curative petition
-
వాయిదాల ఉరి.. న్యాయమేదరి?
న్యూఢిల్లీ: యావత్ దేశాన్నీ కుదిపేసిన నిర్భయ పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు శతవిధాలా యత్నిస్తున్నారు. న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రతిసారీ నిర్భయ తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. మృత్యువు తరుముకొస్తున్న ప్రతి సందర్భంలోనూ దోషుల తరఫు న్యాయవాదులు చట్టపరిధిలో శిక్ష అమలును అడ్డుకుంటూనే ఉన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి. న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకునే హక్కు దోషులకుందన్న న్యాయ నిబంధనల నేపథ్యంలో మరణశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. మరణశిక్ష పడిన దోషులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా, లేదా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవడం ద్వారా శిక్ష అమలు కొంతకాలం వాయిదా పడేలా చేసుకోవచ్చు. ఒకసారి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినట్టయితే, తిరస్కరణను సవాల్ చేస్తూ కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇలాంటి అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటూ మరణశిక్షని వాయిదా వేస్తూ వచ్చారు దోషులు. చివరకు తలగోడకేసి కొట్టుకొని కూడా అనారోగ్యం, గాయాలు అయ్యాయన్న నెపంతో ఉరిశిక్షని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ► జనవరి 22, 2020: ఈ కేసులో జనవరి 7న ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు దోషులు నలుగురినీ జనవరి 22న ఉరితీయాలని తీర్పునిచ్చింది. ► ఫిబ్రవరి 1, 2020: అయితే ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష తిరస్కరణ అనంతరం ఉరిశిక్షకు 14 రోజుల గడువివ్వాలన్న నిబంధనల మేరకు జనవరి 17న ఢిల్లీ కోర్టు నిర్భయ దోషుల ఉరిశిక్షను తిరిగి వాయిదా వేసి, ఫిబ్రవరి 1న దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంది. ► పవన్ గుప్తా 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌నంటూ జనవరి 17న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దీంతో రెండోసారి ఉరి ఆగిపోయింది. ► మార్చి 3, 2020: తిరిగి ఫిబ్రవరి 17న కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసింది. దీనిప్రకారం మార్చి 3న నలుగురికీ ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉంది. సోమవారం తాజాగా మూడోసారి మరణశిక్ష వాయిదా పడింది. -
నిర్భయ కేసు : మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార కేసులో మరో కీలకపరిణామం చోటు చేసుకుంది. 2012 సామూహిక హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం కొట్టి వేసింది. ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల (అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమాన్, భానుమతి, అశోక్ భూషణ్) ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. అయితే రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్ గుప్తాకు ఇంకా మిగిలే ఉంది. చదవండి : నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా? -
నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా?
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా?
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 2) విచారించనుంది. తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా శుక్రవారం సుప్రీం కోర్టులో నివారణ పిటిషన్ దాఖలుచేసిన సంగతి విదితమే. న్యాయమూర్తులు ఎన్వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమన్. ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్ని అనీ, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇదిలావుండగా డెత్ వారెంట్ అమలుపై స్టే కోరుతూ దోషి అక్షయ్ కుమార్ సింగ్ దరఖాస్తుపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ కోర్టు శనివారం తీహార్ జైలు అధికారులను కోరింది. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా సోమవారం ఈ విషయాన్నివిచారించనున్నారు. పవన్ గుప్తా తాజా క్యురేటివ్ పిటిషన్ తిరస్కరణ గురైన తర్వాత కూడా అతను రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురైనా కూడా, దాన్ని సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చు. దీంతో పాటు దోషులను విడిగా ఉరితీయాలని ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మార్చి 5 న విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 డిసెంబర్ 16 రాత్రి నిర్భయను దారుణంగా సామూహిక హత్యాచారం చేసిన దోషులందరూ మృత్యుభయంతో, న్యాయ వ్యవస్తలో ఉన్న అన్ని అవకాశాలను తమకనుకూలంగా మలుచుకుంటూ శిక్షనుంచి తప్పించుకునేందుకు అనేకపన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిర్భయ దోషుల్లో ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించు కున్నారు. దోషుల వరుస పిటీషన్లతో నిర్భయ దోషులకు ఇప్పటికే రెండుసార్లు శిక్ష వాయిదాపడింది. మొదట జనవరి 22 న ఉరి తీయవలసి ఉండగా, ఆ తరువాత ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులనూ ఉరితీయాల్సి ఉంది. మరోవైపు దోషులకుఉరిశిక్ష అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి, తన కుమార్తెకు న్యాయం జరగడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. (నిర్భయకు న్యాయం జరగకుంటే..) చదవండి : మార్చి 3న ఉరితీయండి -
సుప్రీంకోర్టులో పవన్ క్యూరేటివ్ పిటిషన్
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్యకేసులో నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా తనకు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయదోషుల్లో న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోని ఏకైక వ్యక్తి పవన్ గుప్తా, అలాగే నిర్భయ కేసులో రాష్ట్రపతి దయాభిక్ష కోసం అర్జీపెట్టుకున్న చివరి వ్యక్తి కూడా పవన్ గుప్తాయే. నిర్భయ ఘటనలో నలుగురు దోషులు ముకేశ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్‌లకు మార్చి3న ఉరిశిక్ష అమలుచేయాలని ఫిబ్రవరి 17న ట్రయల్ కోర్టు ఆదేశించింది. వీరిలో ఇప్పటికే ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. రాష్ట్రపతి దయాభిక్ష పిటిషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ ముకేశ్, వినయ్ లు దాఖలు చేసుకున్న ప్రత్యేక పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని ఇంకా అక్షయ్ కోర్టులో సవాలు చేయలేదు. -
నిర్భయ నిందితుల ఉరిశిక్షలో మరో ట్విస్ట్
-
23ఏళ్ల విషాద ఘటన.. శిక్షను పొడిగించలేం!
న్యూఢిల్లీ: 23ఏళ్ల క్రితం దేశ రాజధానిలోని ఉపహార్ థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధితులు వేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు కొట్టేసింది. 1997 సంవత్సరం గ్రీన్ పార్క్ సమీపంలో ఉపహార్ థియేటర్లో సినిమా ప్రదర్శిస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అనూహ్య ఘటనలో 59మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ఘటనలో థియేటర్ యాజమానులైన గోపాల్ అన్సల్, సుశీల్ అన్సల్‌లపై కేసు నమోదైంది. 2007లో వీరిని విచారించిన ట్రయల్ కోర్టు దోషులుగా ప్రకటించి రేండేళ్ల జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అన్సల్ సోదరులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్ష ఏడాదికి తగ్గించబడింది. కాగా, ఈ శిక్షను నిందితులు సుప్రీం కోర్టులో సవాలు చేయగా.. 60కోట్లు చెల్లిస్తే సరిపోతుందని, జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. అయితే వయసు దృష్ట్యా సుశీల్ బన్సాల్‌కు జైలు శిక్ష నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. సుప్రీం తీర్పుపై భాదితుల సంఘం మరోసారి క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయగా.. నిందితులకు శిక్షను మరింత కాలం పొడగించలేమని, ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది. చదవండి: నిర్భయకు న్యాయం జరగకుంటే.. -
మార్చి 3న ఉరితీయండి
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలుకు తేదీ ఖరారయ్యింది. నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారంట్ జారీచేసింది. రోజుకో మలుపు తిరుగుతూ యావత్ దేశం దృష్టినీ ఆకర్షిస్తోన్న నిర్భయ కేసులో దోషులకు మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలుచేయాలని ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. ఇంకా దోషులకు శిక్ష అమలును ఆలస్యం చేయడం బాధితుల హక్కులకు భంగకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ముకేశ్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ కుమార్ శర్మ(26), అక్షయ్‌కుమార్(31)లకు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశించడం ఇది మూడోసారి. జనవరి 7, 2020 తేదీన కోర్టు ఇచ్చిన ఆదేశాలు మార్చి 3న అమలులోకి వస్తాయని ఢిల్లీ కోర్టు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా వెల్లడించారు. దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ జనవరి 7, 2020న కోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే జనవరి 17, జనవరి 31న రెండు సార్లు దోషులకు విధించిన మరణశిక్ష వాయిదాపడింది. శిక్ష అమలును ఇంకా వాయిదా వేయడం వల్ల బాధితుల హక్కులకూ, సత్వర న్యాయానికీ నష్టమని కోర్టు అభిప్రాయపడింది. ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు కొత్తగా డెత్ వారంట్ జారీ చేసేందుకు ట్రయల్ కోర్టును ఆశ్రయించొచ్చంటూ సుప్రీంకోర్టు అధికారులకు స్వేచ్ఛనివ్వడంతో, నిర్భయ దోషుల తల్లిదండ్రులూ, ఢిల్లీ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తులను పటియాలా హౌజ్ కోర్టు విచారించింది. ఉరిశిక్ష అమలుపై నిర్భయ తల్లి ఆశాభావం తన కుమార్తె నిర్భయపై సామూహిక అత్యాచారంచేసి, హత్య చేసిన నలుగురు దోషులకూ ఒకేసారి శిక్షపడుతుందని నిర్భయ తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు అమలు జరుగుతాయని ఆమె భావిస్తున్నానన్నారు. క్షమాభిక్ష కోరతాం: పవన్, అక్షయ్ పవన్‌గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయాలనీ, రాష్ట్రపతి ఎదుట క్షమాభిక్ష పిటిషన్ వేయాలని భావిస్తున్నట్టు న్యాయవాది రవిఖాజీ కోర్టుకి వెల్లడించారు. అలాగే, అక్షయ్ కూడా త్వరలోనే రాష్ట్రపతికి పూర్తిస్థాయిలో క్షమాబిక్ష పిటిషన్ దాఖలు చేస్తాడని న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకి విన్నవించారు. వినయ్ శర్మ దీక్ష విరమణ తీహార్ జైల్లో వినయ్ శర్మ నిరాహార దీక్ష చేస్తున్న విషయం కోర్టుకి తెలిసింది. ఆ తరువాత అతడు దీక్షను విరమించుకున్నట్టు కోర్టు వెల్లడించింది. వినయ్ మానసిక ఆరోగ్యం సరిగాలేనందున ఉరితీయడం కుదరదనీ అతడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే కోర్టు ఈ వాదనని తోసిపుచ్చింది. 33 నెలలు... దోషుల అప్పీల్‌ను 2017, మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 33 నెలల తరువాత కూడా నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా ఎటువంటి క్యూరేటివ్ పిటిషన్‌ను గానీ, క్షమాభిక్ష పిటిషన్‌ని కానీ దాఖలు చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. న్యాయపరమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకోని ఏకైక వ్యక్తి పవన్ గుప్తాయేనని కోర్టు వెల్లడించింది. నిర్భయ దోషులు వీరే.. -
అక్షయ్‌కు సుప్రీం షాక్.. పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో నిర్భయ దోషులను ఉరితీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న వేళ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఫిబ్రవరి 1న అమలు కానున్న మరణ శిక్షపై స్టే విధించాలంటూ గురువారం పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అదే విధంగా ఉరిశిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులోనూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ఇదే కేసులో మరో దోషి అయిన వినయ్ శర్మ బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ వేసిన విషయం విదితమే. జైళ్లో ఇప్పటికే పలుమార్లు చచ్చిపోయాను కాబట్టి తనను క్షమించాలని.. 2012 ఘటన తన జీవితాన్ని మార్చివేసిందని.. అయితే దీనికి మరణ శిక్ష అమలు చేయాలా వద్దా లేదా అన్న విషయాన్ని మీరే నిర్ణయించాలంటూ రాష్ట్రపతిని అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలు తేదీపై మరోసారి సందేహాలు తలెత్తుతున్నాయి.(నిర్భయ కేసు: మరో అనూహ్య పరిణామం..అసలు ఫిబ్రవరి 1న ఉరితీస్తారా?) కాగా ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు గత కొన్ని రోజులుగా నిర్భయ దోషులు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు, స్టే కోరుతూ నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31) వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. నిజానికి జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ... వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం.. ముఖేష్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో.. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో... ఏదో విధంగా ఉరిశిక్ష తేదీ మారేలా చేయడం, ఉరిశిక్ష నుంచి తప్పించుకునేలా దోషులు పావులు కదుపుతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు దాదాపు రెండేళ్ల క్రితమే ఉరిశిక్ష విధించినా.. శిక్ష అమలులో జాప్యంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
‘తీహార్’ అధికారులు సహకరించట్లేదు!
న్యూఢిల్లీ: తీహార్ జైలు అధికారులు తమకు సహకరించడం లేదంటూ నిర్భయ దోషులు ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు వేసేందుకు అవసరమైన పత్రాలను అధికారులు ఇవ్వడం లేదని ఉరిశిక్ష పడిన నలుగురిలో ముగ్గురు శుక్రవారం కోర్టులో పిటిషన్లు వేశారు. వినయ్ కుమార్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌కు అవసరమైన 70 పేజీల డైరీ ప్రతితోపాటు అక్షయ్‌కుమార్ సింగ్, పవన్ సింగ్ క్యూరేటివ్ పిటిషన్లకు జైలు అధికారులు కొన్ని పత్రాలను ఇవ్వాల్సి ఉందని అందులో తెలిపారు. అవి లేనందున వెంటనే దరఖాస్తు చేయలేకపోయామని, వాటిని వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకోసం ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భావించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ కోర్టులో వేసిన ఈ పిటిషన్లు శనివారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. కాగా, వినయ్, ముకేశ్ సింగ్‌లు ఆఖరిప్రయత్నంగా వేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. దీంతోపాటు ముకేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఉరిశిక్ష అమలును పలు విధాలుగా సవాలు చేస్తూ కాలం గడిపేయొచ్చనే అభిప్రాయం దోషుల్లో ఏర్పడరాదంటూ గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
క్షమాభిక్ష పెట్టండి!
న్యూఢిల్లీ: మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా దోషుల్లో ఒకరైన ముకేశ్ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశ్రయించాడు. అలాగే, తన ఉరిశిక్షపై జారీ అయిన డెత్ వారంట్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టాడు. నిర్భయ దోషులు వినయ్ శర్మ(26), ముకేశ్ కుమార్(32), అక్షయ్ కుమార్ సింగ్ (31), పవన్ గుప్తా(25)లను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జనవరి 7వ తేదీన డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిలో ఇద్దరు వినయ్ శర్మ, ముకేశ్ కుమార్‌లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను మంగళవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత మంగళవారం సాయంత్రం ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు, వారి ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్యూరేటివ్ పిటిషన్లను నిశితంగా పరిశీలించి, వారి అభ్యర్థనను తోసిపుచ్చాలనే ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం వెల్లడించింది. క్యూరేటివ్ పిటిషన్ శిక్ష పడిన వ్యక్తికి లభించే చట్టబద్ధమైన చివరి అవకాశం. అయితే, ఇప్పటివరకు మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేయలేదు. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పిటిషన్ పెట్టుకున్నానని, అందువల్ల ఢిల్లీ ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను పక్కనపెట్టాలని ముకేశ్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. లేని పక్షంలో క్షమాభిక్ష కోరే తన రాజ్యాంగ హక్కును కోల్పోతానన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టులోని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంగీత ధింగ్రాల ధర్మాసనం నేడు(బుధవారం) విచారించే అవకాశముంది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించినప్పటికీ.. ఆ తరువాత మరణశిక్షను అమలు చేసేందుకు కనీసం 14 రోజుల గడువు ఉండాలన్న నిబంధనను ముకేశ్ కోర్టుకు గుర్తు చేశారు. త్వరలో క్షమాభిక్ష పిటిషన్ వేస్తా మిగతా ఇద్దరు దోషులు అక్షయ్, పవన్ తరఫున సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లను వేస్తానని న్యాయవాది ఆర్పీ సింగ్ వెల్లడించారు. ఈ నలుగురు దోషులపై ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌ను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచన కూడా ఉందన్నారు. ‘దోషుల తరఫున క్షమాభిక్ష పిటిషన్ వేసిన తరువాత ఈ విషయాన్ని వివరిస్తూ.. ఉరిశిక్ష అమలును నిలిపేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయిస్తాన’న్నారు. కాగా, వినయ్, ముకేశ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. వారిని ఉరితీసే జనవరి 22 వ తేదీ తనకు అత్యంత ముఖ్యమైన రోజని ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వద్ద హర్షం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి 2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి.. 2012, డిసెంబర్ 16 అర్ధరాత్రి పారామెడిక్ విద్యార్థిని బస్సులో దారుణంగా సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెను దారుణంగా హింసించిన ఆరుగురు వ్యక్తులు ఆ తరువాత ఆమెను బస్సులో నుంచి రోడ్డుపై విసిరేశారు. అనంతరం, ‘నిర్భయ’గా పేరు పొందిన ఆ బాధితురాలు డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ ఆరుగురు దోషుల్లో నలుగురికి ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను 2017లో సుప్రీంకోర్టు సమర్ధించింది. దోషుల్లో ఒకరైన రామ్‌సింగ్ తిహార్ జైళ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో దోషి అయిన మైనర్ బాలుడు జువనైల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. మిగిలిన దోషుల్లో ముగ్గురు 2018 జూలైలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్!
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు దోషులు వినయ్ శర్మ(26), ముఖేష్ కుమార్(32) దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ అత్యున్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం(అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమణ్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్) వాటిని కొట్టివేసింది. దీంతో నిర్భయ కేసు దోషులను ఉరి తీసేందుకు మార్గం సుగమమైంది.(ఉరి ఖాయం.. ఆరోజే నా కూతురికి న్యాయం) కాగా 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడి... ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు బాధితురాలు సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది.(నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు) దోషులు వీరే.. ముఖేష్ సింగ్: తీహార్ జైల్లో ఉరి వేసుకొని చనిపోయిన బస్సు డ్రైవర్ రామ్ సింగ్ తమ్ముడే ముఖేష్ సింగ్ (32). దక్షిణ ఢిల్లీలోని రవిదాస్ మురికివాడల్లో సోదరుడితో కలసి నివసించేవాడు అప్పుడప్పుడు తానే ఆ బస్సుని నడిపించేవాడు. క్లీనర్‌గా చేసేవాడు. ఘటన రోజు ముఖేశ్ బస్సు నడిపాడు. అత్యాచారం చేశాక నిర్భయ, ఆమె స్నేహితుడిని ఐరన్ రాడ్‌తో చితకబాదాడని ముఖేష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. వినయ్ శర్మ: వినయ్‌శర్మ (26) కూడా రవిదాస్ మురికివాడల్లో నివసించే వాడు. అతను ఫిటినెస్ ట్రైనర్. ఒక జిమ్‌లో అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య అభ్యసించాడు. అక్షయ్ కుమార్ ఠాకూర్: అక్షయ్ ఠాకూర్ (31) బిహార్ వాసి. నిర్భయను అత్యాచారం చేసిన బస్సులో హెల్పర్‌గా ఉన్నాడు. స్కూల్ డ్రాపవుట్ అయిన అక్షయ్ 2011లో బిహార్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. నేరం చేయడమే కాదు సాక్ష్యాధారాల్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నేరం జరిగిన ఐదు రోజుల తర్వాత అక్షయ్‌ని బిహార్‌లో అరెస్ట్ చేశారు. పవన్ గుప్తా: పవన్ గుప్తా (25) పండ్ల వ్యాపారి. డిసెంబర్ 16 మధ్యాహ్నం మద్యం సేవించి బయటకు వెళ్లాడు. అరెస్ట్ చేసిన తర్వాత పవన్ తాను చాలా దుర్మార్గానికి పాల్పడ్డానని, తనకి ఉరి శిక్షే సరైనదని కోర్టులో చెప్పుకున్నాడు. నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు 'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష' సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా.. -
ఆరోజే నా కూతురికి న్యాయం..
