satkaram
-
బాలకృష్ణ ఇలాకాలో పెద్ద ప్లానే!
సాక్షి టాస్క్ ఫోర్స్: హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో హిందూపురంలో వచ్చే నెలలో అభినందన సభకు ఆయన పీఏలు ప్లాన్ చేశారు. ఇందుకోసం పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్‌ను ఎంపిక చేశారు. సుమారు 20 వేల మందితో సభను నిర్వహించాలని ప్రణాళిక చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అందిని కాడికి దోచేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భారీగా వసూళ్లకు ప్లాన్? బాలకృష్ణ అభినందన సభ కోసం అయ్యే ఖర్చుకు మించి భారీగా నగదు కూడబెట్టుకోవాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే పీఏలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ ప్రకారం అన్ని అడ్డదారుల్లోనూ డబ్బు వెనుకేసుకునేలా పథకం రచించారంటున్నారు. జన సమీకరణ బాధ్యత టీడీపీ నేతలకే అప్పజెప్పుతున్నారు.టీడీపీ నేతలకు ఆఫర్లు ఊరకనే ఖర్చు అంటే టీడీపీ నేతలు వెనుకడుగు వేస్తారేమో అన్న ఆలోచనతో పదవులు, కాంట్రాక్టులు ఆశ చూపెడుతున్నారు. భూఆక్రమణలకు కూడా అవకాశం కలి్పస్తున్నారు. ఇసుక, మట్టి దందాలకు అడ్డు లేకుండా చేస్తున్నారని సమాచారం. వేలంలో అమ్మినట్లు పదవులను అమ్మకానికి పెట్టారంటున్నారు. ఇందులో భాగంగానే మార్కెట్ యార్డు చైర్మెన్ పదవి టీడీపీ నేతకు ఇచ్చారన్న విమర్శలున్నాయి. మద్యం బెల్టు షాపులు నిర్వహించేందుకు కూడా సహకరిస్తున్నరని చెబుతున్నారు.ఆ నలుగురిపై భారం హిందూపురం పట్టణానికి చెందిన నలుగురు టీడీపీ ముఖ్య నేతలపై వసూళ్ల భారం వేశారని సమాచారం. వారు కూడా భారీ మొత్తంలో పీఏలకు నగదు అందించినట్లు తెలుస్తోంది. కొట్నూరు వద్ద మున్సిపాలిటీ స్థలంలో అక్రమంగా షెడ్ల నిర్మాణానికి పీఏలు ఒకే చెప్పడంతో అందుకోసం రూ. 20 లక్షలు సదరు టీడీపీ నేత ఎమ్మెల్యే కార్యాలయానికి చెల్లించినట్లు సమాచారం. అందుకే మున్సిపల్ అధికారులు ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. పరిశ్రమల నుంచి వచ్చే నెలవారీ మొత్తం, మద్యం దుకాణాలు, కల్లు దుకాణాల నుంచి మామూళ్లు, మట్టి, ఇసుక ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింట్లో సభ కోసం అంటూ అందినకాడికి దోచేయాలని పీఏలు ప్లాన్ చేసినట్లు తెలిసింది. మండల పరిషత్ నిధులకు ఎసరు!నియోజకవర్గంలోని మండల పరిషత్ నిధులను ఎమ్మెల్యే పీఏలు భారీగా వాడుకున్నట్లుగా తెలుస్తోంది. చేయని పనులకు లక్షల రూపాయలు ఒక్కో మండలం నుంచి డ్రా చేసినట్లు తెలిసింది. ఈ నగదు అంతా ఎమ్మెల్యే పీఏల ఖాతాలకు అక్రమంగా మళ్లించారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పంచాయతీరాజ్ పనుల్లో కూడా చేసిన పనులకే లక్షలాది రూపాయలు బిల్లులు మంజూరు చేయించుకొని సభకు మళ్లిస్తున్నట్లు సమాచారం. ఎంపీపీలు అందరూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వారే అయినా అభివృద్ధి పనులంటూ వారితో నిధులకు ఆమోదం తీసుకోవడం, ఆ నిధులను మళ్లించడం వంటివి గుట్టుగా కానిచ్చేశారని చెబుతున్నారు.ఖర్చు తక్కువ.. వసూళ్లు ఎక్కువబాలకృష్ణ అభినందన సభ కోసం 20 వేల మందిని జన సమీకరణ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే దృష్టిలో అంతమంది జనాభా వస్తున్నారని చెప్తే ఖర్చులు కూడా భారీగా ఉంటాయని ఆయన దృష్టిని మరల్చే యత్నం చేస్తున్నారని తెలిసింది. ఎంజీఎం గ్రౌండ్ కెపాసిటీ 6 నుంచి 7 వేల మందికి మిందని... మరి ఎలా 20 వేల మంది సభకు ఎలా తరలిస్తారన్న విషయంలో ఆ పార్టీ సభ్యుల మధ్యే చర్చ సాగుతోంది. 20 వేల మందితో సభ అంటూ ఖర్చు భారీగా ఉంటుందని జేబులు నింపుకునేందుకు ఎత్తువేశారని అంటున్నారు.వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకేనా?బాలకృష్ణ ఇలాకాలో పీఏల వసూళ్లు తారాస్థాయికి చేరాయి. ముగ్గురు పీఏల్లో ఒకరు వసూళ్ల సొమ్మంతా చిలకలూరిపేటకు చేరుస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా అవినీతికి శ్రీకారం చుట్టారని అంటున్నారు. సహజ వనరులు, ప్రజల సొమ్మును స్థానిక సమస్యలకు వాడకకుండా పీఏలు సొంత జేబులు నింపుకోవడానికే వాడుతున్నారన్న విమర్శలున్నాయి. -
బీసీ రాయ్ అవార్డు గ్రహీత రామారెడ్డికి సత్కారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డిని కలాం ఐఏఎస్ ఇ¯ŒSస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.టేకి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే గొప్పగా ఎదగాలని కలలు కంటూ వాటి సాకారంకోసం నిత్యం శ్రమించాలన్నారు. సీసీసీ ఎండీ పంతం కొండలరావు మాట్లాడుతూ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ డాక్టర్ రామారెడ్డి రాజమహేంద్రవరానికే గర్వకారణమన్నారు. డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి, ఇంటరీ్మడియట్ విద్యార్థులు విద్యాభివృద్ధికి, ఉద్యోగ సాధనకు లక్ష్యాలను ఏర్పర్చుకోవాలన్నారు. అనంతరం రెండుగంటల పాటు లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేష¯ŒS నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ డైరెక్టర్ రజనీష్ రెడ్డి, విజ్ఞానభారతి రాష్ట్ర కన్వీనర్ కె.సుబ్బరాయశాస్త్రి, ఆదిరెడ్డి వాసు, రామ్‌గోపాల్‌రెడ్డి, జి.సూర్యకుమారి పాల్గొన్నారు. -
చిర్రావూరికి సత్కారం... పాండిత్యానికి పట్టం
వేద విభూషణ బిరుదను సార్ధకం చేసుకున్న చిర్రావూరి చిర్రావూరికి సింహతలాట ద్వయ సమర్పణ సభలో వక్తలు ఒకే వేదికపై ముగ్గురు మహామహోపాధ్యాయులు రాజమహేంద్రవరం కల్చరల్ : ఇది పాండిత్యానికి పట్టం, విద్వల్లోకానికి అభినందన సత్కారమని మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ చిర్రావూరికి జరిగిన సింహతలాటద్వయ సమర్పణ సభను అభివర్ణించారు. ఇటీవల శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్ చిర్రావూరి శ్రీరామ శర్మ మహా మహోపాధ్యాయ బిరుదును అందుకున్న సందర్భంలో మంగళవారం ప్రకాష్ నగర్, ధర్మంచర కమ్యూనిటీ హాల్లో ఆయన అభిమానులు, శిషు్యలు నిర్వహించిన సత్కార సభకు విశ్వనాథ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ మాట్లాడుతూ పుష్యమాసంలో విద్వత్ సమ్మానం, దేవతా పూజలు చేస్తే, శ్రేయస్సు కలుగుతుందని అన్నారు. వేదభాస్య విభూషణ బిరుదాన్ని సార్థకం చేసుకున్న వ్యక్తి చిర్రావూరి అని, దేశంలో పూర్వ మీమాంసా శాస్త్రంలో వేళ్ళపై లెక్కపెట్టగల వ్యక్తుల్లో ఆయన ఒకరని , అలవోకగా సంస్కృతాంధ్రాల్లో అవధానాలు చేశారు, ఏ శాస్త్రమైనా మనకు ఎందుకు లొంగదు అన్న పట్టుదల ఆయనలో కనపడుతుందని ప్రశంసించారు. వేదం కేవలం ఆధ్యాత్మిక విద్య మాత్రమేకాదు, లౌకిక ప్రయోజనాలకు కూడా వేదం ఉపయోగిస్తుంది, వేదాన్ని సైన్సుగా నిరూపిస్తున్న చిర్రావూరి కృషిని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సైతం అభినందించారని గుర్తు చేశారు. ‘స్వాద్ధా్యయ భాస్కర’ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి మాట్లాడుతూ వేదపండితుని సత్కరిస్తే, అన్ని విద్యలను సత్కరించినట్టేనని అన్నారు. మరో మహా మహోపాధ్యాయ కొంపెల్ల సత్యనారాయణ శాస్త్రి మాట్లాడుతూ ఫలవంతం కాని ప్రయత్నం ఉండదని, చిర్రావూరి జీవితమే ఇందుకు నిదర్శనమన్నారు. భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ ‘మీ దేశంలో విద్వాంసుల మధ్య విభేదాలు ఎందుకు ఉంటా’యని ఒక అమెరికా మిత్రుడు నన్ను ప్రశ్నించగా విభేదాలు, స్పర్థలు విద్యల వరకు మాత్రమేనని జవాబు ఇచ్చానని అన్నారు. ఒకప్పుడు కాశీక్షేత్రం పండితులకు ప్రధాన కేంద్రం, రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రమవుతుందని దివంగత సద్గురు కందుకూరి శివానందమూర్తి అనేవారని, ఆ మాటలు నిజమయ్యే రోజులు వచ్చాయన్నారు. నగర ప్రముఖుడు దాట్ల బుచ్చి వేంకటపతి రాజు జ్యోతి ప్రజ్వలనం చేశారు. తిరుపతి నుంచి వచ్చిన రాష్ట్రపతి పురస్కార గ్రహీత కొంపెల్ల రామసూర్యనారాయణ చిర్రావూరి పాండితీగరిమను ప్రశంసించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా చిర్రావూరికి సింహతలాటద్వయ సమర్పణ చేశారు. ముందుగా వేదిక వద్దకు చిర్రావూరిని పూర్ణకుంభంతో, వేదస్వస్తితో తీసుకువచ్చారు. చిర్రావూరి తనకు జరిగిన సత్కారానికి ఉచితరీతిన కృతజ్ఞతలు తెలిపారు. వేద శాస్రా్తలపై మరిన్ని పరిశోధనలు జరగాలని, ఇందుకు ఒక సంస్థను నెలకొల్పాలని కోరారు. వేదశాస్రా్తభిమానులు, సాహితీవేత్తలు తరలి వచ్చారు. -
ముకుందరెడ్డి మరింత ఉన్నతి సాధించాలి
మంత్రులు పత్తిపాటి, దేవినేని ఆకాంక్ష పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం మండపేట : జాతీయస్థాయిలో బిగ్గెస్ట్ లేయర్ కోళ్లరైతు అవార్డు గ్రహీత కర్రి వెంకట ముకుందరెడ్డి మరింత ఉన్నతిని సాధించాలని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు ఆకాంక్షించారు. విజయవాడలో ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముకుందరెడ్డిని ఘనంగా సత్కరించి, మంత్రుల చేతుల మీదుగా జ్ఞాపికను అందజేశారు. బిక్కవోలు మండలం బలభధ్రపురంలో కేపీఆర్ గ్రూప్ సంస్థల్లో భాగంగా శ్రీలక్ష్మి పౌల్ట్రీస్ పేరిట రెండు దశాబ్దాల క్రితం రెండు లక్షల లేయర్ కోళ్లతో ఫారమ్‌ను ఏర్పాటు చేసిన ముకుందరెడ్డి అంచెలంచెలుగా శ్రీ లక్ష్మి ఎగ్ఫార్మ్ ప్రైవేటు లిమిటేడ్ పేరిట ఏపీ, కర్ణాటకల్లో 28 లక్షల లేయర్ కోళ్లతో ఫారాలు నెలకొల్పారు. ముకుందరెడ్డిని జాతీయ గుడ్ల సమన్వయ సంస్థ(నెక్) అక్టోబర్ 14న ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కేంద్ర వ్యవసాయ మంత్రి చేతుల మీదుగా సత్కరించి అవార్డును అందజేసింది. విజయవాడ సత్కారంలో ముకుందరెడ్డి మాట్లాడుతూ పౌల్ట్రీపరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని మంత్రులను కోరారు. ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ నాయకులు, జిల్లాకు చెందిన పలువురు కోళ్ల రైతులు పాల్గొన్నారు. -
డబ్బింగ్ జానకికి సత్కారం
రాజమహేంద్రవరం కల్చరల్ : నేటితరం నటీనటులు ఎటువంటి శిక్షణా లేకుండా కెమెరాల ముందుకు రావడంతో నటనలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని డబ్బింగ్ జానకి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నారాయణపురంలోని విశ్రాంత హిందీ అధ్యాపకురాలు పార్వతి గృహంలో ఆమెను నగరానికి చెందిన కళాకారులు, గాయకులు, ప్రముఖులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి తరం నటీమణులు వాణిశ్రీ, శారదలకు తాను సమకాలీనురాలినని, కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పలు సినిమాల్లో నటించానని తెలిపారు. ప్రముఖ దర్శకుడు జంధ్యాలకూడా తనను ప్రోత్సహించేవారన్నారు. దక్షిణాది భాషలన్నింటిలో సుమారు వేయిచిత్రాలలో నటించానన్నారు. ‘ఎస్ బ్యాంక్’ మేనేజర్ ఘంటసాల శ్యామలాకుమారి, గాయకుడు రాయుడు చంద్రకుమార్, పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి, కొప్పర్తి రామకృష్ణ తదితరులు జానకిని సత్కరించారు. -
డాక్టరేట్ గ్రహీత శర్మకు సన్మానం
తుని రూరల్ : తుని మండలం వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 ఏళ్లు అధ్యాపకుడిగా పని చేసి, రసాయన శాస్త్ర విభాగంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఈరంకి సీతారామ సుబ్రహ్మణ్య శర్మను గురువారం ఘనంగా సన్మానించారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి.రవిచంద్రకుమార్ అధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు సుబ్రహ్మణ్యశర్మను అభినందించారు. అంతకు ముందు పీజీ విద్యార్థులకు రసాయనశాస్త్రాన్ని బోధించే గెస్ట్ లెక్చరర్ల ఎంపిక ప్రక్రియను కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకులు వి.మల్లికార్జున శర్మ, సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశారు. గెస్ట్ లెక్చరర్లు పీజీలో క్రొమటోగ్రఫీ, సైక్లో అలే్కన్లు అంశాలను బోధిస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. అధ్యాపకులు వి.సత్యనారాయణ, గోవిందు, మురళి, సంతోషి పాల్గొన్నారు.