PBKS vs KKR
-
Shreyas Iyer: సైలెంట్ వారియర్
సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రెవేంజ్.. అంటారు. అవమానించిన వారికి గెలుపుతో సమాధానం చెబితే వచ్చే కిక్కే వేరు. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) విషయంలో సరిగ్గా అదే జరిగిందని అంటున్నారు ఫ్యాన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఎడిషన్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ (Punjab Kings) అనూహ్య విజయం సాధించింది. చండీగఢ్- ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను మంచి అనుభూతిని కలిగించింది. శ్రేయస్ అయ్యర్ అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది.కష్టసాధ్యమైన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఊహించని విజయం దక్కడంతో వారు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వ పటిమను ప్రస్తుతిస్తున్నారు. పనిలో పనిగా కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యంపై విసుర్లు విసుతున్నారు. గత సీజన్లో ఐపీఎల్ కప్ సాధించి పెట్టిన అయ్యర్‌ను ఈసారి కోల్‌కతా నైట్‌రైడర్స్ (kolkata knight riders) వదిలేసుకుంది. జట్టును ఐపీఎల్ విజేతగా నిలిపిన కెప్టెన్‌ను కోల్‌కతా వదిలేసుకోవడం క్రికెట్ లవర్స్‌ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అయ్యర్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇది అయ్యర్‌కు జరిగిన అవమానంగా వారంతా భావించారు. మెగా వేలంలో భారీ మొత్తానికి అయ్యర్‌ను పంజాబ్ దక్కించుకుని కెప్టెన్‌గా నియమించింది.బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ఈ నేపథ్యంలో గత రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ భావోద్వేగాలను శిఖర స్థాయికి చేర్చింది. ఐపీఎల్లో అతి తక్కువ స్కోరును కాపాడుకుని కోల్‌కతాపై కింగ్స్ జయకేతనం ఎగరవేసింది. దీంతో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కింగ్స్ కెప్టెన్‌ను వరించడంతో అభిమానులు సోషల్ మీడియాలో అయ్యర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ జనరేషన్లో బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ అంటూ పొగిడేస్తున్నారు. అవమానాలను పంటి బిగువన భరిస్తూ పదునైన ఆటతోనే సమాధానం చెబుతున్నాడని మెచ్చుకుంటున్నారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా శ్రేయస్‌ను శభాష్ అంటూ మెచ్చుకున్నారు.శిఖర్ కాదు.. శ్రేయర్ టీమ్తనను కాదన్న కోల్‌కతాపై అయ్యర్ బదులు తీర్చుకున్నాడని కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అయ్యర్ అనవసర హడావుడి చేయకుండా చాలా హుందాగా వ్యవహరించాడని అంటున్నారు. కర్మఫలం అనుభవించక తప్పదని కొంతమంది కోల్‌కతాను కసురుకున్నారు. ఇది శిఖర్ ధవన్ టీమ్ కాదు, శ్రేయస్ అయ్యర్ టీమ్ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్ధి కోల్‌కతా అయితే పంజాబ్ జట్టుకు ఎక్కడలేని బలం వస్తుందని, అద్భుతాలు చేస్తుందని మరో యూజర్ అభిప్రాయపడ్డారు. 2024 ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్లో కోల్‌కతాపై 262 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ ఛేజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.చాహల్ సూపర్పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ (yuzvendra chahal)పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాచ్‌ను మలుపు తిప్పి ఒంటిచేత్తో జట్టును గెలిపించాడని పొగుడుతున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ మరింత యాక్టివ్ అయ్యాడంటూ కొంతమంది సరదా వ్యాఖ్యలు చేశారు. Yuzvendra Chahal ~ the best bowler with most wickets in IPL showing the world that he is still a match winner & game changing player#TATAIPL2025 #IPL2025 #PBKSvKKR #PBKSvsKKR #KKRvsPBSK #KKRvPBKS #ShreyasIyer #chahal #Punjab #Russell #MIvSRH #SRHvsMI pic.twitter.com/66Fn91XIsD— Riyaaa_VK18 (@Riyaaa_VK18) April 15, 2025 Shreyas Iyer is one of the best Captain and player in this Generation! ♥️Like if you agree! 👍🏻 Stop watching cricket if you disagree.😂#PBKSvsKKR #ShreyasIyer pic.twitter.com/Xsk2FJwn1C— Celebeauty Official (@CeleBeautyHQ) April 15, 2025No camera stare.No finger on the lips.No viral celebration.No dramaJust a calm smile, a handshake, hug and respect for the game.This is how a mature player behaves. Respect to Shreyas Iyer.#PBKSvKKR || #ShreyasIyer pic.twitter.com/K3HQTVzRlz— Mini (@josbuttler99) April 15, 2025 -
PBKS Vs KKR: చెత్తగా బ్యాటింగ్ చేశాం.. నిజమే కదా!: శ్రేయస్‌తో రహానే చాట్ వైరల్
ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. తాజా సీజన్లోనూ ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మిగిలిన జట్లకు సాధ్యం కాని రీతిలో 286 పరుగులతో సవాల్ విసిరింది. రాజస్తాన్ రాయల్స్‌పై ఈ మేర భారీ స్కోరు సాధించి.. ఐపీఎల్-2025 (IPL 2025)లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.ఇక పంజాబ్ కింగ్స్ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడ్డ శ్రేయస్ సేన.. 245 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరైన రైజర్స్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేదించడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.111 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీఅయితే, తాజా మ్యాచ్‌లో మాత్రం పంజాబ్ అత్యల్ప స్కోరు నమోదు చేసినా.. సంచలన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో 111 పరుగులకే ఆలౌట్ అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకుంది. అసాధారణ రీతిలో కేకేఆర్‌ను 95 పరుగులకే ఆలౌట్ చేసి.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది.𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025 కేకేఆర్ స్వీయ తప్పిదాల కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకోగా.. ఊహించని విజయం దక్కినందుకు పంజాబ్ జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. నిజానికి పంజాబ్ విధించిన 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కేకేఆర్‌కు అంత కష్టమేమీ కాదనిపించింది.రివ్యూకు వెళ్లకుండాఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువన్షీ చక్కగా ఆడుతూ మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కానీ చహల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లకుండా రహానే వెనుదిరగగా.. ఆ తర్వాత కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశామో!.. నిజమే కదా!పంజాబ్ స్పిన్నర్ చహల్ అంగ్క్రిష్ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (2)లను పెవిలియన్‌కు పంపగా.. వెంకటేశ్ అయ్యర్ (7)ను మాక్స్వెల్, ఆండ్రీ రసెల్ (17)ను మార్కో యాన్సెన్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక పంజాబ్ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత కేకేఆర్ ఆటగాళ్లు.. శ్రేయస్ సేనతో కరచాలనం చేస్తున్న వేళ.. రహానే చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్‌ను ఆలింగనం చేసుకోవడానికి ముందు.. ‘‘ఎంత చెత్తగా బ్యాటింగ్ చేశామో!.. నిజమే కదా!’’ అంటూ రహానే తమ జట్టు ప్రదర్శన తీరు పట్ల నవ్వుతూనే అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఐపీఎల్-2025: పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్👉వేదిక: ముల్లన్పూర్, చండీగడ్👉టాస్: పంజాబ్ కింగ్స్.. తొలుత బ్యాటింగ్👉పంజాబ్ కింగ్స్ సోరు: 111 (15.3)👉కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోరు: 95 (15.1)👉ఫలితం: కోల్‌కతా నైట్ రైడర్స్‌ను పదహారు పరుగుల తేడాతో ఓడించిన పంజాబ్ కింగ్స్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యజువేంద్ర చహల్ (నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు).చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’Was watching the #PBKSvKKR game and caught this funny bit as Shreyas and Rahane shook hands at the end. In a self-deprecating way Rahane appears to be saying to Shreyas in Marathi : काय फालतू बॅटिंग केली ना आम्ही (We played terrible, didn't we) 😂😂 pic.twitter.com/bNkC7TXGbU— निखिल घाणेकर (Nikhil Ghanekar) (@NGhanekar) April 15, 2025 -
మా ఆశలన్నీ అతడిపైనే.. ఈ గెలుపు మరింత ప్రత్యేకం: శ్రేయస్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో గెలుపొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో మ్యాచ్‌లో ఇలాంటి విజయం ఎంతో ప్రత్యేకమని.. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ గర్వాన్ని తలకెక్కించుకోనని చెబుతున్నాడు.111 పరుగులకే ఆలౌట్‌ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ మంగళవారం కేకేఆర్‌తో తలపడింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన ఆతిథ్య పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, అనూహ్య రీతిలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (30) ఫర్వాలేదనిపించగా.. ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది.కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. పేసర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లతో చెలరేగాడు. అన్రిచ్ నోర్జే, వైభవ్ అరోరా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.అంచనాలను నిజం చేస్తూ..టార్గెట్ పూర్తి చేసే దిశగా పయనిస్తున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ తమ వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను రంగంలోకి దించాడు. అయ్యర్ అంచనాలను నిజం చేస్తూ.. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (17), అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0) రూపంలో చహల్ నాలుగు కీలక వికెట్లు కూల్చాడు. తద్వారా కేకేఆర్ బ్యాటింగ్ పతనాన్ని శాసించి పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చాడు.అందుకే యుజీని పిలిపించాఈ క్రమంలో విజయానంతరం పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా మనసు చెప్పిన మాట విన్నాను. బంతి కాస్త టర్న్ అవుతుందని అనిపించింది. అందుకే యుజీని పిలిచి పని అప్పగించాను.సరైన సమయంలో సరైన ఆటగాళ్లను అటాక్ చేయాలని మేము ప్రణాళికలు రచించుకున్నాం. వాటిని యుజీ చక్కగా అమలు చేశాడు. ఇలాంటి విజయాలు ఎంతో ప్రత్యేకం. అంతకంటే నేనేమీ ఎక్కువగా చెప్పలేను.నేను బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు వికెట్ అంత బౌన్సీగా అనిపించలేదు. అయితే, ఈ వికెట్‌పై మేము మెరుగైన స్కోరే సాధించామని అనుకుంటున్నా. అంతేకాదు పదహారు పరుగుల తేడాతో కేకేఆర్‌పై గెలిచాం కూడా.తప్పులు చేసే ఆస్కారం కల్పించాంయుజీ బంతితో రంగంలోకి దిగినప్పుడు మా అంచనాలు, ఆశలు మిన్నంటాయి. అతడు వాటిని నిజం చేశాడు. ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలనే తలంపుతో వాళ్ల కళ్లెదుటే ఫీల్డింగ్‌లో వడివడిగా మార్పులు చేస్తూ.. వాళ్లు తప్పులు చేసే ఆస్కారం కల్పించాం.ఈ విజయం ప్రత్యేకమైనదే అయినా గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఉండాలి. ఈ మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. వాటిని స్వీకరిస్తూ.. తప్పులు సరిచేసుకుంటూ మరింత గొప్పగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాం’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్,. కానీ అతడిని రిటైన్ చేసుకోవడంలో కోల్‌కతా విఫలమైంది.కేకేఆర్‌పై ప్రతీకారం తీరింది!మెగా వేలంలోనూ పంజాబ్ శ్రేయస్ అయ్యర్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేసిన సమయంలోనూ.. తమకు అవసరం లేదని విడిచిపెట్టింది. ఇక పంజాబ్ సారథిగా, బ్యాటర్ ఈ సీజన్లో శ్రేయస్ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో పంజాబ్‌ను నాలుగింట గెలిపించాడు. బ్యాటర్‌గా ఇప్పటికి 250 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందుకే ఈ విజయం అతడికి మరింత ప్రత్యేకమైందని ప్రత్యేకంగా చెప్పాలా?!ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కోల్‌కతాటాస్: పంజాబ్.. మొదట బ్యాటింగ్పంజాబ్ స్కోరు: 111 (15.3)కోల్‌కతా స్కోరు: 95 (15.1)ఫలితం: కోల్‌కతాపై 16 పరుగుల తేడాతో పంజాబ్ విజయం.చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. ఎట్టకేలకు పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాMoments they will never forget 🤩🎥 All the 𝙍𝙖𝙬 𝙀𝙢𝙤𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling ending and memorable victory as #PBKS created history in front of a buzzing home crowd ❤🥳#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/mndhJxEt5X— IndianPremierLeague (@IPL) April 16, 2025 -
KKR Vs PBKS: తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు: రహానే
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా పంజాబ్ కింగ్స్ విధించిన 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. పటిష్ట పంజాబ్ బ్యాటర్లను తమ బౌలర్లు అద్బుత రీతిలో కట్టడి చేసినా.. బ్యాటర్ల వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా ఓటమిని చవిచూసింది.ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని.. తన తప్పు వల్లే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయామని అంగీకరించాడు. బౌలర్లు ఎంతో కష్టపడినా.. చెత్త బ్యాటింగ్ వల్ల పంజాబ్ ముందు తలవంచాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.తప్పంతా నాదే.. ‘‘మైదానంలో ఏం జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఓటమి అన్నింటికంటే ఎక్కువగా బాధిస్తోంది. ఇందుకు పూర్తిగా నేనే బాధ్యుడిని. షాట్ ఎంపికలో పొరపాటు చేశాను. అయితే, అదృష్టవశాత్తూ బాల్ స్టంప్స్‌ను మిస్ అయింది. కానీ లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో నాకు స్పష్టత లేదు.అతడు కూడా నాతో అదే అన్నాడుఅంపైర్ ఎల్బీడబ్ల్యూ (LBW) ఇచ్చిన తర్వాత మరో ఎండ్‌లో ఉన్న అంగ్‌క్రిష్‌తో చర్చించాను. అతడు కూడా అంపైర్స్ కాల్ నిజమవుతుందేమోనని చెప్పాడు. అందుకే ఆ సమయంలో నేను చాన్స్ తీసుకోవాలని అనుకోలేదు. నాకు కూడా పూర్తి స్పష్టత లేదు కాబట్టి రివ్యూకు వెళ్లలేదు.నిర్లక్ష్య ఆట తీరు వల్లే ఓటమిమా బ్యాటింగ్ విభాగం ఈ రోజు అత్యంత చెత్తగా ఆడింది. సమిష్టిగా విఫలమయ్యాం. బౌలర్లు ఎంతో కష్టపడి పటిష్ట బ్యాటింగ్ లైనప్‌ను 111 పరుగులకే ఆలౌట్ చేశారు. కానీ మేము మాత్రం వారి కష్టానికి ప్రతిఫలం లేకుండా చేశాం. మా నిర్లక్ష్య ఆట తీరే మా ఓటమికి కారణం.ఇప్పుడు నా మనసులో ఎన్నో భావాలు చెలరేగుతున్నాయి. సులువుగా ఛేదించగల లక్ష్యాన్ని కూడా మేము దాటలేకపోయాం. మా వాళ్లతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. ఇంకా సగం టోర్నీ మిగిలే ఉంది. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి’’ అని అజింక్య రహానే పేర్కొన్నాడు.రివ్యూకు వెళ్లకుండా తప్పు చేశాడుకాగా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదవ ఓవర్‌ను పంజాబ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ వేశాడు. అతడి బౌలింగ్‌లో నాలుగో బంతికి స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రహానే విఫలం కాగా.. బంతి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో పంజాబ్ అప్పీలు చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు.అయితే, రీప్లేలో మాత్రం ఇంపాక్ట్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా తేలింది. ఒకవేళ రహానే గనుక రివ్యూకు వెళ్లి ఉంటే నాటౌట్‌గా ఉండేవాడు. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. నిజానికి అప్పటికి కేకేఆర్‌కు ఇంకా రెండు రివ్యూలు మిగిలే ఉండటం గమనార్హం. ఇలా స్వీయ తప్పిదం కారణంగా జట్టు ఓడిపోవడాన్ని తట్టుకోలేక రహానే పైవిధంగా స్పందించాడు.ఐపీఎల్-2025: పంజాబ్ వర్సెస్ కేకేఆర్వేదిక: మహరాజ యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ముల్లన్పూర్, చండీగడ్టాస్: పంజాబ్.. బ్యాటింగ్పంజాబ్ స్కోరు: 111 (15.3)కేకేఆర్ స్కోరు: 95 (15.1)ఫలితం: 16 పరుగుల తేడాతో కేకేఆర్‌పై పంజాబ్ గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యజువేంద్ర చహల్ (4/28).చదవండి: IPL 2025:చరిత్ర సృష్టించిన పంజాబ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి జట్టుగా𝘈𝘴 𝘥𝘦𝘭𝘪𝘨𝘩𝘵𝘧𝘶𝘭 𝘢𝘴 𝘪𝘵 𝘤𝘢𝘯 𝘨𝘦𝘵 🤌Ajinkya Rahane & Angkrish Raghuvanshi ignite the #KKR chase with some beautiful sixes 💜Updates ▶️ https://t.co/sZtJIQoElZ#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/YQxJJep9z3— IndianPremierLeague (@IPL) April 15, 2025The moment where Yuzvendra Chahal turned the game 🪄#TATAIPL | #PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/D2O5ImOSf4— IndianPremierLeague (@IPL) April 15, 2025 -
KKR Vs PBKS: రూ. 18 కోట్లు.. పైసా వసూల్ ప్రదర్శన!.. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటా
ఐపీఎల్-2025 (IPL 2025 )లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS vs KKR) అనూహ్య విజయంతో ఆకట్టుకుంది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో సంచలన రీతిలో గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా ఘనత సాధించింది. ఇందుకు ప్రధాన కారణం పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal).రూ. 18 కోట్లకు కొనుగోలుఐపీఎల్-2025 మెగా వేలంలో చహల్‌ను పంజాబ్ ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, సీజన్ ఆరంభం నుంచి ఇంతవరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. తొలి ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.అయితే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్... 112 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు చహల్. ఈ మణికట్టు స్పిన్నర్ దెబ్బకు కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.మణికట్టు స్పిన్నర్ మాయాజాలంచహల్ ధాటికి కెప్టెన్ అజింక్య రహానే (17) సహా అంగ్క్రిష్ రఘువన్షీ (37), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0).. ఇలా కేకేఆర్‌కు చెందిన నలుగురు కీలక బ్యాటర్లు పెవిలియన్ బాటపట్టారు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్ 11 బంతుల్లో 17 పరుగులతో కేకేఆర్ శిబిరంలో ఆశలు రేపినా మార్కో యాన్సెన్ అతడి ఆట కట్టించడంతో.. పంజాబ్ గెలుపు ఖరారైంది. చహల్‌ను హగ్ చేసుకున్న ప్రీతి జింటాఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. జట్టు సహ యజమాని ప్రీతి జింటా అయితే సంతోషం పట్టలేకపోయారు. స్టాండ్స్‌లో పరిగెడుతూ సహచరులతో ఆనందం పంచుకున్నారు. Along with Kohli, Want to see Preity Zinta winning IPL trophy soon❤️Such a passionate supporter for 18 years without fail👌pic.twitter.com/viyPn107oV— Gss🇮🇳 (@Gss_Views) April 15, 2025అంతేకాదు.. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన చహల్‌ను ఆలింగనం చేసుకుని అభినందించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.కేకేఆర్ చేజేతులాకాగా ముల్లన్‌పూర్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (30) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఫలితంగా 15.3 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి పంజాబ్ ఆలౌట్ అయింది.కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా మూడు, సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జే ఒక్కో వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యాన్ని సులువుగానే ఛేదిస్తుందనుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 95 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా 16 పరుగులు తేడాతో పంజాబ్ సొంత మైదానంలో జయభేరి మోగించింది. మార్కో యాన్సెన్ (3/17), చహల్ (4/28) కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేయగా.. జేవియర్ బార్ట్లెట్, అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చదవండి: IPL 2025: కేకేఆర్ కొంపముంచిన రహానే.. ఆ ఒక్క తప్పు చేయకపోయింటే?𝙏𝙃𝙄𝙎. 𝙄𝙎. 𝘾𝙄𝙉𝙀𝙈𝘼 🎬#PBKS have pulled off one of the greatest thrillers in #TATAIPL history 😮Scorecard ▶️ https://t.co/sZtJIQpcbx#PBKSvKKR | @PunjabKingsIPL pic.twitter.com/vYY6rX8TdG— IndianPremierLeague (@IPL) April 15, 2025Preity Zinta was really happy with performance of Punjab Kings Today.congrats @PunjabKingsIPL for a thriller victory. pic.twitter.com/iNvuXm6TJB— 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧🧛 (@hiit_man45) April 15, 2025 -
PBKS vs KKR: బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!
ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR)తో మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ తమ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై వేటు వేయాలని సూచించాడు. అతడి స్థానంలో మరో బ్యాటర్‌ను ఎంపిక చేసుకుంటే శ్రేయస్ సేనకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.మూడు గెలిచిన పంజాబ్కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 34 పరుగులు చేశాడు. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు చేసిన స్కోరు 3.ఇక స్పిన్ బౌలింగ్ చేయగల మాక్సీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచిన పంజాబ్ కింగ్స్.. మంగళవారం కేకేఆర్‌తో ముల్లన్పూర్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాక్స్‌వెల్‌ను జట్టు నుంచి తొలగించాలని పంజాబ్ నాయకత్వ బృందానికి సూచన ఇచ్చాడు.‘‘గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్) పంజాబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్.. మార్కస్ స్టొయినిస్.. అంతా అద్భుతంగా ఆడారు. కానీ మాక్సీ సంగతేంటి?..బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించండి. గ్లెన్ మాక్స్‌వెల్‌ను బ్యాటర్‌గా మీరు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటున్నారు. బౌలర్‌గా అతడికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ అతడు ఏం చేస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టు నుంచి తప్పిస్తే మరొక బ్యాటర్‌కు అవకాశం దక్కుతుంది.అతడు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. నేను కూడా ఒప్పుకొంటాను. మాక్సీ రూపంలో మీకు ఆఫ్ స్పిన్నర్ దొరికాడు. ఇక కేకేఆర్‌లో మీకు నలుగురు లెఫ్టాండర్లు కనిపిస్తున్నారు. సునిల్ నరైన్, క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్.. వీళ్ల కోసం మీరు మాక్సీని ఆడించాలని చూస్తారు.దయచేసి పరుగులు సాధించవయ్యాకానీ అతడు బ్యాట్‌తో రాణించకపోతే ఫలితం ఉండదు. కేకేఆర్ స్పిన్నర్లను మాక్సీ ఎదుర్కోలేడు. ఏదేమైనా మాక్స్వెల్ సాబ్.. నువ్వు గనుక తుదిజట్టులో ఉంటే.. దయచేసి పరుగులు సాధించవయ్యా.. చేతులు జోడించి అర్థిస్తున్నా’’ అంటూ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్లో తనదైన శైలిలో మాక్సీ గురించి కామెంట్స్ చేశాడు.శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త ఉత్సాహంతోకాగా గత సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన పంజాబ్.. తొమ్మిదో స్థానంతో ముగించింది. అయితే, ఈసారి మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకుని.. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక పంజాబ్ సారథిగా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న శ్రేయస్.. బ్యాటర్‌గానూ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్ ఆడి 250 పరుగులు సాధించాడు.చదవండి: కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయిమాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..