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని బాధితురాలి తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావని పేర్కొన్నారు. ఏడేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతంలో దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినయ్ శర్మ, ముఖేష్ కుమార్‌లు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం(అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారీమణ్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్) విచారించనుంది.(నేనొక బండరాయిని.. నాకు భావోద్వేగాలు లేవు) ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి మాట్లాడుతూ... ‘ఆ దోషులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కానీ నేడు అవి తిరస్కరించబడతాయని నేను భావిస్తున్నాను. జనవరి 22న వారిని ఉరి తీయడం ఖాయం. ఆరోజే నిర్భయకు న్యాయం జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దోషులు పవన్‌గుప్తా, అక్షయ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్లు..వాటిని ఉరి తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (దోషులు న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకోలేదు..) నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు -
14న నిర్భయ దోషుల పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై జనవరి 14న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 2012 డిసెంబర్లో నిర్భయపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారణమైన నలుగురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారుచేస్తూ తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో నలుగురు దోషుల్లో వినయ్ శర్మ(26), ముఖేష్ కుమార్(32)లు మాత్రం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారించనుంది. ఢిల్లీ కోర్టు ఒకటి నలుగురు దోషులకు జనవరి 8న డెత్ వారంట్లు జారీ చేస్తూ తగినంత సమయం అవకాశాలు కల్పించినా.. దోషులు తమ ముందు ఉన్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకోలేదని వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కారణంగా తన కుటుంబం మొత్తం ఇబ్బంది పడిందని, వారి తప్పు లేకపోయినా సామాజికంగా హేళనకు గురైందని వినయ్ శర్మ తన క్యూరేటివ్ పిటిషన్లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు పేదవారు, వయో వృద్ధులని, కేసు కారణంగా ఆర్థికంగా మరింత చితికిపోయారని తెలిపాడు. సీనియర్ న్యాయవాది అధీస్ సి.అగర్వాలా, ఏపీ సింగ్‌ల ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు కాగా.. పిటిషనర్‌ను ఉరితీస్తే కుటుంబం మొత్తం ధ్వంసమైపోతుందని, ఇన్నేళ్ల జైలు జీవితం, అతడి మానసిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. -
సుప్రీంకోర్టులో నిర్భయ దోషుల క్యూరేటీవ్ పిటిషన్
-
సుప్రీంలో నిర్భయ దోషి క్యూరేటివ్ పిటిషన్..
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ కేసులో మరణ శిక్ష ఖరారైన నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ శిక్ష అమలును నిలిపివేసే ఆశలతో చిట్టచివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 22న నలుగురు దోషులను ఉరితీయాలని ఢిల్లీ కోర్టు ప్రకటించిన రెండు రోజుల అనంతరం వినయ్ శర్మ సుప్రీం తలుపు తట్టారు. ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)లను కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 22న ఉరితీసేందుకు తిహార్ జైలులో అన్ని ఏర్పాట్లూ సాగుతున్నాయి. డెత్ వారెంట్ జారీ కాగానే నలుగురు దోషులూ కోర్టు రూమ్‌లోనే కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు వీరిని ఉరితీసేందుకు తిహార్ జైలులో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని ఉరితీసే క్రమంలో డమ్మీ ఎగ్జిక్యూషన్‌ను జైలు అధికారులు చేపట్టనున్నారు. మరణ శిక్ష అమలయ్యే వరకూ నలుగురు దోషులనూ ఒకే గదిలో ఉంచుతారు. కుటుంబ సభ్యులతో చివరిసారిగా కలిసేందుకు ఏర్పాట్లు చేస్తారు. చదవండి : 'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష' -
‘స్వలింగసంపర్కం’ రాజ్యాంగ ధర్మాసనానికి
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం క్యురేటివ్ పిటిషన్‌ను ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందులో మానవ సంబంధాలకు సంబంధించిన ముఖ్య, అమూల్య అంశాలెన్నో ముడిపడివున్న దృష్ట్యా విస్తృత బెంచ్‌కు నివేదిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ జేఎస్ ఖేహార్‌ల బెంచ్ వ్యాఖ్యానించింది. త్వరలోనే బెంచ్ ఏర్పాటవుతుందని వెల్లడించింది. ప్రకృతి విరుద్ధమైన స్వలింగ సంపర్కం నేరమంటూ 1860లో బ్రిటిష్ రాజ్ వే సెక్షన్ 377ను అమల్లోకి తెచ్చింది. దీనికి విరుద్ధంగా ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఈ తీర్పును నిలుపుదల చేసింది. తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్‌తో పాటు మరికొంతమంది సుప్రీమ్ కోర్టులో రివ్యూ పిటిషన్లు వేశారు. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని గే ఉద్యమకారులు స్వాగతించారు. కోర్టు నిర్ణయాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్వాగతించారు. స్వలింగ సంపర్క చట్టబద్ధతపై కేంద్రం ఎలాంటి అభిప్రాయానికీ రాలేదని మంత్రి వెంకయ్య చెప్పారు. -
అక్కడ దూకుడెందుకు చూపలేదు?
