మెట్రో ప్రయాణికులకు ‘క్యాష్‌బ్యాక్’ | Metro passengers' Cash Back ' | Sakshi
Sakshi News home page

మెట్రో ప్రయాణికులకు ‘క్యాష్‌బ్యాక్’

Published Thu, May 14 2015 2:18 AM | Last Updated on Tue, Oct 16 2018 5:16 PM

వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికులకు మెట్రో-1 యాజమాన్యం ‘క్యాష్ బ్యాక్’ ఆఫర్ పకటించింది.

సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికులకు మెట్రో-1 యాజమాన్యం ‘క్యాష్ బ్యాక్’ ఆఫర్ ్రపకటించింది. ఈ నెల 1 నుంచి 31 వరకు మెట్రో రైలులో 30 సార్లు ప్రయాణిస్తే ఐదు శాతం డబ్బులు ప్రయాణికులకు తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటిచింది. అయితే ఈ సౌకర్యం రోజూ టికెట్లు కొనుగోలు చేసేవారికి కాదని, కేవలం స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణించే వారికి మాత్రమేనని అధికారులు తెలిపారు.

నెలలో మొత్తం 30 ట్రిప్పులు పూర్తయ్యాక  వెచ్చించిన డబ్బు నుంచి 5 శాతం మొత్తం స్మార్ట్‌కార్డులో అటోమెటిక్‌గా జమా అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అత్యధిక శాతం ముంబైకర్లు స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గింది. దీంతో ప్రతి రోజు మెట్రో ద్వారా రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ఆదాయం సమకూర్చుకునే క్రమంలో ఈ స్కీంకు శ్రీకారం చుట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement