Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Sri Rama Navami Wishes To Telugu People1
తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సాక్షి, తాడేపల్లి: శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు.ఒంటిమిట్ట, భద్రాద్రి ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కల్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీసీతారాముల అనుగ్రహం లభించాలని వైఎస్‌ జగన్‌ అభిలషించారు.

Strong country, yet weak reaction Zelensky slams US2
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ

రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20 మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం‍్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు. ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు.

IPL 2025: Punjab Kings vs Rajasthan Royals live updates and highlights3
పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ లైవ్ అప్‌డేట్స్‌

IPL 2025 RR vs PBKS live updates and highlights: ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.రాజ‌స్తాన్ మూడో వికెట్ డౌన్‌..నితీష్ రాణా రూపంలో రాజ‌స్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ప‌రుగులు చేసిన రాణా.. జానెస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ 3 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది. క్రీజులో ప‌రాగ్‌(12), హెట్‌మెయిర్‌(4) ఉన్నారు.రాజ‌స్తాన్ రెండో వికెట్ డౌన్‌..య‌శ‌స్వి జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రియాన్ ప‌రాగ్‌(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజ‌స్తాన్ నాలుగో వికెట్ డౌన్‌..య‌శ‌స్వి జైశ్వాల్ రూపంలో రాజ‌స్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన జైశ్వాల్‌.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రెండు వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. క్రీజులో రియాన్ ప‌రాగ్‌(11), నితీష్ రాణా(11) ఉన్నారు.రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌కెప్టెన్ సంజూ శాంస‌న్ రూపంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన శాంస‌న్‌.. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ వికెట్ న‌ష్టానికి 105 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(56), రియాన్ ప‌రాగ్‌(5) ఉన్నారు.4 ఓవ‌ర్ల‌కు రాజ‌స్తాన్ స్కోర్‌:40/04 ఓవ‌ర్లు ముగిసే స‌రికి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 40 ప‌రుగులు చేసింది. క్రీజులో య‌శ‌స్వి జైశ్వాల్‌(25), సంజూ శాంస‌న్‌(15) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో ముల్లాన్‌పూర్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ త‌మ తుది జ‌ట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగింది. రాజ‌స్తాన్ మాత్రం త‌మ తుది జ‌ట్టులో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ సంజూ శాంస‌న్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా సంజూనే వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు తుషార్ దేశ్ పాండే గాయం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో యుద్ద్‌వీర్ సింగ్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు.తుది జ‌ట్లుపంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీప‌ర్‌), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

SBI Discontinued Popular Amrit Kalash Fixed Deposit Scheme4
అధిక వడ్డీ ఇచ్చే స్కీమ్ నిలిపేసిన ఎస్‌బీఐ

డబ్బు పొదుపు చేసుకోవాలనుకునేవారు సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలనే చూస్తారు. అందులోనూ కొంత ఎక్కువ వడ్డీ వచ్చే పథకాలు ఎమున్నాయా అని వెతుకుతారు. అలాంటి వారికోసం 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) అందిస్తున్న 'అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్' స్కీమ్ నిలిపివేసింది.గతంలో ఎస్‌బీఐ.. తన అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు ముగిసినప్పటికీ దానిని పొడిగించింది. అయితే ఇప్పుడు గడువును పొడిగించకపోగా.. స్కీమును ఏప్రిల్ 1 నుంచి నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అధిక వడ్డీ ఇచ్చే ఈ పథకాన్ని బ్యాంక్ నిలిపివేసింది.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన అమృత్ కలశ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా.. సాధారణ పెట్టుబడిదారులకు సంవత్సరానికి 7.10 శాతం వడ్డీని, 400 రోజుల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని అందించింది. ఇకపై ఈ స్కీమ్ అందుబాటులో ఉండదని తెలియడంతో కస్టమర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

Waqf Amendment Bill: Asaduddin Owaisi Fire On Chandrababu5
మోసం చేశావ్‌ చంద్రబాబూ.. అసదుద్దీన్‌ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: వక్ఫ్‌ బిల్లును అడ్డుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకునే రకం కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘పిల్లనిచ్చిన మామనే మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. గుజరాత్‌ అల్లర్ల సమయంలోనూ బాబు ముస్లింలను మోసం చేశారు’’ అని అసదుద్దీన్‌ ఓవైసీ ఆరోపించారు.‘‘ఆ తర్వాత పదేళ్ల పాటు చంద్రబాబు అధికారానికి దురమయ్యాడు. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు.. ఆయనకు భవిష్యత్‌ లేదు. చంద్రబాబు పాపాలకు లోకేష్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు.కాగా, సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు.

YSRCP Leader Pratap Reddy Injured In Attack Nandyal6
వైఎస్సార్‌సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి

నంద్యాల: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఇందూరి ప్రతాప్ రెడ్డిపై టీడీపీ గూండాలు వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామంలోప్రతాప్ రెడ్డి గుడిలో ఉండగా దాడికి దిగారు. శనివారం జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రతాప్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ రెడ్డిని బ్రిజేంద్రారెడ్డి పరామర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డి గన్ మెన్ ను తొలగించడం కూడా దాడికి ముందస్తు ప్రణాళికలో భాగంగానే కనిపిస్తోందని బ్రిజేంద్రారెడ్డి మండిపడ్డారు.ఏపీలో శాంతి భద్రతలు అధ్వాన్నంచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో శాంతి భద్రతలు అధ్వానంగా మారాయని వైఎస్సార్ సీపీ మండిపడింది చంద్రబాబు పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగవిప్పుతోందని, ప్రతాప్ రెడ్డిపై దాడి చేసిన వారంత టీడీపీ కార్యకర్తలేనని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. గతంలో ప్రతాప్ రెడ్డి అన్న, బావమరిదిని హత్య చేసిన నిందితులే మళ్లీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డిని టార్గెట్ చేశారని మండిపడుతోంది.

Cm Revanth Reddy Is Serious About Ai Fake Videos7
హెచ్‌సీయూ వివాదం: ఏఐ ఫేక్‌ వీడియోలపై సీఎం రేవంత్‌ సీరియస్‌

సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రేవంత్‌ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేసింది.కంచ గచ్చిబౌలి లోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గత 25 ఏండ్లుగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఐఎస్‌బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ఐఐఐటీ, ప్రైవేటు బిల్డింగ్ లు, రెసిడెన్షియల్ అపార్టుమెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ బిల్డింగ్‌లను నిర్మించారని.. వాటిని నిర్మించేటప్పుడు ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకు వచ్చారు.అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు కూడా లేవన్నారు. అలాంటప్పుడు అదే సర్వే నెంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసేటప్పుడు ఎందుకు వివాదాస్పదమైందని సమావేశంలో చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.వాస్తవాలు వెల్లడించేలోగా అబద్ధాలు సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో వైరల్ కావటం ప్రభుత్వానికి సవాలుగా మారిందని అధికారులు సీఎంకి వివరించారు. ఏకంగా నెమళ్లు ఏడ్చినట్లుగా ఆడియోలు, బుల్లోజర్లకు జింకలు గాయపడి పరుగులు తీస్తున్నట్లుగా ఫేక్ ఫొటోలు, వీడియోలు తయారు చేశారని పోలీసు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా వాటినే నిజమని నమ్మి సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్లయిందని అన్నారు.ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్ రాఠీ, సినీ ప్రముఖులు జాన్ అబ్రహం, దియా మీర్జా, రవీనా ఠండన్ లాంటి వాళ్లందరూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ఫొటోలు, వీడియోల పోస్టు చేసి సమాజానికి తప్పుడు సందేశం చేరవేశారని సమావేశంలో చర్చ జరిగింది. ఈ భూములపై మొట్టమొదటగా ఫేక్ వీడియో పోస్ట్ చేసిన జర్నలిస్ట్ సుమిత్ జా కొద్ది సేపట్లోనే తన పోస్టును తొలిగించి క్షమాపణలు చెప్పారని, కానీ మిగతా ప్రముఖులెవరూ ఈ నిజాన్ని గుర్తించకుండా అదే ఫేక్ వీడియో ప్రచారం చేశారని అధికారులు అభిప్రాయపడ్డారు. కంచె గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందని ఈ సమావేశంలో చర్చ జరిగింది.ఇదే తీరుగా ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దుల్లాంటి వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో యుద్ధాలు జరిగే ప్రమాదముంటుందని చర్చ జరిగింది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫొటోలు కరోనా వైరస్‌ను మించిన మహమ్మారిలాంటివని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని సీఎం సూచించారు

Woman drags mother in law by hair, beats up husband8
ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపుతావా.. లేదా.. ? భర్తపై భార్య దాడి

గ్వాలియర్: ఇది భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న రగడ. అత్తను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయమని డిమాండ్ చేస్తోంది కోడలు. అందుకు కొడుకు ఒప్పుకోవడం లేదు. అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయడమేంటని పట్టుపట్టుకుని కూర్చున్నాడు. ఇక్కడ ఎవరు చెప్పినా వినే ప్రసక్తే లేదని భార్యకు తేల్చిచెప్పాడు. ఇది గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న సంఘర్షణ. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. తన మాట విననందుకు కుటుంబ సభ్యుల్ని పిలిపించింది భార్య. ఈ విషయంలో భర్తతో అమీతుమీ తేల్చుకోవడాని సిద్ధమైంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో ఆమె భర్త గొడవపడ్డాడు.. అయితే భర్తపై భార్య తరఫు బంధువులు దాడికి దిగారు. తన కొడుకును ఒక్కడిని చేసి దాడి చేస్తున్నారని తల్లి పరుగెత్తుకొచ్చింది. కొడుకును రక్షించాలని తాపత్రాయపడింది. మరి కోడలు ఊరుకుంటుందా.. అత్తను జట్టు పట్టుకుని కిందకు పడేసింది. పడిపోయిన అత్తపై మళ్లీ మళ్లీ దాడి చేసింది సదరు కోడలు.వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ కు చెందిన విశాల్ బత్రా, నీలిక భార్యా భర్తలు. వీరితో కలిసి విశాల్ తల్లి ఉంటోంది. 70 ఏళ్లు పైబడ్డ వయుసులో కొడుకును ఆశ్రయించింది. తన తల్లిని చూసుకోవాలనే బాధ్యతను గ్రహించిన విశాల్.. తల్లిని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే కోడలు ఊరుకోలేదు. ఎంతకాలం ఈ ముసలామెను ఇంట్లో ఉంచుతావంటూ భర్తతో పదే పదే గొడవ పడేది. ఇలా ఏడాదికి పైగానే గడిచింది. ఎంతకాలమైనా తన వద్దే తల్లి ఉంటుందని భర్త తెగేసి చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య.. తన బంధువుల్ని గొడవకు పురామాయించింది. ఎలాగైనా సరే అత్తను ఇంట్లో నుంచి పంపించాలని భీష్మించుకుని కూర్చొంది. విశాల్ ఇంటికి వచ్చిన ‘పెద్దలు’( భార్య తరప/ బంధువులు) అతనిపై దాడికి పూనుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి విశాల్ పై దాడికి దిగారు. దీన్ని చూసిన విశాల్ తల్లి దాన్ని ఆపడానికి యత్నించింది. ఇక్కడ కోడలు అమాంతం అత్త మీదకు దూకి ఆ పెద్దామెను జట్టు పట్టుకుని ఈడ్చేసింది. ఈ క్రమంలోనే ఆమె కిందపడిపోయినా మళ్లీ మళ్లీ దాడి చేసింది. ఈ ఘటనను ఇండియన్‌ ప్రైవేట్‌ న్యూస్‌ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్‌ తో సహా పలు జాతీయ చానళ్లు వెలుగులోకి తెచ్చాయి.Gwalior, Madhya Pradesh: An incident occurred in Adarsh Colony, where a video of a daughter-in-law, along with her brother, assaulting her mother-in-law and husband went viral. pic.twitter.com/BmhTQZllPr— IANS (@ians_india) April 4, 2025 నా భార్య వేధిస్తోంది.. చివరకు దాడి చేసింది..దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన విశాల్.. బయట మీడియాతో మాట్లాడారు. ‘ నేను నా ఇంటిలో దాడికి గురయ్యాను. సుమారు 10 నుంచి 15 మంది వరకూ నా ఇంటికి వచ్చి నన్ను, మా అమ్మపై దాడి చేశారు. నా తల్లిని బయటకు పంపేయమని నా భార్య వేధిస్తోంది. దీన్ని నేను కాదనడంతో నాపై దాడికి చేయించింది. నీలిక సోదరుడు, తండ్రి కలిసి మమ్మల్ని దారుణంగా కొట్టారు. ఈ విషయంలో భార్య నీలిక నన్ను రోజూ తీవ్రంగా తిడుతూ ఉంటోంది. ఈ విషయంలో న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీ ఆఫీస్ కు వచ్చాను’ అని విశాల్ తెలిపాడు.

Hrithik Roshan: My Favourite Co Star is Jr NTR, Feeling Nervous to Dance With him9
జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్‌ రోషన్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ 'డ్రాగన్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ 'వార్‌ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్‌ 2 ఈవెంట్‌లో హృతిక్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్‌ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్‌ సినిమా సీక్వెల్‌ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌..జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ కోస్టార్‌. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్‌ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్‌ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్‌ 2 విషయానికి వస్తే.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఇకపై డైరెక్టర్‌గానూ..హృతిక్‌ రోషన్‌ నెక్స్ట్‌ 'క్రిష్‌ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్‌ తండ్రి రాకేశ్‌ ఇటీవల సోషల్‌ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్‌ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్‌.. వీడియో వైరల్‌

IAF PilotSiddharth YadavFiancee Breaks Down Next To His Coffin10
‘వస్తానని చెప్పావు కదా బేబీ’! : భోరున విలపించిన పైలట్‌ భార్య

జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన IAF పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి, తోటి పైలట్‌ను, అనేక మంది పౌరులను కాపాడిన సిద్దార్థ్‌ యాదవ్‌కు యావద్దేశం సంతాపం ప్రకటించింది. ఆయన త్యాగం, ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రు నయనాలతో సెల్యూట్‌ చెబుతున్నారు. త్రివర్ణ పతాకం కప్పి, పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా భల్ఖిలోని ఆయప స్వగ్రామంలో ఏప్రిల్ 4న అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది. పెళ్లి బారాత్‌లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు, అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడం కన్నతల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్‌తో నిశ్చితార్థం జరిగింది. నవంబరు 2న అంగరంగవైభంగా ఈ జంటకు పెళ్లిచేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహంచని విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది. ఫైటర్‌జెట్‌ ప్రమాదంలోమరణించిన సిద్దార్థ్‌ పార్ధివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి, గౌరవ లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్దార్థ శవపేటిక పక్కనే కూలిపోయింది. ఇదీ చదవండి: మొన్ననే ఎంగేజ్‌మెంట్‌, త్వరలో పెళ్లి, అంతలోనే విషాదంభోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కుడన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. సిద్ధార్థ్ యాదవ్ శవపేటికను కౌగిలించుకుని ‘‘వస్తానని చెప్పావు కదా బేబీ...రానేలదు ("బేబీ తు ఆయా నహీ...తునే కహా థా మై ఆవుంగా’’) అంటూ విలపించిన తీరు అందర్నీ కలిచివేసింది. కన్నీళ్లు ఆపుకోవడం అక్కడున్న ఎవ్వరి తరమూ కాలేదు. పలువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు , ఇతర అధికారులు సిద్ధార్థ్‌కు వీడ్కోలు పలికారు.Such incidents breaks down the hearts of many. My 🙏🙏🙏 to the family members of #SiddharthYadav I don't understand the story. Technical Snag, and a fighter jet and 2 pilot down. Technical efficacy of the Aero Engineers must improve. Loss can't be adjusted. pic.twitter.com/YXkdeSG5zU— Little Somesh 🇮🇳 1729 (@shankaravijayam) April 4, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement