sirkakualam
-
రాజాంలో విద్యార్ధులకు నాట్స్ ఉపకారవేతనాలు
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ తాజాగా శ్రీకాకుళం జిల్లా రాజాం లో విద్యార్ధులకు ఉపకారవేతనాలు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీశ్ గంథం తన సొంత ఊరికి చేతనైన సాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజాంలోని శ్రీ విద్యానికేతన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సతీశ్ గంథం విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందించారు. అలాగే ఇక్కడే మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొని సతీశ్ గంథం సేవా నిరతిని ప్రశంసించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ ఫినిక్స్ చాప్టర్ జాయింట్ కో ఆర్డినేటర్ సతీష్ గంథం చూపిన చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు ప్రత్యేకంగా అభినందించారు. -
పచ్చ బ్యాచ్ అరాచకం.. వైఎస్సార్సీపీ మహిళా నేతను చంపేస్తామంటూ బెదిరింపులు!
👉ఏపీలో టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పచ్చ బ్యాచ్ అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా ఎల్లో బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది..👉వైఎస్సార్ జిల్లాలో టీడీపీ ‘చెత్త’ రాజకీయాలకు తెర లేపింది. తన ఇంటి ముందు చెత్త వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. మేయర్‌తో పాటుగా ఏకంగా 14 మంది వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టారు పోలీసులు. దీంతో, తమపై కేసులు పెట్టడంతో పోలీసులను పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.👉మరోవైపు.. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ మహిళా సర్పంచ్ చాందినిని టీడీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు. వెంటనే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ పచ్చ బ్యాచ్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో సర్పంచ్ చాందిని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ కడప ప్రశాంతంగా ఉండటం మీకు ఇష్టం లేదా @JaiTDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి? 30 ఏళ్లుగా ఎప్పుడూ జరగని అరాచకాలు గత 3 నెలల నుంచి జరుగుతున్నాయి రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? -సురేష్ బాబు గారు, కడప మేయర్ pic.twitter.com/LQRVfymgmA— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 టీవీలో చూపిస్తానంటూ టీడీపీ వాళ్లని రెచ్చగొట్టిన బిగ్ టీవీ జర్నలిస్ట్ ప్లాన్ ప్రకారం కడప మేయర్ సురేశ్ ఇంటి ముందు చెత్త వేసిన @JaiTDP నేతలు ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్షన్లో సైగలతో ప్లాన్ అమలు చేసిన బిగ్ టీవీ జర్నలిస్ట్ప్రశాంతంగా ఉన్న వైయస్ఆర్ కడపలో మళ్లీ ఫ్యాక్షన్ బీజం… pic.twitter.com/1FqzgCVPvv— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
మానవత్వం: రోజూ కూలీలే.. అన్నదాతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘కరోనా’ పలువురిని బలి తీసుకుని ప్రపంచాన్ని గడగడలాడించడమేకాదు.. పలువురు వ్యక్తుల్లో పరివర్తన తీసుకొచ్చి మానవత్వాన్ని, దయాగుణాన్ని, సాటి మానవునికి ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందించాలనే తపనను పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కష్ట కాలంలో గ్రామాలనుంచి వచ్చిన అనేకమందికి స్వచ్ఛందంగా ఆకలి తీర్చాలనే సంకల్పంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది యువకుల వినూత్న ఆలోచనలకు ప్రతిరూపమే ‘డాడీ హెల్పింగ్ ఫౌండేషన్’ పేరుతో వెలసిన ఫుడ్ బ్యాంకులు.. వాటిపై ప్రత్యేక కథనం. రోజు కూలీలే.. అన్నదాతలు.. అన్నదానం చేస్తున్న డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు శ్రీమంతులు కారు. అలాగని ఉద్యోగస్తులూ కాదు. కూలి, ఇతరత్రా పనులు చేసుకుని బతికేవారే. ఒకరు ఆటో డ్రైవర్, మరొకరు ట్యాక్సీ డ్రైవర్, మిగతా వారు రకరకాల కూలి పనులు చేసుకునేవారే. తమకు తగినంత స్థోమత లేకపోయినా అన్నార్తుల కోసం ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో.. గుజ్జల సూర్యనారాయణ (ప్రభాస్ సూర్య) ఫౌండర్‌గా, శ్రీనివాసరావు మేనేజర్‌గా డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ పేరుతో 2019లో సంస్థను స్థాపించారు. అనంతరం మరో 18మంది యువకులు ఆ సంస్థలో సభ్యులయ్యారు. స్థానికంగా ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే స్వచ్ఛందంగా వారికి అవసరమైనవి సమకూరుస్తూ వస్తున్నారు. ఫుడ్ బ్యాంకులు ఎలా ఆవిర్భవించాయంటే.. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో వ్యాధి బారిన పడి చికిత్స కోసం మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులను పెద్ద ఎత్తున రోగులు ఆశ్రయించేవారు. వారికి నయమయ్యేవరకు సంబంధీకులు అక్కడే ఉండేవారు. అదే సమయంలో లాక్డౌన్ కారణంగా హోటళ్లు మూతపడ్డాయి. దాంతో దూర ప్రాంతాల నుంచి వచి్చన రోగుల సహాయకులు తినడానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటించేవారు. అలాంటి వారికి అండగా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆహారం అందించాయి. అయితే ఆహారం అందుబాటులోకి వస్తున్నా అనేక మంది ఆకలితోనే ఉండిపోయేవారు. మొహమాటంతో ఆహారం తీసుకోవడానికి సిగ్గుపడేవారు. చూసిన వారు ఏమైనా అనుకుంటారేమోనని ఉద్ధేశంతో ఆకలిని సైతం చంపుకునేవారు. ఇలాంటి వారిని గమనించి, వారికి ఇబ్బంది లేకుండా ఏమైనా చేయగలమా అని డాడీ హెలి్పంగ్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు ఆలోచించారు. ఆ సమయంలో వారి మదిలో నుంచి వచి్చందే ఫుడ్ బ్యాంకుల ఏర్పాటు. వాటిని కరోనా సమయానికే పరిమితం కాకుండా ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మండుటెండైనా, జోరు వానైనా శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ జంక్షన్, సెవెన్ రోడ్డు జంక్షన్, సూర్యమహల్ జంక్షన్లో రెండు పూటలా రుచికరమైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. రోజూ రెండు పూటలా సాంబారు, రెండు కూరలు, అన్నం, పెరుగుతో కూడిన పార్సిల్స్‌ను వాహనంలో తీసుకెళ్లి ఫుడ్ బ్యాంకులో పెడతారు. ఆకలితో ఉన్న ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. మధ్యాహ్నం 150 మందికి, రాత్రి 105 మందికి భోజనం ప్యాకెట్లను ఫుడ్ బ్యాంకుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఆకలితో ఉండకూడదని.. కోవిడ్ బాధితులకు సేవలందించే సమయంలో కొందరు భోజనం అడిగేందుకు మొహమాటం పడేవారు. చాలా మంది కష్టాలు చూశాం. అలాంటి వారి కోసమే ఫుడ్ బ్యాంకు ఏర్పాటు ఆలోచన చేశాం. – గుజ్జల సూర్యనారాయణ , డాడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. శ్రీకాకుళం. -
అధికార పక్షానికే ఇస్తారా..!
పింఛన్ల మంజూరులో అనర్హులకు పెద్దపీట వేస్తున్నారంటూ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంపీడీవోను నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా వంగర మండల కేంద్రంలో అధికార టీడీపీ నాయకులు చెప్పిన వారికే పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారంటూ సోమవారం ఎంపీడీవో కాశీవిశ్వనాథంపై మండిపడ్డారు. గ్రామాల్లో పర్యటించి, అర్హులనే ఎంపిక చేస్తామని వారికి ఎంపీడీవో హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి సురేష్‌ముఖర్జీ, మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్‌రావు తదితరులు కొందరు అర్హులైన లబ్ధిదారులతో కలసి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోను కలిశారు.