Brahmin students
-
జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్‌లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన బ్రాహ్మణ విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇవ్వాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో పరిషత్ కార్యవర్గ సమావేశం అనంతరం పరిషత్ చైర్మన్ డాక్టర్ కె.వి.రమణాచారి వివరాలను మీడియాకు వివరించారు. బ్రాహ్మణ విద్యార్థులకు శ్రీ సరస్వతి విద్యాప్రశస్తి అనే పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ పథకం కింద చదువులో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక పారితోషికం ఇస్తామన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి తత్సమాన పరీక్షలో 90 శాతం మార్కులు ఆపైన సాధించిన విద్యార్థులకు రూ.7,500 నగదు పురస్కారం ఇస్తామన్నారు. పాలిటెక్నిక్ తత్సమాన పరీక్షల్లో 90 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. డిగ్రీలో 75 శాతం మార్కులు సాధించినవారికి రూ.15 వేలు, పీజీలో 70 శాతంతో ఉత్తీర్ణులయినవారికి రూ.20 వేలు, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యలో 80 శాతం మార్కులు సాధించినవారికి రూ.35 వేల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే సివిల్ సర్వీసెస్, గ్రూప్–1, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యే బ్రాహ్మణ యువతీ యువకులకు వారు తీసుకునే శిక్షణ వ్యయాన్ని ‘లక్ష్య’పథకం ద్వారా అందిస్తామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యా ఉపకార వేతనం పథకం కింద ఏడాది కోర్సుకు రూ. 10 లక్షలు, ఏడాది నుంచి రెండేళ్ల కాలవ్యవధిగల కోర్సుకు రూ. 15 లక్షలు, రెండేళ్లు ఆ పైబడిన కోర్సుకు రూ. 20 లక్షల సహాయాన్ని అందజేస్తామన్నారు. వేద విద్యను పోత్సహించేందుకు వేద విద్యార్థులకు నెలకు రూ.500 స్టైపండ్ ఇస్తామన్నారు. అలాగే 75 ఏళ్లు పైబడిన వేద, సంస్కృత, శాస్త్ర పండితులకు వృద్ధాప్యంలో ఆసరా కల్పించేందుకు నెలకు రూ. 2,500 గౌరవ భృతి కల్పించనున్నట్లు రమణాచారి చెప్పారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే బ్రాహ్మణ కుటుంబాలకు వారి చికిత్సకయ్యే ఖర్చులో రూ. 2 లక్షల మేరకు ఇన్యూరెన్స్ కంపెనీలు అందిస్తాయని పరిషత్ సభ్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలచారి తెలిపారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా పథకాల కింద ఆర్హులైన బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా పరిషత్ తోడ్పాటునందిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లోని గోపన్నపల్లిలో నిర్మించనున్న బ్రాహ్మణ సదనానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వచ్చే నెల 5న శంకుస్థాపన చేస్తారని జ్వాలా నరసింçహారావు తెలిపారు. ఈ నెల 9న బ్రాహ్మణ పరిషత్ అధికారిక వెబ్ సైట్ (www. brahminparishad. telangana. gov. in) ప్రారంభిస్తామని వెల్లడించారు. కంచి కామకోటి పీఠం వారు హైదరాబాద్‌లో నెలకొల్పనున్న సంప్రదాయ పాఠశాలల్లో బ్రాహ్మణ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ సభ్యులు పురాణం సతీశ్, డాక్టర్ సువర్ణ సులోచన, దేవాదాయ కమిషనర్ శివశంకర్ పాల్గొన్నారు. -
బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు
– బ్రాహ్మణ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు కర్నూలు(అర్బన్): బ్రాహ్మణ విద్యార్థినీ, విద్యార్థులకు భారతీ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందిస్తామని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కో ఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. స్థానిక మౌర్యా ఇన్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవసరమైన ధవీకరణ పత్రాలతో అక్టోబర్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన వారు మతి చెందిన సందర్భాల్లో కర్మకాండ ఖర్చుల నిమిత్తం గరుడ పథకం కింద కార్పొరేషన్ ద్వారా రూ.10 వేలు అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఆదుకునేందుకు 2016–17లో కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు కేటాయించారన్నారు. కర్నూలు నగరంలో 20 వేలకు పైగా బ్రాహ్మణులున్నారని, జనాభాకు అనుగుణంగా కార్పొరేషన్ ఎన్నికల్లో తగు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నగరాధ్యక్షుడు కళ్లె చంద్రశేఖరశర్మ, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్, కాల్వబుగ్గ అధ్యక్షుడు లక్ష్మినరసింహ శర్మ, సుబ్రమణ్యశాస్త్రి, కళ్లె రామకష్ణశర్మ, కల్కూర మురళీ తదితరులు పాల్గొన్నారు. -
పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత వసతి
ఒంగోలు (ప్రకాశం జిల్లా): పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పకాశం జిల్లా బ్రాహ్మణ వయోవృద్ధుల సంక్షేమ సమితి తెలిపింది. ఇంటర్, ఆపై తరగతులు చదివే విద్యార్థులు గత పరీక్షల్లో 65 శాతం మార్కులు పొందడంతో పాటు ఉపనయనం జరిగిన వారై ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొంది. సమితి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని శ్రీ సిద్ధేశ్వరీ పీఠపాలిత బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, వరలక్ష్మమ్మ బ్రాహ్మణ వయోవృద్ధుల సేవాశ్రమంలో ఈ మేరకు ఉచిత సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఆశ్రమంలో ప్రవేశం పొందగోరే పేద విద్యార్థులు ఒంగోలు బయటి ప్రాంతానికి చెందిన వారై ఉండాలని స్పష్టం చేసింది. వివరాల కోసం 9849115621 నంబర్ ఫోన్లో సంప్రదించాలి.