gst collections
-
జీఎస్టీ వసూళ్ల రికార్డు
న్యూఢిల్లీ: మార్చి నెలకు జీఎస్టీ వసూళ్లు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. జీఎస్టీ మొదలైన తర్వాత రెండో నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలలో వసూలైన రూ.2.10 లక్షల కోట్లు ఇప్పటి వరకు నెలవారీ ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా ఉంది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ యూజర్లకు గుడ్న్యూస్దేశీ విక్రయ లావాదేవీల రూపంలో ఆదాయం 8.8 శాతం పెరిగి రూ.1.49 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై జీఎస్టీ 13.56 శాతం వృద్థితో రూ.46,919 కోట్లకు చేరింది. స్థూలంగా చూస్తే సెంట్రల్ జీఎస్టీ కింద రూ.38,145 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.49,891 కోట్లు, ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.95,853 కోట్లు, సెస్సు రూపంలో రూ.12,253 కోట్లు చొప్పన మార్చిలో వసూలైంది. ఇక మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.22.08 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24తో గణాంకాలతో పోల్చి చూస్తే 9.4 శాతం పెరిగింది. -
జీఎస్టీ వసూళ్ల జోరు.. చాన్నాళ్లకు అత్యధికం
జనవరి నెలలో జీఎస్టీ (GST) వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 12.3% అధికంగా రూ.1.96 లక్షల కోట్లు వసూలైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో దేశీ వస్తు, సేవల ద్వారా 10.4% అధికంగా రూ.1.47 లక్షల కోట్లు వసూలైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ ఆదాయం 19.8% అధికంగా రూ.48,382 కోట్లు సమకూరింది. గతేడాది ఏప్రిల్ నుండి ఇవే అత్యధిక జీఎస్టీ వసూళ్లు కావడం విశేషం.మొత్తం జీఎస్టీ ఆదాయం జనవరి నెలకు రూ.1,95,506 కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది. అదే నెలలో రూ.23,853 కోట్లు రిఫండ్లు జారీ చేసినట్టు, ఇది క్రితం ఏడాది ఇదే నెలలో పోల్చి చూసినప్పుడు 24% పెరిగినట్టు పేర్కొంది. రిఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర ఆదాయం 1.72 లక్షల కోట్లు అని, ఇది 10.9% వృద్ధికి సమానమని వెల్లడించింది.జీఎస్టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతుండడం ఆర్థిక వృద్ధి పుంజుకోవడానికి, వ్యాపార సంస్థల నిబంధనల అమలుకు నిదర్శనమని కేపీఎంజీ పరోక్ష పన్నుల హెడ్ అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. రిఫండ్ల తర్వాత కూడా నికర వసూళ్లు అధికంగా ఉండడం ప్రశంసనీయమన్నారు.రాష్ట్రాల వారీగా..జనవరి నెలలో రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర ముందుంది. రూ. 32,335 కోట్ల వసూళ్లతో అగ్ర స్థానంలో నిలిచింది. గుజరాత్ తర్వాత రూ. 12,135 కోట్లు, కర్ణాటక రూ. 14,353 కోట్లు, తమిళనాడు రూ. 11,496 కోట్లు, హర్యానా రూ. 10,284 కోట్లతో ఆ తర్వాత స్థానాలలో నిలిచాయి. ఇక అత్యల్ప జీఎస్టీ వసూళ్లలో చూసుకుంటే రూ. 1 కోటి వసూళ్లతో లక్షద్వీప్ అట్టడుగు స్థానంలో ఉంది. మణిపూర్ (రూ. 56 కోట్లు), మిజోరాం (రూ. 35 కోట్లు), అండమాన్ నికోబార్ దీవులు (రూ. 43 కోట్లు), నాగాలాండ్ (రూ. 65 కోట్లు) చివరి నుంచి తర్వాతి స్థానాలలో ఉన్నాయి. -
బడ్జెట్ బతుకునిచ్చేనా?
2025, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రేవేశ పెట్టనున్నారు. గత బడ్జెట్లకు భిన్నంగా ఈ బడ్జెట్‌పై అటు కార్పొరేట్ వర్గాలు, ఇటు మధ్యతరగతి – సామాన్య జనాలలో కూడా పెద్ద స్థాయిలో ఆసక్తి, అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం ప్రస్తుతం దేశంలో నెలకొంటోన్న ఆర్థిక మాంద్య వాతావరణం. మొన్నటి 2వ త్రైమాసికంలో 5.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటుతో పాటుగా ప్రజల కొనుగోలు శక్తికి కోతలు పెడుతోన్న ద్రవ్యోల్బణం, పెరిగిపోతోన్న నిరుద్యోగం వంటి అనేకానేక సమస్యల వల్ల నేడు దేశీయ ప్రజల స్థితిగతులపై కారుమబ్బులు కమ్ముతున్నాయి. ఫలితంగా కార్పొరేట్ల అమ్మకాలూ, లాభాలూ కూడా నేలచూపులు చూస్తున్నాయి. కాబట్టి, ప్రస్తుత బడ్జెట్ ప్రజలకు ఉపాధి కల్పించేది, వారి కొనుగోలు శక్తిని పెంచేది, ద్రవ్యోల్బణానికి పరిష్కారం చెప్పేదిగా ఉండాలనేది అందరి ఆకాంక్ష. అయితే, గత మూడున్నర దశాబ్దాలుగా మన దేశంలో అమలవుతూ... గత దశాబ్ద కాలంగా మరింత ముమ్మరం అయిన కార్పొరేట్ల, ధనికుల అనుకూల విధానాలను ఈ బడ్జె ట్లో ప్రభుత్వం విడనాడగలదా అనేది పెద్ద ప్రశ్న. ఈమధ్యే వెలువడిన ప్రత్యక్ష పన్నులూ, పరోక్ష పన్నుల వసూలు గణాంకాలు చూస్తే ప్రభుత్వ విధానాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో స్పష్టమవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025) లోని 2024 ఏప్రిల్– నవంబర్ కాలంలో కేంద్ర ప్రభుత్వం తాలూకు వ్యక్తిగత పన్ను ఆదాయ వసూళ్ళు అంతకు ముందరి సంవత్సరం అదే కాలం కంటే 23.5 శాతం పెరిగాయి. కాగా, 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ పెరుగుదల అంచనా 13.6 శాతంగా ఉంది. ఇక 2024 ఆర్థిక సంవత్స రంలో కూడా ఈ వసూళ్ళు... అంచనా కంటే (10.5%) అధికంగా (సుమారు 23 శాతం) ఉన్నాయి. కార్పొరేట్ పన్ను ద్వారా సమకూరే ఆదాయం 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో 12 శాతం పెరుగుతుందని అంచనా వేసుకోగా... వాస్తవంలో అది అంతకు ముందరి సంవత్సరం కంటే 0.5 శాతం తగ్గింది. 2019–20 కాలంలో కార్పొరేట్ పన్నును 10 శాతం మేర తగ్గించడంతో తగ్గిన వసూళ్ళు, తగ్గిపోయిన కార్పొరేట్ల లాభాల మొత్తాలవంటివి దీని వెనుక ఉన్న కారణాలు.ఏదేమైనా ఇక్కడ కనపడేది మధ్యతరగతి ఉద్యోగస్థులు, వ్యాపారులు, తదితరులు కట్టే వ్యక్తిగత ఆదాయ పన్ను మొత్తాల వసూళ్ళు అంచనాలను మించి పెరగడం... బడా కార్పొరేట్లు కడుతోన్న పన్ను మొత్తాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం అనేవి... ప్రభుత్వ కార్పొరేట్లు, ధనికుల అనుకూల విధానాలకు తార్కాణాలు. అలాగే, పరోక్ష పన్ను అయిన జీఎస్టీ వసూళ్ళ విషయంలో కూడా 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 2 శాతం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తే అది 8.7 శాతంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వ విధానాలు జన సామాన్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయనేదానికి అంచనాలను మించిన ఈ జీఎస్టీ ఆదాయ పెరుగుదల తార్కాణం. అలాగే, కార్పొ రేట్ అనుకూల ప్రభుత్వ విధానాలకు మరో మచ్చు తునక ఎక్సయిజ్ ఆదాయం కూడా ఈ కాలంలో అంచనాల కంటే తగ్గుముఖం పట్టడం. దీనికి కారణం పెట్రోలియంపై లభించే భారీ లాభాలకు గాను కంపెనీలపై విధించబడే ‘విండ్‌ఫాల్ ట్యాక్స్’ను ఉపసంహరించుకోవడం!ఏ విధంగా చూసినా పెద్ద మనుషులకో నీతి; సామాన్య, మధ్యతరగతి జనానికో నీతిగా ప్రభుత్వ విధా నాలు నడుస్తున్నాయి. అలాగే, ఈ మధ్య కాలంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ స్వయంగా వాపోయినట్లుగా... కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరిగిన స్థాయిలో... వాటి కార్మికులూ, ఉద్యోగుల జీతాలు పెర గడం లేదు. అలాగే, 2016 నవంబర్‌లో అమలు జరిగిన పెద్ద నోట్ల రద్దు... 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ పన్ను విధానాల వల్ల దేశంలో లెక్కకు మించిన స్థాయిలో సూక్ష ్మ, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు మూతపడ్డాయి. అదే విధంగా అనేకమంది సాధారణ వ్యాపారులు జీవనోపా ధిని కోల్పోయారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగం పెరిగి పోయింది. అలాగే, 2020లో చుట్టు ముట్టిన కోవిడ్ మహ మ్మారిని ఎదుర్కోవడంలోని వైఫల్యాల వలన కూడా దేశంలో నగర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి తరలి వెళ్ళిపోయిన వలస కార్మికులలోని పెద్ద భాగం, నేటికీ తిరిగి నగర ప్రాంతాలకు పూర్తిగా రాలేదు. అంటే, నిజానికి దేశంలోని ఆర్థిక పరిస్థితులు కోవిడ్ ముందరి కాలం నాటి స్థితికి కూడా ఇంకా చేరుకోలేదన్న మాట. స్థూలంగా నేడు, కార్పొరేట్లకు పన్ను రాయి తీలు... ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పేరుతో నజరా నాలు, అలాగే వాటి బ్యాంక్ ఋణాల రద్దు (రైట్ ఆఫ్)లు ఒక ప్రక్క; సామాన్య మధ్యతరగతి జనాలపై ప్రత్యక్ష (ఆదాయపు పన్ను), పరోక్ష పన్నుల (జీఎస్టీ) భారాలు మరో పక్క నేటి ప్రభుత్వ విధానాలుగా ఉన్నాయి. అంటే, మార్కెట్లో తమ కొనుగోళ్ళ ద్వారా కార్పొరేట్ల సరుకులూ, సేవలకు డిమాండ్‌ను కల్పించే జన సామాన్యం కొనుగోలు శక్తిని, చేజేతులా కూలదోస్తోన్న ప్రభుత్వ విధానాలు కూర్చున్న కొమ్మనే నరుక్కునే పిచ్చివాడి తీరుగా ఉన్నాయి. కాబట్టి, ఈ బడ్జెట్లోనైనా మన ‘స్వదేశీ’ విధానాల కేంద్ర ప్రభుత్వం తన తీరును మార్చుకుంటుందా?గమనిక: ఈలోగా, పేద ప్రజానీకానికి ఉపశమనాన్ని ఇచ్చి... వారి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్టీ ఆదాయం పడిపోతోన్న కోవిడ్ కాలంలో కూడా కొద్దిమేరనైనా ఈ ఆదాయం పెరుగుదలను చూపించగలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల విధానాలూ... అలాగే 2008 ప్రపంచ ఆర్థికసంక్షోభ కాలంలో కూడా దేశీయ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడిన ‘జాతీయ ఉపాధి హామీ పథకం’ వంటి వాటిని మన మధ్యతరగతి వర్గం సానుకూలంగా చూడగలగాలి. నిజానికి ఈ వర్గానికి నష్టం చేస్తోంది ప్రభుత్వాల కార్పొరేట్, ధనికుల అనుకూల విధానాలే కానీ... అవి పేద ప్రజలకు ఇచ్చే కొద్దిపాటి రాయితీలు కాదనేది గుర్తించాలి!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు 2024 డిసెంబర్లో స్థూలంగా (2023 ఇదే నెలతో పోల్చి) 7.3 శాతం పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరాయి. సమీక్షా నెల్లో దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల పైన వచ్చే పన్నుల వసూళ్లు దాదాపు 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరాయి. డిసెంబర్లో రిఫండ్స్(Refunds) భారీగా నమోదుకావడం గమనార్హం.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..రిఫండ్స్ 31 శాతం పెరిగి రూ.22.490 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను సవరించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ. 32,836 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ. 40,499 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.47,783 కోట్లు. సెస్సు(Cess) రూ.11,471 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ వసూళ్ల ఇప్పటి వరకూ ఒక రికార్డు. -
రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో మెరుగ్గానే నమోదయ్యాయి. సమీక్షా నెలలో 8.5 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోలిస్తే) రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6 శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరుకుంది.రిఫండ్స్ రూ.19,259 కోట్లునవంబర్ జీఎస్టీ వసూళ్లు రూ.1,82 కోట్లలో రూ.19,259 కోట్ల రిఫండ్స్ జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 8.9 శాతం క్షీణతను నమోదు చేసింది. రీఫండ్లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరాయి.విభాగాల వారీగా..→ మొత్తం వసూళ్లు రూ.1,82 కోట్లు→ సెంట్రల్ జీఎస్టీ రూ.34,141 కోట్లు → స్టేట్ జీఎస్టీ రూ.43,047 కోట్లు → ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ విలువ రూ.91,828 కోట్లు → సెస్ రూ.13,253 కోట్లు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంమరోవైపు డిసెంబర్ 21న జైసల్మేర్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కౌన్సిల్ మొదట నవంబర్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల కారణంగా వాయిదా పడింది.