రాజీవ్ హంతకుల అంశంపై పణజి: యాకూబ్ మెమన్ కేసులో చూపించిన అత్యవసరతను.. రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నిర్ధారితులైన వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చూపించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ప్రశ్నించారు. రాజీవ్ హత్య కేసులో ముగ్గురికి విధించిన మరణశిక్షను తగ్గించి, వారికి కొత్త జీవితాన్ని అందించటాన్ని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత వారంలో కొట్టివేసింది. దిగ్విజయ్ శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకువేయటాన్ని హర్షిస్తున్నాం. కానీ.. మరోవైపు హిందూ అతివాదుల ప్రమేయం ఉన్న ఉగ్రవాద కేసుల్లో మందకొడిగా వ్యవహరించాలని ఎన్ఏఐ ఒక సీనియర్ న్యాయవాదికి చెప్పింది’’ అంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సలైన్ ఆరోపణలను ప్రస్తావించారు. యాకూబ్ కేసులో చూపిన అత్యవసరతను రాజీవ్ హంతకుల విషయంలో కానీ, సిక్కు ఉగ్రవాది భుల్లార్ విషయంలో కానీ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. మానవీయంగా నడుచుకుంది: ఆరెస్సెస్ న్యూఢిల్లీ: యాకూబ్‌ను ఉరితీసిన తర్వాత ఆయన మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించే విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మానవీయంగా వ్యవహరించిందని ఆరెస్సెస్ కితాబునిచ్చింది. వారు దేశద్రోహులు: సాక్షి మహరాజ్ రిషికేష్: యాకూబ్ మరణం పట్ల విచారిస్తున్న వారు జాతివ్యతిరేకులని, దేశద్రోహులని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అభివర్ణించారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వారు పాకిస్తాన్‌కు వెళ్లాలని సూచించారు. -
మెమన్ పిటిషన్ తిరస్కరణ సబబే: సుప్రీం
న్యూఢిల్లీ: ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ ను తిరస్కరించడం సబబేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. క్యూరేటివ్ పిటిషన్ విచారణలో చట్టపరంగా ఎలాంటి లోపాలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ విచారణలో న్యాయప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొంది. యాకుబ్ మెమన్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ పై వాదనలు త్రిసభ్య ఎదుట బుధవారం సాయంత్రం ముగిశాయి. క్యూరేటివ్ పిటిషన్ విచారణలో మెమన్ లేవనెత్తిన సాంకేతిక అంశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. క్యూరేటివ్ పిటిషన్ పై విచారణ చట్టబద్ధంగా జరగలేదని అంతకుముందు మెమన్ తరపు లాయర్ వాదించారు. జైల్లో మెమన్ సత్ప్రర్తనను దృష్టిలో పెట్టుకోవాలని త్రిసభ్య ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మెమన్ స్కిజోఫ్రెనియాతో బాధ పడుతున్నారని తెలిపారు. -
మెమన్ క్షమాభిక్ష: విచారణ రేపటికి వాయిదా
-
ఆ ఉగ్రవాదికి ఉరి ఖాయం
-
ముంబైపేలుళ్ల సూత్రధారికి ఉరి ఖాయం
ముంబై: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కారకుడు, ఉగ్రవాది యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ ఉరశిక్ష దాదాపు ఖరారైంది. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ అతడు పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో ముంబై పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష అమలు ఖాయమైంది. టాడా కోర్టు అతనికి విధించిన ఉరిశిక్షను ఆ తర్వాత సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. ఈ నేపథ్యంలో జూలై 30న యాకూబ్ ను ఉరితీయనున్నారు. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను అమలుచేసేందుకు రంగం సిద్ధం చేశామని ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఈ శిక్ష అమలుకానుంది. ప్రస్తుతం ఉరి శిక్ష కోసం ఎదురుచూస్తున్న ఏకైక ఖైదీ మెమన్ మాత్రమే. తనకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా గతంలో రాష్ట్రపతికి పెట్టుకున్న తిరస్కరించడంతో అతని మరణశిక్ష అమలు రూఢీ అయింది. కాగా 1993 మార్చి, 12 ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో సుమారు 257 మంది మరణించారు. 700 మంది తీవ్రంగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యాకూబ్‌ను ముంబై పేలుళ్ల కుట్రదారుడుగా తేల్చిన టాడా కోర్టు 2007 లో యాకూబ్ , మరో పదిమందికి ఉరిశిక్ష విధించింది. అయితే మార్చి 21, 2013న తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, యకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష ఖరారు చేసింది. మిగిలిన పది మందికి ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షకు తగ్గించింది.