Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Tweet On Chandrababu Cheap Politics1
బాబు దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరాచకాలను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. ‘‘చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.‘‘ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది?..బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగం చేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.‘‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్‌ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు.ఇన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరింపులకు గురిచేసినా తలొగ్గక పార్టీవైపు, ప్రజలవైపు నీతి, నిజాయితీగా నిలబడి చిత్తశుద్ధి చాటుకున్న వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లను, అలాగే వామపక్షాలకు చెందిన కార్పొరేటర్లను అభినందిస్తున్నాను.రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో తమకు అధికారం లేకపోయినా అధికార దుర్వినియోగం, కండబలంతో వాటిని చేజిక్కించుకోవడానికి చంద్రబాబుగారి కుటిల ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొని నిలబడుతున్న మా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు మరోసారి హ్యాట్సాప్‌ చెప్తున్నా’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. .@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.ప్రజలు ఇచ్చిన…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025

Audio Release: Raj Kasireddy Said Dont Believe Vijaya Sai Says2
విజయసాయి మాటలు నమ్మొద్దు.. ఆడియో రిలీజ్‌ చేసిన రాజ్‌ కసిరెడ్డి

సాక్షి, అమరావతి: విజయసాయి చెప్పే మాటలు నమ్మొద్దంటూ మీడియాకు రాజ్‌ కసిరెడ్డి ఆడియో విడుదల చేశారు. త్వరలోనే విజయసాయి బండారం బయటపెడతానన్నారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పోలీసులకు సహకరిస్తానని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.‘‘సిట్‌ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించా. మార్చిలో సిట్‌ అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశా. న్యాయపరమైన రక్షణ తర్వాత విచారణకు హాజరవుతా. సాక్షిగా పిలిచి అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని లాయర్లు చెప్పారు. అందుకోసమే న్యాయస్థానాన్ని ఆశ్రయించాను’’ అని రాజ్‌ కసిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: భేతాళ కుట్రే.. బాబు స్క్రిప్టే

IPL 2025 RR VS LSG: Vaibhav Suryavanshi Becomes The Youngest Player To Play IPL3
RR VS LSG: ఐపీఎల్‌లో సంచలనం

ఐపీఎల్‌లో సంచలనం నమోదైంది. ఓ కుర్రాడు కేవలం 14 ఏళ్ల 23 రోజుల వయసులోనే అరంగేట్రం చేయనున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్‌ ఆడుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. సూర్యవంశీకి ముందు ఈ రికార్డు ప్రయాస్‌ రే బర్మన్‌ పేరిట ఉండేది. బర్మన్‌ 2019 సీజన్‌లో ఆర్సీబీ తరఫున 16 ఏళ్ల 157 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. బర్మన్‌ తర్వాత ఐపీఎల్‌ ఆడిన అత్యంత పిన్న వయస్కుడి రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ పేరిట ఉంది. ముజీబ్‌ 2018 సీజన్‌లో 17 ఏళ్ల 11 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు.అత్యంత పిన్న వయసులో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఆటగాళ్లు..14y 23d - వైభవ్ సూర్యవంశీ, 2025*16y 157d - ప్రయాస్ రే బర్మన్, 2019 17వ 11వ తేదీ - ముజీబ్ ఉర్ రెహమాన్, 2018 17y 152d - రియాన్ పరాగ్, 2019 17y 179d - ప్రదీప్ సాంగ్వాన్, 2008లక్నో, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. జైపూర్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. గాయం కారణంగా రాయల్స్‌ కెప్టెన్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతని గైర్హాజరీలో రియాన్‌ పరాగ్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆకాశ్‌దీప్‌ స్థానంలో ప్రిన్స్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాయల్స్‌ తరఫున సంజూ స్థానంలో వైభవ్‌ సూర్యవంశీ బరిలోకి దిగుతున్నాడు.తుది జట్లు..రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, రియాన్ పరాగ్(కెప్టెన్‌), నితీష్ రాణా, ధృవ్ జురెల్(వికెట్‌కీపర్‌), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండేఇంపాక్ట్ సబ్స్: వైభవ్ సూర్యవంశీ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్లక్నో: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్‌/కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్ఇంపాక్ట్ సబ్స్: ఆయుష్ బడోని, మయాంక్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్

Robert Kiyosaki Advised People To Put Their Money In Gold Silver And Bitcoin4
మార్కెట్‌ మరింత పడుతుంది.. బంగారం, వెండి కొనడమే మేలు

రాబోయే ఆర్థిక మాంద్యం గురించి చాలామంది తీవ్ర ఆందోళనలు చెందుతున్న వేళ.. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఓ సుదీర్ఘ ట్వీట్ చేసారు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి.. కీలకమైన పెట్టుబడి సలహాలను సైతం పంచుకున్నారు.2025లో క్రెడిట్ కార్డ్ అప్పులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నిరుద్యోగం పెరుగుతోంది.. దీనివల్ల నాలుగు లక్షల కంటే ఎక్కువమంది నష్టపోయె అవకాశం ఉంది. అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. అంతే కాకుండా.. అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం రాబోతుందని గతంలోనే నేను వెల్లడించారు. అది ఇప్పుడు నిజమైందని అన్నారు.నిజానికి.. ఫేక్, హూ స్టోల్ మై పెన్షన్, రిచ్ డాడ్ పూర్ డాడ్ వంటి నేను రాసిన చాలా పుస్తకాలలో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించారు. నా హెచ్చరికలను పాటించిన వ్యక్తులు నేడు బాగానే ఉన్నారు. అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నానని కియోసాకి అన్నారు.శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పుడు కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిని కొనుగోలు చేస్తే ధనవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే.. స్టాక్ మార్కెట్ మరింత పతనం కావొచ్చు, బంగారం ధరలు ఇంకా పెరగవచ్చు. కాబట్టి కేవలం ఒక బిట్‌కాయిన్ లేదా కొంత బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టే వారు ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు, ధనవంతులుగా మారవచ్చు.పేదలు పేదలుగానే ఉండటానికి కారణం ఏమిటంటే.. నేను దానిని భరించలేను, నేను ప్రయత్నిస్తాను, నేను వేచి ఉంటాను అనే ఆలోచనలే. ఒక పేదవాడు కొన్ని ఔన్సుల బంగారం లేదా వెండి లేదా ఒక బిట్‌కాయిన్‌లో 1/2 వంతు కొనుగోలు చేస్తే.. ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నానని రాబర్ట్ కియోసాకి అన్నారు.2035 నాటికి.. ఒక బిట్‌కాయిన్ ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. బంగారం, వెండి ధరలు కూడా ఊహకందని రీతిలో ఉంటాయని అన్నారు. భయంతో వేచి ఉన్నవారే.. నష్టాలను చూస్తారు. రాబోయే మాంద్యం లక్షలాది మందిని పేదలుగా చేస్తుంది.నేను ఊహించిన భారీ పతనం.. ఇప్పుడు జరుగుతున్న క్రాష్. ఇది మీ జీవిత కాలంలో గొప్ప సంపదను సాధించడానికి, మరింత ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి అవకాశం కావచ్చు. దయచేసి ఈ భారీ క్రాష్‌ను వృధా చేయకండి. జాగ్రత్తగా ఉండండి, బెస్ట్ ఆఫ్ లక్ అని రాబర్ట్ కియోసాకి ట్వీట్ ముగించారు.MAKES ME SAD: In 2025 credit card debt is at all time highs. US debt is at all time highs. Unemployment is rising. 401 k’s are losing. Pensions are being stolen. USA may be heading for a GREATER DEPRESSION.I get sad because as I stated in an earlier X….Tweet….I warned…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 18, 2025 Note: బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టడం అనేది మీ సొంత ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా.. పెట్టుబడుల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

Woman Attempts To Jump From Hospital Building In Banjara Hills5
బంజారాహిల్స్‌లో కలకలం.. ఆసుపత్రి బిల్డింగ్‌పైకి ఎక్కి దూకేస్తానంటూ మహిళ హల్‌చల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏఐజీ ఆసుపత్రి మాజీ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేసింది. బంజారాహిల్స్‌లోని నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి పైకి ఎక్కిన ఓ యువతి.. బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు యత్నించింది.యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని బెదిరింపులకు దిగుతోంది. ప్రస్తుతం ఆ మహిళను కిందకు దింపేదుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళను ఆసుపత్రి మాజీ ఉద్యోగి శివలీలగా గుర్తించారు. ఇటీవల ఆమెను ఉద్యోగం నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించింది. తన ఉద్యోగం తనకు ఇవ్వాలంటూ శివలీల డిమాండ్‌ చేస్తోంది.

Uddhav and Raj Thackeray hint at burying the hatchet6
రెండు దశాబ్దాల తర్వాత ‘బంధం’ కలుస్తోంది..!

ఎన్నో ఏళ్లుగా ‘రాజకీయ కత్తులు’ దూసుకుంటూనే ఉన్నారు.. ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూనే ఉన్నారు. వీరి వైరం సుమారు రెండు దశాబ్దాల నాటిది. ఒకప్పుడు కలుసున్న బంధం.. చాలా ఏళ్ల పాటు దూరంగానే ఉంటూ వచ్చింది. అది రాజకీయ వైరం కావడంతో ప్రజల్నే నమ్ముకుని పోరాటం సాగించారు. వారిలో ఒకరు ఉద్ధవ్ ఠాక్రే అయితే.. ఇంకొకరు రాజ్ ఠాక్రే. వరుసకు సోదర బంధం వారిది. కానీ శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే జీవించి ఉన్న కాలంలోనే రాజ్ ఠాక్రే బయటకు వచ్చేశారు. శివసేనలో విభేదాల కారణంగా రాజ్ ఠాక్రే అక్కడ ఇమడలేక బయటకు వచ్చేశారు. ఎమ్మెన్నెస్ అంటూ పార్టీ స్థాపించి తన ఉనికిని మహారాష్ట్రలో చాటుకునే యత్నం చేశారు. కానీ ఆయన ఆశించిన ఫలితాలు ఏమీ చూడలేకపోయారు. చివరకు ఉద్ధవ్ ఠాక్రేతో కలిసేందుకు సిద్ధమయ్యారు రాజ్ ఠాక్రే.శివసేనతో కలుస్తా..ప్రస్తుతం మహారాష్ట్రలో సైతం హిందీ భాషా యుద్ధం నడుస్తోంది. తమకు థర్ద్ లాంగ్వేజ్ గా హిందీని తప్పనిసరి చేయాలని కేంద్రం చూస్తోంది. కేంద్ర ప్రభుత్వపు త్రి భాషా విధానంలో భాగంగా హిందీ థర్డ్ లాంగ్వేజ్ అంశాన్ని పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఉద్ధవ్ ఠాక్రే శివసేన(యూబీటీ)తో పాటు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే తాము ఒక్కటిగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు రాజ్ ఠాక్రే తెలిపారు.ఫిల్మ్ మేకర్ మహేష్ మంజ్రేకర్ నిర్వహించిన పాడ్ కాస్ట్ లో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న విభేదాల్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఒక్కటవ్వాలని ఉందని పేర్కొన్నారు. శివసేనతో కలిసి పోరాటం చేయటానికి నిశ్చయించుకున్నానని, అది కూడా వారికి ఇష్టమైతేనే అంటూ రాజ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇక్కడ మరాఠీల కమ్యూనిటీని రక్షించడంతో పాటు మరాఠీ భాషను కాపాడుకోవడం ముఖ్యమన్నారాయన.మరి ఉద్ధవ్ ఏమన్నారంటే..తనతో రాజ్ ఠాక్రే కలుస్తానంటే ఏమీ ఇబ్బంది లేదన్నారు. తమ మధ్య భేదాభిప్రాయల కారణంగా ఎవరికి వారు అన్నట్లు ఉంటున్నామని, రాజ్ వస్తానంటే తనకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. కాకపోతే మరాఠీ కమ్యూనిటీని వ్యతిరేకించే శక్తులను వెంటబెట్టుకు రావద్దని తన కండిషన్ అంటూ ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ మన శత్రువర్గాన్ని ఇంటికి ఆహ్వానించి.. వారికి భోజన తాంబూలం ఇచ్చే సాంప‍్రదాయాన్ని రాజ్ ఠాక్రే వదిలేతేనే తనతో కలవచ్చన్నారు. ఇక్కడ ఇద్దరికీ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎమ్మెన్నెస్.. ఎన్డీఏకు దగ్గరై వారికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిపై అసహనంతో ఉన్న రాజ్ ఠాక్రే.. శివసేన(యూబీటీ) తో కలవడానికి సిద్ధం కావడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.20 ఏళ్ల కిందటే.. బయటకుదాదాపు 19 ఏళ్ల కిందట బాలాసాహెబ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్‌ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్‌ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్‌ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్‌ ఒక్కరే గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెన్నెస్ గ్రాఫ్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం తన పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ను కలవడానికి సిద్ధమైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు.

Raj Tarun Ex Lover Lavanya Says Telangana Minister Gave Rs 55 Lakhs Loan7
తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్‌తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య

హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun), అతడి స్నేహితుడు శేఖర్‌ బాషా వల్ల తనకు ప్రాణహాని ఉందని లావణ్య (Lavanya) ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ శనివారం నాడు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ప్రాణాలు విడుస్తానంది. మీడియాతో లావణ్య మాట్లాడుతూ.. ఇటీవల నాపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న రాత్రి నలుగురు వ్యక్తులు నా ఇంటిపైకి వచ్చారు. భయంతో బతుకున్నాను. నా ప్రాణం పోయాక చర్యలు తీసుకుంటారా? ఆ ఇంటి కోసమే నాపై ఇలా దాడి చేస్తున్నారు.రూ.55 లక్షల అప్పునిజానికి ఆ ఇంటిపై తెలంగాణ మంత్రి బంధువుల దగ్గరి నుంచి రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. నాలుగేళ్లవుతోంది.. రెండేళ్లుగా మా గొడవల వల్ల వడ్డీ చెల్లించడం లేదు. కాస్త గడువు ఇవ్వమని అడుగుతూ వచ్చాం. నిన్న సాయంత్రం వారు మాకు ఫోన్‌ చేశారు. వారం రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇల్లు ఆక్రమించుకుంటామన్నారు. అందుకు నేను ఒప్పుకున్నాను. రెండుమూడురోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తాను. ఇకపోతే ఆ మంత్రి పేరు నేను చెప్పలేను. నాలుగురోజుల్లో ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తారు. అప్పుడు మీకే తెలుస్తుంది.పరువు పోతుందని ఆగా..ఒకవేళ రాజ్‌తరుణ్‌.. అప్పిచ్చిన వ్యక్తికి రూ.55 లక్షలు ఇచ్చినా సరే ఆ ఇంటిని మళ్లీ రాజ్‌తరుణ్‌కు ఇవ్వకూడదని కోరతాను. ఎందుకంటే ఆ ఇంట్లో నా వాటా కూడా ఉంది. ఇప్పటికే రాజ్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో అతడిపై కేసులు కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. పరువు పోతుందని ఇంతకాలం ఈ విషయం బయటకు చెప్పలేదు అని లావణ్య పేర్కొంది.చదవండి: శంకర్‌దాదా ఎంబీబీఎస్‌.. ఆమె జీవితాన్నే మార్చేసింది!

YV Subba Reddy Strong Counter To Vijaysai Reddy Comments8
అధికారంలో ఉన్నప్పుడు విజయసాయే చక్రం తిప్పింది

విజయవాడ, సాక్షి: లిక్కర్‌ కేసు విచారణ సందర్భంగా రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వైఎస్సార్‌సీపీ కోటరీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ పడింది. అసలు అలాంటి కోటరీ ఒకటి ఉందో లేదో ఆయనకే తెలియాలి అంటూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజయసాయికి చురకలు అంటించారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదోరకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారు. ఆయన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనే కదా ప్రధానంగా చక్రం తిప్పింది. అలాంటప్పుడు పార్టీలో కోటరీ ఉందో? లేదో?.. కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా?. ఇప్పుడేమో నెంబర్‌ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని ఆయనే చెప్పుకుంటున్నాడు. .. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు. మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎప్పుడూ లేదు.. రాబోయే రోజుల్లో కూడా ఉండదు. మా పార్టీలో నెంబర్‌ వన్‌ నుంచి 100 వరకూ అన్నీ జగన్ మోహన్ రెడ్డే’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ అంటూ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. భయపెట్టి కొంతమందిని లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అన్నింటి పైనా న్యాయపోరాటం చేస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Son gets married after father passed away to receive his blessings video viral9
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి

చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్‌(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్‌ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Kutami Atrocities No confidence motion against Vizag Mayor Live Updates10
GVMC: అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గిన కూటమి

విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో ప్రజాస్వామ్యం మళ్లీ మళ్లీ ఖూనీ అవుతోంది. బలం లేకున్నా విశాఖ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి.. కుట్రలు, ప్రలోభాల పర్వాలతో అడ్డదారిలో నెగ్గింది. ఏకంగా 30 మంది కార్పొరేటర్లను కొనుగోలు చేసిన టీడీపీ.. యాదవ సామాజిక వర్గానికి చెందిన గొలగాని హరి వెంకటకుమారిను మేయర్‌ పీఠం నుంచి దించేసింది. అధికార వ్యామోహంలో ఉన్న కూటమి ప్రభుత్వం.. కేవలం పది నెలల కాలం ఉన్న ఓ మేయర్ పదవి కోసం కోట్లాది రూపాయలు గుమ్మరించడం గమనార్హం. ఈ క్రమంలో దిగజారుడు రాజకీయాలు చేసింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు చివరి నిమిషం దాకా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. కార్పొరేటర్లను ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలకు పంపడం, స్టార్‌ హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయడం లాంటి చేష్టలకు పాల్పడింది. కేరళకు వెళ్లి మరీ వైస్సార్‌సీపీ కార్పొరేటర్లను బెదిరించి.. బతిమాలి.. డబ్బు ఆశ చూపించి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. అవిశ్వాసం నెగ్గాలంటే 74 ఓట్లు అవసరం. ఒకవైపు డబ్బు ఎర, మరోవైపు బెదిరింపులు, ఇంకోవైపు కిడ్నాపులు.. ఇలా టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అయినా సరే బొటాబొటిగా 74 మంది సభ్యులతోనే విశాఖ మేయర్‌పై అవిశ్వాసం నెగ్గింది టీడీపీ. ఇక అవిశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే.. భారీ భద్రత నడుమ ఓటింగ్‌ నిర్వహించాలని, ఓటింగ్‌ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌ చేయించాలని వైఎస్సార్‌సీపీ చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కూటమి నేతలను అడ్డుకోని పోలీసులుఅవిశ్వాసం వేళ.. కూటమి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు కాకుండా కొందరు కూటమి నేతలను పోలీసులు జీవీఎంసీ కార్యాలయంలోకి లోపలికి అనుమతించారు. బస్సులో ఉన్న కూటమి నాయకులను వారి అనుచరులను నిలువరించకుండా చూస్తూ ఉండిపోయారు. ఓటింగ్‌కు వెళ్లిన సభ్యులతో కలిసి జీవీఎంసీ దర్జాగా కొందరు కూటమి నేతలు వెళ్తున్న దృశ్యాలు మీడియాకు చేరడం గమనార్హం. నీచమైన రాజకీయాలు వద్దని చెప్పాప్రత్యేక విమానంలో కేరళ వచ్చి కూటమి నేతలు నన్ను బెదిరించారు. కూటమికి అనుకూలంగా ఓటు వేయమన్నారు. నేను పార్టీ మారేది లేదని చెప్పాను. మొదటినుంచి నేను వైఎస్సార్‌సీపీలో ఉన్నాను. రాజకీయమంటే వ్యాపారం కాదు. డబ్బులు కోసం నీతిమాలిన రాజకీయాలు చేయను. నీచమైన రాజకీయాలను చెయ్యొద్దని చెప్పాను. వైయస్ జగన్ వలనే నేను కార్పోరేటర్ అయ్యాను అని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ శశికళ ఈ ఉదయం ఓ వీడియో విడుదల చేశారు కూడా. ఓటింగ్‌కు ముందు వాస్తవ బలాబలాలువైఎస్సార్సీపీ 58 టీడీపీ 29జనసేన 3బీజేపీ 1సీపీఐ 1సీపీఎం 1ఇండిపెండెన్స్ 4.ఖాళీలు 1.జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లుజీవీఎంసీలో 14 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులుటీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు.. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీ..వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎక్స్ అఫీషియ సభ్యులు.ఎంపీ గొల్ల బాబురావు, ఇద్దరు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం జీవీఎంసీ సభ్యుల సంఖ్య బలం 97+14= 111అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం..ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి వైఎస్సార్‌సీపీ మొత్తం బలం 61ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48ఎన్నికకు దూరంగా ఇద్దరు సీపీఎం, సీపీఐ సభ్యులు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement