Sarangapani Jathakam Movie
-
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?
టైటిల్: సారంగపాణి జాతకంనటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులుదర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటినిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్సినిమాటోగ్రఫీ: పీజీ విందాసంగీత దర్శకుడు: వివేక్ సాగర్ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025ఇటీవలే కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో మూవీ థియేటర్లలో పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్‌లో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.సారంగపాణి జాతకం కథేంటంటే..సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్‌తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా మనదేశంలో జాతకాలంటే జనాలకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివీ విపరీతంగా నమ్మేస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఓ యువకుడి స్టోరీనే మన ముందుకు తీసుకొచ్చారు మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్‌కు వివరించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులను నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అలా ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీతో ఇంద్రగంటి కట్టిపడేశారు. ప్రతి సీన్లో పంచ్‌లు, ప్రాసలు, అక్కడక్కడ అడల్డ్ జోక్స్‌తో ప్రేక్షకున్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేశారు డైరెక్టర్. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని కోసం హీరో(సారంగ) ప్లాన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుకోని వాళ్లు ఉండరేమో? అలా ఫస్ట్ హాఫ్‌లోనే తన కామెడీ పంచ్‌లతో సగటు ప్రేక్షకున్ని సీట్ నుంచి కదలకుండా చేసేశాడు. సరదాగా వెళ్తున్న కథలో ఓ సీరియస్‌నెస్ తెప్పించే ట్విస్ట్ ఇచ్చిన ఇంద్రగంటి ఇంటర్వెల్ బ్యాంగ్ పడేశాడు. ఫస్ట్ హాఫ్‌తోనే ప్రేక్షకులను తెగ నవ్వించేసిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో కొత్త పాత్రలతో కథను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేసే కామెడీ ఆడియన్స్‌కు హిలేరియస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ మొత్తం ఓ హోటల్ చుట్టే ప్లాన్ చేశాడు డైరెక్టర్. హోటల్లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల ఉహకందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ఇంద్రగంటి ఫుల్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో తనికెళ్ల భరణి(అహోబిలం రావు) ఎంట్రీతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించని ట్విస్ట్‌లతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోరింగ్ అనే పదం గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. జాతకం అనే కాన్సెప్ట్‌తో ఇంద్రగంటి చేసిన కామెడీ.. రోటీన్ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీరియస్ సీన్లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ.. కామెడీ ఎంటర్టైనర్గా కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బందే పడే లా అయితే లేవు. ఓవరాల్‌గా జాతకం అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చేసిన కామెడీ తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా సారంగపాణి జాతకంపై ఓ లుక్కేయండి.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టేశాడు. మిస్టర్ ప్రెగ్నెట్ హీరోయిన్ రూప మరోసారి తన అందం, నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. వెన్నెల కిశోర్, అవసరాస శ్రీనివాస్, హర్ష చెముడు, వీకే నరేశ్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో ఆడియన్స్‌ను అలరించారు. సాంకేతికత విషయానికొస్తే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు శ్రీదేవి మూవీస్ సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
అస్సలు యాక్టర్ కాలేవన్నారు: ప్రియదర్శి
‘‘సారంగపాణి జాతకం’లో నేను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతాయని భావిస్తున్నాను. నేను నటించిన ‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ సినిమాల తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’’ అన్నారు ప్రియదర్శి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రియదర్శి పంచుకున్న విశేషాలు. ⇒ ఇంద్రగంటిగారితో ఒక ఫొటో దిగితే చాలనుకునేవాణ్ణి. అలాంటిది ఆయనే నన్ను పిలిచి, ‘సారంగపాణి జాతకం’ కథ చెప్పారు. ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రం కోసం ఇంద్రగంటిగారే ఎక్కువగా కష్టపడ్డారు. నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశానంతే. ఇంతవరకు నేనెక్కువగా తెలంగాణ మాండలికం మాట్లాడాను. కానీ, ఈ సినిమాలో ఆంధ్ర యాసలో మాట్లాడాను. ⇒ జాతకాలని నమ్మాలని కానీ, నమ్మకూడదని కానీ మా సినిమాలో చెప్పడం లేదు. ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తున్నాం. ఇండస్ట్రీలోకి రాకముందు నా జాతకాలు చూపిస్తే.. ‘అస్సలు యాక్టర్ కాలేవు’ అని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. నా పైన, చేసే పని మీద నమ్మకం పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చాను. ⇒ శివలెంక కృష్ణ ప్రసాద్‌గారు గొప్ప నిర్మాత. అప్పట్లోనే ‘ఆదిత్య 369’ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించారాయన. ఇప్పటికీ నాలాంటి కొత్త యాక్టర్లని కూడా సార్ అని పిలుస్తుంటారు. ఆయన బ్యానర్లో పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. ప్రస్తుతం ఆడియన్స్ ఏ సినిమా చూడాలో... చూడకూడదో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సినిమాలో విషయం ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. కామన్ మేన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువమందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. ప్రస్తుతం ‘ప్రేమంటే, మిత్ర మండలి’ సినిమాలు చేస్తున్నాను. మరికొన్ని కథలు వింటున్నాను. -
జీవితంలో యాక్టర్‌వి కాలేవన్నారు : ప్రియదర్శి
నేను జాతకాలను ఎక్కువగా నమ్మను కానీ అందరిలాగే మా అమ్మనాన్నలు కూడా వీటిని నమ్ముతారు. ఇండస్ట్రీలోకి రాకముందు నా జాతకం చూపిస్తే జీవితంలో నేను యాక్టర్‌ని అవ్వనని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు. నా మీద నమ్మకంతో ఇండస్ట్రీలోకి వచ్చాను. జాతకాలను కాకుండా చేసే పని మీద నమ్మకం పెట్టుకున్నాను. ఇప్పటికీ అదే ఫాలో అవుతాను’ అన్నారు హీరో ప్రియదర్శి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘సారంగపాణి జాతకం’ సినిమా గతేడాది చివర్లో రావాల్సింది. కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం. కోర్ట్ లాంటి హిట్ తరువాత మళ్లీ వెంటనే ‘సారంగపాణి జాతకం’ అని వస్తుండటం ఆనందంగా ఉంది.→ ‘సారంగపాణి జాతకం’ చిత్రంలో చూపించినట్టుగా కాదు కానీ.. నేను కొంత వరకు జాతకాలు నమ్ముతాను. ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్లో ఉండదు. మంచి సినిమాను చేయాలని ప్రయత్నిస్తాం. ఫలితం మన చేతుల్లో ఉండదు. ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ బిజినెస్ పరంగా, థియేటర్ల పరంగా అన్నీ లెక్కేసుకుని ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం.ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమాలో చూపించాం.→ కామన్ మేన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా నమ్మకం. ‘మల్లేశం‘ అయినా, ‘సారంగపాణి‘ అయినా మన చుట్టు పక్కనే చూస్తాం. వారి జర్నీ చాలా పెయిన్ ఫుల్‌గా ఉంటుంది. ‘మల్లేశం, బలగం, కోర్ట్, సారంగపాణి‘ ఇలా అన్నీ కూడా మన చుట్టూనే చూస్తుంటాం. ఇందులో జాతకాల్ని నమ్మే ఓ కుర్రాడి పాత్రను పోషించాను.→ ప్రస్తుతం నవ్వించడం అనేది చాలా కష్టమైన పని. ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇలాంటి ఓ పాత్రను ఇంత వరకు నేను చేయలేదనిపిస్తోంది. ఇది చాలా కొత్తగా ఉండబోతోంది. ఈ చిత్రం, అందులోని నా పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.→ ఇంత వరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికంలోనే ఎక్కువగా మాట్లాడాను. కానీ ఈ సారి మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడతాను. ఇంద్రగంటి గారి స్టైల్లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నా కోసం ఇందులో సపరేట్ ట్రాక్, టైమింగ్‌ను సెట్ చేశారు. అది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.→ ఇంద్రగంటి గారితో ఒక ఫోటో దిగితే చాలని అనుకునేవాడ్ని. కానీ అలాంటి ఆయనే కథను తీసుకొచ్చి చెప్పారు. కథ విన్నవెంటనే అద్భుతంగా అనిపించింది. జాతకాల పిచ్చోడు అంటూ కథ మొత్తాన్ని చెప్పారు. ‘సారంగపాణి జాతకం‘ అని టైటిల్ కూడా చెప్పారు. ఆ టైటిల్ కూడా నాకు చాలా నచ్చింది. టైటిల్ అద్భుతంగా ఉంది సర్ అని అన్నాను. ఇక ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతీ ఒక్కరికీ ఇంద్రగంటి గారితో పని చేసే అదృష్టం రావాలని కోరుకుంటున్నాను.→ ఏషియన్ సినిమాస్‌లో ‘ ప్రేమంటే‘ అనే సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాను. గీతా ఆర్ట్స్‌లో బన్నీ వాస్ గారి నిర్మాణంలో ‘మిత్రమండలి‘ అనే మరో ప్రాజెక్టుని చేస్తున్నాను. ఇంకా కొన్ని కథలు వింటున్నాను. బలమైన పాత్రలుండే సినిమాల్ని ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను. -
సారంగపాణి జాతకంతో ఆ లోటు తీరింది: శివలెంక కృష్ణప్రసాద్
‘‘సారంగపాణి జాతకం’ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్... ఇలా అన్ని రకాల అంశాలుంటాయి. ఇంద్రగంటికథ చెప్పినప్పుడు చాలా ఎగై్జట్ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. జంధ్యాలగారితో పూర్తి స్థాయిలో ఓ వినోదాత్మక చిత్రం నిర్మించాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇంద్రగంటిగారితో చేసిన ఈ వినోదాత్మక చిత్రంతో ఆ లోటు తీరిపోయింది. కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి.అలా ఈ సినిమా కూడా చాలా కాలం పాటు గుర్తుంటుంది’’ అని శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా శివ లెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ–‘‘జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం’ వంటి చిత్రాల తర్వాత ఇంద్రగంటిగారు,నా కాంబోలో ‘సారంగపాణి జాతకం’తో హ్యాట్రిక్ హిట్ సాధించనున్నాం. ఫ్యామిలీతో పాటుగా యూత్ ని కూడా మా చిత్రం మెప్పిస్తుంది.‘కోర్ట్’ మూవీలో సీరియస్‌గా కనిపించిన ప్రియదర్శి మా సినిమాలో నవ్విస్తారు. ‘వెన్నెల’ కిశోర్, వైవా హర్ష, వీకే నరేశ్, అవసరాల శ్రీనివాస్ పాత్రలు నవ్విస్తాయి. జంధ్యాలగారి కామెడీ, ఈవీవీ సత్యనారాయణగారి స్టైల్, ఇంద్రగంటి మార్క్‌తో ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తీశాం. అప్పట్లో మేం ఒక హీరోతో చేసిన తర్వాత ఇంకో హీరోతో సినిమాను ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులని లైన్ లో పెడుతున్నారు.కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతూ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. అందుకే నా మార్క్ కనిపించాలని కోరుకుంటున్నాను. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. ‘యశోద’ చిత్ర దర్శకులు హరి–హరీష్ చెప్పిన రెండు కథలు, అలాగే పవన్ సాధినేని చెప్పిన కథ నాకు నచ్చాయి. మోహనకృష్ణ ఇంద్రగంటిగారితో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాను’’ అన్నారు. -
జ్యోతిష్కుడు చెప్పినట్లు నిజంగానే యాక్సిడెంట్ జరిగింది: దర్శకుడు ఇంద్రగంటి
‘‘సాధారణంగా ప్రతి సినిమా విషయంలో ఆ సినిమా ఫిల్మ్ మేకర్‌కి ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. కానీ నా కెరీర్లో నేను అతి తక్కువ అసంతృప్తితో తీసిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ప్రియదర్శి, రూపా కొడవాయూర్ జంటగా, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పిన సంగతులు... → ‘యశోద’ మూవీ తర్వాత సినిమా చేద్దామని శివలెంక కృష్ణప్రసాద్‌గారు అన్నప్పుడు ‘సారంగపాణి జాతకం’ కథ చెబితే, ఆయనకు నచ్చింది. ప్రియదర్శి చేసిన ‘మెయిల్, బలగం’ సినిమాలు, ‘సేవ్ ది టైగర్స్’ సిరీస్ చూసి తనతో మంచి హ్యూమరస్ మూవీ చేయొచ్చనిపించింది. దర్శికి విషయం చెబితే, అంగీకరించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ ఆటోమొబైల్స్ రంగంలో ఉద్యోగాలు చేస్తుంటారు. ఒకరు సేల్స్‌మేన్, మరొకరు సేల్స్ సర్వీసింగ్ కన్సల్టెంట్. వైవా హర్ష పాత్ర కూడా బాగుంటుంది.→ జాతకాలను నమ్మే పాత్రలో దర్శి నటించాడు. నేను జాతకాలను నమ్ముతానా? అంటే... నా జీవితంలో జ్యోతిష్కులు చెప్పినవి కొన్ని జరిగాయి... మరికొన్ని జరగలేదు. నా 32 యేళ్ల వయసులో దర్శకుడిగా నా తొలి చిత్రం వస్తుందని ఓ జ్యోతిష్కుడు చెప్పాడు. అది జరిగింది. 2016లో మే నుంచి ఆగస్టు మధ్యలో ఓ ప్రమాదం జరుగుతుందని మరో జ్యోతిష్కుడు 2015లోనే హెచ్చరించాడు. నిజంగానే 2016 జూలైలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అలానే జ్యోతిష్కులు చెప్పినవాటిలో జరగనవీ ఉన్నాయి. → ఈ సినిమాలో నేను జాతకాన్ని ప్రశ్నించలేదు. ఏ నమ్మకాన్ని అయినా మీరు నమ్ముకోవచ్చు. అది దేవుడు కావొచ్చు.. వాస్తు కావొచ్చు. జాతకం కావొచ్చు. కానీ మామూలు నమ్మకం ఓ మనిషిని బలవంతుడ్ని చేస్తే, మూఢనమ్మకం బలహీనుడిని చేస్తుంది. అప్పుడు మనిషి తన జీవితంతో పాటు తన చుట్టూ ఉన్నవారి జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తాడు. అప్పుడు ఎంత గందరగోళం ఏర్పడుతుందనే విషయాన్ని ఈ సినిమాలో హాస్యాస్పదంగా చూపించాం. నమ్మకం మనకు బలాన్నిచ్చే విధంగా ఉండాలి కానీ పిచ్చోడ్ని చేయకూడదు? ఈ సినిమాతో ఇదే చెప్పాలనుకున్నాను. → ఇక ఓటీటీల్లో సినిమాలు వెంటనే రిలీజ్ కాకుండా దర్శక–నిర్మాతలు–హీరోలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆడియన్స్‌ను థియేటర్స్ తీసుకురావడం మరింత కష్టమైపోతుంది. అలా అని ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదని కాదు. మార్చి 14న పదో తరగతి ఎగ్జామ్స్ టైమ్‌లో ‘కోర్ట్’ సినిమాను విడుదల చేస్తే బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఎమెషనల్ ఎక్స్‌పీరియన్స్‌ని కోరుకుంటున్నారు. → వాల్మికీ రామాయణం ఆధారంగా యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ‘జఠాయు’ కథ ఉంది. భవిష్యత్‌లో ఈ కథతో సినిమా చేస్తాను.