engineering common entrance test
-
జంధ్యం ఉంటే నో ఎగ్జామ్
బెంగళూరు: కర్ణాటకలో జంధ్యం వివాదం చర్చనీయాంశంగా మారింది. జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను పరీక్షకు అధికారులు అనుమతించడం లేదు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో జంధ్యం ధరిస్తే ‘నో ఎగ్జామ్’ అంటున్నారు. ఇటీవల శివమొగ్గ పట్టణంలో ఓ బ్రాహ్మణ విద్యార్థిని పరీక్షకు అనుమతించకపోవడం వివాదంగా మారింది. తాజాగా బీదర్, గదగ్, ధార్వాడ్‌లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి.జంధ్యం తొలగిస్తేనే పరీక్ష రాయనిస్తామంటూ అధికారులు తేల్చిచెప్పారని విద్యార్థులు ఆరోపించారు. గదగ్, ధార్వాడ్‌లో అధికారులు ఇద్దరు విద్యార్థుల జంధ్యాలను కత్తిరించి, చెత్తబుట్టలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల తాను చాలా కలత చెందానని, పరీక్ష రాయకుండా వెనక్కి వెళ్లిపోయానని ధార్వాడ్ విద్యార్థి చెప్పాడు. బీదర్ జిల్లాలో జంధ్యం తొలగించిన ఘటనపై బాధిత విద్యార్థి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. -
పీజీఈసెట్‌లో 91.48% ఉత్తీర్ణత
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఎం.టెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్టు గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్ 2022)లో 91.48 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 2 నుంచి 5 వరకు జరిగిన ఈ పరీక్షలకు 12,592 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,520 మంది అర్హత సాధించారు. అందులో 6,440 మంది అమ్మాయిలు, 5,080 మంది అబ్బాయిలు ఉన్నారు. శనివారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డి.రవీందర్, రిజిస్ట్రార్, పీజీఈసెట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రాజశేఖర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 19 సబ్జెక్టులకు పీజీఈసెట్ పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ఈ పరీక్ష ద్వారా 115 కోర్సులలో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పీజీఈసెట్‌లో అమ్మాయిల ఉత్తీర్ణత 93 శాతంగా నమోదు కాగా, అబ్బాయిల ఉత్తీర్ణత 89.62 శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. ఫార్మసీలో అధికం పీజీఈసెట్‌కు హాజరైన వారిలో ఫార్మసీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఈ పరీక్షకు మొత్తం 12,592 మంది హాజరుకాగా, అందులో 5,452మంది కేవలం ఫార్మసీ విద్యార్థులే ఉన్నారు. వారిలో 5,186 మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి 2,027మంది పరీక్షకు హాజరుకాగా, 1,782 మంది అర్హత సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 1,279 మంది హాజరుకాగా,1,211 మంది ఉత్తీర్ణత సాధించారు. -
టీఎస్ ఈసెట్ 2021: ముఖ్యసమాచారం
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(టీఎస్ ఈసెట్)–2021 నోటిఫికేషన్ వెలువడింది. ఈసెట్ ద్వారా బీటెక్/బీఈ/ బీఫార్మసీ కోర్సుల్లో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందవచ్చు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/బీఎస్సీ(మ్యాథ్స్) ఉత్తీర్ణులు ఈసెట్ ర్యాంకుతో నేరుగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో అడ్మిషన్ పొందొచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ విద్యార్థులకు బీఫార్మసీ సెకండియర్‌లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ పూర్తి సమాచారం... అర్హతలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా మండళ్లు గుర్తించిన డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ/ఫార్మసీ ఉత్తీర్ణులు; మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌కు హాజరవ్వొచ్చు. బీఎస్సీ మ్యాథ్స్ అభ్యర్థులకు బీఫార్మసీలో ప్రవేశానికి అర్హత లేదు. ఆయా కోర్సులు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కోర్సులో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత 40 శాతం. పరీక్ష స్వరూపం ఈసెట్ పరీక్ష 200 ప్రశ్నలు–200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. పరీక్ష సమయం మూడు గంటలు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్లు ఈ స్ట్రీమ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. ► మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు అందరికీ కామన్‌గా ఉంటాయి. ఇంజనీరింగ్ పేపర్(విభాగం) మాత్రం అభ్యర్థి బ్రాంచ్ ఆధారంగా ఉంటుంది. బీఎస్సీ(మ్యాథ్స్) బీఎస్సీ మ్యాథ్స్ ఉత్తీర్ణులకు పరీక్ష స్వరూపం కింది విధంగా ఉంటుంది. ఫార్మసీ స్ట్రీమ్ అర్హత మార్కులు అభ్యర్థులు నాలుగు సబ్జెక్టుల్లో(బీఎస్సీ అభ్యర్థులకు మూడు సబ్జెక్టులు) కలిపి సగటున కనీసం 25 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులకు కనీస అర్హత మార్కులు వర్తించవు. అర్హత– బ్రాంచ్‌లు ► టీఎస్ ఈసెట్ సబ్జెక్టు పేపర్లు వారీగా అర్హత డిప్లొమా స్పెషలైజేషన్స్.... ► కెమికల్ ఇంజనీరింగ్ పేపర్: సిరామిక్, లెదర్, టెక్స్టైల్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్–పెట్రోకెమికల్,కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, కెమికల్ ఆయిల్ టెక్నాలజీ, కెమికల్–షుగర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► సివిల్ ఇంజనీరింగ్ పేపర్: సివిల్, సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్: కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ► ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పేపర్: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ► మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్: ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఫుట్‌వేర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ,డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ. ► మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్: మెటలర్జికల్ ఇంజనీరింగ్ పేపర్. ► మైనింగ్ ఇంజనీరింగ్ పేపర్: మైనింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. ముఖ్యసమాచారం ► ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 17,2021 ► దరఖాస్తు ఫీజు: జనరల్ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.400. ► పరీక్ష తేదీ: జూలై 1, 2021 ► ఉదయం సెషన్ (ఉ.9 గం–మ.12 గం)–ఈసీఈ, ఈఐఈ, సీఎస్ఈ, ఈఈఈ పేపర్లు ► మధ్యాహ్నం సెషన్ (మ.3 గం–సా.3 గం)–సీఐవీ, సీహెచ్ఈ, ఎంఈసీ, ఎంఐఎన్, ఎంఈటీ, పీహెచ్ఎం, బీఎస్ఎం పేపర్లు. ► వెబ్సైట్: https://ecet.tsche.ac.in -
4 నుంచి ఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్)-2015 ర్యాంకర్లకు జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఉన్నత విద్యామండలి శనివారం ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలనకు రాష్ట్రవ్యాప్తంగా 10 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ర్యాంకులను బట్టి వారికి కేటాయించిన తేదీల్లో ఏ హెల్ప్‌లైన్ కేంద్రంలోనైనా ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవచ్చు. వికలాంగులు, మాజీ సైనికుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు హైదరాబాద్ (మాసబ్‌ట్యాంక్)లోని సాంకేతిక విద్యాభవన్‌లో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అర్హత పరీక్షలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల అభ్యర్థులు 40% మార్కులు పొంది ఉండాలి. వివరాలకు https://tsecet.nic.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వచ్చే నెల 5 నుంచి 8వ తేదీలోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 10వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలన ఇలా.. 4వ తేదీన ఉదయం 9కి 1 నుంచి 3000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 12.30కు 3,001నుంచి 6,000 ర్యాంకు వరకు 5న ఉదయం 9కి 6,001 నుంచి 9,000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 12.30కు 9,001నుంచి 1,2000 ర్యాంకు వరకు 6న ఉదయం 9కి 12,001 నుంచి 15,000 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 12.30కు 15,001నుంచి చివరి ర్యాంకు వరకు