
సాక్షి, అమరావతి: అమిత్ షా లేఖ ద్వారా చెప్పిన విషయాలు మొదటి విడత మాత్రమేన ని, ఇంకా చాలా నిజాలను ప్రజల ముందు పెడతామని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసింద న్న వాదన ఒకవేళ నిజమైతే అందుకు సీఎం చంద్రబాబుతోపాటు టీడీపీ ప్రభుత్వ అసమర్థతే కారణమని స్పష్టం చేశారు. ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టే సత్తా లేకపోవడం అసమర్థతేనని పేర్కొన్నారు.
ఆయన మంగళ వారం విజయవాడలోని విలేకరులతో మాట్లాడారు. ‘‘నాలుగేళ్లు కేం ద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు రాష్ట్రాన్ని ఎం దుకు అభివృద్ది చేసుకోలేకపోయారు? అంటే వాళ్లు రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో మాట్లాడలేదా?’’ అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గంటల తరబడి అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు.