CSK vs KKR
-
టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా?.. ఇప్పటికైనా పృథ్వీ షాను తీసుకోండి!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆట తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో కనీస పోరాట పటిమ కనిపించలేదని.. సీఎస్కే చరిత్రలోనే ఇది అత్యంత చెత్త ప్రదర్శన అని ఘాటుగా విమర్శించాడు. ఇప్పటికైనా మూస పద్ధతి, ముతక ఆట తీరుకు చరమగీతం పాడాలని సూచించాడు.వరుసగా ఐదు ఓటములుకాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో సీఎస్కే పరాజయ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన చెన్నై జట్టుకు.. ఆ తర్వాత విజయమే కరువైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైన సీఎస్కే.. శుక్రవారం కేకేఆర్ చేతిలోనూ పరాజయాన్ని చవిచూసింది.సొంత మైదానం చెపాక్‌లో ఈ సీజన్లో వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది. ఒక ఐపీఎల్ సీజన్లో చెన్నై ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం.. తమకు కంచుకోటైన చెపాక్‌లో హ్యాట్రిక్ పరాజయాలు చవిచూడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ సారథి, మాజీ చీఫ్ సెలక్టర్ సీఎస్కే తీరును ఎండగట్టాడు.పృథ్వీ షాను తీసుకోండి‘‘సీఎస్కే చరిత్రలోనే ఇదొక చెత్త ఓటమి. పవర్ ప్లేలో అయితే.. ఏదో టెస్టు మ్యాచ్‌కు ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఆడారు. ప్రతి ఒక్కరు అదే తీరు. సమయం మించిపోతోంది. వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పృథ్వీ షా వంటి ఆటగాళ్లను ఎందుకు తీసుకోకూడదు?!ఇలాంటి సమయంలో అలాంటి వాళ్లే అవసరం. ఈ విషయం గురించి మీరు ఎందుకు ఆలోచించరు?.. లేదా ఇలాంటి గందరగోళం, పేలవమైన ఆట తీరు కూడా వ్యూహంలో భాగమే అంటారా?’’ అంటూ చిక్కా ఓ వైపు సూచనలు ఇస్తూనే.. మరోవైపు.. సీఎస్కే నాయకత్వ బృందానికి చురకలు అంటించాడు.మహేంద్ర సింగ్ ధోని మరోసారికాగా ఈ సీజన్లో ఐదు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన సీఎస్కే రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని మరోసారి కెప్టెన్సీ చేపట్టాడు. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లలో అతడే సీఎస్కేను ముందుండి నడిపించనున్నాడు.మరోవైపు.. ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. క్రమశిక్షణా రాహిత్యం, వరుస వైఫల్యాల కారణంగా ప్రస్తుతం కఠిన దశను ఎదుర్కొంటున్నాడు. జాతీయ జట్టుకు ఎప్పుడో దూరమైన పృథ్వీ.. ఐపీఎల్-2025 మెగా వేలంలోనూ అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.రూ. 75 లక్షల కనీస ధరఒకప్పుడు కోట్లు పలికిన ఈ ఆటగాడు రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చినా పది ఫ్రాంఛైజీలలో ఒక్కటీ పృథ్వీ షాను పట్టించుకోలేదు. అయితే, తనదైన రోజున అద్భుతంగా ఆడే ఈ ఓపెనింగ్ బ్యాటర్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని.. క్రిష్ణమాచారి సీఎస్కేకు సూచించడం గమనార్హం.కాగా పృథ్వీ షా ఐపీఎల్లో ఇప్పటి వరకు ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 1892 పరుగులు చేశాడు. చివరగా 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.చదవండి: IPL 2025: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. అతడు సీజన్ మొత్తానికి దూరం -
KKR Vs CSK: అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా? అసలు మెదడు పనిచేస్తోందా?!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందిన ఈ ఫైవ్ టైమ్ చాంపియన్.. ఆ తర్వాత పరాజయ పరంపర కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.తద్వారా ఈ సీజన్లో వరుసగా ఐదు పరాజయాలు నమోదు చేసింది. సీఎస్కే చరిత్రలో ఇలాంటి పరాభవం ఇదే తొలిసారి. అది కూడా చెన్నైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారథ్యంలో ఈ చేదు అనుభవం ఎదుర్కోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎస్కే ఆట తీరు, ధోని కెప్టెన్సీ తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి తీవ్రంగా విమర్శించాడు.ప్రత్యర్థి తెలివిగా ఆడితే.. వీరు మాత్రందిగ్గజ ఆటగాడు, కెప్టెన్ అయిన ధోని నుంచి ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని.. అసలు వాళ్లకు మెదడు పనిచేయడం మానేసిందా అన్నట్లుగా మ్యాచ్ సాగిందని మనోజ్ తివారి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రత్యర్థి తెలివిగా ఆడి గెలుపొందితే.. చెన్నై జట్టు మాత్రం తెల్లముఖం వేసిందని ఎద్దేవా చేశాడు.‘‘సీఎస్కే పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ముఖ్యంగా గత మూడు- నాలుగు మ్యాచ్‌లలో వారి ప్రదర్శన మరీ నాసిరకంగా ఉంది. ఆటగాళ్ల షాట్ల ఎంపిక చెత్తగా ఉంటోంది. గత 20- 25 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్లకు కూడా ఏమైంది?అతడిని ఎనిమిదో ఓవర్లో పంపిస్తారా?అసలు వారి ప్రణాళికలు ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. మీ జట్టులో ప్రస్తుత పర్పుల్ క్యాప్ విజేత నూర్ అహ్మద్ ఉన్నాడు. కానీ అతడిని మీరు ఎప్పుడు బౌలింగ్‌కు పంపించారో గుర్తుందా? ఎనిమిదో ఓవర్.. అవును ఎనిమిదో ఓవర్..ప్రత్యర్థి జట్టులోని సునిల్ నరైన్ తన తొలి బంతికే వికెట్ తీసిన విషయం మీకు తెలియదా? దీనిని బట్టి పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుందనే అంచనా రాలేదా? అలాంటపుడు మీ పర్పుల్ క్యాప్ విజేతను ముందుగానే ఎందుకు బౌలింగ్‌కు పంపలేదు?సాధారణంగా ధోని ఇలాంటి పొరపాట్లు చేయడు. చాలా ఏళ్లుగా అతడిని గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పు అయితే ఎన్నడూ చేయలేదు. కానీ ఈరోజు ఏమైంది? ఓటమి తర్వాతనైనా మీరు పొరపాట్లను గ్రహిస్తారనే అనుకుంటున్నా.అసలు మెదడు పనిచేస్తోందా?!మామూలుగా అయితే, అశ్విన్ లెఫ్టాండర్లకు రౌండ్ ది స్టంప్స్ బౌల్ చేస్తాడు. కానీ ఈరోజు అతడు కూడా ఓవర్ ది స్టంప్స్ వేశాడు. ధోని వంటి అనుభవజ్ఞుడైన, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఉన్న జట్టులో ఇదేం పరిస్థితి? వాళ్లు మెదళ్లు పనిచేయడం ఆగిపోయాయా?’’ అంటూ మనోజ్ తివారి క్రిక్‌బజ్ షోలో సీఎస్కే, ధోనిపై విమర్శల వర్షం కురిపించాడు.కాగా చెపాక్‌లో కేకేఆర్‌తో టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేసింది. కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులే చేసింది. స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు, మొయిన్ అలీ ఒక వికెట్ తీయగా.. పేసర్లు వైభవ్ అరోరా ఒకటి, హర్షిత్ రాణా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.ధనాధన్.. 10.1 ఓవర్లలోనే ఇక సీఎస్కే బౌలింగ్ అటాక్‌ను పేసర్ ఖలీల్ అహ్మద్ ఆరంభించగా.. స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను ఎనిమిదో ఓవర్లో రంగంలోకి దింపారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నూర్ తన ఓవర్లో కేవలం రెండు పరుగులే ఇచ్చినా.. మరో రెండు ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ గెలుపు ఖరారైంది.సీఎస్కే విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి కేకేఆర్ పూర్తి చేసింది. ఓపెనర్లలో క్వింటన్ డికాక్ (23) రాణించగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సునిల్ నరైన్ మెరుపు ఇన్నింగ్స్ (18 బంతుల్లో 44) ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (17 బంతుల్లో 20).. రింకూ సింగ్ (12 బంతుల్లో 15)తో కలిసి కేకేఆర్‌ను గెలుపుతీరాలకు చేర్చాడు.చదవండి: వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025 -
వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడా.. అయితే: ధోని
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వరుస పరాజయాలతో చతికిలపడ్డ సీఎస్కే.. తాజాగా మరో ఓటమిని చవిచూసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.తద్వారా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో ఓటమితో పాటు.. సొంత మైదానం చెపాక్‌లో హ్యాట్రిక్ పరాజయాన్ని నమోదు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సీఎస్కేను ముందుండి నడిపించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.పూర్తిగా విఫలమైపోయాంఅయితే, కెప్టెన్‌గా పునరాగమనం చేసిన వేళ ధోనికి ఇలా ఊహించని, ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమిపై స్పందిస్తూ.. ‘‘గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసి రావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిని అంగీకరించకతప్పదు.ఈరోజు మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు నింపలేకపోయాం. గత మ్యాచ్‌లలో రెండో ఇన్నింగ్స్‌లో మేము తడబడ్డాం. కానీ ఈసారి తొలి ఇన్నింగ్స్‌లోనే మేము దారుణంగా విఫలమయ్యాం. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో పూర్తిగా విఫలమైపోయాం.పవర్ ప్లేలో 31 పరుగులు మాత్రమే వచ్చాయన్నది వాస్తవం. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటానికే ప్రాధాన్యం ఇస్తాం. గత రెండు మ్యాచ్‌లలో మీరు ఈ విషయం గమనించే ఉంటారు. మా బలాలు ఏమిటో మాకు తెలుసు. అందుకు అనుగుణంగానే మేము ఆడతాం.వాళ్లలా మేము ఆడలేం.. మాకు అది చేతకాదు కూడాఇతరులను అనుకరిస్తూ.. వారితో పోటీ పడుతూ.. వారిలాగానే ఆడాలనుకోవడం సరికాదు. స్కోరు బోర్డును చూస్తూ పవర్‌ప్లేలో అరవై పరుగులు చేయాలనే ఆతురత ఒత్తిడిని పెంచుతుంది. మా ఓపెనర్లు అచ్చమైన క్రికెట్ షాట్స్ ఆడతారు. పరిధులు దాటి హిట్టింగ్ మాత్రమే ఆడాలనే దృక్పథం మాకు లేదు. మాకు అది చేతకాదు కూడా.భాగస్వామ్యాలు నెలకొల్పుతూ మధ్య ఓవర్ల సమయానికి పటిష్ట స్థితిలో ఉండాలని భావిస్తాం. ఒకవేళ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే మిడిలార్డర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకుంటుంది. మా ప్రణాళికలు ఇలాగే ఉంటాయి’’ అని ధోని పేర్కొన్నాడు. కాగా సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనికి ఉంది. కానీ ఇప్పుడిలా చేదు అనుభవం ఎదుర్కోవడంతో తాము తీవ్ర నిరాశకు గురైనట్లు తలా తెలిపాడు.103 పరుగులు మాత్రమేకాగా చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాపార్డర్‌లో ఓపెనర్లు రచిన్ రవీంద్ర (4), డెవాన్ కాన్వే (12).. వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (16) మూకుమ్మడిగా విఫలమయ్యారు.మిడిల్లో విజయ్ శంకర్ (21 బంతుల్లో 29), శివం దూబే (29 బంతుల్లో 31) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0), దీపక్ హుడా (0), కెప్టెన్ ధోని (1) తీవ్రంగా నిరాశపరిచారు. కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు సునిల్ నరైన్ మూడు, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లతో అదరగొట్టగా.. మొయిన్ అలీ కాన్వే రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు.10.1 ఓవర్లలోనే ఫినిష్పేసర్లలో వైభవ్ అరోరా ఒకటి, హర్షిత్ రాణా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక సీఎస్కే విధించిన స్పల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (16 బంతుల్లో 23), సునిల్ నరైన్ (18 బంతుల్లో 44) రాణించగా.. కెప్టెన్ అజింక్య రహానే (17 బంతుల్లో 20), రింకూ సింగ్ (12 బంతుల్లో 15) కలిసి జట్టు విజయాన్ని ఖరారు చేశారు. చదవండి: SRH vs PBKS: సన్‌రైజర్స్‌కో విజయం కావాలి! Game set and done in a thumping style ✅@KKRiders with a 𝙆𝙣𝙞𝙜𝙝𝙩 to remember as they secure a comprehensive 8️⃣-wicket victory 💜Scorecard ▶ https://t.co/gPLIYGiUFV#TATAIPL | #CSKvKKR pic.twitter.com/dADGcgITPW— IndianPremierLeague (@IPL) April 11, 2025 -
CSK Vs KKR: ‘ద్రోహి వచ్చేశాడు చూడండి... జీవితం చాలా చిత్రమైనది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో వరుస పరాజయాలతో చతికిల పడ్డ చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి నాయకుడిగా వ్యవహరించనున్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్ సందర్భంగా ధోని సీఎస్కే తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సొంత మైదానం చెపాక్‌లో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తలమునకలయ్యారు. ఇక ధోని సైతం నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు.ఆ సమయంలో కేకేఆర్ మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా అతడికి ఎదురువెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. ద్రోహి వచ్చేశాడు చూడండిఇంతలో నెట్స్‌లో ఉన్న ధోని మాత్రం.. బ్రావోను చూసి.. ‘‘ఇదిగో.. ద్రోహి వచ్చేశాడు చూడండి’’ అంటూ తనదైన శైలిలో స్వాగతం పలికాడు. ఇందుకు.. ‘‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది’’ అని బ్రావో బదులిచ్చాడు. నవ్వుతూ వెళ్లి ధోని హగ్ చేసుకున్నాడు. ఆ వైబ్‌ను మిస్సవుతున్నాంఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ఎంఎస్- డీజే.. ఆ వైబ్‌ను మిస్సవుతున్నాం’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక ఈ వీడియోను చూసి సీఎస్కే అభిమానులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. బ్రావో చెన్నై ఫ్రాంఛైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.సీఎస్కేతో సుదీర్ఘ బంధంకాగా వెస్టిండీస్‌కు చెందిన డ్వేన్ బ్రావో 2011- 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2018- 2022 మధ్య కాలంలో ఈ కరేబియన్ ఆల్‌రౌండర్ సీఎస్కేకు ఆడాడు. 2011, 2018, 2021, 2022లో ట్రోఫీ గెలిచిన చెన్నై జట్టులో అతడు సభ్యుడిగా ఉన్నాడు.అంతేకాదు.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బ్రావో 2023లో బౌలింగ్ కోచ్‌గా చెన్నై జట్టుకు సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో చెన్నై ముఖచిత్రం, కర్త, కర్మ, క్రియ అయిన ధోనితో బ్రావోకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే, 2025 సీజన్ ఆరంభానికి ముందు పరిస్థితులు మారిపోయాయి.గౌతం గంభీర్ స్థానంలోసీఎస్కేను వీడిన తర్వాత బ్రావో.. కేకేఆర్ ఫ్రాంఛైజీతో జట్టుకట్టాడు. గౌతం గంభీర్ స్థానంలో డిఫెండింగ్ చాంపియన్ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక సీఎస్కే- కేకేఆర్ మధ్య శుక్రవారం మ్యాచ్ నేపథ్యంలో చెన్నై ఆటగాళ్లను కలవగా ధోని ఇలా సరదాగా స్పందించడం విశేషం.కాగా 41 ఏళ్ల పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బ్రావో ఐపీఎల్లో 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. అదే విధంగా.. 1560 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. మరోవైపు.. సీఎస్కే ఆడిన ఐదింట.. గత నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైంది.చదవండి: RCB Vs DC: ఇదేం కెప్టెన్సీ?.. పాటిదార్‌పై కోహ్లి ఫైర్?!.. డీకేతో చర్చ.. అతడు కెప్టెన్‌తో మాట్లాడాల్సింది!MS🫂DJ : MISS THIS VIBE! 💛✨#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/IlSd876zes— Chennai Super Kings (@ChennaiIPL) April 11, 2025