మేమిద్దరం స్నేహితులమే!
నటుడు ప్రభాస్, నేను మంచి స్నేహితులం అంటోంది నటి అనుష్క. ఈ జంట ఇప్పటికే నాలుగు తెలుగు చిత్రాల్లో కలసి నటించింది. అవన్నీ సక్సెస్‌లే. తాజా చిత్రం బాహుబలి –2 అయితే ఈ జంటను ప్రపంచ సిని మాకే పరిచయం చేసింది. అదే విధంగా ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం జరుగుతుందనే ప్రచారం కాస్త ఎక్కువగానే జరుగుతోంది. ఇటీవల నటి అనుష్క దైవ పూజలు నిర్వహించడంతో పెళ్లి సక్రమంగా జరగాలనే ఈ పూజలు అంటూ ప్రచారం హోరెత్తింది.
తాజాగా ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం సాహోలోనూ అయ్యకు జంటగా అనుష్కనే నాయకి అనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనుష్కను సిఫారసు చేసింది ప్రభాసే అని కూడా సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీంతో ఈ జంట మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం నిజమేననే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఇలాంటి ప్రచారానికి మరో వైపు కూడా ఉంది. ప్రభాస్‌కు వధువు ఖరారైందని, ఒక వ్యాపారవేత్త కూతురిని ఆయన వివాహం చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇందులో ఏది నిజం అన్నది ఇదిమిద్దంగా తెలియకపోయినా, తాజాగా నటి అనుష్క స్పందిస్తూ తాను, ప్రభాస్ తెరపై సరైన జోడి అని అయితే నిజంగానే తామిద్దరం మంచి మిత్రులం అని పేర్కొంది. కానీ అనుష్క మంచి మిత్రులం అన్న వ్యాఖ్యలును సినీ వర్గం మరో విధంగా భావిస్తోంది. అవును వారిద్దరూ మంచి ప్రేమికులు అన్నదే వారి భావన. ఈ విషయంలో ప్రభాస్ గానీ, అనుష్క గానీ క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి బేస్‌లెస్ వార్తలు షికార్లు చేస్తూనే ఉంటాయి.