ఒంగోలు (ప్రకాశం జిల్లా): పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పకాశం జిల్లా బ్రాహ్మణ వయోవృద్ధుల సంక్షేమ సమితి తెలిపింది. ఇంటర్, ఆపై తరగతులు చదివే విద్యార్థులు గత పరీక్షల్లో 65 శాతం మార్కులు పొందడంతో పాటు ఉపనయనం జరిగిన వారై ఉండాలని ఒక ప్రకటనలో పేర్కొంది. సమితి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని శ్రీ సిద్ధేశ్వరీ పీఠపాలిత బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, వరలక్ష్మమ్మ బ్రాహ్మణ వయోవృద్ధుల సేవాశ్రమంలో ఈ మేరకు ఉచిత సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. ఆశ్రమంలో ప్రవేశం పొందగోరే పేద విద్యార్థులు ఒంగోలు బయటి ప్రాంతానికి చెందిన వారై ఉండాలని స్పష్టం చేసింది. వివరాల కోసం 9849115621 నంబర్ ఫోన్‌లో సంప్రదించాలి.