Delhi IIT students
-
ప్రియుడితో మాజీ సీఎం కుమార్తె పెళ్లి : వైభవంగా
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ,ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్, సునీతా దంపతుల కుమార్తె హర్షిత వివాహం ఘనంగా జరిగింది. ఐఐటీలో క్లాస్మేట్, ప్రియుడు సంభవ్ జైన్‌ను వివాహమాడింది హర్షిత. బంధుమిత్రుల సమక్షంలో నిన్న (ఏప్రిల్ 18) ఢిల్లీలోని కపుర్తల హౌస్‌లో వైభవంగా ఈ మూడుముళ్ల వేడుక జరిగింది. ఈ గ్రాండ్ వివాహానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి.డిల్లీ మాజీ సీఎం కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్హంగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణితో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన హిట్ చిత్రం పుష్ప సినిమాలోని పాటకు స్టెప్పులేశారు. ఏప్రిల్ 20న ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారని సమాచారం. చదవండి: ఇషా అంబానీ డైమండ్ థీమ్డ్ లగ్జరీ ఇల్లు : నెక్ట్స్ లెవల్ అంతే!అందంగా వధూవరులుతన వెడ్డింగ్ డే కోసం, ఎరుపు లెహంగాలో గోల్డెన్ కలర్ వర్క్ బ్లౌజ్‌తో కళకళలాడింది. ఆమె ధరించినవీల్కూడా హైలైట్‌గా నిలిచింది .సంభవ్ తెల్లటి రంగు షేర్వానీ, తలపాగా నల్ల సన్ గ్లాసెస్ క్రిస్పీగా, రాయల్‌గా కనిపించాడు.ఇక అరవింద్ తెల్లటి షేర్వానీలో కనిపించగా, సునీత పింక్ చీర, కమర్బంద్, గులాబీ రంగు చూడీల సెట్, చక్కటి హెయిర్ బన్‌తో అత్తగారి హోదాలో హుందాగా కనిపించారు.ఎవరీ సంభవ్ జైన్హర్షిత, సంభవ్ IIT ఢిల్లీలో కలుసుకున్నారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2018లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గురుగ్రామ్‌లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG)లో పనిచేసింది హర్షిత. ఆ తరువాత సంభవ్తో కలిసి, బాసిల్ హెల్త్ అనే స్టార్టప్‌ను మొదలు పెట్టింది. కస్టమర్లకు ఆరోగ్యకరమైన, అనుకూలీకరించిన భోజనాన్ని అందించడమే దీని లక్ష్యం.. హర్షిత కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నపుడు మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు ఈ ఆలోచన ఆమె మనసులోకి వచ్చిందట. ఇక హర్షిత సోదరుడు పుల్కిత్ కూడా IIT ఢిల్లీలో చదువుతున్నాడు. -
మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా?
-
మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా?
తాను ఎన్నడూ చూడనంత అతి భారీ వర్షాన్ని చూసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ఢిల్లీలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా, తన పర్యటనలను చాలావరకు రద్దుచేసుకున్నారు. ఒక్క ఐఐటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి మాత్రం కష్టమ్మీద ఆయన వెళ్లగలిగారు. మామూలుగా అయితే అందరినీ ఎలా ఉన్నారనో.. మిమ్మల్నందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందనో పలకరిస్తారు. కానీ ఆయన మాత్రం.. ''మీరు ఇక్కడికి ఎలా వచ్చారు.. బోట్లలో వచ్చారా'' అని అడిగారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో రోడ్ల మీద పరిస్థితి చూసిన ఆయనకు ఈ అనుమానం వచ్చింది. జాన్ కెర్రీ ఆ ప్రశ్న అడగ్గానే ఒక్కసారిగా సమావేశం హాల్లో నవ్వులు విరబూశాయి. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయడం భారత్, అమెరికా దేశాలకు మాత్రమే తెలిసిన విద్య అని జాన్ కెర్రీ చెప్పారు. ఆ తర్వాత ఆయన భారత - అమెరికా సంబంధాలు, ఉగ్రవాదాన్ని అణిచేయడం, వాణిజ్య సంబంధాలు.. ఇలా పలు అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. పలు దేశాలు బలప్రయోగంతోనే సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నాయని... కానీ అమెరికా, భారత దేశాలు మాత్రం అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వాటి ద్వారానే ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఉగ్రవాదానికి మూలాలు ఏంటో వెలికితీయాలని, వేర్వేరు కారణాలను మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒక్కో దేశానికి, ప్రాంతానికి మధ్య కారణాలు వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే అవినీతిపై కూడా పోరాడి దాన్ని అరికట్టాలని ఐఐటీ విద్యార్థులకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో ఏ ఒక్క దేశం విజయం సాధించలేదని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీ బిల్లుతో పాటు కొత్త దివాలా చట్టాలను ఆమోదించిందని, విదేశీ పెట్టుబడుల నియంత్రణలలో మార్పులు చేసిందని.. వచ్చే సంవత్సరం భారతదేశం సంయుక్తంగా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తుందని, దీనివల్ల భారతీయ వ్యాపారుల సత్తా అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు. -
భారత్ మా ఫేస్బుక్
ఈ దేశం లేకుండా ప్రపంచంతో అనుసంధానం సాధ్యం కాదు ♦ భారత్‌లో మా వినియోగదారులు13 కోట్లు ♦ మెరుగైన విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఇంటర్నెట్తో పేదరికాన్ని పారదోలవచ్చు ♦ క్యాండీక్రష్ రిక్వెస్ట్‌లకు త్వరలో చెక్ నెట్ న్యూట్రాలిటీకి మద్దతు ♦ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఢిల్లీ ఐఐటీ విద్యార్థులతో మాటామంతీ న్యూఢిల్లీ: ‘‘ప్రపంచంలోని ప్రతి ఒక్కరితో కనెక్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భాగస్వామ్యం లేకుండా అది సాధ్యపడదు. ఫేస్బుక్ భారత ప్రజలతో మమేకం కావటం అత్యంత ప్రధానం. భారత దేశమే మా ‘ఫేస్ బుక్’. ప్రపంచంలో ఈ దేశమే మాకు పెద్ద మార్కెట్’’ అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. భారత భూభాగంపై అడుగుపెట్టడం తనకు ఎంతో ఉత్కంఠ కలిగించిందని.. ఇక్కడ అంతులేని శక్తి దాగుందని మార్క్ భావోద్వేగంతో చెప్పారు. భారత పర్యటనలో భాగంగా బుధవారం ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టౌన్హాల్లో వెయ్యిమందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. భారత్‌లో 13 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ వినియోగదారులున్నారని, వీరిలో ఎక్కువమంది తమ అనుబంధ సంస్థ వాట్సప్‌కు కూడా కనెక్ట్ అయి ఉండటం అద్భుతమని అన్నారు... అయితే నాణేనికి మరోవైపు చూస్తే, భారత్‌లో ఇంకా చాలామందికి ఇంటర్నెట్ సదుపాయం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ సదుపాయం ద్వారా విద్య, ఆరోగ్య సమాచారాలను తేలిగ్గా అందించటమే కాకుండా.. ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అన్నారు. తమ లక్ష్యం ఈ దిశగానే ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల అఫ్ఘానిస్తాన్‌లో భూకంపం వచ్చినప్పుడు 30లక్షల మంది తాము సురక్షితంగా ఉన్నట్లు సందేశమివ్వటానికి ఫేస్బుక్ సరైన మాధ్యమంగా ఉపయోగపడిందన్నారు. తప్పిపోయిన పిల్లలను అన్వేషించటానికి ఫేస్బుక్ ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలలో ఏఎంబీఈఆర్ అలర్ట్ పేరుతో ఫేస్బుక్లో ఫీచర్ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా పిల్లలు తప్పిపోయినప్పుడు వారి వివరాలు, ఫొటో, వార్త వంటివి పోస్ట్ చేస్తామని..ఈ చొరవ వల్ల పిల్లలు తొందరగా దొరికే అవకాశాలున్నాయన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్‌తో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఆఫ్రికాలో కొత్త తరహా పాఠశాలల కోసం పెట్టుబడులు పెడుతున్నామని.. త్వరలోనే భారత్‌లో కూడా ఈ పాఠశాలలను తీసుకువస్తామని జుకర్‌బర్గ్ అన్నారు. భారత్ .. కీలక మార్కెట్... ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ప్రాజెక్టు ప్రస్తుతం 24 పైగా దేశాల్లో నిర్వహిస్తున్నామని, దీని వల్ల కోటిన్నర పైగా ప్రజలకు నెట్ అందుబాటులోకి వచ్చిందని జుకర్‌బర్గ్ వివరించారు. భారత్‌లోను 10 లక్షల మంది పైచిలుకు ప్రజలు తమ ప్రాజెక్టు ద్వారా నెట్‌ను వినియోగించగలుగుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి ఇంటర్నెట్ను చేరువ చేయాలన్న తమ లక్ష్యంలో భారత్ పాత్ర చాలా కీలకమని వివరించారు. ఆయన ఇంకా ఏమ న్నా రంటే.. ప్రపంచంలో అన్ని స్మారక భవనాలూ యుద్ధాల విజయ చిహ్నాలుగా నిర్మించినవే. తాజ్‌మహల్ ఒక్కటే ప్రేమకు ప్రతిరూపంగా నిర్మించింది. ఫొటోలలో చూసిన దానికంటే తాజ్‌మహల్ ఎంతో అందంగా ఉంది. ► రానున్న 5-10 సంవత్సరాలలో కంప్యూటర్లు ప్రపంచంలో తమ చుట్టూ ఉన్న వాటిని గుర్తిస్తాయి.. భాషల్ని మరింత మెరుగ్గా అనువదిస్తాయి.. అర్థం చేసుకుంటాయి. రానున్న కాలంలో ప్రధాన సమాచార మార్పిడి మాధ్యమంగా వీడియో మాత్రమే ఉంటుంది. ► త్వరలోనే మాకు కూతురు పుడుతుందని భావిస్తున్నాం. నేను, నా కుటుంబం అంతా అక్కడ ఉండి అమె తొలి అడుగులను చూడాలనుకుంటున్నాం.. ఇదే తరహాలో త్వరలోనే నిజ జీవితానికి సంబంధించిన 3డీ చిత్రాలను షేర్ చేసుకునే ప్రోగాంను డెవలప్ చేస్తున్నాం. ► పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో లేనిచోట మా టెక్నాలజీ ద్వారా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాం. నెట్ న్యూట్రాలిటీకే మా ఓటు.. నెట్ న్యూట్రాలిటీకి తమ కంపెనీ కట్టుబడి ఉందని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. అయితే, జీరో-రేటింగ్ ప్లాన్లు కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నెట్ న్యూట్రాలిటీపై ఫేస్బుక్ వైఖరిపై వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ.. ‘ఇది చాలా కీలకమైన సూత్రం. మేం ఈ నిబంధనను మా కార్యాలయంలో కూడా పాటిస్తాం. కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించే డెవలపర్లు ... దేన్నైనా స్వేచ్ఛగా రూపొందించేలా మా సొంత కార్యాలయంలో ఓపెన్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుంది’ అని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతం నెట్ న్యూట్రాలిటీ కోసం పట్టుబడుతున్న వారిలో చాలా మందికి ఇంటర్నెట్ అందుబాటులోనే ఉందని ఆయన చెప్పారు. కానీ, నెట్ అందుబాటులో లేని మిగతా వారి పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సిన నైతిక బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీంతో పాటు జీరో రేటింగ్ పథకాలు ఉండాలనీ ఆయన అన్నారు. న్యూట్రాలిటీ ఇదీ.. ఇంటర్నెట్ వెబ్సైట్లను అందుబాటులో ఉంచడంలో ఏ కొన్నింటిపైనో పక్షపాతం చూపకుండా టెల్కోలు తటస్థంగా వ్యవహరించాలన్నది నెట్ న్యూట్రాలిటీ సూత్రం. నెట్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే పేరుతో కొన్ని టెలికం కంపెనీల భాగస్వామ్యంతో ఫేస్బుక్ తలపెట్టిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ప్రాజెక్టు ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ► ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తే ప్రతి పది మందిలో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. తద్వారా అతను పేదరికం నుంచి బయటపడతాడు. అతని జీవితం మెరుగుపడుతుంది. భారత్‌లో ఇందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. ► {పపంచంలో 400 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు నెట్వర్క్ అందుబాటులోకి రాకపోవటం, చైతన్యం లేకపోవటం. ► మీరు తప్పులు చేశామని భయపడకండి. మంచి మీద దృష్టి పెట్టండి.. అది మీకు శక్తినిస్తుంది. మన విజయం ఇతరులకు సహాయపడటంలోనే ఉంది. ► క్యాండీ క్రష్ గేమ్ ఆడాలంటూ ఫేస్బుక్ ద్వారా వచ్చే ఇన్విటేషన్ల బారి నుంచి తప్పించుకోవటానికి త్వరలోనే పరిష్కారం వెతుకుతాం. దీనిపై కృషి చేయాలని మా ప్రోగ్రామ్ డెవలపర్లను కోరాను. -
వాడిన నూనెతో బయోడీజిల్
పదే పదే మరగించిన నూనె వాడటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతందని శాస్త్రం చెబుతుంది. బోలెడంత డబ్బు పోసి కొంటున్న నూనెను ఒకసారి మాత్రమే ఎలా వాడి పడేయగలమన్నది హోటళ్లు, ఆహార పరిశ్రమ వర్గాల బాధ. ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారాన్ని కనుక్కున్నారు ఢిల్లీ ఐఐటీ విద్యార్థులు. వాడేసిన వంటనూనెను బయోడీజిల్‌గా మార్చే ఓ యంత్రాన్ని అభివృద్ధి చేశారు. నిజానికి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏ నూనెనైనా బయోడీజిల్‌గా మార్చవచ్చునని చాలాకాలంగా తెలుసు. కాకపోతే ఎవరికి వారు వాడుకునే రీతిలో పరికరం మాత్రం లేకపోయింది. అభిషేక్ శర్మ, హర్షిత్ అగర్వాల్, మోహిత్ సోని అనే ముగ్గురు ఐఐటీ విద్యార్థులు ఈ కొరతను తీర్చారు. వాషింగ్ మెషీన్ సైజులో ఉండే ఈ యంత్రంతో బయోడీజిల్ తయారు చేసుకోవడం చాలా సులువని వారు అంటున్నారు.