carter
-
పారేయకండి.. పదును పెట్టండి..!
ఒకసారి వాడి పడేసే కార్టర్లను ఆహ్లాదకరమైన జంతువుల ఆకారాలుగా మార్చవచ్చు. ఇది పిల్లల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంచడానికి దోహద పడుతుంది. ఇందుకోసం పిల్లలను వారికి ఇష్టమైన జంతువు లేదా పక్షుల గురించి అడిగి, వాటి ఆకారాలను కాగితంపై ఔట్‌లైన్ గీయడం ద్వారా ప్రారంభించవచ్చు. కావలసినవి: ఖాళీ కార్టన్లు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్‌లు, గమ్, గూగ్లీ కళ్ళు, పైప్ క్లీనర్లు. ఆలోచనకు తగ్గట్టు కార్టర్‌ను వివిధ ఆకారాలుగా కత్తిరించుకుని వారికి ఇష్టమైన రంగులలో పెయింట్ చేయనివ్వండి. రంగులు కలిపి నమూనాలను రూపొందించడానికి వారికే అవకాశం ఇవ్వడం మంచిది. అలంకరణ: రంగు ఆరిన తర్వాత, గూగ్లీ కళ్ళపై జిగురు వేయండి. మార్కర్ల సాయం తో ముఖంలో ఇతర భాగాలను లేదా నమూనాలను గీయండి. పైప్ క్లీనర్లతో కాళ్ళు, యాంటెన్నా లేదా తోకలుగా చేసి చిన్న రంధ్రాలు చేసి దారంతో అటాచ్ చేయండి.టాయిలెట్ పేపర్ రోల్ బైనాక్యులర్లు.. ఖాళీ టాయిలెట్ పేపర్ రోల్స్‌ను బైనాక్యులర్లుగా మార్చుకోండి, కావలసినవి: రెండు ఖాళీ టాయిలెట్ పేపర్ రోల్స్, నూలు లేదా రిబ్బన్, యాక్రిలిక్ పెయింట్ బ్రష్‌లు, గమ్, స్టిక్కర్లు, డెకరేషన్లు.పెయింటింగ్: పిల్లలను టాయిలెట్ పేపర్ రోల్స్‌కు పెయింట్ వేయమని చెప్పి, వాటిని పూర్తిగా ఆరిన తర్వాత పక్కపక్కనే అతికించండి. గ్లూ గట్టి పడగానే మెడ పట్టీకోసం రెండువైపులా నూలు లేదా రిబ్బన్ముక్కను అటాచ్ చేయండి. వీటికి స్టిక్కర్లు, మార్కర్లు, ఇతర అలంకరణలతో డెకరేట్ చేయండి. అలా తయారైన∙బైనాక్యులర్లతో సరదాగా బయటి ప్రదేశాలను చూడమని చెప్పండి. బాటిల్ క్యాప్ అయస్కాంతాలు...పాత బాటిల్ మూతలను అయస్కాంతాలుగా మార్చండి. వీటితో మీ రెఫ్రిజిరేటర్‌ను అందంగా అలంకరించండి.కావలసినవి: మెటల్ బాటిల్ మూతలు, చిన్న గుండ్రని అయస్కాంతాలు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్‌లు, పూసలు, బటన్లు, సీక్విన్ , గ్లూతయారీ: బాటిల్ మూత లోపల, వెలుపల బ్రైట్ కలర్స్ తో పెయింట్ చేయండి.ఆరిన తర్వాత క్యాప్‌ల లోపల చిన్న పూసలు, బటన్లు లేదా గవ్వలను అతికించండి. గ్లూ లేదా మంచి గమ్‌తో ప్రతి బాటిల్ మూత వెనుక భాగంలో ఒక చిన్న గుండ్రని అయస్కాంతాన్ని అటాచ్ చేయండి. ఇలా తయారైన వాటితో రిఫ్రిజిరేటర్పై కళాకృతులు, నోటీసులు లేదా ఫోటోలను ప్రదర్శించండి.ప్లాస్టిక్ బాటిల్ ప్లాంటర్లు...ప్లాస్టిక్ బాటిళ్లను అందమైన ప్లాంటర్లుగా తిరిగి ఉపయోగించవచ్చు, పిల్లలకు రీసైక్లింగ్, తోటపని నేర్పచ్చు.కావలసినవి: ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, కత్తెర, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్‌లు, మట్టి, చిన్న మొక్కలు లేదా విత్తనాలు.తయారీ: ప్లాస్టిక్ బాటిళ్లను సగానికి కట్ చేసి, పైభాగాన్ని పారవేయండి. సీసాల దిగువ భాగాలను రంగులతో అలంకరించండి. ఇలా అలంకరించిన సీసాలను మట్టితో నింపి వాటిలో విత్తనాలు లేదా చిన్న మొక్కలను నాటండి. వీటిని ఎండ పడే ప్రదేశంలో ఉంచి, రోజూ నీరు పెట్టండి.వార్తాపత్రిక కోల్లేజ్ కళ...పాత వార్తాపత్రికలను కథను చెప్పే అద్భుతమైన కొల్లేజ్ కళాఖండాలుగా మార్చండి కావలసినవి: పాత వార్తాపత్రికలు, కత్తెరగ్లూ స్టిక్, కాగితం లేదా కాన్వాస్, మార్కర్లు తయారీ: వార్తాపత్రికల నుంచి ఆసక్తికరమైన చిత్రాలు, ముఖ్యాంశాలు, ఇతర న్యూస్‌ను కత్తిరించండి. కొల్లేజ్ సృష్టించడానికి కటౌట్ లను కాగితం లేదా కాన్వాస్‌పై అమర్చండి. విభిన్న లే ఔట్లు, థీమ్‌లతో ప్రయోగం చేయండి. తర్వాత, ఈ ముక్కలను అతికించండి. మార్కర్లు లేదా రంగు పెన్సిళ్లతో కొల్లేజ్కు నేపథ్యాలను జోడించండి. ఇలా తయారైన∙కోల్లెజ్‌ను కనిపించేలా వేలాడదీయండి.సీడీ సన్ క్యాచర్లు...పాత సీడీలకు మిరుమిట్లు గొలిపే సన్ క్యాచర్లుగా కొత్త జీవం పోయవచ్చు, కావలసినవి: పాత సీడీలు, యాక్రిలిక్ పెయింట్స్, బ్రష్‌లు, క్రాఫ్ట్ జిగురు, స్ట్రింగ్ లేదా రిబ్బన్, పూసలు, ఇతర డెకరేషన్లు.తయారీ: రంగురంగుల డిజైన్లు, నమూనాలు లేదా అబ్స్ట్రాక్ట్ ఆర్ట్‌తో సీడీలు మెరిసే వైపు పెయింట్ చేయండి. అంచుల చుట్టూ లేదా మధ్యలో పూసలతో అలంకరించి వాటిని సీడీ మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా దారంతో అతికించండి. వీటిని ఎండ పడే కిటికీలో వేలాడదీస్తే అందమైన కాంతులు వెదజల్లుతాయి.న్యూస్ పేపర్లతో ఫోటో ఫ్రేమ్...కొన్ని పాత న్యూస్పేపర్లను తీసుకొని ప్రతి షీట్‌ను ముక్కలుగా చింపివేయండి. ఇప్పుడు, వార్తాపత్రికను ఒక మూల నుండి చుట్టడం ద్వారా సన్నని రోల్స్ తయారు చేయండి. రోల్‌ను భద్రపరచడానికి వార్తాపత్రిక అంచుని అతికించండి. ఇప్పుడు మీకు కావలసిన ఏ పరిమాణంలోనైనా కార్డ్బోర్డ్ ముక్కను తీసుకోండి. మీరు ఫ్రేమ్ చేయాలనుకుంటున్న ఛాయాచిత్రాన్ని ఫ్రేమ్ మధ్యలో ఉంచి, దాని రూపురేఖలను గీయండి. వార్తాపత్రిక రోల్స్‌ను అవుట్లైన్లపై అతికిస్తూ నాలుగు వైపులా కవర్ చేయండి. అదనపు వార్తాపత్రికను కత్తిరించండి. ఫ్రేమ్‌కు మీకు నచ్చిన ఏ రంగునైనా పెయింట్ చేసి ఫోటోగ్రాఫ్‌ను అతికిస్తే సరి.. మీ ఫోటో ఫ్రేమ్ రెడీ!పిల్లల చేత ఇలాంటి వాటిని తయారు చేయిస్తే వారికి మంచి కాలక్షేపం అవుతుంది.వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిల్స్, న్యూస్ పేపర్లు, పనికిరాని ఇతర గృహోపకరణాలను బుర్రకు కాస్త పడును పెడితే చాలు... కళాఖండాలుగా తయారు చేయచ్చు. ఈ వేసవి సెలవల్లో పిల్లలకు దీనిపై కాస్తంత ఐడియా ఇస్తే చాలు... ఆనక వాళ్లే అల్లుకుపోతారు. వీటితో సృజనాత్మకత పెరగడమే కాదు.. కుదురు వస్తుంది. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్య తెలుస్తుంది. వనరుల పరిరక్షణ, రీసైక్లింగ్ ప్రాముఖ్యత తెలిసొస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. (చదవండి: జర్నలిస్టులకు.. సండేస్ ఆన్ సైకిల్) -
వీధుల్లో కూరగాయలు అమ్మినట్లు మ్యాగీని అమ్మేస్తున్నాడు!
మ్యాగీ న్యూడిల్స్‌తో రకరకాల రెసిపీలు చేసిన వైరల్ వీడియోలు చూశాం. ఇప్పుడు ఏకంగా మ్యాగీని తోపుడు బండిమీద వేసి కూరగాయాలు అమ్మినట్లు అమ్మేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తోపుడు బండిపై పెద్ద ఎత్తున ఒపెన్‌గా మ్యాగీ న్యూడిల్స్‌ని వేసుకుని లూజ్కి అమ్మేస్తున్నాడు. పైగా ఆ క్వాండిటీకి సరిపడా మషాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాడు. ఏదో కూరగాయాలు, పండ్లు మాదిరి తూచి అమ్మేస్తుండటం అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే చాలామంది అతడి వద్దకొచ్చి కావల్సినంత కొనుక్కుని పట్టుకుపోతుండటం విశేషం. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు. మ్యాగీ ప్యాకెట్లలో ఉంటే ఎలాంటీ అనారోగ్య సమస్యలు రావు, కానీ ఇలా ఘోరంగా బండిపై ఓపెన్‌గా అమ్మితే ప్రజల ఆరోగ్యం ఏం కావాలంటూ ఫైర్ అవ్వుతూ పోస్టులు పెట్టారు. ఈ వీడియోకి మిలియన్సల్లో వ్యూస్, లక్షల్లో లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by CHATORE_BROOTHERS (@chatore_broothers) (చదవండి: వింత గ్రామం: నిద్ర ముంచుకొచ్చిందా ఇక అంతే!..ఏకంగా..) -
ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది: వీడియో వైరల్
మనలో చాలామంది చక్కగా అవతలి వాళ్లకు ఉచిత సలహలు, సూచనలు ఇచ్చేస్తారే తప్ప చేతల వరకు వచ్చేట్టేప్పటికి శూన్యం. అయినా సాయం చేయాలంటే డబ్బులుండాలి అనుకుంటారు గానీ మనకు చేతనైనంతలో ఏ చిన్న పని సాయం చేసిన చాలు. దానికి డబ్బులతో పనిలేదు. కనీసం రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న ఏ వ్యక్తి కైనా, ప్రమాదం బారిన గాయపడిన వ్యక్తి నైన కాస్త మంచినీళ్లు అందించో లేక చేయి అందించో సాయం చేసిన చాలు. కానీ చేయం పైగా మన కళ్ల ముందే ఇబ్బందిపడుతూ కనిపించిన మనకెందుకులే అని వెళ్లిపోతుంటారు. కానీ ఇద్దరు చిన్నారులు అందరిలా కాకుండా సాయం అందించి తమ పెద్ద మనసును చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే...రోడ్డు పై అరటిపళ్లు అమ్ముకునే ఒక మహిళ ఉంటుంది. ఆమె అరటిపళ్ల తోపుడు బండి పై పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుంటుంది. ఐతే ఇంతలో ఆ బండి ఒక చోట కదలదు ఆ రోడ్డు బాగా ఎత్తుగా ఉంటుంది. ఆమె ఉన్నవైపు రోడ్డు పల్లంగా ఉండటంతో పైకి తొయ్యడం కష్టంగా ఉంటుంది. బండిమీద ఉన్న అరటిపళ్లు బరువుకి ముందుకి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తుంటుంది. దీంతో ఆమె చాలా ఇబ్బంది పడుతుంటుంది. పైగా మరోవైపు మంచి ఎండగా ఉండటంతో చెమటులు పట్టేసి బండిని తొయ్యలేక నానా అవస్తలు పడుతోంది. కనీసం రోడ్డు పై వెళ్తున్న పాదాచారులు గానీ, వాహన దారులుగానీ ఎవ్వరు సాయం చేసేందుకు ముందుకు రారు. ఐతే ఇంతలో అటుగా వెళ్తున ఇద్దరు చిన్నారులు ఈ మహిళ వద్దకు వచ్చి ఆ బండిని తోసి సాయం అందించారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఆనందపడి ఆ చిన్నారులిద్దరికి చెరోక అరటి పండు ఇస్తుంది. వారు కూడా ఆనందంగా తీసుకుని వెళ్లిపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓలుక్కేయండి. आपकी डिग्री सिर्फ़ एक काग़ज़ का टुकड़ा है, अगर वो आपके व्यवहार में ना दिखे तो। pic.twitter.com/eHsuTYOGrh — Mahant Adityanath 2.0🦁 (@MahantYogiG) August 8, 2022 (చదవండి: ఆనంద్ మహింద్ర మనసు దోచిన 'కప్పు':ఫోటో వైరల్) -
కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్
రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. ) వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. Bhopal : After a slight touch of a car parked on the road, the woman in anger threw all the fruits of the fruit seller on the road. It is said that a professor of a private university in Bhopal, madam. The cartman kept pleading but madam did not listen.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/cAFvPL7LRN — Mario David Antony Alapatt (@davidalapatt) January 11, 2022 -
‘బరువు’ లేని ప్రయాణం..!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రయాణికుడే ప్రథమం’(ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్) అనే లక్ష్యంతో వివిధ రకాల సదుపాయాలను ప్రవేశపెట్టిన శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఇంటి నుంచి తిరిగి గమ్యస్థానం చేరేవరకు లగేజీ బరువు లేకుండా హాయిగా ప్రయాణం చేసే లా కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే డోమెస్టిక్ ప్యాసింజర్స్ మాత్రమే కాకుండా విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఈ లగేజీ పోర్టర్ సేవలను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రయాణికులు ‘కార్టర్‌ఎక్స్–ఇండియా’ఆన్లైన్ సర్వీసులో తమ ప్రయాణ వివరాలు, లగేజీ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేయాలనే అంశాలను నమోదు చేసుకోవాలి. దీంతో పోర్టర్లు వచ్చి లగేజీ తీసుకెళ్లి.. ప్రయాణికులు కోరుకున్న చోటుకు చేరవేస్తారు. దక్షిణ భారతదేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ‘ఇది పూర్తిగా డిజిటలైజ్డ్ సర్వీసు. ప్రయాణికులకు నమ్మకమైన, పూర్తి భద్రతతో కూడిన సదుపాయాన్ని కార్టర్‌ఎక్స్ ఇండియా అందజేస్తుంది’అని కార్టర్‌ఎక్స్ ఇండియా వ్యవస్థాపకుడు హర్షవర్ధన్ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సర్వీసులను ప్రారంభించిన వారంలోనే వందకుపైగా ఆర్డర్లు వచ్చాయని అన్నారు. ఈ సర్వీసులను భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు తెలిపారు. కార్టర్‌ఎక్స్ సేవలు ఇలా.. ప్రయాణికులు ప్రయాణానికి ముందే ఆన్లైన్లో (www.carterx.in) లగేజీ వివరాలను నమోదు చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి చేరవేయాలి.. ఎన్ని కిలోల బరువు అన్నదీ తెలియజేయాలి. ఆర్డర్ బుక్ చేసిన కార్టర్‌ఎక్స్ పోర్టర్లు ఎక్కడి నుంచి బుక్ చేసుకుంటే అక్కడికి వచ్చి లగేజీ తీసుకెళ్తారు. ప్రయాణికులు చెప్పిన గమ్యస్థానానికి చేరవేస్తారు. కార్టర్‌ఎక్స్ మొబైల్ యాప్ ద్వారా కూడా లగేజీ ఆర్డర్లు బుక్ చేయవచ్చు. బరువు మేర చార్జీలు..: ఈ సేవలు లగేజీ బరువుకు అనుగుణంగా రూ.299 నుంచి రూ.599 వరకు చార్జీలు ఉంటాయి. సాధారణ క్యాబిన్ లగేజీ బ్యాగులకు రూ.299 వరకు చార్జీ ఉంటుంది. అంతర్జాతీయ విమానాల్లో 23 కిలోల నుంచి 32 కిలోల వరకు అనుమతిస్తుండగా, దేశీయ విమానాల్లో మాత్రం 15 కిలోల నుంచి 20 కిలోల వరకే అనుమతిస్తారు. ఈ అదనపు బరువు ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి ప్రయాణికులు కార్టర్‌ఎక్స్ ద్వారా తమ లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇందుకోసం ఎయిర్‌పోర్టులో కార్టర్‌ఎక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. బిర్యానీ కూడా ఆర్డర్ చేయొచ్చు.. కార్టర్‌ఎక్స్ సేవల్లో భాగంగా ప్రయాణికులు ఆన్లైన్లో డబ్చులు చెల్లించి నచ్చిన రెస్టారెంట్ లేదా స్వీట్ షాప్ నుంచి బిర్యానీ, స్వీట్లు ఇతర ఆహార పదార్థాలను బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న ఆర్డర్‌ను కార్టర్‌ఎక్స్ పోర్టర్లు తీసుకుని క్యాబిన్ లగేజీలో భాగంగా ప్రయాణికులకు అందజేస్తారు. -
ఫ్రీ చికెన్ కోసం ట్వీట్.. రికార్డు బద్దలు
వాషింగ్టన్: 16 ఏళ్ల బాలుడికి చికెన్‌పై ఉన్న ప్రేమ ట్వీటర్ రికార్డు బద్దలయ్యేలా చేసింది. కార్టర్ విల్కర్సన్కు చికెన్ అంటే ప్రాణం. అందులోనూ చికెన్ నగ్గెట్స్ అంటే మరీనూ. అలాంటి కార్టర్ గత నెలలో ఓ ఫుడ్ రెస్టారెంట్ వెళ్లి.. చికెన్ నగ్గట్ ఆర్డర్ ఇచ్చాడు. అది తినడం పూర్తయ్యేలోగా అతనికో మెరుపులాంటి ఆలోచను వచ్చింది. చికెన్ నగ్గట్స్ను ఓ ఏడాది పాటు ఉచితంగా ఇస్తానంటే ఎన్ని రీట్వీట్స్ వస్తాయంటూ ట్వీటాడు. అంతే ఒక్కసారిగా అతని ట్వీట్‌కు రీ-ట్వీట్స్ వరదలా రాసాగాయి. అది ఎంతలా అంటే ట్వీటర్లో ఒక ట్వీట్‌కు అత్యధిక రీట్వీట్స్ వచ్చేలా. మొత్తం 3,430,500 మంది కార్టర్ ట్వీట్‌కు స్పందించారు. ఇప్పటికీ స్పందిస్తున్నారు కూడా. అత్యధిక రీట్వీట్ వచ్చిన ట్వీట్‌గా కార్టర్ ట్వీట్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన వెబ్సైట్లో పేర్కొంది. 2014 ఆస్కార్ అవార్డుల సందర్భంగా ఎలెన్సో ఎలెన్ డీజెనెరెస్ సెల్ఫీ ట్వీట్‌కు అత్యధికంగా ట్వీటరాటీలు రీ-ట్వీటారు.