Bank Merger
-
ఒక రాష్ట్రం.. ఒకే ఆర్ఆర్బీ అమలుకు డేట్ ఫిక్స్
న్యూఢిల్లీ: ఒక రాష్ట్రం–ఒకే ఆర్ఆర్బీ విధానం మే నెల 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్ఆర్బీ) కన్సాలిడేట్ చేయనున్నారు. దీంతో నాలుగో విడత కన్సాలిడేషన్‌లో భాగంగా మొత్తం ఆర్ఆర్బీల సంఖ్య ప్రస్తుతమున్న 43 నుంచి 28కి తగ్గుతుంది.విలీన జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర 11 రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనం అమల్లోకి వచ్చే తేదీని మే 1గా నిర్ణయించారు. ఉదాహరణకు, వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు స్పాన్సర్ చేస్తున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మొదలైన వాటిని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు కింద ఏకీకృతం చేస్తారు. కొత్త బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. దీన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేస్తుంది. వ్యయాలను క్రమబద్ధీకరించేందుకు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు 10 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆర్ఆర్బీలను విలీనం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేగ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతరత్రా బ్యాంకింగ్ సదుపాయాలను కల్పించే ఉద్దేశంతో ఆర్ఆర్బీ యాక్ట్ 1976 కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం 26 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 43 ఆర్ఆర్బీలు ఉన్నాయి. విలీనానంతరం ఈ సంఖ్య 28 ఆర్ఆర్బీలకు తగ్గుతుంది. వీటికి 700 జిల్లాల్లో 22,000 శాఖలు ఉంటాయి. ఆర్ఆర్బీల విలీన ప్రక్రియలో ఇది నాలుగో దశ. 2006–2010 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో తొలి విడతగా 196 ఆర్ఆర్బీలను 82కి తగ్గించారు. -
బ్యాంకుల విలీనంలో ఐటీ కీలక పాత్ర..
ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియపై ఎస్బీఐ చైర్మన్ రజినీష్ కుమార్ స్పందించారు. గురువారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బ్యాంకుల విలీన ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టీ) సమన్వయంతో ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో బ్యాంకుల విలీన ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని రజినీష్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
గతంకంటే బలంగా బ్యాంకింగ్ రంగం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల విలీనం వల్ల బ్యాంకింగ్ రంగం ఎంతో బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ దృడ సంకల్పంతో బ్యాంక్‌ల విలీన నిర్ణయం జరిగిందని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ 17వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంతో పాటు అంతరాష్ట్రాల సంబంధాలు కూడా బలపడ్డప్పుడే దేశంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కాగా కేంద్ర ప్రభుత్వం పథకాల కోసం 100 లక్షల కోట్ల ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏ పౌరుడిపైనా ఒత్తిడి పైట్టబోదని తెలిపారు. పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందితే పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన సమస్యలుంటే అధికారులు చెప్పవచ్చని అన్నారు. కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించడం వల్ల దేశంలో పెట్టుబడులు పెరగడంతో పాటు తయారీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. సంస్కరణలను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని అన్నారు. అందరికీ సురక్షితమైన నీరు అనే లక్ష్యంతో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో 112 జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాలను విస్మరించారని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు, రామ జన్మభూమి సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. -
బ్యాంకుల విలీనం; ఖాతాదారుల పరిస్థితేంటి?
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాలను నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకుల విలీనంతో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలియక ఖాతాదారులు అయోమయంలో ఉన్నారు. బ్యాంకుల విలీనంతో ఖాతాదారులు పెద్దగా నష్టపోయేదేమి ఉండదు. కాకపొతే కొన్ని మార్పులు తప్పవు. అవేంటో గమనించండి. మారేవి... 1. కొత్త చెక్‌బుక్, డెబిట్/క్రెడిట్ కార్డులు ఇస్తారు 2. అకౌంట్ నంబరు, కస్టమర్ ఐడీతో పాటు ఐఎఫ్ఎస్ఈ కోడ్ కూడా మారుతుంది 3. మారిన ఐఎఫ్ఎస్ఈ కోడ్ ఆదాయపన్ను శాఖ, బీమా కంపెనీ వద్ద అప్డేట్ చేసుకోవాలి 4. ఈఎంఐలు, సిప్‌లు చేసేవారు తాజాగా బ్యాంకుల నుంచి ఆమోదపత్రం ఇవాల్సి ఉంటుంది 5. బిల్ పేమెంట్లకు తాజాగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు 6. మీ బ్యాంకు బ్రాంచ్ మీకు దగ్గరగా లేదా దూరంగా మారొచ్చు 7. బ్యాంకు స్టేషనరీ కూడా మారిపోతుంది 8. సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లు కూడా మారే అవకాశముంది. మారనివి.. 1. ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు యథాతథంగా ఉంటాయి 2. ఫిక్సిడ్ డిపాజిట్లను చివరి వరకు ఉంచితే ప్రస్తుతం వస్తున్న వడ్డీతో తీసుకోవచ్చు 3. రుణాల రేట్లు కూడా మారవు 4. ఎంసీఎల్ఆర్ రుణాలపై గడువు ఆధారంగా వడ్డీ రేట్లు మారతాయి. సంబంధిత వార్తలు బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు భారీగా ప్రభుత్వ బ్యాంకుల విలీనం షాకింగ్ : ఆరేళ్ల కనిష్టానికి జీడీపీ -
బ్యాంకుల విలీనం మంచిదే!
► బాగున్న బ్యాంకులు ఇంకా బలపడతాయి ► ఎన్పీఏల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ► అక్కర్లేని బ్రాంచీలను అమ్మేస్తే నిధులొస్తాయి ► అమెరికా వాణిజ్య రక్షణాత్మక విధానం సరికాదు ► ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేల్ వ్యాఖ్యలు ► 2017–18లో వృద్ధి 7.4 శాతంగా అంచనా న్యూయార్క్: కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి జరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. మంచి బ్యాలెన్స్ షీట్లున్న బ్యాంకుల్లోకి విలీనాలు జరిగితే మొండిబకాయిలు, దానివల్ల ఒత్తిడిలో ఉన్న రుణ సమస్యలను ఎదుర్కోవటం సులువవుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందంటూ... అమెరికా రక్షణాత్మక విధానాలు సరికాదని స్పష్టంచేశారు. ఇక్కడి కొలంబియా యూనివర్సిటీలో కొటక్ ఫ్యామిలీ ప్రతిష్టాత్మక ఉపన్యాసమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ... ♦ ఇన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరం లేదని చాలామంది చెబుతున్నారు. అవి కొద్ది బ్యాంకులుగా మారితే అదీ మంచి బ్యాలెన్స్ షీట్స్ ఉన్న బ్యాంకులుగా రూపాంతరం చెందితే అది బ్యాంకింగ్ వ్యవస్థకు మంచి ఫలితాలను అందిస్తుంది. ♦ విలీనాల వల్ల అవసరంలేని ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల్ని మూసివేయవచ్చు.అలాంటి బ్రాంచీలను మూసివేసినప్పుడు సంబంధిత రియల్టీ అమ్మకాల ద్వారా నిధులు సమకూరుతాయి. స్వచ్ఛంద పదవీ విరమణ పథకాల ద్వారా ఉద్యోగుల సంఖ్య సరిచేసుకోవచ్చు. టెక్నాలజీ మీద అవగాహన ఉన్న యువతకు బ్యాంకింగ్‌లో ఉపాధి దొరుకుతుంది కూడా. ♦ మొండిబకాయిల సమాచారం అంతా ఆర్బీఐ వద్ద ఉంది. ఎన్పీఏల సమస్య పరిష్కారానికి గత ఏడాది ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల సమగ్ర రుణ నాణ్యతను సమీక్షించింది కూడా. ♦ దివాలా కోడ్‌కు అనుగుణంగా ఎన్పీఏల సమస్య పరిష్కార దిశలో తదుపరి అడుగులకు ఆర్బీఐ సిద్ధమవుతోంది. కష్టాల్లో ఉన్న బ్యాంకుల విషయంలో తగిన దిద్దుబాటు చర్యలూ ఉంటాయి. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటు క్యాపిటల్‌ను స్వయంగా సమకూర్చుకోవాలి. ఆయా అవసరాలకు కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడ్డం సరికాదు. నిర్వహణా పరమైన నిర్ణయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను బ్యాంకులు పాటించాలి. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం మొత్తంమీద బ్యాంకింగ్ రంగానికి మంచిదే. మెరుగుపడిన మార్కెట్ విలువల నేపథ్యంలో డిజిన్వెస్ట్‌మెంట్ మరింత మేలు చేకూరుస్తుంది. మూలధన కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గడానికీ ఈ చర్య దోహదపడుతుంది. ♦ ఆర్థిక సంస్కరణల అమలు విషయంలో దేశంలో విస్తృతస్థాయి ఏకాభిప్రాయ సాధన ఏర్పడుతోంది. ఇది దేశాభివృద్ధికి దారితీస్తుంది. జీఎస్టీ, దివాలా కోడ్, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్ఐపీబీ) రద్దు వంటి అంశాలు ఇన్వెస్టర్ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ♦ భారత్ ఆర్థిక అంశాలన్నీ పటిష్టంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది.కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో ఒక శాతంకన్నా తక్కువగానే ఉంది. బడ్జెట్‌కు అనుగుణంగా ద్రవ్యలోటును మూడు శాతంలోపే కట్టడిచేసే పరిస్థితి ఉంది. ♦ డీమోనిటైజేషన్ ఇబ్బందులు ఉన్నప్పటికీ, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. డిజిన్వెస్ట్‌మెంట్ కాలాన్ని చూస్తే– కరెన్సీ కన్నా, క్రెడిట్ ముఖ్యం. రుణ సంబంధ ఇబ్బందులు ఎక్కడా తలెత్తలేదు. ♦ రూపాయి విలువ అనేది పూర్తిగా మార్కెట్ నిర్ణయించే అంశం. ఒడిదుడుకులను నివారించడానికే ఆర్బీఐ జోక్యం. మున్ముందూ ఇదే విధానం కొనసాగుతుంది. ఆర్బీఐ పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది.