
కదిరి ఆధ్యాత్మిక కడలిని తలపించింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనతరంగం ఉప్పెనలా ఎగసింది. ‘నమో నారసింహ... గోవిందా’ నామస్మరణ ప్రతిధ్వనించింది

భక్తిభావం ముందు భగభగ మండే భానుడే వెలవెలబోగా..ఆధ్యాత్మిక శోభ వెల్లివెరిసింది

ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం వేళ చిన్నా, పెద్దా తారతమ్యం మరచి భక్తిపారవశ్యంలో మునిగితేలారు. దవనం, మిరియాలు రథంపై చల్లి మొక్కులు చెల్లించుకున్నారు












