Top Stories
ప్రధాన వార్తలు

గెలిచి నిలిచిన రైజర్స్
చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్‌తో సూపర్ కింగ్స్‌ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్‌కు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్‌కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్ 5 వికెట్లతో సీఎస్కేపై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెవిస్ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (0) అవుట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్ తరహాలో ఆయుశ్ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్ కరన్ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్ కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షల్ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్ చేయగా... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రెవిస్ మాత్రం కమిందు బౌలింగ్‌లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ బాదిన బ్రెవిస్ తర్వాతి బంతికి కమిందు మెండిస్ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. శివమ్ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన అన్షుల్ కంబోజ్ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్ కిషన్... ఛేదనలో సన్‌రైజర్స్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) అవుట్ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్‌ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్ కిషన్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడంతో రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) అభిషేక్ (బి) షమీ 0; ఆయుశ్ (సి) ఇషాన్ కిషన్ (బి) కమిన్స్ 30; స్యామ్ కరన్ (సి) అనికేత్ (బి) హర్షల్ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్ (సి) కమిందు (బి) హర్షల్ 42; శివమ్ దూబే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 12; హుడా (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 22; ధోని (సి) అభిషేక్ (బి) హర్షల్ 6; అన్షుల్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 2; నూర్ (సి) షమీ (బి) హర్షల్ 2; ఖలీల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్: షమీ 3–0–28–1, కమిన్స్ 4–0–21–2, ఉనాద్కట్ 2.5–0–21–2, హర్షల్ పటేల్ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్ 3–0–26–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఆయుశ్ (బి) ఖలీల్ 0; హెడ్ (బి) కంబోజ్ 19; ఇషాన్ కిషన్ (సి) కరన్ (బి) నూర్ 44; క్లాసెన్ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్ (సి) హుడా (బి) నూర్ 19; కమిందు (నాటౌట్) 32; నితీశ్ రెడ్డి (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్: ఖలీల్ 3–0–21–1, కంబోజ్ 3–0–16–1, నూర్ అహ్మద్ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్ కరన్ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం
వాణిజ్య సుంకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరతలు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూనే ఉంది. విస్తృత జనాభా, సాంకేతిక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచ ‘క్రియేటివ్ పవర్ హౌస్’గా తనను తాను నిరూపించుకునే సత్తా భారత్‌కుంది. కథలు చెప్పడంలో మనకున్న సామర్థ్యాన్ని ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ విజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను (క్రియేటర్స్) లక్ష్యంగా చేసుకుని భారత మీడియా–వినోద (ఎం అండ్ ఇ) రంగం ముందుకు సాగుతోంది.చలనచిత్రం, సంగీతం, కళ, సాంకేతికత వంటి వివిధ రంగాలలో యువ సృష్టికర్తలకు భారత్ నిలయంగా ఉంది. ముఖ్యంగా ‘డ్యూన్–2’ సినిమా ఆస్కార్ గెలుపునకు కారణమైన అద్భుత వీఎఫ్ఎక్స్ను అందించిన విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ స్టూడియోగా నమిత్ మల్హోత్రాకు చెందిన ‘డీఎన్ఈజీ’ని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్ ప్రాబల్యాన్ని తెలియచెబుతూ భారత్‌కు 7వ ఆస్కార్‌ను తెచ్చిపెట్టింది. సంప్రదాయ ఫిల్మ్ మేకింగ్ నుంచి డిజిటల్ నిర్మాణానికి మళ్ళుతూ ప్రపంచ స్థాయి కంటెంట్‌ను రూపొందించడంలో భారత్ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.ముంబయి వేదికగా మే నెలలో భారత ప్రభుత్వం ‘ప్రపంచ ఆడియో–విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ను నిర్వహిస్తోంది. యువ సృష్టికర్తలను పరిశ్రమ దిగ్గజాల చెంతకు చేర్చడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం వేవ్స్‌లో భాగమైన వేవ్స్ ఎక్స్లెరేటర్ (వేవెక్స్) లక్ష్యం. యువ సృష్టికర్తలు అనుభవజ్ఞుల సలహాలు పొందేలా చూడటం, నిధుల లభ్యత, అంతర్జాతీయ అవకాశాలను అందించడం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత అంకుర సంస్థల స్థాయిని పెంచడానికి వేవ్స్ కృషి చేస్తుంది. గేమింగ్, కృత్రిమ మేధ, మెటావర్స్ వంటి వినూత్న రంగాలపై దృష్టి సారిస్తూ... ఈ రంగం 2023లో రూ. 2,422 బిలియన్ల నుంచి 2027 నాటికి రూ.3,067 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, బ్రాహ్మణ్ గేమ్ స్టూడియోస్, కీబౌండ్, వాయన్ క్లౌడ్ వంటి అంకుర సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉపకరిస్తుంది. వీటిలో మీడియా – వినోద రంగ సామర్థ్యాన్ని చాటే ల్యాప్వింగ్ స్టూడియోస్, వైగర్ మీడియా వంటి మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టడానికి ఒక పోటీతత్వ అంకుర సంస్థల వాతావరణాన్ని వేవ్స్ అందిస్తుంది. పెట్టుబడులు పొందడానికి, అంతర్జాతీయ అరంగేట్రంలో ఇబ్బందులను తప్పించడానికి, మెంటార్షిప్ అడ్డంకులకు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక విజన్‌తో ‘బయోకాన్’ను ప్రారంభించిన నాకు ఇటువంటి ప్రోత్సాహక వేదికల ప్రాముఖ్యం ఏమిటో బాగా తెలుసు.క్రియేటివ్ హబ్ కళలంటే ఇష్టపడే నేను మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ (మ్యాప్), సై¯Œ ్స గ్యాలరీ బెంగళూరు కార్యక్రమాలకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక దేశ సంస్కృతి దాని కళలు, శాస్త్రాలతో ముడిపడి ఉందని బలంగా నమ్ముతాను. కళలు, విజ్ఞాన శాస్త్రం రెండూ సృజనాత్మకతలో భాగమే. కళాకారులు వేదికపై ప్రదర్శించే విధంగానే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తారు.కథలు చెప్పడంలో శతాబ్దాలుగా నైపుణ్యం కలిగిన భారత్... ప్రపంచ సృజనాత్మక శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. శాస్త్రీయ నృత్యం నుంచి సినిమా వరకు; కామిక్స్ నుంచి ఇమ్మర్సివ్ టెక్నాలజీ వరకు, అధునాతన సృజనాత్మకత ఆవిష్కరణలతో ముడిపడి ఉన్న ఉత్తేజకరమైన యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ అనే ఆలోచన ఈ ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది.సృజనాత్మక అంకుర సంస్థలకు ఉత్ప్రేరకంసాంకేతికత, కథ చెప్పడంలోని నైపుణ్యానికి వేవ్స్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. యానిమేషన్, ఏఐ, ఏఆర్/వీఆర్, గేమింగ్, మెటావర్స్ వంటి వినూత్న రంగాల్లో అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా వేవెక్స్ తన ప్రాబల్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉంది.వేవ్స్ బజార్లో 4,500కు పైగా అమ్మకందారులు, 5,900కి పైగా కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు. ఇది భారతీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ సంస్థల చెంతకు చేర్చడం ద్వారా ప్రపంచ మీడియా, వినోద రంగాల్లో భారత్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంప్రదాయ మీడియాకు మించిన ఆవిష్కరణలకు కూడా వేవ్స్ పెద్దపీట వేస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా తయారుచేసిన ప్రకటనల్లో ఎరుకానావిస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అదే సమయంలో యానిమేషన్, వీఆర్ ద్వారా అమేజ్ స్టూడియోస్, ఆఫ్‌లైన్ హ్యూమన్ స్టూడియోలు కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. ఇన్స్కేప్ ఎక్స్ఆర్, విజన్ ఇంపాక్ట్ వంటి ఎడ్–టెక్ వెంచర్లు ఇమ్మర్సివ్ మీడియాతో నేర్చుకునే విధానంలో మార్పులు తెస్తున్నాయి.భవిష్యత్ దృక్కోణంమీడియా, వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేవ్స్ వంటి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విషయంలో భారత ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం వేవ్స్ ద్వారా కేవలం అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే కాదు, కథను చెప్పే, స్వీయ–వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్వచించే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోనూ పెట్టుబడి పెడుతున్నాం. అది బయోటెక్ ల్యాబ్ కావొచ్చు, డిజిటల్ స్టూడియో కావొచ్చు... సృజనాత్మకత అనేది రేపటి పరిశ్రమలు, గుర్తింపులను రూపొందించే ఒక సాధనం.వేవ్స్–2025 భారతదేశపు మీడియా, వినోద పరిశ్రమలకు సంబంధించిన వేడుకే కాదు... ఇప్పటి వినోదం, విద్య, సంస్కృతుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచంలో తదుపరితరం సృష్టికర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయ వేదిక.ఈ ప్రయాణంలో వేవ్స్ సలహా సంఘంలో నేనూ ఒక సభ్యురాలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచ సృజనాత్మక విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధమవుతున్న క్షణమిది. ‘భారత్‌లో సృష్టిద్దాం– ప్రపంచం కోసం సృష్టిద్దాం’ అంటూ అనంత కాల్పనిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం.-వ్యాసకర్త బయోకాన్ గ్రూప్ చైర్ పర్సన్-కిరణ్ మజుందార్ షా

ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: బ.నవమి ప.1.03 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శ్రవణం ఉ.8.06 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.12.02 నుండి 1.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు, అమృతఘడియలు: రా.9.30 నుండి 11.01 వరకు.సూర్యోదయం : 5.41సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.3.00 నుండి 3.00 వరకు మాస శివరాత్రి. మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలలో ఆటంకాలు. పనులు మధ్యలో వాయిదా పడతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త చిక్కులు.వృషభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విద్యావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.సింహం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. శుభవార్తా శ్రవణం. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.తుల: గౌరవం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు.వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులు విధుల్లో అవాంతరాలు.ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.మకరం: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. పనుల్లో మరింత పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.మీనం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభం. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు.

కార్పొరేట్ సంస్థలకు కళ్లెం
ప్రభుత్వాల హవా తగ్గి కార్పొరేట్లు, గుప్పెడుమంది వ్యక్తులు రాజ్యాన్ని శాసించే స్థితి ప్రపంచమంతటా వచ్చి చాన్నాళ్లవుతోంది. ఇలాంటి స్థితిలో డిజిటల్ మార్కెటింగ్ చట్టం (డీఎంఏ) ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికన్ బడా టెక్ సంస్థలు యాపిల్, మెటా (ఫేస్బుక్)లకు భారీయెత్తున జరిమానా విధించి యూరోపియన్ యూనియన్ (ఈయూ) కొంత సాహసాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. యాపిల్ సంస్థకు 57 కోట్ల డాలర్లు (రూ. 4,868 కోట్లుపైగా), మెటా సంస్థకు దాదాపు 23 కోట్ల డాలర్లు (రూ. 1,965 కోట్లు) ఈయూ పెనాల్టీ విధించింది. వచ్చే జూన్ చివరికల్లా యాపిల్ ఈయూ నిబంధనలకు భిన్నంగావున్న తన యాప్ స్టోర్ నిబంధనల్లో సవరణలు చేయకపోతే రోజువారీ జరిమానాలు మొదలవుతాయి. మెటా సంస్థ నిరుడు ఈయూ నోటీసు అందుకున్నాక దారికొచ్చి యాప్ స్టోర్‌లో మార్పులు తెచ్చింది. అందువల్ల పాత తప్పులకు మాత్రమే జరిమానా పడింది. ఈయూ తమపై కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తున్నదని ఆ రెండు సంస్థలూ ఆరోపిస్తున్నాయి. నిజానికి ఈ రెండు సంస్థలకు విధించిన జరిమానాలూ చాలా తక్కువన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లోవుంది. మ్యూజిక్ స్ట్రీమింగ్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ నిరుడు యాపిల్ సంస్థకు 205 కోట్ల డాలర్ల (రూ. 17,500 కోట్లపైమాటే), మెటా సంస్థకు 90 కోట్ల డాలర్ల (రూ. 7,685 కోట్లకుపైగా) జరిమానాలు విధిస్తున్నట్టు ఈయూ ప్రకటించింది. ఏడాదిగా ఆ సంస్థల వివరణను పరిశీలించే పేరిట తాత్సారం చేసి చివరకు తుది తీర్పు ప్రకటించింది. ఆ సంస్థలు మాత్రం ఇది కూడా అన్యాయమేనన్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నాయి.వర్తమాన పరిస్థితుల్లో ఈయూ ఈ స్థాయి జరిమానాలు విధించటం ఒకరకంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిష్ఠించాక లెక్కలు మారిపోయాయి. సర్వరోగ నివారిణిగా ఆయన అధిక సుంకాల మోతమోగిస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రత్యేకించి అమెరికన్ టెక్ కంపెనీల జోలికి ఎవరొచ్చినా తాట తీస్తామంటున్నారు. మొన్న ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన కృత్రిమ మేధ సదస్సు సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈయూపై బాహాటంగానే అక్కసు వెళ్లగక్కారు. ఏఐ ప్రగతిని అడ్డుకునేలా యూరప్ వ్యవహ రిస్తున్నదని, అమెరికా బడా సంస్థలను అతిగా నియంత్రించే పోకడలు మానుకోవాలని హెచ్చరించారు. ఆయన ప్రత్యేకించి డీఎంఏ, డిజిటల్ సర్వీసెస్ చట్టం (డీఎస్ఏ)లను ప్రస్తావించారు కూడా. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) సైతం తమకు సమ్మతం కాదని తెలిపారు. యూరప్ దేశాల్లో నిబంధనలు తమ వ్యాపార విస్తరణకూ, లాభార్జనకూ ఆటంకం కలిగిస్తున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నట్టు వాన్స్ వివరించారు. ఈ పోకడల్ని సహించబోమన్నారు. ఇదంతా గుర్తుంచుకుంటే ఈయూ తాజా నిర్ణయంలోని ఆంతర్యమేమిటో బోధపడుతుంది. కాకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఏటా కోట్లాది డాలర్లు పన్నుల రూపంలో చెల్లిస్తున్న తమ బడా సంస్థలంటే అమెరికాకు అభిమానంవుండొచ్చు. కానీ ఆ సంస్థలు రకరకాల నిబంధనల పేరిట సాధారణ వినియోగదారుల్ని పీల్చి పిప్పి చేస్తున్నా, దివాలా తీయిస్తున్నా వేరే దేశాల వారెవరూ మాట్లాడకూడదని ట్రంప్, వాన్స్ భావించటం తెంపరితనం తప్ప మరోటి కాదు. యాపిల్ యాప్ స్టోర్‌లో లభించే మ్యూజిక్ యాప్ తదితరాలపై అధికంగా వసూలు చేస్తున్నారని భావించే వినియోగదారులు నేరుగా తమ వద్ద కొనుగోలు చేయొచ్చని చెప్పే డెవలపర్ల సందేశం కనబడకుండా, ఆ యాప్‌కు నేరుగా తీసుకెళ్లే లింక్‌లు పనిచేయకుండా యాపిల్ నిరోధిస్తున్నది. ఇక మెటా అయితే తన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లభ్యమయ్యే యాప్‌లు కావాలంటే వినియోగదారుల వ్యక్తిగత డేటా ఉపయోగించుకోవటానికి అనుమతించాలని షరతు విధిస్తోంది. అంగీకరించనివారికి ఆ యాప్‌లలో వాణిజ్య ప్రకటనలు కనబడేలా చేస్తోంది. అవి వద్దనుకుంటే నెలవారీ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సాంకేతికతలు ఎంతగానో విస్తరించిన ఈ తరుణంలో బడా కార్పొరేట్ సంస్థలు వాటిపై ఆధారపడకతప్పని స్థితి జనాలకు కల్పించి చెల్లిస్తారా... చస్తారా అన్నట్టు పీక్కుతింటున్నాయి. ఈ స్థితిలో కీలెరిగి వాతపెట్టిన చందాన డీఎంఏ రంగప్రవేశం చేసింది. టెక్ కంపెనీలు ఉల్లంఘనలకు పాల్పడితే ఆ సంస్థల ప్రపంచ టర్నోవర్‌లో 10 శాతం, పదే పదే ఆ తప్పులు చేస్తూ పోతే ప్రపంచ టర్నోవర్‌లో 20 శాతం మేర జరిమానాలు విధించాలని చట్టం నిర్దేశిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు వాతలుపెట్టి అనవసరంగా ట్రంప్ ఆగ్రహాన్ని చవిచూడటమెందుకని ఈయూ జంకుతున్న వైనం తాజా నిర్ణయంలో స్పష్టంగా కనబడుతోంది. వాటిపై చర్య తీసుకుంటున్నామన్న అభిప్రాయం యూరప్ ప్రజల్లో కలగాలి... అదే సమయంలో ట్రంప్ చేత చీవాట్లు తినకుండా, ఆయనగారిని మరీ నొప్పించకుండా గండాన్ని గట్టెక్కాలి అని ఈయూ భావిస్తోంది. అయితే మనకన్నా ఈయూ ఎంతో నయం. గుత్తాధిపత్య వ్యాపార ధోరణులను అరికట్టడానికున్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కఠినంగా ఉండలేకపోతున్నది. గూగుల్ సంస్థ పోకడలను అరికట్టడంలో ఎంతో కొంత విజయం సాధించినా అది చాలినంతగా లేదు. వినియోగదారులూ, స్థానిక పరిశ్రమలూ నిలువుదోపిడీకి గురికాకుండా... టెక్ సంస్థలైనా, మరే ఇతర సంస్థలైనా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు కావలసిన చట్టాలు తీసుకురావాలి. అనారోగ్యకర వ్యాపార పోకడలపై కఠినచర్యలుండాలి. బడా కార్పొరేట్ సంస్థలు తమ లాభాలను అపారంగా పెంచుకోవటం, అవి ప్రభుత్వాల్ని శాసించే స్థితికి ఎదగటం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది. అందుకే ఈయూ చర్యల్ని స్వాగతించాలి.

అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్

పాక్‌ను ముక్కలు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘మోదీజీ.. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను భారత్‌లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీటైన జవాబు ఇచ్చారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కఠినంగా వ్యవహరించాలి.. ‘పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ మద్దతు పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.‘ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుతున్నాం. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం’అని రేవంత్ అన్నారు. ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయ్ దుర్గామాతతో పోల్చారని పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీరు దుర్గామాత భక్తులు. ఇందిరను ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు. కొవ్వొత్తుల ప్రదర్శన...పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ ఎంపీలు అజహరుద్దీన్, సల్మాన్ ఖుర్షీద్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, సలహాదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని ప్రారి్థంచారు. భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ ముందుకు సాగారు.

అవినీతి 'ఐకానిక్'!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది. అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.నాడూ నేడూ అదే దోపిడీ..!2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు అప్పగించింది.

ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!
సాక్షి, అమరావతి: బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. ఆరి్థక ఆస్తుల నిర్వహణలో పారదర్శత తీసుకురావడంతోపాటు బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఖాతా దారులకు రెండు ఆప్షన్లునలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.గతంలో ఒక్క నామినీకే అవకాశం గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతోపాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్‌కి అవి జమ అయిపోతున్నాయి.

జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

కాసింత నీడ.. కాస్తంత నీరు..!
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మేలో 47 వరకూ వెళ్లే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా. రాష్ట్ర ప్రభుత్వం వేసవిని ఎదుర్కొనేందుకు హెచ్చరికలు జారీ చేయడం తప్ప, క్షేత్ర స్థాయిలో తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు కనపడడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వేడిగాలులు పెరిగాయి. డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాష్టన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలకు ఇవి దారితీస్తాయి. ప్రభుత్వ తక్షణ దృష్టి అవశ్యం తీవ్ర ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉంచే దిశలో ప్రభుత్వం కీలక చర్యలు తీసుకోవాలి. భారత వాతావరణ శాఖ భాగస్వామ్యంతో జిల్లాల వారీగా హీట్ అలర్ట్స్ మరింత కచ్చితత్వంతో జారీ చేయాలి. అన్ని వర్గాలకు ఈ హెచ్చరికలు చేరేలా చూడాలి. బస్టాండ్లు, ఆటోస్టాండ్లు, రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలి. కూల్ రూఫ్ బస్టాండ్లు, షెడ్లను శాశ్వతంగా నిర్మించడం మంచిది. ఆసుపత్రుల్లో హీట్ స్ట్రోక్ యూనిట్లు, ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, ఐవీ ఫ్లూయిడ్స్, ఎమర్జెన్సీ బెడ్లు సిద్ధం చేయాలి. ఇక బడుల సమయాల్లో మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉండకుండా చూడాలి. బయట తరగతులు నిర్వహించకూడదు. హీట్ అలర్ట్ వచి్చనపుడు సెలవులు ప్రకటించాలి. ప్రజా రవాణా పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు» బయటకి వెళ్లే సమయాన్ని తగ్గించుకోవాలి. » మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి. » తప్పనిసరిగా బయటకి వెళ్లాల్సివస్తే తలపై టోపీ, తెల్లని దుస్తులు ధరించాలి. » రోజుకు కనీసం 3–4 లీటర్ల వరకు నీటిని తాగాలి. కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటివి తాగడం మంచిది. » ఆహార నియమాలు పాటించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వేడి ఆహారం, మసాలా పదార్థాలు, డ్రై ఫుడ్స్ తగ్గించి ఎక్కువగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. » వృద్ధులు, చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిని వేడి సమయాల్లో ఇంట్లోనే ఉంచాలి. తగినంత నీటిని తాగేలా చూడాలి. » వ్యాయామాలు ఉదయం, సాయంత్రం మాత్రమే చేయాలి » కూలీలు, రైతులు ఉదయం 6–10 లేదా సాయంత్రం 5–7 సమయంలో పని చేయాలి. » రోడ్లపై పనిచేసే ట్రాఫిక్ పోలీసులు, కూలీలకు జాకెట్లు, నీటి పంపిణీ జరగాలి. వడదెబ్బ తగలకుండా ఢిల్లీ తరహాలో కూల్ రూమ్ కాన్సెప్‌్టను ప్రవేశపెడితే మంచిది. » అడవుల్లో జంతువుల కోసం నీరు అందుబాటులో ఉంచాలి. హీట్ వేవ్ హాట్ స్పాట్లుకర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుఅన్ని చర్యలు తీసుకుంటున్నాంరోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఈ సంవత్సరం వేసవి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసి, తగిన చర్యలను సూచిస్తున్నాం. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మంచిది. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదు.
ఖాకీ రీల్స్
వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
భారత షిప్పింగ్ మూలాలు పటిష్టం
సరఫరా వ్యవస్థలో మార్పులతో భారత్‌కు ప్రయోజనాలు
బంగారం.. కొనేదెలా..?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
బయోమెట్రిక్స్, చిరునామా
ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీల వీసాలు రద్దు
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
ప్రాణాలు కాపాడిన ఉప్పు
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
మళ్లీ ఉగ్ర కాండ!
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
టాపర్ కాస్త హంతకుడిగా..
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
గెలిచి నిలిచిన రైజర్స్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
సాక్షి కార్టూన్ 25-04-2025
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
ఒకే ఇల్లు.. ఒకే వంట
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
పాక్‌ను ముక్కలు చేయండి
మెగా అగచాట్ల డీఎస్సీ!
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
రంగంలోకి యుద్ధనౌకలు!
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
సీఎస్కేపై సన్‌రైజర్స్ ఘన విజయం
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలోకి విధ్వంసకర వీరుడు?
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
IPL 2025: ధోని అరుదైన రికార్డు..
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
ఎన్టీఆర్‌తో స్పెషల్ డ్యాన్స్?
మే నెలలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
‘ఆపరేషన్ కర్రెగుట్ట ఆపండి.. చర్చలకు రండి’
అవినీతి 'ఐకానిక్'!
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
చీరలో అనసూయ ఇలా.. అంజలి ఏమో అలా
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
జలదిగ్బంధం!
భారీగా పెరిగిన టెలికం కంపెనీల ఆదాయం: ఏకంగా..
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
డేంజర్ నుంచి క్రిటికల్ జోన్లోకి.. ఎస్ఎల్బీసీలో ఇప్పుడేం జరుగుతోంది?
ఖాకీ రీల్స్
వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
భారత షిప్పింగ్ మూలాలు పటిష్టం
సరఫరా వ్యవస్థలో మార్పులతో భారత్‌కు ప్రయోజనాలు
బంగారం.. కొనేదెలా..?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
బయోమెట్రిక్స్, చిరునామా
ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం
తీన్మార్ మల్లన్నకు హైకోర్టు నోటీసులు
పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీల వీసాలు రద్దు
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్.. మండిపడ్డ నెటిజన్స్!
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
సికింద్రాబాద్: గోదాంలో భారీగా నోట్ల కట్టలు కలకలం
పాకిస్తాన్‌కు వెళ్లిపోయిన కేన్ మామ
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
ప్రాణాలు కాపాడిన ఉప్పు
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
తల్లికి వందనం డబ్బులు అడిగితే సంపద సృష్టించే మార్గం చెవిలో చెప్పండని వెళ్లిపోతున్నాడు!
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
IPL 2025: ప్లే ఆఫ్స్ రేసు.. ఏ జట్టు ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
నా భార్య వర్షిణి ఎక్కడ?.. ప్రత్యేక బ్యారెక్‌లో అఘోరీ అరుపులు, కేకలు!
మళ్లీ ఉగ్ర కాండ!
విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
ఏపీ గవర్నర్‌ను కలిసిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
పాకిస్తానీలు వెంటనే మీ దేశానికి వెళ్లండి: తెలంగాణ డీజీపీ
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
యాహూ! ఎట్టకేలకు భారతీయురాలిగా..! వీడియో వైరల్
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
టాపర్ కాస్త హంతకుడిగా..
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఉగ్రదాడి ఘటనపై నోరు జారిన ఎమ్మెల్యే అరెస్ట్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
చిరంజీవి సినిమాలో విలన్‌గా టాలీవుడ్ యంగ్ హీరో!
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
నేపాల్ మీదుగా హైదరాబాద్‌కు.. పోలీసుల అదుపులో పాకిస్తానీ
కోటీశ్వరుడినయ్యా.. నాకేంటి?!.. వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
గెలిచి నిలిచిన రైజర్స్
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
నిశ్చితార్థం చేసుకుని ఏడాది.. మరి పెళ్లెప్పుడు?
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
సాక్షి కార్టూన్ 25-04-2025
ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
ఐపీఎల్ క్రికెటర్ ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
పవన్ సినిమా వాయిదా.. ఎందుకంటే ఈ రెండు మూవీస్
ఒకే ఇల్లు.. ఒకే వంట
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోండి
పాక్‌ను ముక్కలు చేయండి
మెగా అగచాట్ల డీఎస్సీ!
అనుష్క చేతిలో ఏడు సినిమాలు? ప్రభాస్‌కు జంటగా..!
ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!
‘పవన్.. మీరు సామాన్యులను, దళితులను పట్టించుకోరా?’
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
రంగంలోకి యుద్ధనౌకలు!
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
నెవ్వర్.. ఆ ఇద్దరితో విజయశాంతి నటించే ఛాన్స్ లేదు
‘అలా చేస్తే అర్జున్ టెండుల్కర్ మరో క్రిస్‌గేల్ అవుతాడు’
సీఎస్కేపై సన్‌రైజర్స్ ఘన విజయం
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
నెల్లూరు లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య
కాకమ్మకు జర్రమొచ్చింది.. చీమల పుట్టను వెతుక్కుంది
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలోకి విధ్వంసకర వీరుడు?
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
IPL 2025: ధోని అరుదైన రికార్డు..
బీచ్‌లో చిల్ అవుతోన్న సుప్రీత.. తేనే కళ్లతో కవ్విస్తోన్న బిగ్‌బాస్ దివి!
పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం
నీళ్లతో మనకేం పని! మనం తాగేది రక్తం కదా!!
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం
ఎన్టీఆర్‌తో స్పెషల్ డ్యాన్స్?
మే నెలలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం
‘ఆపరేషన్ కర్రెగుట్ట ఆపండి.. చర్చలకు రండి’
అవినీతి 'ఐకానిక్'!
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
పిఠాపురంలో పవన్ ‘రచ్చ’బండ రద్దు
చీరలో అనసూయ ఇలా.. అంజలి ఏమో అలా
ఉగ్రదాడిలో మీ హస్తం లేకపోతే ఎందుకు ఖండించలేదు.. పాక్ ప్రధానిని నిలదీసిన ఆ దేశ మాజీ క్రికెటర్
నేనేమీ మాట్లాడలేను.. ఒంటరిగా వదిలేయండి:
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్ డూప్
పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
ముత్యాల నగరంలో..ఆభరణాల ఉత్సవం!
కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు
జలదిగ్బంధం!
భారీగా పెరిగిన టెలికం కంపెనీల ఆదాయం: ఏకంగా..
ఆ ఊళ్లో అల్లుడే పెద్దకొడుకు
అతడొక అద్భుతం.. రెండేళ్లలో టీమిండియాకు ఆడుతాడు: శాంసన్
రూటు మార్చిన చంద్రబాబు.. ఏపీలో ఆర్థిక విధ్వంసం
డేంజర్ నుంచి క్రిటికల్ జోన్లోకి.. ఎస్ఎల్బీసీలో ఇప్పుడేం జరుగుతోంది?
సినిమా

నాన్సెన్స్ అంటున్నా... కుర్రహీరోయిన్లతో ఆగని సీనియర్ హీరోల రొమాన్స్..!
‘‘అవును రష్మికతో చేస్తున్నా..తర్వాత ఆమె కుమార్తెతో కూడా నటిస్తా..మీకేంటి ప్రాబ్లమ్?’’ అంటూ తీవ్ర స్వరంతో అడిగిన సల్మాన్‌ఖాన్ ప్రశ్నలో విసుగును గమనించారా? మన దేశంలో అనేక భాషలకు చెందిన వయసు పైబడిన హీరోలు అందరిలో పైకి కనపడని చిరాకులకు అది ప్రతిరూపంగా చెప్పొచ్చు. కొంత కాలంగా సీనియర్ హీరోలు తమకు జోడీ కడుతున్న హీరోయిన్ల విషయంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్‌కు గురవుతున్నారు.వృధ్ధాప్యానికి చేరువలో ఉన్న నటులు తమకన్నా చాలా తక్కువ వయస్సు గల మహిళా కథానాయకులతో జతకట్టడం అనేది ఇటీవల తరచూ వివాదాలు విమర్శలకు కారణమవుతోంది. కొందరు దీనిని దీనిని వృత్తి పరమైన అంశంగా సమర్థిస్తున్నారు. మరికొందరు, ఇది హానికరమైన మూస పద్ధతులను కొనసాగిస్తుందని వయసు పెరిగిన నటీమణులకు అవకాశాలను పరిమితం చేస్తుందని వాదిస్తున్నారు.తమ కన్నా బాగా తక్కువ వయసు ఉన్న వారితో రొమాంటిక్ పాత్రలలో పెద్ద వయసున్న మగవాళ్లు నటించడం అనేది ఈనాటిది కాదు ఇది ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారింది.. అయితే చర్చా వేదికలు పెరగడం, భావ వ్యక్తీకరణ మార్గాలు విస్త్రుతం కావడంతో ఇప్పుడు ఈ తరహా రొమాన్స్‌ను నాన్సెన్స్గా తిట్టిపోయడం కూడా పెరుగుతోంది.ఒకప్పుడు సీనియర్ హీరోలుగా ఉన్న ఎన్టీయార్, ఏయన్నార్‌లు తమ కన్నా చాలా చిన్న వయసు అమ్మాయిల పక్కన నటించినా...ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనపడవు. అదేపని ఇప్పుడు సీనియర్ హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలు చేస్తే మాత్రం విమర్శకులు నోళ్లకు పదను పెడుతున్నారు. అందుకే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్లతో రొమాన్స్ చేసే పాత్రలకు బదులు తన వయసుకు తగ్గ పాత్రలతో సరిపెట్టుకుంటున్నాడు. వయసు కనపడనీయని నాగార్జున మన్మధుడు 2లో రకుల్‌కి ముద్దొచ్చాడేమో కానీ... మరోవైపు విమర్శకుల నోటికి బాగా పనిచెప్పాడు. అలాగే హీరో రవితేజ కూడా గత కొంత కాలంగా ఇదే విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు.హీరోలు తమకన్నా కనీసం 20 ఏళ్ల వయసు తక్కువ ఉన్న యువతులతో నటించడం బాలీవుడ్లో సర్వసాధారణం. ఎప్పుడో 1980లలోనే దయావన్ లో వినోద్ ఖన్నా తనకన్నా 21 ఏళ్ల చిన్నదైన మాధురి దీక్షిత్‌తో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేశాడు. నిశ్శబ్ద్లో, సీనియర్ అమితాబ్ బచ్చన్ తన కంటే 46 ఏళ్లు చిన్న వయస్సులో ఉన్న జియాఖాన్ తో కలిసి నటించాడు. ఇక దీపికా పదుకొణె ఓం శాంతి ఓం చిత్రంలో తనకన్నా 20 ఏళ్ల సీనియర్ షారూఖ్ ఖాన్ పక్కన తెరంగేట్రం చేసింది. కాగా, రబ్ నే బనా ది జోడిలో అరంగేట్రం చేసిన అనుష్క శర్మ షారూఖ్ కంటే 23 ఏళ్లు చిన్నది. గజినిలో అమీర్ ఖాన్, సహ నటి కంటే 20 సంవత్సరాలు పెద్దవాడు. 44 ఏళ్ల అజయ్ దేవగన్ 23 ఏళ్ల తమన్నాతో కలిసి హిమ్మత్వాలా చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. అయితే ఈ ట్రెండ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోన్నట్టు కనిపిస్తోంది. సల్మాన్‌ఖాన్ ఏక్ థా టైగర్‌లో తనకన్నా 19 ఏళ్లు చిన్నదైన కత్రినా కైఫ్‌తో నటించాడు. దబాంగ్‌లో 20 ఏళ్ల చిన్నదైన సోనాక్షి సిన్హా తో నటించాడు. ఇప్పుడు ఏకంగా తనకన్నా 32ఏళ్ల చిన్నదైన రష్మిక మందన్నతో జోడీ కట్టాడు. మరోవైపు మన మెగాస్టార్ చిరంజీవి కూడా తన సమకాలీకుడైన కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్‌తో స్టెప్స్ వేయడం చూశాం.ఈ పరిస్థితి మారాలని, హీరోలు వయసుకు తగినట్టుగా తమ జోడీలను ఎంచుకోవాలనే డిమాండ్ ఎప్పుడూ లేనంత స్థాయిలో వినిపిస్తోంది. పాత చింతకాయ పచ్చడి లాంటి రొడ్డకొట్టుడు ధోరణికి చెక్ పెట్టాలని, వయసు పెరుగుతున్న నటీమణులకు అవకాశాలను పరిమితం చేయడం సరైంది కాదని అంటున్నారు. ఇప్పటికీ మాధురీ దీక్షిత్ నటిస్తున్నా ఆమె సల్మాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాల్లేవు అలాగే సుహాసిని, రాధిక తదితరులు ఉన్నా వారు చిరంజీవి, బాలకృష్ణల పక్కన హీరోయిన్స్‌గా ఎంపిక కాలేదు.. ఈ పరిస్థితి హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాళ్ అనే పాత కాలపు ధోరణికి బలం చేకూరుస్తోందనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. ఏదేమైనా ఎప్పుడూ లేనంత బలంగా వినిపిస్తున్న విమర్శలు... సీనియర్ హీరోల్లో ఎలాంటి మార్పులు తెస్తాయో...చూడాలి.

'హిట్ 3' కోసం అనిరుధ్.. వీడియో సాంగ్ రిలీజ్
నాని(Nani) హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ హిట్ 3(HIT 3 Movie). మే 1న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ముంబయి, కేరళ అంటూ నాని తెగ తిరిగేస్తున్నాడు. మరోవైపు ఇన్వెస్టిగేషన్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా నుంచి ఇప్పుడో పాట రిలీజ్ చేశారు. దీన్ని అనిరుధ్ పాడటం విశేషం.హిట్ 3 మూవీ నుంచి ఇదివరకే ప్రేమ వెల్లువ, అభీ బార్ అర్జున్ సర్కార్ అనే పాటలు రిలీజయ్యాయి. ఇప్పుడు 'తను..' అంటే సాగే గీతాన్ని రిలీజ్ చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్ లో ఉన్న నాని.. హీరోయిన్ కోసం పాడే సాంగ్ ఇదని అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) దీన్ని మిక్కీ జే మేయర్ కంపోజ్ చేయగా.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పాడాడు. స్వతహాగా సినిమాలకు కంపోజ్ చేసే అనిరుధ్.. కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కానీ పాడటానికి మాత్రం రూపాయి కూడా తీసుకోడు. గతంలో అతడే ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు కూడా నాని కోసమే అనిరుధ్ ఈ పాట పాడినట్లు అనిపిస్తుంది. గతంలో నాని 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. నెక్స్ట్ రాబోయే 'ప్యారడైజ్' కూడా ఇతడే సంగీతమందించబోతున్నాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దృష్ట్యా హిట్ 3లో అనిరుధ్ పాట పాడినట్లున్నాడు.(ఇదీ చదవండి: పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్)

పహల్గాం ఘటన.. సింగర్ చిన్మయి కాంట్రవర్సీ పోస్ట్
కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వల్ల 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎలాగైనా సరే సదరు ఉగ్రవాదుల్ని చంపాల్సిందే అని ప్రతి ఒక్క భారతీయుడు కోపంతో రగిలిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ సింగర్ చిన్మయి వివాదాస్పద పోస్ట్ పెట్టింది. కులం ఆధారంగా తక్కువ చేసి చూసేవాళ్లూ టెర్రరిస్టులతో సమానమని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: భర్తతో కలిసి కాస్ట్ లీ కారు కొన్న హీరోయిన్) ఇంతకీ ఏం జరిగింది?దక్షిణాదిలో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయమై ట్వీట్, పోస్ట్ పెడుతూ వివాదాలు కొనితెచ్చుకునే చిన్మయి.. ఇప్పుడు కూడా అలాంటి పోస్ట్ పెట్టింది.చిన్మయి పోస్టులో ఏముంది?'నేను షెడ్యూల్ కులానికి చెందిన అమ్మాయిని. సోకాల్డ్ హిందువులు.. నేను వాళ్లలో ఒకరినే అనే విషయాన్ని మర్చిపోయారు. ఎందుకంటే నా చిన్నతంలో మా ఊరి దేవాలయానికి వెళ్లేదాన్ని. పూజారి మాత్రం నాకు నేరుగా ప్రసాదం ఇచ్చేవారు కాదు. నా కాలేజీ రోజుల్లోనూ అంతే. రిజర్వేషన్ల వల్ల మీరంతా మా నెత్తిపై కూర్చున్నారని మా లెక్చరర్ అనేవారు. ఇలాంటి అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాను''చెప్పడానికి బాధగా ఉన్నా.. నా చుట్టూ ఉంటే అగ్ర కులానికి చెందినవాళ్లు, కులం ఆధారంగా తక్కువ చేసే చూసేవాళ్లందరూ కూడా టెర్రరిస్టులతో సమానమే. ఎందుకంటే వీళ్లందరూ నా మానసిక పరిస్థితిని బాగా ఇబ్బంది పెట్టాడు. కులం చూసి కొందరు చంపేస్తున్నారు. కులం ఆధిపత్యం చూపించి మరికొందరు మానసికంగా హింసించి చంపేస్తున్నారు' అని చిన్మయి తన పోస్టులో రాసుకొచ్చింది.సమయం సందర్భం లేకుండా చిన్మయి ఇలాంటి పోస్ట్ పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెని నోటికొచ్చినట్లు అంటున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
టైటిల్ : సోదరా నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తి గుప్తా, ప్రాచి బన్సాల్, బాబు మోహన్, బాబా భాస్కర్ తదితరులునిర్మాణ సంస్థలు: క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: చంద్ర చగన్లాఎడిటింగ్: శివ శ్రావణి దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లిసంగీతం: సునీల్ కశ్యప్ విడుదల: ఏప్రిల్ 25, 2025డిఫరెంట్ కామెడీ సినిమాలతో నవ్వించి మెప్పించే సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu ) మొదటిసారి రియల్ ఎమోషన్ చేశాను, న్యాచురల్ కామెడీ సినిమా చేశాను అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించాం అంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చారు. మరి ఈ సోదరా సినిమా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం(Sodara Movie Review )కథేంటంటే..తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లవ్వట్లేదని, వచ్చిన 99 సంబంధాలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్న సమయంలో చిరంజీవి ఎదురింట్లోకి దివి(ఆర్తి గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడతారు. ఇద్దరూ దీవిని ట్రై చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వస్తాయి. అదే సమయంలో కాలేజీలో చదువుకోడానికి చిరంజీవి తమ్ముడు పవన్ ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు పవన్. ఓ సారి పవన్ ఇంటికి వచ్చినప్పుడు దివి తన అన్నయ్యని రిజెక్ట్ చేసిందని తెలిసి మరోసారి నీ ప్రేమని చెప్పు అంటూ అర్ధరాత్రి తన అన్నయ్యని దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అది దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవ అయి రెండు కుటుంబాలు కొట్టుకునే దాకా వెళ్తారు. ఈ గొడవతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. తమ్ముడి వల్లే ఇదంతా జరిగిందని చిరంజీవి పవన్ కి దూరంగా ఉంటాడు. మరి చిరంజీవి - పవన్ మళ్ళీ అన్నదమ్ములుగా క్లోజ్ అవుతారా? దివి చిరంజీవి కోసం తిరిగి వస్తుందా? చిరంజీవి 100వ పెళ్లిచూపులు జరుగుతాయా? పవన్ లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కామెడీ కథలు చేసే సంపూర్ణేష్ బాబుతో మరో హీరోని పెట్టి అన్నదమ్ముల సినిమాతో పాటు ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ తెలంగాణ మట్టి వాసన, స్లాంగ్, జనాలు కాస్త రియలిస్టిగా చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఫస్టాఫ్ బాగా సాగదీసారు. కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్ కొడతాయి. ప్రథమార్థం సింపుల్ గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి నెలకొంటుంది. సెకండాఫ్‌లో కామెడీ, ఎమోషన్ పండించడానికి బాగానే కష్టపడ్డారు. కొన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్వుకుంటాం. ఓ పక్క లవ్ ఎమోషన్, మరో పక్క అన్నదమ్ముల ఎమోషన్ ని బాగానే చూపించే ప్రయాతం చేశారు. క్లైమాక్స్ లో కూడా మళ్ళీ ట్విస్టులు ఇచ్చి కథ ముగిస్తారు. అయితే అన్నదమ్ముల ఎమోషన్ ని లవ్ స్టోరీలు డామినేట్ చేశాయి అనిపిస్తాయి. ఎవరెలా చేసారంటే.. ఇన్నాళ్లు నవ్వించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ విలేజ్ లో సోడాలు అమ్ముకునే కుర్రాడి పాత్రలో సింపుల్ గా బాగానే నటించాడు. ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేసాడు. సంజోష్ కూడా తెలంగాణ యువకుడి పాత్రలో యాక్టివ్ గా కనపడ్డాడు. ఆర్తి గుప్తా కాసేపే కనపడినా పర్వాలేదనిపిస్తుంది. ప్రాచి బన్సాల్ తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రా పరిధి మేరకు నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే చూపించారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంది. సినిమాలో కొంతమందికి డబ్బింగ్ సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే మెప్పిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. మొదటి సినిమా అయినా డైరెక్టర్ మంచి కథ తీసుకొని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు... తీవ్రస్థాయికి చేరిన ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్. దౌత్య సంబంధాలకు కత్తెర. సింధూ ఒప్పందం సస్పెన్షన్. ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ

జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి... కాల్పులకు 26 మంది బలి, మరో 20 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ఇద్దరు విదేశీయులు

బాబోయ్ బంగారం. దేశంలో తొలిసారి లక్ష రూపాయల మార్కును దాటేసిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం

ఆంధ్రప్రదేశ్‌లో డొల్ల కంపెనీకి ఎకరం 99 పైసల చొప్పున అత్యంత ఖరీదైన భూమిని కేటాయించిన కూటమి ప్రభుత్వం...3 వేల కోట్ల రూపాయల ఖరీదైన భూమిని కొట్టేసే ఎత్తుగ

అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు... ఎంపీ మిథున్‌రెడ్డి విచారణలో సిట్ బాగోతం బట్టబయలు

వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు... దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు

సుదీర్ఘ కాలంగా వక్ఫ్ అధీనంలో ఉన్న ఆస్తులను ఇకపై కూడా వక్ఫ్ ఆస్తులుగానే పరిగణించాలని భావిస్తున్నాం... ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాం... సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో ఫీజుల షెడ్యూల్‌కు చెల్లుచీటి... కూటమి పాలనలో గతితప్పిన ఫీజు రీయింబర్స్మెంట్... ఊసేలేని వసతి దీవెన

వక్ఫ్(సవరణ) చట్టంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
క్రీడలు

గెలిచి నిలిచిన రైజర్స్
చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్ గతంలో ఎప్పుడూ ఓడించలేదు. ఈసారి చక్కటి బౌలింగ్‌తో సూపర్ కింగ్స్‌ను 154 పరుగులకే పరిమితం చేసినా... వరుసగా విఫలమవుతున్న బ్యాటింగ్ బృందంతో గెలుపుపై మళ్లీ సందేహాలు. ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించగా 37 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో జట్టు నిలిచింది. అయితే కమిందు మెండిస్‌కు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి జత కలిశాడు. వీరిద్దరు ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో ఆడి రైజర్స్ శిబిరంలో ఆనందం నింపారు. టోర్నీలో మూడో విజయంతో హైదరాబాద్‌కు కాస్త ఊరట దక్కగా... ఏడో పరాజయంతో చెన్నై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు దాదాపు ముగిసినట్లే! చెన్నై: ఐపీఎల్లో వరుసగా రెండు ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో విజయం దక్కింది. తొలిసారి చెన్నైని వారి వేదికపైనే ఓడించడంలో హైదరాబాద్ సఫలమైంది. శుక్రవారం జరిగిన పోరులో రైజర్స్ 5 వికెట్లతో సీఎస్కేపై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు), ఆయుశ్ మాత్రే (19 బంతుల్లో 30; 6 ఫోర్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్షల్ పటేల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కమిందు మెండిస్ (22 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రెవిస్ దూకుడు... తొలి బంతికే ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ (0) అవుట్ కావడంతో చెన్నై ఇన్నింగ్స్ పేలవంగా మొదలైంది. మరోవైపు గత మ్యాచ్ తరహాలో ఆయుశ్ మాత్రమే చక్కటి బౌండరీలతో ఆకట్టుకున్నాడు. మూడో స్థానంలో వచ్చిన స్యామ్ కరన్ (9) విఫలం కాగా... తర్వాతి ఓవర్లోనే ఆయుశ్ కూడా వెనుదిరిగాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 50/3 చేరింది. 8 పరుగుల వద్ద జడేజా ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షల్ వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే జడేజాను కమిందు బౌల్డ్ చేయగా... సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బ్రెవిస్ మాత్రం కమిందు బౌలింగ్‌లో చెలరేగిపోయి 3 సిక్సర్లు బాదడం విశేషం. హర్షల్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ బాదిన బ్రెవిస్ తర్వాతి బంతికి కమిందు మెండిస్ కళ్లు చెదిరే క్యాచ్‌కు వెనుదిరిగాడు. శివమ్ దూబే (12), ధోని (6)లతో పాటు ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా వచ్చిన అన్షుల్ కంబోజ్ (2) కూడా ప్రభావం చూపలేకపోయారు. చివర్లో దీపక్ హుడా (21 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కొన్ని పరుగులు జోడించడంతో స్కోరు 150 దాటింది. రాణించిన ఇషాన్ కిషన్... ఛేదనలో సన్‌రైజర్స్‌కు కూడా సరైన ఆరంభం లభించలేదు. రెండో బంతికే అభిషేక్ శర్మ (0) అవుట్ కావడంతో తొలి దెబ్బ పడింది. ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 19; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోగా పవర్‌ప్లేలో 37 పరుగులే వచ్చాయి. మరోవైపు ఇషాన్ కిషన్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (7) విఫలం కావడంతో రైజర్స్ కష్టాలు మరింత పెరిగాయి. వేగంగా ఆడే ప్రయత్నంలో రైజర్స్ వికెట్లు కోల్పోయింది. 16 పరుగుల వ్యవధిలో కిషన్, అనికేత్ వర్మ (19 బంతుల్లో 19; 2 సిక్స్‌లు) నిష్క్రమించడంతో గెలుపుపై సందేహాలు ఏర్పడ్డాయి. అయితే కమిందు, ఏడో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఒత్తిడిని అధిగమించి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరం చేర్చారు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రషీద్ (సి) అభిషేక్ (బి) షమీ 0; ఆయుశ్ (సి) ఇషాన్ కిషన్ (బి) కమిన్స్ 30; స్యామ్ కరన్ (సి) అనికేత్ (బి) హర్షల్ 9; జడేజా (బి) కమిందు 21; బ్రెవిస్ (సి) కమిందు (బి) హర్షల్ 42; శివమ్ దూబే (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 12; హుడా (సి) అభిషేక్ (బి) ఉనాద్కట్ 22; ధోని (సి) అభిషేక్ (బి) హర్షల్ 6; అన్షుల్ (సి) క్లాసెన్ (బి) కమిన్స్ 2; నూర్ (సి) షమీ (బి) హర్షల్ 2; ఖలీల్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–47, 4–74, 5–114, 6–118, 7–131, 8–134, 9–137, 10–154. బౌలింగ్: షమీ 3–0–28–1, కమిన్స్ 4–0–21–2, ఉనాద్కట్ 2.5–0–21–2, హర్షల్ పటేల్ 4–0–28–4, అన్సారీ 3–0–27–0, కమిందు మెండిస్ 3–0–26–1. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) ఆయుశ్ (బి) ఖలీల్ 0; హెడ్ (బి) కంబోజ్ 19; ఇషాన్ కిషన్ (సి) కరన్ (బి) నూర్ 44; క్లాసెన్ (సి) హుడా (బి) జడేజా 7; అనికేత్ (సి) హుడా (బి) నూర్ 19; కమిందు (నాటౌట్) 32; నితీశ్ రెడ్డి (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–37, 3–54, 4–90, 5–106. బౌలింగ్: ఖలీల్ 3–0–21–1, కంబోజ్ 3–0–16–1, నూర్ అహ్మద్ 4–0–42–2, జడేజా 3.4–0–22–1, స్యామ్ కరన్ 2–0–25–0, పతిరణ 3–0–27–0. ఐపీఎల్లో నేడుకోల్‌కతా X పంజాబ్ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

