15 శాతం వార్షిక రాబడి.. అత్యాశే! | Dhirendra Kumar, CEO, Value Research interview | Sakshi

15 శాతం వార్షిక రాబడి.. అత్యాశే!

Published Mon, Oct 14 2013 1:26 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

15 శాతం వార్షిక రాబడి.. అత్యాశే! - Sakshi

15 శాతం వార్షిక రాబడి.. అత్యాశే!

నేను ప్రైమరీ హోల్డర్‌గా నా భార్య సెకండరీ హోల్డర్‌గా కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశాను. నా భార్య గృహిణి మాత్రమే.

నేను ప్రైమరీ హోల్డర్‌గా నా భార్య సెకండరీ హోల్డర్‌గా కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశాను. నా భార్య గృహిణి మాత్రమే. ఎలాంటి ఆదాయ వనరులు లేవు.  ఫండ్ సంస్థ నివేదించిన వార్షిక సమాచార నివేదిక(యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఏఐఆర్) ఆధారంగా ఆదాయపు పన్ను అధికారులు  సెకండరీ హోల్డర్‌గా ఉన్న మా ఆవిడ ఫండ్స్ విషయమై వివరణ అడుగుతున్నారు. నేను ఏం చేయాలి? 
 - పవన్ కుమార్, వరంగల్
 ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా కనీసం రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్ వివరాలను మ్యూచువల్ ఫండ్ సంస్థ వార్షిక సమాచార నివేదిక(యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్-ఏఐఆర్)ను ఆదాయపు పన్ను అధికారులకు పంపించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పన్ను ఎగవేతలను నివారించడానికి ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. ఇన్వెస్టర్ సమర్పించే ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్)లో, ఐటీ అధికారులకు అందే ఏఐఆర్‌లో ఏమైనా తేడాలుంటే దానికి సదరు ఇన్వెస్టర్‌దే బాధ్యత. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను మీరు ప్రైమరీ హోల్డర్‌గా, మీ భార్య సెకండరీ హోల్డర్‌గా కొనుగోలు చేసిన పక్షంలో, సెకండరీ హోల్డర్‌గా ఉన్న మీ భార్య తాను కేవలం మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణకు సంబంధించి కేవలం జాయింట్ సెకండరీ హోల్డర్‌ని మాత్రమేనని ఆదాయపు పన్ను అధికారులకు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్‌లను ప్రైమరీ హోల్డర్ పెట్టుబడులతోనే కొనుగోలు చేయడం జరిగిందని వారికి తెలపాల్సి  ఉంటుంది. 
 
 నేను రిటైరై ఏడాదవుతోంది. ఎలాంటి నష్టభయం లేని, ఏడాదికి 15% రాబడినిచ్చే మ్యూ చువల్ ఫండ్స్‌లో కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. 
 - సింహాచలం, విశాఖ పట్టణం
 నష్ట భయం లేని ఇన్వెస్ట్‌మెంట్స్ నుంచి 15% వార్షిక రాబడి ఆశించడం కొంచెం ఎక్కువేనని చెప్పాలి. మీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని స్థిరాదాయాన్నిచ్చే మార్గాల్లో, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో మదుపు చేయండి. ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా పెట్టుబడులు పెట్టడం సముచితం.  రిటైరైన తర్వాత క్రమం తప్పకుండా మీకు కొంత ఆదాయం కావాలి. ఎంత ఆదాయం కావాలో అంత మొత్తానికి స్థిరాదాయాన్నిచ్చే  స్కీముల్లో పెట్టుబడులు పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీల్లో మదుపు చేయాలి. ఉదాహరణకు మీకు రిటైర్మెంట్ సొమ్ము రూ.25 లక్షలు వచ్చిందనుకుందాం. దీంట్లో రూ.15 లక్షలను 9% రాబడినిచ్చే సీని యర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో పొదుపు చేయవచ్చు. మిగతా మొత్తాన్ని ఈక్విటీల్లో కొద్ది మొత్తాల్లో క్రమం తప్పక ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ఒకే కేటగిరీ ఈక్విటీల్లో కాకుండా, వివిధ రంగాలకు చెందిన ఈక్విటీల్లో డైవర్సిఫై చేయడాన్ని మరువకండి. 
 
 నేను కొంత మొత్తాన్ని 366 రోజుల ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్(ఎఫ్‌ఎంపీ)లో ఇన్వెస్ట్ చేశాను. దీనిపై వచ్చే రాబడిని ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వచ్చే రాబడిని లెక్కించినట్లుగా మా ఆడిటర్ లెక్కించాడు. ఎఫ్‌ఎంపీలకు ఉండే ఇండెక్సేషన్ ప్రయోజనాలను మా ఆడిటర్‌కు తెలిపాను. దీనికి సంబంధించిన చట్టం, తదితర వివరాలు కావాలని ఆయన అడుగుతున్నారు. దయచేసి ఆ వివరాలు వెల్లడిస్తారా?              - సమీర, హైదరాబాద్
 ఆదాయపు పన్ను(ఐటీ) చట్టం, 1961లో సెక్షన్ 112లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. అన్ని ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్‌లో కూడా ఈ సమాచారం ఉంటుంది. పన్ను ఆదాలకు ఇండెక్సేషన్ తోడ్పడుతుంది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement