత్రపటంలో ఉన్న వీరనారి కూడా అనుష్కే. అంటే... ‘భాగమతి’లో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తున్నారా? ఇంతకీ వీళ్లిద్దరికి మధ్య ఉన్న బంధం ఏంటీ? ఆమె వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం తెలిసిందా? వీరిలో భాగమతి ఎవరు? వీటన్నింటికి సమాధానం తెలియాలంటే మాత్రం ఈనెల 26 వరకు ఆగాల్సిందే. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘భాగమతి’ సినిమాకు జి.అశోక్ దర్శకత్వం వహించారు. యూవీ క్రి యేషన్స్ పతాకం పై వంశీ–ప్రమోద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమేరా: మది. -
బొం బొం బాటుగుందిరా డైరీ
ఈ హీరోయిన్లు ఈ ఏడాది మేకప్ తీసేట్టు లేరు. సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా.... డైరీ బిజీ. ఫుల్‌గా సినిమాలు... నిల్‌గా డేట్స్. నయా తార: ఎంతమంది కొత్త నాయికలు వచ్చినా.. నయనతార ‘నయా తార’లానే ఉన్నారు. గతేడాది డోరా, ఆరమ్, వేలైక్కారన్ ఇలా.. మూడు తమిళ సినిమాలు చేశారు. ఇందులో ‘డోరా’ తెలుగులో విడుదలైంది. మరి... ఈ ఏడాది స్కోర్ ఎంత అంటే? గతేడాది కన్నా ఎక్కువ. నయనతార ఖాతాలో మూడు తమిళ సినిమాలు (ఇమైక్క నొడిగళ్, కొలైయుదిర్ కాలమ్, కోలమావు కోకిల) ఉన్నాయి. ఇక తెలుగులో సంక్రాంతికి వస్తున్న ‘జై సింహా’లో నయనతారే కథానాయిక. ‘సైరా’కి సై అన్న విషయం తెలిసిందే. ‘కర్తవ్వం’ అనే టైటిల్‌తో ‘ఆరమ్’ని తెలుగులో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాల సంగతి ఇలా ఉంచితే.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార లవ్‌లో ఉన్నారని చెన్నై ఇండస్ట్రీ కోడై కూస్తోంది. పెళ్లి ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి. సౌత్‌లో ఆ గౌరవం త్రిషదే: చెన్నై చందమామ త్రిష గత ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై మెరవలేదు. అలాగని అవకాశాలు తగ్గిపోయాయనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఏకంగా ఆరు సినిమాలు (మెహిని, గర్జనై, చతురంగ వెటై్ట 2, 1818, 96, హే జ్యూడ్) ఆమె చేతిలో ఉన్నాయి. మరో మూడు సినిమాలకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో... 2018లో లెక్క ఎక్కువ. సినిమాలవైజ్గా గతేడాది వెనక్కి తగ్గారేమో కానీ,, అరుదైన గౌరవం దక్కించుకున్నారు త్రిష. యూనిసెఫ్ (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) సెలబ్రిటీ అడ్వకేట్ స్టేటస్‌ను పొందారామె. సౌత్‌లో ఈ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ హీరోయిన్ త్రిషనే అట. వెరీ వెరీ స్పెషల్: గతేడాది సమంతకు వెరీ వెరీ స్పెషల్. మరి... నచ్చిన కుర్రాడి (నాగచైతన్య)తో మూడు ముళ్లు వేయించుకోవడం అంటే స్పెషల్ కాక ఏంటి? పెళ్లి తర్వాత సినిమాల పరంగా స్పీడ్ తగ్గిస్తారేమో? అన్నది కొందరి ఊహ. కానీ, సమంతకు ఆ ఆలోచన లేదు. గతేడాది ‘రాజుగారి గది 2’, తమిళంలో ‘మెర్సెల్’లో నటించారు. ఈ ఏడాది విషయానికొస్తే... ‘రంగస్థలం , మహానటి’ సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో ‘ఇరంబుదురై, ఇంకా టైటిల్ డిసైడ్ కాని ఓ సినిమా, ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో నటిస్తున్నారు. సో.. లెక్క పెరిగిందే కానీ, తగ్గలేదు. ఫిదా చేసింది: బాన్స్వాడ భానుమతి అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. కథానాయిక సాయిపల్లవి గురించి చెబుతున్నామని గ్రహించే ఉంటారు. గతేడాది ‘ఫిదా, ఎంసీఏ’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారామె. తమిళంలో చేసిన ‘కరు’ తెలుగులో ఈ ఏడాది ‘కణం’ పేరుతో రిలీజ్ కానుంది. తమిళంలో మరో రెండు సినిమాలు చేయనున్నారు. ఇక తెలుగులో నెక్ట్స్ శర్వానంద్‌తో జోడీ కట్టారు సాయిపల్లవి. పక్కా స్కెచ్: గత ఏడాది ‘బాహుబలి–2’లో అవంతికగా, ‘జైలవకుశ’లో స్పెషల్ సాంగ్, తమిళ చిత్రం ‘ఏఏఏ’లో నాయికగా కనిపించారు తమన్నా. అందుకే ఈ ఏడాది పక్కా స్కెచ్ వేసుకున్నారామె. తెలుగులో మూడు సినిమాలు (సందీప్‌కిషన్ సరసన ఓ మూవీ, కల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా, ‘క్వీన్’ తెలుగు రీమేక్) లైన్లో పెట్టారామె. అంతేకాదు ఈ జనవరిలో తెలుగు, తమిళ భాషల్లో ‘స్కెచ్’ రిలీజ్ కానుంది. అంతేకాదండోయ్ ‘కామోషీ’ సినిమాతో మరోసారి హిందీ ఇండస్ట్రీలో లక్‌ను చెక్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. లెక్క బాగుంది కదూ. బొమ్మాళీ... తగ్గొద్దు : ఓ వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ మూవీస్ చేస్తూనే మరో పక్క సోలోగా కత్తి తిప్పారు ఈ ‘అరుంధతి’. 2017లో అనుష్క మూడు చిత్రాల్లో కనిపించారు. ‘సింగమ్ 3’, ‘ఓం నమో వెంకటేశాయ’లో మెరిశారు. ఆ తర్వాత ‘బాహుబలి ది కన్‌క్లూజన్’లో దేవసేనగా అభిమానులను అలరించారు అనుష్క. ఈ ఏడాది జనవరిలో ‘భాగమతి’గా కనిపించనున్నారు. జవనరి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి శివ దర్శకత్వంలో అజిత్ చేయబోతున్న ‘విశ్వాసం’ సినిమాలో హీరోయిన్గా ఈ భామ పేరును పరిశీలిస్తున్నట్టు కోలీవుడ్ టాక్. సిక్సర్ : తమిళంలో ‘భైరవ’, ‘పాంబు సాటై్ట’, తెలుగులో ‘నేను లోకల్’.. ఇలా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు కీర్తీ సురేశ్. వచ్చే ఏడాది ఏకంగా సిక్సర్ కొట్టనున్నారు కీర్తి. ‘గ్యాంగ్’, ‘అజ్ఞాతవాసి’తో సంక్రాంతి పండగకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. మళ్లీ మార్చిలో ‘మహానటి’గా రానున్నారు. ఆ తర్వాత ‘సామీ స్క్వేర్’లో, 2005లో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్లో, విజయ్ సరసన ఓ సినిమాలోనూ హీరోయిన్గా కనిపిస్తారు కీర్తీ సురేశ్. ఆ విధంగా 2018లో అరడజను సినిమాల్లో సందడి చేయనున్నారు. లెక్క అదిరిందబ్బా. అదే దూకుడు: ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పన్నెండేళ్లవుతున్నా.. కాజల్ దూకుడు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే చిన్న హీరోల పక్కన నటిస్తున్నారు. 2017లో ‘ఖైదీ నంబర్ 150’లో, ‘నేనే రాజు నేనే మంత్రి’, తమిళంలో విజయ్‌తో ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది‘), అజిత్‌తో ‘వివేగం’ (తెలుగులో ‘వివేకం’)’ సినిమాల్లో కనిపించారు కాజల్. ఆ ఉత్సాహంతో 2018లోను నాలుగు సినిమాల్లో కనిపించనున్నారామె. కల్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’, ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’, నాని నిర్మిస్తున్న ‘అ’ చిత్రాల్లో సందడి చేయనున్నారు. రాశి బాగుంది: రాశీ ఖన్నా 2017లో మూడు సినిమాల్లో కనిపించారు. ‘జై లవ కుశ’, ‘ఆక్సిజన్’ చిత్రాల్లో మెరిశారు. ‘విలన్’ సినిమా ద్వారా మలయాళ తెరకు పరిచయమయ్యారు. ఈ ఏడాది రాశీ ఖన్నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు తమిళ సినిమాలు రెండు తెలుగు సినిమాలు. ‘టచ్ చేసి చూడు’, ‘తొలిప్రేమ’. ‘సైతాన్ కా బచ్చా, ఇమైక్క నొడిగల్, అడంగమారు’... ఇలా ఐదు సినిమాలతో ఈ ఏడాది రాశీ ఖన్నా డైరీ బిజీ. లెక్క తేలలేదు: అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది ‘విన్నర్, స్పైడర్, జయ జానకి నాయక, రారండోయ్ వేడుక చూద్దాం, ఖాకీ’ సినిమాల్లో కనిపించారు రకుల్. ఈ ఏడాది మాత్రం కేవలం ఒక్కటే సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అది కూడా బాలీవుడ్ ‘అయ్యారీ’. ప్రస్తుతానికి కొన్ని రోజులు రకుల్ డైరీ ఖాళీ. అధికారికంగా ప్రకటించలేదు కానీ, రవితేజ–కల్యాణ్ కృష్ణ సినిమా, హరీష్ శంకర్–‘దిల్’ రాజు కాంబినేషన్ మూవీ (దాగుడు మూతలు), బోయపాటి–రామ్‌చరణ్ సినిమాలకు రకుల్ పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంకా లెక్క తేలలేదు. 2017 ఏం చేశారు? 2018 ఏం చేయబోతున్నారు? గతేడాది స్ట్రైట్‌గా నాలుగు సినిమాల్లో కనిపించారు హీరోయిన్ మెహరీన్ (మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్). తమిళ, తెలుగు బైలింగ్వల్ ‘కేరాఫ్ సూర్య’లో నటించారామె. ఈ ఏడాది ఇప్పటివరకు గోపీచంద్ 25వ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే తెలుగులో ఒక సినిమా చేసిందో లేదో అప్పుడే కోలీవుడ్ నుంచి కాలింగ్ రావడం, ఆమె రెండు తమిళ సినిమాలకు (జీవాతో ఓ సినిమా, జీవీ ప్రకాశ్‌కుమార్‌తో ‘100% లవ్’ రీమేక్) సైన్ చేశారు. కెరీర్లో దూసుకెళ్తున్నారు సీనియర్ హీరోయిన్ శ్రియ. 2017లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్’ సినిమాల్లో ఆమె హీరోయిన్గా కనిపించారు. తమిళ సినిమా ‘ఏఏఏ’లో నటించారు. ఇక ఈ ఏడాది తమిళంలో ఆమె నటించిన ‘నరగాసురన్’ (తెలుగులో నరకాసురుడు) థియేటర్స్‌కు రానుంది. హిందీలో ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘ధడ్కా’ రిలీజ్‌కి సిద్ధమైంది. ‘గాయత్రి, ‘వీరభోగ వసంతరాయలు’లో కీలక పాత్రలు చేస్తున్నారామె. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత జోరు పెంచారు తాప్సీ. 2017లో మూడు హిందీ సినిమాల్లో (రన్నింగ్ షాదీ, నామ్ షబానా, జుడ్వా 2) నటించారు. ‘ఘాజీ’లో చిన్న పాత్ర చేసి, తెలుగు తెరపై మెరిసిన తాప్సీ ‘ఆనందో బ్రహ్మ’ సినిమా చేశారు. ఈ ఏడాది కూడా అదే స్పీడ్‌లో నాలుగు హిందీ సినిమాలను లైన్లో పెట్టారు. మరో తెలుగు సినిమా కోసం డిస్కస్ చేస్తున్నారు. గతేడాది ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, తుప్పరివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) సినిమాలతో థియేటర్స్‌లో సందడి చేసిన అనూ ఇమ్మాన్యుయేల్ ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. అందులో ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి రిలీజ్ అవుతుండగా, ‘నా పేరు సూర్య’ వేసవి బరిలో ఉంది. నాగచైతన్యతో చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. ‘లై’ ఫేమ్ మేఘా ఆకాశ్ తొలి హీరో నితిన్‌తో మరో సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతో అలరించిన లావణ్య త్రిపాఠి ప్రజెంట్ సాయిధరమ్ తేజ్ సినిమా చేస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్ గతేడాది ‘శతమానం భవతి, జోమొంటే సువిషంగల్, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల్లో కనిపించారు. ఈ సంవత్సరం నాని ‘కృష్ణార్జున యుద్ధం’, సాయిధరమ్‌తో ఓ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. 2017లో తెలుగులో నక్షత్రం, బాలకృష్ణుడు, తమిళంలో మా నగరం, సరవనన్ ఇరుక్క భయమేన్, నెంజమ్ మరప్పదిల్లయ్, జెమిని గణేశన్ సురళీ రాజనుమ్... ఇలా ఆరు సినిమాల్లో కనిపించారు రెజీనా. ఈ సంవత్సరం తమిళంలో పార్టీ, చంద్రమౌళి, తెలుగులో అ! రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ‘పెళ్ళి చూపులు’తో ఫేమస్ అయిన రీతూ వర్మ ఈ ఏడాది తమిళంలో విక్రమ్ సరసన ‘ధృవనక్షత్రం’, దుల్కర్ సల్మాన్‌తో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్’ సినిమాల్లో కనిపించనున్నారు. వీళ్లు కాకుండా మరికొంత మంది భామలు ఈ సంవత్సరంలో తెలుగు తెరపై తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు బాలీవుడ్ భామల సినిమాలు ఈ ఏడాది తెలుగులో రిలీజ్ కానున్నాయి. వారి హిందీ సినిమాల విషయం పక్కనపెడితే.. ఆ లిస్ట్‌లో శ్రద్ధాకపూర్ (‘సాహో’) అదితిరావ్ హైదరి (సుధీర్‌బాబు సినిమా), కియారా అద్వాని (మహేశ్ 24), కంగనా రనౌత్ (మణికర్ణిక), సన్నీ లియోన్ (వీరమహాదేవి) ఉన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ ఎంతమందినైనా ఆహ్వానిస్తుంది. సో.. ఈ ఏడాది ఇంకా నయా తారలు చాలామంది వస్తారని ఊహించవచ్చు. -
ఆమెలా వెరైటీ పాత్రలు చేయాలని ఉంది..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినీ పరిశ్రమలో ఏళ్లు తరబడి ఉండాలంటే హార్డ్‌వర్క్‌తో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని మెహ్రీన్ కౌర్ పిర్జాదా (జవాన్ ఫేం) అన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరూ గమనిస్తారని కాబట్టి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలన్నారు. తను ఏ చిత్రం చేసినా మొదటి చిత్రంగానే భావిస్తానన్నారు. నగరంలోని వీపీఐ రోడ్డులోని ఇమారా షాపింగ్ మాల్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మెహరిన్ సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్ర: హలో మెహరిన్ ఎలా ఉన్నారు..? జ: ఫైన్.. ప్ర:ఈ మధ్య వైజాగ్‌కు చాలా ఎక్కువసార్లు వస్తున్నట్లు ఉన్నారు...? జ:అవునండి..వైజాగ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్ అభిమానులు నాపై ఎప్పుడూ ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. ప్ర:మీరు చేసిన సినిమాల్లో ఫెయిల్యూర్స్‌పై కామెంట్? జ: ఏ పరిశ్రమంలోనైనా గెలుపోటములు సహజం, పాజిటివ్‌గా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం ప్ర:మీ కిష్టమైన నటి? జ:ప్రియాంక చోప్రా, అనుష్క, కాజోల్ అంటే చాలా ఇష్టం. ప్ర:మీ డ్రీమ్ రోల్ జ:అనుష్క చేసే వెరైటీ పాత్రలు చేయాలని ఉంది. అరుంధతి, రుద్రమాదేవి ఇలాంటి పాత్రలు చేస్తే జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది. ఐ లవ్ అనుష్క. ప్ర: మీరు నటించిన సినిమాల్లో ఇష్టమైన పాత్ర? జ: కృష్టగాడీ వీరప్రేమ గాథలో మహాలక్ష్మి పాత్ర అంటే చాలా ఇష్టం. ప్ర: భవిష్యత్ ప్రాజెక్టులు? జ: ప్రస్తుతం గోపీచంద్‌తో నటిస్తున్నా. మరికొన్ని చర్చల్లో ఉన్నాయి. ప్ర: గోపిచంద్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది...? జ: ఆ సినిమాలో యంగ్ టీచర్ పాత్ర పోషిస్తున్నా. మొత్తం సోషల్ డ్రామాగా సాగుతుంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఇమారా షాపింగ్ మాల్‌ను ప్రారంభిస్తూ... -
అజిత్ ఇన్ బ్లాక్
సౌత్ ఇండియన్ హీరోస్లో సాల్ట్ అండ్ పెప్పర్ (అక్కడక్కడా నెరిసిన జుత్తు, గెడ్డం) లుక్‌తో ఎక్కువగా కనిపించే హీరో అజిత్. కానీ, ఈసారి లుక్ మార్చబోతున్నారట. మూడు నాలుగేళ్లుగా అజిత్ ఈ గెటప్‌లోనే కనిపిస్తున్నారు. ఫర్ ఎ చేంజ్ తన తదుపరి సినిమా కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కు ఫుల్స్టాప్ పెట్టి, ఫుల్ బ్లాక్‌లో కనిపించబోతున్నారట. ఫుల్ బ్లాక్ అంటే ఒంటి రంగు అనుకునేరు. జుట్టు, గడ్డం రంగు. ఇంతకీ ఏ సినిమాలో ఈ గెటప్ అంటే.. ‘విశ్వాసం’లో. అజిత్ హీరోగా ‘వీరం, వేదాళం, వివేగం’ వంటి హిట్స్ ఇచ్చిన శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై జి.త్యాగరాజన్, జి. శరవణన్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో అనుష్క పేరుని హీరోయిన్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. జనవరి 19న రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రాన్ని 2018 దీపావళికి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. -
స్వీటీ డిఫరెంట్
ఎప్పటి నుంచో ఉపయోగంలో లేని పాడుబడ్డ భవంతి అది. అందులోకి వెళ్లాంటే గుండె నిండా ఖలేజా కావాలి. ఓ రోజు మెరుపుల శబ్దాల మధ్య ఆ భవంతి తలుపులు తెరుచుకున్నాయి. వెలుగును వెంబడిస్తూ భయంతో వడివడిగా అడుగులు వేస్తున్న ఒకరి చూపులు దేన్నో ఆత్రుతగా వెతుకున్నాయి. అంతే.. హఠాత్తుగా పెద్ద శబ్దం. దేన్నో వెతుకున్న ఆ మనిషి చేతిలోని టార్చ్‌లైట్ వెలుగు గోడపై ఫ్లాష్ అయ్యింది. కట్ చేస్తే.. ఓ అమ్మాయి. చేతిలో మేకును సుత్తితో బలంగా కొట్టుకుంది. ఆ అమ్మాయి తనని తాను ఎందుకలా శిక్షించుకుంది? బుధవారం రిలీజైన ‘భాగమతి’ టీజర్ కహానీ ఇది. అసలు కహానీ ఏంటో వెయిట్ అండ్ సీ. టైటిల్ రోల్లో అనుష్క నటించిన ఈ చిత్రాన్ని అశోక్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు. జనవరి 26న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. భాగమతికి బాహుబలికి కితాబు ప్రభాస్ – అనుష్క కలసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అందుకే స్వీటీ (అనుష్క ముద్దు పేరు)ని అభినందించారు ప్రభాస్. ‘‘డిఫరెంట్‌గా ట్రై చేయడంలో అనుష్క ఫస్ట్ లేడీ. ప్రతి సినిమాలోనూ ఆమె క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. గుడ్‌లక్ టు స్వీటీ అండ్ యూవీ క్రియేషన్స్ టీమ్’’ అంటూ ప్రభాస్ తన ఫేస్బుక్ ఖాతాలో ‘భాగమతి’ టీజర్‌ను పోస్ట్ చేశారు. -
‘విరుష్క’ పెళ్లి వేడుక వీడియో...
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి సోమవారం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమాడాడు. ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహానికి దుస్తులు డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ .. తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కోహ్లీ-అనుష్కల ఫోటోను షేర్ చేశాడు. అలాగే నూతన వధూవరులు...ఈ నెల 21న ఢిల్లీలో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులకు రిసెన్షన్ ఏర్పాటు చేశారు. వివాహ వేడుకకు సంబంధించి వీడియోను మీరూ చూడండి... అందరి దృష్టిని ఆకర్షించిన ‘విరుష్క’ జంట -
స్వీటీ ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూస్
స్వీటీ అంటే అనుష్క అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బొమ్మాళి ముద్దు పేరు స్వీటీ అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. స్వీటీ ఫ్యాన్స్‌కి ఓ న్యూ ఇయర్ గిఫ్ట్. ‘బాహుబలి’లో దేవసేనగా కనిపించిన అనుష్క త్వరలో భాగమతిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ‘పిల్ల జమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న చిత్రం ‘భాగమతి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. టీజర్‌ను ఈ నెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అంటే... న్యూ ఇయర్ గిఫ్ట్ అన్న మాట. జనవరి 26న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేయటానికి హైదరాబాద్‌కు చెందిన నాలుగు కంపెనీలతో సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్ చేయిస్తున్నారట. -
ముగ్గురిలో విక్టరీ ఎవరికి?
అనుష్క, కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో విక్టరీ ఎవరిది? అదేనండి.. గెలుపు ఎవరిది? ఇక్కడ విక్టరీ వెంకటేశ్ ఫొటో ఉంది కాబట్టి... ఆయన మనసుని గెలుచుకునేది ఎవరు? ఇంతకీ వెంకీ మనసుని వీళ్లు గెలవడం ఏంటి? అంటే.. ఓ సినిమాలో జత కట్టేందుకు. అది తేజ సినిమా. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ఆరంభమవుతుంది. ఇప్పుడు డిస్కషన్ అంతా ఈ సినిమాలో వెంకీ సరసన నటించనున్నది ఎవరు? అని. ముగ్గురు పేర్లను తేజ పరిశీలిస్తున్నారట. వెంకీ కాంబినేషన్లో ఆల్రెడీ ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’ చిత్రాల్లో నటించిన అనుష్క, వెంకీతో ఇప్పటివరకూ నటించని కాజల్ అగర్వాల్, రాధికా ఆప్టే.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకర్ని కథానాయికగా తీసుకోవాలని తేజ అనుకుంటున్నారట.మరి.. ముగ్గురిలో ఎవరికి చాన్స్ దక్కుతుందో ఈ ఇయర్ ఎండింగ్లో తెలిసిపోతుంది. ఎందుకంటే జనవరిలో ఈ చిత్రం షూటింగ్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో యాంగ్రీ మేన్ రాజశేఖర్ ఓ కీలక పాత్ర చేయనున్నారని టాక్. వెంకీ బావగా నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేయనున్నారట. అది నిజమా? కాదా? అనే క్లారిటీ కూడా ఇయర్ ఎండింగ్లో వచ్చేస్తుంది. -
స్నేహంతో స్పృశిస్తాం.. ప్రేమలతో తరిస్తాం..
ఎక్కడి నుంచి తెచ్చావ్.. ఈ కుక్కపిల్లను..! అనడిగితే చాలా మందికి కోపమొస్తుంది. ‘ఇది కుక్కపిల్ల కాదు.. మా రీనా. మా ఫ్రెండ్’ అంటూ ఘాటుగా సమాధానమిస్తారు. కుక్కపిల్లనో.. పిల్లి అనో పిలిస్తే వారు ఒప్పుకోరు. ఇది కాస్త చాదస్తంగా.. అనిపించినా నగర జీవనంలో ఇప్పుడు చాలామంది తమ పెంపుడు జంతువుల విషయంలో ఇలానే ఉంటున్నారు. ఈ పద్ధతి కుక్కపిల్లకే పరిమితం కాలేదు.. అన్ని జంతువుల విషయంలోనూ ఇలానే ఉంది. వాటికి రూ.లక్షలు ఖర్చుపెట్టి పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. చనిపోతే రిచ్‌గా సమాధులు కట్టించేవారూ ఉన్నారు. పెంపుడు జంతువులపై నగరవాసి పెంచుకున్న ప్రేమకు ఇది నిదర్శనం. నేడు జాతీయ జంతు సంరక్షణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నగరంలో జంతుప్రేమకుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే పెద్దవారికి తోడుగా ఉంటాయనే ఆలోచన నుంచి యువత తమ తోటి స్నేహితులుగా పలు రకాల జంతువులను, పక్షులను ఇంట్లో పెంచుకుంటున్నారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చినా కలవర పడుతున్నారు. జంతువులు కూడా తమ యజమానుల పట్ల అంతే ప్రేమను పంచుతున్నాయి. ఇటీవలి కాలంలో చాలా సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, ఫొటోలు ఇందుకు ఉదాహరణగా నిలిస్తున్నాయి. జంతు సంరక్షణలో సంస్థలు.. ఏ జంతువైనా సరే మనతో కలిసి జీవించే హక్కు ఉందంటున్నారు జంతు ప్రేమికులు. అందుకే వాటి సంరక్షణ కోసం ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. వాటి హక్కుల కోసం పోరాడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని బ్లూక్రాస్ సంస్థ దాదాపు 24 ఏళ్లుగా జంతు సంరక్షణ సేవలందిస్తోంది. ఇక్కడి సభ్యులు ఇప్పటి వరకు దాదాపు 4 లక్షలకు పైగా జంతువులను కాపాడారు. వాటికి అవసరమైన వైద్యం అందించి ప్రాణం పోశారు. మరో 1,22,480 పక్షులను కాపాడడంతో పాటు 12,805 జంతువులను దత్తత తీసుకొన్నారు. ఈ ఉద్యమాన్ని బ్లూక్రాస్ హైదరాబాద్ నిర్వాహకురాలు అక్కినేని అమల 1992 నుంచి చేస్తున్నారు. ఈ సంస్థనే కాకుండా స్నేక్ సొసైటీలు, జంతు సంరక్షణ సంస్థలు నగరంలో చాలానే ఉన్నాయి. ఎవరన్నా జంతువులు, పక్షులను బాధపెట్టేలా ప్రవర్తించినా, గాయం చేసినా వారికి శిక్ష వేయించేలా కృషి చేస్తున్నారు. మరో ప్రపంచంలో ఉన్నట్టే.. నా వద్ద పది కుక్కలున్నాయి. ఇంట్లో ఉన్నంత సేపూ వాటితోనే గడుపుతుంటా. వాటితో ఉన్నంత సేపూ మరో ప్రపంచంలో ఉన్నట్టు ఆనందంగా ఉంటుంది. ఆ ప్రాణులుకు ఏమన్నా జరిగితే అస్సలు తట్టుకోలేను. తగ్గేవరకు మనసు మనసులో ఉండదు. – పూరీ జగన్నాథ్ ఒత్తిడిలో పెద్ద రిలీఫ్ అవే.. ఒక్క జంతు సంరక్షణ దినోత్సవం నాడేకాదు.. జంతువులను ప్రతిరోజు ప్రేమగా చూడాలి. ఆ మూగ జీవాలను అర్థం చేసుకోవాలేగాని హాని చేయకూడదు. నా వద్ద రెండు పిల్లులు ఉన్నాయి. వాటిని చూస్తే చాలు నాకు పెద్ద రిలీఫ్‌గా ఉంటుంది. – సదా గుండెల నిండా ప్రేమ.. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే చాలా ప్రేమ. ఈ మధ్య అతను ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల ఒక్కటి మృత్యువాతపడింది. దీంతో దాదాపు వారం రోజులపాటు కోలుకోలేకపోయాడు. బేగంపేటలో మరో కుటుంబం ముద్దుగా పెరిగిన శునకం కన్నుమూస్తే ఇంటిల్లిపాది కన్నీరుమున్నీరయ్యారు. ప్రత్యేకంగా దహన సంస్కారాలు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ఓ పెంపుడు కుక్కపిల్ల అదృశ్యమవడంతో దాని యజమాని నిద్రాహారాలు మాని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. చివరికి సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కుక్కపిల్లను దొంగిలించిన నిందితుడిని పట్టుకున్నారు. దానిని తిరిగి అప్పగించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. చాలా సంఘటనల్లో ఇప్పుడు తమ పెంపుడు జంతువులకు ప్రత్యేక స్థానం ఇస్తున్నారు. వాటికి ముద్దు పేర్లు పెట్టుకోవడమే కాకుండా ఎవరైనా వాటిని పేరుతోకాకుండా మరొలా పిలిస్తే గొడవకు దిగుతున్నారు. జంతువులపై తమ అనంతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నారు. తారల ఇంట అనుబంధం.. కొన్ని నెలల క్రితం తెలుగు ఇండస్ట్రీకి చెందిన రవిబాబు పందిపిల్లతో ఓ ఏటీఎం క్యూలైన్లో నిలబడి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సినిమా కోసం ఇది చేసినా.. దానిని తాను పెంచుకుంటున్నట్లు చెప్పారు. ఇక రాంచరణ్ వద్ద పదుల సంఖ్యలో గుర్రాలు, కుక్కలు, ఒంటె వంటి జంతువులు, కోడి పుంజుతో సహా పక్షులే ఉన్నాయి. హీరో రాజ్‌తరుణ్‌కు కుక్కపిల్లలంటే పిచ్చిప్రేమ. దర్శకుడు పూరీ జగన్నాథ్ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయన వద్ద దేశవిదేశీ పక్షులు, జంతువులు చాలానే ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్, నాగార్జున, ప్రభాస్, త్రిష, అనుష్క, సోనమ్ కపూర్.. ఒకరేమిటి.. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు షూటింగ్‌లు మినహాయిస్తే ఎక్కువ సమయాన్ని తమకు ఇష్టమైన జంతువులు, పక్షులతోనే గడుపుతున్నారు. -
భాగమతి కమింగ్
డిసెంబర్లో రిలీజ్ చేస్తారా? గ్రాఫిక్స్ వర్క్స్ ఉన్నాయట కదా.. డిసెంబర్లో కష్టం. సంక్రాంతికి రేస్‌లో ఉంటుందేమో? ఊహూ.. సమ్మర్‌కి వస్తుందేమో? – ఇదిగో ఇలాంటి చర్చలే ‘భాగమతి’ సినిమా రిలీజ్ గురించి ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. ఆ చర్చలకు ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. ఎందుకంటే... ‘భాగమతి’ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో అనుష్క ముఖ్యపాత్రలో రూపొందుతున్న సినిమా ‘భాగమతి’. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘సూపర్‌ఫామ్‌లో ఉన్న అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భాగమతి’ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఫస్ట్ లుక్‌కి వచ్చిన స్పందన చిత్రబృందానికి మంచి ఎనర్జీ ఇచ్చింది. దర్శకుడు అశోక్ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అనుష్క నటన సినిమాకు హైలైట్. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. తమన్ సంగీతం సూపర్. సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు నిర్మాతలు. -
వదల బొమ్మాళీ వదలా!
తమిళసినిమా: వదల బొమ్మాళీ వదలా ఈ పదం వింటే టక్కున గుర్తొచ్చేది నటి అనుష్కనే. తను నటించిన అరుంధతి చిత్రం ఎంతగా ఘన విజయం సాధించిందో, అంతగా అందులోని ఆ సంభాషణలు ప్రాచుర్యం పొందాయి. ఆ చిత్రంలోని వదల బొమ్మాళీ వదల సంభాషణల్లా నటి అనుష్కను వదంతులు వదల కుండా వెంటాడుతూనే ఉన్నాయి. నటుడు ప్రభాస్‌తో ఎక్కువ చిత్రాల్లో నటించిన నటి అనుష్కనే. అదే విధంగా ఈ జంట నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో సహజంగానే వీరి గురించి గ్యాసిప్ ప్రచారం అవుతుంటాయి. ప్రభాస్, అనుష్క ప్రేమించుకుంటున్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారన్న రకరకాల వదంతులు చాలాకాలంగా ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వదంతులను ఆ జంట ఖండించినా వదల బొమ్మాళీ వదలా అన్నట్లుగా ప్రచారం అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఒక వదంతే సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే నటి అనుష్క గత 7వ తేదీన పుట్టినరోజును జరుపుకుంది. అదే రోజు తాను నటించిన భాగమతి చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.దాన్ని ప్రభాస్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి అనుష్కకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన అనుష్కకు ఖరీదైన కారును బహుమతిగా అందించారనే ప్రచారం హల్చల్ చేస్తోంది.అదే విధంగా ప్రభాష్ పుట్టిన రోజున అనుష్క ఆయనకు ఖరీదైన వాచ్‌ను బహుమతిగా అందించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. -
ఆయనతో పీకల్లోతు ప్రేమలో పడిపోయా!
... అని ధైర్యంగా.. బాహాటంగా చెబుతున్నారు బెంగళూరు బ్యూటీ అనుష్క. ఈ జేజెమ్మ ప్రేమలో పడ్డారంటే ఏ హీరోతో? అనే డౌట్ రాకమానదు. కానీ, స్వీటీ ప్రేమలో పడ్డది సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. క్రికెటర్ అట. ఇంతకీ ఎవరా లక్కీ పర్సన్? అతని గురించి తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది కదూ! అతను మరెవరో కాదు.. రాహుల్ ద్రావిడ్. అందం, అభినయంతో ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్న అనుష్కకు ద్రావిడ్ అంటే వీరాభిమానమట. ఇప్పటి వరకూ తన మనసులో ఉన్న ఈ విషయాన్ని తొలిసారి బాహాటంగా చెప్పేశారీ దేవసేన. ‘‘చిన్నప్పటి నుంచి ఆయనంటే నాకు విపరీతమైన అభిమానం. ఆయన కోసమే క్రికెట్ చూసేందుకు టీవీ ముందు వాలిపోయేదాన్ని. ఒకానొక సమయంలో ఆయనతో పీకల్లోతు ప్రేమలో పడిపోయా. ఇప్పటికీ నా ఇష్టం అలాగే ఉంది. తను మరెవరో కాదు.. రాహుల్ ద్రావిడ్’’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ తన మనసులో మాట బయటపెట్టారు అనుష్క. -
భాగమతీ... ఏంటిది?
...తప్పదు మరి! ‘భాగమతి’ చేసిన పని చూస్తే ఆ ప్రశ్నే వేయాలన్పించింది. ఎవరైనా తమకు తామే ఓ చేత్తో సుత్తి పట్టుకుని, మరో చేతిని గోడపై పెట్టి మేకు కొట్టుకుంటారా? ‘భాగమతి’ అంత పని చేసింది! శిక్ష విధించుకుంది. ఎందుకలా చేసింది? అంటే... త్వరలో తెలుస్తుంది! అనుష్క ముఖ్యతారగా నటిస్తున్న సినిమా ‘భాగమతి’. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సిన్మా ఫస్ట్ లుక్‌నే మీరు చూస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో లుక్ విడుదల చేశారు. లుక్‌లో గోడపై గమనిస్తే... సంకెళ్లతో మహిళ కాళ్లు ఉన్నాయ్ చూశారా? ఆమె ఆత్మ ‘భాగమతి’ అలియాస్ అనుష్కలో ప్రవేశించిందా? ఏమో? టీజర్ లేదా ట్రైలర్స్ వస్తే తెలుస్తుందేమో! ‘‘అనుష్క నటనలో మరో కోణాన్ని చూపించే చిత్రమిది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు అందర్నీ ఎంటర్టైన్ చేస్తాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘అనుష్క నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అద్భుతమైన కథ. దర్శకుడు అశోక్ చెప్పినదానికంటే బాగా తీశాడు. తమన్ మ్యూజిక్, రవీందర్ సెట్స్, మధి సినిమాటోగ్రఫీ హైలైట్స్’’ అన్నారు నిర్మాతలు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు. -
సూపర్ గర్ల్స్!
ఊ.. ల.. లా.. ఊ.. ల.. లా...అంటూ కథానాయికలు చెట్లు చుట్టూ తిరుగుతూ పాడాల్సిందేనా? హీరోలతో రొమాంటిక్ సీన్స్...కామెడీ ట్రాక్‌లో ఎంతో కొంత పార్ట్...పాటల్లో గ్లామరస్‌గా కనిపించడం..ఇంతేనా? హీరోయిన్ల క్యారెక్టర్లు ఇంతేనా?ఇంతకు మించి యాక్టింగ్‌కి స్కోప్ ఉండదా? సినిమాలో ఇంపార్టెంట్ స్పేస్ ఉండదా? ఈ క్వొశ్చన్స్కి ఫుల్స్టాప్ పడిపోయినట్లే..ఇప్పుడు ‘లేడీ ఓరియంటెడ్ మూవీస్’ పెరిగాయి.కథానాయికలూ సినిమాని మోయగలుగుతున్నారు. ‘సూపర్ గర్ల్స్’ అని నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం సౌత్, నార్త్‌లో.. కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాల డజనుకు పైనే ఉన్నాయి. తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల జోరు ఎక్కువ. స్టార్ హీరోతో మాంచి మసాలా సినిమా తీస్తే, ‘సేఫ్’. ఇది కొంతవరకూ నిజం. అయితే ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పొచ్చింది. బాగున్న ప్రతి సినిమానీ ఆదరిస్తున్నారు. అందుకే, దర్శక–నిర్మాతలు కొత్త ప్రయత్నాలు చేయడానికి వెనకాడటంలేదు. ఈ క్రమంలోనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ పెరిగాయి. ఫ్రమ్ ‘అరుంధతి’ ఈ జోరు ఎక్కువైందనే చెప్పాలి. లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్ ‘అరుంధతి’ (2009)లో అనుష్క అభినయం, ఆహార్యం చూశాక లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే తనే చేయాలన్నంతగా చాలామంది ఫిక్సయ్యారు. గడచిన ఎనిమిదేళ్లల్లో ‘పంచాక్షరి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారీ బొమ్మాళి. ప్రస్తుతం చేసిన మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘భాగమతి’ విడుదలకు సిద్ధమవుతోంది. షాకిచ్చిన త్రిష అదేంటో కానీ... కొంతమంది ‘ఇక పనైపోయంది’ అనుకున్నప్పుడు ఎగిసి పడే అల అయిపోతారు. త్రిషను ఈ జాబితాలోకే చేర్చవచ్చు. దాదాపు పదిహేనేళ్లు దాటాయి త్రిష కథానాయిక అయి. కొత్త కథానాయికలు వచ్చేస్తున్నారు.. త్రిష వెనక్కి తగ్గాల్సిందేనని కొంతమంది అనుకుంటున్న సమయంలో ఐదారు సినిమాలు సైన్ చేసి, షాకిచ్చారు. వాటిలో ‘1818’, ‘పరమపదమ్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. కాజల్ – తమన్నా కూడా... దాదాపు గ్లామరస్ రోల్స్‌కి పరిమితమైన కాజల్ అగర్వాల్, తమన్నాలకు కూడా ఈ ఏడాది ‘క్వీన్’ రూపంలో మంచి చాన్స్ వచ్చింది. హిందీ ‘క్వీన్’ రీమేక్‌లో ఈ ఇద్దరూ నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు ‘క్వీన్’లో తమన్నా, తమిళంలో కాజల్ చేస్తున్నారు. ‘క్వీన్’ విడుదలయ్యాక ఈ ఇద్దరికీ మరిన్ని హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేసే చాన్సులు వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌లోనూ స్కోప్ ఉన్నంతవరకూ ఇద్దరూ బాగానే నటించారు. నయనతార.. ఓ సెన్సేషన్ ‘చంద్రముఖి’ నయనతారకూ ఇప్పుడు నయనతారకూ అస్సలు సంబంధం లేదు. స్లిమ్‌గా తయారై, అందర్నీ ఆశ్చర్యపరిచారు. సీన్ డిమాండ్ చేస్తే బికినీ వేసుకోవడానికి కూడా వెనకాడలేదు. తమిళ ‘బిల్లా’లో బికినీలో దర్శనమిచ్చిన అదే నయనతార ‘శ్రీరామరాజ్యం’లో సీతగా ‘భేష్’ అనిపించుకున్నారు. ఆ సినిమాతో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సూట్ అవుతానని నిరూపించుకున్నారు. ‘మాయ’తో నయన లేడీ ఓరియంటెడ్ మూవీస్ క్లబ్‌లోకి అడుగుపెట్టారు. అంతకుముందు మలయాళంలో ‘ఎలక్ట్రా’ అనే కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా చేసినా, ‘మాయ’ ఆమెను మరో ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమా తర్వాత ‘డోర’ చేశారు. మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘ఆరమ్’ విడుదలకు రెడీ అయింది. ఈ గ్యాప్‌లో తెలుగులో ‘అనామిక’ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చేతిలో అరడజను సినిమాలు ఉంటే వాటిలో మూడు తమిళ సినిమాలు ‘కొలైయుదిర్ కాలమ్’, ‘కోలమావు కోకిల’, ‘ఇమైక్క నొడిగళ్’ కథానాయిక ప్రాధాన్యంగా సాగేవే. క్వీన్ హవా! ‘క్వీన్’ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కి సూట్ అవుతానని కంగనా రనౌత్ నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘మణికర్ణిక’ చేస్తున్నారామె. ‘ఏక్ నిరంజన్’ తర్వాత తెలుగులో కంగనా చేస్తోన్న సినిమా ఇది. హిందీలోనూ రూపొందుతోంది. ఈ సినిమా కోసం కంగనా కత్తి సాము నేర్చుకున్నారు. హార్స్ రైడింగ్ కూడా నేర్చేసుకున్నారు. దిశా.. ఫ్రమ్ మోడ్రన్ టు హిస్టారికల్ దిశా పాట్నీ.. చేసిన సినిమాల సంఖ్య జస్ట్ ఫోర్. పైగా.. అన్నీ మోడ్రన్ క్యారెక్టర్సే. ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ ‘సంఘమిత్ర’లో చాన్స్ కొట్టేశారు. పైగా హిస్టారికల్ మూవీ. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్. ముందు ఈ సినిమాలో శ్రుతీహాసన్‌ని అనుకుని, ఆమె తప్పుకున్నాక దిశాని తీసుకున్నారు. ఈ సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నారు దిశా. అప్ కమింగ్ హీరోయిన్‌కి ఈ సినిమా కత్తి మీద సామే. కానీ, దిశా సవాల్‌గా తీసుకున్నారు. గెలుస్తారు కూడా. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే కదా. ఇంకా.. కథానాయికలే ‘హీరో’ అయి, చేసిన జాబితాలో అంజలి ఒకరు. ఆమె ‘గీతాంజలి’ చేసిన విషయం తెలిసిందే. సౌత్‌లో 50 సినిమాలు చేశాక రాయ్ లక్ష్మీకి బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘జూలీ–2’లో చాన్స్ వచ్చింది. తాప్సీ కూడా అక్కడ ‘పింక్’, ‘నామ్ షబానా’ అనే సినిమా కూడా చేశారు. ఆ మాటకొస్తే.. బాలీవుడ్‌లోనూ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువయ్యాయి. విద్యాబాలన్ ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యంగా సాగే సినిమాలు చేస్తుంటారు. ఇప్పటివరకూ ‘ది డర్టీ పిక్చర్’, ‘కహానీ’, ‘బాబీ జాసూస్’, ‘కహానీ–2’, ‘బేగమ్’ జాన్ వంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం ‘తుమ్హారీ సులు’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొనె ‘పద్మావతి’గా రాబోతున్నారు. అనుష్కా శర్మ ‘పరీ’ అనే సినిమా చేస్తున్నారు. ‘సాహో’తో తెలుగుకి పరిచయమం కానున్న శ్రద్ధాకపూర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథతో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు. కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖా తల్సానియా కాంబినేషన్లో ‘వీరీ ది వెడ్డింగ్’ అనే ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ రూపొందుతోంది. అటు కన్నడ వైపు వెళితే ‘క్వీన్’ రీమేక్‌లో పారుల్ యాదవ్, మలయాళం ‘క్వీన్’లో మంజిమా మోహన్ చేస్తున్నారు. ఇంకా సౌత్ టు నార్త్... లేడీ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని సెట్స్‌లో ఉన్నాయి. తగ్గేది లేదంటున్న శ్రీదేవి యంగ్ హీరోయిన్స్ గురించి చెప్పాం.. సీనియర్ నటి శ్రీదేవిని కూడా లిస్ట్‌లో చేర్చాలి. ‘ఇంగ్లిష్–వింగ్లిష్’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, ఇటీవల ‘మామ్’ చేశారామె. తగ్గేది లేదు. కథాబలమున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలనుకుంటున్నారు. నాలుగేళ్లకే మహానటి! దాదాపు పదేళ్లు ఎక్స్పీరియన్స్ ఉన్న కథానాయికకు లేట్‌గా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కి చాన్స్ వస్తే.. జస్ట్ మూడు నాలుగేళ్ల కెరీర్ ఉన్న కీర్తీ సురేశ్‌కి ఆ అవకాశం రావడం విశేషం. అది కూడా అందాల అభినేత్రి సావిత్రి జీవిత కథలో నటించే చాన్స్ అంటే కీర్తీ సురేశ్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే. కానీ, అది పెద్ద బాధ్యత అండీ బాబు. ఇప్పుడు అందరి కళ్లూ ‘మహానటి’ పైనే. సావిత్రిగా కీర్తీ సురేశ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? టోటల్‌గా నటన ఎలా ఉంటుంది? అనేది చూడ్డానికి రెడీగా ఉన్నారు. కీర్తీ అందరి మనసు గెలుచుకుంటుందని ఊహించవచ్చు. ఎందుకంటే, ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి ప్రశంసలు లభించాయి. అదీ బాస్.. చాన్స్ ఇచ్చి చూడండి.. హీరోయిన్లు తడాఖా చూపిస్తారు. – డి.జి. భవాని -
ఎందుకు మారాలి?
ఆడపిల్లకు పాతికేళ్లొస్తే చాలు... పెళ్లి కాకపోతే టెన్షన్. అసలు వయసుకీ పెళ్లికీ లింకేంటి? ఆ మాటకొస్తే... వయసుకీ కెరీర్‌కీ లింకేంటి? ముఖ్యంగా హీరోయిన్లు థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉంటే.. రిటైర్ అవ్వాల్సిందేనా? సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మారాల్సిందేనా? ఏం...? 30 ఏళ్లు దాటితే హీరోయిన్లుగా పనికి రారా? అక్క–వదిన–అమ్మ పాత్రలకు మారాల్సిందేనా? అవసరం లేదంటున్నారు కొందరు కథానాయికలు. మెయిన్లీ థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతార... ఈ నలుగురూ హీరోయిన్లుగానే దూసుకెళుతున్నారు. ‘నో ఏజ్ లిమిట్ ఫర్ హీరోయిన్స్’ అని ప్రూవ్ చేస్తున్నారు. ఫిల్మ్ వరల్డ్ ఎంతమందినైనా వెల్కమ్ చేస్తుంది. అందరికీ చోటుంటుంది. లక్ ఫేవర్ చేస్తే... చాన్సులు ఈజీగానే వచ్చేస్తాయి. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే బెర్త్ కన్ఫార్మ్.. కొత్తవాళ్లొస్తే సీనియర్లు తప్పుకోవాలా? ‘నో... నో’. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేదు. ఎవరి అవకాశాలు వాళ్లకుంటాయి. అందుకే పదీ పదిహేనేళ్లకు పైగా హీరోయిన్లుగా కొనసాగుతోన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతారలకు చాన్సులు తగ్గలేదు. జోరుగా.. హుషారుగా సినిమాలు చేస్తున్నారు. నలుగురిలో ఏదో సమ్మోహన శక్తి ఉంది. రోజు రోజుకీ ఈ నలుగురిలో అందం మరింత పెరుగుతోంది. వయసు అంతకంతకూ తగ్గుతోంది. శ్రియ సంగతికొస్తే... కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో నటించారు. ఆ తర్వాత స్పెషల్ సాంగులు, ‘పవిత్ర’ వంటి బోల్డ్ మూవీస్ చేశారు. ఇక, శ్రియ పనైపోయిందనుకుంటున్న టైమ్‌లో... ‘మనం’తో మళ్లీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చారు. ఓ రకంగా ఇది శ్రియకు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలేమో! ఈ ఇన్నింగ్స్‌లో ‘గోపాల గోపాల, దృశ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి నటనకు ఆస్కారమున్న సినిమాలతో పాటు పక్కా కమర్షియల్ ‘పైసా వసూల్’ వంటివీ చేశారు. ప్రస్తుతం తమిళంలో ‘నరగసూరన్’, తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలతో బిజీగా ఉన్నారు. నయనతార సంగతి చూస్తే... తెలుగులో పక్కా కమర్షియల్ సిన్మాలు చేస్తూ, మధ్యలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా అభినయించి, తనలో మంచి పెర్ఫార్మర్ ఉందని నిరూపించుకున్నారు. ఇక, తమిళంలో అయితే లేడీ ఓరియెంటెడ్ సిన్మాలకు ఓటేస్తున్నారు. అవెలాగో తెలుగులో డబ్బింగ్ అవుతాయనుకోండి! దీంతో గ్లామర్‌తో పాటు యాక్టింగ్ గ్రామర్‌ను కవర్ చేసేస్తున్నారు. ఆమె నటించిన ‘ఆరమ్’ విడుదలకు రెడీ అవుతోంది. చేతిలో ‘వేలైక్కారన్’, ‘ఇమైక్క నొడిగళ్’, ‘కొలయుదిర్ కాలమ్’, ‘కో కో’ వంటి సినిమాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ‘జయసింహ’లో తనే హీరోయిన్. అలాగే, చిరంజీవి ‘సైరా’ కూడా కమిట్ అయ్యారు. త్రిష, నయన, శ్రియలతో పోల్చితే అనుష్క అంత బిజీగా లేరు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భాగమతి’ మాత్రమే ఉంది. ఈ బొమ్మాళికి బోలెడన్ని అవకాశాలు వస్తున్నా.. ఎందుకనో ఒప్పుకోవడంలేదట. అరుందతి, బాహుబలి. రుద్రమదేవి, తాజా ‘భాగమతి’ వంటి సినిమాలు చేశాక... ఇకపై కూడా మంచి సినిమాల్లోనే కనిపించాలని అనుకుంటున్నారట. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నారు. త్రిష అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశారు. కానీ, కథానాయికగా 50 సిన్మాలు పూర్తయ్యాక కాస్త రూటు మార్చారు. లేడీ ఓరియెంటెడ్ సిన్మాలపై దృష్టి పెట్టారు. ‘సదురంగ వేటై్ట–2’, ‘1818’, ‘96’ సినిమాలు చేస్తున్నారు. ‘హే జ్యూడ్’ అనే చిత్రం ద్వారా మలయాళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. 15 ఏళ్ల కెరీర్ తర్వాత ఇప్పుడు వేరే భాషలో చాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు... తమిళ పొన్ను తడాఖా అది. సినిమా సెలక్షన్‌ను పక్కన పెడితే... ముగ్గురిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది అందం గురించి! వీళ్లు చిత్రసీమలోకి వచ్చి పదేళ్లు దాటిందనీ, వీళ్లకు 30 ఏళ్లు వచ్చేశాయనీ గుర్తు చేస్తే తప్ప గుర్తు రానంతగా వయసును దాచేస్తున్నారు. 15 ఇయర్స్... ఈజ్ రియల్లీ సమ్‌థింగ్! మనం చూస్తూనే ఉండాలి గానీ... ఇంకో పదిహేనేళ్లు నటిస్తూనే ఉంటారు. చూస్తుందాం బాస్... హాలీవుడ్లో థర్టీ, ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ ఏజ్ లోనూ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇండియన్ హీరోయిన్ల కెరీర్‌కి కూడా అంత లాంగ్విటీ ఉంటే ఏం పోతుంది? వయసు తెచ్చే పరిణతి, కెరీర్ తెచ్చిన అనుభవంతో మంచి మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటారు. ఏమంటారు? -
అందంగా చూపేందుకు ఐదు కోట్లు
సినిమాలో అందం ఒక భాగం. ముఖ్యంగా హీరోయిన్ పాత్రల్లో అభినయానికి ఎంత స్కోప్ ఉన్నా అందం ఉండేలా జాగ్రత్తపడుతుంటారు దర్శక నిర్మాతలు. ఇక అగ్ర కథానాయకి అనుష్క విషయానికి వస్తే మందం ఆమెకు ఒక శాపంగా మారిందనే అనాలి. ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరో సైజ్) చిత్రాన్ని ఏ ముహూర్తాన అంగీకరించిందో గానీ, ఆ చిత్ర ఎఫెక్ట్ ఈ బ్యూటీని వెంటాడుతూనే ఉంది. ఆ చిత్రంలోని పాత్ర కోసం బరువెక్కిన అనుష్క ఆ తరువాత తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారట. బాహుబలి చిత్రంలో అనుష్క లావుగా కనిపించినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అందులో హీరోకి తల్లిగా కనిపిస్తారు కాబట్టి. బాహుబలి–2కి వచ్చే సరికి అనుష్క బరువు గ్రాఫిక్స్ ద్వారా తగ్గించడానికి దర్శకుడు రాజమౌళి కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ చిత్రం తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం భాగమతి. ఈ చిత్రానికి ఆ అమ్మడి బరువు భారంగా మారిందన్నది తాజా సమాచారం. అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఎట్టకేలకు వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అయితే భాగమతి చిత్రంలో అ నుష్క బరువును తగ్గించి అందంగా చూపించడానికి రూ.5 కోట్ల వరకూ గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేస్తున్నారట. ఈ గ్రాఫిక్స్ పని ముంబైలో ముమ్మరంగా జరుగుతోందని సమాచారం. అనుష్కకు పారితోషికం అదనంగా అందంగా చూపించడానికో రూ.5 కోట్లు కలిసి నిర్మాతకు తడిసిమోపెడు అవుతోందని చిత్ర వర్గాలు అంటున్నట్లు మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. -
ఉత్తిదే!
‘ఇకనుంచి నో గ్యాప్. కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తా’’ అని ఆ మధ్య ప్రభాస్ తన అభిమానులకు ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి గుమ్మడికాయ కొట్టగానే ప్రభాస్ కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందట. ఫిబ్రవరికల్లా ‘సాహో’ పూర్తవుతుందట. అంతా ఓకే.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ఓ వార్త హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ‘సాక్షి’తో ప్రభాస్ సన్నిహితులు పేర్కొన్నారు. సో.. పెళ్లి వార్త ఉత్తుత్తిదే. -
అనుష్కకు నిశ్చితార్ధమా ?
తమిళసినిమా: అందాల అపరంజి బొమ్మ నటి అనుష్క పెళ్లికి సిద్ధమవుతోంది. వివాహ నిశ్చితార్థానికి ముహూర్తం కుదిరింది లాంటి ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నా, తాజాగా ఇంకాస్త బలంగా వినిపిస్తోంది. బాహుబలి–2 చిత్రం తరువాత అనుష్క ఒక్క కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు.ఆ చిత్ర సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రాన్నే ఇటీవల పూర్తి చేసింది. ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాహుబలి పార్టు–1, పార్టు–2 చిత్రాల్లో ప్రభాస్‌కు జంటగా నటించింది. ఈ రెండు చిత్రాల చిత్రీకరణే దాదాపు నాలుగైదేళ్లు పట్టింది. అయితే మధ్యలో ఇంజి ఇడుప్పళగి (తెలుగులో సైజ్ జీరో) చిత్రం కోసం తన బరువును భారీగా పెంచి నటించిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి నానా తంటాలు పడక తప్పలేదు. బాహుబలి–2 చిత్రంలో కూడా ఆ ఎఫెక్ట్ పడింది.అనుష్కను ఆ చిత్రంలో స్లిమ్‌గా చూపించడానికి ఆ చిత్ర వర్గాలు పెట్టిన ఖర్చు కోట్లలోనేనని ప్రచారం జరిగింది. ఏదైతేనేమి ఎక్సర్సైజ్, జిమ్, యోగా వంటి కసరత్తులతో ఇప్పటికి అనుష్క తిరిగి అందగత్తెగా తయారైంది. వదంతుల హోరు బహుబలి చిత్ర హీరో ప్రభాస్‌తో అనుష్క సన్నిహితం, చెట్టా పట్టాలు, ప్రేమ అంటూ రకరకాల వదంతులు చాలా కాలంగానే హోరెత్తుతున్నాయి. ఈ ప్రేమ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం హల్చల్ చేసింది. ఇలాంటి ప్రచారాలపై అనుష్క మౌనం వహించినా, ప్రభాస్ మాత్రం ఖండించారు. ప్రభాస్‌కు ఆయన కుటుంబసభ్యులు పెళ్లి ప్రయత్రాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్, అనుష్కల పెళ్లి చేసుకోవడం ఖాయం అని పెళ్లి నిశ్చితార్థం డిసెంబర్లో జరగనుందనే ప్రచారం మళ్లీ మొదలైంది. అంతే కాదు అనుష్క బరువు తగ్గి స్లిమ్‌గా మారడానికి కారణం సినిమాల్లో నటించడానికి కాదని, పెళ్లి కోసమేనని టాక్ వినిపిస్తోంది. అనుష్క నటించాలంటే ఆమెకున్న క్రేజ్‌కు అవకాశాలు వరుస కట్టేవని, వస్తున్న అవకాశాలను తను నిరాకరిస్తుందనే మాట వినిపిస్తోంది. ఈ విషయం గురించి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ చిర్రుబుర్రులాడుతున్నారట. పెళ్లి అనేది తన వ్యక్తిగతం అని, దాని గురించి అడిగితే తనకు చిరాకు పుడుతుందని, నిజంగా పెళ్లి కుదిరితే అందరికీ చెబుతానని అంటున్నారట. వీరి పెళ్లి గురించి అడిగితే చిరాకు పడుతున్నాడట. ఇంతకీ ప్రభాస్, అనుష్కలకు డిసెంబర్లో వివాహ నిశ్చితార్థం అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాంట్లో నిజం ఎంత? ఎప్పటిలానే ఇదీ ఫేకేనా? రియల్ ఏమిటన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అనుష్క చేతిలో సినిమాలు లేకపోయినా, ప్రభాస్ మాత్రం సాహో చిత్రంతో చాలా బిజీగా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ అంటూ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ నటిస్తోంది. -
దుస్తుల యాడ్‌లో ’విరుష్క’
సాక్షి, హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మల ప్రేమాయణం అందరికి తెలిసిందే. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ విరుష్కజంట. అయితే వారి వాణిజ్య ప్రకటనలైనా, వ్యకిగత విషయాలనైన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే ఈ జంట ఓ విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. భారత్‌లో రాబోయే పండుగ సీజన్ల సందర్భంగా ఓ దుస్తుల కంపెనీ యాడ్‌లో విరుష్క జంట నటించింది. ఈ విషయాన్నిఈ ఇద్దరూ రహస్యంగా ఉంచారు. ఫిల్మ్‌ఫేర్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ అనుష్కశర్మ, విరాట్ కోహ్లిలు ఇప్పుడే ఓ యాడ్‌లో నటించారు.’ అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ తొలిసారి కలిసింది కూడా ఒక యాడ్ షూటింగ్‌లోనే.. 2013లో ఓ హేయిర్ షాంపో యాడ్‌లో వీరిద్దరూ తొలిసారి నటించారు. అనంతరం వీరిమధ్య ప్రేమ చిగురించింది. #AnushkaSharma and #ViratKohli just shot for an ad together! #Virushka all the way baby ❤️ A post shared by Filmfare (@filmfare) on Sep 12, 2017 at 10:18am PDT -
స్లిమ్‌గా స్వీటీ!
తమిళసినిమా: చేతిలో సొమ్ముంటే కొండపైన కోతి కూడా దిగివస్తుందనే నానుడి ఉంది. అలాంటిది నటి అనుష్కలాంటి టాప్ కథానాయికకు జిమ్ ఒక లెక్కా. ఏమిటీ అసందర్భ మాటలంటారా? నటనలో వైవిధ్యం కోసం తారలు ఆయా పాత్రలకు జీవం పోయడానికి సాధ్యమైనంత వరకూ కృషి చేస్తుంటారు. హీరోలైతే బరువు తగ్గడానికి, పెరగడానికి, సిక్స్ ప్యాక్ బాడీకి తయారవ్వడానికి శ్రమిస్తారు. హీరోయిన్లు మాత్రం అంతలా సాహసం చేయలేరు. ముఖ్యంగా బరువు పెరగడానికి సమ్మతించరు. ఎందుకంటే అందం వారికి చాలా ముఖ్యం. అలాంటిది నటి అనుష్క ఇంజిఇడప్పళగి(సైజ్ జీరో) చిత్రం కోసం మ్యాగ్జిమమ్ బరువు పెరిగి నటించారు. ఆ తరువాత తను బరువు తగ్గడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అనుష్క బరువు బాహుబలి 2 చిత్రానికి కూడా చాలా భారమైంది. ఆ చిత్రం తరువాత వచ్చిన కొన్ని అవకాశాలను అనుష్క తిరష్కరించిందట. కారణం తాను మళ్లీ మునుపటి అనుష్కలా అందంగా తయారైన తరువాత కొత్త చిత్రాలను అంగీకరిస్తానని చెప్పి బరువు తగ్గడానికి శారీరక కసరత్తులు చేయడం మొదలెట్టారు. అందుకు ఇంట్లోనే అధునాతనమైన జిమ్‌తో పాటు, ఒక శిక్షకుడిని నియమించుకున్నారు. రోజుకు 8 గంటల పాటు జిమ్‌లోనే గడుపుతూ శారీరక శ్రమతో పూర్వ అందాలతో చాలా స్లిమ్‌గా తయారయ్యారట. అంతకు ముందు తనతో చిత్రాలు చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతల్లో ఒకరిని ఇటీవల ఇంటికి రప్పించుకుని కథ చెప్పమని, ఆ కథ నచ్చడంతో నటించడానికి పచ్చజెండా ఊపారట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల టాక్. సో చిన్న విరామం తరువాత అనుష్క విజృంబణను చూడవచ్చునన్నమాట. అనుష్క ప్రస్తుతం నటిస్తున్న టాలీవుడ్ చిత్రం భాగమతి నిర్మాణాంతక కార్యక్రమాల్లో బిజీగా ఉందని సమాచారం. -
సైరాలో చిరూతో...
...నటించే ఛాన్స్ ప్రగ్యా జైస్వాల్ చెంతకు వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అదీ ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా! చిరంజీవి హీరోగా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందుతోన్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఇందులో ముగ్గురు నాయికలకు చోటుంది. అంటే... ఉయ్యాలవాడ జీవితంలో ముగ్గురు మహిళలు ప్రముఖ పాత్ర పోషించారట! అందులో ఒకరిగా నయనతారను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర పోరాటంలో ఉయ్యాలవాడకు చేదోడు వాదోడుగా నిలిచిన యోధురాలిగా ఆమె పాత్ర ఉండనుందట. మిగతా రెండిటిలో... ఒకటి యవ్వనంలో ఉయ్యాలవాడతో ప్రేమలో పడిన అమ్మాయి పాత్ర, ఇంకొకటి శక్తివంతమైన మహిళ పాత్ర అని తెలుస్తోంది. ఆ ప్రేమలో పడిన అమ్మాయి పాత్రకు ప్రగ్యాను తీసుకోవాలనుకుంటున్నారట. మరో పాత్రకు అనుష్క పేరు వినిపిస్తోంది! సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య తారాగణం! -
కౌన్ బనేగా డిఐజీ
తమిళసినిమా: దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న తారలిద్దరే అని చెప్పవచ్చు. అందులో ఒకరు నయనతార, మరొకరు అనుష్క అని గంటాపథంగా చెప్పవచ్చు. చిత్ర కథను తమ భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చగల సత్తా ఉన్న భామలు వీరు. నయనతార మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియెంటెడ్ నాయకిగా మారినా, అనుష్క మాత్రం అంతకు ముందే అరుంధతి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్ర సంచలన విజయానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ తరువాత ఈ ఇద్దరు బ్యూటీస్‌కు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార చేతిలో ఆ తరహా చిత్రాలు నాలుగైదు ఉన్నాయి. అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఇప్పుడీ ఇద్దరిలో కౌన్ బనేగా డీఐజీ అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. విషయం ఏమిటంటే యథార్థ సంఘటనల ఇతివృత్తాలతో చిత్రాలు చేసే దర్శకుడిగా పేరొందిన వ్యక్తి ఏఎంఆర్.రమేశ్. ఆ మధ్య రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో చిత్రం, బాబ్రీమసీద్ ఇతి వృత్తంతో మరో చిత్రం తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వాసికెక్కారు. తాజాగా కర్ణాటక డీఐజీ రూప ఇతివృత్తంతో చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. డీఐజీ రూప అనగానే అన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్న శశికళ ఖైదీ జీవితం గుర్తుకు వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం కర్ణాటకలో జైలు జీవితాన్ని గడుపుతున్న శశికళ ఆక్కడి జైల్లో ఆడంబర జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని డీఐజీ రూప ఆధారాలు సహా బట్టబయలు చేసి పెద్ద కలకలానికే దారి తీసిన విషయం తెలిసిందే. జైలు అధికారి సత్యనారాయణ రూ.2 కోట్ల లంచం తీసుకుని శశికళకు వీఐపీ వసతులు కల్పించారని ఆరోపణలు చేశారు. ఫలితంగా రూప బదిలీకి గురయ్యారు. అయితే డీఐజీ రూప విధి నిర్వహణకు, కర్తవ్య దక్షణకు ఈ సంఘటన ఒక్కటే కాదు అంతకు ముందు కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మెడల్‌ను అందుకున్న రూప జీవిత సంఘటనలతో దర్శకుడు ఏఎంఆర్.రమేశ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు డీఐజీ రూప కూడా అనుమతి ఇచ్చారట.ఇక ఆమె పాత్రలో నటించే నటీమణులు ఎవరన్న అంశంలో ఆయన కళ్ల ముందు కదలాడిన తారలు నయనతార, అనుష్కలేనట. వారిలో ఒకరిని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్ వర్గాల సమాచారం. మరి నయనతార, అనుష్కలలో కౌన్ బనేగా డీఐజీ అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
వీరిలో ‘డీఐజీ రూప’ ఎవరు?
చెన్నై: దక్షిణాదిలో అగ్ర కథానాయికలుగా రాణిస్తున్న నయనతార, అనుష్క అని గంటాపథంగా చెప్పవచ్చు. చిత్ర కథను తమ భుజాలపై వేసుకుని విజయతీరానికి చేర్చగల సత్తా ఉన్న భామలు వీరు. నయనతార మాయ చిత్రంతో హీరోయిన్ ఓరియంటెడ్ నాయకిగా మారినా, అనుష్క మాత్రం అంతకు ముందే అరుంధతి చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించి ఆ చిత్ర సంచలన విజయానికి ప్రధాన కారణంగా నిలిచారు. ఈ ఇద్దరినీ ఇటీవల నాయిక ప్రధాన కథా చిత్రాల అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార చేతిలో ఆ తరహా చిత్రాలు నాలుగైదు ఉన్నాయి. అనుష్క భాగమతి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా, ఈ ఇద్దరిలో కౌన్ బనేగా డీఐజీ అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. విషయం ఏమిటంటే యధార్ధ సంఘటనల ఇతి వృత్తాలతో చిత్రాలు చేసే దర్శకుడిగా పేరొందిన వ్యక్తి ఏఎంఆర్ రమేశ్. ఆ మధ్య రాజీవ్‌గాంధీ హత్య నేపథ్యంలో చిత్రం, బాబ్రీమసీద్ ఇతి వృత్తంతో మరో చిత్రం తెరకెక్కించి సంచలన దర్శకుడిగా వాసి కెక్కారు. తాజాగా కర్ణాటక డీఐజీ రూప ఇతి వృత్తంతో చిత్రం చేయడానికి సిద్దం అయ్యారు. డీఐజీ రూప అనగానే అన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్న శశికళ ఖైదీ జీవితం గుర్తుకు వస్తుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రస్తుతం కర్ణాటకలో జైలు జీవితాన్ని గడుపుతున్న శశికళ ఆక్కడి జైలులో ఆడంబర జీవితాన్ని అనుభవిస్తున్న విషయాన్ని డీఐజీ రూప ఆధారాలతో సహా బట్టబయలు చేసి పెద్ద కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. జైలు అధికారి సత్యనారాయణ రూ.2 కోట్లు లంచం తీసుకుని శశికళకు వీఐపీ వసతులు కల్పించారని ఆరోపణలు చేశారు. ఫలితంగా రూప బదిలీకి గురయ్యారు. అయితే, డీఐజీ రూప విధి నిర్వహణకు, కర్తవ్య దక్షణకు ఈ సంఘటన ఒక్కటే కాదు అంతకు ముందు కూడా చాలా అంశాలు ఉన్నాయి. రాష్ట్రపతి నుంచి మెడల్‌ను అందుకున్న రూప జీవిత సంఘటనలతో దర్శకుడు ఏఎంఆర్.రమేశ్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు డీఐజీ రూప కూడా అనుమతి ఇచ్చారట. ఇక ఆమె పాత్రలో నటించే నటీమణులు ఎవరన్న అంశంలో ఆయన కళ్ల ముందు కదలాడిన తారలు నయనతార, అనుష్కలేనట. వారిలో ఒకరిని ఈ చిత్రంలో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు దర్శకుడు రమేశ్ వర్గాల సమాచారం. మరి నయనతార, అనుష్కలలో కౌన్ బనేగా డీఐజీ అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఎవర్ గ్రీన్ మన్మథుడికి బర్త్ డే విషెస్
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజు గారి గది 2 షూటింగ్ లో ఉన్న నాగ్ కు పుట్టిన రోజు కానుకగా చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేయనుంది. నాగార్జున హీరో భక్తిరస చిత్రాలను అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'మా ఎవర్ గ్రీన్ గ్రీకువీరుడు, ఏ పాత్రనైనా చేయగల ఘరానా బుల్లోడు, అందరిని మెప్పించగల రామదాసు, నాగార్జున కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. నాగ్ వెండితెరకు పరిచయం చేసిన యోగా బ్యూటి అనుష్క, మంచు హీరోలు మనోజ్, విష్ణులతో పాటు ప్రస్తుతం నాగ్ హీరోగా తెరకెక్కుతున్న రాజు గారి గది 2 నిర్మాతలు కూడా సోషల్ ట్విట్టర్ ఫేస్ బుక్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. Wishing a Very Happy Birthday to one and only king @iamnagarjuna garu, the smartest man ever! -
జేజమ్మకు పెళ్లి కళ వచ్చిందా?
తమిళసినిమా: పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఒక వేడుకే కాదు, అది మధురమైన, మమతల అల్లికతో కూడిన బంధం కూడా. అలాంటి గడియలు వస్తే ఆపడం ఎవరి తరం కాదు. అయితే ఈ విషయంలో సినిమా వాళ్లపై మీడియా కాస్త అత్యుత్సాహం చూపిస్తుందనడం వాస్తవమే. అలా చాలా మంది తారల మాదిరిగానే నటి అనుష్క ప్రేమ, పెళ్లి గురించి చాలా ప్రచారం జరుగుతోంది. బాహుబలి చిత్ర షూటింగ్ సమయం నుంచి ఆ చిత్ర హీరో ప్రభాస్‌తో ప్రేమ కలాపాలంటూ అనుష్క గురించి ప్రచారం జరుగుతోంది. ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అవన్నీ వదంతులంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. అంతే కాదు తన గురించి ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని, మీరు అనుకుంటున్న నటిని తాను పెళ్లి చేసుకోవడం లేదని నటుడు ప్రభాస్ ఇటీవల ఒక భేటీలో కుండబద్దలు కొట్టారు. ఇక నటి అనుష్క విషయానికొస్తే బాహుబలి–2 చిత్రం తరువాత కొత్త చిత్రాలను అంగీకరించలేదు.అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కానున్నట్లు సమాచారం. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి (సైజ్ జీరో) చిత్రం కోసం లావెక్కిన అనుష్క ఆ బరువును తగ్గించుకోవడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. తాజాగా యోగా, ఇతర వర్కౌట్స్ చేసి ఎట్టకేలకు మళ్లీ స్లిమ్‌గా తయారయ్యారట. అయినా కొత్త చిత్రాలు అంగీకరించకపోవడంతో అమ్మడు పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే ఆ తీపి కబురు వినే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్. కాగా ఈ ప్రచారాన్ని అనుష్క ఖండించకపోవడం గమనార్హం. -
కోలీవుడ్‌లో ఓం నమో వేంకటేశాయా
తమిళసినిమా: ఓం నమో వెంకటేశాయ చిత్రం బ్రహ్మాండ నాయకన్ పేరుతో తమిళ పేక్షకుల ముందుకు రానుంది. అక్కినేని నాగార్జున వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీరాం బాబాజీగానూ, తనను ఆండాళ్గా భావించుకునే పాత్రలో నటి అనుష్క, శ్రీకృష్ణుడిగా హిందీ నటుడు సౌరభ్‌జైన్ ప్రధాన పాత్రలు పోషించిన తెలుగులో మంచి విజయాన్ని సాధించిన భక్తిరసా కథా చిత్రం ఓం నమో వేంకటేశాయ. శతాధిక చిత్రాల ప్రఖ్యాత దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఇందులో నటి ప్రగ్యాజైస్వాల్, జగపతిబాబు, బ్రహ్మానందం, సాయికుమార్, సంపత్ నటీనటులు నటించారు. బాహుబలి వంటి పలు విజయవంతమైన చిత్రాలకు పని చేసిన కీరవాణి ( తమిళంలో మరగదమణి) సంగీతాన్ని అందించారు. ఇది భగవంతుడికి, భక్తుడికి మధ్య బంధాన్ని ఆవిష్కరించే చిత్రం. రామ అనే భక్తుడు హథీరాంగా ఎలా మారాడు. తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చింది, ఆనందనిలయం అనే పేరు రావడానికి కారణం ఏమిటి, తిరుమలలో బ్రహ్మాండ నాయకుడికి ఎవరు తొలి అర్చన చేయాలి లాంటి చాలా మందికి తెలియని దైవ విశేషాలను ఆవిష్కరించే చిత్రంగా ఓం నమో వేంకటేశాయ చిత్రం ఉంటుంది. ఇది భక్తిరస కథా చిత్రమే అయినా ఈ తరం ప్రేక్షకులను అలరించే జనరంజక అంశాలతో అత్యంత ఆధునికి సాంకేతిక పరిజ్ఞానంతో తరకెక్కించిన చిత్రం. ఇంతకు ముందు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తిరస కథా చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన నాగార్జున ఈ చిత్రంలో హథీరాం బాబాజీగా ఆ పాత్రకు జీవం పోశారు. బాహుబలి సిరీస్ చిత్రాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన నటి అనుష్క ఓం నమో వేంకటేశాయ చిత్రంలో వేంకటేశ్వరస్వామిని అమితంగా ఆరాధించి, ప్రేమించే ఆండాళ్దేవిగా తనదైన ముద్రవేసుకున్నారు. ఈ చిత్రాన్ని జోషికా ఫిలింస్ పతాకంపై ఎస్.దురైమురుగన్,బి.నాగరాజన్ బ్రహ్మాండనాయగన్ పేరుతో తమిళంలోకి అనువధిస్తున్నారు. దీనికి మాటలు, పాటలను డీఎస్.బాలాగన్ అందిస్తున్నారు. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఐటం సాంగ్‌కు 2సీ!
తమిళసినిమా: నటి అనుష్క సింగిల్ సాంగ్‌కు రూ. 2 కోట్లు పారితోషికం పుచ్చుకుంటున్నారా? దీనికి అవుననే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా విరాజిల్లుతున్న నటి అనుష్క.అయితే బాహుబలి–2 చిత్రం తరువాత ఆ సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రం మినహా అమ్మడి చేతిలో చిత్రాలు లేవు. దీంతో అంతగా ప్రపంచ సినిమాను తిరిగి చూసేలా చేసిన చిత్రం తరువాత అనుష్కకు అవకాశాలు రావడం లేదా అంటే వచ్చిన వాటిని అనుష్కనే అంగీకరించడం లేదనే సమాధానం చిత్ర వర్గాల నుంచి వస్తోంది. దీంతో ఈ అమ్మడి గురించి రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. అందులో ఒకటి పెళ్లి. అనుష్కకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కుదిరితే త్వరలోనే అనుష్క ఇంట పీపీపీ..డుండుండుమ్మేననే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే అనుష్క ఇటీవల గుళ్లు, గోపురాలు అంటూ చుట్టేశారు. తాజాగా అనుష్క ఒక టాలీవుడ్ చిత్రంలో సింగిల్‌సాంగ్ చేయడానికి సమ్మతించినట్లు, అది మహేశ్‌బాబు హీరోగా నటించనున్న భారత్ అనే నేను చిత్రం అని ప్రచారం హల్చల్ చేస్తోంది. అంతే కాదు ఈ పాటలో మహేశ్‌బాబుతో లెగ్‌షేక్ చేయడానికి అక్షరాలా రూ.2 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రసారం సాగుతోంది. అయితే అసలు మహేశ్‌బాబు తాజా చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదన్నది గమనార్హం. ఇంతకు ముందు కూడా నటి తమన్నా రెండు, మూడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌కు కోటి, రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారసుడు నటించిన జాగ్వర్ చిత్రంలో ఐటమ్‌సాంగ్ కోసం మిల్కీబ్యూటీ రెండు కోట్లు పుచ్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. -
సింగిల్ సాంగ్‌కు రూ.2కోట్లా..! ఎవరామె..?
హైదరాబాద్: దక్షిణాదిలో అగ్ర కథానాయికల్లో ఒకరుగా ఉన్న నటి అనుష్క. బాహుబలి -2 సమయంలో అంగీకరించిన భాగమతి చిత్రం మినహా ఈమెకు చేతిలో చిత్రాలు లేవు. బాహుబలి 2 చిత్రం తరువాత వచ్చని అవకాశాలను తిరస్కరిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. దీంతో ఈ అమ్మడి గురించి రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. అందులో ఒకటి పెళ్లి. అనుష్కకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ, కుదిరితే త్వరలోనే అనుష్క ఇంట పీపీపీ..డుండుండుమ్మేననే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే అనుష్క ఇటీవల గుళ్లు, గోపురాలు అంటూ చుట్టేశారు. తాజాగా అనుష్క ఒక టాలీవుడ్ చిత్రంలో సింగిల్‌సాంగ్ చేయడానికి ఒకే చేసినట్లు సమాచారం. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ చిత్రం అని ప్రచారం హల్ చల్ చేస్తోంది. అంతే కాదు ఈ పాటలో మహేశ్‌బాబుతో లెగ్‌షేక్ చేయడానికి అక్షరాలా రూ .2 కోట్ల పారితోషికాన్ని పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అన్నది పక్కన పెడితే ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అసలు మహేశ్‌బాబు తాజా చిత్రం ఇంకా ప్రారంభమే కాలేదన్నది గమనార్హం. ఇంతకు ముందు కూడా నటి తమన్నా రెండు, మూడు చిత్రాలలో ఐటమ్ సాంగ్‌కు కోటీ, రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ మధ్యనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వారసుడు నటించిన జాగ్వర్ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం మిల్కీబ్యూటీ రెండు కోట్లు పుచ్చుకున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ చిత్రంలో నేను పక్కాలోకల్ అంటూ డాన్స్‌లో ఇరగదీసిన కాజల్‌అగర్వాల్ కూడా అందుకు భారీ పారితోషికాన్నే పుచ్చుకున్నట్లు సమాచారం. -
హీరో లేడు... విలనూ లేడు!
... మరి ఎవరున్నారు? అంటే... హీరోలను మించిన హీరో, విలన్లను మించిన విలన్! ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘సాహో’. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ‘జస్ట్ హీరో బేస్డ్ ఫిల్మ్, విలన్ బేస్డ్ ఫిల్మ్’ అనేలా ఉండదట. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ సగటు కమర్షియల్ సినిమాల్లోని హీరోలతో పోలిస్తే... ‘అంతకు మించి’ అనేలా ఉంటుందట! నీల్ నితిన్ ముఖేశ్ క్యారెక్టర్ కూడా అంతేనట. ఎన్నో డిస్కషన్స్, ఎంతో రీసెర్చ్ తర్వాత ‘సాహో’లో ప్రభాస్ లుక్‌ను ఫైనలైజ్ చేశారు. టెక్నికల్‌గానూ ‘సాహో’ హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఇంటర్నేషనల్ టెక్నికల్ అండ్ యాక్షన్ టీమ్స్ ఈ సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా అనుష్కను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. -
'నా లవ్‌తో బ్రేక్ చాలా అవసరం'
న్యూయార్క్: ప్రేమ పక్షులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు న్యూయార్క్‌లో వాలాయి. న్యూయార్క్ నగర వీధుల్లోని గాలిలో ప్రేయసితో కలిసి తిరుగుతుండటం కోహ్లికి బాగా ఊరటనిస్తున్నట్లుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో వరుసగా మ్యాచ్‌లలో పాల్గొన్న విరాట్.. మచ్ నీడెడ్ బ్రేక్ విత్ మై లవ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్కతో కలిసివున్న ఓ ఫోటోను పోస్టు చేశాడు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు ‘విరుష్క’ చక్కటి జంట అంటూ లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. అనుష్క.. న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. జులై 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఐఫా ఈవెంట్ జరగబోతోంది. మరోవైపు విరాట్ వెస్టిండీస్ టూర్ ముగించుకుని అటు నుంచి యూఎస్ వచ్చినట్లు తెలుస్తోంది. -
ప్రభాస్‌తో ఐదోసారి..
తమిళసినిమా: సాహో చిత్రంలో నాయకి అనుష్కనేనా? అవుననే అంటున్నారు సినీవర్గాలు. బాహుబలి–2లో అమరేంద్ర బాహుబలి, దేవసేనల జంటను మనదేశమే కాదు ప్రపంచదేశాల ప్రేక్షకులు తెగ మెచ్చేశారు. అంతగా బహుళ ప్రాచుర్యం పొందిన ప్రభాస్, అనుష్కల జంట అంతకు ముందే బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా నిలిచారు. బాహుబలి–2తో ఈ జంట మళ్లీ కలిసి నటిస్తే బాగుండు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి–2 చిత్రం తరువాత ప్రభాస్ సాహో అనే త్రిభాషా(తమిళం, తెలుగు, హిందీ) చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలోనూ ఆయనకు జంటగా అనుష్క నటిస్తే బాగుంటుందని భావించిన వారు లేకపోలేదు. అయితే సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సాహో చిత్రంలో వేరే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది. బాలీవుడ్ బ్యూటీస్ సోనంకపూర్, అలియాభట్, పూజాహెగ్డేలతో చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ చిత్రంలో అనుష్కకు అవకాశం లేదేమో అనుకున్న వారికి శుభవార్త సాహో చిత్రంలో అనుష్కనే నాయకి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద ప్రభాస్, అనుష్క జంట ఐదోసారి జత కట్టనున్నారన్నమాట. మరి ఈ జంట మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అన్నది వేసి చూడాలి. -
ప్రభాస్‌తో మళ్లీ జతకట్టనున్న అనుష్క!
ప్రభాస్-అనుష్క జంట తెలుగు వెండి తెర మీద ఎవర్గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది. బాహుబలితో భారీ విజయాలను అందుకున్న ఈ జంట తాజాగా మరో సినిమాలో అలరించబోతోంది. యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అనుష్క.. ఇలా పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు. తాజాగా తమిళ సినీ విశ్లేషకుడైన రమేష్ బాలా సాహో చిత్రంలో హీరోయిన్గా అనుష్కను తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో తెరకెక్కుతోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
భాగమతి వచ్చేస్తోంది..!
కొంత కాలంగా తన లుక్స్‌తో ఆకట్టుకోలేకపోతున్న అనుష్క, మరో డిఫరెంట్ రోల్లో దర్శనమివ్వనుంది. దాదాపు ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న భాగమతి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిల్ల జమిందార్ ఫేం అశోక్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో భాగమతి సినిమాను తెరకెక్కిస్తుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమా లేడిఓరియంటెడ్ కథతో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి, బాలీవుడ్ బ్యూటీ టబులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంతవరకు రావాల్సినంత హైప్ మాత్రం రాలేదు. అందుకే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ లుక్‌తో పాటు రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. -
స్వీటీ బ్యాక్ టు యోగా
తమిళసినిమా: మనిషి మానసిక రుగ్మతలను దూరం చేసి అందాన్ని, ఆనందాన్ని పెంచేది యోగా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాన్ని పెంచడమే కాదు మందాన్ని తగ్గించే శక్తి యోగాకు ఉంది. ఈ విషయం నటి అనుష్కకు బాగా తెలుసు. మొదట్లో యోగా టీచర్ అయిన ఈ స్వీటీ ఆనక యాక్టర్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇంజి ఇడుప్పళగి (తెలుగులో జీరో సైజ్) చిత్రం కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తరువాత బహుబలి–2 చిత్రం కోసం తగ్గడానికి చేయని కసరత్తులు లేవట. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ భామను నాజూగ్గా ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి గ్రాఫిక్స్‌ను ఆశ్రయించక తప్పలేదు. అందుకు భారీ మొత్తాన్నే ఖర్చు చేశారట. కాగా ప్రస్తుతం అనుష్క చేతిలో భాగమతి అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. అదీ చిత్రీకరణను పూర్తి చేసుకుందని సమాచారం. కొత్త చిత్రాలను అంగీకరించకపోవడంతో అనుష్క పెళ్లికి సిద్ధం అవుతున్నారని, అందుకే నూతన చిత్రాలను ఒప్పుకోవడం లేదని ప్రచార మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. అసలు విషయం ఏమిటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో అనుష్క యోగానే శరణ్యంగా భావించి నటనను కొంతకాలం దూరంగా పెట్టి యోగాలో మునిగితేలనున్నారట. ఒక పక్క నటిస్తూ యోగాకు పూర్తిసమయాన్ని కేటాయించడం సాధ్యం కాకపోవడంతో అనుష్క ఈ నిర్ణయానికి వచ్చారట. ప్రభాస్ తాజా చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మనే నాయకి అని ప్రచారం జరుగుతున్నా, అధికారికపూర్వక ప్రకటన ఇంతవరకూ రాలేదు. ఇకపోతే యోగాకు కేటాయించిన కాలాన్ని పూర్తి చేసుకుని కొత్త అందాలతో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
బెస్ట్ ఛాయిస్ స్వీటీయేనా?
టాలీవుడ్లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న నటీనటుల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాలలో నటించారు. అవన్నీ విజయాలు సాధించడం విశేషమే. బిల్లా చిత్రంతో కలిసిన ఈ జంట బాహుబలి– 2 వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఈ క్రేజీ జంటపై ప్రేమ వదంతులకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మీడియాలో హోరెత్తుతోంది. ఇప్పటి వరకూ దక్షిణాదికే పరిమితం అయిన ప్రభాస్, అనుష్క క్రేజ్ బాహుబలి– 2తో ప్రపంచస్థాయికి చేరింది. ఇకపోతే బాహుబలి ఫీవర్ నుంచి బయట పడ్డ ప్రభాస్ సాహో చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది. ఇంతకు ముందు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికీ ఇందులో నటించే నాయకి ఎంపిక జరగలేదు. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. అయితే సాహో చిత్రంలో నటించడానికి బాలీవుడ్ భామలెవరూ సెట్ కానట్టుంది. కొందరు కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించలేదని, మరి కొందరు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో వారిని దర్శక, నిర్మాతలు పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీంతో సాహోలో ప్రభాస్ పక్కన అనుష్కనే బెస్ట్ ఛాయిస్ అనే భావనకు ఆ చిత్ర వర్గాలు వచ్చినట్లు తాజా సమాచారం. బాహుబలి– 2 తరువాత ఈ బ్యూటీ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో బాహుబలి చిత్ర క్రేజ్‌ను సాహో చిత్ర యూనిట్ వాడుకోవడానికే సిద్ధం అయినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే దీని గురించి అధికార పూర్వక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
బెస్ట్ ఛాయిస్ స్వీటీయేనా?
టాలీవుడ్లో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న నటీనటుల్లో ప్రభాస్, అనుష్క జంట ఒకటి. ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి నాలుగు చిత్రాలలో నటించారు. అవన్నీ విజయాలు సాధించడం విశేషమే. బిల్లా చిత్రంతో కలిసిన ఈ జంట బాహుబలి-2 వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. ఈ క్రేజీ జంటపై ప్రేమ వదంతులకు ఇది కూడా ఒక కారణం కావచ్చు. వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మీడియాలో హోరెత్తుతోంది. ఇప్పటి వరకూ దక్షిణాదికే పరిమితం అయిన ప్రభాస్, అనుష్క క్రేజ్ బాహుబలి-2తో ప్రపంచస్థాయికి చేరింది. ఇకపోతే బాహుబలి ఫీవర్ నుంచి బయట పడ్డ ప్రభాస్ సాహో చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోంది. ఇంతకు ముందు లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం శనివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.అయితే ఇప్పటికీ ఇందులో నటించే నాయకి ఎంపిక జరగలేదు. ఇది త్రిభాషా చిత్రం కావడంతో బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. అయితే సాహో చిత్రంలో నటించడానికి బాలీవుడ్ భామలెవరూ సెట్ కానట్టుంది. కొందరు కాల్షీట్స్ సమస్య కారణంగా అంగీకరించకపోయారని, మరి కొందరు అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో వారిని దర్శక, నిర్మాతలు పక్కన పెట్టినట్లు ప్రచారం జరిగింది. దీంతో సాహోలో ప్రభాస్ పక్కన అనుష్కనే బెస్ట్ ఛాయిస్ అనే భావనకు ఆ చిత్ర వర్గాలు వచ్చినట్లు తాజా సమాచారం. బాహుబలి-2 తరువాత ఈ బ్యూటీ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అంతకు ముందు ఒప్పుకున్న భాగమతి చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. దీంతో బాహుబలి చిత్ర క్రేజ్‌ను సాహో చిత్ర యూనిట్ వాడుకోవడానికే సిద్ధం అయినట్లు సినీ వర్గాల సమాచారం. అయితే దీని గురించిన అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. -
పూజలు పెళ్లి కోసమేనా?
నటి అనుష్కకు ఇటీవల దైవ చింతన పెరిగిందా? తరచూ ఆలయ దర్శనాలు, అర్చనలు, దోషనివారణ పూజలు చేస్తున్న ఈ భామ నటనపై ఆసక్తి తగ్గించుకున్నారా? వీటన్నింటికీ కారణం పెళ్లేనా? ఇవే ప్రస్తుతం చిత్ర వర్గాల్లో అనుష్క గురించి చర్చలు. బాహుబలి–2 చిత్రం తరువాత ఈ బ్యూటీ ప్రేమ, పెళ్లి గురించి ప్రచారం బాగా జరుగుతోందని చెప్పవచ్చు.అంతే కాదు నటుడు ప్రభాస్‌తో ప్రేమాయణం అని, త్వరలోనే ఆయనతో ఏడడుగులకు సిద్ధం అవుతున్నారనే వదంతులు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం స్వీటీ ప్రభాస్ తనకు మంచి స్నేహితుడని, అంతకు మించి ఏమీ లేదని ఇటీవల క్లారిటీ ఇచ్చేశారు. అదే విధంగా ఇకపై తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయినా అనుష్క గురించి ప్రేమ, పెళ్లి ప్రచారాలు ఆగడం లేదు. అందుకు కారణం ఆమె చర్యలే కావచ్చు. ఆ మధ్య బెంగళూర్ సమీపంలోని మూకాంబికాదేవి ఆలయానికి తన కుటుంబ సబ్యులు సహా వెళ్లి విశేష పూజలు నిర్వహించారు. తాజాగా దోష నివారణ పూజలకు ప్రసిద్ధి గాంచిన శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి దోష నివారణ పూజలు నిర్వహించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అనుష్క పెళ్లి కోసమే ఆమె తల్లిదండ్రులు పూజలు చేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అనుష్క కుటుంబ సభ్యులు కొట్టిపారేస్తున్నారనుకోండి. ఏదేమైనా అనుష్క చేతిలో భాగమతి అనే ఒకే ఒక్క చిత్రం ఉంది. బాహుబలి తరువాత ఒక్క కొత్త చిత్రాన్ని ఆమె అంగీకరించలేదు. అదే విధంగా చిన్న హీరోలతో చిత్రాలు చేయడానికి అంగీకరించడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక సంఘమిత్ర చిత్ర అవకాశాన్ని నిరాకరించారనే టాక్ వైరల్ అవుతోంది. బాహుబలి చిత్రం మాదిరి మరో రెండేళ్లు సంఘమిత్రకు వెచ్చించడానికి ఇష్టం లేకే ఈ అవకాశాన్ని నిరాకరించినట్లు ప్రచారం అవుతోంది. -
టాప్ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్
చెన్నై: ‘ఇప్పటి దాకా చాలా సహనం పాటించాను. ఇక ఉపేక్షించేది లేదు.. గాసిప్స్ పుట్టించే వారిపై ఇక చర్యలు తప్పవ’ని అంటోంది అగ్ర కథానాయకి అనుష్క. ఆ ముద్దుగుమ్మ గురించి ఇది వరకే చాలా గాసిప్స్ షికార్లు చేశాయి. అయితే బాహుబలి 2 చిత్రం తరువాత అనుష్కపై వదంతుల పర్వం మోతాదు మించిందనే చెప్పాలి. ఆ చిత్ర కథానాయకుడు ప్రభాస్‌తో ప్రేమాయణం సాగించి పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే ప్రభాస్ ఇంట్లో అనుష్కను కోడలిగా అంగీకరించడం లేదన్న ఊహాగానాలు కోకొల్లలుగా ప్రచారం చేశారు. అన్నిటికీ మౌనం పాటిస్తూ వచ్చిన అనుష్క ఇక లాభం లేదని భావించి.. ‘నేను, ప్రభాస్ హిట్ పెయిర్. అయితే పర్సనల్‌గా మా మధ్య ఉన్నది స్నేహమే..’ అంటూ కుండబద్దలు కొట్టారు. అయినా ఈ జంటపై వదంతుల ప్రవాహం ఆగడం లేదు. దీంతో విసిగిపోయిన ఈ స్వీటీ ఇక లాభం లేదనుకుందో ఏమో తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇకనైనా గాసిప్స్‌కు పుల్‌స్టాప్ పడుతుందో, లేదో చూడాలి. ప్రస్తుతం అనుష్క ‘భాగమతి’ సినిమాలో నటిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. -
ఫైనల్‌గా అనుష్క చేతికే వెళ్లిందా..?
బాహుబలి తరువాత అదే స్థాయిలో సౌత్‌లో తెరకెక్కుతున్న సినిమా సంఘమిత్ర. తమిళ దర్శకుడు సుందర్.సి దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తొలుత మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్ హీరోలతో ఈ సినిమా చేయాలని భావించినా.. వారు బల్క్ డేట్స్ ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో జయం రవి, ఆర్యలు హీరోలుగా సినిమా ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక కీలకమైన సంఘమిత్ర పాత్రకు శృతిహాసన్‌ను ఫైనల్ చేశారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఘనంగా సినిమాను లాంచ్ చేశారు. అయితే లాంచింగ్ తరువాత శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తనకు డేట్స్ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదన్న కారణంతో సంఘమిత్ర నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలిపింది శృతిహాసన్. దీంతో టైటిల్ రోల్ కోసం మరో స్టార్ హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించిన చిత్రయూనిట్... సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనుష్కనే సంప్రదిస్తున్నారట. ముందుగా తమన్నా, కాజల్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేర్లు కూడా వినిపించినా.. ఫైనల్‌గా అనుష్క కే ఫిక్స్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భాగమతి సినిమాలో నటిస్తున్న అనుష్క సంఘమిత్రకు అంగీకరిస్తుందో.. లేదో.. చూడాలి. -
బరస్ట్ అయిన హీరోయిన్ అనుష్క
బాహుబలి-2 మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ అనుష్క... సినీ గ్లామర్ ప్రపంచంపై బరస్ట్ అయ్యింది. తాము సినిమాల్లో గ్లామర్‌గా, అందంగా కనిపించే తమను జనాలు ఆదరిస్తారని, అయితే నటుల కన్నీళ్లు, కష్టాలను మాత్రం వారు అర్థం చేసుకోరని ఆమె వాపోయింది. మరీ ముఖ్యమంగా నటీమణుల జీవితాలు అద్దాల మేడ లాంటిదని, ఆ మాటలు అక్షరాలా నిజమని అనుష్క పేర్కొంది. తెరపై కనిపిస్తే ఆహో, ఓహో అనేవారే ...ఆ తర్వాత తమతో వెటకారంగా మాట్లాడతారని అంది. హీరోయిన్లకేంటి చేతి నిండా డబ్బు, ఖరీదైన జీవితం అని కూడా భావిస్తారనీ, అయితే అలాంటి భావన చాలా తప్పు అని వాళ్ల కష్టాలు, కన్నీళ్లు తమకు మాత్రమే తెలుసనీ అనుష్క చెప్పుకొచ్చింది. మేకప్ వేసుకోవడానికే గంటల తరబడి సమయం పడుతోందని, షూటింగ్ అయిన తరువాత ఇంటికెళ్లితే ఒళ్లంతా నొప్పులు, బాధ అవన్నీ ఇంటో వాళ్లకు తెలిస్తే వాళ్లు బాధ పడతారనీ, చాలాసార్లు ఒంటరిగా గదిలో కూర్చుని ఏడ్చేదాన్నని అనుష్క తెలిపింది. అలాగే పాత్రల కోసం బరువు పెరగడం గురించి మాట్లాడుతూ... అదంతా గతమని, అదో మానసిక వేదన అంటూ ఓ సినిమా కోసం బరువు పెరిగి ఆ తరువాత తగ్గడానికి తాను పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావని వెల్లడించింది. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే సమాధానంగా ఉండే.... అనుష్క తాజాగా స్పందిస్తూ తన ఇంట్లో ఈ విషయమై ఒత్తిడి బాగా పెరిగిందని, అయితే ఇప్పట్లో పెళ్లి ప్రస్తావన తీసుకు రావద్దని వారితో చెప్పానని తెలిపింది. ఒప్పుకున్న చిత్రాలు పూర్తయ్యే వరకూ పెళ్లి మాట ఎత్తవద్దని ఇంట్లోవాళ్లకు గట్టిగా చెప్పాననీ ఈ స్వీటీ వెల్లడించింది. ఇటీవలే అనుష్క...కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడిని సందర్శించుకుంది. దీంతో వివాహం కోసం ఆమె పూజలు చేసేందుకు ఆలయానికి వచ్చిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. -
మేమిద్దరం స్నేహితులమే!
నటుడు ప్రభాస్, నేను మంచి స్నేహితులం అంటోంది నటి అనుష్క. ఈ జంట ఇప్పటికే నాలుగు తెలుగు చిత్రాల్లో కలసి నటించింది. అవన్నీ సక్సెస్‌లే. తాజా చిత్రం బాహుబలి –2 అయితే ఈ జంటను ప్రపంచ సిని మాకే పరిచయం చేసింది. అదే విధంగా ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం కాస్త ఎక్కువగానే జరుగుతోంది. ఇటీవల నటి అనుష్క దైవ పూజలు నిర్వహించడంతో పెళ్లి సక్రమంగా జరగాలనే ఈ పూజలు అంటూ ప్రచారం హోరెత్తింది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం సాహోలోనూ అయ్యకు జంటగా అనుష్కనే నాయకి అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనుష్కను సిఫారసు చేసింది ప్రభాసే అని కూడా సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో ఈ జంట మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం నిజమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇలాంటి ప్రచారానికి మరో వైపు కూడా ఉంది. ప్రభాస్‌కు వధువు ఖరారైందని, ఒక వ్యాపారవేత్త కూతురిని ఆయన వివాహం చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం అన్నది ఇదిమిద్దంగా తెలియకపోయినా, తాజాగా నటి అనుష్క స్పందిస్తూ తాను, ప్రభాస్ తెరపై సరైన జోడి అని అయితే నిజంగానే తామిద్దరం మంచి మిత్రులం అని పేర్కొంది. కానీ అనుష్క మంచి మిత్రులం అన్న వ్యాఖ్యలును సినీ వర్గం మరో విధంగా భావిస్తోంది. అవును వారిద్దరూ మంచి ప్రేమికులు అన్నదే వారి భావన. ఈ విషయంలో ప్రభాస్ గానీ, అనుష్క గానీ క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి బేస్‌లెస్ వార్తలు షికార్లు చేస్తూనే ఉంటాయి. -
టాప్ హీరోయిన్‌కు షాక్
చెన్నై(తమిళసినిమా): హీరోయిన్ అనుష్కకు తమిళనాడు అధికారులు షాక్ ఇచ్చారు. షూటింగ్ కోసం ఆమె ఉపయోగిస్తున్న కారవాన్‌ను రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి చిత్రం తరువాత ‘భాగమతి’ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కొద్దిరోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడ హోటల్లో బస చేసి ఆ చిత్రంలో నటిస్తున్న నటి అనుష్క షూటింగ్ లోకేషన్స్‌కు వెళ్లడానికి కారవాన్‌ను ఉపయోగిస్తోంది. దీనికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్ చేసి ఆర్టీఓ కార్యాలయానికి తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంతో హర్రర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు రెండు వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. -
స్క్రీన్ టెస్ట్
1.ఈ స్టార్ హీరో చిన్నప్పుడు హారర్ సినిమాలంటే భయపడేవారట. ఇప్పుడాయన ఓ హారర్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం! ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) రజనీకాంత్ డి) కమల్‌హాసన్ 2 అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన ఏకైక తెలుగు సినిమా? ఎ) అల్లుడా మజాకా బి) ఘరానా మొగుడు సి) మెకానిక్ అల్లుడు డి) రౌడీ అల్లుడు 3 ‘స్పైడర్’ లో మహేశ్‌బాబుకు జోడీగా నటిస్తున్న రకుల్‌ప్రీత్ సింగ్, అంతకు ముందు డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఓ మహేశ్ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఆ సినిమా ఏదో తెలుసా? ఎ) బ్రహ్మోత్సవం బి) శ్రీమంతుడు సి) ఆగడు డి) 1–నేనొక్కడినే 4 ముందు పవన్‌కల్యాణ్ పక్కన హీరోయిన్గా నటించి, తర్వాత అతని సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్? ఎ) శ్రియా శరన్ బి) కాజల్ అగర్వాల్ సి) నికిషా పటేల్ డి) పార్వతీ మెల్టన్ 5 పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా కోసం బాలకృష్ణ పాట పాడారు. ఆ పాట హుక్ లైన్ బయటకు వచ్చేసింది. అదేంటో తెలుసా? ఎ) మామ.. కల్లు మామ బి) ఒరేయ్ మామా.. సి) మావా... ఏక్ పెగ్ లావో డి) జింగిడి... జింగిడి... 6 అల్లు అర్జున్ నటించి, నిర్మించిన ‘ఐయామ్ దట్ ఛేంజ్’ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) ‘బొమ్మరిల్లు’ భాస్కర్ బి) సుకుమార్ సి) త్రివిక్రమ్ శ్రీనివాస్ డి) పూరి జగన్నాథ్ 7 హీరోయిన్ అనుష్క ఈయన దగ్గర యోగా నేర్చుకున్నారు! ఎ) భరత్ ఠాగూర్ బి) ప్రకాశ్ రాయ్ సి) బాబా రామ్‌దేవ్ డి) ఎ.ఎన్. విఠల్ శెట్టి 8 ఈ తెలుగు హీరో ‘క్విక్ గన్ మురుగన్’ అనే ఇంగ్లిష్ సినిమాలో నటించారు. ఎ) వినోద్ బి) భానుచందర్ సి) సుమన్ డి) రాజేంద్రప్రసాద్ 9 హీరో కాకముందు మహేశ్‌బాబు బావ సుధీర్‌బాబు జాతీయస్థాయి క్రీడాకారుడు. అతను ఏ ఆట ఆడేవారు? ఎ) టెన్నిస్ బి) బ్యాడ్మింటన్ సి) టేబుల్ టెన్నిస్ డి) కబడ్డీ 10 ఎన్టీఆర్ ‘యమదొంగ’ సినిమాలో ‘నాచోరే... నాచోరే’ పాటకు డ్యాన్స్ మాస్టర్ ఎవరు? ఎ) బాబా భాస్కర్ బి) ప్రభుదేవా సి) ప్రేమ్‌రక్షిత్ డి) శేఖర్ 11‘సాహోరే... బాహుబలి’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది? ఎ) భళి భళి భళిరా బలి... బి) హేస్సా... రుద్రస్సా సి) అంత మహాబలుడైనా... డి) ఆ జననీ దీక్షా అచలం... 12 దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ హీరోతో ఓ సినిమా మొదలుపెట్టి కొన్ని రోజులు షూటింగ్ చేశారు. తర్వాత ఆ సినిమా ఆగింది! ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేశ్ 13 ‘జల్సా’లో ఇలియానా క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ ఎవరు? హింట్: ముందు యాంకర్‌గా, తర్వాత హీరోయిన్గా హిట్స్ అందుకున్నారామె! ఎ) అనసూయ బి) రష్మీ సి) ‘కలర్స్’ స్వాతి డి) శ్రియా రెడ్డి 14 సీనియర్ ఎన్టీఆర్ గుబురు గడ్డంతో ఉన్న ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) భీష్మ బి) దక్షయజ్ఞం సి) పాండవ వనవాసం డి) మాయాబజార్ 15 ఈ ఫొటోలోని ఇప్పటి యంగ్ హీరో ఎవరు? ఎ) నాగచైతన్య బి) నాగశౌర్య సి) నారా రోహిత్ డి) ఎన్టీఆర్ 16 దర్శకుడు కృష్ణవంశీ, హీరో రవితేజ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా? ఎ) సింధూరం బి) ఖడ్గం సి) గులాబీ డి) సముద్రం 17 ఈ హీరోయిన్ సింగర్ కూడా. క్యాన్సర్‌ను జయించిన ఆమె తెలుగులో పలు హిట్ పాటలు పాడారు. ఎ) మమతా మోహన్‌దాస్ బి) గౌతమి సి) మనీషా కోయిరాలా డి) నర్గిస్‌దత్ 18 జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా? ఎ) బాబాయ్–అబ్బాయ్ బి) జయమ్ము నిశ్చయమ్మురా సి) చిన్నికృష్ణుడు డి) మొగుడు–పెళ్లాలు 19 ఈ ఫొటోలోని ఫైట్ మాస్టర్ పేరేంటో తెలుసా? ఎ) విజయన్ బి) పీటర్ హెయిన్స్ సి) సెల్వ డి) డ్రాగన్ ప్రకాశ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 19 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) బి 2) సి 3) ఎ 4) ఎ 5) బి 6) సి 7) బి 8) ఎ 9) డి 10) బి 11) సి 12) డి 13) ఎ 14) సి 15) ఎ 16) బి 17) ఎ 18) ఎ 19) ఎ 20) బి -
పెళ్లి పూజలేనా?
అదేంటో! అనుష్క ఎప్పుడు గుడికి వెళ్లినా... పెళ్లి కోసం ప్రత్యేకంగా పూజలు చేశారని గాసిప్‌రాయుళ్లు కథలు అల్లేస్తారు. ఇప్పుడు కూడా అంతే. అందులోనూ అనుష్క వెంట ఆమె మదర్ ప్రఫుల్లా రాజ్‌శెట్టి, బ్రదర్ గుణరంజన్ శెట్టి, మరికొంత మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండడంతో కచ్చితంగా పెళ్లికి సంబంధించిన పూజలు ఏవో జరిపించుంటారని కథ అల్లేశారు.‘బాహుబలి’ విడుదల తర్వాత మనసుకు నచ్చిన వ్యక్తితో అనుష్క ఏడడుగులు వేసే అవకాశం ఉందని గతంలో వార్తలు వినిపించిన నేపథ్యంలో తాజా పూజలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు మేటర్ ఏంటంటే... రెండు రోజుల క్రితం సాయంత్రం కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు అనుష్క. వీఐపీ సౌకర్యాలు ఏవీ కోరకుండా సాధారణ భక్తులతో కలసి క్యూ లైనులో నిలబడ్డారు. గుడిలోకి ఎంటరయ్యాక ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారట! అనంతరం అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు. ఆ పూజలు ఎందుకనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చినా... మౌనమే అనుష్క సమాధానమైంది. ఇప్పుడూ మౌనంగానే ఉంటారో? లేక బదులిస్తారో? చూడాలి. ఆమె ఫ్యామిలీ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేసింది. ‘‘అనుష్కకు భక్తి ఎక్కువ. రజనీకాంత్ ‘లింగ’ షూటింగ్ టైమ్‌లోనూ మూకాంబిక గుడికి వెళ్లింది. ఇప్పుడు‘బాహుబలి’ సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది’’ అని అనుష్క తండ్రి విఠల్ పేర్కొన్నారు. మంగుళూరులోని బప్పనాడు దుర్గాపరమేశ్వరీ ఆలయాన్ని కూడా అనుష్క సందర్శించారు. -
ప్రభాస్ సరసన మళ్లీ అనుష్క?
మిర్చి సినిమాలో స్టైలిష్‌గా కనపడే ప్రభాస్ సరసన అనుష్కను చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతకుముందే బిల్లాలో కూడా చేసినా.. మిర్చిలో వాళ్లిద్దరి జంట సూపర్బ్‌గా ఉందని ఆడియన్స్ టాక్. ఆ తర్వాత ఇక బాహుబలిలో అయితే దేవసేన-అమరేంద్ర బాహుబలి ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడినట్లుగా మరీ చేశారు. ఇలా ఇప్పటికే మూడు సినిమాల్లో హిట్ పెయిర్ అయిన వీళ్లిద్దరూ మరోసారి జంటగా చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ప్రభాస్ కొత్త సినిమా సాహోకు ఇప్పటికీ హీరోయిన్లు ఎవరూ ఖరారు కాకపోవడంతో రీసెంట్ హిట్ జంట అయిన అనుష్కనే ఫైనల్ చేస్తే ఎలా ఉంటుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయంటున్నారు. తొలుత ఈ చాన్స్ ఎవరైనా బాలీవుడ్ బ్యూటీకి ఇద్దామా అనుకున్నారు. కానీ వాళ్లు మరీ కళ్లు తిరిగే రేట్లు చెప్పడంతో అటువైపు చూడటం కూడా మానుకున్నారు. ఇప్పటికీ జనంలో బాహుబలి క్రేజ్ తగ్గలేదు కాబట్టి, దాన్ని క్యాష్ చేసుకోవాలంటే ప్రభాస్ సరసన అనుష్కను దించడమే కరెక్ట్ అని అనుకుంటున్నారట. బాహుబలి-2 సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తుండటంతో ప్రభాస్ కూడా నేషనల్ స్టార్ అయిపోయాడు. సాహో టీజర్‌కు కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది. దాంతో తెలుగు, తమిళం, మళయాళం, హిందీ నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమెనే ఖరారు చేయాలని దర్శకుడు సుజిత్ కూడా అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.