#SRH: సీఎస్కే కంచు కోట బద్దలు .. 12 ఏళ్ల తర్వాత తొలిసారి
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కమిందు మెండిస్(32 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సీఎస్కే బౌలర్లలో నూర్ ఆహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ఖాలీల్ అహ్మద్, కాంబోజ్ తలా వికెట్ సాధించారు. కాగా చెపాక్‌లో సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ విజయం సాధించడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ ఓటమితో సీఎస్కే ప్లే ఆఫ్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే

వారెవ్వా మెండిస్.. ఐపీఎల్ చరిత్రలోనే సంచలన క్యాచ్
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ కమిందు మెండిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. మెండిస్ అద్బుతమైన క్యాచ్‌తో సీఎస్కే ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్‌ను పెవిలియన్‌కు పంపాడు.చెన్నై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ ఐదో బంతిని బ్రెవిస్‌కు ఔట్ సైడ్ ఆఫ్ స్లో డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బేబీ ఏబీడీ లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కావడంతో అంతా సిక్స్ అని భావించారు. కానీ లాంగాఫ్‌లో ఉన్న మెండిస్ అద్భుతం చేశాడు. లాంగ్-ఆఫ్‌లో ఉన్న మెండిస్ గాలిలోకి తన ఎడమ వైపునకు దూకి సూపర్మ్యాన్లా క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్రెవిస్ ఒక్కసారిగా షాక్ పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఏడాది సీజన్లో అత్యుత్తమ క్యాచ్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. సీఎస్కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.Only a catch like that could’ve stopped that cameo from Brevis! 🤯Kamindu Mendis, take a bow 🙇#CSK 119/6 after 14 overs.Updates ▶ https://t.co/26D3UalRQi#TATAIPL | #CSKvSRH | @SunRisers pic.twitter.com/NvthsQfpUj— IndianPremierLeague (@IPL) April 25, 2025

చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. ఐపీఎల్ హిస్టరీలోనే
టీమిండియా స్టార్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే అత్యధిక సార్లు వికెట్ తీసిన బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ రషీద్‌ను మొదటి బంతికే ఔట్ చేసిన షమీ.. ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు.షమీ ఇప్పటివరకు ఇన్నింగ్స్ మొదటి బంతికి నాలుగు సార్లు వికెట్ సాధించాడు. జాక్వెస్ కాలిస్, కెఎల్ రాహుల్,ఫిల్ సాల్ట్, షేక్ రషీద్‌లను తొలి బంతికే షమీ ఔట్ చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ పేరిట ఉండేది. బౌల్ట్ మూడు సార్లు మొదటి బంతికే వికెట్ పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బౌల్ట్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. అయితే షమీ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో మాత్రం విఫలమవుతున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకుని జట్టుకు భారంగా మారుతున్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. 28 పరుగులిచ్చి కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. సీఎస్కే బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మాత్రే(30), రవీంద్ర జడేజా(21) రాణించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కట్ తలా రెండు వికెట్లు సాధించారు. సీఎస్కే కెప్టెన్ ధోనికి ఇది 400వ టీ20 మ్యాచ్ కావడం గమనార్హం.చదవండి: విరాట్ కోహ్లి తొందరపడ్డాడు.. అప్పటి వరకు ఆడాల్సింది: సురేష్ రైనా
బిజినెస్

ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
బిజినెస్ అంటే.. కేవలం పురుషులకు మాత్రమే సాధ్యమవుతుందన్న రోజులు పోయాయి. వ్యాపార ప్రపంచంలో మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. 'సాక్షి ఛబ్రా మిట్టల్' (Sakshi Chhabra Mittal). ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సాధించిన సక్సెస్ ఏమిటి?, అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సాక్షి ఛబ్రా మిట్టల్.. లండన్‌కు చెందిన 'ఫుడ్‌హాక్' వ్యవస్థాపకురాలు, సీఈఓ. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో బీఎస్సీ, ది వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన సాక్షి.. ఫైజర్‌లో తన కెరీర్ ప్రారంభించింది. అక్కడే ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల వంటి వాటిలో మంచి పట్టును సాధించింది. సైన్స్ అండ్ బిజినెస్ వంటి వాటిపై అమితాసక్తి కలిగిన ఈమె.. ఆనతి కాలంలోనే బాబిలోన్, డెలివరూ, డార్క్ట్రేస్ వంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టింది.ఆరోగ్య సంరక్షణ వైపు..ఆ తరువాత సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌లో చేరి, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ యొక్క పెట్టుబడి బృందంలో కీలక సభ్యురాలిగా మారింది. ఆ సమయంలో రోయివెంట్ సైన్సెస్‌తో ఒక బిలియన్ ఈక్విటీ ఒప్పందంతో సహా ప్రధాన పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే.. ఈమె దృష్టి ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లింది.కాలేయ వ్యాధి..2017లో సాక్షి ఛబ్రా మిట్టల్ మొదటి గర్భధారణ సమయంలో.. అనారోగ్యం వచ్చింది, దాని ఫలితంగా కాలేయ వ్యాధి వచ్చింది. అప్పుడు ఆయుర్వేద ఆహారాన్ని స్వీకరించి పూర్తిగా నయం చేసుకుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆహారమే ఔషధం అని భావించి.. ఫిబ్రవరి 2021లో ఫుడ్‌హాక్ సంస్థను ప్రారభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందగలిగింది. ఇది (ఫుడ్‌హాక్) ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సైన్స్, టెక్నాలజీ, ఆయుర్వేద సూత్రాలను మిళితం చేసి భోజనం అందించే డెలివరీ సంస్థ.సాక్షి ఛబ్రా.. భారతి గ్లోబల్‌కు నాయకత్వం వహిస్తున్న 'శ్రావిన్ మిట్టల్'ను వివాహం చేసుకుంది. ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో క్లాస్మేట్స్గా ఉన్న ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. ఈయన భారతీయ బిలియనీర్ సునీల్ మిట్టల్ కుమారుడు. సునీల్ మిట్టల్ భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ మరియు నికర విలువ రూ. 2,63,099 కోట్లు.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..

మే నెలలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
ఏప్రిల్ నెల ముగియనుంది. మే నెల వచ్చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెల సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. మే నెలలో శని, ఆదివారాలతో కలిపి మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉంటాయి.మే నెలలో బ్యాంకు సెలవుల జాబితా➤మే 1, 2025 – కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర దినోత్సవం➤మే 4, 2025 – ఆదివారం➤మే 9, 2025 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి➤మే 10, 2025 – రెండవ శనివారం➤మే 11, 2025 – ఆదివారం➤మే 12, 2025 – బుద్ధ పూర్ణిమ➤మే 16, 2025 – సిక్కిం స్టేట్ డే➤మే 18, 2025 – ఆదివారం➤మే 24, 2025 – నాల్గవ శనివారం➤మే 25, 2025 – ఆదివారం➤మే 26, 2025 – కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు➤మే 29, 2025 – మహారాణా ప్రతాప్ జయంతిఇదీ చదవండి: పహల్గాం ఘటన.. ఎల్ఐసీ కీలక ప్రకటనబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).

సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
ముంబయి: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 35,577 కోట్ల రూపాయల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించింది. గత సంవత్సరం 38,238 కోట్లతో పోలిస్తే, రెగ్యులర్ ప్రీమియం 11% వృద్ధి చెందింది. ప్రొటెక్షన్ న్యూ బిజినెస్ ప్రీమియం 4,095 కోట్ల రూపాయలు, వ్యక్తిగత ప్రొటెక్షన్ ప్రీమియం 793 కోట్ల రూపాయలుగా నమోదైంది.వ్యక్తిగత న్యూ బిజినెస్ ప్రీమియం 26,360 కోట్ల రూపాయలతో 11% వృద్ధి సాధించింది. పన్ను తర్వాత లాభం 2,413 కోట్ల రూపాయలతో 27% వృద్ధి చెందగా, సాల్వెన్సీ నిష్పత్తి 1.96 వద్ద బలంగా ఉంది. ఆస్తుల నిర్వహణ 4,48,039 కోట్ల రూపాయలకు 15% వృద్ధి చెందింది, డెట్-ఈక్విటీ మిశ్రమం 61:39గా ఉంది. 94% డెట్ పెట్టుబడులు ట్రిపుల్ ఏ, సావరిన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నాయి.దేశవ్యాప్తంగా 309,034 మంది బీమా నిపుణులు, 1,110 కార్యాలయాలతో బ్యాంకాషూరెన్స్, ఏజెన్సీ, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, పీవోఎస్, వెబ్ అగ్రిగేటర్ల ద్వారా విస్తృత సేవలు అందిస్తోంది.2025 మార్చి 31 నాటి పనితీరువ్యక్తిగత రేటెడ్ ప్రీమియం 19,354 కోట్ల రూపాయలతో 22.8% మార్కెట్ వాటా.ఏపీఈ 21,417 కోట్ల రూపాయలతో 9% వృద్ధి.వ్యక్తిగత న్యూ బిజినెస్ సమ్ అష్యూర్డ్ 2,76,918 కోట్ల రూపాయలతో 43% వృద్ధి.13 నెలలు, 61 నెలల పర్సిస్టెన్సీలో 63 బీపీఎస్, 528 బీపీఎస్ మెరుగుదల.వీవోఎన్‌బీ 5,954 కోట్ల రూపాయలతో 7% వృద్ధి, మార్జిన్ 27.8%.ఐఈవీ 70,250 కోట్ల రూపాయలతో 21% వృద్ధి.ఆపరేటింగ్ రిటర్న్ ఆన్ ఎంబెడెడ్ వాల్యూ 20.2%.ఆస్తుల నిర్వహణ 4,48,039 కోట్ల రూపాయలతో 15% వృద్ధి.సాల్వెన్సీ నిష్పత్తి 1.96.

ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
చైనీస్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇటీవల ఇండియన్ మార్కెట్లో 'సీలియన్ 7' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసినప్పటి నుంచి కొనుగోలుదారులు దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఒకే రోజు 52 కార్లను డెలివరీ చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను సాధించినట్లు ప్రకటించింది.గతంలో చాలా కంపెనీ వందలాది వాహనాలను డెలివరీ చేశాయి. కానీ బీవైడీ కంపెనీ డెలివరీ చేసిన కారు ధరలు ధర రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షలు మధ్య ఉన్నాయి. ఇంత ఖరీదైన కార్లను 52 డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్ల డెలివరీకి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో 308 Bhp పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తే.. పర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా 523 Bhp పవర్, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా వరుసగా 567 కిమీ, 542 కిమీ రేంజ్ అందిస్తాయి. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. View this post on Instagram A post shared by BYD India (@byd.india)
ఫ్యామిలీ

Summer లేస్ బ్రైట్ఫుల్
వేసవిలో కంఫర్ట్గానూ,స్టైలిష్‌గానూ ఉండే ఔట్ఫిట్స్ జాబితాలో కూల్‌గా మన మదిని చుట్టేస్తుంది క్రోచెట్ లేస్ డ్రెస్సింగ్ స్టైల్. ఎప్పుడూ ఎవర్గ్రీన్ అనిపించుకునే ఈ క్రియేటివ్ వర్క్‌ని ఏ ఫ్యాబ్రిక్‌తోనైనా జత చేస్తే రిచ్ లుక్‌ని మన సొంతం చేస్తుంది.క్యాజువల్ లేదా పార్టీవేర్‌గా ఇట్టే మార్కులు కొట్టేస్తుంది.బ్రైడల్ వేర్‌గా యూనివర్సల్ సింబల్‌ని సొంతం చేసుకున్న ఈ అల్లికల అందం ఈ వేసవికి మగువల ముస్తాబులో రెక్కలకు రంగులు అద్దుకున్న రాయంచలా మరింతగా మెరిసిపోతుంది.సంప్రదాయ హంగులుక్రోచెట్ లేస్ అత్యంత సున్నితమైన, క్లిష్టమైన వర్క్. సంప్రదాయ అల్లిక కావడంతో ఈ వర్క్ ఎవర్‌గ్రీన్‌గా అందరి మన్ననలు అందుకుంటుంది. కాటన్, సిల్క్, చందేరీ, నెటెడ్... ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా ఇట్టే జత కట్టే క్రోచెట్ లేస్‌లో సంప్రదాయ పద్ధతిలో హ్యాండ్మేడ్గానూ, అధునాతనంగా మిషనరీపైనా రూపు దిద్దుకుంటుంది. ఇండో–వెస్ట్రన్గానూ..వెస్ట్రన్ గౌన్స్, టాప్స్, మిడీస్.. ఇండోవెస్ట్రన్ శైలులు క్రోచెట్ లేస్ మోడల్ డ్రెస్సుల ద్వారా మనం చూడచ్చు. కాటన్, సిల్క్దారాలతో తయారయ్యే ఈ అల్లికల ఫ్యాబ్రిక్‌లో పువ్వులు, తీగలు, లతల డిజైన్లు కనిపిస్తాయి. లేతరంగులు, ముఖ్యంగా తెలుపులో ఎక్కువగా కనిపించే ఈ డ్రెస్సులు సమ్మర్ స్పెషల్‌గానూ యువతను ఆకట్టుకుంటున్నాయి.వెస్ట్రన్ బ్రైడ్స్ ధరించే పొడవాటి తెల్లని గౌన్లతో మనల్ని ఆకట్టుకుంటుంది క్రోచెట్ లేస్. మన సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలలోనూ నవ వధువులు లేస్ డిజైనరీ దుస్తులు ధరించడం చూస్తే కదలాడుతుండే హంసలు కళ్ల ముందు నిలుస్తాయి. క్యాజువల్ వేర్‌గానూ, చీరలు, లెహంగాలు, కుర్తా, దుపట్టా.. వంటి డ్రెస్సులకు, క్రొచెట్ లేస్ అందమైన అలంకరణగా విరాజిల్లుతుంది. క్రోచెట్ లేస్తో అంచులు, డెకరేటివ్ ప్యాచ్ లేదా మొత్తం దుపట్టా, శారీగానూ ఆకట్టుకుంటుంది. లేస్ ఆభరణాలుముచ్చటైన కంఠాభరణాలు, పర్సులు, హ్యాండ్ కఫ్స్, షూ డిజైన్స్‌లోనూ డిజైనర్లు లేస్తో క్రియేటివ్ డిజైన్స్‌ను మన ముందుకు తీసుకువస్తున్నారు. నాణ్యతను బట్టి వందల రూపాయల నుంచి డిజైన్‌ను బట్టి వేలల్లోనూ ఈ డిజైన్స్ ధర పలుకుతున్నాయి.

ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్..!
మధుమేహ బాధితులూ ఇకపై మీరంతా అధికంగా కార్బొహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని నిశ్చింతగా తినేయొచ్చు. ఊబకాయులు సైతం కార్బొహైడ్రేట్స్‌ను ఎంత కావాలంటే అంత లాగించేయొచ్చు. అవును.. మీరు వింటున్నది నిజమే. అదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ)ను అదుపులో ఉంచే స్మార్ట్ కుక్కర్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ బాపట్లలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు మూడేళ్లపాటు శ్రమించి అభివృద్ధి చేసిన ఈ వినూత్న ఆవిష్కరణ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కుక్కర్‌గా పేటెంట్ సైతం దీనికి లభించింది.గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) మనం తీసుకునే ఆహారంలో 55% కంటే తక్కువగా ఉంటే రక్తంలో సుగర్ అత్యంత నిదానంగా పెరుగుతాయి. జీఐ 56–70% మధ్య ఉంటే నెమ్మదిగా.. 70% పైబడి ఉంటే వేగంగా పెరుగుతాయి. రక్తంలో చక్కెర పాళ్లు పరిమితికి మించి పెరిగితే క్లోమ గ్రంధి (పాంక్రియాస్)పనితీరు మందగించి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిని తగ్గించడమే లక్ష్యంగా..ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దల్లోనేకాదు.. పిల్లల్లోనూ టైప్–1 డయాబెటిస్ విపరీతంగా పెరగడానికి కారణమవుతున్న ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్‌ను నియంత్రించాలన్న సంకల్పంతో బాపట్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్ బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త డి.సందీప్రాజా నేతృత్వంలో డాక్టర్ బీవీఎస్ ప్రసాద్, వి.వాసుదేవరావు, ఎల్.ఏడుకొండలుతో కూడిన శాస్త్రవేత్తల బృందం మూడేళ్లపాటు చేసిన పరిశోధన ఎట్టకేలకు ఫలించింది. ఎలాంటి వరి రకమైనా సరే ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా వాటిలోని జీఐ స్థాయిలను తగ్గించి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యేలా అభివృద్ధి చేసిన స్మార్ట్ కుక్కర్ ఆహార రంగంలో విప్లవమే.ఇదెలా పనిచేస్తుందంటే..ప్రాసెసింగ్ ట్రీట్మెంట్ ద్వారా జీఐను తగ్గించడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో బియ్యాన్ని స్టీమింగ్ ప్రక్రియ ద్వారా ఉడికిస్తారు. గంజిని సోలనాయిడ్ వాల్వ్ ద్వారా వేరు చేస్తారు. తర్వాత అన్నం వేగంగా చల్లబడే (ర్యాపిడ్ కూలింగ్) చాంబర్లోకి పంపి 1–2 డిగ్రీల సెల్సియస్‌లో ప్రాసెస్ చేస్తారు. శాస్త్రీయంగా చెప్పాలంటే.. బియ్యాన్ని రీట్రో గ్రేడ్ చేయడం (అన్నేలింగ్, హీట్ మాయిశ్చర్ ట్రీట్మెంట్ (హెచ్ఎంటీ) ద్వారా అన్నంలో ఉండే స్టార్చ్ (పిండి పదార్థం)లో 20 నిమిషాల్లో జీర్ణమయ్యే పదార్థం (ర్యాపిడ్లీ డైజెస్టబుల్ స్టార్చ్–ఆర్డీఎస్)ను 90 నిముషాల్లో నెమ్మదిగా జీర్ణయ్యే పదార్థం (స్లో డైజెస్టబుల్ స్టార్చ్–ఎస్డీఎస్)గా మారుస్తుంది. దీంతో పాటు అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది అసలు జీర్ణ మవకుండా డైటరీ ఫైబర్‌లా ప్రవర్తించేలా ఒక రకమైన పిండి పదార్థం. బియ్యాన్ని వండే సమయంలో అదనపు పానీడు తీసేయడంతో కొంత స్టార్చ్ తగ్గిపోతుంది. ఈ స్మార్ట్ కుక్కర్లో వండితే 45% ఆర్డీ ఎస్‌ను ఎస్డీఎస్గా మార్చి ఆర్ఎస్ను 121% శాతానికి పెంచుతుంది. ఫలితంగా గ్లైసెమిక్ ఇండెక్స్ 22% వరకు తగ్గిపోతుంది. ఇలా వండిన అన్నం సాధారణ అన్నంలాగే ఉంటుంది. సాధారణంగా వండే అన్నా నికి ఉన్నట్టుగానే రంగు, రుచి, వాసనలు పాడవకుండా ఉంటుంది.ప్రపంచంలోనే తొలి డయాబెటిస్ రైస్ కుక్కర్ఇది పూర్తిగా స్మార్ట్ కంట్రోల్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇంటిగ్రేషన్‌తో పనిచేస్తుంది. ఐవోటీ కంట్రోల్ రిమోట్ (మొబైల్ యాప్) ద్వారా ఎంతదూరం నుంచైనా దీనిని నియంత్రించవచ్చు. కేవలం ఒక కమాండ్ ఇస్తే చాలు ఇంట్లో అన్నం నిర్ణయించిన సమాయనికి రెడీ అయి ఉండేలా సెట్ చేసుకోవచ్చు. రైస్ వేరియంట్, బియ్యం–నీరు నిష్పత్తి, వండే ఉష్ణోగ్రత, చల్లదనం, స్టీమింగ్ సమయం వంటి వాటిని మొబైల్ ద్వారానే సెట్ చేసేలా ఏర్పాటు చేశారు. మనం పెట్టే బియ్యం రకం ఆధారంగా దానికి అవసరమైన నీటి నిష్పత్తి, ఉడికే ఉష్ణోగ్రత, ఉడికే సమయం, చల్లబడే ఉష్ణోగ్రత, చల్లబడే కాలం, స్టీమింగ్కు అవసరమైన సమయం, వంటి అంశాలను కూడా ప్రత్యేక ఆల్గారిథం ద్వారా స్వయం చాలకంగా నియంత్రిచబడతాయి. 2022లో ప్రారంభమైన ఈ పరిశోధనకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ పరిశోధన పూర్తిగా బాపట్లలోనే జరిగింది. ఫ్యాబ్రికేషన్ కోసం కోయంబత్తురులోని ఓ కంపెనీ సహకారం తీసుకున్నారు. ఈ వినూత్నమైన రైస్ కుక్కర్‌కు గత నెలలోనే భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కు(405194–001) లభించింది.డయాబెటిస్ రోగులకు ఎంతో ఉపయోగంస్మార్ట్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తినడం వల్ల రక్తంలోని సుగర్ స్థాయిలను పూర్తిగా నియంత్రించవచ్చు. నిధానంగా జీర్ణమవడం వల్ల మళ్లీ ఆకలి వేయడానికి సమయం పడుతుంది. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల శరీర బరువును కంట్రోల్ చేస్తుంది. శరీరంలోని శక్తి పెరగడమే కాకుండా అలసట తగ్గుతుంది. రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. త్వరలోనే ఈ స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇందుకోసం ఒక కంపెనీతో ఎంవోయూ చేసుకోబోతున్నాం. గతంలో నేను అభివృద్ధి చేసిన ఆప్లాటాక్సిన్ను కనుగొనే ఒక రాపిడ్ కిట్‌తో పాటు అతి తక్కువ ధరలోనే గైసెమిక్ ఇండెక్స్‌ను తగ్గించేలా తయారు చేసిన కిట్‌కు పేటెంట్ హక్కులు లభించాయి. వరుసగా మూడో ఆవిష్కరణకు పేటెంట్ హక్కు రావడం ఆనందంగా ఉంది.– డాక్టర్ దోనేపూడి సందీప్ రాజా, బయో కెమిస్ట్రీ శాస్త్రవేత్త, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సెంటర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్ల(చదవండి: ఇంటిని కూల్‌గా ఉంచడంలో ఆవుపేడ సహాయపడుతుందా..?)

నార్త్ టు సౌత్ నగరానికి క్యూ కడుతున్న నార్త్ ఫుడ్ బ్రాండ్స్
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న సంస్కృతుల సమ్మేళనంలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆహార రుచులు ఆదరణ పొందటం విధితమే. ఈ మధ్య కాలంలో నగరం వేదికగా నార్త్ డిషెస్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నగరంలో నార్త్ రెస్టారెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇందులో భాగంగానే నార్త్ ఇండియన్ ఫుడ్‌కు ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ నగరానికి విచ్చేసింది. ఢిల్లీ వేదికగా ప్రసిద్ధి చెందిన లజీజ్ అఫేర్ దక్షిణాదిలో మొదటిసారిగా నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45లో ఆవిష్కరించడం ఇక్కడి ఫుడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ అని ఫుడ్ బ్లాగర్స్ చెబుతున్నారు.స్మోక్ తందూరి కబాబ్‌లు మొదలు మటన్ షికంపురి కబాబ్, పత్తర్ కా గోష్ట్ వంటి వంటకాలు ఉత్తరాది లాజీజ్ అఫైర్ ప్రత్యేకత. వీటితో పాటు షాహి దమ్ కా ఆలూ, భట్టి కా పనీర్, షాదీ కా లాల్ చికెన్, దాల్ లాజీజ్, కేసర్ ఫిర్ని వంటి రుచులను నగరవాసులకు చేరువ చేయడానికి జూబ్లీహిల్స్‌లో లజీజ్ అఫేర్ను ప్రారంభించినట్లు ఇన్నాటో హాస్పిటాలిటీ డైరెక్టర్ యాష్ త్రివేది తెలిపారు. ప్రత్యేకించి నార్ట్ స్టైల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మరోసారి నగరవాసులకు రుచి చూపించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిసుగంధ ద్రవ్యాల సమ్మిళితంతో సాంస్కృతిక వంటకాలు, ఉత్తరాది పాకశాస్త్ర నైపుణ్యాలతో వడ్డించిన పసందైన రుచులు హైదరాబాదీల మనసు దోచేస్తాయన్నారు. అనాది ప్రపంచ స్థాయి వంటకాలకు నగరం వేదికగా నిలుస్తోంది. ఇక్కడి ప్రజలు వినూత్న రుచులను ఆస్వాదించే లక్షణమే ఈ ఆహార వైవిధ్యానికి కారణం. ఈ ప్రయాణంలో లజీజ్ అఫేర్కు స్పందన వస్తుండటం తమ ప్రయత్నానికి భరోసా లభించిందని సహా డైరెక్టర్ కుష్ త్రివేది వివరించారు.

Payal Rajput వజ్రాభరణాలంటే ఇష్టం..
గచ్చిబౌలి: వజ్రాభరణాలంటే చాలా ఇష్టమని నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) అన్నారు. కొండాపూర్‌లోని ప్రణవ్ వైష్ణాయ్ బిజినెస్ పార్క్‌లో టీబీజడ్–ది ఒరిజినల్ జ్యువెలర్ స్టోర్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో వివిధ రకాల డిజైన్ల భరణాలు ధరించి సందడి చేశారు. అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లడుతూ రూ.75 లక్షల విలువైన వజ్రాలు (Diamonds) పొదిగిన నక్లెస్‌తో పాటు మొత్తం కోటి రూపాయల విలువైన ఆభరణాలు ధరించానని చెప్పారు. ప్రతి ఆభరణం మన సంస్కృతిని తెలియజేసే విధంగా రూపొందించారన్నారు. టీబీజడ్ మూడో స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ రితీష్ గాడే మాట్లాడుతూ ప్రతి ఆభరణం మన వారసత్వానికి ప్రతీకలని, స్టోర్ బంగారంతో పాటు యాంటిక్, టెంపుల్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విస్తృతశ్రేణి మోడళ్లు, వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో సమకాలీన ఆభరణాల నుంచి సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. టీబీజడ్ ఒరిజినల్ సర్టిఫైడ్, స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్‌ను కలిగి ఉందన్నారు. దేశంలో వివిధ నగరాల్లో 37 స్టోర్లు ఉన్నాయని తెలిపారు. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి
ఫొటోలు


నిశ్చితార్థమై ఏడాది.. కాబోయే భర్తతో 'బిగ్ బాస్' శోభాశెట్టి (ఫొటోలు)


బాబోయ్.. సుర్రుమంటున్న ఎండలు.. జనం బెంబేలు (చిత్రాలు)


త్రిష తల్లిని చూశారా? ఈమె కంటే అందంగా ఉందిగా! (ఫొటోలు)


అందంగా ఆషికా.. అద్దం ముందు నుంచి కదలట్లేదుగా! (ఫోటోలు)


సూర్య ‘రెట్రో’ మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)


నేచురల్ స్టార్ నాని 'హిట్ 3' మూవీ స్టిల్స్


క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముచ్చట్లు (ఫొటోలు)


గోపీచంద్ కొత్త సినిమా హీరోయిన్ గా ఈ అమ్మాయే ..(ఫొటోలు)


పెళ్లి రోజు వేడుకను సెలబ్రేట్ చేసుకున్న అజిత్ కుమార్ దంపతులు.. (ఫోటోలు)


తిరుపతిలో హీరోయిన్ మీనాక్షిచౌదరి సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
ఇస్లామాబాద్: సరిహద్దు వెంట తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ పహల్గాం ఉదంతం తర్వాత సైతం తన బుద్ధిని మార్చుకోలేదు. తాజాగా కరాచీ తీరం వెంట క్షిపణి పరీక్షను చేపట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు తూర్పున ఉన్న కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించి క్షిపణిని పరీక్షించనున్నట్లు ఒక నోటీస్‌ను జారీచేసింది. అరేబియా సముద్రంలో తమ పరిధిలోని సముద్రజలాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలు లేకుండా నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఆ పరిధిలో నావికులు సంచరించకూడదని హెచ్చరించింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్‌ను పరీక్షంచనుంది. పాక్ తన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)ప్రాంతంలో ఏప్రిల్ 25వ తేదీన ఈ క్షిపణి పరీక్ష చేపట్టే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉదంతంపై ఆగ్రహంతో భారత్ తమపై ప్రతీకార దాడులకు దిగితే తాము కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేప్పేందుకే పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలకు దిగిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.

నీటి మళ్లింపు.. పాక్‌పై యుద్ధ ప్రకటనే
ఇస్లామాబాద్: సింధూ నది జలాల ఒప్పందాన్ని లెక్కచేయకుండా నీటి మళ్లింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా అది తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత్‌పై ఆంక్షలు ప్రకటించింది. భారతదేశ విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. ఇండియాతో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో గురువారం నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. పలువురు మంత్రులతోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై చర్చించారు. భారత్‌పైనా అదే తరహా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్ఎస్సీ భేటీ అనంతరం పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. కేవలం సిమ్లా ఒప్పందమే కాకుండా మిగతా ఒప్పందాలనూ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయాలు → ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు సిమ్లా ఒప్పందం సైతం నిలిపివేత. → వాఘా బోర్డర్ పోస్టు తక్షణమే మూసివేత. రాకపోకలు పూర్తిగా రద్దు. → ఈ సరిహద్దు గుండా బయటకు వెళ్లినవారు 30లోగా తిరిగిరావాలి. → సార్క్ వీసా మినహాయింపు పథకం(ఎస్‌వీఈఎస్) కింద భారతీయులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలు వెంటనే రద్దు. సిక్కు యాత్రికులకు మాత్రం మినహాయింపు. → ఎస్‌వీఈఎస్ పథకం కింద పాకిస్తాన్లో ఉన్న భారతీయులు 48 గంటల్లోకి బయటకు వెళ్లిపోవాలి. → పాక్‌లో ఉన్న భారతీయ త్రివిధ దళాల సభ్యులు ఏప్రిల్ 30 లోగా వెనక్కి వెళ్లిపోవాలి. భారత హైకమిషన్‌లోని ఈ పోస్టులు రద్దు. → భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న భారత సహాయక సిబ్బంది సైతం స్వదేశానికి వెళ్లిపోవాలి. → ఇండియన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, సిబ్బంది సంఖ్య 30కి పరిమితం. ఇది ఈ నెల 30వ తేదీ నుంచి అమల్లోకి. → పాక్ గగనతలంపై ప్రయాణించేందుకు భారత విమానాలు అనుమతి లేదు. ఈ నిర్ణయం ఇది తక్షణమే అమలు. → సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణం. 24 కోట్ల మంది పాక్ పౌరులకు ఈ జలాలు జీవనాధారం. → ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో, ఎక్కడున్నా అంతం చేయాల్సిందే. శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ పాక్ సార్వ¿ౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన రీతిలో బదులిస్తాం. → రాజకీయ ఎజెండా కోసం పాక్‌పై నిందలు వేయడం భారత్ మానుకోవాలి. ఇలాంటి నిందలు శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు.

సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గురువారం పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్ చర్యలను ప్రకటించింది. భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్ ప్రభుత్వం.. భారత్ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది. యూఎస్ఏ (పవర్ ఇండెక్స్ 0.0744)2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.రష్యా (పవర్ ఇండెక్స్0.0788)అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.చైనా (పవర్ ఇండెక్స్ 0.0788)పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.భారత్ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దక్షిణకొరియా (పవర్ ఇండెక్స్ 0.1656)పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.యూకే (పవర్ ఇండెక్స్ 0.1785)పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్రాన్స్ (పవర్ ఇండెక్స్ 0.1878)అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.జపాన్ (పవర్ ఇండెక్స్ 0.1839)సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉన్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.టర్కీ (పవర్ ఇండెక్స్ 0.1902)టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.ఇటలీ (పవర్ ఇండెక్స్ 0.2164)అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.పవర్ ఇండెక్స్ లెక్క ఇలా..పవర్ ఇండెక్స్ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం. .
జాతీయం

పాక్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి
న్యూఢిల్లీ, సాక్షి: పాకిస్థాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరుల్ని గుర్తించి తక్షణమే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.పహాల్గం ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయుల వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారం లోపు దేశం విడిచిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు నజర్ వేశారు. పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాకిస్తానీయులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది.. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తేలింది. వీళ్లను రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.నల్లరిబ్బన్లతో నమాజ్‌కు..పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింలు నమాజ్‌కు హాజరయ్యారు. మరోవైపు.. శాస్త్రిపురంలోని ఒక మసీదులో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నమాజ్ కోసం వచ్చిన వాళ్లకు నల్లటి రిబ్బన్ పంపిణీ చేశారు.

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూత
బెంగళూరు, సాక్షి: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్(Krishnaswamy Kasturirangan). కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన. 1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.

24 ఏళ్ల కిందటి కేసు.. మేధా పాట్కర్ అరెస్టు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సుమారు 24 ఏళ్ల కిందట దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు, ఈ కేసుకు సంబంధించిన ప్రొబేషన్ బాండ్ అమలు ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో క్రవారం నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్ అరెస్ట్‌ను సౌత్ఈస్ట్ డీసీపీ రవి కుమార్ సింగ్ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కిందటే ఢిల్లీ సాకేత్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో న్యాయ స్థానం నుంచి మేధా పాట్కర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, కోర్టు ఆదేశాలను ఆమె ఉల్లంఘించారని, ప్రొబేషన్ బాండ్ సమర్పించలేదని, రూ. లక్ష జరిమానా చెల్లించలేదంటూ వారెంట్‌లో పేర్కొంది. నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్ కుమార్ సక్సేనా(VK Saxena)పై ఆమె అప్పట్లో కేసు వేశారు. అప్పుడు ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు. అయితే ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు.సక్సేనా పిరికిపంద అని, హవాలా లావాదేవీల్లో ఆయన హస్తం ఉందని ఆరోపించారామె. నవంబర్ 5, 2000 సంవత్సరంలో మేధా పాట్కర్ వీకే సక్సేనాపై వ్యాఖ్యలు చేయగా.. పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తోచ్చింది. అంతేకాదు.. కిందటి ఏడాది జులై1వ తేదీన ఆమె ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Pahalgam: ‘ఆ వీడియోలో ఉన్నది మేమే.. వినయ్ సార్ కాదు’
న్యూఢిల్లీ: ఏప్రిల్ 16న ఉత్తారఖండ్ మసూరీలో పెళ్లి. 19న హర్యానాలోని కర్నాల్‌లో రిసెప్షన్. ఏప్రిల్ 21న కశ్మీర్లో హనీమూన్. ఏప్రిల్ 23న కర్నాల్‌లో అంత్యక్రియలు. ఇండియన్ నేవి లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ నర్వాల్ జీవితం ఇలా ముగిసింది.ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన త్రీవవాదుల దాడిలో 26 మంది మరణించారు. వారిలో నేవి అధికారి వినయ్ నార్వాల్ ఒకరు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడికి కొద్ది నిమిషాల ముందు వినయ్ నార్వాల్, ఆయన సతీమణి హిమాన్షి సరదగా గడిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. We're safe. A recent video was misused by some pages, falsely claiming it was the last video of late Vinay narwal and his wife. They have clarified that this video is not theirs. #Pahalgam #Kashmir #pahalgamattack pic.twitter.com/aAdlnTarNf— Shaheen khan (@shaheenkhan09) April 24, 2025 ఆ వీడియో మాదే కానీ,ఆ వీడియోలో ఉన్నది వినయ్ నార్వాల్ దంపతులు కాదని, ఆ వీడియోలో ఉన్నది తామేనంటూ ఆశిష్ శరావత్, యాషికా శర్మ దంపతులు సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్టు చేశారు. ఆ వీడియోలో.. ‘పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, అతని భార్య చివరి హనీమూన్ వీడియో అంటూ మా వీడియోని షేర్ చేస్తున్నారు. నేవి అధికారి వినయ్ నర్వాల్ దంపతుల పేరిట వైరల్ అవుతున్న వీడియో మాదే. దుర్ఘటన జరిగే సమయంలో మేం అక్కడలేము. మేం బ్రతికే ఉన్నాం.. కశ్మీర్ టూర్లో ఉండగా ఏప్రిల్ 14న రికార్డ్ చేసిన వీడియోని ఏప్రిల్ 22న సోషల్ మీడియాలో షేర్ చేశాం. అయితే అదే రోజు పహల్గాం దాడి జరగడం. మేం పోస్టు చేసిన వీడియోకి నెగిటీవ్ కామెంట్లు వచ్చాయి. వెంటనే వాటిని డిలీట్ చేశాం. కానీ అప్పటికే నేవి అధికారి వినయ్ నర్వాల్ దంపతుల పేరిట వీడియోని షేర్ చేశారని స్పష్టత ఇచ్చారు. యాషికా, ఆశిష్‌లు స్పందిస్తూ.. మేం బ్రతికే ఉన్నాం. మేం షేర్ చేసిన వీడియో ఇలా ఒక విషాద ఘటనకు లింక్ చేయడం మాకు బాధ కలిగింది. మేము లెఫ్టినెంట్ నర్వాల్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దయచేసి ఈ వీడియోను షేర్ చేయొద్దని కోరారు.తప్పుడు ప్రచారం మమ్మల్ని మరింత బాధిస్తున్నాయిపహల్గాంలో వినయ్ నర్వాల్ దంపతులు సంతోషంగా గడిపిన చివరి క్షణం ఇదేనంటూ 19సెకన్ల వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఆ వీడియోపై వినయ్ నర్వాల్ సోదరి స్రిష్టి నర్వాల్ స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తన సోదరుడు వినయ్, వదిన హిమాన్షి కాదని తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ వినయ్‌ను అగౌర పరచొద్దని కోరారు. వినయ్ గురించి కుటుంబసభ్యులు సమాచారం ఇస్తారని అన్నారు. మేం ఇప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్నాం. ఇలాంటి పుకార్లు మమ్మల్ని మరింత బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఐ

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
అమెరికాలో తెలుగు వారిని కలిపే అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా పిట్స్బర్గ్ లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ నిర్వహించిన ఉగాది వేడుకలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన లభించింది. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు, తదితర వినోద కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది వేడుకల్లో భాగంగానే తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించగా, ప్రత్యేకంగా విజేతలకు బహుమతులు అందించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన పిల్లలకు ప్రత్యేకంగా గుర్తింపు, పురస్కారాలను అందజేశారు. ఈ పోటీలు పిల్లలలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, పోటీ భావనను పెంపొందించేందుకు ఒక గొప్ప వేదికగా నిలిచాయి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో నాట్స్ పిట్స్బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, నాట్స్ వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల కీలక పాత్ర పోషించారు. వారి నాయకత్వం, అంకితభావం వల్లే ఈ వేడుకలు దిగ్విజయంగా జరిగాయని స్థానిక తెలుగు వారి నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వేడుకలకు వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహారించారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించిన సంస్కృతి డ్యాన్స్ స్కూల్‌కి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. ఇక విందు భోజనాన్ని పిట్స్బర్గ్ తత్వా ఇండియన్ క్యూసిన్ అందింయింది., సంప్రదాయ తెలుగు విందు భోజనంతో అందరి చేత ఆహా అనిపించారు.ఉగాది వేడుకలకు సహకరించిన వారికి, వేడుకల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ పిట్స్ బర్గ్ టీం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. తెలుగు వారి కోసం ఉగాది వేడుకలను దిగ్విజయంగా నిర్వహించిన పిట్స్బర్గ్ టీంకి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అందాల బొమ్మ.. ఈ గోదావరి భామ
వీరవాసరం: పుట్టింది పల్లెటూరులో.. పెరిగింది పట్నంలో.. ఆపై ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లిన తెలుగమ్మాయి అక్కడ అందాల పోటీల్లో ఫైనల్‌కు చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుదురు గ్రామ శివారు నడపనవారి పాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు కుమార్తె కొత్తపల్లి చూర్ణిక ప్రియ (Churnika Priya Kothapalli). అమెరికాలో ఎంఎస్ చదువుతున్న ఆమె తెలుగు సంఘం ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన మిస్ తెలుగు యూఎస్ఏ–2025 పోటీల్లో పాల్గొంది. సుమారు 5 వేల మంది పాల్గొన్న పోటీల్లో ఆమె సత్తాచాటి ఫైనల్–20 జాబితాలో చోటు సంపాదించింది. గోదావరి (Godavari) కీర్తిని చాటింది.అమెరికాలోని డల్లాస్ (Dallas) ఐర్వింగ్ ఆర్ట్ సెంటర్ వేదికగా వచ్చే మే 25న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీలో గెలుపొందేందుకు ప్రపంచంలోని తెలుగు ప్రజల ఓట్లే కీలకం. అమెరికాలోని తెలుగు యువతులకు మాత్రమే పరిమితమైన ఈ పోటీల్లో చూర్ణిక ప్రియ అద్భుతమైన ప్రతిభను చాటుతుండటం విశేషం. బీటెక్ పూర్తి చేసిన ఈమె క్లాసికల్ డ్యాన్సర్ గానూ ప్రతిభ చాటింది.చదవండి: టాలెంట్‌ను ట్రంప్ కూడా ఆపలేడు

స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు)

న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు)
క్రైమ్

వికటించిన ప్రేమపెళ్లి
కర్ణాటక: ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్న ఓ యువతి.. నిండు గర్భిణిగా ఉండి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం రాయచూరు జిల్లా సింధనూరు గ్రామీణలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బూదిహాల్కు చెందిన యువకుడు నాగరాజు బ్రతుకుతెరువు కోసం బెంగళూరులో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేసే దుకాణ యజమాని కూతురు, చామరాజనగర జిల్లా కొళ్లేగాళకు చెందిన పల్లవి అలియాస్ అనుపమతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. కట్న వేధింపులు పెరిగి సుమారు ఏడాది కిందట గంగావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పల్లవి తొమ్మిది నెలల గర్భిణి. పల్లవి అగ్రవర్ణురాలు కాగా, నాగరాజ్‌ది మరో కులం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు, కట్న వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ కోసం అందరినీ వదులుకుని వస్తే జీవితం తలకిందులైందని పల్లవి ఆక్రోశించింది. గురువారం బూదిహాల్లో భర్త ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ తలవార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవలు జరగకుండా బూదిహాళలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త నాగరాజ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశామని సిఐ వీరారెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన హవాలా డబ్బు..
హైదరాబాద్: నెల రోజుల నుండి నిఘా ఉంచి రూ.74.56 లక్షల హవాలా డబ్బును రాయదుర్గం పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన మేరకు.. ఇద్దరు యువకులు యాక్టివాపై డబ్బు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో రాయదుర్గంలోని విస్పర్ వ్యాలీ జంక్షన్లో ఎస్ఐ శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేపట్టారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో వాహనంపై ఒక బ్యాగ్ కనిపించింది. తనిఖీ చేయగా ఆ బ్యాగ్‌లో రూ. 74,56,200 నగదు లభించింది. కరీంనగర్‌కు చెందిన బి.సాయికృష్ణ బీటెక్ పూర్తి చేసి చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నాడు. రాయదుర్గంలో ఉండేరవితో కలిసి బేగంపేట్‌లోని సురేందర్ అగర్వాల్ నుంచి డబ్బు తీసుకొని వస్తున్నారు. రవి డ్రైవింగ్ చేస్తుండగా బ్యాగ్‌తో సాయి కృష్ణ వెనకాల కూర్చున్నాడు. మియాపూర్‌కు వెళ్లి ఫోన్ చేస్తే ఎవరికి ఇచ్చేది చెప్తారని పోలీసులకు తెలిపారు. స్వాధీనం చేసుకొని నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించామన్నారు. కొంత కాలంగా బ్లాక్ మనీ అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఈ క్రమంలోనే రెండు మూడు సార్లు పట్టుకునేందుకు ప్రయతి్నంచినా పట్టుబడలేదు. ఎట్టకేలకు భారీ నగదును స్వా«దీనం చేసుకున్నారు.

ఫోన్‌కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
మంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మీప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్‌వాచ్‌మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మీప్రసన్నమృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది..ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మీప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్‌కు వాచ్మెన్ మహేశ్ సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్‌మెన్‌కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్‌కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్‌పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మీప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు.

కట్టుకున్న భార్యలను కడతేర్చారు..
కలకాలం కాపురం చేస్తామని చేసిన బాసలు మరిచిన ఆ ఇద్దరు భర్తలూ భార్యల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. తన వివాహేతర సంబంధాన్ని నిలదీసిందని కోపం పెంచుకున్న ఓ భర్త అదనుచూసి సహచరిని అంతం చేయగా, ఆడపిల్లలను కనిందన్న కోపంతో భార్యను హత్య చేశాడు మరో భర్త. నమ్మించి మెడ కోశాడు..గుడిహత్నూర్: కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. సహించలేకపోయిన భర్త ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. నాలుగు రోజులు అత్తింటి వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నమ్మించాడు. గురువారం కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్‌కు చెందిన లట్పటే మారుతికి ఇదే గ్రామానికి చెందిన కీర్తి (28)తో 2012లో వివాహం జరిగింది. మారుతి ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై కీర్తి పలుమార్లు భర్తను నిలదీసింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో ఇటీవల కీర్తి తన ముగ్గురు పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో కక్ష పెంచకున్న మారుతి తన భార్యను అంతమొందించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అత్తగారింటికి వచ్చి వారితో మర్యాదగా ప్రవర్తించాడు. గురువారం ఉదయం కీర్తి తాగునీటి కోసం ఇంటి సమీపంలోని నల్లా వద్దకు వెళ్లగా, మారుతి వెంట తెచ్చుకున్న కత్తితో కీర్తి మెడపై దాడి చేసి పారిపోయాడు. రిమ్స్‌కు తరలించేలోపే ఆమె మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు.ఆడపిల్లలు పుట్టారని హతమార్చాడు..కాగజ్‌నగర్ రూరల్: మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవ పడి తలపై దాడి చేసి చంపాడు. ఈ సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాంకు ఆసిఫాబాద్‌కు చెందిన భీంబాయితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఓ కూతురు పుట్టగా, మగసంతానం లేదని జయరాం కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్‌పూర్‌కు చెందిన పోషక్కను (40) 2010లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు కూడా ఇద్దరూ కూతుళ్లే రవళి (12), గౌతమి (6) పుట్టారు. దీంతో మగపిల్లలు లేరని జయరాం తరచూ ఇద్దరు భార్యలతో గొడవ పడేవాడు. బుధవారం రాత్రి కూడా రెండో భార్య పోషక్కతో గొడవ జరిగింది. ఆవేశానికి గురైన జయరాం పలుగుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోషక్క అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనస్థలాన్ని కాగజ్‌నగర్ ఇన్చార్జి సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్ పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
వీడియోలు


మాకు అన్యాయం చేయొద్దు బాబుపై డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహం


కేటీఆర్ విత్ కొమ్మినేని పొలిటికల్ ఇంటర్వ్యూ


Perni Nani: చంద్రబాబు అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారు


పెళ్లి తర్వాత దూసుకుపోతున్న కీర్తి సురేష్ ..


High Temperature: భానుడి భగభగలకు ఠారెత్తిపోతున్న ప్రజలు


ఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్


మా కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు


DYFI ఆధ్వర్యంలో విజయవాడలో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన


విద్యా రంగంలో బెడిసికొట్టిన కూటమి సర్కార్ ప్రయోగాలు


చంద్రమౌళి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి