గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్లో బుధవారం రిజర్వేషన్ల ఖరారుపై మున్సిపల్ అధికారుల సమావేశం జరిగింది. హైదరాబాద్ 150, వరంగల్ 58, ఖమ్మం 50 డివిజన్లు ఉన్నాయి. వీటితో పాటు పెండింగ్లో ఉన్న మరికొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఒకట్రెండు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ శివార్లలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.