ఫ్రీ చికెన్‌ కోసం ట్వీట్‌.. రికార్డు బద్దలు | 16-yr-old US boy's tweet breaks world record | Sakshi
Sakshi News home page

ఫ్రీ చికెన్‌ కోసం ట్వీట్‌.. రికార్డు బద్దలు

Published Wed, May 10 2017 9:15 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఫ్రీ చికెన్‌ కోసం ట్వీట్‌.. రికార్డు బద్దలు - Sakshi

ఫ్రీ చికెన్‌ కోసం ట్వీట్‌.. రికార్డు బద్దలు

వాషింగ్టన్‌: 16 ఏళ్ల బాలుడికి చికెన్‌పై ఉన్న ప్రేమ ట్వీటర్‌ రికార్డు బద్దలయ్యేలా చేసింది. కార్టర్‌ విల్కర్‌సన్‌కు చికెన్‌ అంటే ప్రాణం. అందులోనూ చికెన్‌ నగ్గెట్స్‌ అంటే మరీనూ. అలాంటి కార్టర్‌ గత నెలలో ఓ ఫుడ్‌ రెస్టారెంట్‌ వెళ్లి.. చికెన్‌ నగ్గట్‌ ఆర్డర్‌ ఇచ్చాడు.

అది తినడం పూర్తయ్యేలోగా అతనికో మెరుపులాంటి ఆలోచను వచ్చింది. చికెన్‌ నగ్గట్స్‌ను ఓ ఏడాది పాటు ఉచితంగా ఇస్తానంటే ఎన్ని రీట్వీట్స్‌ వస్తాయంటూ ట్వీటాడు. అంతే ఒక్కసారిగా అతని ట్వీట్‌కు రీ-ట్వీట్స్‌ వరదలా రాసాగాయి. అది ఎంతలా అంటే ట్వీటర్‌లో ఒక ట్వీట్‌కు అత్యధిక రీట్వీట్స్‌ వచ్చేలా. మొత్తం 3,430,500 మంది కార్టర్‌ ట్వీట్‌కు స్పందించారు. ఇప్పటికీ స్పందిస్తున్నారు కూడా.

అత్యధిక రీట్వీట్‌ వచ్చిన ట్వీట్‌గా కార్టర్‌ ట్వీట్‌ను గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 2014 ఆస్కార్‌ అవార్డుల సందర్భంగా ఎలెన్‌సో ఎలెన్‌ డీజెనెరెస్‌ సెల్ఫీ ట్వీట్‌కు అత్యధికంగా ట్వీటరాటీలు రీ-ట్వీటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement