ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియపై ఎస్‌బీఐ చైర్మన్ రజినీష్ కుమార్ స్పందించారు. గురువారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బ్యాంకుల విలీన ప్రక్రియ సవాలుతో కూడుకున్నదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టీ) సమన్వయంతో ప్రక్రియను అమలు చేయాలని సూచించారు. భవిష్యత్తులో బ్యాంకుల విలీన ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని రజినీష్ కుమార్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment