
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అమడగురు ఎస్‌ఐ దౌర్జన్యం చేశారు. జేకేపల్లికి చెందిన 12 మంది కార్యకర్తలను ఎస్‌ఐ రాఘవయ్య బైండోవర్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. గాయాలతో ఆరుగురు కార్యకర్తలు కదిరి ఆసుపత్రిలో చేరారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాలతోనే ఎస్‌ఐ.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బైండోవర్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శిష్యడినంటూ బాహాటంగానే చెబుతూ తమపై ఎస్‌ఐ రెచ్చిపోయారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తెలిపారు.