Jhelum River
-
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్‌లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇక, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025 -
జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురి మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని జీలం నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయంలో జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగిన పడవలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా..
శ్రీనగర్: గుర్తుతెలియని ఒక మహిళ జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలను కుంది. అయితే, పోలీసులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. ఈ సంఘటన శ్రీనగర్‌లోని జీలం నది వద్ద సోమవారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని ఒక మహిళ జీలంనది ఉన్న బుద్షా వంతెన వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి నదిలో దూకడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడ గస్తీలో ఉన్న జమ్ముకశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) పోలీసులు ఆమెను పక్కకు లాగి, ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, కరోనా, లాక్డౌన్ కారణంగా పనిదొరక్క కుటుంబ సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆర్థికంగా కూడా ఎంతో కృంగిపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు నిపుణులతో సరైన కౌన్సిలింగ్ ఇప్పిస్తామని కశ్మీర్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే, సదరు మహిళ ప్రాణాలను కాపాడిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ‘ మీరు చేసిన గొప్ప పనికి హ్యట్సాఫ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
కాశ్మీర్ ప్రజలకు హెచ్చరికలు
శ్రీనగర్: కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం మరోసారి వరద ముప్పు హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జీలం నది సాధారణ స్థాయిని మించి ఉధృతరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో లోతట్టు, లోయ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎత్తైన ప్రాంతాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. వీలయినంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలాలని హెచ్చరించింది. సాధారణ స్థాయిని మించి ప్రస్తుతం జీలం నది ప్రవాహం 19.10 అడుగుల మేర ఉందని అధికారులు తెలిపారు. కాగా, అనంతనాగ్ జిల్లాలోని సంగం ఏరియాలో 22.30 అడుగులకు చేరి జీలం ప్రవహిస్తుందని ఇది ప్రమాదకరమని ప్రభుత్వం తెలిపింది. గత రెండు రోజులుగా కాశ్మీర్లో కాస్త అయిన తెరపునివ్వకుండా వర్షం పడుతోంది. -
కాశ్మీర విలయం మానవ తప్పిదమే..
కాశ్మీర్లో అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కారణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండాపోయాయి. కాశ్మీర్ అనగానే జివ్వుమనిపించే హిమ పాతాలు, దాల్ సరస్సు అందాలు స్ఫురణకు రావడం సహజం. అందులోనూ శ్రీనగర్ అంటే సుంద రమైన వనాలకు, పూలతోటలకు ప్రసిద్ధి. అయితే అదంతా గతం. ఇపుడు శ్రీనగర్ వరదనీటిలో మునకలేస్తున్నది. నయనమనోహరమైన పూదోట లన్నీ నడుం లోతులో మునిగి ఉన్నాయి. వీధు లను వరద ముంచెత్తింది. వందేళ్లలో కనీవిని ఎరుగని జలవిపత్తు కాశ్మీర్‌ను కకావికలం చేసింది. వందల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో నిర్వాసితుల య్యారు. ఎన్నడూ లేనిది ఈ జల విలయా నికి కారణమేమిటి? ప్రశాంత కాశ్మీరంలో ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులు? జమ్మూ కాశ్మీర్లో వరదలు ప్రకృతి వైపరీ త్యమేనా... అంటే.. కానేకాదు ఇది మానవ తప్పిద ఫలితమేనంటున్నారు పర్యావరణ వేత్తలు. అపారమైన ప్రాణనష్టం, అంతులేని ఆస్తినష్టానికి దారితీసిన ఈ విలయానికి కార ణం సరస్సుల కబ్జాలేనంటే ఆశ్చర్యం కలుగక మానదు. 9వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న చిన్నచిన్న సరసులనేకం అగుపించకుండా పోయాయి. శ్రీనగర్‌లో ఒకప్పుడు 2400 హెక్టార్లలో విస్తరించి ఉన్న దాల్ సరస్సు ఇపుడు 1200 హెక్టార్లకు పరిమితమైపో యింది. శ్రీనగర్‌కు ఎగువన 20,200 హెక్టా ర్లలో విస్తరించి ఉండే ఉలార్ సరస్సు 2,400 హెక్టార్లకు కుంచించుకుపోయింది. కాశ్మీర్‌లోయలో జీలం నది ఉరవడిని తట్టుకోవడానికి సరస్సుల దాపులనుండే చిత్తడినేలలు ఎంతగానో ఉపకరి స్తాయి. అయితే కాశ్మీర్లో గత 30 ఏళ్లలో 50 శాతం చిత్తడి నేలలు అంతరించిపోయాయి. సరస్సుల సమీపంలో ఉండే విశాలమైన చిత్తడినేలలన్నీ కుంచించుకుపోయాయి. ఉలార్ సరస్సునే తీసుకుంటే.. ఈ సరస్సు సమీపంలోని నేలలను కాశ్మీరీ మహరాజాలు, చివరకు బ్రిటిష్‌వారు సైతం ఎంతో జాగ్రత్తగా పరిరక్షిస్తూ వచ్చారు. ఎందుకంటే ఇవి వరద నీటిని స్పాంజిలాగా పీల్చుకుంటాయి. అయితే అనేక సంవత్సరాలుగా ఇవి ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య కార్యకలాపాలకు ఆలవాలంగా మారిపోయాయి. జీలం నది పొడవునా అనేకచోట్ల ఆక్రమణలు జరిగాయి. వెడల్పు తగ్గడంతో నది ఉరవడి పెరిగింది. దీంతో పాటు శ్రీనగర్‌లోని దిగువ ప్రాంతాలు కూడా ఆక్రమణలకు గురయ్యాయి. వరదనీటి విడుదలకు ఉపకరించే చిన్నచిన్న కాల్వలు చాలావరకు పూడిపోయాయి. జీలం వరదల నుంచి శ్రీనగర్‌ను రక్షించేందుకు గాను శతాబ్దం కిందట దోగ్రా పాలకుడు ప్రతాప్ సింగ్ నిర్మించిన జీలంబండ్ కూడా ఆక్రమణలపాలయ్యింది.వాస్తవానికి జీలం పరివాహకప్రాంతాలకు ముఖ్యంగా శ్రీనగర్‌కు వరద ప్రమాదం పొంచి ఉందని అనేకమార్లు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఆ హెచ్చరికలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించదు. అసలు జమ్ము కాశ్మీర్‌కు వరదల గురించి హెచ్చరించే వ్యవస్థ ఏదీలేదు. జీలం నది శ్రీన గర్‌ను చేరుకోవడానికి ముందు దక్షిణ కాశ్మీర్లో ఆరు రోజుల పాటు ప్రవహిస్తుంది. అనంతనాగ్ సమీపంలో సంగం వద్ద నీటిమట్టం పెరగడం కూడా స్పష్టమైన సూచికలా పనిచేస్తుంది. ఎగువ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురు స్తున్నా, దక్షిణ కాశ్మీర్లో జీలం నది ఉరవడి పెరు గుతున్నా అధికార యంత్రాంగం, ఒమర్ ప్రభు త్వం అప్రమత్తం కాలేదు. వారి మొద్దు నిద్ర శ్రీన గర్‌కు ప్రాణాంతకంగా పరిణమించింది. జమ్ము కాశ్మీర్‌కు తీవ్ర వరద ముప్పు పొంచి ఉన్నదని 2010లో వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చ రించారు. తగిన మౌలిక సదుపాయాల కల్పనకు, వరద నివారణ చర్యలకుగాను 22,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుకు అప్పటి రాష్ర్ట ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ఆ తర్వా త వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించేశాయి. దీంతో పాటు అభివృద్ధి పేరుతో జరిగిన అనేక కార్యక్రమాలు కాశ్మీర్ నీటిపారుదల వ్యవస్థకు చేటు తెచ్చిపెట్టాయి. కాశ్మీర్ లోయలో నిర్మించిన కొత్త రైల్వే లైన్లు, హైవేలు నగరాన్ని లోతట్టు ప్రాంతంగా మార్చివేశాయి. కొత్తగా ఏర్పాటయిన నాలుగులైన్ల హైవే ప్రాజెక్టు శ్రీనగర్ మురుగునీటిపారుదల వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. ఇవన్నీ జలవిలయాన్ని సృష్టించాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు మేల్కో వాలని, కాశ్మీర్లో చిత్తడినేలల పరిరక్షణకూ అడవుల పరిరక్షణ చట్టం -1980 వంటి పటిష్టమైన చట్టం ఉండాలని పర్యావరణ వేత్తలంటున్నారు. అయితే చట్టాలు చేయడం తోనే సరిపోదు. ప్రకృతిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయం కూడా అవసరమే. అది లేనపుడు మనకు వైపరీత్యాల నుంచి రక్షణ లేనట్లే. అందుకు కాశ్మీర్ జలవిలయమే ప్రత్యక్ష ఉదాహరణ. పోతుకూరు శ్రీనివాసరావు