భారీ సైబర్‌ దాడి | it's again, Ransomware virus hits computer servers across Europe | Sakshi

భారీ సైబర్‌ దాడి

Published Tue, Jun 27 2017 9:38 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

భారీ సైబర్‌ దాడి

భారీ సైబర్‌ దాడి

సైబర్‌ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. మరో ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌తో మంగళవారం యూరప్‌ దేశాలపై విరుచుకుపడ్డారు.

- మళ్లీ పడగవిప్పిన ర్యాన్సమ్‌వేర్‌..
- రష్యా, ఉక్రెయిన్‌, బ్రిటన్‌ సహా ఈయూ దేశాలు అతలాకుతలం
- ఎయిర్‌పోర్టు, కార్యాలయాల్లో ఎక్కడిక్కడే నిలిచిన పనులు


మాస్కో/లండన్‌:
సైబర్‌ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్‌వేర్‌ వైరస్‌తో మంగళవారం మరోమారు యూరప్‌ దేశాలపై  విరుచుకుపడ్డారు. దీంతో రష్యా, ఉక్రెయిన్‌, బ్రిటన్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లో కార్యకలాపాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

మొదటిగా రష్యాలోని అతిపెద్ద ఆయిల్‌ కంపెనీ సైబర్‌దాడికి గురైనట్లు గుర్తించారు. కొద్దిసేపటికే ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోని కంప్యూటర్లు వైరస్‌ దాడికి గురయ్యాయి. ఈ రెండు దేశాల్లోని ఫార్మా, మీడియా, బయోటెక్నాలజీ తదితర కంపెనీలన్నీ వైరస్‌ బారిన పడటంతో గందరగోళం నెలకొంది.

భారత్‌ సహా ఆసియాదేశాలు, అమెరికాలపై సైబర్‌దాడి ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సిఉంది. అటు యూరప్‌లోని బ్రిటన్‌, స్పెయిన్‌లలోని పలు కంపెనీల ఆఫీసులు ర్యాన్సమ్‌ దాడికి గురైనట్లు వార్తలు వచ్చాయి. నెల రోజుల కిందటే ప్రపంచమంతా ర్యాన్సమ్‌వేర్‌ వాన్నాక్రై వైరస్‌ ధాటికి విలవిలలాడిన పరిస్థితి తెలిసిందే.

ఇది చూశారంటే మీ ఫైల్స్‌ గోవిందా..
సైబర్‌దాడికి గురైన కంప్యూటర్ల స్క్రీన్లపై "If you see this text, then your files are no longer accessible, because they have been encrypted. Perhaps you are busy looking for a way to recover your files, but don't waste your time. Nobody can recover your files without our decryption service" అనే సందేశం ప్రత్యక్షమైంది.

ఉక్రెయిన్‌కు భారీ దెబ్బ
నేటి సైబర్‌ దాడితో అన్ని దేశాలకంటే ఎక్కువగా నష్టపోయింది ఉక్రెయినే అని ఆ దేశ ప్రధాని అన్నారు. ఎయిర్‌పోర్టు, కంపెనీల కార్యాలయాలన్నీ దాడికి గురయ్యాయని, గతంలో ఎప్పుడూ ఇంత నష్టాన్ని చవిచూడలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement